Munugode By Election 2022
-
మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్..
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వర్సెస్ బీజేపీ నేతలు అన్నట్టుగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇది పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఉప ఎన్నికల అనంతరం, కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీలో చేరినందుకు కాంట్రాక్ట్ తీసుకున్ననని నాపై ఆరోపణలు చేశారు. ఆ 18వేల కోట్ల కాంట్రాక్ట్ నిరూపించండి. గోబెల్స్ ప్రచారం నాపై పనిచేస్తుందని భావించకండి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 18వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని హైలైట్ చేశారు. ఈ క్రమంలో దీనిపై కోమటిరెడ్డి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. KTR if you have an iota of credibility and honesty, once again I challenge you to prove that I got the 18000 cr contract for joining BJP and don’t think Goebbels propaganda will work in my case. — Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) March 10, 2023 -
మునుగోడులో కమ్యూనిస్టులతోనే టీఆర్ఎస్ గెలుపు: గోరటి వెంకన్న
నల్లగొండటౌన్: మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతోనే టీఆర్ఎస్ గెలుపు సాధ్యమైందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రజానాట్యమండలి నిర్వహిస్తున్న వీధినాటకోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రజా నాట్యమండలి కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు గొప్పవని కొనియాడారు. తాను ఇక్కడికి ఒక కళాకారునిగా వచ్చానని, కళాకారునిగా ఉండడంలోనే సంతృప్తిని పొందుతానని తెలిపారు. నాజర్, సుద్దాల హనుమంతు వారసులుగా ప్రజానాట్య మండలి కళాకారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళలు, సాహిత్యం ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కమ్యూనిస్టు నాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ఆటాపాటలతో అలరించారు. కార్యమ్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కె.శాంతారావు, వేల్పుల వెంకన్న, కట్ట నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్చార్జిని నియమించాలని కేసీఆర్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. మోహరింపుతో స్వయం విశ్లేషణ మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది. ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. ఓటర్లకు చేరువ అయ్యేలా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్ నంబర్ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?! -
Munugode: ఉప ఎన్నిక ముగిసినా చల్లారని వేడి
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని అధికార పార్టీ టీఆర్ఎస్ చెబుతున్నా.. కార్యాచరణ మాత్రం ఆ దిశాగానే సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఇప్పుడు ఆ వేడి చల్లారకుండా టీఆర్ఎస్, బీజేపీలు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడిన పార్టీలు ఆ తర్వాత కూడా తగ్గేదేలేదు అన్నట్లు కార్యక్రమాలు చేపడుతున్నాయి. బలం పెంచుకునే దిశగా ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మునుగోడులో గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవాలతోపాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీజేపీ పోరాటానికి దిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ క్షేత్ర స్థాయిలో వెళ్లాలని దిశా నిర్దేశం చేయడం కూడా ఆ సంకేతాలనే ఇస్తుంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కోసం జిల్లా కోర్ కమిటీని, నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందే ఆయా శాఖల వారీగా ప్రభుత్వం గుర్తించింది. ఉప ఎన్నికల సమయంలో ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు విన్నవించారు. త్వరలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలో నిర్వహించబోయే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించేందుకు సిద్ధం అవుతోంది. ప్రధానంగా రోడ్లు, కాలేజీలు, చండూరును రెవెన్యూ డివిజన్ చేయడం తదితర సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు దృష్టిపెట్టారు. ఇక సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉన్నా ముందస్తు వస్తే ఎలా ముందుకు సాగాలన్న అంశంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు జిల్లాలో మరింత అభివృద్ధిపై దృష్టి సారించింది. సమస్యలే ఎజెండాగా.. ఉప ఎన్నికలో ఓటమిపాలైనా.. అధిక ఓట్లు సాధించిన బీజేపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే మునుగోడులో ప్రజ సమస్యలపై దృష్టిపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప వాటిని పరిష్కరించలేదంటూ బీజేపీ నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గొల్ల కురుమలకు వచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం మునుగోడులో ధర్నా చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. «ఇలా ముందస్తు నేపథ్యంలో అధికార పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించగా బీజేపీ మాత్రం ప్రజాసమస్యలపై కార్యచరణ ప్రారంభించింది. మునుగోడులో ఇరు పార్టీల పోటాపోటీ కార్యాచరణ -
కమ్యూనిస్టులతో ‘కారు’ జర్నీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కామ్రేడ్లు ‘కారు’తో కలిసి ప్రయాణించిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారితో జట్టు కట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరిట దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ సీపీఐ, సీపీఎం మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ మినహా భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి సాగే దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష, రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న వైనం తదితరాలపై భవిష్యత్తులో టీఆర్ఎస్ సాగించే పోరాటంలోనూ వామపక్షాలను భాగస్వామ్యం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల్లో ఢిల్లీ వేదికగా జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇటు తెలంగాణతోపాటు జాతీయస్థాయిలోనూ కలిసి నడిచేందుకు కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు ఇరు పార్టీల నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్.. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేసి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కమ్యూనిస్టులకు గణనీయమైన ఓటు బ్యాంకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టులతో మైత్రీ కుదిరిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు ఆ పార్టీలకు కేటాయించే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తమకు గణనీయ ఓటు బ్యాంకున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టులు ఆరు నుంచి పది స్థానాలు కోరే అవకాశమున్నట్లు సమాచారం. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలకు పట్టు ఉండటం కొంతమేర కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కమ్యూనిస్టులు కోరే స్థానాలివే.. సీపీఎం, సీపీఐలతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఇప్పటికే టీఆర్ఎస్ సంకేతాలివ్వడంతో 2023 ఎన్నికల్లో తమకు కేటాయించే స్థానాలపై త్వరలో స్పష్టత కోరే అవకాశమున్నట్లు తెలిసింది. పదేళ్లుగా అసెంబ్లీలో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీపీఐ, సీపీఎం కృతనిశ్చయంతో ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ మనుగడకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం తప్పనిసరి అని రెండు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం మధిర, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ లేదా హుజూర్‌నగర్‌ను.. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంతోపాటు మరికొన్ని స్థానాలను సీపీఐ కోరే అవకాశముంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పాలేరు నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ లేదా హుజూర్నగర్ నుంచి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, హుస్నాబాద్ నుంచి సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. -
Munugode: బీజేపీ ఓటమి.. కమ్యూనిస్టులకు సంతోషమెందుకు?
మునుగోడు విజయం ఎవరికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది? బీజేపీని ఓడించినందుకు గులాబీ పార్టీ కంటే ఎర్ర పార్టీలే ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నది నిజమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక క్రమంగా ఉనికి కోల్పోతున్న వామపక్షాలకు మునుగోడు టానిక్‌లా పనిచేస్తుందా? టీఆర్ఎస్తో మునుగోడు పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? మునుగోడు ఒకప్పుడు సీపీఐకి కంచుకోట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక, స్థానిక సంస్థల్లో కూడా కూనారిల్లిపోతూ... కేడర్ చెల్లాచెదురవుతున్నా.. చేసేది లేక చేష్టలుడిగి చూస్తున్నారు అగ్ర నాయకులు. లెఫ్ట్ పార్టీల విజయం అనే మాట విని చాలాకాలం అయిపోయింది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఒకప్పుడు సీపీఐకి కంచుకోట. అటువంటి చోట ఎన్నోసార్లు గెలిచిన కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోగా... గతంలో విజయం సాధించిన సీపీఐ సోదరపార్టీ సీపీఎంతో కలిసి ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతివ్వాల్సి వచ్చింది. ఓడిన బీజేపీ రెండో స్థానానికి చేరింది. అయినప్పటికీ బీజేపీ ఓటమిలో తమ ప్రమేయం ఉండటం సీపీఐ, సీపీఎంలకు ఎంతో సంతోషాన్నివ్వడమే గాదు..వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్లయింది. కారెక్కడమే కామ్రెడ్లకు బెటరా? మునుగోడులో ఎలాగైతే టీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఓడించగలిగామో... భవిష్యత్‌లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ సైద్ధాంతిక శత్రువైన కమలం పార్టీకి అధికారం దక్కకుండా గులాబీ పార్టీతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సూది, దబ్బనం పార్టీలు అన్న నోటితోనే... ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో లెఫ్ట్ పార్టీల వల్లే గెలిచాం అని చెప్పడంతో ఎర్ర పార్టీల నేతలు ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నారట. ఏడాదిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తమకు బలమున్న స్థానాల్లో చెరో పది అడగాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా చెరో ఎంపీ సీటు కూడా అడిగే ఆలోచన చేస్తున్నాయట. ఇక ఎన్నికలు వచ్చే వరకు టిఆర్ఎస్ తో ఉమ్మడి కార్యాచరణకు కూడా సిద్ధం అవుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. ఇక్కడ బూస్ట్.. అక్కడ సపోర్ట్ బీజేపీపై ఉమ్మడిగా చేసే పోరాటానికి తెలంగాణలో ప్రధాని పర్యటనను అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కార్యాచరణలో ఇరుపక్షాలకు ప్రయోజనాలు దాగున్నాయి. లెఫ్ట్ పార్టీలకు తెలంగాణలో బూస్టింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కోసం సీపీఎం, సీపీఐల మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని లెఫ్ట్ పార్టీలు టిఆర్ఎస్ సహాకారంతో ఎలాగైనా అడుగు పెట్టాలని చూస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో కూటమి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి సక్సెస్ కాదని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తు లేనేలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య స్నేహం కుదిరే చాన్స్ లేదు. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగిస్తున్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్‌ను కాదని టీఆర్ఎస్తో పొత్తు కొనసాగించగలుగుతారా? మునుగోడు బాటలో నడిచి తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ పాదం మోపాలని రాష్ట్రంలోని రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. ఈ పూర్వ రంగంలో లెఫ్ట్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ముందడుగు వేస్తాయా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
కేసీఆర్ భయం అదే.. తరుణ్ చుగ్ చురకలు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సవాల్ చేశారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమై కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో కేంద్రం భాగస్వామ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు ఈనెల 12న వస్తున్న ప్రధాని మోదీ పర్యటనలో సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు కేసీఆర్, ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై మోదీ కొత్త నాటకం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రధాని మోదీ కొత్త నాటకం ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంపై ఏ విధంగా పగ తీర్చుకోవాలన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఏడాదిగా పనిచేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని వస్తుంటే.. ప్రొటోకాల్ పాటించని దుస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరిందని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఎంపీ బడుగుల బుధవారం మీడియా తో మాట్లాడారు. రామగుండం వస్తున్న ప్రధాని మోదీ.. ముందుగా తెలంగాణకు ఏమివ్వనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా కేంద్రానికి రాష్ట్రం పన్నుల ఆదాయం పంపితే... తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. విభజన హామీల అమలు విషయంలోనూ ఎలాంటి పురోగతి లేదని.. కృష్ణా, గోదావరి నీటి సమస్యలు ఇంకా పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్నందున నెలరోజుల్లోనే రూ.లక్ష కోట్లకు పైగా గుజరాత్‌కు ఇచ్చారని ఆరోపించారు. మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధానా? లేక దేశం మొత్తానికా? అని ప్రశ్నించారు. కేంద్రం... బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో రకంగా ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు. ప్రధానికి ఏనాడూ తెలంగాణ మీద ప్రేమ లేదని లింగయ్య యాదవ్ విమర్శించారు. -
మునుగోడు ఎన్నిక నోట్ల ఎలక్షన్..
సాక్షి, కామారెడ్డి: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు పోటీపడి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు మద్యాన్ని ఏరుల్లా పారించాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని విమర్శించారు. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా శేకాపూర్ గేట్ వద్ద రాహల్ గాంధీ బస చేసిన చోట ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఓట్ల ఎన్నిక కాదని.. అది నోట్ల ఎన్నిక అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సాహసవంతమైన మహిళ అని, ఆమె డబ్బు, అధికారం ఉన్న వారితో పోరాడిందని ప్రశంసించారు. తనతో ప్రజా గాయకుడు గద్దర్ ఒక సారి ‘వన్ సీఆర్, టూ సీఆర్, త్రీ సీఆర్, ఫోర్ సీఆర్.. కేసీఆర్ ’అని చెప్పారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఉప ఎన్నికలో ఎన్నడూ 93 శాతం పోలింగ్ జరగలేదని, అది మునుగోడులో మాత్రమే సాధ్యమైందని అన్నారు. మునుగోడు ఓటమితో కాంగ్రెస్ పార్టీ కుంగిపోదని, మరింత బలంగా కొట్లాడుతుందని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఎన్నికల యాత్ర కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారిని సంఘటితం చేయడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ఓట్ కట్టర్ పార్టీ అని విమర్శించారు. పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలుంటాయి.. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవారు ఏ స్థాయివారైనా వారిపై చర్యలుంటాయని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలో పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసు ఇచ్చిందని, ఆయన సమాధానం వచ్చిన తరువాత పరిశీలించి, తప్పు జరిగినట్టయితే తప్పకుండా చర్యలుంటాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. -
ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది: పాల్వాయి స్రవంతి
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత చండూరు మండలం ఇడికుడలో సోమవారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో ధనబలం, అంగబలం చూపించి టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది. అన్ని వర్గాలను భయబ్రాంతులకు గురిచేశారు. అసత్య ప్రచారాలు, అనైతిక చర్యలతో టీఆర్ఎస్ గెలిచింది. తప్పుడు ఫోటోలతో నాపై దుష్ప్రచారం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయాందోళనకు గురిచేసి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారు. మద్యం ఏరులై పారింది. అబద్ధపు ప్రచారం చేసినా చివరి వరకు పోరాటం చేశాను. సీఎంని కలిశా అని తప్పుడు ఫోటోతో ప్రచారం చేశారు. భూ నిర్వాసితులను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేసింది. ఐదు వందల కోట్లు ఖర్చు చేశాయి రెండు పార్టీలు. మూడు నెలలు మత్తులో జోగేలా చేశారు.’ అని పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఇదీ చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది! -
ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపై కాషాయ పార్టీ నేతలు అధికార టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు చావుతప్పి కన్నులొట్టపోయినట్టుంది. కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటింది. ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మోహరించారు. ఓటమి భయంతోనే మాపై దాడులకు పాల్పడ్డారు. హుజురాబాద్‌లోనూ నన్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేశారు. ఎనిమిదేళ్లుగా సీపీఎం, సీపీఐ నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే కమ్యూనిస్టులను మచ్చిక చేసుకున్నారు. కేసీఆర్ తీరు అందితే జుట్టు లేదంటే కాళ్లు అనే చందంగా ఉంటుంది. వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచింది. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారు. అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారు. టీఆర్ఎస్ను గెలిపించడానికి వాళ్లు కృషిచేశారు. ఇంత చేసినా స్వల్ప మెజారీటీనే వచ్చింది’ అని ఎద్దేవా చేశారు. -
బీజేపీకి భంగపాటు.. మునుగోడు ఓటమిపై సీరియస్ యాక్షన్ ప్లాన్ షురూ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ భంగపాటుకు గురైంది. మొదటి నుంచి మునుగోడులో గెలుపు తమదే అనుకున్న కాషాయ పార్టీకి ఓటర్లు ఊహించని విధంగా షాకిచ్చారు. బీజేపీ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం చేశారు. ఇక, అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. 10వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా, మునుగోడులో ఓటమిని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పోస్టుమార్టంకు దిగింది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన మునుగోడు ఓటమిపై సమీక్షించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాత్రి ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇక, పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ విఫలమైనట్టు ముఖ్య నేతలు గుర్తించారు. మరోవైపు.. మునుగోడులో ఓటు బ్యాంకు పెరిగిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తపరుస్తున్నాయి. కాగా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో భారీగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల వరకు నియోజకవర్గాల బలోపేతంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. దీంతో, కొత్త రోడ్ మ్యాప్‌పై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: మునుగోడు ఫలితాలపై బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్ -
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన
-
మునుగోడులో బెడిసికోట్టిన బీజేపీ స్కెచ్
-
కేసీఆర్ చాణుక్యమే గెలిపించింది
-
3 నెలలు.. హోరాహోరీ!
సాక్షి, హైదరాబాద్: పేరుకు ఒక ఉప ఎన్నిక.. కానీ 2023 ఎన్నికలకు సెమీఫైనల్‌గా ప్రచారం.. హోరాహోరీ తలపడిన ప్రధాన రాజకీయపక్షాలు.. అన్ని అస్త్రశస్త్రాల ప్రయోగం.. దాదాపు మూడు నెలలు సందడి.. ఫలితం తేలేదాకా ఎడతెగని ఉత్కంఠ.. ఒక్క మాటలో చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో విపరీతమైన సెగ పుట్టించింది. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, పార్టీ జంపింగ్‌లు, వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, వెల్లువెత్తిన డబ్బు, మద్యం ప్రలోభాలు.. రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజల దాకా ఎక్కడ చూసినా అదే చర్చ. రాజగోపాల్‌రెడ్డి వీడినరోజు నుంచే.. మునుగోడులో కాంగ్రెస్ నుంచి గెలిచినా బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలను కలవడంతోనే ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ఆ ఘటనతో కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం, ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవకుండానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా వేడి పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. బహిరంగ సభలతో ప్రచారం మొదలుపెట్టాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక పోరు రసవత్తరంగా మారింది. తార స్థాయికి ప్రచారం ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందరికంటే ముందు కాంగ్రెస్ ఇక్కడ బహిరంగసభ నిర్వహించగా.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ భారీ సభ చేపట్టింది. వెంటనే రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. తర్వాత మరోమారు సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల అగ్రనేతలతో ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపింది. బీజేపీ తరఫున పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కె.లక్ష్మణ్ వంటి సీనియర్లు ప్రచారం చేశారు. మరోవైపు ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర సీనియర్లు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రచారానికి చివరి రోజున మహిళా గర్జన సభ నిర్వహించింది. అన్ని పార్టీల నుంచి నేతలు పోలింగ్ బూత్‌స్థాయి నుంచీ గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ తరఫున ఒక గ్రామానికి ఇన్చార్జిగా వ్యవహరించడం గమనార్హం. దుమ్ము రేపుతూ.. దుమ్మెత్తి పోసుకుంటూ.. మునుగోడు ప్రచారంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ బలాన్ని చాటేందుకు భారీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇదే సమయంలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. పార్టీల వారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు తోడు నేతల వ్యక్తిగత విమర్శలూ పరిధి దాటాయి. రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో పలుచోట్ల అడ్డగింతలతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఒకచోట టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి కూడా. మరోవైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర అంశం, అందులో బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలు, ఆడియోలు లీకవడం కలకలం రేపింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడం.. మరోవైపు టీఆర్ఎస్ బహిరంగసభకు కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని రావడం మరింత వేడి పుట్టించాయి. ఆకర్ష్‌లు.. ప్రలోభాలు.. ఈ ఉప ఎన్నిక సమయంలో స్థానిక నేతల నుంచి సీనియర్ల దాకా పార్టీలు మారడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ‘ఆకర్‡్ష’కు తెరతీయడంతో పలువురు నేతలు అటూ ఇటూ మారడం, వెళ్లినవారు వెనక్కి రావడం, కొందరైతే మూడు పార్టీలు మారడం వంటివి జరిగాయి. మరోవైపు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ కేంద్రంగా పలుమార్లు నగదు దొరకడంతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపోటములపై వందల కోట్లలో బెట్టింగ్‌లు జరిగాయనే వార్తలు రావడమూ గమనార్హం. -
13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
ఎన్నయినా చెప్పు! గెలవలేదని ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం కుదర్దు!
ఎన్నయినా చెప్పు! గెలవలేదని ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం కుదర్దు! -
ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌పై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈసీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీరియస్ అయ్యింది. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చిరించింది. అయితే బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. ఓటమి తట్టుకోలేకే కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అధికారులను భయపెట్టడం సరికాదని విమర్శించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగంవారిగుడెంలో టీఆర్ఎస్ 340 ఓట్లు లీడ్ సాధించింది. మీడియా ఆందోళన మునుగోడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చదవండి: Munugode Bypoll 2022 Result: ఆధిక్యంలో టీఆర్ఎస్ -
Munugode Bypoll: చౌటుప్పల్‌లో తక్కువ ఓట్లు.. నిరాశలో రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. రౌండ్ రౌండ్ ముగిసే సమయానికి పార్టీల మధ్య ఆధిక్యం తారుమారవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ అఫ్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద రాజగోపాల్‌రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంత మండలం చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన చెందారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చివరి వరకు హోరాహోరి తప్పకపోవచ్చని, బాజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాగా చౌటుప్పల్ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 21,209...బీజేపీకి 21,174...కాంగ్రెస్‌కు 5,164 ఓట్లు పడ్డాయి. ఇక మునుగోడు కౌంటింగ్‌లో ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. 4 రౌండ్లు ముగిసే సరికి 714 స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,854 ఓట్లు రాగా, బీజేపీకి 4,555 ఓట్లు పోలయ్యాయి. చదవండి: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు -
Munugode Election Results: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్!
సాక్షి, నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. నవంబర్ 3న ఎన్నిక జరగగా.. నవంబర్ 6న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందునుంచీ అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఆయా పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కు మారుతూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మూడు రౌండ్లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సొంతూరి ప్రజలే షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సొంత మండలం చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ పుంజుకోవడం గమనించదగ్గ విషయం. (చదవండి: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
నేడే మునుగోడు బైపోల్ తీర్పు
-
Munugode Round Wise Results: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు
సాక్షి నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు, మూడు రౌండ్లు మినహా ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్ తర్వాత ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్.. 14 రౌండ్లు ముగిసే సరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. 21 టేబుళ్ల ఏర్పాటు నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. 3-4 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. 93.41 శాతం పోలింగ్ నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ సాగింది -
Munugode Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయం
Time: 5:10PM ►మునుగోడులో టీఆర్ఎస్ విజయం ►ఏడు మండలాల్లో టీఆర్ఎస్కు ఆధిక్యం ►14 రౌండ్లు ముగిసేసరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్ ► 14వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం Time: 04:35PM ► విజయం దిశగా టీఆర్ఎస్ ► 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్9,039 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ► 13వ రౌండ్లో టీఆర్ఎస్ 1,002 ఓట్ల ఆధిక్యం ► కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు. Time: 03:53 PM 7,836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ 12వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 7,836 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,042 ఓట్ల ఆధిక్యం దక్కింది. Time: 03:45 PM కేటీఆర్ మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం. Time: 03:14 PM తెలంగాణ భవన్లో సంబురాలు షురూ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రౌండ్లు ముగిసే కొద్ది భారీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Time: 03:09 PM 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. Time: 02:44 PM 10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 10వ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది. 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. Time: 02:16 PM 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 3,952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 7,515 ఓట్లు రాగా.. బీజేపీకి 6,665 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,300 ఓట్లు, ఇతరులకు 1,100 ఓట్లు వచ్చాయి. Time: 01:58 PM చండూరుపైనే బీజేపీ ఆశలు 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరుగనుంది. Time: 01:54 PM 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 3,104 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. 8 రౌండ్లో టీఆర్ఎస్ 536 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. Time: 01:45 PM చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇప్పటివరకు టీఆర్ఎస్కు 45,710, బీజేపీకి 43,155 ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పటివరకు 1,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరగనుంది. Time: 01:27 PM ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 386 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. ఏడో రౌండ్ టీఆర్ఎస్- 7,189 బీజేపీ-6,803 Time: 12:59 PM ఏడో రౌండ్ ఓట్లు లెక్కింపు మునుగోడులో హైవోల్టేజ్ హీట్ కొనసాగుతోంది. ఏడో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఏడో రౌండ్లో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Time: 12:34 PM ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ఆరో రౌండ్ టీఆర్ఎస్-6,016 బీజేపీ- 5,378 Time: 12:05 PM పారదర్శకంగా కౌంటింగ్: సీఈవో ఆరో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. ఆలస్యానికి కారణాలు కూడా వివరించాలని చెప్పానన్నారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా అక్కడ ఉన్నారన్నారు. ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యం అవుతుందని సీఈవో తెలిపారు. Time: 11:47 AM ఐదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ టీఆర్ఎస్- 5,961 బీజేపీ-5,245 Time: 11:18 AM ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. Time: 11:13 AM కాసేపట్లో ఐదో రౌండ్ ఫలితం ప్రతి రౌండ్‌కు ఉత్కంఠ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. ఐదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. Time: 10:39 AM చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు-55,678 టీఆర్ఎస్- 21,209 బీజేపీ-21,174 కాంగ్రెస్-5,169 Time: 10:34 AM ఫలితం ఎలానైనా ఉండొచ్చు: రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. Time: 10:31 AM మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. నాలుగో రౌండ్ టీఆర్ఎస్-4,854 బీజేపీ-4,555 కాంగ్రెస్-1817 Time: 10:19 AM టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం Time: 10:09 AM మునుగోడులో బీజేపీ ఆధిక్యం మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 10:05 AM ఐదో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:57 AM మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. మూడో రౌండ్ టీఆర్ఎస్-7,010 బీజేపీ-7,426 కాంగ్రెస్-1,532 Time: 09:54 AM మొదటి రౌండ్లో కేఏ పాల్‌కు 34 ఓట్లు కేఏ పాల్‌కు తొలిరౌండ్లో 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. Time: 09:39 AM నాలుగో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. Time: 09:39 AM మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. 1000 ఓట్లు పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. Time: 09:33 AM మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మూడో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్- 14,211 బీజేపీ-13,648 కాంగ్రెస్-2,100 Time: 09:25 AM ఆధిక్యంలో టీఆర్ఎస్ రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. Time: 09:19 AM చౌటుప్పల్‌లో బీజేపీ ఆధిక్యం.. తొలిరౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్ అర్బన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 09:12 AM రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:01 AM చౌటుప్పల్ మండలం జైకేసారంలో టీఆర్ఎస్ లీడ్‌లో ఉంది. తొలిరౌండ్(14,553) టీఆర్ఎస్- 6,478 బీజేపీ- 5,126 కాంగ్రెస్- 2,100 Time: 08:55 AM 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఈవీఎం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. Time: 08:45 AM పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్ఎస్కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. Time: 08:30 AM టీఆర్ఎస్ ముందంజ.. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు Time: 08:15 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:07 AM కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు.. మునుగోడు కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:01 AM కౌంటింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. Time: 7:15 AM కాసేపట్లో కౌంటింగ్.. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ♦1,2,3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కింపు ♦4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు ♦7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు ♦9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు ♦11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల›లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. 2 –3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్ఎస్ విశ్వసిస్తుండగా ప్రజలకు తాను సేవ చేశానని, అలాగే యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. -
చంద్రబాబు మతి ఉండే మాట్లాడుతున్నారా?
-
‘కేఏ పాల్‌ను మించిపోయిన పవన్ కల్యాణ్’
సాక్షి, గుడివాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా?. డీజిల్, గ్యాస్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. పవన్, చంద్రబాబు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు. హైదరాబాద్‌లో రెక్కీ డ్రామా జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే సంబంధమా?. రెక్కీ పేరుతో పవన్ గాలిమాటలు మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో రెక్కీ జరిగితే చంద్రబాబుకు ఏం సంబంధం?. అప్పుడు పవన్ విశాఖలో ఐదు నానా హంగామా చేశారు. ఇప్పుడు ఇప్పటం వెళ్లి మరోసారి పవన్ నానా హంగామా చేశారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే టీడీపీకి నిద్రపట్టడం లేదు. కేపీ పాల్‌లా పవన్ ఇప్పటంలో పరుగులు పెట్టారు. మునుగోడులో కేఏ పాల్ ఎంటర్టైన్మెంట్తో రక్తి కట్టించాడు. కేఏ పాల్ కన్నా వెనకబడిపోయానని పవన్ ఇప్పటం వచ్చాడు. షో అయిపోగానే 2 గంటల కల్లా వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి. లేని సమస్యలను పవన్, చంద్రబాబు సృష్టిస్తున్నారు. వారిద్దరూ వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు. తాగుబోతులు పవన్ ఇంటి ముందు హడావుడి చేస్తే రెక్కీ అన్నారు. గులకరాయితో చంద్రబాబుపై హత్యయత్నం జరిగిందంట.. తనపై రాయి విసిరారని చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబే తన పార్టీ కార్యకర్తలతో రాళ్లు వేయించుకున్నాడు. పెట్రోల్, గ్యాస్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్, చంద్రబాబుకు లేదు. పవన్ రాజకీయ అజ్ఞాని. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్ ప్రధాని అవ్వాలి. ప్రధాని అవ్వడం కోసం పవన్.. కేఏ పాల్‌తో పోటీ పడుతున్నాడా?. జనసేన తరఫున 300 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని అవ్వమనండి. అప్పుడు ఇడుపులపాయలో కాదు. గుడివాడలో కూడా హైవే వేసుకోమనండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ఇప్పటం ప్రజలు..’ -
‘ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా నిప్పు కణికలు అవుతారు?’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తానే ఒక రాజు, చక్రవర్తిలా తెలంగాణను ఏలుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశం అధోగతి పాలవుతుందని చెబుతూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెల్లడించిన బాధ స్వయంగా తాము రాష్ట్రంలో అనుభవిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. 2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కొనుగోలు కేసులోని ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా నిప్పు కణికలు అవుతారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2018లో టీఆర్ఎస్కు 90 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మానవత్వం లేకుండా కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు అభివృద్ది జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజాం కాదా అని ప్రశ్నించారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ‘కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం, మర్యాద మాకు ఉండేది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజక వర్గానికి మంత్రులు వచ్చిన సమాచారం ఇచ్చి, అడిగిన పనులు చేసేవారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే పలు టీవీ ఛానెల్స్ మీడియా మీద ఆంక్షలు విధించింది మీరు కాదా?. పెద్ద పెద్ద టీవీ ఛానెల్స్‌ను బెదిరించి లోంగదిసుకుంటున్నారు. మీ అహంకారం, దుర్మార్గాలకు ఇవే నిదర్శనం. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఓటమి భయంతోనే మునుగోడులో టీఆర్ఎస్ హింసను ప్రేరేపించింది. హుజూరాబాద్‌లో ఏం జరిగిందో మునుగోడులో అదే రిపీట్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఎవరిది ..?
-
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి
సాక్షి, నల్గొండ: తాను అభిమానించిన నాయకుడు ఓడిపోతాడని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆ యువకుడు వేదనకు గురయ్యాడు. అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని రాంనగర్ కాలనీకి చెందిన ఊదరి శంకర్ (30) సెంట్రింగ్ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొంత కాలంగా విద్యానగర్ కాలనీలో సోదరి వద్ద ఉంటున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నెల రోజులుగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రచారం నిర్వహించాడు. పోలింగ్ ముగిసిన తర్వాత టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో ఆందోళనకు గురయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు తన మిత్రులతో మాట్లాడి ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఊరి నుంచి వచ్చిన అక్కాబావలు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పక్కింటి వారి సాయంతో తలుపు తెరిచి చూడగా శంకర్ చనిపోయి ఉన్నాడు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారని చాలా ధీమాతో ఉన్న సమయంలో ఎగ్జిట్‌పోల్స్ అందుకు విరుద్ధంగా రావడాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ తెలిపారు. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది? -
మునుగోడు ఫలితాలపై తేల్చేసిన కేఏ పాల్!
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో 50వేల మెజారిటీతో గెలువబోతున్నానని ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోకవర్గంలో యువత, మహిళలు ఇతర ప్రజలు నాపై ప్రేమ చూపించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో సందర్శిస్తున్న సమయంలో తనపై మూడు సార్లు దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్ఓ ఇతర అధికారులు రక్షించారని తెలిపారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమను మునుగోడు ప్రజలు ఇచ్చారని, వారికి జీవితాంతం కృతజ్ఞడునై ఉంటానని చెప్పారు. మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని పాల్ ఆరోపించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రచారం సందర్భంగా పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎస్పీ కూడా అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం గన్మెన్లను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గద్దర్‌కు గన్మెన్లు ఇచ్చారు. నాకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో అలాంటి పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు. ఎమ్మెల్యేలు కొనుగోలు అంతా డ్రామా... ఎమ్మెల్యేల కొనుగోలు అంతా డ్రామా అని ఆయన ఆరోపించారు. సీఎం అయితే తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తానన్నారు. అమిత్‌షా నన్ను పార్టీలో చేరమన్నాడు. మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారన్నారు. నేను కాదని చెప్పానని , పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని చెప్పాడన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు టీఆర్ఎస్ ఒప్పుకుందని , బీజేపీ ఇండరైక్టుగా మద్దతు ఇస్తే కాంగ్రెస్ నేరుగా మద్దతిచ్చిందని కాబట్టి గెలిచేది ఇక నేనే అని ఆయన చెప్పుకొచ్చారు. -
Munugode: లెక్కల్లో నిమగ్నమైన బీజేపీ..2, 3వేల మెజారిటీతో విజయఢంకా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక లెక్కలు, విశ్లేషణల్లో కమలదళం తలమునకలైంది. ఈ నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ముఖ్యనేతలు బీజేపీకి పడిన ఓట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రెండు, మూడు వేల మెజారిటీతో విజయఢంకా మోగిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ బీసీ వర్గాల ఓట్లతో పాటు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు కమలానికే పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు సూచికగా భావిస్తున్నారు. గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఆయా వర్గాల ఓటింగ్ తీరుపై పోలింగ్ బూత్‌స్థాయి నుంచి ఎన్నికల ప్రకియలో నిమగ్నమైన పార్టీ యంత్రాంగం నుంచి సమాచారాన్ని సరి చూసుకుంటున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా రాళ్ల దాడితో పాటు భౌతికదాడులకు ప్రయత్నించడం వంటి పరిణామాలు టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేశాయంటున్నారు. అయితే టీఆర్ఎస్కు వామపక్ష అనుకూల ఓటింగ్‌తో పాటు మైనారిటీల ఓట్లు, ఎస్సీలో కొంతశాతం ఓట్లు పడ్డాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా.. చౌటుప్పల్, చండూర్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి)లో బీజేపీ హవా బాగా కనిపించి, ఇక్కడి నుంచే అధిక శాతం ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మునుగోడు మండలంలోనూ బీజేపీకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్‌లో బీజేపీ, టీఆర్ఎస్కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మర్రిగూడ, నాంపల్లిలో బీజేపీ కంటే టీఆర్ఎస్ స్వల్పంగా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగతా చోట్ల కూడా బీజేపీకే మొగ్గు ఉంటుందనే విశ్వాసంలో బీజేపీ నేతలున్నారు. పొద్దున పోలింగ్ మొదలయ్యాక టీఆర్ఎస్కు మద్దతుదారులుగా ఉన్న ఆసరా, ఇతర రూపాల్లో పింఛన్లు పొందుతున్న వృద్ధులు, ఇతర వర్గాల వారు ఎక్కువగా ఓటింగ్ రావడంతో భిన్నమైన అంచనాలు వచ్చాయంటున్నారు. మధ్యాహ్నం తర్వాత యువత అధికంగా పోలింగ్ బూత్‌లకు రావడం, హైదరాబాద్ శివార్లలోని ఓటర్లు బూత్‌లకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరుగుదలతో మొత్తం వ్యవహారంలో మార్పులు చోటుచేసుకుని బీజేపీ వైపు మొగ్గు స్పష్టమైందని చెబుతున్నారు. -
మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది. ఈ మేరకు మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్‌చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు. పోలింగ్ బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందు పరిచారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి శుక్రవారం పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. పోలైన ఓట్లలో 50శాతం మేర ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ తరపున ఏజెంట్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది. పార్టీ తరపున ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు శనివారం అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే సుమారు పక్షం రోజులపాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన నేతలు గురువారం రాత్రి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ కేడర్‌ను సమన్వయం చేశారు. చదవండి: Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే -
సగం మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో వివిధ పార్టీలు సాధించే ఓట్ల శాతంపై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (పోస్ట్ పోల్) ఫలితాలను శుక్రవారం కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఆరా, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ప్రకటించాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ 50శాతానికి అటూ ఇటూగా సాధించి పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని అంచనా వేశాయి. బీజేపీ 31–35 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ‘ఆరా’సంస్థ లెక్కల ప్రకారం ఆదివారం 298 బూత్‌లకు సంబంధించి 22 రౌండ్ల పాటు జరిగే ఓట్ల లెక్కింపులో కేవలం ఒక రౌండ్లో మాత్రమే బీజేపీ ఆధిక్యత చూపనుంది. ఐదు రౌండ్లలో టీఆర్ఎస్, బీజేపీ నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోరు ఉంటుందని, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్కు ఆధిక్యత వస్తుందని ‘ఆరా’అంచనా వేసింది. 18 నుంచి 25ఏళ్ల యువత టీఆర్ఎస్, బీజేపీ పట్ల సమాన స్థాయిలో మొగ్గు చూపగా, మిగతా వయసుల వారు టీఆర్ఎస్పై మొగ్గుచూపినట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. -
Munugode ByElection: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. యువత, మహిళలే ఎక్కువ.. గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలస్యం అందుకే.. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్‌లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రూ.10 వేల నుంచి లక్షల్లో.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజామున స్ట్రాంగ్ రూమ్‌లకు.. పోలింగ్ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్! -
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన మునుగోడు
-
మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. దీంతో, ఊహించని విధంగా ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెల 22వ తేదీన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. అయితే, తనకు ఆ నోటీసులు అందలేదన్నారు. దీంతో, తాజాగా ఏఐసీసీ మరోసారి నోటీసులు పంపింది. ఇక, నోటీసుల్లో భాగంగా 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డిని కోరింది. ఇక, తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలువదు అంటూ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అంతకుముందు కూడా.. మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరినట్లు లీకైన ఆడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపకుండా బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక, ఈసారి కూడా కోమటిరెడ్డి స్పందించకపోతే.. ఆయనపై సీరియస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్
-
మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్!
సాక్షి, నల్గొండ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన యువకుడు కుడుముల కళ్యాణ్‌రెడ్డి తనకు తొలిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు. పోలింగ్ సమయం దగ్గర పడిన క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. అప్పటికే సమయం 6.08 గంటలు అయ్యింది. ఓటర్ స్లిప్పుతో పోలింగ్ కేంద్రంలోని వెళ్తుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు అనుమంతిచలేదు. సమయం ముగిసినందున ఓటు వేయడం కుదరదని తేల్చిచెప్పారు. తనకు మొదటిసారి ఓటు వచ్చిందని అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు నిరాశతో వెనుదిరిగాడు. ఒక్కరికి రెండు ఓట్లు! మునుగోడు : అధికారుల తప్పిదాల వల్ల ఒక్క ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు వచ్చింది. దీంతో వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మునుగోడులోని పలు బూత్‌లలో ఒకే ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు ఓటరు లిస్టులో ముద్రించారు. మునుగోడులోని బూత్ నంబర్ 155లో క్రమ సంఖ్య 902లో కట్ట పవిత్రకు ఓటు హక్కు ఉన్నట్లు ఓటరు లిస్టులో ఉంది. అదే ఓటరు పేరు తిరిగి 903 క్రమ సంఖ్యలో కూడా ఉండటంతో ఆ యువతి ఓటు వేసేందుకు అభ్యంతరం వ్యక్తమైంది. చివరికి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ బూత్ ఏజెంట్లతో మాట్లాడి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. అదే గ్రామంలోని పందుల పవన్‌కు 155 బూత్‌లోని 927 క్రమ సంఖ్యలో ఓటు హక్కు ఉంది. అదే యువకుడికి బూత్ నంబర్ 152లో కూడా ఉండటంతో అతడు ఏ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు. -
బుధవారం అర్ధరాత్రి బండి నిరసన.. హైదరాబాద్‌లో హైడ్రామా!
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మరో ఆరేడు గంటల్లో ప్రారంభమవుతుందనగా, బుధవారం అర్ధరాత్రి హైడ్రా మా చోటుచేసుకుంది. ప్రచారం గడువు ముగిశాక కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల టీఆర్ఎస్ నేతలు మునుగోడులో ఉన్నారని, ఓటర్ల ను ప్రభావితం చేయడంతో పాటు తమ పార్టీ కార్య కర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు. బుధవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యా లయానికి చేరుకున్న సంజయ్, నాయకులు, కార్య కర్తలు పెద్దసంఖ్యలో మును గోడుకు బయలుదేరారు. మలక్‌పేట వద్ద సంజయ్ కాన్వాయ్‌ను తొలుత పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తల నిరసనల మధ్య పోలీసులతో తోపులాట మధ్య కాన్వాయ్ ముందుకు కదిలింది. ఆ తర్వాత పనామా గోడౌన్ వద్ద పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. సంజయ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కార్యకర్తలు రక్షణ వలయంగా నిలిచారు. అక్కడి నుంచి ముందుకు కదిలిన సంజయ్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద మరోసారి అడ్డుకున్నారు. మంత్రులు, ఇతర ప్రాంత ఎమ్మెల్యేలను మునుగోడు నుంచి బయటకు పంపే దాకా ఇక్కడినుంచి కదిలే దిలేదని సంజయ్ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు రాత్రి 1.30 ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్‌కు తరలించా రు. గురువారం ఉదయం ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. తర్వాత పోలీ సులు సంజయ్‌ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచే మును గోడు ఎన్నికల పోలింగ్ సరళి, ఇతర పరిణామాలను తెలుసుకున్నారు. -
సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన చెందుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ‘ఫాంహౌజ్ సీఎం’పాత ముచ్చటనే పదేపదే చెప్పారని దుయ్యబట్టారు. బీజేపీ కీలకనేతలైన అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తదితరులపై కేసీఆర్ చేసిన అర్థరహితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియోలో ఉన్నవారితో బీజేపీకి సంబంధం లేదని తనతోపాటు తమ పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అయినా కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమన్నారు. పక్షపాతంగా మునుగోడు ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పోలీసులను, ఇతర అధికారులను విచ్చలవిడిగా వినియోగించుకుందని విమర్శించారు. ఎన్నికలకు 36 గంటల ముందు స్థానికేతరులు నియోజకవర్గాన్ని ఖాళీ చేసి పోవాలన్న నిబంధనను కూడా టీఆర్ఎస్ యథేచ్చగా గాలికొదిలేసిందని నిందించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఓ పక్రటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో యధేచ్చగా తిరుగుతూ డబ్బులు పంచడంతోపాటు, ప్రజలను బెదిరించడం, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం, అరాచకాలు సృష్టించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
మునుగోడు పోలింగ్ ప్రశాంతం.. ఎక్కడా రీపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థి తులు ఉత్పన్నం కాలేదన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే ఈవీఎంలను వినియోగించామని, మూడు వీవీ ప్యాట్లు పనిచేయకపోవ డంతో మార్చామని తెలిపారు. మార్చిన ఈవీఎంలలోని ఓట్లను సైతం లెక్కిస్తామని చెప్పారు. సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని సీఈఓ తెలిపారు. నల్లగొండ పట్టణంలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాములో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను సిబ్బంది గురువారం రాత్రిలోగా అక్కడికి చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుందన్నారు. రూ.8.27 కోట్ల నగదు స్వాధీనం.. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.8.27 కోట్ల నగదు, చీరలు, ఇతర సామాగ్రితో పాటు 3.49 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ 599 దాడులు జరిపిందని, మొత్తం 6,100 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 191 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 98 ఫిర్యాదులు వచ్చాయని, వారిలో 70 మందిని గుర్తించి బయటికి పంపించినట్టు తెలిపారు. బయటి వ్యక్తులను పట్టుకునేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించామని చెప్పారు. -
ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు: రాజగోపాల్‌రెడ్డి
మర్రిగూడ: ‘టీఆర్ఎస్ ముసుగులో ఉన్న గూండాలు, కౌరవులు వంద మంది వచ్చినా ఏమీ చేయ లేరని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్న గూడలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనపై కొందరు కార్య కర్తలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకుని చెదరగొట్టారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని రౌడీయిజం, గుండాయిజం నడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్ఎస్ను బొందపెట్టే వరకు ప్రాణం పోయినా భయపడేది లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ గేటును పగులగొట్టి లోపలికి వెళ్లే రోజులు రానున్నాయని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి: సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం మర్రిగూడ ఓటర్లను ప్రలోభా నికి గురిచేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగా రు. దీంతో బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ విష యం తెలుసుకుని పోలీసుల తీరుపై రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
మునుగోడు ఉప ఎన్నిక.. ఆశానిరాశల నడుమ హస్తం..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై కాంగ్రెస్‌లో ఆశ నిరాశల ధోరణి కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల తరహాలోనే పైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో గెలుస్తామా? ఓడిపోతామా? పరువు దక్కించుకుంటామా? అనే దానిపై స్పష్టత రావడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి రెండో స్థానం కోసం ఎదురు చూడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం వస్తే చాలని, కనీసం పరువు దక్కే స్థాయిలో ఓట్లు వచ్చి బీజేపీ ఓడిపోతే తాము గెలిచినట్టేననే భావనలో కాంగ్రెస్ శ్రేణులున్నట్లు తెలుస్తోంది టీఆర్ఎస్, బీజేపీల నడుమ హోరాహోరాగా సాగిన పోరులో తమ సంప్రదాయ ఓటర్లతో పాటు మహిళలు ఎక్కు వగా తమవైపు నిలుస్తారని, 20 శాతానికి అటూ ఇటుగా ఓట్లు సాధిస్తామనే అభిప్రాయం మెజార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కలిసొచ్చిన మహిళా గర్జన: ఉప ఎన్నిక ఖరారైన ప్పటి నుంచీ టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకుని ప్రచార పర్వంలో నిలబడేందుకు శాయశ క్తులా ప్రయత్నించిన కాంగ్రెస్ పోలింగ్ రోజు న కూడా ఆపసోపాలు పడాల్సి వచ్చిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీల్లోకి కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగిన నేపథ్యంలో ఉన్న కొద్దిమందీ ఏం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓటర్లను ‘సంతృప్తి’ పరిచే స్థాయిలో కాంగ్రెస్ పంపిణీ జరగలే దని, చివరి వరకు ఉన్న కాంగ్రెస్ ఓటర్లు కూడా ఓటేసే క్షణంలో మారిపోయారనే చర్చ జరుగు తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిలో చాలామంది మళ్లీ తమకే ఓట్లేశారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఇక, ప్రచారం చివరి రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మహిళా గర్జన కలిసొచ్చిందని, ఆ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు మహి ళలను మెప్పించాయని, ఆడ బిడ్డగా స్రవంతిపై సానుభూతిని తీసుకురావడా నికి ఈ సమావేశం ఉపయోగపడిందనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్త మవుతోంది. టీఆర్ఎస్, బీజేపీల హడావుడి పైకి కనిపించినప్పటికీ సైలెంట్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని, మహిళల ఆదరణతో మంచి ఓట్లు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. -
పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది?
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటింగ్ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన నిశ్శబ్ద ఓటింగ్ తమను గెలిపిస్తుందని అంటున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను కట్టడి చేసేందుకు బుధవారం అర్థరాత్రి నుంచి అనుసరించిన ఎదురు దాడి వ్యూహం.. పోలీసులు, ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి అధికార పార్టీ నేతలను కట్టడి చేయడం మంచి ఫలితాలను ఇచ్చాయని పేర్కొంటున్నారు. పోలింగ్‌కు ముందు నుంచే టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, ఎన్నికల అక్రమాలకు పాల్ప డుతోందనే ప్రచారంతో అధికార పార్టీని నిలువరించగలిగామని.. బీజేపీ చేపట్టిన కార్యాచరణకు విస్తృతంగా ప్రచారం రావడంతో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. యువత వెల్లువెత్తడం అనుకూలమే.. గురువారం పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచే తమ కుటుంబసభ్యులు, ఇతర వర్గాల వారిని ఓటింగ్‌కు వచ్చేలా ప్రోత్సాహంలో యువత కీలకపాత్ర పోషించిందని బీజేపీ నేతలు అంటున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ బూత్‌లకు యువ ఓటర్లు వెల్లువలా వచ్చి ఓటేయడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలం పరిధిలో బీజేపీ ప్రభావం బాగా కనిపించిందని.. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మునుగోడు ఓటర్ల మొగ్గు బీజేపీవైపే ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సరళిపై పరిశీలన గురువారం ఉదయం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి రాత్రి ముగిసేదాకా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఓటింగ్ సరళిని పరిశీలించారు. మునుగోడులోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఓట్లు పడుతున్న తీరు, గంటకు గంటకు నమోదైన ఓటింగ్ శాతం, ఏయే వర్గాలవారు అధికంగా ఓటింగ్‌కు వస్తున్నా రన్న అంశాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకున్నారు. వాటికి అనుగుణంగా గ్రామాలు, మండల స్థాయిల్లో తమ పార్టీ నాయ కులు, కార్యకర్తలను అప్రమత్తం చేశారు. పార్టీకి పట్టున్న గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలు పోలింగ్‌బూత్‌లకు చేరుకునేలా సమన్వయం చేశారు. -
గులాబీ వైపే మునుగోడు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ కూడా తమ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డిపై విజయం సాధిస్తారని పార్టీ అంచనా వేస్తోంది. 47 మంది అభ్యర్థులు రంగంలో ఉన్న ఈ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ప్రధాన ప్రతిపక్షాలపై మొదట్నుంచీ తమదే పైచేయి అని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నేతలకు కేసీఆర్, కేటీఆర్ ఫోన్లు పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సరళి, పార్టీ అభ్యర్థి సాధించే ఓట్ల శాతంపై పలు సంస్థలు, నిఘా వర్గాలతో పాటు పార్టీ యంత్రాంగం నుంచి అందిన నివేదికల ఆధా రంగా గెలుపుపై అధికార పార్టీ అంచ నాకు వచ్చింది. బూత్‌ల వారీ ఓటింగ్ సరళిపై టీఆర్ఎస్ నేతలు ఎప్పటి కప్పుడు ఆరా తీస్తూ క్షేత్రస్థాయి పరిస్థితు లపై నివేదికలు అంద జేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉదయం నుంచే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పార్టీ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులతో పలు దఫాలుగా ఫోన్లో మాట్లాడారు. ఎక్కడెక్కడ ఏ విధంగా పోలింగ్ జరుగు తున్నదీ, పార్టీ అనుకూల వైఖరి అడిగి తెలుసు కున్నా రు. వివిధ పార్టీల ప్రలోభాల పర్వం ఎంతమేర ఓట రుపై ప్రభావం చూపిందనే కోణంలోనూ ఆరా తీసి నట్లు సమాచారం. ఒకటీ రెండు మండలాల్లోనే బీజేపీ నుంచి గట్టి పోటీ ఉందని, కాంగ్రెస్‌తో పెద్దగా ఇబ్బంది లేదనే అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫలించిన ప్రచార వ్యూహం ఉప ఎన్నికలో పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే విపక్ష పార్టీలపై పైచేయి సాధించగలిగామని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడు తున్నారు. నియోజక వర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు 70 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లను మోహరించడం, ప్రతి వంద మంది ఓటర్లుకు ఒకరు చొప్పున పార్టీ నేతలను ఇన్చార్జిలను నియమించడం కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. మరోవైపు సామాజిక పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు గంప గుత్తగా టీఆర్ఎస్కే ఓటు వేశారని, రైతుబంధు వంటి పథకాల లబ్ధి దారుల్లో మెజారిటీ ఓటర్లు తమ వైపే మొగ్గుచూపినట్లు టీఆర్ ఎస్ లెక్కలు వేసుకుంటోంది. మును గోడు నియోజకవర్గం బయట 40వేల ఓట్లు ఉండగా, ఇతర పార్టీలతో పోలిస్తే తామే వారిని ఎక్కువ సంఖ్యలో చేరుకో గలిగామని చెబుతోంది. గురువారం హైదరా బాద్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి మునుగోడులోని స్వస్థలా లకు వచ్చిన ఓటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా అధినేత కేసీఆర్‌కు ప్రచార ఇన్చార్జిలు నివేదించారు. కాంగ్రెస్, బీఎస్పీ సాధించే ఓట్లపైనా లెక్కలు ఇదే సమయంలో ఏయే అంశాలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయనే కోణంలో కూడా కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. మహిళా ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వారు ఎటు వైపు మొగ్గు చూపారనే కోణంలో వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించే పనిలో టీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సాధించే ఓట్లపైనే టీఆర్ఎస్ ఆధిక్యత ఆధారపడి ఉందని భావిస్తోంది. బీఎస్పీతో పాటు కేఏ పాల్ సాధించే ఓట్ల శాతంపైనా టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. -
మునుగోడు ఎన్నిక ఉందనే సైలెంట్‌గా ఉన్నా.. కేసీఆర్ సీరియస్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కాగా, ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది. నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితి నాది. నిరుద్యోగం పెరిగిపోయింది. రూపాయి విలువ పడిపోయింది. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ఉందనే ఇన్ని రోజులు ఓపిక పట్టి మాట్లాడలేదు. మునుగోడు ఎన్నిక ప్రచారంలో ఎన్నో అబద్ధాలు మాట్లాడారు. ఈసీ కూడా వారికి అనుకూలంగా పనిచేయాలా?. ఈసీపై దిగజారుడు ఆరోపణలు చేశారు. ఈసీపై కూడా చిల్లర ఆరోపణలు చేశారు. మీకు నచ్చినట్టు ఈసీ చేసే.. బాగా పనిచేసినట్టా?. ఏ వ్యవస్థనూ బీజేపీ లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నన్ను కలిసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఇది అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న మాట. ఇలాంటి దుర్మార్గమైన పనులు సరికాదు. ఇంతలా దిగజారి ప్రవర్తించడం సరికాదు. ఫేక్ వార్తలలో భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. ఎన్నికలైన తర్వాత ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులకు సంయమనం ఉండాలి. ఎమ్మెల్యేల కొనుగోలుపై గంట వీడియో ఉంది. దేశంలో అన్ని న్యూస్, ఏజెన్సీలకు, సీఎంలకూ వీడియోలు పంపిస్తున్నాము. మీ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ దేశ ప్రధాని చెబుతారు. ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి వాంఛనీయామా?. సుప్రీంకోర్టు సహా దేశంలో న్యాయమూర్తులను చేతులు జోడించి కోరుతున్నా.. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దేశంలోని న్యాయమూర్తులందరికీ వీడియో పంపిస్తాను. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికీ కూడా వీడియో పంపిస్తాను. ఇలాంటివి సహించాలా?. దీని వెనుక ఉన్నది ఎవరు?.ఇప్పుడు చూపించే వీడియోలు చూసి నివ్వెరపోతారు. రోహిత్‌రెడ్డిని కలిసి ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. దీనిపై రోహిత్‌రెడ్డి మాకు ఫిర్యాదు చేశారు. రోహిత్‌రెడ్డిని ఎలా ప్రలోభాలకు గురిచేశారో మీకే చూస్తారు. -
మునుగోడు పోలింగ్ జాతర.. పోటెత్తిన ఓటర్ మహాశయులు (ఫొటోలు)
-
మునుగోడు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో ఆ పార్టీదే హవా..!
-
మునుగోడు: బండి సంజయ్ ఆగ్రహం.. ఈసీపై షాకింగ్ కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కాగా, సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఉప ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, మునుగోడు ఎన్నికల సరళిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచింది. ఈసీ టీఆర్ఎస్కు కొమ్ముకాసింది. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది బీజేపీనే’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈనెల 6న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
-
మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది : బండి సంజయ్
-
‘మునుగోడులో 98 ఫిర్యాదులు వచ్చాయి.. 70 మంది స్థానికేతరులను గుర్తించాము’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉప ఎన్నిక ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఎన్నిక సరళిపై మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాము. పలుచోట్ల నగదు, బంగారం, చీరలు సీజ్ చేశాము. 8.27 కోట్ల వరుకు నగదు, ఇతర వస్తువులు, 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాము. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 98 ఫిర్యాదులు వచ్చాయి. 70 మంది స్థానికేతరులను బయటకు పంపించాము. నల్లగొండలో ఈవీఎంలను భద్రపరుస్తాము. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. కౌంటింగ్‌లోనూ మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాము. ఈ నెల 6వ తేదీన కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాము. స్థానికేతరలను గుర్తింపు కోసం బృందాలు ఏర్పాటు చేశాము అని తెలిపారు. -
మునుగోడులో పోలీసుల లాఠీచార్జ్.. కోట్ల రూపాయల బెట్టింగ్‌లు!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, చండూరు, కొరిటికల్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక, మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మునుగోడులో పోలింగ్ జోరందుకుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, తండావాసులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మునుగోడులో 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. క్యూలైన్లలో ఓటర్లు బారులుతీరడంతో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక, 2018లో మునుగోడు నియోజకవర్గంలో 91.3 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో రకంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఫేక్ ప్రచారాల గోల..
-
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
ఓటు హక్కు వినియోగించుకున్న రాజగోపాల్ రెడ్డి
-
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి : ఎన్నికల అధికారి వికాస్ రాజ్
-
Munugode: ఉప ఎన్నికకు కారణం స్వార్థమే!.. ఈ రెండు అంశాలే కీలకం..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాల పరిమితి ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరైంది కాదు. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే తప్పుడు సంకేతం ప్రజలకు ఇవ్వడం ఒకటి కాగా, రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి ఆయన తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్ని కల్లో పోటీ చేయటం వింతైన రెండో అంశం. మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరక్కపోతే శాసనసభ్యుడిగా ఆయన చట్టసభలో ప్రభు పై ప్రజా వాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషి చేయాలి. ఆ పని చేయకుండా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరికాదు. వాస్తవంగా తన సొంత ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశంలో గుర్తించబడిన కాంట్రాక్టర్ల లిస్టులో వీరి కుటుంబం ఒకటి. కేంద్ర బీజేపీ పాలకులు తనకు 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పని కట్టపెట్టారని ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. తన స్వప్రయోజనాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో... ఆయనకు భయం పట్టుకుంది. మునుగోడు నియోజక వర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన రాజగోపాల్ రెడ్డి, ఆయనకి బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు కమ్యూనిస్టుల మీద విమర్శలకు దిగటం తగదు. బీజేపీ దక్షిణ తెలంగాణలో కృత్రిమ ఊపును... ఒక్క మాటలో చెప్పాలంటే వాపును సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డిని ఒక ఎరగా ప్రయోగించి బలపడడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి తమకు అనూకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామ రూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ టీఆర్ఎస్ శాసన సభ్యులను వందల కోట్ల రూపాయలతో కొనడానికి చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీ పాలకులు ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఉప ఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని, బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకుంది. అందుకు రాజగోపాల్ రెడ్డి కుటుంబం, బీజేపీకి బలమైన ఎరగా కనబడింది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకి సంబంధించి భారతీయ జనతాపార్టీ అంతర్గత ఎజెండాను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మతతత్త్వ విచ్ఛిన్న కర, ఫాసిస్ట్ విధానాల్ని తిప్పికొట్టేందుకు, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. రానున్న ప్రజా తీర్పు దేశ ప్రజలకు ఆదర్శం కాబోతోంది. వ్యాసకర్త సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు- జూలకంటి రంగారెడ్డి -
మునుగోడులో పట్టుబడ్డ డబ్బు, మద్యం
-
నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో తన వెంట గన్మెన్లు లేకపోతే తన తలకాయ ఉండేది కాదని ఈటల పేర్కొన్నారు. తనను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనపై ఈగ వాలినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ దాడి ఘటనలో తన పీఆర్ఓ చైతన్య, గన్‌మ్యాన్ అంజయ్యలకు గాయాలయ్యాయని తెలిపారు. తమ మీటింగ్ వద్దకు వచ్చి దాడిచేసి, వారిపైనే దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమితో తనపై కేసీఆర్ పగ పట్టారని ఆరోపించారు. తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయన్నారు. హుజూరాబాద్‌లో అవసరం లేకున్నా అనేకమందికి గన్ లైసెన్సులు ఇచ్చారని విమర్శించారు. రాళ్లు రువ్వారు..జెండా కర్రలతో కొట్టారు పలివెల గ్రామంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని సైతం అడ్డుకున్నారన్నారు. కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని, పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోందని ఈటల ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని, జెండా కర్రలతో కొట్టారని చెప్పారు. డీఎస్పీని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి కొట్టారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క కారుతో అర్ధరాత్రి కూడా తిరిగే వాళ్ళమని, కేసీఆర్ హయాంలో బయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని, తొమ్మిదేళ్లు ఏమీ చెయ్యకుండా.. మొన్న వచ్చి 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రిని కడతా, రోడ్లు వేయిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
మునుగోడులో ప్రారంభమైన పోలింగ్
-
మునుగోడు వార్
-
బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి : కేటీఆర్
-
KTR: మునుగోడులో సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు మండలంలోని పలివెలలో జరిగిన ఘర్షణను సూచిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ నుంచి ఆదేశాలతోనే బీజేపీ హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ నుంచి ఆదేశాలతో బీజేపీ హింసకు పాల్పడుతోంది. ఎవరు ఎవరి మీద ఎవరు దాడి చేసరో వీడియోలు ఉన్నాయి. ఈటల పీఏ రాళ్ల దాడి చేశారు. మా పై దాడి చేసి.. మళ్ళీ సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాంతి ఉంది. బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉంది. బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. మునుగోడులో బీజేపీ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఇదే సంస్కృతి కొనసాగిస్తే.. మేము తిరగబడతాము. బీజేపీ,మోదీలు ఫేకులు.’అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇదీ చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ.. మునుగోడులో ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు, గన్ లైసెన్స్‌లపై ఈటల అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వంచన చేరి భాష, న్యాయం, ధర్మం పేరుతో సానుభూతి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన నిలబడిందే కౌరవుల వైపు అంటూ దుయ్యబట్టారు. బీజేపీ నేతలే టీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ నేతలే దాడులు చేశారని, మునుగోడులో మెజారిటీ రాదనే విషయమే అర్థమయి ఇలాంటి పనులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అందుకే రాజేందర్ సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమికి సాకులు వెతుక్కుంటూ అసత్యలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు హింస నచ్చదు.. శాంతియుతంగా ఎన్నికలకు వెళ్లాలనే కోరుకుంటారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నో ఘర్షణలు ఉండేవని, టీఆర్ఎస్ వచ్చాక ఒక రాజకీయ ఘర్షణ జరగలేదని తెలిపారు. ‘తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఉత్తప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు. దుర్మార్గమైన పార్టీలో చేరి ఏదో మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో ఉన్న శాంతి భద్రతలు, రక్షణ ఇంకెక్కడ లేదు. షీటీమ్స్ ఎంతో బాగా పనిచేస్తున్నాయి. ఎవరు ఎటు వైపు ఉన్నారో, ఎవరు కౌరవుల వైపు చేరారో అన్ని ప్రజలకు తెలుసు. దాడులు దాడులు అంటున్నరు.. ఎవరు దాడులు చేశారో అన్ని సాక్షాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సోదాలేమి మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేయవు.. ప్రజలు మా వైపు ఉన్నారు. మాతో ఉన్నారు. నా పీఏలపై ఎక్కడా సోదాలు జరగలేదు. నా సన్నిహితుడుపై జరిగింది’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి .. -
మునుగోడు: ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్?!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హోటల్స్‌లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్ లు పుచ్చుకుంటున్నారని సమాచారం. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్‌ను.. బుకీలు రౌండ్ రౌండ్‌కు బెట్టింగ్ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ వ్యవహారం నడుస్తోంది. -
ప్రచార గడువు ముగిసిన మునుగోడులోనే తిష్టవేసిన నాన్ లోకల్స్
-
మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి ..
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.ఎన్నికకు(నవంబర్3) ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు పంచాలని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. ఇదిలా ఉండగా ప్రచారం గడువు ముగిసినా మునుగోడులో నాన్ లోకల్స్ తిష్ట వేశారు. మునుగోడు మండలం కోతులారంలో 30 మంది నాన్ లోకల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తే భోజనాల కోసం ఆగమంటూ తలా తోక లేని సమాధానాలు చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలోని చాలాచోట్ల ఇతర జిల్లాల నేతలు మకాం వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు! -
Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!
నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఎటువైపో.. గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. -
రేపే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
-
మునుగోడులో 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: కేఎ పాల్
నల్గొండ: 50వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివైన మునుగోడు ప్రజలు తనకే అండగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలు ప్రధాన పార్టీలను ఓడిస్తారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. హైదరాబాద్‌కు తాను ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకురావడంతో అభివృద్ధి చెందిందని.. అదే మాదిరిగా మునుగోడుకు సైతం తీసుకొస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100–112 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చు మునుగోడుకు ఇస్తే ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తున్నానని తెలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన బహిరంగ సభను రద్దు చేసుకున్నాడని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. వారంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు. -
సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం! కంటతడి పెట్టనీయకండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో... సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు. ఆడబిడ్డను కంటతడి పెట్టనీయకండి. నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించి ఉప ఎన్నికల్లో గెలిపించండి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోయాక ఆయన భార్య బయటికి రాలేదని, ఇప్పుడు వారి బిడ్డ స్రవంతిని ప్రజల చేతుల్లో పెట్టడానికి ఆమె ఇక్కడికి వచ్చారన్నారు. ఇప్పటి నుంచి స్రవంతి నియోజకవర్గ ప్రజల బిడ్డ అని చెప్పారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో రేవంత్ మాట్లాడారు. ఇప్పుడు స్రవంతిని గెలిపిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది మహిళలకు టికెట్లు ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు. ఆ నలుగురిలో స్రవంతి కూడా ఉంటుందని చెప్పారు. స్రవంతిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతోందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిన మోసం, కేసీఆర్ చేసిన ధోకాపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. కేసీఆర్‌ను పాతిపెట్టండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరికీ రాని అవకాశం ఇక్కడి ప్రజలకు వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను మోసం చేసి నట్టేట ముంచి ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కేసీఆర్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. గుజరాత్, ఢిల్లీ నుంచి తెచ్చిన సీసాలు, నోట్ల కట్టలతో ఓట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.1,100 ఎందుకు అయిందని బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 2014లో ఎమ్మెల్యేగా గెలిíపించినా మునుగోడుకు జూనియర్ కాలేజీ కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. కిష్టరాయినిపల్లె, చర్లగూడెం, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొత్తవారేం కాదని, వారి రంగు ఏంటో అందరికీ తెలుసని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి: స్రవంతి ప్రజలందరి ఆదరాభిమానాలతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దిగానని, అడుగడుగునా ఒక ఆడబిడ్డను టీఆర్ఎస్, బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ‘మా తండ్రి సహకారంతోనే రాజకీయంగా ఎదిగిన వారు నన్ను మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడుపోయారు. నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు. కేవలం నా తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే పోటీచేస్తున్నా’ అని చెప్పారు. ఒక్కోసారి తాను అలిసిపోయానని అనిపిస్తుందంటూ స్రవంతి కంటతడి పెట్టారు. ఇది స్రవంతి ఎన్నిక కాదని, బడుగు బలహీన వర్గాల ఎన్నికని, ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రంజితా రంజన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి మహిళలు తమ శక్తిని చాటాలన్నారు. ఈ సభలో తమిళనాడు ఎంపీ జ్యోతిమణి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
సోషల్‌మీడియాలోనూ ప్రచారం బంద్.. బల్క్ మెసేజ్‌లు పంపడం కూడా..
నల్లగొండ, చండూరు: ఈ నెల 3న నిర్వహించే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించాక.. చండూరు, కోటయ్యగూడెం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందని.. õసోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో ప్రచారం చేయొద్దని, సైలెంట్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత బల్క్ షార్ట్ మెసేజ్ సర్వీస్ ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడం కూడా నిషేధించబడిందని ఆయన చెప్పారు. మోడల్ కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించామని తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తును పరిశీలించి, ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ఇలాంటి దాడులు చేయడం సహజం : మంత్రి జగదీష్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
రెచ్చగొట్టే చర్యలతో దాడులకు దిగారు : ఈటెల రాజేందర్
-
తమపై తామే దాడి చేసుకుని టీఆర్ఎస్ పై దుష్ప్రచారం : హరీష్ రావు
-
టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి.. మీ ఆస్తులన్నీ బయట పెడతా: బండి సంజయ్
సాక్షి, నల్గొండ: మునుగోడు అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్ అంతర్జాతీయ అంశాలు మాట్లాడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దని సూచించారు. కేసీఆర్ ముందు కొందరు ఉద్యోగులు మోకరిల్లుతున్నారని.. ప్రమోషన్ల కోసం టీఎన్జీవో ఉద్యోగులు సాగిలపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు నాంపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నలుగురు టీఎన్జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు .టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని. మీరే చెప్పాలని తెలిపారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే ఉంటానని. తమ ఆస్తులను మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. ‘కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. ఆయన హామీలను ప్రజలు నమ్మడం లేదు. మా కార్యకర్తలు ప్రలోభాలకు లొంగలేదు. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోంది. కుల సంఘాలు మరోసారి ఆలోచించాలి. ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో సర్కస్ చూపించారు. బెల్ట్ షాప్‌లు పెట్టి గౌడ కులస్తుల పొట్టకొట్టారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. కౌలు రైతులు, పత్తి రైతులకు ఏం చేశారు.’ అని టీఆర్ఎస్పై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ సామాన్యుడి బతుకు నాశనం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేశారు. మోదీ అధికారంలో వచ్చినప్పుడు రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. మోదీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇవాళ 110 రూపాయలకు చేరింది. కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి చేరవేసేందుకే డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట్ సమీపంలోని పూడూరుకు చెందిన కడారి శ్రీనివాస్, జూబ్లీహిల్స్‌రోడ్‌నం.82లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ కార్యాల యం నుంచి రూ.89.92 లక్షలు తీసుకొని టీఎస్ 27డి7777 థార్ కారులో వెళ్తున్నాడు. భారతీయ విద్యాభవన్ స్కూల్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బ్యాగుల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించడంతో విచారించగా శ్రీనివాస్ నుంచి సరైన సమాధానం రాలేదు. డబ్బుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తాను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ జనార్ధన్ డ్రైవర్‌నని, త్రిపుర కన్స్ట్రక్షన్స్ నుంచి డబ్బు తీసుకొని రావాల్సిందిగా జనార్ధన్ చెప్పగా వచ్చానని, ఆ మేరకు నగదు తీసుకుని వస్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. డబ్బు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి చేర్చడానికి వెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తి అంగీకరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆ మేరకు నేరాంగీకార వాంగ్మూలం నమోదుచేశారు. శ్రీనివాస్‌కు సెక్షన్ 41(ఏ) నోటీసు అందజేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
...సైగలతో ఓటు అడుక్కుంటున్నాడు!
...సైగలతో ఓటు అడుక్కుంటున్నాడు! -
చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చిన వారి వద్ద గుళ్లు, సామాజిక అవసరాలకు పార్టీలతో ప్రమేయం లేకుండా హామీలు తీసుకున్నారు. కానీ ఓటు వేసే విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తున్నారు. తమ అంతరంగాన్ని ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓటరు తీరు ప్రధాన రాజకీయ పార్టీల అంతరంగంలో తుఫాన్ సృష్టిస్తోంది. అయితే ప్రధాన పార్టీల ప్రలోభాల ప్రభావం ఓటర్లపై కొంతమేర ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పార్టీల నాయకులు గెలుపును సవాల్‌గా తీసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీరోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి నల్లాలు ఇలా పలు సమస్యలకు సంబంధించి ఓటర్లు.. అభ్యర్థుల నుంచి కొన్నిసాధించుకోగా, మరికొన్నింటికి హామీలు పొందారు. అయితే ఓటు వేసే విషయంలో ఎవరికి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముందే వసూలు సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామస్తులు ఓ పార్టీ బహిరంగ సభ కోసం వెళ్లేందుకు ఇస్తామన్న డబ్బును ముందుగానే తీసుకున్నారు. సభ కోసం వెళ్లడానికి గ్రామంలో వాహనం ఎక్కిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఇన్చార్జి నాయకులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్రామ శివారులో వాహనం ఆపి డబ్బులు ఇచ్చిన తర్వాతే సభకు బయలుదేరారు. రెండు పార్టీల సహాయం పొందారు చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఓటర్లు మాతమ్మ గుడి అభివృద్ధికి రెండు పార్టీల సహకారం కోరారు. దీంతో ఓ పార్టీ నాయకులు దేవాలయం చుట్టూ కాంక్రీటు, దేవాలయానికి టైల్స్, ఆలయం ముందు పైకప్పుకు రేకులు వేయించారు. మరో పార్టీ.. ఆలయం ముందు భవన నిర్మాణం చేపట్టింది. రెండు పార్టీలను వాడుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. ఇంకా నిర్ణయించుకోలేదు ఒక్కో అభ్యర్థి ఒక్కో రీతిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతోంది. వాళ్లు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. – సుర్కంటి విజయ్, ఎల్లంబావి, చౌటుప్పల్ మండలం ఆలోచిస్తున్నాం ఎవరికి ఓటు వేయాలన్నది ఇంకా ఆలోచిస్తున్నాం. మాకు మంచి చేసిన వాళ్లకే ఓటు వేస్తాం. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – దోర్నాల సత్యనారాయణ, నారాయణపురం సరైన వ్యక్తికి ఓటు వేస్తా నాకు కొత్తగా ఓటు హక్కు లభించింది. ఇంతలోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేస్తాను. – ఎండీ సోహెల్, చౌటుప్పల్ -
మునుగోడులో గడువు దాటాక స్థానికేతరులు ఉండొద్దు: సీఈఓ వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం6 గంటలతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులెవరూ ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన స్థానికేతరులు సాయంత్రం 6 గంటల లోగా వెళ్లిపోవాలని, లేకుంటే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో స్థానికేతరులను గుర్తించడానికి లాడ్జీలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లను సోమవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 105 సమస్యాత్మక కేంద్రాలు నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని, మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఈఓ తెలిపారు. అందులో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు. 2,41,795 మంది సాధారణ ఓటర్లతో పాటు 10 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్ రోజున 15 కేంద్ర బలగాలతో పాటు 3,366 మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గం సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా పెట్టామన్నారు. ఇప్పటివరకు రూ.6.8 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 111 బెల్ట్ షాపులను మూసివేయించామని చెప్పారు. విధుల్లో 1,492 మంది సిబ్బంది మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభించనున్నారు. మొత్తం ఉప ఎన్నికకు సంబంధించి 1,492 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా మరో 300 మంది అందుబాటులో ఉంటారు. దివ్యాంగ ఓటర్లతో పాటు 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోలింగ్ స్టేషన్లలో వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం ప్రకటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 821 మందిని బైండోవర్ చేయడంతో పాటు వివిధ రకాల కేసులు 40,065 నమోదు చేశారు. ఈసీకి రాజగోపాల్‌రెడ్డి వివరణ తన కుటుంబ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి రూ.5.24 కోట్లను మునుగోడులోని కొందరికి బదిలీ చేసినట్టు టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణను ఎన్నికల సంఘానికి పంపించామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సీఈఓ కార్యాలయంపై రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, ఓ అభ్యర్థి ఎన్నికల గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించిన వ్యవహారంలో తమ కార్యాలయం పాత్ర ఏమీ లేదని తెలిపారు. -
డబ్బుల బదిలీ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి
-
చండూరు సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: కిషన్‌రెడ్డి
-
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీష్‌రావు
-
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్ఏగా మారిందని దుయ్యబట్టారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి.. ‘‘ప్రజలపై భారం మోపిందెవరో ప్రజలకు తెలుసు. దొడ్డిదారిన ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర బీజేపీది. రాజ్యసభ ఎంపీలను బీజేపీ విలీనం చేసుకోలేదా?. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నటి సీఎం కేసీఆర్ సభ తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్ అయిందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
అబద్ధాలు నాటే యత్నం: ఈటల
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం ద్వారా మునుగోడు ప్రజల మెదళ్లలో పచ్చి అబద్ధాలు నాటి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల విశ్వసనీయత కేసీఆర్ కోల్పోయారని, ఆయన మాటలు ఎవరూ నమ్మబోరని అన్నారు. కేసీఆర్‌కు మునుగోడు గడ్డమీద ఓటు అడిగే నైతికత లేదని ఈటల ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడు సభలో నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు అని కేసీఆర్ చెబుతున్నారని, వీరిలో ముగ్గురు పార్టీ మారినా రాజీనామా చేయాలనే సంస్కారం లేనివారని మండిపడ్డారు. అలాంటి వారిని పరమ పవిత్రులు అని చెప్పడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సీబీఐ రావద్దంటూ జీవో ఇచ్చారంటే రాజ్యాంగ సంస్థల మీద కేసీఆర్‌కు నమ్మకం లేదా? అని నిలదీశారు. వామపక్ష నేతలను అటు ఒకరిని ఇటు ఒకరిని కూర్చోబెట్టుకున్నంతమాత్రాన కేసీఆర్ పవిత్రుడు కాలేరన్నారు. లెఫ్ట్ పార్టీలను బొంద పెట్టాలని కేసీఆర్ అన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని.. ఆ నగదుకు సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలలోగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఉప ఎన్నిక పోలింగ్ సమీస్తున్న సమయంలో ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది. మునుగోడులోని ఖాతాలను నగదుతో.. మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నగదు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఈ నెల 29న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన 23 వేర్వేరు వ్యక్తులు/కంపెనీల ఖాతాలకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని.. ఆ ఖాతాలను సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రూ.5.24 కోట్లు పొందిన మునుగోడు వ్యాపారులు, ఇతర వ్యక్తులకు సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నగదును దేనికి బదిలీ చేశారు? టీఆర్ఎస్ ఆరోపించిన విధంగా రాజగోపాల్‌రెడ్డి ద్వారాగానీ, ఆయన ఆదేశానుసారం కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారాగానీ 23 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన రూ.5.24 కోట్లను ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగించట్లేదని నిర్ధారించాల్సిన బాధ్యత రాజగోపాల్‌రెడ్డిపై ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం అవినీతి పద్ధతి అని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సోమవారం సాయంత్రం 4 గంటలలోపు పూర్తి వివరణ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణతో సంతృప్తి చెందని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు. -
రేకులుగా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టుబడింది. రూ.1.90కోట్ల విలువైన బంగారాన్ని ఆది వారం తెల్లవారుజామున ఎస్ఎస్టీ(స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా దుబాయ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా ప్యాక్ చేసి అండర్వేర్లలో ఉంచుకొని విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్‌కు వస్తుండగా, పంతంగి టోల్గేట్ చెక్‌పో స్టు వద్ద పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. వారి నుంచి బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు నిమిత్తం డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా గా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లా రు, బంగారం ఎవరిచ్చారు, ఎయిర్ పోర్టులను దా టుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు, లేదంటే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎవరైనా బంగారం ఇచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. -
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్
సాక్షి, హైదరాబాద్: చండూరు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాత రికార్డునే చండూరు సభలో ప్లే చేశారని విమర్శించారు. అభద్రతాభావం, అపనమ్మకం కేసీఆర్‌లో కనిపించిందని అన్నారు. కేసీఆర్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. ఆరోపణలు, హామీలపై కేసీఆర్ అవాస్తవాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. నలుగురు హీరోలని కేసీఆర్ చెబుతున్న నేతల పార్టీ ఫిరాయించిన వారేనని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 40 లక్షల టర్నోవర్ వరకూ ఏ రకమైన జీఎస్టీ లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. జీఎస్టీ టారిఫ్ నిర్ణయించింది కేంద్రం కాదని.. జీఎస్టీ కౌనిల్స్ అని తెలిపారు. చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీ కౌన్సిల్లో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ‘వాజ్‌పేయి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోఐరైడ్ సమస్యను పూర్తిగా పక్కన పెట్టింది. మోదీ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి రూ. 800 కోట్లు ఖర్చు చేసింది. యూపీఏ మయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. అప్పుడెందుకు మాట్లాడలేదు?. 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారు. ఈ తొమ్మిదేళ్లలో మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఇదే మునుగోడు ఎన్నికల సభలో గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీ దగ్గర అంత పెద్ద సినిమా ఉంటే ఎందుకు న్యాయ స్థానానికి వెళ్లలేదు. మీరు చేసే కుంభకోణాలు కప్పించుకోవడానికే సీబీఐని అడ్డుకున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కార్పొరేట్ గద్దలకు బీజేపీ 14 లక్షల కోట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నిధులు ఇవ్వడం చేత కాదా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే మనల్ని నూకలు తినమన్నారని, నూకలు తినమన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. చండూరు సభ వేదికపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. ఈ నలుగురు అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. చదవండి: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న వడ్లు కొనడం చేతకాని వారు వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారని.. ఢిల్లీ బ్రోకర్లు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. ‘నేను రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదదవిలో ఉన్నాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. మతోన్మాద శక్తులను తరిమేస్తే తప్ప దేశం బాగుపడదు. టీవీల్లో చూసింది చాలా చిన్నది. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న
LIVE UPDATES: ‘మునుగోడులో యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం చేనేతలకు చేశారు. నేతన్నలపై జీఎస్టీ విధించి మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారు. చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?. పెట్టుబడి దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్ పెడతామన్న వారికే మీటర్ పెట్టాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి. మోదీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ►కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. ►మోదీ గారు మీకు ఇంకా ఏం కావాలని.. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిపై విచారణ జరగాలన్నారు. వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చినవారు చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా? ►చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఫలితం కూడా మీరు(ప్రజలు) ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. ఎలక్షన్ వస్తే చాలు కొందరు హడావిడీ చేస్తరని.. గాయ్.. గాయ్ గత్తర్ గత్తర్ లొల్లి నడుస్తుందని అన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని సీఎం సెటైర్లు వేశారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు. దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా అని ప్రశ్నించారు. సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికకు మరో నాలుగు రోజులు సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని మరింత జోరు పెంచాయి. బహిరంగ సభలు, సహావేశాలతో హోరెత్తనున్నాయి. సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కాసేపట్లో చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం ఇప్పటికే కేసీఆర్ చండూరు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహరంపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. దీంతో చండూరు సభ వేదికగా సీఎం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
మునుగోడు ఉప ఎన్నిక: జూనియర్ కేసీఆర్ హంగామా (ఫోటోలు)
-
చండూరులో కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో, ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా పారీ్టకి ఊపు తెచ్చేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మరో సభను చండూరులో ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన సమీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. చండూరు సభకు ప్రాధాన్యత ఒకవైపు మునుగోడులో అన్ని రాజకీయ పక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో చండూరు సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీంతో చండూరు సభలో సీఎం ఏమైనా మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 20న జరిగిన సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి.. ఆదివారం జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంబంధం కలిగిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చండూరు సభకు సీఎం కేసీఆర్‌తో పాటు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయినందునే ఉప ఎన్నిక వచి్చందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదనే విషయాన్ని సభ ద్వారా చెప్పే అవకాశాలున్నట్లు తెలిసింది. భద్రతా కారణాల వల్లే అజ్ఞాతంలో.. ఎమ్మెల్యేలకు ఎర అంశంపై దర్యాప్తు దశలో స్పందించకూడదని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ ఘటనతో సంబంధం కలిగిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ నెల 26న పోలీసు భద్రత నడుమ ప్రగతిభవన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా వీరు ప్రగతిభవన్లోనే బస చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, భద్రతా కారణాల దృష్ట్యా వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. అయితే వారు తమ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
జగదీశ్‌రెడ్డి ప్రచారానికి బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనకుండా ఈసీ నిషేధం విధించింది. శనివారం రాత్రి 7 గంటల నుంచి 48 గంటల పాటు జగదీశ్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, మీడియా భేటీలు, టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న మంత్రి జి.జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ‘రాజకీయ పార్టీల మోడల్ ప్రవర్తనా నియమావళి సాధారణ ప్రవర్తన’పార్ట్ 1లోని సబ్ పేరా (4)ని ప్రాథమికంగా ఉల్లంఘించినట్లుగా ఈసీ భావించింది. దీనిపై వివరణ ఇవ్వాలని శుక్రవారం సాయంత్రం మంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా మంత్రి వివరణను సీఈసీ అందుకుంది. టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని తను ఎప్పుడూ ప్రసంగించలేదని మంత్రి వివరణ ఇచ్చారు. పథకాలను వివరించే ప్రయత్నం చేశామని.. తను చేసిన ప్రకటన అవినీతి విధానాల నిర్వచనం కిందకు రాదని తెలిపారు. ఫిర్యాదుదారు, బీజేపీ నాయకుడు కపిలవాయి దిలీప్‌కుమార్ చేసిన ఆరోపణలు కల్పితం, అవాస్తవమన్నారు. అయినా.. జగదీశ్‌రెడ్డి మోడల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. 48 గంటల పాటు మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపే ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ఇంటర్వ్యూలు, మీడియాలో (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) బహిరంగంగా మాట్లాడకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓడిపోతామనే బీజేపీ కుట్రలు.. అంతకుముందు నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారులను కలసి నోటీసుకు వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే రాజకీయ కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించడంతో పాటు సర్కారును పడగొట్టడానికి కుతంత్రాలు పన్నిందని ఆరోపించారు. -
గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తాం
మునుగోడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని త్వరలో గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తమ పార్టీకి సంబంధం లేదని శుక్రవారం యాదగిరిగుట్టలో తడిబట్టలతో సంజయ్ ప్రమాణం చేయగా, ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందుతాగి లక్ష్మీనర్సింహ్మస్వామి పేరు ఉచ్ఛరిస్తున్నందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. నాస్తికుడు దైవభక్తి గూర్చి మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నలుగురు ఎమ్మెల్యేలు తప్పుచేయకపొతే ప్రగతిభవన్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదని, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకపొతే దేవుడి వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ చేస్తుంది కాంగ్రెస్ జోడోయాత్ర కాదని, అది టీఆర్ఎస్, కాంగ్రెస్ జోడుయాత్ర అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, మమ్మల్ని విమర్శించే అర్హత ఆ బానిసలకు లేదని అన్నారు. మిగిలినివారికి సైతం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 31న నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 9 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటిల్లో తమ పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆరోపణలు నిజం కాదు: తరుణ్‌ఛుగ్ నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తోందని ఇటీవల వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అది అంతా సీఎం కేసీఆర్ ఆడిన డ్రామా అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కోనుగోళ్ల విషయంలో ఎలాంటి సంబంధం లేకపోతే బండి సంజయ్ సవాల్ మేరకు ఎందుకు యాదగిరిగుట్టలో ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు సంబంధం ఉన్నందునే ప్రమాణానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే గత 8 ఏళ్ల కాలంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యాడో కేసీఆర్‌కు సైతం అదే గతి పడుతుందన్నారు. మునుగోడు ఎన్నిక కేసీఆర్ అహంకారం వల్లే వచ్చిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు గంగిడి మనోహర్‌రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు షాక్.. జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొనరాదు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంత్రి, మునుగోడులో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెనర్ జగదీశ్వర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మునుగోడులో ఎన్నికల ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉత్తర్వుల్లో రానున్న 48 గంటల పాటు జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ సీఈసీ నిషేధం విధించింది. అయితే, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు(ఓటర్లను బెదిరించేలా ప్రసంగాలు చేశారని) ఎన్నికల సంఘం తెలిపింది. ఇక, ఈ ఆదేశాలు శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జగదీష్ రెడ్డి ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొనకూడదని, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని నిషేధం విధించింది. మరోవైపు.. మునుగోడులో ఉప ఎన్నిక నవంబర్ 3వ తేదీన జరుగనుంది. -
మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను సీజ్ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు. -
మంత్రి జగదీష్ రెడ్డికి షాకిచ్చిన ఎన్నికల సంఘం.. నోటీసులు జారీ!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మునుగోడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇక, పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా, తాజాగా మంత్రి జగదీష్ రెడ్డికి అనుకోని షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. రేపు(శనివారం) మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. -
మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్‌ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. (చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు) మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్‌రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు. (చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్‌లు) -
‘ఎర’పై గరం గరం!
