సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశమంతా మునుగోడు వైపు చూస్తోందన్నారు.
చదవండి: కారు పార్టీలో కోల్డ్‌వార్.. టీఆర్‌ఎస్‌లో ఎవరి దారి వారిదే!
తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయిమెంట్ ఇవ్వకుండా అవమానించారు. అధికార యంత్రాంగం అంతా అస్తవ్యస్తంగా మారింది. ఉప ఎన్నికలు వస్తే అకౌంట్‌లో డబ్బులు వేయడం ఆ తర్వాత మర్చిపోవడం అలవాటుగా మారిందని’’ రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.
‘‘పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి. ఒక వ్యక్తి కోసం వచ్చిన ఉప ఎన్నిక కాదు. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ గురించి మాట్లాడుతోంది. వేల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేలు ఊరూరు తిరుగుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా ధర్మం వైపు ఉండాలి. భవిష్యత్తు తరాల బాగు కోసం వచ్చిన ఉప ఎన్నిక తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల నుంచి గాడిన పడాలంటే బీజేపీకి ఓటేయాలి.
రెండు నెలలుగా అమ్ముడు పోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రుజువు చేయకపోతే రాజీనామా చేయండి. తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను కోర్టుకు ఈడుస్తా. ఒక నియంతకు బుద్ధి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. యాదాద్రి గర్భగుడిలో తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తా మీరు సిద్ధమా’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment