komatireddy rajagopal reddy
-
‘విద్యుత్’ ఒప్పందాల కథ వెలికితీస్తాం..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతారహిత నిర్ణయాల వల్ల విద్యుత్‌శాఖ రూ.వేల కోట్లు నష్ట పోయిందని శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమ వారం ఆయన ‘విద్యుత్’అంశంపై చర్చను ప్రారంభించారు. ఉచిత విద్యుత్ తీసుకొచి్చన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని..గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించబట్టే విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు.గత పదేళ్లు ఇష్టానుసారం విద్యుత్ నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి సభలో లేకపోవడం దురదృష్టకరమని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. కేసీఆర్ సభకు రాకూ డదనుకుంటే ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన దోపిడీపై విచారణ జరుగుతుందని, ఒప్పందాల కథ వెలికితీస్తామని చెప్పారు. ఈ విద్యుత్ ఒప్పందాలు ఎందుకు? ‘‘భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం ప్రారంభించే నాటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని కాదని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియాబుల్ వాళ్ల ప్లాంట్ కోసం తయారు చేసిన టర్బన్ బాయిలర్ వాడటం వల్ల భద్రాద్రి ప్లాంట్ పనిచేయని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఏదో ఒక యూనిట్ ఆగిపోతోంది. అది పదేళ్ల కిందటి పాత ప్లాంటులా ఉందని చీఫ్ ఇంజనీర్ నివేదిక కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ ప్లాంట్ వ్యయం రూ.7,200 కోట్ల నుంచి రూ.10 వేలకోట్లకు పెరిగింది..’’అని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.బీహెచ్ఈఎల్కు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వడం, ఆ తర్వాత సివిల్ పనులు బీఆర్ఎస్ నేతల బినామీలకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంటే అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రంలో కుటుంబ పాలన నడిచిందని, ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర వారిదని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ రంగం అస్తవ్యస్థమైంది
-
రాజగోపాల్ రెడ్డి మంత్రి అయ్యేనా?
-
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్‌రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్‌రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్‌రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. -
ప్లీజ్ కేటీఆర్.. కాంట్రవర్సీ వద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’
సాక్షి, హైదరాబాద్: తాను హోం మంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. హోం శాఖ అడుగుతున్నా.. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు (బీఆర్ఎస్ నాయకులు) కంట్రోల్లో ఉంటారన్నారు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టెకెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు. -
భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలబడడానికి పలువురు నేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా.. బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. భువనగిరి ఎంపీ స్థానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారు. మరో వైపు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశమైంది. వివిధ వేడుకలతో జనాల్లోకి.. అగ్రనేతల తనయులు వారి పుట్టిన రోజు, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర సందర్భాలను పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్ తమ్ముడు జయవీర్‌రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్‌ను రఘువీర్‌రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంట్ కోసం పోటీ చేయించాలానే ఆలోచనలో భాగంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రఘువీర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా హైదరాబాద్‌తో పాటు హాలియాలోనూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి గుత్తా తనయుడు.. బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న ఆయన జన్మదినం సందర్భంగా గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంట్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాడు రెండు పార్లమెంట్ నియోజక వర్గాలైన నల్లగొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల నిర్వహించిన చిట్‌చాట్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎవరి ప్రయత్నాల్లో వారే.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇవ్వగా.. పటేల్ రమేష్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటుఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనల్లో రమేష్‌రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్, సంకినేని వెంకటేశ్వర్రావు, మన్నెం రంజిత్ యాదవ్, బండారు ప్రసాద్, గోలి మదుసూదన్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, జెడ్పి మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి మాజీ ఎమ్మల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రయత్నిస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆశిస్తున్నట్లు తెలిసింది. రంగంలోకి ‘కోమటిరెడ్డి’ కుటుంబం భువనగిరి పార్లమెంట్ సీటు కోసం ‘కోమటిరెడ్డి’ కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్‌ను కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూతురు కీర్తిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. -
‘ఖబడ్దార్’పై కలకలం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ గురువారం దారి తప్పింది. ‘ఖబడ్దార్’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య సభలో కలకలం సృష్టించింది. విపక్ష బీఆర్ఎస్ సభ్యులు అంతే దూకుడుతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఆవేశంతో ప్రతి సవాళ్ళు విసరడం సభలో వేడిని మరింత పెంచింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి వ్యంగా్రస్తాలు సంధించారు. ‘కిరోసిన్ దీపం కింద చదువుకున్న... కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారు?’అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌కు జోకడం తప్ప, ఎదురు చెప్పలేని స్థితి మాజీ మంత్రిది అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి అభ్యంతరం చెప్పా రు. ప్రతిగా అధికార పక్ష సభ్యులూ లేవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అధికార పక్షం వైపు వేలెత్తి చూపారు. పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే రాజగోపాల్‌రెడ్డి ‘పదేళ్ళు భరించాం.. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఖబడ్దార్’అంటూ చేసిన హెచ్చరిక సభా వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కొత్త వాళ్ళున్నారు... కాస్త జాగ్రత్త వాగ్వాదాల మధ్య మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జోక్యం చేసకుని ‘ఈ సభ లో కొత్త వాళ్ళున్నారు. సభా మర్యాద కాపాడాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం మంచిది కాదు’అంటూ సలహా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. సభ లో ‘ఖబడ్దార్’అనే పదం వాడొచ్చా? అని బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఖబడ్డార్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత సభ సర్దుమణిగింది. చర్చ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకపోవడాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం కొద్ది సేపటికే బీఆర్ఎస్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. -
కేసీఆర్ రిటైర్ అయితే మంచిది
-
‘నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’
సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గద్దె దించడమే తన ముందున్న లక్ష్యమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. దీనిలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నేను పార్టీ మారినా కాంగ్రెస్‌లోకే వచ్చా. నా ఏకైక లక్ష్యం కేసిఆర్ నియంత పాలనను గద్దె దించడమే. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం యంత్రాంగం వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా?, మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే మునుగోడుగడ్డ ప్రజలు ఎక్కడ కూడా తలలించుకునేలా చేయలేదు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకోరావడానికి కష్టపడ్డాం.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ చేతిలో పోయింది.ఆ కుటుంబాన్ని గద్దే దించడానికి పోరాడుతున్నా. రాజ్‌గోపాల్‌రెడ్డికి ప్రజాబలం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశా.రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది. చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు గెలుస్తాడా?, ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డ నుంచే జరుగుతుంది.కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది మునుగోడు గడ్డ. అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మళ్లీ కాంగ్రెస్ లోకి ఎలా వస్తా.అమ్ముడుపోయానని నాపై ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్నా నన్నుకొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నేను పదవి త్యాగం చేసినా.. పదవిలో ఉన్నా అది ప్రజల కోసమే.. నా పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెట్టిన. నా చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి.గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారు.చండూరు ను రెవిన్యూ డివిజన్ చేశారు. చౌటుప్పల్‌లో వంద పడకల ఆసుపత్రి ఇచ్చారు. కొత్త రోడ్లు వేశారు.గజ్వేల్ లో పోటీ చేస్తాను అని ఏఐసీసీకి చెప్పా. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతోంది.ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది’ అని విమర్శించారు. -
ఖర్గేతో రాజగోపాల్‌రెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/యాదాద్రి/పటాన్చెరు టౌన్: గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరికొందరు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు టి.సంతోష్ కుమార్, కపిలవాయి దిలీప్, ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్, నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, ఆమె భర్త గంగాధర్‌రావుకు ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుగోడు స్థానాన్ని రాజగోపాల్‌రెడ్డికి ఖర్గే ఖరారు చేశారు. పార్టీ అభ్యున్నతికి, గెలుపు లక్ష్యంగా చేయాలంటూ ఖర్గే సూచించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా... కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై బీజేపీ ఆయన్ని జైలుకు పంపుతుందనే ఆలోచనతోనే తాను బీజేపీలో చేరినా ఆ పరిస్థితులు కనిపించలేదన్నారు. అందుకే మళ్లీ సొంతగూటికి వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. అవినీతితో సంపాదించిన కోట్ల రూపాయలను ఇండియా కూటమికి ఫండ్ ఇస్తానని.. తనను ప్రధానిని చేయాలంటూ కేసీఆర్ కూటమిని కోరిన విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజల మద్దతుతో తాను మునుగోడులో గెలుస్తానని, ఇంకా కొంచెం ముందుగా తాను కాంగ్రెస్‌లో చేరి ఉంటే కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేదన్నారు. -
కేసీ వేణుగోపాల్ ను కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి రెడీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం జరిగింది. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి చేరనున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై కూడా పోటీకి రెడీ అన్నారు. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. -
బీజేపీ ద్వారా బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలనుకున్నా: రాజగోపాల్
-
అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ప్లానేంటి..?
-
సొంతగూటికి వెళ్లే యోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..?
-
తెలంగాణ బీజేపీ నాయకత్వంపై నమ్మకం కుదరడం లేదా?
-
బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నాను’’ అని రాజగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: టీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రెడీ.. ప్రాబబుల్స్ జాబితా ఇదే -
బీజేపీకి బిగ్ ఝలక్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సద్దుమణిగిందని అనుకుంటున్న అసంతృప్తి మళ్లీ రాజుకుందా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తుండగా, మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో.. కొందరు కీలక నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేడో, రేపో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఆయన బాటలో నడవనున్నారని తెలిసింది. కాంగ్రెస్ సంప్రదింపులతో సుముఖత! కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమైన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి జాబితాలో తనకు (ఎల్బీనగర్), తన భార్య లక్ష్మికి (మునుగోడు) టికెట్లను రాజ్‌గోపాల్‌రెడ్డి ఆశించారు. కానీ నాయకత్వం ప్రకటించిన జాబితాలో ఆ స్థానాలతో పాటు వీరి పేర్లు చోటు చేసుకోలేదు. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు మాత్రం రెండు సీట్లలో (హుజూరాబాద్, గజ్వేల్) పోటీకి అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. రాజగోపాల్ కూడా సానుకూలంగా స్పందించారని, బుధవారం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇదే బాటలో మరికొందరు! రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వీరిలో గతంలో రెండుసార్లు ఎంపీగా ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నేత అసెంబ్లీకి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినా బరిలో నిలవాల్సిందేనని నాయకత్వం ఒత్తిడి తేవడంతో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మాజీ ఎంపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచి కేంద్రమంత్రి కావాలని కోరుకుంటున్నారే తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని ఆయన సన్నిహితుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు తనకు పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన విజయావకాశాలపై సర్వేలు చేయించుకున్న ఆయనకు ఎక్కడా సానుకూల వాతావరణం కన్పించక పోవడంతో పార్టీనే వీడాలనే ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. కొంత కాలంగా నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న మరో మహిళా నేత కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొందరు సైతం ఎన్నికలకు ముందు బీజేపీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇలావుండగా ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితా విడుదలలో జాప్యం చేయడం.. బీజేపీ నుంచి వచ్చే నేతల కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. తొలి జాబితాపై అసంతృప్తే రాజుకుంటోందా? తొలి జాబితాలో రాజగోపాల్‌రెడ్డితో పాటు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలకు టికెట్లను ఖరారు చేయకపోవడం, పార్టీ బలంగా ఉన్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన వారికి సీట్లివ్వడం లాంటి అంశాలు బీజేపీ నేతల్లో అసంతృప్తికి కారణమౌతున్నాయి. మొత్తంగా బీసీ వర్గాలకు 19 సీట్లు కేటాయించినా వాటిలో కొన్ని ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి ఉన్నట్టు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అత్యధిక సీట్లు రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడం, కొంతకాలంగా టికెట్‌ను ఆశిస్తూ ఆయా నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులకు టికెట్ నిరాకరించడం, కనీసం వారిని పిలిచి పరిస్థితిని వివరించి, బుజ్జగించే పరిస్థితి లేకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నట్టు తెలిసింది. హిందుత్వవాదం బలంగా ఉన్న నిర్మల్ జిల్లాలోని ఓ సీటును పార్టీలో చేరేదాకా ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఒకరికి ఇవ్వడంపై స్థానిక నేతల్లో అంతర్మథనం సాగుతున్నట్టు సమాచారం. ఇక ముధోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన రమాదేవి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరోనేత మోహన్‌రావు పాటిల్ కూడా టికెట్ కోరుకున్నా రాలేదు. వరంగల్ (పశ్చిమ) టికెట్‌ను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డికి కాకుండా రావు పద్మకు ఇచ్చినా, కనీసం పిలిపించి మాట్లాడకపోవడంతో ఆయన రెబెల్‌గా పోటీకి సిద్ధమౌతున్నట్టు తెలిసింది. జనగామ నుంచి జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డికి అవకాశం కల్పించినా, అక్కడ టికెట్ కోరుకున్న బీరప్ప, మరో ఇద్దరు నేతలకు ఈ విషయాన్ని తెలియజేసి బుజ్జగించే ప్రయత్నం చేయపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీకి దింపడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేపు రెండో జాబితా? బీజేపీ రెండో జాబితాను గురువారం ఢిల్లీలో జాతీయ నాయకత్వం ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం. ఈ మేరకు 26న జరగనున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను ప్రకటించగా..మిగిలిన 67 సీట్లకు ఒకటి లేదా రెండు జాబితాలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలావుండగా తొలి జాబితాలో పార్టీ టికెట్లు దక్కించుకున్నవారు ఈ 28న మంచిరోజు కావడంతో అప్పటి నుంచి ప్రచారం ప్రారంభించాలని నాయకత్వం సూచించింది. ఈలోగా నామినేషన్ దాఖలుకు సంబంధించిన డాక్యుమెంట్లు, అఫిడవిట్లు, ఇతరత్రా సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. -
కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. అయితే, కోమటిరెడ్డి పార్టీ మారతాడంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ కోరేందుకు రాజగోపాల్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధులు సంప్రదించగా, పార్టీ మార్పు వార్తలు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా, రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. చదవండి: బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు -
మునుగోడులో బరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు గాను ఆదివారం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని రో జులుగా జాబితా ఇదిగో.. అదిగో.. అంటూ ఉత్కంఠ రేపుతూ వచ్చిన అధిష్టానం ఆలస్యంగానైనా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుందని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా నాలుగు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో మిగతా చోట్ల ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అందులో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకుగాను నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదిత రెడ్డి, సూర్యాపే ట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసింది. ఆయనే పోటీచేస్తారా.. ? మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతేడాది ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో గతేడాది ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ జరిగింది. రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు రాజగోపాల్‌రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా, బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు కల్పించలేదు. దీంతో ఆయనే అక్కడి నుంచి పోటీచేస్తారా? ఆయన సతీమణిని పోటీలో దింపుతారా? అన్న చర్చ మొదలైంది. ఇదివరకు ఈ చర్చ ఉన్నప్పటికీ రాజగోపాల్‌రెడ్డినే పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన పేరును మొదటి జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, బీజేపీ రెండో జాబితాను ఎప్పుడు ప్రకటిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆ జాబితా ఎప్పుడు వస్తుంది.. ఆ అభ్యర్థుల ప్రచారానికి ఎంత సమయం ఉంటుందనే విషయాలను అధిష్టానం ఆలోచించడం లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానించాయి. నివేదితకు మరోసారి అవకాశం సాగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కంకణాల నివేదితరెడ్డి 2018 ఎన్నికల్లో పోటీచేశారు. ఇప్పుడు మరోసారి పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సతీమణి కావడంతో ఆమెకు రెండోసారి టికెట్ దక్కింది. తొలిసారి పోటీలో.. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గూడురు నారాయణరెడ్డి మొదటిసారి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి, యువజన సంఘాల నాయకునిగా కొనసాగుతూ 2005 నుంచి 2020 వరకు ఏఐసీసీ సభ్యుని ఉన్నారు. పీసీపీ కోశాధికారిగా పని చేశారు. 2020లో బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు మొదటిసారిగా బీజేపీ నుంచి పోటీచేస్తున్నారు. మళ్లీ తుంగతుర్తి నుంచే.. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కడియం రామచంద్రయ్య బీజేపీ అభ్యర్థిగా రెండోసారి పోటీలో ఉంటున్నారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచే రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇంకా ఉత్కంఠ.. బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఆగస్టు 21వ తేదీనాడే ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు సాగుతోంది. బీజేపీ మాత్రం మొదటి జాబితాను ప్రకటించడంలో ఆలస్యం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితాను ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఆదివారం ప్రకటించినా ఉమ్మడి జిల్లాలో నాలుగు పేర్లనే ప్రకటించడంతో మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఐదోసారి పోటీలో సంకినేని అసెంబ్లీ ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్వర్రావు ఇప్పుడు ఐదోసారి పోటీ చేయబోతున్నారు. ఒకసారి తుంగతుర్తి నుంచి గెలుపొందిన ఆయన ఒకసారి ఆ నియోజవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తరువాత సూర్యాపేటలో రెండుసార్లు ఓడిపోయారు. 1999లో ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో సూర్యాపేటకు వచ్చారు. అప్పుడు పోటీచేయాలని భావించినా మహాకూటమి పొత్తులో ఆ స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయించారు. ఇక 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నుంచి మళ్లీ పోటీలో ఉండబోతున్నారు. -
పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ మార్పుపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను బీజేపీ పార్టీని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం.. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించింది’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షాకి ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతాం’’ అంటూ కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్ -
మునుగోడు నియోజకవర్గ చరిత్రను ఎవరు తిరగరాస్తారు..?
