బిహార్లో ముగిసిన ప్రచారం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత నెల రోజులుగా హోరెత్తిన ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఈ నెల 5న చివరి, ఐదో దశ పోలింగ్ జరగనుంది. 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జీతన్ రామ్ మంజీ, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఎన్డీయే, మహాకూటమి మధ్య హారాహోరీ పోరు నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.