సాక్షి నెట్వర్క్: ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర ఆరోపణలు, విమర్శలు, నిరసనలతో పరిస్థితి వేడెక్కింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ కుట్ర చేసిందంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ప్రతిగా టీఆర్ఎస్ కావాలనే బురద జల్లుతోందని, మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయం చేస్తోందని బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలుచోట్ల పోటాపోటీ నినాదాలు, రాస్తారోకోలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో మునుగోడుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఎంపీ కాన్వాయ్‌ను పంపించారు. ►మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీజేపీ తీరును నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో నల్ల దుస్తులు ధరించి ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని, బీజేపీ కుప్పిగంతులు సాగవని వ్యాఖ్యానించారు. ►సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ప్రధాని మోదీ, అమిత్‌షాల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించింది. ∙బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు వనపర్తి జిల్లా కొత్తకోట చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ►కరీంనగర్ జిల్లా మానకొండూరులో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి. వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసన తెలిపాయి. -
Munugode By Election: గడువు ముగిసే వరకు కదలొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార గడువు ముగిసేంత వరకు పార్టీ ఇన్చార్జిలు తమకు కేటాయించిన చోట ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఇన్చార్జిలతో గురువారం ఉదయం ప్రగతిభవన్ నుంచి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30న చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30న బహిరంగ సభ, 31న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నందున ఈ రెండు రోజులను మినహాయిస్తే ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినా పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఫోన్ ద్వారా పార్టీ స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను సవాల్‌గా తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు: కేటీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోవద్దు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్‌లు
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ కాక పెంచుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు హోరాహోరీ పోరు సలుపుతూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. నాయకులను ఆకర్షించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ను బిజెపి ఆకర్షిస్తే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ , మరో నేత దాసోజు శ్రావణ్,మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లను బిజెపి నుంచి టిఆర్ఎస్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ నేతలు గతంలో ప్రత్యర్ధి పార్టీలపై చేసిన విమర్శలు, ప్రతి విమర్శలకు తూచ్ పెట్టారని అనుకోవచ్చు. నాలుగు రోజుల క్రితం కూడా స్వామి గౌడ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విరుచుకుపడ్డారట. కాని అంతలోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకం ఉన్నవారందరిని తమ పోల్డ్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకుని వారికి ఆహ్వానం పంపడం,వారు చేరిపోవడం ఆసక్తికర పరిణామం.స్వామిగౌడ్ గతంలో ఉద్యోగ సంఘ నేత. ఆయనకు కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చైర్మన్ చేశారు. కాని ఈ పదవికాలం చివరిలో వీరిద్దరి మద్య ఎక్కడ తేడా వచ్చిందో కాని మాటలు లేకుండా పోయాయి.గౌడ్ ఒకప్పుడు మంత్రి పదవి ఆశించినట్లు చెబుతారు. దాని సంగతేమోకాని, టిఆర్ఎస్ కే రామ్ రామ్ అని చెప్పవలసి వచ్చింది. కాగా తాజాగా ఎలాంటి ఒప్పందం కుదిరిందో కాని తిరిగి స్వగృహానికి చేరుకున్నారు. ఇక శ్రావణ్ అయితే తొలుత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరి కేసిఆర్ కు సన్నిహితంగా మెలిగారు. కాని రాష్ట్ర సాధన తర్వాత తగు ప్రాధాన్యం లభించలేదని అలిగి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. పిసిసి అధ్యక్షుగా ఉత్తంకుమార్ రెడ్డిని తప్పించి ,రేవంత్ రెడ్డిని నియమించడం, తదుపరి ఖైరతాబాద్ నేత విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో ఆగ్రహం చెంది శ్రావణ్ బిజెపిలోకి వెళ్లారు. మంచి వాదనా పటిమ కలిగిన శ్రావణ్ తిరిగి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి పదవి వస్తుందో తెలియదు. టిఆర్ఎస్ ను వీడకుండా ఉన్నట్లయితే ఈపాటికే ఏదో ఒక పదవి వచ్చి ఉండేదేమో!. రాపోలు ఆనందభాస్కర్ ఒకప్పుడు జర్నలిస్టు. తదుపరి కాంగ్రెస్ పక్షాన గాంధీ భవన్ లో యాక్టివ్ గా ఉండేవారు. ఆ తరుణంలో బిసి వర్గంవారికి రాజ్యసభ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ అదిష్టానానికి రావడం, ఆ చాన్స్ రాపోలుకు దక్కడం జరిగింది. పదవీకాలం ముగిసిన కొన్నాళ్లకు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ గూటికి వెళ్లారు. వీరే కాదు. ఆయా గ్రామాలలో సర్పంచ్ లు, మండల పరిషత్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు ఇలా ఒక్కో కేటగిరికి ఒక్కో రేటు పెట్టి టిఆర్ఎస్ ,బిజెపిలు కొనుగోలు చేస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ.చికెన్, మద్యం బాటిళ్లు తెగ సప్లై చేస్తున్నారట. బస్ లలో ఇతర ప్రాంతాలకు టూర్ తీసుకువెళుతున్నారట. ఇలా ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు. చివరికి బిజెపి అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టిన వైనం శోచనీయంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక. ఆయన గెలిస్తే బిజెపి గెలిచినట్లుగా దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. బిజెపి ఓడిపోతే అది రాజగోపాలరెడ్డి ఖాతాలోకి వెళుతుంది. టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డికి ఆ సమస్య లేదు. టిఆర్ఎస్ గెలిచినా, ఓడినా అది ముఖ్యమంత్రి కెసిఆర్ , వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఖాతాలోకే వెళుతుంది. అందువల్ల ఇది కెసిఆర్, కెటిఆర్ లకు ఇది సవాల్ వంటిది. కెటిఆర్ స్వయంగా మునుగోడుపై దృష్టి పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన బిజెపి పెద్దలను, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ పెద్దలు, గద్దలు, దొంగలు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజగోపాలరెడ్డికి 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని అంటూ వివాదాస్పదం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెడుతున్నారు. దుబ్బాక, హుజరాబాద్ లలో ఓటమి నేపధ్యంలో టిఆర్ఎస్ ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. అందుకే 86 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో రంగంలో దించింది. బిజెపి కూడా పోటాపోటీగా తమ పార్టీ నేతలను ప్రచారంలో పెట్టింది.టిఆర్ఎస్ గుజరాత్ దొంగలు అంటూ విమర్శలు చేస్తుంటే, కెటిఆర్ నియోజవర్గం సిరిసిల్లను, కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తోందని బిజెపి నేతలువిమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటికి మల్లగుల్లాలు సాగుతున్నాయి. తనను ఒంటరి చేయడానికి కాంగ్రెస్ లో కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ కంటతడి పెట్టారన్న వార్త ఆ పార్టీకి నష్టం చేసింది. బిజెపి,టిఆర్ఎస్ లు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపణలు చేసినా పెద్ద ఫలితం ఉండడం లేదు. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నా , ఆర్ధికంగా చూస్తే బిజెపి, టిఆర్ఎస్ లతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడైన బిజెపి అభ్యర్ధి రాజగోపాలరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు లీక్ అయిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటి అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసే యత్నం చేసిందన్న ప్రహసనం, అదంతా టిఆర్ఎస్ చిల్లర రాజకీయం అన్న బిజెపి ఆరోపణతో తెలంగాణ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. -
‘మునుగోడు.. ఒక్కో ఓటర్‌కు 20 వేలు పంచారు!’
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా.. ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కోరారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పేరిట మూడు పేజీల వినతిపత్రాన్ని ఆయన్ని కేంద్ర ఎన్నికల కమీషన్‌కు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి.. ఎన్నికలు రద్దు చేసే విస్తృత అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణి, అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను సైతం తన వినతిపత్రంలో ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలోనే అతి ఖరీదైన ఉప ఎన్నికగా మునగోడు నిలవనుంది. మునుగోడులో ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 132 కోట్ల రూపాయల విలువైన మద్యం ఏరులై పారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అక్రమాలకు.. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిఓటర్‌కు రూ.20 వేల రూపాయల డబ్బు, మహిళలకు ఒక గ్రాము బంగారం ఇవ్వడానికి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి అని గోనె ప్రకాష్‌రావు ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మందు పంపిణీ కట్టడి చేసి.. ఎన్నికలు రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు ఆయన. ఇదీ చదవండి: టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ -
నైతిక విలువలు లేకుండా పార్టీలో చేర్చుకున్నది మీరు
-
ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటమి తప్పదని తెలిసి టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్‌హౌజ్ ఘటన టీఆర్ఎస్ కుట్రగా వర్ణించారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చరిత్ర టీఆర్ఎస్దేనని మండిపడ్డారు. ఫిరాయింపులకు పెద్ద పీట వేసింది కేసీఆర్.. ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నైతిక విలువలు లేకుండా అనేకమందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. తాము బ్రోకరిజం చేశామంటున్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఏ పార్టీ నుంచి గెలిచారో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. మండలిలోని మొత్తం కాంగ్రెస్ నేతల్ని టీఆర్ఎస్ తమ పార్టీలోకి లాక్కుందని ప్రస్తావించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని, ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను చేర్చుకోలేదా అని నిలదీశారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకున్నారని మండిపడ్డారు. తమకు ఆ అవసరం లేదని, 2023 వరకూ తాము వేచిచూడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్ బీజేపీకి సంబంధం ఏమిటి ‘కల్వకుంట్ల కుటుంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందని భయం. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారని భయం. ఫామ్‌హౌజ్‌కు పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పోస్టులు సిద్ధం మునుగోడులో బీజేపీ నేతలకు కేటీఆర్ ఫోన్ చేస్తే అది నైతికత. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఫామ్‌హౌజ్ ఘటనలో దొరికిన డబ్బులెంత? ఇప్పుడా డబ్బులు ఎటు పోయాయి. డబ్బుతో పట్టుకున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి సంబంధం ఏమిటి? నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా. వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా. కొంతమంది పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టాలంటే మొదటి కేసు కేసీఆర్ పైనే పెట్టాలి. ఫామ్‌హౌజ్‌కు ఎందుకు పిలిచారు. అప్పుడే మా పార్టీలోకి రానిస్తాం వాళ్లకు వాళ్లే పిలుచుకున్నారు. వాళ్లకు వాళ్లు మొత్తం వ్యహారం నడిపించారు. దమ్ముంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. ఇది ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్న కేసు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో సానుభూతి కోసం ప్రయత్నాలు. ప్రధానిని తిడితేనే జాతీయ నేత అతవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. 8 సంవత్సరాలలో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. నాలుగు ఆర్లు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి రానిస్తాం. టీఆర్ఎస్ నేతలు చాలా మందితో నందకుమార్ ఫోటోలు దిగారు. నాతో దిగిన ఫోటో చూపించి కిషన్ రెడ్డి మనిషి అంటే ఎలా;’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి? -
...మనుగోడును ఇంతమంది పట్టించుకుంటారని ఊహించలేదు! ఐదేండ్లకోసారి...
...మనుగోడును ఇంతమంది పట్టించుకుంటారని ఊహించలేదు! ఐదేండ్లకోసారి ఉప ఎన్నిక వస్తే చాలు! -
Hyderabad: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఓటర్లను నగర శివార్లలోని మన్నెగూడకు తరలించేందుకు ఏర్పాటు చేయడంతో.. శివారు వాసులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పలు రూట్లలో రాకపోకలు సాగించేందుకు బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. శివారు డిపోల నుంచి ప్రతి మండలానికి నిత్యం 20– 30 బస్సులను తరలిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఖరీదైనదిగా మునుగోడు ఉపఎన్నిక మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శివార్లలోని మన్నెగూడలోని కన్వెన్షన్ సెంటర్లకు తరలించి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం ఊపందుకుంది. కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. బస్సులు లేక శివారు వాసుల అవస్థలు గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలుండగా.. శివారు ప్రాంతాల్లో ఉన్న బండ్లగూడ, హయత్‌నగర్–1, 2, ఇబ్రహీంపట్నం, మిధాని, ఫరూఖ్‌నగర్ తదితర డిపోలకు చెందిన 150 బస్సులు నిత్యం మునుగోడు ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఆతీ్మయ సమ్మేళనం పేరిట మన్నెగూడకు తరలించేందుకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు చెల్లించి ఈ బస్సులను తరలిస్తున్నట్లు ఆయా పారీ్టల నేతలు చెబుతున్నారు. నగరంలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులను మునుగోడుకు తరలించడంతో నగరంలోని 1050 ఆర్టీసీ రూట్లుండగా.. వీటిలో 250 రూట్లలో నిత్యం 1500 ట్రిప్పులకు కోత పడుతోంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వేలాది మంది సెవన్‌సీటర్ ఆటోలు,క్యాబ్‌లు ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. శివారు ఆర్టీసీ డిపోల నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని 190 గ్రామాలకు రాకపోకలు సాగించే బస్సులే అధికంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఈ బస్సులు మునుగోడు బాట పట్టడంతో ఆయా గ్రామాల వాసులు ఉదయం, రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. కాగా బస్సుల తరలింపు వ్యవహారంపై ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఆర్ఎంను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాలేదు. -
హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్‌కే.. కేసీఆర్‌తో ఆ నలుగురు భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్‌హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు. అనంతరం రోహిత్‌రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంది. రోహిత్‌రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్‌రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌తో ‘ఆ నలుగురు’ భేటీ.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు! టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్‌కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్‌మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో.. రోహిత్‌రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్‌హౌజ్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్‌హౌజ్ ఉంటుంది. రోహిత్‌రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పూజల కోసమే వచ్చాం: నందకుమార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు. బ్యాగులు తెరవకుండానే.. మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్‌రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్‌హౌస్ వద్ద హైడ్రామా సాగింది -
మునుగోడు: టీఆర్ఎస్పై సీఈసీకి ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల్లో అధికారపార్టీ(టీఆర్ఎస్) దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే.. మునుగోడు ఎన్నికల్లో నకిలీ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని.. మరో 14 వేల ఓట్లను కూడా తొలగించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో డబ్బులు,మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని,ప్రభుత్వ వాహనాలను సైతం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. ఇదీ చదవండి: మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు -
మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. అభ్యర్థులను అంచనా వేస్తూ ఏకంగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు, నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. మునుగోడుతో పాటు చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో విధంగా బెట్టింగ్‌లు వేస్తూ, ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారని వినికిడి. అయితే మునుగోడులో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ రాయుళ్లపై కన్నేసి ఉంచింది. కాగా ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ, మద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. మంత్రుల వాహనాలతో సహా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చదవండి: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. -
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్!
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్! -
‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’
సాక్షి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. ఈ విషయమై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులు కూడా ఉన్నాయన్నారు. ‘జీఎస్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని ఎందుకు కోరలేదు? ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతారు?’ అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ మేరకు ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు మొదటి జీఎస్టీ సమావేశంలో పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు మునుగోడు ఓట్ల కోసం ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని, అప్పటి జీఎస్టీ సమావేశంలో తాగి పాల్గొన్నారా? అని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు చేనేత వ్రస్తాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామన్న రాష్ట్ర సర్కార్.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని బండి డిమాండ్ చేశారు.గత ఎన్నికల్లో మునుగోడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కే ప్రమాదముందని, దీనిపై ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు -
నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా!
సాక్షి, హైదరాబాద్: ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. అక్కడ కాంగ్రెస్‌పై కుట్ర జరుగుతోంది. మనల్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పథక రచన చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంచన్ దొరా అని బానిసలవుదామా? నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా? తేల్చుకోవాల్సిన సమయం ఇది. నికార్సైన కాంగ్రెసోడా... మునుగోడుకు రా. మీ కోసం ఎదురుచూస్తుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా, ఊరూవాడా, పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని, అక్కడ కార్యకర్తలు కదం తొక్కి తాడోపేడో తేల్చుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు వేలాదిగా తరలివచ్చి అద్భుత స్వాగతం పలికిన కేడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారని, కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వారే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పైసాకు పనికిరాని వారు రాజ్యమేలుతూ కాంగ్రెస్‌ను అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆడబిడ్డ అనే భావన కూడా లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేషు్టలుగా ఉందామా? తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియాగాంధీకి ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా? సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం’అని రేవంత్ పేర్కొన్నారు. -
Munugode Bypoll 2022: లక్ష మందితో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, హరీశ్‌రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు, మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. వచ్చే నెల 1న ప్రచార పర్వం ముగియనుండగా, రెండురోజుల ముందు అంటే ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు యూనిట్ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలంతా చివరి నిమిషం వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే మకాం వేయాలని కేసీఆర్ ఆదేశించారు. వారి పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్‌కు నివేదికలు అందజేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నేతలను మోహరించి ప్రచార లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచార సరళి, అభ్యర్థుల ప్రచారానికి వస్తున్న స్పందన, ఆయా పార్టీలు అనుసరిస్తున్న తెర వెనుక వ్యూహాలు గమనిస్తూ తక్షణమే ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనిని స్వయంగా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. నగర ఓటర్లపై దృష్టి నియోజకవర్గానికి చెందిన సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్ శివారు కాలనీల్లో ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 300 నుంచి 500 వరకు ఓటర్లు నగరంలో నివాసముంటున్నట్లు తమ పరిశీలనలో తేలిందని యూనిట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీల్లోని మునుగోడు ఓటర్ల వివరాలు.. ఇంటి చిరునామా, ఫోన్ నంబరుతో సహా ఇప్పటికే సేకరించి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ పూర్తి చేసింది. పోలింగ్ రోజున వారంతా మునుగోడులో ఓటు హక్కు వినియోగించుకునలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్.. పోస్టల్ బ్యాలెట్లపైనా దృష్టి సారించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. నిరంతరం టచ్‌లో ఉండేలా.. ఓటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రతి ఓటరును కనీసం అరడజను సార్లు కలిసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. యూనిట్ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలు.. తమ పరిధిలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ నేత చొప్పున బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ రోజున ఓటు వేసి వెళ్లేంతవరకు వారితో టచ్‌లో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాజికవర్గాల సమ్మేళనం పేరిట ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా టీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. సభ విజయవంతమయ్యేలా.. చండూరు సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా చూడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమీకరణపై దృష్టి సారించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించారు. -
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక
-
‘హుజురాబాద్, దుబ్బాక మాదిరిగా మునుగోడులోనూ డ్రామాలు షురూ’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ? -
Telangana: రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!
ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులతో అధికారిక వాహనాలు అక్కడ దుమ్ము రేపుతున్నాయా? ఇంతకీ మునుగోడులో ఏం జరుగుతోంది? ప్రచారం.. ఆపై అధికారుల హడావుడి నల్గొండ జిల్లా మునుగోడు ఇప్పుడు తెలంగాణకు మరో రాజధానిగా మారిపోయిందన్నట్టుగా పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. రాష్ట్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉంది. వారి కోసం అధికారులు వచ్చి వెళుతున్నారు. దీంతో మునుగోడులో ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు అధికారుల రాకపోకలతో నానా హడావుడిగా తయారైంది. ఏ ఎన్నికల్లోనూ ఇంత హడావుడి చూడలేదంటున్నారు స్థానిక ప్రజలు. ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి నాయకులు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తక్కువేం తినలేదు. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు కేంద్ర నాయకులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కేంద్ర పెద్దల్లో ఒకరు బీజేపీ అభ్యర్థి కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతున్నందున అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చావో రేవో అన్నట్లుగా పోరాడుతుండటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. 15 మంది మంత్రులు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర పరిపాలన అంతా మునుగోడు నుంచే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది రాష్ట్ర మంత్రులు, 71 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారంలో తలమునకలయ్యారు. కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది సీనియర్ మంత్రులు మునుగోడులోనే తిష్ట వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ కూడా బాగానే ఫైట్ చేస్తోంది. నిత్యం హైదరాబాద్‌లోనే కనిపించే కాంగ్రెస్ సీనియర్లంతా ఇప్పుడు మునుగోడులోనే ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా మునుగోడు ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు. పాపం ఖాకీలు కీలక నేతల పర్యటన, ప్రచారంతో పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు కరువైంది. స్థానిక పోలీసులకు తోడుగా ఇతర జిల్లాల నుంచి కూడా వేలాదిగా పోలీసులను అక్కడ మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ చెక్‌పోస్టులు, బారీకేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము చూడని పెద్ద పెద్ద కార్లు రావడం, ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ జామ్‌లతో మునుగోడు ప్రజలు సతమతమవుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక అనేక రకాలుగా చరిత్ర సృష్టించబోతోంది. -
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం: మంత్రి తలసాని
-
ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరుగుతోందా? ఎల్బీ నగర్‌కు మునుగోడుకు సంబంధం ఏంటి? మునుగోడులో ఎవరు గెలిచేది ఎల్బీ నగర్ నిర్దేశించబోతోందా? మునుగోడు వెళ్లాల్సిన మూడు పార్టీల ముఖ్య నేతలంతా ఎల్బీనగర్లోనే ఎందుకు మకాం వేశారు? హైదరాబాద్ శివార్లపై దృష్టి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా పోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేవు రాజకీయ పార్టీలు. అందుకే మునుగోడు ఓటర్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో గాలిస్తున్నారు. వెతికి పట్టుకుంటున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆశలు రేకెత్తిస్తున్నారు. తాయిలాలు ఎరగా వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్లు ఉపాధి కోసం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నవారి అడ్రస్, ఫోన్ నెంబర్లు మునుగోడులోని వారి బంధు, మిత్రుల నుంచి సేకరించి వారితో భేటీలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. 25వేల మంది@ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 25 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా మునుగోడు ఓటర్లే. దీనిపై పక్కా సమాచారం సేకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రహీం పట్టణం సహారా ఎస్టేట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కాలనీల్లో మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని టాక్. ఎవరికి వారు తమ పార్టీకే ఓటేసేవిధంగా వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఓటర్ల కోసం ముంబైలో గాలింపు పార్టీల ప్రచారం చూస్తున్న స్థానికులు ఎన్నిక జరుగుతోంది.. మునుగోడు లోనా ఎల్బీనగర్ లోనా అని చర్చించుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితి ఒక ఎల్బీనగర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఉపాధి వెతుక్కుంటూ ముంబాయి వెళ్లినటువంటి వలస కూలీల వద్దకు కూడా ఒక పార్టీ కీలక నేత వెళ్లి నవంబర్ మూడున ఓటు వేసేందుకు రావలసిందిగా కోరారట. అందుకు అవసరమైన ఖర్చు కూడా తామే భరిస్తామని.. ఏదైనా కోరితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చి వచ్చారట. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి.. -
కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు వెళ్లాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య దూరం స్పష్టం బహిర్గతం అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరండి. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేము. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్లు పార్టీలు అడుగడునా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పవిత్రమైన యాదాద్రిని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడమే దీనికి పరాకాష్ట. మునుగోడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్టులుగా ఉందామా?. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు. -
ముదురుతున్న మునుగోడు పాలిటిక్స్.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు కూడా దారి తీస్తోంది. మూడు పార్టీల నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మునుగోడులో దొడ్దిదారిన గెలవాలని టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. టీఆర్ఎస్ వైఖరిని మునుగోడు ప్రజలు గమినిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కేసీఆర్ అహం దిగాలంటే టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో ఆదివారం బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు కూడా.. నాంపల్లి మండలంలో తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పండుగ ధమాక షురూ!.. ఇంటింటికి కిలో చికెన్, మద్యం, క్రాకర్స్ బాక్స్
సాక్షి, నల్లగొండ: పండుగ ధమాక షురూ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ తాయిలాల పంపిణీని ప్రారంభించాయి. చికెన్, మద్యంతోపాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. అంతేకాదు.. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ ఓటర్ల ఇంటికే చికెన్, క్రాకర్ బాక్సుల పంపిణీని ఆదివారమే ప్రారంభించింది. మరో పార్టీ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం కల్లా పిల్లలకు క్రాకర్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు పెద్దలకు మద్యం బాటిళ్ల పంపిణీని కూడా షురూ చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కొన్ని చికెన్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. వాటిన్నంటిని తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో ఇంటింటికి పంచేందుకు కొందరు గ్రామ నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులను పురమాయించినట్లు సమాచారం. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే గ్రామ, మండల స్థాయి నేతలకు బెస్ట్ ఆఫర్లు గ్రామ మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంలో బొనాంజా ప్రకటించాయి. భారీ మొత్తంలో నగదును నజరానాగా అందజేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ వార్డు సభ్యుని నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకుని వరకు ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ముట్టజెప్తున్నట్లు తెలిసింది. మరో ప్రధాన పార్టీ వారు కూడా రూ.10వేల నుంచి మొదలుకొని రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల పుణ్యమాని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది. గత కొన్ని రోజులుగా నియోకవర్గంలో పొద్దంతా ప్రచారం, సాయంత్రం మద్యం సిట్టింగ్‌లు వేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో బయట నిర్వహించే సిట్టింగ్‌లు బంద్ చేసి ఇంటికే మద్యం, మాంసం పంపిణీలో పడ్డాయి. చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు మహిళలకు చీరలు.. దీపావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ పార్టీ నాయకులు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించింది. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచితే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో చీరలు కొనుక్కొమ్మని డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. -
ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు. -
ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది. ‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్‌ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు. రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. -
Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది బరిలో ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో.. ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా కట్టడి చేసే పనిలో పడ్డాయి. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఏ మేరకు, ఎవరి ఓట్లను చీల్చగలిగారన్న అంచనాల్లో మునిగిపోయాయి. త్రిముఖపోరే.. అయినా తప్పని ఆందోళన ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్ పారీ్టల అభ్యర్థులు 10 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పారీ్టలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది. మారిన పరిస్థితుల్లో అంచనాలెలా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి. అయినా పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి. ఇక టీఆర్ఎస్కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పారీ్టల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్ నుంచి వచి్చన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ గతంలో రాజగోపాల్‌రెడ్డికి పడిన కాంగ్రెస్ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ చెబుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇలా.. 2018 సాధారణ ఎన్నికల్లో 16 మంది బరిలో ఉన్నారు. పోలైన మొత్తం 1,98,843 ఓట్లలో.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డికి 97,239 (48.90 శాతం) ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,687 ఓట్లు (37.56 శాతం), బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు (6.40 శాతం) వచ్చాయి. అదే ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ మంగ వెంకటేశ్ కురుమకు 3,569 ఓట్లు (1.79 శాతం), ట్రక్కు గుర్తుపై ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి బరిలో ఉన్న చిలువేరు నాగరాజుకు 2,279 ఓట్లు (1.15 శాతం) లభించాయి. బీఎల్ఎఫ్ అభ్యర్థి గోశిక కరుణాకర్‌కు 2,080 ఓట్లు (1.05 శాతం), నోటాకు 3,086 ఓట్లు (1.55 శాతం) పడ్డాయి. మిగతా అభ్యర్థులందరికీ కలిపి మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలను, ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్నాయి. -
Munugode Bypoll 2022: ఓటర్లకు ప్రలోభాలపై ఈసీ సీరియస్! కేసులు తప్పవా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఆదేశించింది. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌రాజ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు. మునుగోడుకు అదనంగా పరిశీలకులు మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో ముసలం ఖాయం) -
టీఆర్ఎస్లో ముసలం ఖాయం
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్‌ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని తేలిపోయిందని.. అందుకే కేసీఆర్ తన పదవిని కాపాడుకొనేందుకు వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అయినా వారికి మునుగోడులో ఓటమి తప్పదని, టీఆర్ఎస్లో ముసలం పుట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారన్న, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్న మాటలు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వపరంగా, వివిధ సంస్థల ద్వారా నిర్వహించిన అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయన్నారు. మునుగోడు ఎన్నికల ›ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. సాక్షి: మునుగోడు ఎన్నికను ఎలా అంచనా వేస్తున్నారు? బండి సంజయ్: తెలంగాణలోని పేద ప్రజల భవిష్యత్‌తో ముడిపడిన ఎన్నిక లివి. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ, గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ చేసిన తప్పులను, అవినీతిని అంగీకరించినట్టేనని.. మందు, డబ్బుల పంచే టీఆర్ఎస్ గెలిస్తే అంతకంటే అవమానం ఉండదని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి ప్రదాత కాదు.. ఫక్తు రాజకీయ అవకాశవాది. ఎన్నికలొస్తేనే నిధులిస్తారు, అభివృద్ధి చేస్తారనే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ప్రజలు ఇదంతా గమనించి, రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాకే మునుగోడులో పలు అభివృద్ధి పనులు జరగడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. గతంలో నిరాహార దీక్షలు, నిరసనలు చేసినా కానిది రాజీనామా చేశాక గట్టుప్పల్ మండలం ఏర్పాటు, చౌటుప్పల్–సంస్థాన్ నారాయణపూర్ రోడ్డు, ఆసరా పింఛన్లు వంటివన్నీ వచ్చాయి. గొల్లకురుమ సోదరులకు గొర్రెల పైసలు విడుదల చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు మార్గం చూపే ఉప ఎన్నిక కాబట్టి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. మునుగోడుకు సంబంధించిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదు. డిండి ప్రాజెక్టు పూర్తి కాలేదు, డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు. వంద పడకల ఆస్పత్రి ఇస్తామని ఇవ్వలేదు. కిష్టాపురం, చర్లగూడెం ప్రాజెక్టులు పూర్తికాలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఫ్లోరోసిస్, మూసీ సమస్యలపై చర్చ జరుగుతోంది కదా! గరళంగా మారిన మూసీ నీళ్లను తాగుతూ చస్తూ బతుకున్న మునుగోడు ప్రజలపై కనికరం లేని కేసీఆర్.. ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే మందీ మార్బలాన్ని పంపి ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మూసీ ప్రక్షాళన ఎటు పోయింది? మునుగోడును నిండా ముంచింది కేసీఆరే. ఫ్లోరోసిసేకాదు మూసీ ప్రక్షాళనపైనా మేం చర్చకు సిద్ధం బీజేపీ గెలుపు సాధ్యమని ఎలా అనుకుంటున్నారు? కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ మాది. కొత్త, పాత తేడా లేకుండా అంతా బీజేపీ గెలుపు కోసం కసిగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చరిష్మా, కేంద్రం చేపడుతున్న పథకాలు, వాటితో పేదలకు చేకూరుతున్న ప్రయోజనాలు బీజేపీని గెలిపిస్తాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మద్దతును కూడగడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసిన విషయాన్ని వివరిస్తున్నాం. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్‌ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బీజేపీని, మోదీని కేసీఆర్ విమర్శిస్తున్నందునే లిక్కర్ కేసులు, ఈడీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మీ స్పందన? ఇప్పుడు మునుగోడుపై గుంట నక్కల్లా పడిందెవరు? లిక్కర్ దందా చేసిందెవరు? మునుగోడులో మద్యాన్ని పారిస్తున్నదెవరు? మీ కళ్లముందే సాక్ష్యాలున్నయి. ప్రధాని మోదీ ఎలాంటి ఆరోపణలనైనా పాజిటివ్ ఆలోచనతో చూస్తారే తప్ప.. విమర్శలను తట్టుకోలేని కేసీఆర్ కుటుంబంలా చేయరు. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకుంటే భయపడటం ఎందుకు? తప్పు చేశారు కాబట్టే ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. గతంలో మోదీ, అమిత్‌షా ఇలా ఆరోపణలు చేయలేదు. విచారణను ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజాసంగ్రామయాత్రను వాయిదా వేసుకున్నారేం? ప్రజల కష్టాలను, సమస్యలను స్వయంగా చూడటం, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాం. ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. మునుగోడు ఉప ఎన్నికను, ప్రజాసంగ్రామ యాత్రను వేర్వేరుగా చూడొద్దు. రెండూ కూడా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ల నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంచుకున్న క్షేత్రాలే. మునుగోడులో తొలి నుంచీ కాంగ్రెస్, వామపక్షాలకు పట్టుంది కదా! తమ పార్టీ కేసీఆర్ కంట్రోల్లో ఉందని కాంగ్రెస్ నేత స్వయంగా ఒప్పుకొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా మళ్లీ టీఆర్ఎస్లో చేరరనే గ్యారెంటీ లేదని ప్రజలే అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కంట్రోల్ ఉన్న తమ పార్టీకి ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలూ భావిస్తున్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతుపై ఆ పార్టీల కేడర్ అయోమయంలో ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారు. ఎందుకు? అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాం, చీకోటి ప్రవీణ్ పేకాట స్కాం, డ్రగ్స్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల పాత్ర ఉందని మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ఈడీ, సీబీఐ విచారణలో ఆధారాలు బయటకొస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీలు, సన్నిహితులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడి.. పైగా బీజేపీపై ఏడిస్తే మేమేం చేస్తాం? మునుగోడు ఫలితంతో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావమేంటి? టీఆర్ఎస్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోవడం ఖాయమని తేలడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా తన పదవిని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయినా టీఆర్ఎస్ ఓటమి తప్పదని ఇప్పటికే తేలిపోయింది. దీనితో టీఆర్ఎస్లో ముసలం పుట్టడం ఖాయం. తర్వాత ఆ ప్రభుత్వం ఏ మేరకు బతికి బట్టకడుతుందనే దానిపై ఎలాంటి గ్యారెంటీ లేదు. రాష్ట్రంలో ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఇంకా సాగితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగి శ్రీలంక గతి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
కార్పొరేట్ కమలం X గరీబోళ్ల గులాబీ
చండూరు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కార్పొరేట్ కమలానికి, గరీబోళ్ల గులాబీ పార్టీకి మధ్య జరుగుతోందని, ఈ ఎన్నికలో కార్పొరేట్లు గెలవాల్నా.. గరీబోళ్లు గెలవాల్నా అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. ఆయన ఆదివారంరాత్రి నియోజకవర్గంలోని గట్టుప్పల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ‘ఓటుకు తులం బంగారం ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకొని టీఆర్ఎస్కు ఓటు వేయండి’అని పేర్కొన్నారు. 2018లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ బీజేపీ కోవర్టుగా మూడున్నరేళ్లు పనిచేశాడని, చివరికి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఇది కోవర్టు రాజకీయం కాదా.. మునుగోడు నియోజకవర్గ సమస్యలను రాజగోపాల్‌రెడ్డి తనకుగానీ, ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికిగానీ చెప్పిన దాఖలాలు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఉపఎన్నికలు బీజేపీ కుట్రలో భాగమేనని, ప్రజలు కోరుకున్నవి కావన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కోవర్టులేనని, రాజగోపాల్‌ను గెలిపించాలని ఆయన అన్న కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఇతరులకు ఫోన్ చేస్తున్నారని, ఇక్కడున్న కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి పంపేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇది కోవర్టు రాజకీయం కాదా అని ప్రశ్నించారు.‘మాది ఓ చిన్న కంపెనీ అని చెప్పిన రాజగోపాల్.. అదే నోటితో రూ.18 వేల కాంట్రాక్టు వచ్చిందని చెప్పారని, చిన్న కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. అది ఇచ్చిన పెద్దలు ఎవరు .. గుజరాత్ గద్దలు ఎవరని అన్నారు. జన్‌ధన్ ఖాతాలో పేదలకు రూ.15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో జమ అయ్యాయని ధ్వజమెత్తారు. ఓట్లు వేసిన మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘చేనేత సమస్యలను విస్మరించారు.. డబ్బులు పెట్టి ప్రజలను అంగడి సరుకులు లాగా కొందామని కుట్ర చేస్తున్నారు’అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని.. రైతన్నలు ఓటేసేటప్పుడు ఓసారి ఆలోచించాలని కోరారు. ఫ్లోరైడ్‌ను సీఎం కేసీఆర్ తరిమికొట్టారు శాశ్వతంగా ఫ్లోరైడ్‌ను తరిమికొట్టింది ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డిలు మంత్రులుగా ఉండి కూడా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించ లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నల్లా ఇవ్వడంతోపాటుగా సాగు నీరు అందించేందుకు శివన్నగూడెం, లక్ష్మణా పురం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. పాలమూరు–డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు. అందుకే బీజేపీ వాళ్ళ కన్ను కుట్దింది.. కుట్రలు మొదలు పెట్టారన్నారు. దళిత బంధులాగా భవిష్యత్తులో అన్ని వర్గాలకు బంధు పథకం అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ మోసం చేశాడన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేస్తే సిలిండర్ ధర రెండు వేలవుతుందని చెప్పారు. చేనేతలకు సబ్సిడీలు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి , శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు , మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడులో ఎన్నికల అధికారిపై కే ఏ పాల్ వాగ్వాదం
-
మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. లీటరు పెట్రోల్ రూ.70 డీజిల్ రూ.65కే ఇవ్వాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహీ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని కేంద్రం చెబుతోందని అన్నారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ పేదలకు చేయకూడదా అని ప్రశ్నించారు. ‘దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. నేడు మూడున్నర కోట్ల టున్నల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి’ అని కేంద్రంపై మండిపడ్డారు. చదవండి: కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్ -
మునుగోడులో మస్తు దావత్‌లు.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యూత్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ ఓటర్లుకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందకు పొలిటికల్ లీడర్లు.. మందు, చికెన్, మటన్‌తో పెద్ద ఎత్తున దావత్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుల్‌గా తాగిన మందుబాబులు పొట్టుపొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ పార్టీ నేతలు కొందరు యువకులకు మందు పార్టీలు ఇచ్చారు. ఈ సందర్భంగా తమకు మందు సరిపోలేదంటూ దావత్లో యువకులు తన్నుకున్నారు. తమకు మందు కావాలని డిమాండ్ చేయడం విశేషం. మరోవైపు.. దీపావళి పండుగ నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన నేతలు.. మునుగోడులో ఓటర్లుకు కొత్త బట్టలు సైతం కొని ఇచ్చినట్టు సమాచారం. -
కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో తాను గెలిచిన పదిహేను రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికలో తాను గెలుస్తానని ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన 10 సర్వే టీంమ్‌లు తేల్చి చెప్పడంతో సీఎం కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే తన వంద మంది కౌరవ సైన్యాన్ని గ్రామాలకు పంపించి ఇతర పార్టీల నాయకులని బెదిరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. అంతేగాక, సీఎం కేసీఆర్ లెంకలపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడే వారం రోజుల పాటు మకాం వేసి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక అప్రజాస్వామిక చర్యలు పాల్పడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏకంగా రిటర్నింగ్ అధికారిని అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఓ పార్టీ అభ్యర్థికి వచ్చిన రోడ్‌రోలర్ గుర్తును రాత్రి 3.25 గంటలకు సంతకం చేయించి మార్పించారన్నారు. అందులో ఆర్వో తప్పు ఏమీలేదని, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అతనిపై ఒత్తిడిచేసి చేయించారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక ఫలితం రాగానే రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని భావించిన పలు పార్టీల నాయకులు తన గెలుపునకు పరోక్షంగా మద్దతిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రోజే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని కేవలం తనను ఓడించేందుకు మాత్రమే పాల్వాయి స్రవంతితో పోటీ చేయించారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు అభివృద్ధికి కేంద్రమంత్రి అమిత్‌షా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, మునుగోడు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. -
అధికారంలో ఉండి దత్తత ఎందుకు
నల్గొండ: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మునుగోడును మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటాననడం ఏంటని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని శివన్నగూడ, యరగండ్లపల్లితోపాటు పలు గ్రామాల్లో ఆమె ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తత పేరిట కేసీఆర్ అనేకమార్లు మోసం చేశారని అన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందించడానికి మనసొప్పదు కానీ, ఉప ఎన్నికలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని అధికార పార్టీ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి 84 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు, 16 మంది ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని, సీఎం కేసీఆర్ సైతం లెంకలపల్లి గ్రామానికి ఇన్‌చార్‌్జగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో ఆగిన పనులు ప్రారంభిస్తున్నారని అన్నారు. రాజగోపాల్‌రెడ్డిపై విశ్వాసం ఉంచి మునుగోడు ఉప ఎన్నికలోగెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల సబితాయాదగిరిరెడ్డి, మెండు దీపికాప్రవీణ్రెడ్డి, కొడాల రాజ్యలక్ష్మీవెంకట్రెడ్డి, జమ్ముల వెంకటేష్‌గౌడ్, రాజేందర్‌నాయక్, ఎలిమినేటి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓడిపోతామనే భయంతో దుష్ప్రచారాలు బీజేపీ విస్తృత ప్రచారం మండలంలోని రాంరెడ్డిపల్లిలో బీజేపీ నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కోఇన్‌చార్జ్ బొడిగ నాగరాజు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నమనేని శోభారవీందర్రావు, మాజీ ఎంపీపీ పాముల యాదయ్య, మండల కార్యదర్శి పగిళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య, మోర వెంకటయ్య, నక్క బుగ్గరాములు, వడ్డె ముత్యాలు, కావలి గద్దర్, వడ్డె శంకరయ్య, లపంగి దేవేందర్, వడ్డె సైదులు, రాములు, కొండా దేవేందర్, రాజు, వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చండూరు : మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తుల ఉమాతో కలిసి శుక్రవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోరుతూ మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో తాము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. తమపై పార్టీ మారుతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేయడం సరికాదన్నారు. బీజేపీ గెలుపు ఖాయమైందని అనేక సర్వేలు చెబుతుండడంతో టీఆర్ఎస్లో వణుకు మొదలైందన్నారు. ఓటమి చెందుతున్నామనే సంకేతం రావడంతో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా బీజేపీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని అన్నారు. నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు ప్రస్తుత మంత్రులు బీజేపీలోకి రానున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
‘కాంగ్రెస్ గెలవదు.. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు. నేను ప్రచారానికి వెళ్తే మహా అంటే కొన్ని ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతంగా ఎంపీగా గెలిచాను. దాదాపు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ప్రస్తుత రాజకీయాల గురించి నాకు తెలుసు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
దీపావళి తర్వాతే దంగల్.. మునుగోడులో మారుతున్న పాలిటిక్స్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మద్యం, డబ్బు, విందు వినోదాలతో దీపావళి పండుగ తరువాత పూర్తి స్థాయిలో మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి పండుగ కోసం ఇతర ప్రాంతాల నుంచి మునుగోడు నియోజకవర్గంలోని స్వగ్రామాలకు వచ్చే ప్రతి ఓటరును వీలైతే పోలింగ్ వరకు అక్కడే స్వగ్రామాల్లోనే ఉండేలా ఒప్పించడం, కుదరకపోతే కచ్చితంగా పోలింగ్ రోజున వచ్చేలా అవసరమైన మొత్తాన్ని అందజేసి ఓటర్లను తమ అధీనంలోకి తెచ్చుకునే లక్ష్యంతో ప్రధాన పార్టీలు కదులుతున్నాయి. ఇప్పటికే కులాల వారీగా నియోజకవర్గం బయట, హైదరాబాద్‌లో ఉన్న కుటుంబాలకు దీపావళి క్రాకర్స్, ప్రత్యేక గిఫ్ట్ బాక్సులు వంటి తాయిలాలను అందిస్తున్నాయి. బూత్ స్థాయినుంచే.. పండుగ తర్వాత ప్రత్యేక వ్యూహంతో బూత్ స్థాయిలోనే ఓటర్లను ఆకర్షించే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రతి బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. వారు ఎవరు చెబితే వింటారు. వారికి ఏం కావాలి.. వారికున్న అవసరాలేంటి? ఎలా తమ వైపునకు తిప్పుకోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో బూత్ స్థాయిలో మరింత పకడ్బందీ ప్రణాళికతో డబ్బు పంపిణీ చేసి తమ వైపు తిప్పుకునేలా స్కెచ్ వేస్తున్నాయి. ఇప్పటికే ఓ పార్టీకి చెందిన డబ్బు క్షేత్ర స్థాయికి చేరిపోయింది. మరో పార్టీ డబ్బును ఎలా చేరవేయడం అన్న విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఇంకో పార్టీ బూత్‌ల వారీగా నియమితులైన ఇన్‌చార్జీలకే ఆ పనుల బాధ్యతలను అప్పగించింది. ఈ నెలాఖరులో భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్‌షోల నిర్వహణకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావుల రోడ్‌షోలను భారీగా నిర్వహించింది. బీజేపీ కూడా 29వ తేదీన లేదంటే 31వ తేదీన అమిత్‌షా లేదా జేపీ నడ్డాతో బహిరంగ సభ నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. మొత్తానికి అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు మొదలుకొని కిందిస్థాయి నాయకులంతా మునుగోడులోనే మోహరించనున్నారు. -
'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా'
సాక్షి, సంస్థాన్ నారాయణపురం: బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితో కలిసి సంస్థాన్ నారాయణపురంలో రోడ్ షో నిర్వ హించారు. రోడ్‌షోలో పాల్గొన్న జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... ’’‘నేను ప్రగతిభవన్‌లో ఉన్నానట.. ‘నన్ను నీవా కొనేది.. నాకా మెసేజ్‌లు పంపించేది. (జుట్టును చూపిస్తూ) నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు, లుచ్చా మనుషులే బయటకు పోతారు. జితేందర్‌రెడ్డి లాంటి వారు పోరు’.... ‘గుర్తుపెట్టుకో హుజూరాబాద్‌లో ఎన్నికలో పెద్దిరెడ్డిని తీసుకొని పోయావు. మోత్కుపల్లి నర్సింహులును, కాంగ్రెస్ నుంచి ఓ లీడర్‌ను తీసుకుపోయావు. ఏమైనా పీకగలిగినవా, ఏమైనా చేశావా.. ప్రజలు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎవడిని తీసుకొని పోయినా రాజగోపాల్‌రెడ్డి 50వేల మెజారిటీతో గెలుస్తాడు. బీజేపీని వదిలేది లేదు. మా తమ్ముడు సంజయ్‌ను సీఎంను చేస్తా అప్పుడు ఏమైనా ఆలోచిస్తా’ అని వ్యాఖ్యానించారు. -
ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఓటర్లను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలించి ప్రమాణం చేయించడంపై ఎన్నికల కోడ్ ప్రత్యేక బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన సుమారు 700 మందిని యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా 15 ఆర్టీసీ బస్సుల్లో ఆ గ్రామ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు. ఓటర్లను తీసుకొనిపోయి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి, ఆలయంలో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించారని పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఫొటోలు, వీడియోగ్రఫీ సాక్ష్యాల ఆధారంగా టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారానికైన వ్యయాన్ని మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. -
గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి
సాక్షి, యాదాద్రి: ‘‘ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి. అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించండి’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. గతంలో మునుగోడు ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపించారని.. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నాటి నుంచీ బీజేపీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు అనవసరంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలో జరిగిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ డబ్బంతా రాజగోపాల్‌రెడ్డి ఖాతాలోకే.. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనది చిన్న కంపెనీగా చెప్పుకొని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారు? ఇచ్చిన పెద్దలు ఎవరు, గుజరాత్ గద్దలు ఎవరు? పేద ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో పడ్డాయి. ఇందుకోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చే పైసలన్నీ గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకోండి. కానీ కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. శివలింగం వస్తే మాది, శవం వస్తే మీది అంటూ బేకార్ మాటలు మాట్లాడే చిల్లర నాయళ్లకు బుద్ధిచెప్పాలి. మోదీవన్నీ పకోడీ మాటలు 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడకు వచ్చి 300 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదో, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఇడ్లీ బండి, పకోడీ బండి పెట్టుకోవాలని యువతకు సూచిస్తున్నారు. మోదీవన్నీ పకోడీ మాటలే. నల్లధనం తెస్తానని చెప్పి తెల్లమొఖం వేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ వేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారు. నాడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1,200కు చేరింది. ఓటు వేసేటప్పుడు మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైతు బాంధవుడు కేసీఆర్.. గత 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు ఆకుపచ్చ తలపాగాలు ధరించి రైతులను మోసం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతు బంధు, రైతుబీమా వంటి ఉత్తమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైతు పథకాలను అటుఇటు మార్చి అమలు చేస్తున్నాయి. నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా. ఫలానాది కావాలని అడగకుండానే చేసి చూపిస్తా. మునుగోడు నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 48 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇక్కడి దండుమల్కాపురంలో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను నిర్మించాం. 200 కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి. మిషన్ భగీరథ పథకం కోసం రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచిస్తే.. 19 పైసలు కూడా ఇవ్వలేదు. చర్లగూడెం, శివన్నగూడెం ప్రాజెక్టులను సగం పూర్తి చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పూర్తి చేయిస్తాం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. దేశంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా నల్లగొండ జిల్లా మారింది. గత 65 ఏళ్లలో పరిష్కారం కాని ఫ్లోరోసిస్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం రూపుమాపింది..’’ అని కేటీఆర్ చెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు. వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు.. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది. కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. -
హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్, అశోక్ కుమార్, రతన్‌సింగ్, గోషామహల్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డబ్బు ఎవరి ఆదేశాలతో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?