Munugode Bypoll 2022
-
ఎక్కడో తేడా కొట్టింది?.. తెలంగాణలో బీజేపీ స్పీడ్ ఎందుకు తగ్గింది?
తెలంగాణలో కమలం పార్టీ వేగం తగ్గిందా? మునుగోడు తర్వాత నేతల్లో నిస్తేజం ఆవిరించిందా? రాష్ట్ర పార్టీ చీఫ్ పాదయాత్రపైనే ఫోకస్ పెట్టారా? సీనియర్ల సేవల్ని ఉపయోగించుకోవడంలో కాషాయసేన వెనుకబడుతోందా? బీజేపీ స్పీడ్ తగ్గడానికి కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నాయకులు చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారికి ఆమేరకు దిశా నిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఇతర పార్టీలను ఆకర్షించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఆకర్షించి మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికయ్యేలా కమలనాథులు కృషి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ని బీజేపీలోకి ఆకర్షించినప్పటికీ.. ఉపఎన్నికల పోరాటంలో విజయం దక్కలేదు. కాని కమలానికి పునాదులు లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టేసి..టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకున్నారు కమలనాథులు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారే గాని..వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునుగోడు వ్యూహం ఎదురు తన్నిందా? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వానికి కంగారు పుట్టించారు కూడా. కాని ఫలితం దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డిని విజయం వరించలేదు. దీంతో నాయకుల్లో స్పీడ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తిగా తన ప్రజా సంగ్రామ యాత్ర మీదే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఏ మాత్రం అవకాశం దొరికినా తన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినపుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా నేతలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బండి సంజయ్ మాత్రమే ఫోకస్ కావాలనే ఉద్దేశంతో మిగతా నేతలను పాదయాత్రకు సంఘీభావంగా వెళ్ళాలని సూచించలేదా? లేక సంజయ్ పాదయాత్రను మిగతా నాయకులు లైట్ తీసుకున్నారా ? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెయిడ్స్ వర్సెస్ రెయిడ్స్ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు... ఇంకోవైపు రాష్ట్ర మంత్రులపై ఈడీ విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే..తెలంగాణలో గులాబీ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో కమలం పార్టీ నేతలు వెనకబడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా.. ఆయనకు సపోర్టింగ్ గా ఇతర నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ వాయిస్ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్స్ స్ట్రాటజీ ఏంటీ? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి కోసం రాష్ట్రంలోని పెద్దా, చిన్నా నాయకులంతా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఉప ఎన్నిక హడావుడి ముగియగానే వీరంతా సైలెంట్ అయిపోయారు. బండి సంజయ్ తనయాత్రలో మునిగిపోవడం..ఇతర నేతల మధ్య పనివిభజన లేకపోవడంతో ఎవరికీ పని లేకుండా పోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం మినహా నాయకులకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఒకప్పుడు బీజేపీ నాయకులు చాలా కొద్దిమందే ఉండేవారు. ఇతర పార్టీలనుంచి వచ్చినవారితో ఇప్పుడు కమలం పార్టీ నిండుగా కనిపిస్తోంది. కాని సీనియర్ల సేవలను సరిగా వినియోగించుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సీనియర్లను ఖాళీగా ఉంచడం వల్ల పార్టీకి నష్టం కలుగచేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పదే పదే క్లీన్‌బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?
హస్తం కిం కర్తవ్యం.? ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేస్తారు.. ఇవి కాంగ్రెస్ రివ్యూల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ లేకుంటే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ నేతలు మధన పడుతున్నారట. ప్రజా సమస్యల పై ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చారట హస్తం నేతలు. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఉపఎన్నికల్లో క్లీన్ బౌల్డ్ వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ.. అవి ప్రత్యేక ఎన్నికలు అని సర్దిచెప్పుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ఎలాగైనా గెలవాలి అని కసరత్తు చేసినా డిపాజిట్ కోల్పోయి మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయింది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలపై అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. పేరుకే రివ్యూ.. జరుగుతోంది వన్ సైడ్ డ్రైవింగే పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. గతం గతః ఇప్పటి నుండి ఏం చేయాలి అనే దానిపై తాజాగా మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారట. టీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందని, కేసీఆర్ ఇచ్చిన పోడు భూములు, రుణమాఫీ, అసైన్డ్ భూములు ఇలా తదితర అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్దమవుతోంది. ఈ నెల 24న ఎమ్మార్వో కార్యాలయాల ముందు, 30న నియోజకవర్గాల్లో, డిసెంబర్ 5న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పీసీసీ ఛీఫ్ చీఫ్ రేవంత్ ప్రకటించారు. బాబు.. బాగా బిజీ పార్టీ కార్యాచరణ కోసం ఇటీవలే జూమ్ మీటింగ్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది గంటలు గడవకముందే మరోసారి గాంధీ భవన్లో అనుబంధ సంఘాలతో మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగులో పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులపై రేవంత్ ఫైర్ అయ్యారట. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, దీన్ని అధిగమించాలంటే అందరం కలిసి పనిచేయాలని రేవంత్ దిశానిర్దేశం చేశారట. ఇప్పటివరకు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చేపట్టిన కార్యక్రమాల వివరాలేంటి, ఇకపై చేయబోయే కార్యక్రమాలేంటో తనకు పది రోజుల్లోగా తెలియచేయాలని రేవంత్ అడిగినట్లు సమాచారం. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, అందరం కలిసి బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలపై పోరాడాలని చెప్పాడట. చేప.. చేప.. ఎందుకు గెలవలేదు.? ఇంత చేస్తే మునుగోడు ఓటమిపై మాత్రం పూర్తి సమీక్ష చేయలేదంటున్నారు. స్వయానా పీసీసీ చీఫే ఎన్నికలకు ముందుకు కాడి జారేశాడని, సిట్టింగ్ స్థానాన్ని సరైన వ్యూహం లేక పోగోట్టుకున్నారని గొల్లుమంటున్నారు. రేవంత్ తీరు వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొందరంటే.. పార్టీ నేతలే ఇక్కడికి తీసుకొచ్చారని అధిష్టానానికి రేవంత్ చెబుతున్నారట. -
Munugode Bypoll Result 2022: అధికార దుర్వినియోగంతో దక్కిన విజయం
తెలంగాణ చరిత్రలోనే మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 12 మంది ఎంపీలు, మునుగోడులో తిష్ఠ వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ప్రతి రెండు గ్రామాలకూ ఒక ఎమ్మెల్యేని మోహరించారు. మండలానికి ముగ్గురు మంత్రులను నియమించి భారతీయ జనతా పార్టీ నాయకులను, గ్రామస్థాయిలో ఉండే యువతను టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగి పోతాయనీ, పింఛన్ దారులకు పింఛను రాదనీ, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇన్ని కుయుక్తులతో సాధించినది విజయమేనా? ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 97,006 ఓట్లు తెచ్చుకొని 10,309 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,693 ఓట్లు పొంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణికించారు. కాంగ్రెస్ 23,906 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ తమకు పోటీనే కాదనీ, కాంగ్రెస్సే ప్రత్యర్థి అని ఎన్నోసార్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు; ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ మును గోడులో భారతీయ జనతా పార్టీకి మంచి ప్రజాదరణ కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోలేక ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు’ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయి కంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని సాధించిన విజయమే తప్ప కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి కానీ, ఆయన పరిపాలనా విధానం చూసి గానీ వచ్చింది కాదు. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని భావించి... విజయం కోసం తన అంగ బలాన్నీ, అధికార బలాన్నీ ఉపయోగించారు. తాను చీదరించి మనుగడ లేకుండా చేసిన కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టు కున్నారు. అందుకే కనీస మెజారిటీ అన్నా టీఆర్ఎస్కు దక్కింది. ఈ ఉప ఎన్నిక... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఓటమి భయంతో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రెండు గ్రామాలను అప్పగించి ఆయా గ్రామాలలో మెజార్టీ చూపిం చకపోతే వచ్చే ఎలక్షన్లలో వారికి సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలిసింది. దీన్నిబట్టి కేసీఆర్ బీజేపీని చూసి ఎంతగా భయపడ్డారో తెలుస్తోంది. ఇంతజేస్తే... మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాలలో బీజేపీకి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఆ విధంగా మంత్రులకు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదన్నమాట. కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇన్ఛార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఉండి... ప్రతి ఒక్క ఓటరుకూ రూ. 4,000 ఇచ్చినా టీఆర్ఎస్కు బీజేపీ కన్నా 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి వరుసగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఆరెగూడెం, లింగోజిగూడెం గ్రామాలలో టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నిజంగా మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో; చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ, అనుకున్నంత మెజారిటీ సాధించలేక పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే భావించిన టీఆర్ఎస్ చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలలో 30 వేల పైన ఓట్లు కొత్తగా నమోదు చేయించడం జరిగింది. ఇలా హడావిడిగా ఇన్ని కొత్త ఓట్లు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అవుతుంది అని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రెండు మూడు వేల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలోని నివాసితులవి కాగా, మిగతా ఓట్లన్నీ టీఆర్ఎస్ నాయకులు... మునుగోడు పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తల చేత ఓటు కోసం అప్లై చేయించినవే అని చెప్పవచ్చు. ఇదే రకమైన విధానాన్ని కేసీఆర్ పట్టభద్రులకు జరిగిన రెండు శాసనమండలి ఎలక్షన్లలో కూడా ఉపయోగించారు. అలాగే ఒకటవ తారీఖు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకూ డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి, మద్యాన్ని ఏరులై పారించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభుత్వానికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తనకు తాను జాతీయ నేతగా ప్రకటించుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ఫామ్‌హౌస్ డ్రామాకు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు టీఆర్ఎస్ తెరలేపడం జరిగింది. అయినప్పటికీ మునుగోడులోని ఓటర్లు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాటకాన్ని నమ్మలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఫామ్ హౌస్ డ్రామా రక్తి కట్టలేదు. ఈ మొత్తం ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంబంధించిన ఒక రూపాయి కూడా పట్టుబడకపోవడం ప్రభుత్వ వ్యవస్థల దుర్వి నియోగానికీ, అధికార యంత్రాంగం టీఆర్ఎస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసింది అనడానికీ నిదర్శనం. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చిన అనేక సర్వేలు చూసిన తర్వాత అయోమయానికి గురవు తున్న టీఆర్ఎస్ నేతలకు... ఏమి చేయాలో పాలుపోక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం దేనికి అద్దం పడుతుంది? ఈ పనులేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డు కోలేవు. ఇటీవలి కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. అధికారం దిశగా అడుగులు వేస్తోంది. - ఎన్. రామచందర్ రావు మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
మునుగోడు ఓటమిపై సమగ్ర అధ్యయనం
ఎర్రుపాలెం: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటమిపై సమగ్ర విశ్లేషణతో అధ్యయనం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని విమర్శించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అద్భుతంగా సా గిందని, అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమయ్యారని తెలిపారు. అందరి చేతుల్లో ఉండాల్సిన దేశ సంపదను కేవలం అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారులకు మోదీ పంపిణీ చేస్తున్నారని భట్టి ఆరోపించారు. -
ఫలితమొచ్చి వారం గడుస్తున్నా.. ఒడవని మునుగోడు ముచ్చట!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచిన ‘మునుగోడు’ వేడి ఇంకా చల్లారలేదు. ఉప ఎన్నిక ఫలితం వచ్చి వారం గడుస్తున్నా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం ఇచ్చిన సంకేతాలేంటి? త్రిముఖ పోటీ జరిగితే 2023 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? అనే ఎన్నో ప్రశ్నలపై చర్చలు జరుగుతున్నాయి. గేరు మార్చిన ‘కారు’ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ దోస్తీ గురించే రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాజకీయ రణరంగంలో తిరుగులేని శక్తిగా నిలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు పొత్తు రాజకీయాలకు మునుగోడు నుంచే తొలి అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలవాలన్న టీఆర్ఎస్ వ్యూహం సత్ఫలితాన్నే ఇచ్చినా.. ‘కారు’కు అదనపు బలం అవసరం పడుతోందనే చర్చకూ తావిచ్చిందని చర్చ జరుగుతోంది. కోరి తెచ్చుకున్నా చేదు తీర్పు! మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మునుగోడు వేదికగా గోల్ కొట్టి ‘రాజ’సంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక ఫలితం చేదు తీర్పు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. కోలుకునేదెప్పుడు? సిట్టింగ్ స్థానంలో పోటీచేసి.. మూడోస్థానానికి పడిపోయి, డిపాజిట్‌ను గల్లంతు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఉప ఎన్నిక సందిగ్ధంలోకి నెట్టింది. తమకు 23 వేలకు పైగా ఓట్లు రావడం, పార్టీని వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడంతో సంతోషించాలో.. సిట్టింగ్ నుంచి మూడోస్థానానికి పడిపోవడంపై బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ఇంకెప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చిన్నాచితకా పార్టీలు.. ఎప్పటిలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతాయని మునుగోడు ఉప ఎన్నిక తేల్చిందనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ఉప ఎన్నికతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేయాలి: కేఏ పాల్
నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు వేసిన సీల్ మారిందని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్‌కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్ చెప్పారు. -
సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కిలారి పాల్ (కేఏ పాల్) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్‌ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్ సెంటర్ వద్ద సైతం పాల్ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..) ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: కేఏ పాల్ నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్ఎస్ కుట్ర ఎంటో అర్థమవుతోందని, అధికారులంతా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. -
సర్వశక్తులు ఒడ్డినా దక్కని గెలుపు (ఫొటోలు)
-
మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీకి చెంపపెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘డబ్బు, మద్యం, అధికార మదంతో జనం గొంతు నొక్కి, ఓటర్లను కొనాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు మునుగోడు ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్తూ బీజేపీకి చెంపదెబ్బ రుచి చూపించారు..’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ పెద్దలకు మునుగోడు ఉప ఎన్నిక గట్టి ఎదురుదెబ్బఅని పేర్కొన్నారు. వారు ఇంతా చేసి టీఆర్ఎస్ మెజారిటీని తగ్గించగలిగారే తప్ప మునుగోడు విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని.. తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలు టీఆర్ఎస్కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారని కేటీఆర్ అన్నారు. విచ్చలవిడి ధన ప్రవాహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణలోనూ క్రూర రాజకీయ క్రీడకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం తొలిసారిగా ఢిల్లీ నుంచి రూ.వందల కోట్లు తరలించిందని.. డబ్బు, మద్యం, అధికార మదంతో ఓటర్లను కొనాలని అన్నిస్థాయిల్లో ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు కోటి రూపాయలతో దొరికాడు. ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో పట్టుబడ్డాడు. మాజీ ఎంపీ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే దొరికిపోయిన దొంగల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదు. వివేక్ గతంలో ఈటల రాజేందర్‌కు, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి రూ.75 కోట్లను తన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? రూ.75కోట్లు అభ్యర్థి పార్టీ మారగానే ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? రాజగోపాల్‌రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్‌కు రూ.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్‌ను అడ్డం పెట్టుకున్నారు. ఎందుకోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తాము ఫిర్యాదు చేస్తే.. బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షపాత్ర వహించేలా చేశారని ఆరోపించారు. వామపక్షాల నేతలకు కృతజ్ఞతలు మునుగోడులో టీఆర్ఎస్ గెలుపునకు తోడ్పడిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి దోహదపడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు చెప్పారు. నాటకాన్ని నడిపింది మోదీ, అమిత్‌షా ప్రధాని మోదీ, అమిత్ షాలు అహంకారం, డబ్బుతో కళ్లునెత్తికెక్కి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి బలవంతపు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దారని కేటీఆర్ విమర్శించారు. ‘ఉప ఎన్నికను రుద్దిన వారిపై మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనకుండి నాటకం నడిపింది అమిత్ షా, మోదీ అనే విషయం ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఉపఎన్నికలు జరిగిన నారాయణ్‌ఖేడ్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాకలలో కనిపించని.. ధన ప్రవాహం హుజూరాబాద్, మునుగోడులలో ఎందుకు వచ్చిందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. డబ్బున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికల్లోకి వచ్చాకే కలుషితం అయ్యాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనానికి ఈ ఎన్నికలు పరాకాష్ట అని.. 15 కంపెనీల సీఆర్పీఎఫ్, 40 ఐటీ టీమ్‌లను దించి నియోజకవర్గం మీదికి దండయాత్రకు వచ్చారని విమర్శించారు. అయినా గతంకంటే టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం 34.2 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానిని ప్రచారానికి తీసుకొచ్చారని.. తమ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రచారానికి వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు. చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
టీఆర్ఎస్ గెలుపు పోలీసులు, ఈసీదే..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివారం మునుగోడు ఫలితం వెలువడ్డాక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు డాక్టర్ మనోహర్‌రెడ్డి, ఎస్.కుమార్, టి.వీరేందర్‌గౌడ్, జె.సంగప్ప, వెంకటరమణలతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ అధికారులు టీఆర్ఎస్ను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులే దగ్గరుండి డబ్బు పంచారు. రూ. వందల కోట్లు పంచిన టీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో, ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌కు బీజేపీకంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరఫున సైతం టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచారు. అయినా ప్రజలు టీఆర్ఎస్కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆశీర్వదించారు’ అని సంజయ్ పేర్కొన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయినప్పడు కుంగిపోమని, గెలిచినప్పుడు పొంగిపోమని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి యుద్ధంలో హీరోలా పోరాడారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. ‘టీఆర్ఎస్ నేతల పిచ్చి కూతలతో బీజేపీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంతో, కసితో ప్రజలపక్షాన పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం. మునుగోడు ఫలితంపై విశ్లేషించుకుంటాం’ అని బండి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఫలితం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ, సీపీఎంతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్‌తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా... మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా... ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్ఎస్కు 10 వేలకు మించి మెజారిటీ రాలేదు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించింది’ అని బండి సంజయ్ చెప్పారు. ఆ 12 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే కాంగ్రెస్ నుంచి అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సంజయ్ సవాల్ విసిరారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడులోని సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని... ఆ గడువులోగా హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్‌రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ చెప్పారు. సీఎం కేసీఆర్ మనీ, మద్యాన్ని ఏరులై పారించినా, ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం పర్యటించినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. -
ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 'కౌంటింగ్‌కు కేంద్రం నుంచి అబ్జర్వర్ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్‌రాజ్) -
‘కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు.. మునుగోడులో ఏం జరుగుతోంది?’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్ బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్‌రావు ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. -
Munugode Results: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు వార్ కొనసాగుతోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ తీరు అనుమానాస్పదం.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్కు లీడ్ వస్తే తప్ప ఫలితాలు చెప్పరా? అంటూ మండిపడ్డారు. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సీఈవో విఫలం రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. సీఈవో తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రచార సమయంలో చూపిన పక్షపాతమే ఫలితాల్లో చూపిస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
Munugode Election Results: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్!
సాక్షి, నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. నవంబర్ 3న ఎన్నిక జరగగా.. నవంబర్ 6న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందునుంచీ అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఆయా పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కు మారుతూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మూడు రౌండ్లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సొంతూరి ప్రజలే షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సొంత మండలం చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ పుంజుకోవడం గమనించదగ్గ విషయం. (చదవండి: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
Munugode Round Wise Results: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు
సాక్షి నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు, మూడు రౌండ్లు మినహా ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్ తర్వాత ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్.. 14 రౌండ్లు ముగిసే సరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. 21 టేబుళ్ల ఏర్పాటు నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. 3-4 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. 93.41 శాతం పోలింగ్ నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ సాగింది -
Munugode Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయం
Time: 5:10PM ►మునుగోడులో టీఆర్ఎస్ విజయం ►ఏడు మండలాల్లో టీఆర్ఎస్కు ఆధిక్యం ►14 రౌండ్లు ముగిసేసరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్ ► 14వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం Time: 04:35PM ► విజయం దిశగా టీఆర్ఎస్ ► 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్9,039 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ► 13వ రౌండ్లో టీఆర్ఎస్ 1,002 ఓట్ల ఆధిక్యం ► కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు. Time: 03:53 PM 7,836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ 12వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 7,836 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,042 ఓట్ల ఆధిక్యం దక్కింది. Time: 03:45 PM కేటీఆర్ మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం. Time: 03:14 PM తెలంగాణ భవన్లో సంబురాలు షురూ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రౌండ్లు ముగిసే కొద్ది భారీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Time: 03:09 PM 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. Time: 02:44 PM 10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 10వ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది. 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. Time: 02:16 PM 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 3,952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 7,515 ఓట్లు రాగా.. బీజేపీకి 6,665 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,300 ఓట్లు, ఇతరులకు 1,100 ఓట్లు వచ్చాయి. Time: 01:58 PM చండూరుపైనే బీజేపీ ఆశలు 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరుగనుంది. Time: 01:54 PM 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 3,104 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. 8 రౌండ్లో టీఆర్ఎస్ 536 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. Time: 01:45 PM చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇప్పటివరకు టీఆర్ఎస్కు 45,710, బీజేపీకి 43,155 ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పటివరకు 1,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరగనుంది. Time: 01:27 PM ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 386 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. ఏడో రౌండ్ టీఆర్ఎస్- 7,189 బీజేపీ-6,803 Time: 12:59 PM ఏడో రౌండ్ ఓట్లు లెక్కింపు మునుగోడులో హైవోల్టేజ్ హీట్ కొనసాగుతోంది. ఏడో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఏడో రౌండ్లో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Time: 12:34 PM ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ఆరో రౌండ్ టీఆర్ఎస్-6,016 బీజేపీ- 5,378 Time: 12:05 PM పారదర్శకంగా కౌంటింగ్: సీఈవో ఆరో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. ఆలస్యానికి కారణాలు కూడా వివరించాలని చెప్పానన్నారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా అక్కడ ఉన్నారన్నారు. ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యం అవుతుందని సీఈవో తెలిపారు. Time: 11:47 AM ఐదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ టీఆర్ఎస్- 5,961 బీజేపీ-5,245 Time: 11:18 AM ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. Time: 11:13 AM కాసేపట్లో ఐదో రౌండ్ ఫలితం ప్రతి రౌండ్‌కు ఉత్కంఠ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. ఐదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. Time: 10:39 AM చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు-55,678 టీఆర్ఎస్- 21,209 బీజేపీ-21,174 కాంగ్రెస్-5,169 Time: 10:34 AM ఫలితం ఎలానైనా ఉండొచ్చు: రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. Time: 10:31 AM మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. నాలుగో రౌండ్ టీఆర్ఎస్-4,854 బీజేపీ-4,555 కాంగ్రెస్-1817 Time: 10:19 AM టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం Time: 10:09 AM మునుగోడులో బీజేపీ ఆధిక్యం మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 10:05 AM ఐదో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:57 AM మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. మూడో రౌండ్ టీఆర్ఎస్-7,010 బీజేపీ-7,426 కాంగ్రెస్-1,532 Time: 09:54 AM మొదటి రౌండ్లో కేఏ పాల్‌కు 34 ఓట్లు కేఏ పాల్‌కు తొలిరౌండ్లో 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. Time: 09:39 AM నాలుగో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. Time: 09:39 AM మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. 1000 ఓట్లు పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. Time: 09:33 AM మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మూడో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్- 14,211 బీజేపీ-13,648 కాంగ్రెస్-2,100 Time: 09:25 AM ఆధిక్యంలో టీఆర్ఎస్ రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. Time: 09:19 AM చౌటుప్పల్‌లో బీజేపీ ఆధిక్యం.. తొలిరౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్ అర్బన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 09:12 AM రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:01 AM చౌటుప్పల్ మండలం జైకేసారంలో టీఆర్ఎస్ లీడ్‌లో ఉంది. తొలిరౌండ్(14,553) టీఆర్ఎస్- 6,478 బీజేపీ- 5,126 కాంగ్రెస్- 2,100 Time: 08:55 AM 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఈవీఎం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. Time: 08:45 AM పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్ఎస్కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. Time: 08:30 AM టీఆర్ఎస్ ముందంజ.. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు Time: 08:15 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:07 AM కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు.. మునుగోడు కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:01 AM కౌంటింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. Time: 7:15 AM కాసేపట్లో కౌంటింగ్.. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ♦1,2,3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కింపు ♦4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు ♦7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు ♦9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు ♦11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల›లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. 2 –3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్ఎస్ విశ్వసిస్తుండగా ప్రజలకు తాను సేవ చేశానని, అలాగే యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. -
‘కమల్ హాసన్’ గర్వపడేలా నటించాడు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున ఓ బీజేపీ నాయకుడు పోలింగ్ బూత్ వద్ద వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నాయకుడు చేసిన యాక్టింగ్‌పై వైరల్ అయిన వీడియోపై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘కమల్‌హాసన్’గర్వపడేలా నటించాడు అంటూ కేటీఆర్ చమత్కరించారు. క్రిశాంక్ తన ట్వీట్లో ‘బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని సూచించినందుకు..వేరే వ్యక్తికి ఫోన్‌ను విసిరేసి, పోలింగ్ కేంద్రంలోకి పరుగెత్తాడు. తనకు తానే నేలపై పడుకుని, పోలీసులు కొట్టారని ఏడ్చాడు. మోదీ యాక్టింగ్ స్కూల్’అని క్రిశాంక్ ట్వీట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 😂 Kamal Hasan would be proud https://t.co/AoOKtSGW40 — KTR (@KTRTRS) November 4, 2022 చదవండి: జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం -
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్‌లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఒక్క మునుగోడులోనే 300 కోట్ల మద్యం అమ్మకాలు
-
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఎవరిది ..?
-
మునుగోడు ఫలితాలపై తేల్చేసిన కేఏ పాల్!
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో 50వేల మెజారిటీతో గెలువబోతున్నానని ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోకవర్గంలో యువత, మహిళలు ఇతర ప్రజలు నాపై ప్రేమ చూపించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో సందర్శిస్తున్న సమయంలో తనపై మూడు సార్లు దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్ఓ ఇతర అధికారులు రక్షించారని తెలిపారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమను మునుగోడు ప్రజలు ఇచ్చారని, వారికి జీవితాంతం కృతజ్ఞడునై ఉంటానని చెప్పారు. మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని పాల్ ఆరోపించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రచారం సందర్భంగా పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎస్పీ కూడా అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం గన్మెన్లను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గద్దర్‌కు గన్మెన్లు ఇచ్చారు. నాకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో అలాంటి పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు. ఎమ్మెల్యేలు కొనుగోలు అంతా డ్రామా... ఎమ్మెల్యేల కొనుగోలు అంతా డ్రామా అని ఆయన ఆరోపించారు. సీఎం అయితే తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తానన్నారు. అమిత్‌షా నన్ను పార్టీలో చేరమన్నాడు. మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారన్నారు. నేను కాదని చెప్పానని , పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని చెప్పాడన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు టీఆర్ఎస్ ఒప్పుకుందని , బీజేపీ ఇండరైక్టుగా మద్దతు ఇస్తే కాంగ్రెస్ నేరుగా మద్దతిచ్చిందని కాబట్టి గెలిచేది ఇక నేనే అని ఆయన చెప్పుకొచ్చారు. -
పాత రికార్డులు బద్దలు.. మునుగోడులో 93.41% పోలింగ్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ముంబై నుంచి కూడా.. ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాయి. దీంతో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వడం పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. 686 మంది పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్ నమోదైంది. దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా నారాయణపురం మండలంలో 93.76 శాతం పోలింగ్ జరిగింది. చౌటుప్పల్ మండలం నేలపట్లలోని 4వ పోలింగ్ స్టేషన్లో, సంస్థాన్ నారాయణపురం మండలం ఐదుదొనెల తండాలో 72వ పోలింగ్ కేంద్రంలో, గుజ్జ, నారాయణపురంలో ఒక పోలింగ్ స్టేషన్, మునుగోడు మండలం గంగోరిగూడెం, కొండూరు పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలు, పురుషుల ఓట్లు సమాన సంఖ్యలో పోలయ్యాయి. 105 పోలింగ్ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారు. చదవండి: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
Munugode Bypoll: 15 రౌండ్లలో కౌంటింగ్.. మధ్యాహ్నానికి ఫలితం!
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్జాలబావి గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 75 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు అందించేందుకు, ఇతర అవసరాలకు గాను 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పూర్తి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చే అవకాశం ఉంది. 23 టేబుళ్ల ఏర్పాటు..: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌ను నియమించారు. ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 9 గంటల కల్లా తొలిరౌండ్ ఫలితం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 లెక్కించిన తర్వాత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తీసుకొస్తారు. 21 టేబుళ్లమీద వాటిని లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలోపు రానుంది. గంటలో 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉండడంతో.. ఒంటి గంట వరకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తేలిపోనుంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, రాహుల్‌శర్మ, రిటర్నింగ్ అధికారి రోహిత్‌సింగ్ పరిశీలించారు. చదవండి:ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
Munugode ByElection: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. యువత, మహిళలే ఎక్కువ.. గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలస్యం అందుకే.. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్‌లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రూ.10 వేల నుంచి లక్షల్లో.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజామున స్ట్రాంగ్ రూమ్‌లకు.. పోలింగ్ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్! -
బిగ్ క్వశ్చన్ : పోలింగ్ ముగిసినా తగ్గని పొలిటికల్ హీట్
-
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన మునుగోడు
-
‘మునుగోడు ఫలితం రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తుందని, తమ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. డబ్బు, మద్యం ఏరులుగా పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమే నన్నారు. తమ విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ల ‘ఖేల్‌ఖతం’కానుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారని ధ్వజ మెత్తారు. పోలింగ్ ప్రకియను సక్రమంగా జరపకుండా ఈసీ కూడా తప్పుచేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రధానాధికారి పూర్తిగా కేసీఆర్ జేబు మని షిగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాచకొండ కమిషనర్, నల్లగొండ జిల్లా ఎస్పీ టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ కొనసాగించి అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించినందుకు పోలీస్ కమిషనర్ తోపాటు జిల్లా ఎస్పీ కేసీఆర్‌కు గులాంగిరీ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలపై తాము పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డబ్బు పంపిణీ చేసిన వారిలో 42 మందే దొరికారని అధికారులు పేర్కొనడం విడ్డూ రంగా ఉందన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసు ల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తామన్నారు. పోలింగ్‌పై టీఆర్ఎస్ ఫేక్ సర్వేలను ప్రచారంలోకి తెచ్చిందని మండిపడ్డారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? వెయ్యికోట్లు ఖర్చుచేశారు.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదోనన్న భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా మునుగోడులో రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేశారని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నెల రోజులుగా మునుగోడు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర రూపాల్లో ప్రలోభాలకు గురిచేసిందన్నారు. టీఆర్ఎస్ నేతలు అంబులెన్స్‌లు, పోలీసు వాహ నాల్లో పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తే పోలీసులు సహకరించారన్నారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీనే గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలమైన పోలీసు అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలు, కార్యకర్తలను కొట్టించారని, చండూరులో విచక్షణారహితంగా కొట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చిండు ‘ఒక గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఓటుకు రూ.50 వేలిచ్చిండు. ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్థమవుతోంది. పోలింగ్ జరుగు తున్న టైంలోనే ట్విట్టర్ టిల్లు.. రంగంతండా, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్ని కల నిబంధనలను ఉల్లంఘించారు’ అని సంజయ్ మండిపడ్డారు. -
Munugode Bypoll: పోటెత్తిన ఓటర్లు.. 92 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలుత మందకొడిగా సాగింది. 50 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు బూత్‌లకు రావడం పెరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 3 గంటల వరకు 59.92 శాతం మంది ఓట్లు వేశారు. 50 మంది సర్వీసు ఓటర్లు మినహాయిస్తే మిగతా 2,41,805 మందికి గాను 1,44,878 మంది మధ్యాహ్నం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం సహా చాలా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల మొరాయింపు చండూరు మండలం కొండాపురం గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలలో సాంకేతి లోపం ఏర్పడి దాదాపు గంట పాటు మొరాయించాయి. వాటిని మార్చేసి పోలింగ్ కొనసాగించారు. నాంపల్లి మండల కేంద్రంలో, సంస్థాన్‌నారాయణపురం మండలం కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అల్లందేవి చెరువు గ్రామంలో ఈవీఎంలో ఎర్రర్ చూపించడంతో 20 నిమిషాల వరకు పోలింగ్ ఆగిపోయింది. కేటీఆర్ హామీతో పోలింగ్‌కు హాజరు! గట్టుప్పల్ మండలం రంగతండా, హజినతండా గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలుగా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొనమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 3 గంటల ప్రాంతంలో తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు..కొందరు గ్రామస్తులను మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. సమస్యలను పరిష్కరిస్తానని, తానే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు వెళ్లిపోయేంతవరకు పోలింగ్‌ను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో వరంగల్‌కు చెందిన వారు స్థానికంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రూ.14.5 లక్షలు స్వాధీనం నాంపల్లి మండలం మల్పరాజు గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీకి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు, ఇతర సిబ్బంది వారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరు పరిధిలో రూ.1.60 లక్షలు, గట్టుప్పల్ మండలంలో రూ. 2.90 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
మునుగోడు పోలింగ్ జాతర.. పోటెత్తిన ఓటర్ మహాశయులు (ఫొటోలు)
-
మునుగోడు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో ఆ పార్టీదే హవా..!
-
మునుగోడు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు.. సీన్ రివర్స్ ఆ పార్టీదే హవా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 48-51 శాతం బీజేపీ- 31-35 శాతం కాంగ్రెస్- 13-15 శాతం బీఎస్పీ- 5-7 శాతం ఇతరులు- 2-5 శాతం. ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 41-42 శాతం బీజేపీ- 35-36 శాతం కాంగ్రెస్- 16.5-17.5 శాతం బీఎస్పీ- 4-5 శాతం ఇతరులు- 1.5-2 శాతం. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 42.11 శాతం బీజేపీ- 35.17 శాతం కాంగ్రెస్- 14.07 శాతం బీఎస్పీ- 2.95 శాతం ఇతరులు- 5.70 శాతం. -
ఈనెల 6న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
-
మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది : బండి సంజయ్
-
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఫేక్ ప్రచారాల గోల..
-
Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్ ప్రచారాల గోల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ఫేక్ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. స్రవంతిపై బోగస్ ప్రచారం: కాంగ్రెస్ గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్, మధుసూదన్‌రెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం లేదు: కర్నె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు పెట్టిన కేఏ పాల్.. ఎందుకంటే?
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నికల వేళ మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ కనిపించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు. మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళ్లారు. రైతు వేషంతో దర్శనమిచ్చారు. సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన మాటలు, చేష్టలతో రైతులను నవ్వించారు. పోలింగ్ రోజున కూడా తన దైన శైలిలో పంచ్‌లు వేస్తూ, పరుగులు పెడుతూ నవ్వించారు. -
కేసీఆర్‌ను కలిసినట్లు స్రవంతి ఫేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు పోలింగ్ వేళ ప్రత్యర్థులపై పార్టీలు ఫేక్ ప్రచారానికి తెరలేపాయి. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కేసీఆర్‌ను కలిశారంటూ నకిలీ వీడియో ప్రచారం అయ్యింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం మునుగోడు ఉపఎన్నికల్లో తోడుదొంగలు, మాయా మారీచులు, తెరాస బీజేపీ కలిసి విడుదల చేసిన ఫేక్ న్యూస్ పై విరుచుకు పడ్డ పాల్వాయి స్రవంతి గారు @PalvaiINC ఫేక్ న్యూస్ చేసి విడుదల చేసిన వారి పై లీగల్ యాక్షణ్! సిగ్గు విడిచిన కేసీఆర్, బీజేపీలు! గెలవలేక దొంగ నాటకలు! pic.twitter.com/Xpo2Rz01Jk — Telangana Congress (@INCTelangana) November 3, 2022 -
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
Munugode Bypoll 2022 : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు (ఫొటోలు)
-
మునుగోడుకు బయల్దేరిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అడ్డుకున్నపోలీసులు
-
Munugode Bypoll 2022: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్
90శాతానికిపైగా.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 92 శాతం ఓటింగ్ నమోదైంది. Time: 6: 01PM • మునుగోడులో పోలింగ్ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. Time: 5:26PM సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ Time: 4:00PM నల్లగొండ జిల్లా కొరిటికల్‌లో ఉద్రిక్తత టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ ఆరోపణ పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం, లాఠీచార్జ్ Time: 3:20PM మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ Time: 01:20 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12:05 PM ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు: రాజగోపాల్‌రెడ్డి తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారన్నారు. Time: 11:45 AM ఈసీకి ఫిర్యాదు చేశా.. పాల్వాయి స్రవంతి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. Time: 11:19 AM ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడులో జోరుగా పోలింగ్ సాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 10:32 AM పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చండూరు పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్ సెంటర్ గేట్ వద్ద పైపుల్లో మహిళ కాలు ఇరుక్కుపోయింది. స్థానికులు మహిళను రక్షించారు. Time: 9:42 AM చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. Time: 9:40 AM 11.2 శాతం పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. Time: 9:23 AM కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్‌ను సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. Time: 9:19 AM టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. Time: 9:08 AM కొంపల్లిలో ఈవీఎంల మొరాయింపు మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షిస్తున్నారు. రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. చెకింగ్ పాయింట్స్ వద్ద లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. Time: 9:03 AM ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు.. వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను ఈసీ పరిశీలిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ఈసీ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఈవీఎంల వద్ద ఒక్క ఓటరు మాత్రమే ఉండాలని ఆదేశించారు. Time: 8:57 AM ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. Time: 8:27 AM పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో పోలింగ్ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:19 AM ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 8:12 AM మునుగోడు శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి పూజలు మునుగోడు శివాలయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:05 AM స్థానికేతరులు గుర్తింపు యాదాద్రి: పుట్టపాకలో స్థానికేతరులను అబ్జర్వర్ గుర్తించారు. నగదు ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. Time: 7:39 AM బారులు తీరిన ఓటర్లు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 7:21 AM కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. మనుగోడులో మొత్తం ఓటర్లు 2,41,805 కాగా, పురుషులు 1,21,672.. మహిళలు 1,20,126.. అన్ని బూత్‌లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. Time: 7:00 AM పోలింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటున్నాయి. Time: 6:30 AM మాక్ పోలింగ్ ప్రారంభం కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాంపల్లి మండలం పోలింగ్ బూత్ 294లో ఈవీఎం మొరాయించింది. మిగతా బూత్‌లలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందురోజైన బుధవారం ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. ఇదే చివరి అవకాశమంటూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులు వీలైనంత మేర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మద్యం, డబ్బు పంపిణీ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తమకు ఇస్తానని చెప్పినంత నగదు ఇవ్వలేదంటూ, ఆ మేర ఇప్పించాలంటూ పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగడం కూడా కనిపించింది. ఉప ఎన్నిక ప్రక్రియ ఊపందుకున్న నాటి నుంచీ ప్రలోభాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను రుజువు చేస్తూ చాలాచోట్ల నగదు, మద్యం పట్టుబడటం గమనార్హం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో మొత్తం 20 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడ్డాయి. రోజంతా అదే ‘రచ్చ’.. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నెలరోజులుగా నియోజకవర్గంలో హడావుడి నెలకొంది. ఎన్నికల ప్రచారంతోపాటు సభలు, సమావేశాల పేరిట రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారానికి వచ్చేందుకు ఒకరికి ఇంత అంటూ డబ్బులు ముట్టజెప్పడం ఓవైపు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు ఎరవేయడం మరోవైపు కొనసాగాయి. చికెన్, మటన్‌తోపాటు ఇంటింటికీ మద్యం బాటిళ్లు, కూల్డ్రింకులు, నగదు, పార్టీలు చేసుకునే వారికి అదనంగా లిక్కర్ సరఫరా జరిగాయి. పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, భారీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలానా పార్టీ ఓటుకు ఇంత ఇస్తుందనే ప్రచారం ముందు నుంచే విపరీతంగా జరిగింది. దీనితో చాలామంది ఓటర్లు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడటం కనిపించింది. అయితే పోలింగ్‌కు ముందు రోజు రాజకీయ పార్టీలు తమ టార్గెట్ మేరకు నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. ఓటుకు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది. బయట వారికోసం భారీ ఏర్పాట్లు నియోజకవర్గానికి బయట, ముఖ్యంగా హైదరాబాద్‌లో నివాసమున్న ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కొందరు ఓటర్లకు కలిపి ఓ వాహనం ఏర్పాటు చేయడం, దారిఖర్చులతోపాటు ఓటు వేసేందుకు నగదు ఇవ్వడం ద్వారా ఓట్లు సమీకరించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. స్థానిక నాయకులతోపాటు హైదరాబాద్‌లో నివాసం ఉండే నేతలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు నగదు, మద్యం, దారి ఖర్చులు, వాహనాల ఖర్చులను అందుకున్న ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసే బాధ్యతను కొందరు నాయకులకు అప్పగించాయి. స్థానిక నేతలపై ఒత్తిళ్లు ప్రచారం గడువు ముగిసిన తర్వాత బయటి నుంచి వచ్చిన నాయకులు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న నేతలపై ఒత్తిడి పెరిగింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, బడా నేతలు ఉన్నందున తాము అడగలేకపోయామని, ఇప్పుడు ఓటుకింత ఇస్తేనే ఓటేస్తామని కొందరు స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. స్థానిక నేతలు ఈ విషయాన్ని పైకి చేరవేసి.. వారి సూచనల మేరకు వివిధ స్థాయిల్లో నగదు పంచినట్టు సమాచారం. కొన్నిచోట్ల అనుకున్న సమయానికి నగదు రాకపోవడం, ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడం తమకు తలనొప్పిగా మారిందని.. ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు స్థానిక నేతలు వాపోవడం గమనార్హం. మొత్తమ్మీద ధూంధాంగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ముగియడం, పోలింగ్‌కు సమయం ఆసన్నమవడంతో అంతటా ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజకీయ పార్టీలు, నేతల ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లపై ప్రభావం చూపుతాయి, ఎవరిని విజయం వరిస్తుందన్నది ఈ నెల 6న తేలనుంది. ఏర్పాట్లు పూర్తి.. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయి. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్ పెద్దలు పోలింగ్ ముందు మరింత అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటం, ఓటేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న స్థానికులు, పోలింగ్ సమయంలో ఓటర్లను తిప్పుకొనేందుకు జరిగే ప్రయత్నాలు.. వంటివాటి నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నియోజవకర్గంలో పరిస్థితులు, పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ముఖ్య నేతలతో పలుమార్లు చర్చించారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సూచనలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావుతోపాటు కొందరు ముఖ్య నేతలు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో యూనిట్ ఇన్చార్జులుగా వ్యవహరించిన నేతలను కేటీఆర్ హైదరాబాద్ నుంచి సమన్వయం చేస్తున్నారు. యూనిట్ ఇన్చార్జులు పోలింగ్ బూత్‌ల వారీగా స్థానిక నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కేటీఆర్‌కు నివేదిస్తున్నారు. నల్లగొండలో మకాం వేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. బయటి ఓటర్లపై ప్రత్యేక దృష్టి! మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో సుమారు 40వేల మంది ఉపాధి, ఇతర అవసరాలపై హైదరాబాద్, నల్లగొండతోపాటు ముంబై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లారు. ఇలాంటి వారందరి వివరాలను 20 రోజుల క్రితమే టీఆర్ఎస్ శ్రేణులు సేకరించాయి. హైదరాబాద్, నల్లగొండ తదితర చోట్ల నివాసం ఉంటున్న ‘మునుగోడు’ఓటర్లను టీఆర్ఎస్ ప్రత్యేక బృందాలు కలుసుకుని.. ఓటింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్‌లకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముంబై వంటి దూరప్రాంతాల నుంచీ ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నించాయి. అప్రమత్తంగా ఉండాలి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పెద్దలు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సందర్భంగా కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దిగి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవచ్చని.. ఉద్వేగాలకు లోనుకాకుండా అప్ర మత్తంగా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటింగ్ సరళిని చూసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
పొలిమేర నుంచే ప్రణాళిక! సరిహద్దుల నుంచి కీలక నేతల పర్యవేక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈలోగానే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పలివెల వంటి ప్రాంతాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై దాడులకు దిగారు. ప్రచారం ముగియడంతో ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. కానీ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్టలైన కొందరు నేతలు మాత్రం మునుగోడు నియోజకవర్గం పక్కనే పొలిమేర గ్రామాల్లో తిష్టవేశారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిసింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించేలా సూచనలు చేస్తున్నారని.. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ వంటివన్నీ పర్యవేక్షిస్తున్నారని.. స్థానిక నాయకులను పిలిపించుకుని సూచనలు చేస్తున్నారని సమాచారం. సరిహద్దుల నుంచే సలహాలు.. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బుధవారం ఓ టీఆర్ఎస్ నేతకు చెందిన కారు కనిపించిందని.. ఆయన నియోజకవర్గానికి అవతల ఓ గ్రామంలో మకాం వేశారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నేత నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇక మర్రిగూడ మండలం శివారు దాటాక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఒక స్థానిక నాయకుడి ఇంట్లో ఓ సీనియర్ నేత మకాం వేసి పర్యవేక్షిస్తున్నారని.. పోల్ మేనేజ్మెంట్పై అక్కడి నుంచే సూచనలు చేస్తున్నారని తెలిసింది. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ పరిసరాల్లోని ఒక హోటల్లో మరో సీనియర్ లీడర్ ఉండి పరిశీలన జరుపుతున్నారని.. మరో ఎమ్మెల్యే వాహనం సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కనిపించిందని స్థానిక నేతలు చెప్తున్నారు. నార్కట్‌పల్లి వివేరా హోటల్లో అడ్డా వేసిన ఓ నేత మునుగోడులోని పరిసర మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీలో బుధవారం అధికార పార్టీ నేత వాహనం కనిపించింది. దీంతో ఆ కారులో డబ్బుల సంచులు ఉన్నాయని, కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ మకాం వేసినట్టు తెలిసింది. తక్కువగా ఇచ్చారంటూ ఓటర్ల ఆందోళన.. ప్రచారం సందర్భంగా ఓటర్లు ఏది అడిగితే అది ఇస్తామన్న నేతలు మంగళవారం సాయంత్రం నుంచే పంపిణీ మొదలు పెట్టగా.. ఈ ‘పని’లో ఏ ఇబ్బందీ రాకుండా ముఖ్యనేతలంతా చూసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు రూ.20 వేలు.. రూ. 30 వేలు ఇస్తామని ఒక పార్టీ, తులం బంగారం ఇస్తామని మరో పార్టీ వారు చెప్పారని.. తీరా ఇప్పుడు రూ.3 వేలు, రూ.4వేలు ఇస్తున్నారని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కనిపించింది. మునుగోడు మండలం కొరటికల్తోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటర్లు తమకు తక్కువ మొత్తం ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మునుగోడు ఉప ఎన్నిక సర్వేలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఓ సర్వే ఒక పార్టీకి అనుకులంగా.. మరో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని ప్రచారం సాగిస్తున్నాయి. సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనే వారు ఓడిపోతారని తేలిందంటూ మరికొందరు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ
మన్సూరాబాద్/ చాదర్‌ఘాట్: మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చేస్తున్న చిల్లర పనులను అందరూ అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మన్సూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు మన్నె ప్రతాప్‌రెడ్డిని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక్క ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దొంగల ముఠాగా ఏర్పడి మునుగోడులో దిగారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలపై ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహంతో టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని, అదేవిధంగా పలివెలలో ఈటల రాజేందర్‌పై, విశ్వేశ్వరరెడ్డిపై దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో బండి సంజయ్‌కుమార్ పేరుతో వైరల్ అవుతున్న లెటర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ అదెవరో ఫాల్తుగాళ్లు చేస్తున్నారు. ఆ ఫాల్తుగాళ్లపై ఫిర్యాదు కూడా చేయను అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో తిష్టవేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. స్థానికేతరులైన ఇతర పార్టీల నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించకుంటే బీజేపీ శ్రేణులు కూడా మునుగోడుకు తరలివస్తాయని ఆయన హెచ్చరించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో గాయపడి మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త రమేష్ యాదవ్‌ను పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
‘ఎమ్మెల్యేలకు ఎర’ వికటించడం వల్లే నడ్డా సభ రద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా ప్రధాని మోదీ పేద ప్రజలకు పెద్ద ఉపద్రవంలా పరిణమించారని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ ప్లాన్ బెడిసికొట్టడంతోనే మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు చేసుకున్నారని, ఓటమి భయంతోనే అమిత్‌షా ముఖం చాటేశారన్నారు. రాహుల్‌గాంధీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా మొదట కాంగ్రెస్ ప్రాధాన్యతలేమిటో నిర్ణయించుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. మోదీ, బీజేపీ విధానాలపై ఆధారాలతో సహా విమర్శల దాడి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ జడ పదార్ధంలా తయారైంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో.. మోదీ 22 సార్లు అక్కడికి వెళితే, కేజ్రీవాల్ తరచూ పర్యటిస్తున్నారు. రాహుల్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు. గుజరాత్లో అస్త్ర సన్యాసం చేసి ఇక్కడ గాలి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మొదట సొంతింటిని చక్కదిద్దుకోవాలి. దేశ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందనే విషయం ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబ నామినీ మాత్రమే. బీఆర్ఎస్కు మొదటి మెట్టు మునుగోడు మునుగోడు ఉప ఎన్నిక భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మొదటి మెట్టు లాంటిది. ఇక్కడి ఫలితం పార్టీకి కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మునుగోడులో తొలినుంచీ టీఆర్ఎస్కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఫ్లోరోసిస్ నుంచి బయటపడేయడంతో మహిళల్లో మాకు ఆదరణ ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు అదనపు బలాన్ని ఇచ్చింది. నియోజకవర్గం బయట ఉన్న 40వేల మంది ఓటర్ల పాత్ర బలంగా ఉండబోతోంది. అన్ని పార్టీలు తమ బలగాలను మోహరించినపుడు మేం మా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాం. అందులో తప్పేముంది? కేసీఆర్ దెబ్బకు అంతా కకావికలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి జేపీ నడ్డా సభలో చేర్చుకునేలా బీజేపీ ఎత్తుగడ వేసింది. అది బెడిసికొట్టడంతో నడ్డా సభ రద్దు చేసుకోగా.. అమిత్‌షా ముఖం చాటేశారు. మరో రెండు, మూడు పార్టీలకు సాధన సంపత్తి సమకూర్చి మా ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూశారు. విద్వేషం, కుటుంబ పాలన ఆరోపణలు, మత కలహాలు వంటి ‘ప్లే బుక్’ను అడ్డుపెట్టుకుని ఓట్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ బహుళ మార్గాల్లో ప్రయత్నించినా కేసీఆర్ ‘మాస్టర్ స్ట్రాటజీ’తో వారు కకావికలం అయ్యారు. బీజేపీకి పెద్దగా కేడర్ లేదనే విషయం రాబోయే రోజుల్లో బయటపడుతుంది. ‘కోవర్టు బ్రదర్స్’పదం కోమటిరెడ్డి సోదరులకు అతికినట్టు సరిపోతుంది. సీబీఐ మోదీ చేతిలో చిలుక! బీజేపీ మఠాధిపతుల ముసుగులో ఉన్న ముఠాను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నడిపింది. మా ఎమ్మెల్యేలు దీనిని తొలుత నాదృష్టికి, తర్వాత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా ఆట కట్టించారు. ఈ వ్యవహారంలో స్వామీజీలు సంచలన విషయాలు బయటపెట్టారు. కుట్ర గురించి బీజేపీ నేతలకు తెలిసినందునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేకపోతే బీజేపీ నేతలు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? గతంలో సీబీఐని ‘కాంగ్రెస్ చిలుక’అని మోదీ అభివర్ణించారు. ఇప్పుడు అది మోదీ చేతిలో చిలుకలా మారింది. ముందస్తు అనుమతితోనే సీబీఐ అడుగు పెట్టాలనే జీవో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. బ్రిటీషు కాలానికి ప్రతీక గవర్నర్ గిరీ.. కొందరు వ్యక్తులు తమ స్థాయిని, శక్తిని అపరిమితంగా ఊహించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటీషు కాలం నాటిది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పనితీరును చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మంత్రివర్గం నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి రాజ్యాంగ సంస్థల నడుమ వివాదం రేపేందుకు గవర్నర్ బిల్లులను ఆపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొంతు నొక్కి ప్రజల దృష్టిలో కేసీఆర్‌ను చెడుగా చూపేందుకు బీజేపీ అనేక రూపాల్లో ప్రయత్నిస్తోంది. గవర్నర్ అందులో భాగం కావడం సరికాదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్కు గుర్తింపు లభించిన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తాం. పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై దృష్టి పెడతాం. బీజేపీలో పది మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని సమీక్షించుకుని వెనక్కి తగ్గొచ్చు. లేదా కొత్త ‘ప్లేబుక్’తో రూల్స్ మార్చుకుని జనం ముందుకు రావచ్చు. 2023 ఎన్నికల్లో బీజేపీ శక్తినంతా కేంద్రీకరిస్తే.. ఆ పరిస్థితుల్లో పోటీపడి గెలవడంలోనే మజా ఉంటుంది. మునుగోడు కంటే వారణాసి, గుజరాత్ ఎన్నికలే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మోదీ గుజరాత్లో ఇప్పటికే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి : కేటీఆర్
-
KTR: మునుగోడులో సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు మండలంలోని పలివెలలో జరిగిన ఘర్షణను సూచిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ నుంచి ఆదేశాలతోనే బీజేపీ హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ నుంచి ఆదేశాలతో బీజేపీ హింసకు పాల్పడుతోంది. ఎవరు ఎవరి మీద ఎవరు దాడి చేసరో వీడియోలు ఉన్నాయి. ఈటల పీఏ రాళ్ల దాడి చేశారు. మా పై దాడి చేసి.. మళ్ళీ సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాంతి ఉంది. బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉంది. బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. మునుగోడులో బీజేపీ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఇదే సంస్కృతి కొనసాగిస్తే.. మేము తిరగబడతాము. బీజేపీ,మోదీలు ఫేకులు.’అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇదీ చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
మునుగోడు: ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్?!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హోటల్స్‌లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్ లు పుచ్చుకుంటున్నారని సమాచారం. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్‌ను.. బుకీలు రౌండ్ రౌండ్‌కు బెట్టింగ్ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ వ్యవహారం నడుస్తోంది. -
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి పోలింగ్‌పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఆఫీస్‌లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్‌ను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్ చేశామన్నారు. చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం -
మునుగోడులో జోరుగా డబ్బు పంపిణీ
-
మునుగోడులో కట్టుదిట్టమైన భద్రత
-
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్ఎస్ఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!) -
Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!
నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఎటువైపో.. గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. -
మునుగోడులో ముగిసిన ప్రచారం (ఫొటోలు)
-
మునుగోడు కౌంట్ డౌన్ స్టార్ట్
-
లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన ముఖ్య నేతలు కొందరు జిల్లా కేంద్రం నల్లగొండలో, మరికొందరు హైదరాబాద్ శివార్లలో మకాం వేసి చివరి నిమిషం వరకు మునుగోడు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలుగా పనిచేసిన నేతలు కూడా సంబంధిత ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి, వారితో పోలింగ్ ముగిసేంత వరకు టచ్‌లో ఉండాలని పార్టీ ఆదేశించింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో హైదరాబాద్ శివారు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉండటంతో.. పోలింగ్ రోజున వారు స్వస్థలాలకు తరలివెళ్లి తమకు అనుకూలంగా ఓటు వేసేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. నేడు సీఎం టెలీ కాన్ఫరెన్స్ సుమారు 20 రోజులు ప్రచార సరళిని విశ్లేషించుకున్న టీఆర్ఎస్.. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని 298 పోలింగ్ బూత్‌ల పరిధిలో తమ అభ్యర్థికి పడే అవకాశమున్న ఓట్ల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటంతో పార్టీ అంచనాలు, లెక్కలు తప్పకుండా ఉండేందుకు గురువారం పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. వివిధ సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్ బుధవారం మునుగోడు ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని తెలిసింది. పక్షం రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్డీ కేడర్ కలుపుకొని సుమారు మూడు వేల మంది ప్రచారంలో పాల్గొన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
రైతుబంధు కావాలా.. రాబందు రాజ్యం కావాలా? నిర్ణయం మీదే..
సాక్షి, యాదాద్రి, మునుగోడు: మునుగోడు ఉపఎన్నిక పోరు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య కాదని.. ఇది రెండు భావజాలాల మధ్య జరగనున్న యుద్ధమని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రైతులను ట్రాక్టర్లతో తొక్కించే ఆ గట్టున (బీజేపీ) ఉంటారో లేక రైతు సంక్షేమాన్ని కోరుతున్న సీఎం కేసీఆర్ గట్టున ఉంటారో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలన్నారు. అలాగే రైతుబంధు రాజ్యం కావాలో లేక రాబంధు రాజ్యం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. ఉపఎన్నిక చివరిరోజు ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన రోడ్డు షోలలో ప్రసంగించారు. ఫ్లోరిన్ సమస్య లేకుండా చేశాం.. మునుగోడులో ఫ్లోరిన్ సమస్యతో అనేక మంది అనారోగ్యానికి గురవుతుంటే సీఎం కేసీఆర్ చలించి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నేడు నియోజకవర్గంలో ఫ్లోరిన్ సమస్య లేకుండా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం వద్ద టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి త్వరలో 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని చెర్లగూడెం, కిష్టారాయింపల్లి ప్రాజెక్టులను పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేస్తామని, రాచకొండలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని 14 నెలల్లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బీజేపీకి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలి.. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 1,200కు చేరుకుందని.. భవిష్యత్తులో ఇది రూ. 4 వేలకు పెరిగే ప్రమాదం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమం పరుగులు పెడుతుందని, మరిన్ని పథకాలు వస్తాయన్నారు. ‘మనది పేదల ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీది పెద్దల ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్‌ను రద్దు చేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా బుద్ధిచెప్పాలి’ అని ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. తూతూ ప్రమాణం చేసి డబ్బులు తీసుకోండి.. కేంద్రం ఇచ్చిన రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపొయి రాజ గోపాల్‌రెడ్డి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కేటీఆర్ ఆరో పించారు. బీజేపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి రూ. 5 వేల కోట్లకుపైగా వచ్చే లాభంలో రూ. 500 కోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికి తులం బంగారం చొప్పున ఇచ్చి ఆయనకే ఓటేసేలా రాజ గోపాల్‌రెడ్డి ప్రమాణం చేయించుకోజూస్తారని.. కానీ ఏదో తూతూ ప్రమాణం చేసి ఆ బంగారం, డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేయాలని కేటీఆర్ కోరారు. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆరోపణలు .. ప్రత్యారోపణలు, వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు, వ్యక్తిగత విమర్శలు.. దాడులు, ప్రలోభాలు .. పంపకాలు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మోహరించారు. సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో జోరుగా ప్రచారం కొనసాగించారు. ఇక ప్రచార పర్వం చివరిరోజు మంగళవారం మునుగోడు జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గానికి పోటెత్తిన వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.. ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎవరికి వారు తమ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఒకటీ రెండుచోట్ల జరిగిన భౌతిక దాడులు, ఘర్షణలు పోలింగ్‌కు ముందు ఒకింత ఉద్రిక్తతకు తావిచ్చాయి. నియోజకవర్గంలోనే మకాం వేసి.. ఉప ఎన్నిక ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందన్న భావనతో అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ వెలువడక ముందే ప్రచారం ప్రారంభించిన పార్టీలు ఆ తర్వాత ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. స్థానిక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు నియోజకవర్గాన్ని వీడకుండా ఆయా పార్టీల అధిష్టానాలు చివరిరోజు వరకు కట్టడి చేశాయి. దీంతో నాయకులు ఏకంగా ఆయా గ్రామాల్లోనే గదులు అద్దెకు తీసుకుని ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప్పు, నిప్పులా తలపడ్డాయి. అక్టోబర్ 26వ తేదీ రాత్రి బయటకు వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేసింది. సంక్షేమ మంత్రం .. ఎదురుదాడి యత్నం ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన వంటి ఆరోపణల ఎదురు దాడితో కాషాయ దళం కాక పుట్టించింది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అంటూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. హోరెత్తిన ప్రచారం మంగళవారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వేర్వేరు మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడులో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. నాంపల్లి మండలంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, చండూరులో ఎర్రబెల్లి, చౌటుప్పల్‌లో శ్రీనివాస్‌గౌడ్, మలారెడ్డి ర్యాలీలకు నేతృత్వం వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాంపల్లి నుంచి మర్రిగూడ మీదుగా చండూరు వరకు వేలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పార్టీ నాయకులు ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వెంకటస్వామి, సునీల్ బన్సల్ తదితరులంతా నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ మునుగోడులో మహిళా గర్జన నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, గీతారెడ్డి, సీతక్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ప్రచారం ముగియడంతో.. గురువారం జరిగే పోలింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. డబ్బు, మద్యం పంపిణీ మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇవ్వడంతో పాటు భారీయెత్తున మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పోలింగ్‌కు ముందు బుధవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసే ప్రయత్నాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. డబ్బు, మద్యం పంపిణీతో పాటు కుల సమీకరణలకు ప్రాధాన్యతనిస్తూ తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించాయి. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన స్థానికేతర నేతలు ఆ చుట్టుపక్కలే మకాం వేశారు. నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లను గురువారం పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 47 మంది ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ఇలాంటి దాడులు చేయడం సహజం : మంత్రి జగదీష్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
మునుగోడు: రాజగోపాల్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదిలీ చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్ -
రెచ్చగొట్టే చర్యలతో దాడులకు దిగారు : ఈటెల రాజేందర్
-
తమపై తామే దాడి చేసుకుని టీఆర్ఎస్ పై దుష్ప్రచారం : హరీష్ రావు
-
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది : ఈటెల రాజేందర్
-
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
ఈ ఉద్రిక్తతకు కారణం మీరే.. కాదు మీరే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణులు రణరంగం సృష్టించాయి. మునుగోడు మండలం పలివెలలో ఇరు పార్టీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టీఆర్ఎస్దేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీనే రెచ్చగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్లాని చూశారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలకు టీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండి ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని సూచించారు. మరొవైపు మంత్రి హరీష్‌రావు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులు చేస్తుందన్న హరీష్‌రావు.. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. బీజేపీకి అబద్ధాలు చెప్పడం అలవాటేనని, ఆ పార్టీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకునే దాడికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఓటమి భయం కారణంగానే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించగా, తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చాలా సౌమ్యుడని, ఆయనపైనే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
మునుగోడు లో రణరంగం
-
‘ఓటర్లను ప్రభావితం చేసేందుకు మునుగోడులో ఫోన్ల ట్యాపింగ్’
సాక్షి, న్యూఢిల్లి: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్. ఫోన్ల ట్యాపింగ్ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు తరుణ్‌చుగ్. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి -
మునుగోడులో రణరంగం: ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. కార్యకర్తల ఘర్షణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
మునుగోడులో మెరిసేదెవరు ?