Campaigning end
-
మహిళలు... మరాఠాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండూ చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానారకాలుగా చీలిపోయి కని్పస్తుండటం విశేషం. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో రెండుగా చీలిపోవడం తెలిసిందే.దాంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్ధవ్ వర్గం; అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం తహతహలాడుతున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా; ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహా వికాస్ అఘాడీగా మోహరించాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలనూ మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలావరకు తేల్చనున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలావరకు మహిళలు, మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ఓటింగ్లో మహిళల జోరుమహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. పలు ఎన్నికలుగా ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటెత్తారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కారు పలు పథకాలు, తాయిలాలు ప్రకటించింది. 21–65 ఏళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 అందించే లడ్కీ బహిన్ పథకం అందులో భాగమే. ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను, అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది.వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా రూ.3,000 నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలి్పస్తాని పేర్కొంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 అందిస్తామన్న హామీ కూడా యువతుల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. టేబుల్⇒ మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు ⇒ పురుషులు 4.93 కోట్లు ⇒ మహిళలు 4.6 కోట్లురెబెల్స్ కాకతిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కన్పిస్తున్నారు. ముఖ్యంగా మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కూటమి అభ్యర్థులపై ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు చీల్చే ఓట్లు చాలాచోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన మహాయుతి నేతలను వెంటాడుతోంది.ముఖ్యంగా 62 స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబెల్స్ బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్ చేసింది. వీరికి జంప్ జిలానీలు తోడయ్యారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి! వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కని్పస్తున్నారు.మరాఠా రిజర్వేషన్లుఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటినుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పాటిల్ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదేపదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కని్పంచడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. వారికోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది. రైతులు, నిరుద్యోగంవీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కని్పస్తోంది. ఇటీవలి అకాల వర్షాలు రాష్ట్రంలో సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. దాంతో షిండే సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఎగుమతులపై నిషేధం ఉల్లి రైతులను బాగా దెబ్బ తీసింది. ఇవన్నీ తన పుట్టి ముంచేలా కని్పస్తుండటంతో దాంతో రైతులను ఆకట్టుకునేందుకు మహాయుతి సర్కారు ఆపసోపాలు పడుతోంది. పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది. ఇక మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్న మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. -
నేటితో ప్రచారం సమాప్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రలోభాలపై దృష్టి పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి. -
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
