సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు.
తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం..
► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు.
► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి.
► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment