మునుగోడులో మస్తు దావత్‌లు.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యూత్‌ | Intoxicated Munugode Youth Hulchul At Hyderabad | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్‌.. వీడియో వైరల్‌

Published Sat, Oct 22 2022 1:40 PM | Last Updated on Sat, Oct 22 2022 1:46 PM

Intoxicated Munugode Youth Hulchul At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల వేళ ఓటర్లుకు బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందకు పొలిటికల్‌ లీడర్లు.. మందు, చికెన్‌, మటన్‌తో పెద్ద ఎత్తున దావత్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుల్‌గా తాగిన మందుబాబులు పొట్టుపొట్టు తన్నుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ పార్టీ నేతలు కొందరు యువకులకు మందు పార్టీలు ఇచ్చారు. ఈ సందర్భంగా తమకు మందు సరిపోలేదంటూ దావత్‌లో యువకులు తన్నుకున్నారు. తమకు మందు కావాలని డిమాండ్‌ చేయడం విశేషం. మరోవైపు.. దీపావళి పండుగ నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన నేతలు.. మునుగోడులో ఓటర్లుకు కొత్త బట్టలు సైతం కొని ఇచ్చినట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement