సాక్షి నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. రెండు, మూడు రౌండ్లు మినహా ఏ రౌండ్‌లోనూ ఆధిక్యం కనబరచని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్ తర్వాత ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యంలో నిలిచిన టీఆర్‌ఎస్.. 14 రౌండ్లు ముగిసే సరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యం సాధించింది.
పోస్టల్ బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్‌ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది.
21 టేబుళ్ల ఏర్పాటు
నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. 3-4 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది.
93.41 శాతం పోలింగ్
నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడి కానుంది.
టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ!
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ సాగింది
Comments
Please login to add a commentAdd a comment