4 నెలల తర్వాత ఇంటిదారి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్‌లో ప్రచారం ముగియడంతో అన్నిపార్టీలకు చెందిన ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఇంటిముఖం పట్టారు. నియోజకవర్గ ప్రజలు మినహా స్థానికేతరులంతా వెళ్లిపోవాలంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు, అధికారులు నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బస చేసిన ఇళ్లు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్‌హాళ్లలో తనిఖీలు నిర్వహించారు. బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలని సూచించారు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం నుంచే ఇంటిదారి పట్టారు. ముఖ్య నేతలు సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈటల రాజేందర్ జూన్ 12న రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో వేడి మొదలైంది. అప్పటి నుంచి బుధవారం వరకు 130 రోజులకుపైగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేశారు. చాలా మంది మధ్యలో పండుగలు, ఇతర అత్యవసర సమయాల్లో తప్ప.. అక్కడే గడిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత సుదీర్ఘంగా గడపడంతో చాలా మంది నేతలు, కార్యకర్తలకు హుజూరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అంటున్నారు. నాలుగు నెలలకుపైగా ఇక్కడే ఉండి, అందరితో కలిసి పోయామని.. హుజూరాబాద్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరికొందరు నేతలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర
-
మాటల యుద్ధం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: సవాళ్లు, ప్రతిసవాళ్లు.. విమర్శలు, ఆరోపణలు.. ఆత్మీయ ఆలింగనాలు, ప్రమాణాల డిమాండ్లతో హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి బుధవారం సాయం త్రం తెరపడింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నాలుగు నెలల పాటు ప్రచార పర్వం సాగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా మొదలు హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు ఈటల వర్గం, మరోవైపు టీఆర్ఎస్ నేతలు మోహరించారు. హుజూరాబాద్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాస్త ఆల్యసంగా బరిలోకి దిగినా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మూడు ప్రధాన పక్షాలు కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి.. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో నేతలకు బాధ్యతలు అప్పజెప్పి ప్రచారం నిర్వహించాయి. మొత్తంగా ప్రచార హోరు ముగియడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే చర్చ మొదలైంది. అన్ని అస్త్రాలతో టీఆర్ఎస్.. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్‌తో తలపడాల్సిన పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ స్థానిక నాయకత్వం చేజారకుండా, ఈటల పక్షాన వెళ్లకుండా మంత్రి గంగుల కమలాకర్‌ను రంగంలోకి దింపింది. తర్వాత ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించింది. వెంటనే బరిలో దూకిన హరీశ్‌రావు అటు పార్టీ కేడర్‌ను కాపాడటంతోపాటు ప్రచారాన్ని ఉధృతం చేయడంపై దృష్టి సారించారు. ఈటలది పైచేయి కాకుండా వ్యూహాలు పన్నుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆయనకు తోడు పలువురు మంత్రులు, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నామినేటెడ్ పదవుల్లో ఉన్న వివిధ కులాల నేతలు కూడా హూజూరాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తంగా ప్రచారపర్వంలో టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీటుగా బరిలో ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న ఆదరణ, తన వెంట నడిచిన అనుచరులనే నమ్ముకుని బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు.. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడైంది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి వంటి నాయకులు వెన్నంటి నిలవడంతో టీఆర్ఎస్కు దీటుగానే ఈటల ప్రచారాన్ని హోరెత్తించారు. టీఆర్ఎస్లో అవమానాలు భరించలేకనే బయటికి వచ్చానంటూ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రజల నుంచి సానుభూతి కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలనలో విఫలమైందని, కుటుంబ పాలన జరుగుతోందని విమర్శలు గుప్పించారు. శక్తిమేర కాంగ్రెస్.. మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ కూడా శక్తిమేర ప్రచారం నిర్వహించింది. మొదట అభ్యర్థి ఎంపికలో జాప్యం చేసిన ఆ పార్టీ.. విద్యార్థి సంఘం నేత బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపింది. ఆయనకు మద్దతుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు తొలి నుంచీ నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు. కుల సంఘాలు.. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గ స్వరూపానికి అనుగుణంగా ఈ ఉప ఎన్నికలో కుల సంఘాలు, దళితబంధు పథకం కీలకం కానున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా కుల సంఘాలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. నియోజకవర్గంలో మొత్తంగా 2.37 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 1.7 లక్షల ఓట్లు ప్రధానమైన ఏడు సామాజిక వర్గాలవారే ఉన్నారు. మాదిగ, మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, యాదవ, రెడ్డి, మాల సామాజికవర్గాలకు తోడు ఇతర వర్గాలనూ ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నారు. ఇక ఈ ఎన్నికల్లో విస్తృత చర్చకు దారితీసిన దళితబంధు పథకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ ఆగస్టు 16న నియోజకవర్గానికి వెళ్లి దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. తర్వాత సుమారు 16 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమయ్యాయి. కొందరికి ఉపాధి పనులు ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చాయి కూడా. కానీ ఈ పథకాన్ని నిలిపివేయాలని అక్టోబర్ 18న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో మిగతావారికి పంపిణీ నిలిచిపోయింది. దళితబంధు ఆగేందుకు మీరంటే మీరే కారణమంటూ పార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. భారీ ఖర్చు.. ప్రలోభాలు! హుజూరాబాద్‌లో దాదాపు నాలుగు నెలల నుంచి ప్రచారం సాగుతోంది. ఇంతకాలంగా పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం, అదే సమయంలో మరింత మందిని కూడగట్టుకోవడం అభ్యర్థులకు భారంగానే మారిందన్న అభిప్రాయముంది. రోజూ ప్రచార ఖర్చు, కార్యకర్తలకు బస, భోజన ఏర్పాట్లు, మద్యం, మాంసంతో విందులు, మధ్యలో వచ్చిన దసరా పండుగ, ఇతర ఏర్పాట్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల (అక్టోబర్) 1వ తేదీ నుంచి ప్రచారం ముగిసిన బుధవారం వరకు నియోజకవర్గంలో రోజుకు రూ.కోటికిపైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు.. బొట్టుబిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు, కోళ్లు, పొట్టేళ్ల పంపిణీ బహిరంగంగానే జరిగింది. తాజాగా ఓటుకు ఐదారు వేల వరకు ఇస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. బైపోల్ బెట్టింగ్! రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపడం, ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నేపథ్యంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై బెట్టింగ్‌లు జోరందుకున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.100 కోట్లదాకా బెట్టింగ్‌లు కాసినట్టు పందెం రాయుళ్లు చెప్తున్నారు. పోలీసుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ‘లెక్క’లివీ.. ► నగదు రూ.3,29,36,830 ► రూ.6,36,052 విలువైన 944 లీటర్ల మద్యం ► రూ.69,750 విలువైన 11.4 కేజీల గంజాయి ► రూ.44,040 విలువైన పేలుడు పదార్థాలు ► రూ.2,21,000 విలువైన దుస్తులు ► రూ.10,60,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు ► ఇక 2,284 మందిని బైండోవర్ చేయగా.. 116 కేసులు నమోదయ్యాయి. ► రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దళితబంధు పథకం, పెట్రోల్–డీజిల్ పెంపు అంశాలతో టీఆర్ఎస్ ప్రచారం చేసింది. ► టీఆర్ఎస్ తనను అవమానించిం దంటూ వ్యక్తిగత ప్రతిష్ట పేరిట ఈటల జనంలోకి వెళ్లారు. టీఆర్ఎస్ పాలనలో విఫల మైందంటూ బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ► బీజేపీ,టీఆర్ఎస్ ప్రజలనుమోసం చేస్తున్నాయని, వాటికి ప్రత్యామ్నా యం తామేనని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ వచ్చింది. ఎల్లుండే పోలింగ్! ఎన్నికల సంఘం కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేసింది. 30న ఉదయం 7గం.కు పోలింగ్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు. -
మమత ప్రచారంపై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో నేడు(మంగళవారం) ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారం: తిరక్కుండానే టైమౌట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హీట్ పీక్స్‌కు వెళ్లడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జెట్ స్పీడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా డివిజన్ మొత్తాన్ని చుట్టేయడం సాధ్యంకావడంలేదు. ఇదీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం తీరు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారపోకడ గతం కంటే భిన్నంగా సాగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో డివిజన్ మొత్తాన్ని చుట్టి, చివరలో ముఖ్యమైన ప్రాంతాల్లో రెండోసారి కూడా ప్రచారం చేస్తారు. కానీ, ఈసారి డివిజన్వ్యాప్తంగా అభ్యర్థి ప్రచారం చేసే వీలు చిక్కలేదు. ఆదివారం ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలు, అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బస్తీల్లోనే కుస్తీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఎన్నికల తంతు ముగించాల్సి వస్తోంది. అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ అందించిన తర్వాత ప్రచారానికి కేవలం వారం మాత్రమే మిగిలింది. ఈ వారం రోజుల్లో డివిజన్లోని బస్తీలు, కాలనీలన్నింటిలో ప్రచారం చేయటం దాదాపు అసాధ్యమైపోయింది. దీంతో అభ్యర్థులు జెట్ స్పీడ్‌తో గరిష్ట ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించకున్నారు. దాదాపు మూడొంతుల ప్రాంతాలను చుట్టేయగలిగారు. ఎన్నికల వేళ అభ్యర్థులు మెడలో పూలమాలలు వేసుకుని, బాజాభజంత్రీలు, మందీ మార్బలంతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు. కానీ, ఈసారి తీరు మారింది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు తిరగాల్సి రావటంతో హంగూఆర్భాటాలు లేకుండా పరుగు పరుగున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాదయాత్రలు చేసి సాయంత్రం కార్నర్ మీటింగ్స్ జరిపేవారు. ఇప్పుడు కార్నర్ మీటింగ్స్ జోలికి వెళ్లటం లేదు. ఒకచోట మీటింగ్ పెట్టే సమయంలో పది బస్తీలు కవర్ చేయొచ్చన్న ఉద్దేశంతో పాదయాత్రలకే ప్రాధాన్యమిస్తున్నారు. అభ్యర్థులు మూడు, నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, బస్తీలకు అభ్యర్థి వెళ్తుండగా, మిగతా ప్రాంతాలకు అభ్యర్థి తరఫున తండ్రి, సోదరులు, పార్టీ డివిజన్ స్థాయి ముఖ్యనేతలు వెళ్లి ఓట్లడగుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థి చిన్న కటౌట్లను వెంట పెట్టుకుని వెళ్లి దాన్ని చూపిస్తూ ఓట్లడుగుతుండటం విశేషం. మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. గతంలో మైనారిటీయేతరులుండే ప్రాంతాల్లోనూ ప్రచారం చేసేవారు. ఈసారి సమయంలేక అటు వెళ్లటం లేదు. ఉదయం అల్పాహారం ముగించి ప్రచారం ప్రారంభించి మధ్యాహ్నం ఇళ్లకు వచ్చి భోజనం ముగించి, కుదిరితే కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం రెండోదఫా ప్రచారం చేసేవారు. కానీ, ఇప్పుడు షెడ్యూల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వేకువజామునే ప్రచారం ప్రారంభించి, కుదిరిన చోట లంచ్ ముగించి రాత్రి పొద్దుపోయే వరకు తిరుగుతున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లోనే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లోనే అభ్యర్థులు పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాలనీలకు అతి తక్కువగా వెళ్తున్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లని ప్రాంతాల్లో వారి ప్రచార వాహనాలను ఎక్కువగా తిప్పకుండా మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. అగ్రనేతల ప్రచారంపైనే ఆశలు.. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి బల్దియా ఎన్నికల్లో ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ తరఫున ఒకరిద్దరు పెద్ద నేతలు మాత్రమే పాల్గొంటుండగా, టీఆర్ఎస్, బీజేపీలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా అగ్రనేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. నిత్యం డజన్ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు వారి ప్రచారంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారం కంటే అగ్రనేతల మాటలే ఎక్కువగా ఓట్లు తెచ్చిపెడతాయనీ, హామీలు, వరాలు వారి మాటల్లోనే పారుతున్నాయనీ భావించిన అభ్యర్థులు బస్తీల్లో ఓటర్లకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగటం తప్ప పెద్దగా హామీలు ఇవ్వలేకపోతున్నారు. విజయం సాధిస్తే తమ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని అగ్రనేతలే వివరిస్తున్నారు. వాటికి మీడియా ద్వారా భారీ ప్రచారమే సాగుతోంది. అన్ని పార్టీలు సొంతంగా సోషల్ మీడియ బృందాలు ఏర్పాటు చేసుకుని, అగ్రనేతల ప్రసంగాలను వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారు.గెలుపోటములపై అవి ప్రభావం చూపుతాయన్న అభిప్రాయంతో అభ్యర్థులున్నారు. అగ్రనేతలు కొన్ని డివిజన్లకే పరిమితం కావటంతో వారు అడుగుపెట్టని ప్రాంతాల అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. -
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో(సోమవారం) ముగిసింది. జనవరి 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 53,36,505 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. వీరిలో పురుషులు 26,71,694, స్త్రీలు 26,64557మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.40 లక్షల మంది, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. కాగా 69 వార్డుల్లో టీఆర్ఎస్, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు ఇక ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు 7 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను, 44 వేల మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 22న సెలవు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు. -
బెంగాల్ అల్లర్లపై ఈసీ కొరడా
-
బిహార్‌లో ముగిసిన ప్రచారం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత నెల రోజులుగా హోరెత్తిన ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఈ నెల 5న చివరి, ఐదో దశ పోలింగ్ జరగనుంది. 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జీతన్ రామ్ మంజీ, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఎన్డీయే, మహాకూటమి మధ్య హారాహోరీ పోరు నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.