మునుగోడు నియోజకవర్గం మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు, పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు.ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్! బీజేపీలో మళ్లీ అసమ్మతి గోల.. వేదికపైనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్ తగిలింది. వేదికపైనే ఆ పార్టీ నాయకుల ఇంటిపోరు బయటపడింది. అసంతృప్త నేతలపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతోనే తన పదవి పోయిందని బండి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎడమొహం, పెడమొహం ఇక వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి ముందు నుంచే వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి అటు వైపు, ఇటువైపు ఉన్నవారితో కరచాలనం చేశారు తప్ప ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (చదవండి: తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్) అందుకే త్వరగా వెళ్లిపోయా.. మరోవైపు కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమం నుంచి విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలు సైతం హాట్‌టాపిక్‌గా మారాయి. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది’ అని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం వెనుదిరిగానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. (చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్) -
కాంగ్రెస్ నేత పొంగులేటితో బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. కాగా, గతేడాది ఆగస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదని, జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇక నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: బీజేపీలో కిషన్‌రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్‌ఛేంజర్! బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు -
ఈ పరిస్థితి మనకు అనుకూలం కావాలి ‘చేతి’కి చిక్కొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు బాటలు వేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం మార్గనిర్దేశం చేసింది. ముఖ్య నేతల మధ్య గ్రూపులు, వర్గాల తగాదాలు, పాత–కొత్త పంచాయతీలు, సమన్వయ లోపం, పదవుల పంపకాల ప్రచారం వంటివాటిని పక్కనపెట్టాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకు గండికొట్టేలా ఎవరూ వ్యవహరించరాదని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చెడగొట్టుకోవద్దని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలుచుకుని పార్టీని విజయతీరాలకు చేర్చే వ్యూహాలకు పదునుపెట్టాలని సూచించింది. నేతలను ఢిల్లీకి పిలిపించుకుని.. రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు పెరుగుతుండటం, పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు దూరంగా ఉంటుండటం నేపథ్యంలో వాటి ని చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను శనివారం సాయంత్రం ఢిల్లీకి రప్పించుకుంది. తెలంగాణ రాజకీయ అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా పిలిపించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు నాయకులకు సంయమనం, సమన్వయం, సర్దుబాట్లు తప్పనిసరని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై చర్చించారని.. ఎన్నికల వ్యూహాలు, ప్రచార అ్రస్తాలు, నేతల పర్యటనలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పార్టీ అవసరాలకు తగినట్టుగా, అర్హత, పనితీరు ఆధారంగా పదవులు అవే వస్తాయని భేటీ సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ అపోహలు తొలగేలా చూడాలి! తమ అసంతృప్తికి గల కారణాలను ఈటల, రాజగోపాల్‌రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ఉంచారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న ప్రచారం జరుగుతోందని వివరించినట్టు తెలిసింది. దీనికితోడు మంత్రి కేటీఆర్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతుండటాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మల్చుకుంటోందని చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో పథకాలు, పనుల్లో అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు నేతల వ్యవహారశైలి, సమన్వయ లేమి, తామే ఫోకస్లో ఉండేలా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన జాతీయ నేతలు.. అన్ని అంశాలపై తమకు అవగాహన ఉందని, వాటిని సరిదిద్దే బాధ్యతను తమకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకం అంశంపైనా చర్చ జరిగిందని, రాష్ట్ర బీజేపీలో ఏవైనా సంస్థాగత మార్పులు చేపట్టే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని హైకమాండ్ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాలి అధిష్టానానికి చెప్పామని ఈటల, రాజగోపాల్‌రెడ్డి వెల్లడి తెలంగాణలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే తక్షణమే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ జాతీయ నేతలకు స్పష్టం చేసినట్టు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఏకైక ఆశయం రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దింపడమే. మేం పదవుల కోసమో, లావాదేవీల కోసమో ఢిల్లీకి రాలేదు. బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, సంకోచం లేకుండా జాతీయ నేతలకు వివరించాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని కీలక నిర్ణయాలు చేయాలని కోరాం. తక్షణ కర్తవ్యాలపై మా అభిప్రాయాలను వివరించాం’’ అని వెల్లడించారు. కేంద్ర నాయకత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అమిత్‌షా, నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. -
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు
-
నేతలు చేజారకుండా బీజేపీ అప్రమత్తం
-
తెలంగాణ బీజేపీలో సైలెంట్ వార్.. వారిద్దరూ ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’ ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో, తెలంగాణ కాషాయ పార్టీలో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఇక, కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్‌రెడ్డి తీరుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల సైలెంట్ అయినట్టు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్ కావడంతో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ వీడిన వారందరూ మళ్లీ హస్తం గూటికి వస్తారు అని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. ఇది కూడా చదవండి: గద్దర్ అంటే మాకు గౌరవం ఉంది: బండి సంజయ్ -
వలస నేతల ‘ఉక్కపోత’!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విషయంలో బీజేపీ తాజా వైఖరి ఆ పార్టీ నేతలను ఒకింత అసంతృప్తి, ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో పాలన తీరు.. కేసీఆర్, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణల విషయంలో మెతకగా వ్యవహరించాలన్న సంకేతాల అంశం బీజేపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్లో కీలక నేతగా ఎదిగి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఈటల రాజేందర్, కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచుల వరకు వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల సేవలను బీజేపీ విస్తృత స్థాయిలో వినియోగించుకోలేక పోతోందన్న ఆవేదనను వారి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ విషయంలో మారిన పార్టీ వైఖరితో పాటు సమర్థులైన నాయకులను సరైన పద్ధతిలో వాడుకోలేక పోతోందన్న విషయంలో ఈ ఇద్దరి నాయకులపై క్యాడర్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందని సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కేసీఆర్, ఆయన ప్రభుత్వం, ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కేసుల విషయంలో వేగం తగ్గిందని, ఇది బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు వారిలో అనుమానాలకు కారణమవుతోందని అంటున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తాము ఇప్పుడెలా ప్రజల్లోకి వెళతామని, కేసీఆర్‌పై పోరాడే పార్టీలోనే మనం ఉండాలని హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాల క్యాడర్ అంటున్నట్లు సమాచారం. కార్యకర్తలు, ముఖ్య అనుచరుల నుండి పెరుగుతోన్న వత్తిడి నేపథ్యంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతిరోజూ భేటీ అవుతున్నారు. తాము కేసీఆర్, ఆయన కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్నామని, ప్రస్తుత కీలక దశలో బీఆర్ఎస్ విషయంలో బీజేపీ రాజకీయ వైఖరిని మార్చుకునే పరిస్థితి ఉంటే తాము.. మెజారిటీ కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పోరాట పంథాను రూపొందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి బీఆర్ఎస్కు పరోక్ష మద్దతిచ్చే బీజేపీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతా ఉమ్మడి వేదికపైకి.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలపై కింది స్థాయి నుంచి వత్తిడి వస్తోన్న నేపథ్యంలో త్వరలో రాజగోపాల్ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ అనుచరులతో పాటు సబ్బండ వర్గాలు, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన ప్రతినిధులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వచ్చే ప్రతిపాదన దిశగా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవిర్భావానికి ముందు ఇక్కడి ప్రజలు ఏం కోరుకున్నారు?, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది?, ఇందులో బీఆర్ఎస్ నేతల అవినీతి, బంధుప్రీతి ఎలా రాజ్యం చేసింది? తదితర అంశాలపై చర్చించి, అందులో వచ్చే ఏకాభిప్రాయం ద్వారా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశగానే గడిచిన వారం రోజులుగా రాజగోపాల్‌రెడ్డి పలువురు కీలక నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
సత్తన్న ఇంటికి ‘కోమటిరెడ్డి’
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీచైర్మన్ శోభారాణి, బీఆర్ఎస్ రాష్ట్రనేత సత్యనారాయణగౌడ్ దంపతులను మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సత్తన్న ఇంటికి వెళ్లి ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సత్యనారాయణగౌడ్‌ను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ ముధోల్ నియోజకవర్గ నేత రామారావుపటేల్, తదితరులు ఉన్నారు. రాజకీయమేమీ లేదు.. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నేతగా గుర్తింపు ఉన్న సత్యనారాయణగౌడ్ ఇంటికి రాజ్‌గోపాల్‌రెడ్డి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీఆర్ఎస్తో అంటీముట్టనట్టుగా ఉంటున్న సత్తన్న బీజేపీలో చేరుతారా..? ఆదిలాబాద్ పార్లమెంట్‌ను దత్తత తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన కోమటిరెడ్డి అదే విషయంలో ఈయన ఇంటికి వచ్చారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ‘సాక్షి’వివరణ కోరగా సత్యనారాయణగౌడ్ కొట్టిపారేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువు తనకు క్లాస్మేట్ అని, ఆక్రమంలో ముందునుంచీ తమకు కొంత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్ మీటింగ్‌కు వెళ్లి వస్తూ ఆరోగ్య సమాచారం దృష్ట్యా తనను పరామర్శించడానికి మాత్రమే ఆయన వచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పార్టీల చర్చే తమ మధ్య రాలేదన్నారు. తొలిసారి తన ఇంటికి వచ్చినందున శాలువా, జ్ఞాపికతో సత్కరించానని అన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం
మహబూబ్‌నగర్ రూరల్/హన్వాడ: రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా ఎదుగుతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోడూరు, హన్వాడలో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడంలేదని శ్రీకాంతాచారి వంటి అనేక మంది త్యాగాలు చేశారని, ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని, దక్షిణ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అన్నారు. నెత్తిమీద రూపాయి పెడితే కూడా ఎవరూ కొనుక్కోలేని వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయ్యారని, కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు కేవలం ఆరు నెలల్లో కాలం చెల్లనుందన్నారు. ప్రజలు సామాజిక తెలంగాణను కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, జిల్లా ఇన్చార్జి భరత్‌గౌడ్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. -
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు మధ్య ట్విట్టర్లో మాటల వార్ కొనసాగుతోంది. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌రెడ్డి గట్టి కౌంటరే ఇచ్చారు. ‘‘రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు!!. 28 వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌కు రియాక్షన్‌గా ‘‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకెళ్లడం ఖాయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి బదులిచ్చారు. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc — Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022 చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్ -
‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ‘‘రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు!!. 28 వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు’’ అంటూ ట్విట్ చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సమీర్ మహేంద్రుతో పాటు మరో నాలుగు మద్యం సంస్థలపై ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత పేరు కూడా ఛార్జ్షీటులో ఈడీ పేర్కొంది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్విట్ చేశారు. చదవండి: సొంత గూటికి 'ఎల్లో కాంగ్రెస్'! తన మనుషులు మళ్లీ టీడీపీలో చేరేలా బాబు ప్లాన్! -
నల్గొండ జిల్లా: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
-
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆయనను తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఉద్రిక్తత నడుమ రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్ తరలించారు. కాగా, గెలుపు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా చండూరులో టీఆర్ఎస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. అలాగే చౌటుప్పల్‌లో భారీ స్వాగత కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. అదే సమయంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఉప ఎన్నిక సందర్భంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మునుగోడులో రాజకీయ వేడి రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల నినాదాలతో మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది. చదవండి: కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు -
Hyderabad: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు
-
హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్-12లో కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సుశి ఇన్ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. -
మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని.. ఆ నగదుకు సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలలోగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఉప ఎన్నిక పోలింగ్ సమీస్తున్న సమయంలో ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది. మునుగోడులోని ఖాతాలను నగదుతో.. మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నగదు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఈ నెల 29న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన 23 వేర్వేరు వ్యక్తులు/కంపెనీల ఖాతాలకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని.. ఆ ఖాతాలను సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రూ.5.24 కోట్లు పొందిన మునుగోడు వ్యాపారులు, ఇతర వ్యక్తులకు సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నగదును దేనికి బదిలీ చేశారు? టీఆర్ఎస్ ఆరోపించిన విధంగా రాజగోపాల్‌రెడ్డి ద్వారాగానీ, ఆయన ఆదేశానుసారం కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారాగానీ 23 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన రూ.5.24 కోట్లను ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగించట్లేదని నిర్ధారించాల్సిన బాధ్యత రాజగోపాల్‌రెడ్డిపై ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం అవినీతి పద్ధతి అని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సోమవారం సాయంత్రం 4 గంటలలోపు పూర్తి వివరణ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణతో సంతృప్తి చెందని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ ధన బలంతో మునుగోడులో గెలువాలని చూస్తోంది : రాజగోపాల్ రెడ్డి
-
తన స్వార్థం కోసమే రాజీనామా చేశారు: శ్రీనివాస గౌడ్
-
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ
సాక్షి, నల్గొండ జిల్లా: పోలింగ్ సమీపించే కొద్దీ మునుగోడులో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు దారి తీస్తుంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. సీఎంతో భేటీ కాగా, నాంపల్లి మండలంలో ఆదివారం.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుకున్న సంగతి తెలిసిందే. తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు -
అధికారంలో ఉండి దత్తత ఎందుకు
నల్గొండ: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మునుగోడును మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటాననడం ఏంటని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని శివన్నగూడ, యరగండ్లపల్లితోపాటు పలు గ్రామాల్లో ఆమె ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తత పేరిట కేసీఆర్ అనేకమార్లు మోసం చేశారని అన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందించడానికి మనసొప్పదు కానీ, ఉప ఎన్నికలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని అధికార పార్టీ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి 84 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు, 16 మంది ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని, సీఎం కేసీఆర్ సైతం లెంకలపల్లి గ్రామానికి ఇన్‌చార్‌్జగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో ఆగిన పనులు ప్రారంభిస్తున్నారని అన్నారు. రాజగోపాల్‌రెడ్డిపై విశ్వాసం ఉంచి మునుగోడు ఉప ఎన్నికలోగెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల సబితాయాదగిరిరెడ్డి, మెండు దీపికాప్రవీణ్రెడ్డి, కొడాల రాజ్యలక్ష్మీవెంకట్రెడ్డి, జమ్ముల వెంకటేష్‌గౌడ్, రాజేందర్‌నాయక్, ఎలిమినేటి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓడిపోతామనే భయంతో దుష్ప్రచారాలు బీజేపీ విస్తృత ప్రచారం మండలంలోని రాంరెడ్డిపల్లిలో బీజేపీ నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కోఇన్‌చార్జ్ బొడిగ నాగరాజు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నమనేని శోభారవీందర్రావు, మాజీ ఎంపీపీ పాముల యాదయ్య, మండల కార్యదర్శి పగిళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య, మోర వెంకటయ్య, నక్క బుగ్గరాములు, వడ్డె ముత్యాలు, కావలి గద్దర్, వడ్డె శంకరయ్య, లపంగి దేవేందర్, వడ్డె సైదులు, రాములు, కొండా దేవేందర్, రాజు, వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చండూరు : మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తుల ఉమాతో కలిసి శుక్రవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోరుతూ మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో తాము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. తమపై పార్టీ మారుతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేయడం సరికాదన్నారు. బీజేపీ గెలుపు ఖాయమైందని అనేక సర్వేలు చెబుతుండడంతో టీఆర్ఎస్లో వణుకు మొదలైందన్నారు. ఓటమి చెందుతున్నామనే సంకేతం రావడంతో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా బీజేపీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని అన్నారు. నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు ప్రస్తుత మంత్రులు బీజేపీలోకి రానున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
మునుగోడులో అసలు ఏం జరుగుతోంది.. అలా చేసింది ఎవరు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం, కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా నియోజకవర్గంలోని చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నేడే విడుదల.. షా సమర్పించు రూ. 18వేల కోట్లు.. కోవర్టురెడ్డి అంటూ పోస్టర్లు వెలశాయి. కాగా, ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికిస్తుండగా బీజేపీ కార్యకర్త గమినించారు. దీంతో, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కార్లలో దుండగులు పరారైనట్టు బీజేపీ కార్యకర్త తెలిపారు. దీంతో, బీజేపీ వ్యతిరేక పోస్టర్లు ఎవరు అంటించారు అనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ‘‘అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా నాతో సంప్రదింపులు జరపలేదు. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నా. నాకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తాను మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందకు సిద్ధంగా ఉన్నానని కూడా నర్సయ్య గౌడ్ కామెంట్స్ చేయడం విశేషం. -
మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీపైనే ఫోకస్ పెట్టాయి. రానున్న సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. వామపక్షాలు కలిసిరావడంతో కొంతమేరకు ఊరట చెందుతున్నప్పటికీ ఎక్కడో ఓ మూలన కీడు శంకిస్తున్నారు.. ఆ పార్టీ నాయకులు. మొత్తంగా హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. మరోవైపు మునుగోడులో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లపై ఆశలు పెట్టుకొని ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతోంది. చదవండి: మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు పోటాపోటీగా.. ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే రానున్న సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఒత్తిడిలో టీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయి. అందుకోసం ఆరునూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల ఇంటింటికి వెళ్లి తమదైన శైలిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీల ప్రచారంతో గ్రా మాల్లో వాతావారణం వేడెక్కింది. కాంగ్రెస్ ఓట్లపై కన్ను మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కాగా కాంగ్రెస్ ఓటర్లపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కన్నేశాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా తనకున్న పరిచయాలు, బంధుత్వాలు, వ్యక్తిగత ఇమేజ్‌తో కాంగ్రెస్ ఓట్లకు పెద్ద ఎత్తున గండికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఓటర్లు బీజేపీలో చేరకుండా టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంబీజేపీ గెలుపును అడ్డుకోవడం ద్వారా ము నుగోడులో పూర్వవైభవం సాధించాలన్న లక్ష్యంతో కమ్యూనిస్టులు ఉన్నారు. మంగళవారం చండూరులో సీపీఐ, సీపీఐ(ఎం)లు బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తమ వైఖరిని స్పష్టం చేశాయి. మునుగోడులో పోటీ చేస్తున్నది టీఆర్ఎస్ అభ్యర్థికాదని వామపక్షాల వ్యక్తిగా భావించి పనిచేయాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకున్న కార్యకర్తలు చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో బుధవారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. రాజ గోపాల్‌రెడ్డి తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించి ఎనగండితండాకు వెళ్లిపోయారు. -
తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: రాజగోపాల్‌రెడ్డి
-
అందుకు మీరు సిద్ధమా?.. రాజగోపాల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశమంతా మునుగోడు వైపు చూస్తోందన్నారు. చదవండి: కారు పార్టీలో కోల్డ్‌వార్.. టీఆర్ఎస్లో ఎవరి దారి వారిదే! తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయిమెంట్ ఇవ్వకుండా అవమానించారు. అధికార యంత్రాంగం అంతా అస్తవ్యస్తంగా మారింది. ఉప ఎన్నికలు వస్తే అకౌంట్లో డబ్బులు వేయడం ఆ తర్వాత మర్చిపోవడం అలవాటుగా మారిందని’’ రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి. ఒక వ్యక్తి కోసం వచ్చిన ఉప ఎన్నిక కాదు. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ గురించి మాట్లాడుతోంది. వేల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేలు ఊరూరు తిరుగుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా ధర్మం వైపు ఉండాలి. భవిష్యత్తు తరాల బాగు కోసం వచ్చిన ఉప ఎన్నిక తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల నుంచి గాడిన పడాలంటే బీజేపీకి ఓటేయాలి. రెండు నెలలుగా అమ్ముడు పోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రుజువు చేయకపోతే రాజీనామా చేయండి. తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను కోర్టుకు ఈడుస్తా. ఒక నియంతకు బుద్ధి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. యాదాద్రి గర్భగుడిలో తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తా మీరు సిద్ధమా’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. -
మునుగోడు లో బీజేపీదే విజయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
మునుగోడులో మరో ట్విస్ట్.. రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో అనుకోని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మునుగోడు విషయంలో మరోసారి ఆసక్తికర ఘటన జరిగింది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి.. రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డిపై అనర్హత వేటు వేయాలి. రాజగోపాల్‌రెడ్డి రూ. 18వేల కోట్ల పనులు తీసుకుని మునుగోడులో ఓట్లు కొంటున్నారు. రూ. 18వేల కోట్లలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాటా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. తప్పు చేసిన వారు భయపడతారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎన్నిసార్లు అడిగిన ముఖ్యమంత్రి అపాయిమెంట్ ఇవ్వలేదు. ఉప ఎన్నిక అనగానే సీఎం మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చింది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
కేసీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు కారణంగా పాలిటిక్స్ వేడెక్కాయి. శనివారం టీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా దీవెన సభలో బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా దీవెన సభలో కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదు. జాతీయ రాజకీయాలు చెప్పి మళ్లీ ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు. మునుగోడు ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు. మునుగోడులో రైతులకు ఇంకా సాగునీరు అందలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ పూర్తి చేయలేకపోయింది. సీఎం కేసీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలను సహాయం చేసినట్లు చెప్పారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? ఎందుకు డబ్బులు ఇచ్చారు. దీన్ని రాజగోపాల్ రెడ్డి.. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించారా?. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పలేదు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసిఆరే. బీజేపీకి కేసీఆరే ఆదర్శం. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచిందే కేసీఆర్. ఏకలింగం ఉన్న బీజేపీని మూడు తోకలు చేసింది నువ్వే కదా అని విమర్శించారు. కేసీఆర్ గతంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని అవమానించారు. కానీ, ప్రస్తుతం కమ్యూనిస్ట్ సోదరులు ఎందుకు కేసీఆర్ ఉచ్చులో పడుతున్నారో తెలియడం లేదు’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మరో ట్విస్ట్.. అది నిజమేనా? -
మునుగోడు ధర్మయుద్ధంలో విజయం నాదే: రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: మునుగోడులో జరిగే ధర్మ యుద్ధంలో తన విజయం తథ్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజాసేవకు తాను ఆస్తులు అమ్ముకుంటే.. మంత్రి జగదీశ్‌రెడ్డి పద విని అడ్డంపెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో తన అనుచరులు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జగదీశ్ రెడ్డికి విద్యుత్ శాఖకు బదులుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయిస్తే బాగుంటుందని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు నిధులు తీసుకెళ్తుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ జగదీశ్‌రెడ్డి అని దుయ్య బట్టారు. ఈనెల 21న మునుగోడులో జరిగే అమిత్‌షా సభలో తనతోపాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు రూ.8 లక్షల ఆర్థికసాయం చేశారు. చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
మునుగోడుపై మెలిక.. ఉప ఎన్నిక రాకపోవచ్చు: ఇంద్రసేనారెడ్డి
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీ టీఆర్ఎస్తో సహా కాంగ్రెస్, బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ లైట్‌గా తీసుకుంటుంది. ఇక, మునుగోడుకు ఉప ఎన్నిక రాకపోవచ్చు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మునుగోడుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చినా హస్తం పార్టీ గెలవదు. కాగా, మునుగోడులో కమ్యూనిస్టులు సైతం ఒంటరిగా గెలవలేరు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్ -
స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామా సమర్పిస్తా: రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ: తానే స్వయంగా వెళ్లి స్పీకర్‌కి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 8న స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెప్పారు. స్పీకర్ తనను కలవకుండా కాలయాపన చేస్తే అసెంబ్లీ సెక్రటరీని కలిసి రాజీనామా సమర్పిస్తానని స్పష్టం చేశారు. చండూరు పర్యటనలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపుతానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ‘చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించాను. కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదు. శేషిలేటి వాగు,వెల్మకన్నె పీడర్ ఛానల్ గురించి అధికారులతో చాలా సార్లు మాట్లాడినా స్పందించలేదు. మునుగోడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు కూడా కేసీఆర్ నిధులు ఇవ్వలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారు. చండూర్, చౌటుప్పల్ మున్సిపాటీల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు.’ అని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమే’ -
బీజేపీలోకి చేరుతున్నా.. డేట్ ఫిక్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..
సాక్షి, ఢిల్లీ: ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చౌటుప్పల్‌లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానన్నారు. చదవండి: పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సహకరించపోయినా కష్టపడ్డానన్నారు. ‘‘టీఆర్ఎస్లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నా.. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా? మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని’’ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మాపై పెత్తనం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వెంకట్‌రెడ్డిపై అద్దంకి వ్యాఖ్యలు దారుణం. రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి వెంకట్‌రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చిల్లర గ్యాంగ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. దుర్మార్గుడి చేతుల్లోకి కాంగ్రెస్ వెళ్లింది. రేవంత్, ఆయన సైన్యం దొంగల ముఠాగా ఏర్పడింది.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి అవినీతి లేదు. రేవంత్ స్వార్థం కోసం, పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరాడు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్న చరిత్ర రేవంత్‌ది’’ అని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ కుటుంబసభ్యుడని, వెంకట్‌రెడ్డి వేరు, రాజగోపాల్‌రెడ్డి వేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్... కాకపుట్టిస్తున్న మునుగోడు రాజకీయం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాజగోపాల్‌రెడ్డికి బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురించి తాను ప్రస్తావన చేయలేదని స్పష్టం చేశారు. ఆయనకు, తనకు మధ్య కావాలనే విబేధాలు సృష్టిస్తున్నారన్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. -
కాంగ్రెస్‌లో టెన్షన్.. టెన్షన్.. తెలంగాణలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది బాగా నష్టం చేసే పరిణామంగా అనుకోవాలి. దానికి తోడు రాజగోపాలరెడ్డి, రేవంత్‌ల మధ్య సాగిన మాటల యుద్దం కూడా కాంగ్రెస్‌కు కొంత నష్టం చేయవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డిలు కాంగ్రెస్‌లో బలమైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నల్లగొండ రాజకీయాలలో తమకంటూ ఒక ఒక పాత్రను సృష్టించుకోగలిగారు. 1999లో వెంకటరెడ్డి యువజన కాంగ్రెస్ ద్వారా ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డికి దగ్గర అయ్యారు. అప్పటి నుంచి వైఎస్ సన్నిహితుడుగా ఉంటూ వచ్చినా, వైఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యారు. చదవండి: అయోమయంలో కాంగ్రెస్.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా? టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులతో కలిసి విద్యుత్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేయడం, మంత్రి పదవిని వదలుకోవడం వంటి వాటి ద్వారా తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు. నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వెంకటరెడ్డి గత ఎన్నికలలో నల్లగొండ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి చెందారు. తదుపరి వచ్చిన లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి తొలిసారిగా 2009లో భువనగిరి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014లో ఆయన ఓటమి చెందినా, తదుపరి శాసనమండలికి ఎన్నిక కాగలిగారు. 2019లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే అలా జరగకపోగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో విలీనం అవడం ఆ పార్టీకి అవమానంగా మారింది. ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులలో ఒకరు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడం కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరూ ఫైర్ బ్రాండ్‌గా పేరొందారు. జిల్లాలో కాని, రాష్ట్ర స్థాయిలో కాని సొంత పార్టీవారిపైన అయినా, ప్రత్యర్ది పార్టీపైన అయినా, పదునైన మాటలతో విమర్శలు కురిపించగలరు. కోమటిరెడ్డి సోదరులు పీసీసీని తమకు అప్పగించాలని అధిష్టానాన్ని గతంలో కోరారు. కాని వైఎస్ సన్నిహితులు అన్న కారణంగానో, మరెందువల్లో కాని వారి వైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మొగ్గు చూపలేదు. పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి విశేష ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం వీరికి జీర్ణం కాని పరిస్థితి అయింది. దాంతో వెంకటరెడ్డి ఏకంగా పార్టీ ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్‌కు కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి పొందారని ఆరోపించడం తీవ్ర కలకలం రేగింది. అయినా ఆ తర్వాత సర్దుకుని, స్టార్ కాంపెయినర్ హోదాతో సరిపెట్టుకున్నారు. కాగా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి రెండేళ్ల నుంచే బీజేపీ పాట అందుకున్నారు. టీఆర్ఎస్ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లే శక్తిమంతమైన నేతలని అనడం ఆరంభించారు. కాని ఆయన చాలా కాలం ఊగిసలాటలో ఉన్నారనే చెప్పాలి. ఒకసారి కాంగ్రెస్‌ను వీడతానని, మరోసారి ఇక్కడే ఉంటానని అంటూ కాలం గడిపారు. కాని ఇటీవలి కాలంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ స్పర్ద బాగా పెరిగిపోవడంతో బీజేపీ ఇక తన గేమ్ ఆరంభించింది. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న రాజగోపాలరెడ్డిని పార్టీలోకి రప్పించడానికి ఎత్తులు వేసింది. స్వయంగా అమిత్ షానే పార్లమెంటు హాలులో ఈయనతో మంతనాలు జరపడమే ఇందుకు నిదర్శనం. రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాలని అప్పుడే షా సూచించారని చెబుతారు. ఆ తర్వాత దానిని ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి రాజగోపాలరెడ్డి పావులు కదిపారు. ముందుగా తనతో ఉన్న కాంగ్రెస్ మునుగోడు స్థానిక నేతలను బీజేపీలోకి తీసుకు వెళ్లడానికి గాను సంప్రదింపులు జరిపారు. తాను ఒక్కడినే పార్టీని వీడినా పెద్ద ఫలితం ఉండదని ఆయనకు తెలుసు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు, మునుగోడు నియోజకవర్గ అభివృద్దికి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని చెప్పడం ఆరంభించారు. నియోజకవర్గ అభివృద్ది అనుకుంటే టీఆర్ఎస్ లోనే చేరవచ్చు కదా అన్న విమర్శ కూడా లేకపోలేదు. వీరికి దేశ వ్యాప్తంగా పలు చోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి. బీజేపీలో చేరితే వ్యాపార పరంగా ఉపయోగం ఉంటుందని అనుకుని ఉండవచ్చన్నది ఎక్కువ మంది భావన. దాని సంగతి ఎలా ఉన్నా, కాంగ్రెస్‌లో ఉండడం వల్ల తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయానికి ఆయన వచ్చేశారు. అందులోను రేవంత్‌కు అధ్యక్ష పదవి అప్పగించడం ఆయనకు సుతరాము ఇష్టం లేదు. అందువల్లే చాలా కాలంగా కాంగ్రెస్ యాక్టివిటిలో పెద్దగా కనిపించడం లేదు. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటారని ఇప్పటికీ చాలా మంది నమ్ముతుంటారు. అందుకే రేవంత్‌ను తెలంగాణ చంద్రబాబుగా కోమటిరెడ్డి పోల్చారు. అది వేరే సంగతి. రాజగోపాలరెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది కాని విఫలం అయింది. ఆ తర్వాత రేవంత్ ఈయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వేసే బిస్కట్ల కోసం రాజగోపాలరెడ్డి ఆశపడ్డారని, సోనియాగాంధీకి వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. నిజానికి రేవంత్ ఇలాంటి వ్యాఖ్య చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తదుపరి టిఆర్ఎస్లో యాక్టివ్‌గా ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందారు. చివరికి చంద్రబాబు తరపున నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్లి తెలంగాణ ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. ఆయనపై ఈ నెగిటివ్ మార్క్ ఉన్నా కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు పీసీసీ బాధ్యత అప్పగించింది. రేవంత్ తన మాటల ఘాటుతో కాంగ్రెస్ శ్రేణులను కొంతవరకు ఆకర్షించిన మాట నిజం. కాని కాంగ్రెస్ సీనియర్లు ఆయన తీరుతో బహిరంగంగానే విభేధించడం జరుగుతోంది. ఇదంతా కాంగ్రెస్‌కు చికాకుగానే ఉంది. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పార్టీ అధినాయకత్వం ఉన్నప్పటికీ ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం అయితే పార్టీ చేష్టలుడిగి చూస్తుండిపోయింది తప్ప, గట్టిగా పోరాటం చేయలేకపోయింది. రేవంత్ ఆయా కార్యక్రమాలను జోష్ గా నడపాలని కృషి చేస్తున్నా, ఎటో వైపు నుంచి తలనొప్పి తప్పడం లేదు. టీఆర్ఎస్ తర్వాత తెలంగాణలో బలమైన పార్టీ కాంగ్రెసే. కాని తాజా పరిణామాలతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య కాంగ్రెస్ నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దుబ్బాక లో మూడో స్థానానికి పరిమితం కావడం, హుజూరాబాద్ లో కేవలం మూడువేల ఓట్లే రావడం, గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 డివిజన్లు వస్తే కాంగ్రెస్‌కు కేవలం రెండే దక్కడం బాగా నష్టం చేసింది. ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారింది. నిజంగానే రాజగోపాలరెడ్డి వెంటే మెజార్టీ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోతే కాంగ్రెస్‌కు సరైన అభ్యర్ది దొరకడం కూడా కష్టమే అవుతుంది. రాజగోపాలరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నా, ఈ పరిణామాలలో ఆయన జోక్యం చేసుకోవడం కష్టమే అవుతుంది. తాము చెప్పినట్లు కాంగ్రెస్ అధిష్టానం విననప్పుడు తాము ఎందుకు పూసుకోవాలని ఆయన అనుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయిందన్న కథనాలు మీడియాలో వస్తున్నాయి. వ్యక్తిగా రాజగోపాలరెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక అవుతుంది. బీజేపీకి ఈయన మరో ట్రంప్ కార్డు అవుతారు. బీజేపీ ఆడుతున్న గేమ్ లో ఈయన గెలిస్తే తెలంగాణ రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తుందన్నది వాస్తవం. కాంగ్రెస్ ను ముందుగా బలహీనం చేయడం ద్వారా టీఆర్ఎస్ను ఎదుర్కోవాలన్న బీజేపీ వ్యూహం ఫలిస్తున్నట్లవుతుంది. ఒకవేళ ఓడిపోయి రెండో స్థానం సాధించినా బీజేపీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టగలిగితే అది కూడా వారికి లాభమే అవుతుంది. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం రాజగోపాలరెడ్డికి పెద్ద దెబ్బ అవుతుంది. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఇది కీలకమైన ఎన్నిక అవుతుంది. టీఆర్ఎస్ గెలవకపోతే ఆయన బీజేపీ నుంచి మరిన్ని ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం అది ఆ పార్టీకి వచ్చే ఎన్నికల నేపథ్యంలో మంచి ఉత్సాహం ఇస్తుంది. కాంగ్రెస్ ఉనికికి ఇది పరీక్ష అయితే టీఆర్ఎస్కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం అవుతుంది. బీజేపీకి మాత్రం లాటరీ వంటిదే. ఓడిపోతే కొంత అప్రతిష్ట వచ్చినా వారికి పెద్దగా పోయేది ఏమీ ఉండదు. కొండకు వెంట్రుక కట్టినట్లుగా గెలిస్తే కొండ వచ్చినట్లు..లేకుంటే వెంట్రుక పోయినట్లే బీజేపీ అనుకోవచ్చు. త్రిపురలో కాంగ్రెస్‌ను మొత్తం ఖాళీ చేసి అధికారంలోకి వచ్చినట్లు, పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలను సున్నా చేసి, తాను ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినట్లుగా బీజేపీ చేస్తున్న వ్యూహరచన తెలంగాణలో ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఈ గేమ్ లో రాజగోపాలరెడ్డి కీలకమైన వ్యక్తిగా మారారన్నది వాస్తవం. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు. బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. అభ్యర్థి ఎవరు? కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతితోపాటు గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన రియల్టర్ కృష్ణారెడ్డిని బరిలో దింపే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఎవరు పోటీచేసినా గెలిపించే బాధ్యతను నల్లగొండ జిల్లా నాయకత్వమే చూసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. ఉప ఎన్నిక కోసం కమిటీ రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యే నేపథ్యంలో.. ప్రత్యేక వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో.. నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్‌లను సభ్యులుగా నియమిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. (క్లిక్: రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి) సస్పెండ్ చేస్తారనే..! రాజగోపాల్ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీకి విధేయుడైన నాయకుడిని కోల్పోయామని కొందరు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతోనే రాజీనామా ప్రకటన చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా.. మంగళవారం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అధిష్టానం నుంచి సమాచారం అందిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. (క్లిక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?) -
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ ఇంకా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. పీసీసీగానే కాదు.. ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినా ఆయనను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడలేదని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఏం చేశారని నిలదీశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి బ్రాండ్‌నేమ్ బ్లాక్మెయిల్. జయశంకర్, కోదండరామ్‌ను తిట్టిన చరిత్ర నీది. వైఎస్సార్ మరణంపై కూడా విమర్శలు చేశాడు. సోనియాను తిట్టిన వ్యక్తి నా గురించి మాట్లాడుతున్నాడు. కొడంగల్‌లో ఓడిపోయావు. పాలమూరు ఎంపీగా ఎందుకు పోటీ చేయలేదు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కజ్గిరిలో పోటీ చేశావు. కాంగ్రెస్‌లోకి వచ్చి మాకు నీతులు చెబుతున్నావు. నీలాంటి వాడితో మేము చెప్పించుకోవాలా! పీసీసీ చీఫ్ అయ్యాక ఇంటికి వస్తా అంటే వద్దు అన్నా. జైలుకు వెళ్లి వచ్చినవాడు ఇంటికొస్తే మురికి అవుతుందని వద్దన్నా. ఎవరినీ పండపెట్టి తొక్కుతవ్. నువ్వు ఉన్నది మూడు ఫీట్లు, నన్ను తొక్కుతావా? ఎక్కడికి వెళ్లినా జిందాబాద్ కొట్టించుకుంటావు. నిన్ను సీఎంగా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? హుజురాబాద్ వెళ్లి ఏం చేశావు. మునుగోడుకు నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు. నీలాంటి చిల్లర దొంగ దగ్గర పనిచేసే ప్రసక్తే లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ చచ్చిపోయింది’ అని రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి.. సిగ్గూశరం ఉంటే ఆ పని చెయ్! -
రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి.. సిగ్గూశరం ఉంటే ఆ పని చెయ్!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీసీసీ పదవిని రేవంత్ డబ్బులతో కొన్నాడని ఆరోపించారు. తెలంగాణలో పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. పీసీసీ ప్రెసిడెంట్ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్ చేసుకున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చాడని, స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికకు భయపడి ఉత్తుత్తి రాజీనామా చేశాడని ప్రస్తావించారు. సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్ ఒక్కడేనని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, తెలంగాణలో ఉద్యమంలో ఏనాడైనా జైలుకెళ్లాడా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేస్తాడని ఆరోపించారు. వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని రేవంత్‌ను నిలదీశారు. సిగ్గుశరం ఉంటే బీజేపీతో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమేనని.. రేవంత్ బహిరంగ చర్చ సిద్ధమేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు! -
కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! నా నిర్ణయం తప్పయితే క్షమించండి..
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని బాధతో చెప్తున్నా. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ప్రజల్లో తిరగలేను. నేడో, రేపో రాజీనామా చేస్తా. నా పదవీ త్యాగంతో అయినా ఈ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలి. ప్రజాస్వామ్యంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలనే నిర్ణయానికి రావాలి. మునుగోడు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో రాజీనామా చేస్తున్నా’’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తాను ఈ విషయంలో కొంత సమయం తీసుకుందామని అనుకున్నానని.. కానీ కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. ఆ దుష్ప్రచారాన్ని ఆపేందుకే ప్రకటన చేస్తున్నానని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒక్క కుటుంబం తెలంగాణను పాలిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. భవిష్యత్తులో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లకు తప్పితే ఏ నియోజకవర్గానికీ నిధులు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ అమెరికాలో ఉన్నట్టు రోడ్లు ఉన్నాయి. కానీ రోజూ వేల మంది తిరిగే చౌటుప్పల్–నారాయణపురం రోడ్డు మాత్రం గుంతలమయమైంది. ఏ అభివృద్ధీ చేయలేని ఈ ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ఉండటం దేనికని రాజీనామా చేస్తున్నా..’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి అవుతుందంటే పదవీ త్యాగం చేస్తానని ఎప్పుడో చెప్పానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ఇచ్చినప్పుడే.. మునుగోడు దళితుల కోసం రూ.2 వేల కోట్లు ఇస్తే పదవీత్యాగం చేసి, టీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం నిధులివ్వక మునుగోడును ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయానని వాపోయారు. ఉప ఎన్నికలు వచ్చినచోట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశ కలిగిందని.. అందుకే తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ బలహీనం కాంగ్రెస్ అంటే తనకు విశ్వాసం ఉందని, సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కానీ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పార్టీ బలహీన పడిందని, పార్టీలో అంతర్గతంగా ఈ విషయం మాట్లాడినా లాభం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండాలని నాయకత్వం అడుగుతున్నా.. ఉండి చేసేదేమీ లేదని, టీఆర్ఎస్పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదు కాబట్టి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ‘‘20 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని తిట్టిన వారిని తీసుకొచ్చి వాళ్ల కింద మమ్మల్ని పనిచేయాలంటున్నారు. మాకు ఆత్మగౌరవం లేదా? ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడమేకాదు.. వాళ్లే ప్రభుత్వం తీసుకువస్తారని మాట్లాడుతారా? పదవులు ఇవ్వకపోయినా కనీసం చర్చించి నిర్ణయాలు తీసుకోరా? కాంగ్రెస్ మీ కంట్రోల్లో ఉండాలా? ఏం తప్పు చేశామని మాపై చర్యలు తీసుకుంటారు? తెలంగాణ ఇచ్చికూడా తప్పులు చేసి మూర్ఖంగా పార్టీని నాశనం చేశారు. దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయారు’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అరాచక పాలనకు మోదీ, షాలతోనే చెక్ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే మోదీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమని.. తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం బతుకుతారు. డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లు కాదు. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోలేదు. నా రాజకీయ జీవితానికి, వ్యాపారాలకు సంబంధం లేదు. నా కుమారుడే అన్ని వ్యాపారాలు చూసుకుంటున్నాడు. మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారు. నా నిర్ణయం తప్పయితే క్షమించండి. సరైనదే అనుకుంటే నాతో రండి’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో ఎప్పుడు, ఎవరి సమక్షంలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి ఏం చేస్తారనేది ఆయననే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. -
రాజగోపాల్‌రెడ్డితో ముగిసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ
-
రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ నేతలు
-
పార్టీ మారితే నాతో మీరొస్తారా..?
సాక్షి ప్రతినిధి నల్లగొండ : ‘నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందునే నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోతున్నా. కనీసం సంక్షేమ పథకాల పంపిణీలో కూడా నా ప్రమోయం లేకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నాకు గుర్తింపు వస్తుందని ఆ పనులకు నిధులు ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తే అక్కడ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎలాంటి పదవులు ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు.. నేను రాజీనామా చేస్తే కొన్నైనా అభివృద్ధి పనులను చేపడతారు.. అందుకు నిదర్శనం గట్టుప్పల మండల ఏర్పాటే. అందుకే పార్టీ మారడం అనివార్యం.. పార్టీ మారితే నాతో మీరొస్తారా..? వస్తే ఇంతకంటే బాగానే ఉంటుంది.’ ఇవీ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో చెబుతున్న మాటలు. దీనినిబట్టి ఆయన పార్టీ మారడం ఖాయమైపోయిందని అర్థం అవుతోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ధ్రువీకరించారు. గెలిచినా.. ఓడినా మీవెంటే.. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖరారు కావడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పనిసరి కాబోతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆగస్టు మొదటివారం, లేదా రెండో వారంలో పార్టీ మారే అవకాశం ఉంది. అంతకంటే ముందు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ఆత్మీయులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పు ఆవశ్యకతను కూడా వివరిస్తున్నారు. హైదరాబాద్‌కు పిలిపించుకొని వారితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన నేతలతో చర్చించిన ఆయన బుధవారం మునుగోడు, సంస్థాన్‌నారాయణçపురం మండల నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ముందున్న పరిస్థితులు అన్నింటిని వివరించారు. వెంట రావాలని కోరారు. ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా తాను మునుగోడు నుంచే రాజకీయాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలతోనూ భేటీ కానున్నారు. అయితే, పార్టీ మార్పు నేపథ్యంలో తన వెంట వచ్చే నేతలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను, ముఖ్య నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా రెండు మండలాల నేతలతో మాట్లాడుతున్నారు. ఈ భేటీలకు ఒక్కో మండలం నుంచి 150 నుంచి 250 మందికి వరకు నేతలు హాజరవుతున్నారు. ఆయన రాజీనామా, పార్టీ మారే సమయం నాటికి ఆయన వెంట ఎవరెవరు ఉంటారన్నది తేలనుంది. త్వరలో ప్రత్యేకంగా సర్వే... తాను ఢిల్లీకి వెళ్లి వచ్చాకే పార్టీ మారుతాననని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నట్లు తెలిసింది. అంతకుముందే మునుగోడులో తాను ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు తెలియజేశారు. ఆ తరువాతే పార్టీ మారుతానని పేర్కొన్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుంది.. బీజీపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామా వంటి అంశాల ఆధారంగా ఆయన సర్వే చేయనున్నట్లు సమాచారం. తరువాత ఆగస్ట్ రెండో వారంలో ఆయన రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ కనుక ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి చర్యలకు సిద్ధమైతే ఆగస్టు మొదటివారంలోనే రాజీనామా చేసే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. పోటీపై కాంగ్రెస్ కసరత్తు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికలు వస్తే అక్కడి నుంచి ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపైనా ఆలోచన చేస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితే తమకు అవకాశం ఇవ్వాలని మాజీమంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, బీసీ కాన్సెప్ట్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత కోరుతున్నారు. ఈ మేరకు వారు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇదిలా ఉండగానే తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనల నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు జానారెడ్డి కుమారున్ని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని జిల్లా ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
పార్టీలోనే ఉండేలా చూస్తాం: భట్టి విక్రమార్క
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏదైనా మనస్తాపానికి గురై ఉంటే అన్ని విషయాలు మాట్లాడతాం. సాధ్యమైనంత వరకు పార్టీలోనే ఉండేలా చూస్తాం. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన సేవల్ని వాడుకోవాలని మేం అనుకున్నాం. ఆయనకు కాంగ్రెస్ పార్టీ, అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే గౌరవం ఉంది’ అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై కీలక సమావేశం జరిగింది. పార్టీ తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపిన అనంతరం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డితో మూడు గంటలపాటు మాట్లాడానని, ఇప్పటికీ ఆయనకు ఏదైనా ఇబ్బందుంటే మాట్లాడి పార్టీలోనే కొనసాగేలా చేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టి చెప్పారు. సీఎల్పీ నాయకుడిగా తనకు పార్టీ ఎమ్మెల్యేపై నమ్మకం ఉందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడగా, వారికి ఆయన వివరణ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు పార్లమెంట్‌లోనూ, మరోచోట ఇతర పార్టీల వారిని యాథృచ్ఛికంగా కలిసినంత మాత్రాన దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయాల కంటే, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వెల్లడించారు. బండి సంజయ్ ఉన్మాది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ఉన్మాది అని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందనుకోవట్లేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలపై దృష్టిపెట్టి సమయాన్ని వృథా చేసుకోబోదని, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపైనే తమ దృష్టి అని అన్నారు. చదవండి: రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్ -
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్న బండి సంజయ్
-
భట్టీతో భేటీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సొంతపార్టీపై చురకలంటించారు. కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరని విమర్శించారు. చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని అన్నారు. సినిమా డైలాగులకు ఓట్లు రావని స్పష్టం చేశారు. భట్టి తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు. ‘సీఎల్పీ ఇవ్వాలని నేను కూడా అడిగా. నాకు ఇవ్వకుంటే సీఎల్పీ నాయకుడిగా భట్టికి ఇవ్వాలని అధిష్టానానికి చెప్పాను. పీసీసీ అధ్యక్షుడి మార్పు కూడా తొందరగా చేయలేదు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని చెప్పాను. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది నిజం. బీజేపీ బలపడుతోందని నేను పలుమార్లు చెప్పాను. చెప్పిందే నిజమైంది. ఈటలకు బీజేపీ తోడైంది. అందుకే గెలిచారు. నేను కన్ఫ్యూజ్ కాలేదు.. క్లారిటీతో చెప్పా. బీజేపీ, టీఆర్ఎస్ను ఓడిస్తుందని నమ్ముతున్నా. మునుగోడుకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే.. నేను ఒక్కసారి వెళ్లినా ఒక్కటే.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా’ అని ప్రశ్నించారు. మాది కాంగ్రెస్ కుటుంబం తమది కాంగ్రెస్ కుటుంబమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో సమావేశమనంతరం మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ అంటే రాజగోపాల్ రెడ్డికి గౌరవం ఉందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారని తాను అనుకోవడం లేదని అన్నారు. తొందర పడవద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్సేనని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: తెలంగాణలో అప్పులే తప్ప అభివృద్ధి కనిపించడం లేదు: ఉత్తమ్ -
అదే పులి కేసీఆర్‌కు ప్రమాదం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ప్రజలు కోరితే రాజీనామానే కాదు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. చారిత్రక అవసరమైతే తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు. నాలుగు రోజుల నుంచి తనపై వస్తున్న వార్తలు, రాజీనామా వ్యవహారంపై ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే రాజకీయాల గురించి గానీ, రాజీనామా గురించి గానీ చర్చించలేదని, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలుచేసి అవినీతికి పాల్పడుతున్నారనే అంశాలపై మాత్రమే చర్చించినట్టు స్పష్టంచేశారు. దేశంలో సాదు జంతువులాంటి కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, పరోక్షంగా పులిలాంటి బీజేపీని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే పులి రేపో మాపో కేసీఆర్‌ను, అయన పార్టీని చంపుతుందన్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీ మారాల్సి వస్తే విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా తప్పుకుంటానని స్పష్టంచేశారు. కేసీఆర్ ట్రాప్‌లో పడను తాను అమిత్‌షాను కలవగానే కేసీఆర్ భయంతో వణికిపోతున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే, రాజీనామా.. ఉప ఎన్నికలంటూ తన పత్రికలు, టీవీల్లో వార్తలు రాయించుకొని అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ట్రాప్‌లో తాను పడనని, మునుగోడు అభివృద్ధి కోసం హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి గుర్తుచేశారు. తన రాజీనామా వార్తల నేపథ్యంలోనే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని, ఇలా అయినా నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేర్చినందుకు కేసీఆర్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలాగా నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉప ఎన్నికలు రావాలా అని ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రంగులు మార్చుకోవాల్సిన ఖర్మ తనకు లేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన్ను ఎదిరించి ఎమ్మెల్సీగా గెలిచానని, 2018లో మహామహులు ఓడినా తాను గెలిచి వచ్చానంటే తానేంటో నల్లగొండ, భువనగిరి, మునుగోడు ప్రజలకు తెలుసునన్నారు. అవమానాలు ఎదురైనా భరించి ఉంటున్నా... కాంగ్రెస్‌లో అనేక అవమానాలు ఎదురైనా భరించి ఉంటున్నానని, పార్టీ అంటే అమితమైన అభిమానమని, సోనియాగాంధీపై గౌరవం ఉందని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. కానీ, అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లని, జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లని తెచ్చి పదవులు ఇచ్చిందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆవేదనతో గతంలో కొన్నిసార్లు మాట్లాడానని, తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా కేసీఆర్‌ను కొట్టాలంటే అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని చెప్పినట్టు గుర్తుచేశారు. జైలుకు పోయి వచ్చిన వాళ్లతో తాను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరంలేదని, తాను యుద్ధం మొదలుపెడితే విజయమో, వీర మరణమో తప్ప వెనక్కి వచ్చేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు మారుతూ ఉంటారని, పార్లమెంట్లో ఏ పార్టీ నేతలనైనా ఇతర పార్టీల వాళ్లు కలవచ్చని, అదేమీ తప్పుకాదని చెప్పారు. -
‘హ్యాండ్’ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ లోకి వెళ్తానని చాలారోజుల క్రితమే బహిరంగంగా ప్రకటించిన ఆయన ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరిక అంశాన్ని తన అనుయాయులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కాంగ్రెస్‌పై రాజగోపాల్ రెడ్డి పెద్ద పిడుగు వేశారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని... ఏడాదిన్నర క్రితం ఒక రాజగోపాల్‌రెడ్డి బీజేపీ లోకి వెళ్తున్నారని, తానే సీఎం అభ్యర్థిగా ఉంటా నని కార్యకర్తతో మాట్లాడిన ఆడియో రాజకీయంగా సంచలనం రేపింది. అప్పుడే బీజేపీలోకి వెళ్తారని భావించినా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వద్దని వారించినట్టు రాజగోపాల్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే తాజాగా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే బీజేపీయే కరెక్ట్‌అని, కాంగ్రెస్‌లో ఆ శక్తి కనిపించడంలేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలంటే బీజేపీయే సరైన పార్టీ అని భావిస్తున్నట్టు ఆయన తన అనుచరులకు చెప్పినట్టు తెలిసింది. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని, తన నియోజకవర్గ బాగోగుల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని చెప్పినట్టు సమాచారం. అకస్మాత్తుగా యూటర్న్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు పార్టీ అధిష్టానంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌కు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అలా చెప్పిన ఆయన ఇంత అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని బీజేపీలోకి వెళ్లడం వెనుకున్న ఆంతర్యం ఏంటన్న దానిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ మారేందుకు శుక్రవారం మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో విందు భేటీ పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు దాన్ని రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కీలక నేతలంతా రాజగోపాల్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాగా, ఆయన సోదరుడు, ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని, తాను చనిపోయినా.. తన మృతదేహంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని చెప్పిన సంగతి విదితమే. సరైన సమయంలో నిర్ణయం: ‘సాక్షి’తో రాజగోపాల్ పార్టీ మారే విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ను ఓడించే గట్టి పార్టీలో ఉంటా. బీజేపీలో చేరే విషయంపై గతంలోనే చెప్పా. పార్లమెంట్ ఆవరణలో అమిత్‌షాతో భేటీ జరిగింది. ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతోపాటు, రాష్ట్ర రాజకీయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, అప్పులు తదితర అంశాలపై మాట్లాడారు. పార్టీలో చేరే విషయంపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పా. మునుగోడు ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉంటే నేను పదవీ త్యాగానికి సైతం సిద్ధం. బీజేపీలోకి వెళ్తానని మూడేళ్ల కిందటే చెప్పా.. కొత్తగా ప్రచారం ఏముంది? సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా..’ అని వివరించారు. -
నల్లగొండ: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ చిట్‌చాట్
-
తలసాని v/s రాజగోపాల్‌రెడ్డి.. ‘కాంట్రాక్టర్లపైనే ధ్యాస’.. ‘తెల్లారితే పేకాటే’
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆయనో కాంట్రాక్టర్.. ప్రజా సమస్యల గురించి అడగడు. దృష్టంతా కాంట్రాక్టర్ల మీదే..’’ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్య ఇది. ‘‘ఇప్పుడు నేను కాంట్రాక్టర్‌ను కాదు.. ప్రజాజీవితంలో ఉన్న ఎమ్మెల్యేను. పొద్దున లేస్తే పేకాటలో ఉండే శ్రీనివాసయాదవ్ నన్ను అనటమేంటి?’’ – తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రాజగోపాలరెడ్డి కౌంటర్ ఇది. నేతల మధ్య సోమవారం జరిగిన ఈ వాగ్వాదంతో రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ, క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. మొదట అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా టీఆర్ఎస్ సర్కారుపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల గ్రామాలకు కేంద్ర నిధులు విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డికి శ్రీధర్‌బాబు మద్దతు ప్రకటించారు. నన్ను కాంట్రాక్టర్ అంటారా..? టీఆర్ఎస్ సర్కారు లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని.. స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులివ్వక వేధిస్తోం దని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మంత్రి తలసాని.. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ కావటంతో ఆయన దృష్టంతా కాంట్రాక్టర్లపైనే ఉంటుందని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే.. తాను కాంట్రాక్టర్‌నంటూ ఎలా అంటారని మండిపడ్డారు. పొద్దున లేచినప్పటి నుంచి పేకాటలో మునిగే తలసాని తన గురించి మాట్లాడటమేమిటన్నారు. చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు క్షమాపణ చెప్పాల్సిందే.. బలహీనవర్గాల నేత తలసానిపై రాజగోపాల్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరగా.. ఆయన తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయినా అధికారపక్ష సభ్యులు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజగోపాల్.. ‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అని మాత్రమే చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో తలసానికి క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా భట్టికి స్పీకర్ సూచించారు. కానీ భట్టి స్పందిస్తూ.. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరి వ్యాఖ్యలు సరికావని, రెంటినీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కాంగ్రెస్ నేత జుగుప్సాకర మాటలు: కేటీఆర్ సభలో కాంగ్రెస్ సభ్యులు, బయటనేమో వారినేత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ సాధించిన నేతగా ఇటీవల కేసీఆర్ పుట్టినరోజును సంబురంగా జరుపుకోవాలని మేం పిలుపునిస్తే.. కాంగ్రెస్ నాయకుడేమో 3రోజులు సంతాప దినాలు జరుపుకోవాలన్నారు. ఇటీవల చిన్న ఆరో గ్య సమస్యతో సీఎం ఆస్పత్రికి వెళ్తే.. ముందురోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో బలహీనవర్గాలకు చెందిన మంత్రిని పేకాట ఆడుతారంటారా? స్కాంలో కూరుకుపోయిన దౌర్భాగ్యపు పార్టీ వాళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. చదవండి: ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్ -
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ..
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో శనివారం వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ‘జీవన్.. మా గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటి..?’ అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ.. ‘అవును మా బాస్‌ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. బరాబర్‌గా అంటాం’ అని అన్నారు. నేను సీఎం కేసీఆర్‌ను ఏం అనలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్‌కు హెల్త్ బాగోలేదని చెబితే.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నాననిని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. అసలు సీఎం కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని, తనకు పైనుంచి ఆదేశాలు ఉన్నందునే నిన్ను తిట్టాను అని జీవన్ రెడ్డి తెలిపారు. మేము తెలంగాణ తెస్తే మమ్మల్నే తిడుతున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు తమ కుటుంబంపై తమకు గౌరవం ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీని ఎప్పుడూ విమర్శించమని, ఎందుకంటే ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత.. తాము కేవలం రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను తిడతామన్నామని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గట్లే! గెలిస్తే మాకేంటి, ఓడితే మాకేంటి మరోవైపు సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై .జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని, కానీ 5 రాష్ట్రాల న్నారని ధ్వజమెత్తారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే తమకేంటని.. ఓడితే తమకేంటన్నారు. ఆ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే తమకేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ది మామూలు గుండె కాదని, కోట్లాది మంది అభిమానం ప్రజల అభిమానం పొందిన గుండెని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించిన ఉక్కు గుండె అని చెప్పుకొచ్చారు. చదవండి: కరెంట్, మంచి నీళ్లు బంద్ చేస్తాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
తెలంగాణ హుజూరాబాద్ అయితది
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు సరికాదని సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
చల్లారని ‘చౌటుప్పల్ పంచాయితీ’: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి భువనగిరి: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకి సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాన్నిమంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించడం ఏమిటని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : కాగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. పీసీసీ రేసులో కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. టీపీసీసీ ఎవరిని వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే తన సొంత అభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నాని, దీనికి తన అన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన ఆయన ఊహాగానాలకు తెరదించారు. -
జీరో అవర్‌లో హీరోగిరి చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి వేగం ఊపందుకుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత కార్యక్రమాలన్నీ మా ప్రభుత్వం చేసింది. ఆ కృషిని ప్రజలు గుర్తించి అధికారాన్ని కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాం. ఇదంతా గమనించాలి. వాస్తవాలను గుర్తించాలి. జీరో అవర్‌లో అవకాశం దొరికిందని హీరోగిరి చేస్తే కుదరదు’అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వసతులు కల్పించాలని కోరారు. మంత్రి కేటీఆర్ కలగజేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ‘పట్టణ ప్రగతి కింద రూ.138 కోట్లు విడుదల చేశాం. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం. ఆరేళ్లుగా మేము పనిచేయకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయి? అన్ని మున్సిపాలిటీల్లో మా పార్టీ ఎలా అధికారం కైవసం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు.