మద్యం మత్తులో చితక్కొట్టి హింసించారు
వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
వైరల్ కావడంతో వెలుగులోకి..
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కేసును నీరుగార్చే ప్రయత్నం
చుండూరు (కొల్లూరు): కొందరు యువకులు మద్యం మత్తులో ఓ బాలుడిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొడుతూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు... బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన బాలుడు(17) ఒంగోలు వెళ్లి తన పెదనాన్న వద్ద ఉంటూ కుట్టుపని నేర్చుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల కిందట గ్రామానికి వచ్చి అనారోగ్యం వల్ల ఒంగోలు వెళ్లలేదు.
గత నెల 31న ఆ బాలుడి వద్దకు తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు సూర్య, మరో యువకుడు బైక్‌పై వచ్చి సరదాగా బయటకు వెళదామని చెప్పి మండూరు చర్చి డొంక రోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు యువకులు మద్యం తాగి ఆ బాలుడిని కూడా బీరు తాగాలని ఒత్తిడి చేశారు. అందరూ మద్యం తాగుతుండగా, చినగాదెలవర్రుకు చెందిన దయా, ఆలపాడుకు చెందిన చిన్ను అనే వ్యక్తులు వచ్చి వారితో కలిశారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా యువకులందరూ కలిసి ఆ బాలుడిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులు, కర్రలు, బెల్టులతో పైశాచికంగా కొడుతూ అతని చొక్కా చింపేశారు. సుమారు రెండు గంటలు దాడి చేస్తూ వీడియోలు తీశారు.
ప్రమాదమని చెప్పి ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం..
తీవ్రంగా గాయపడిన బాలుడిని ఇద్దరు యువకులు ఆటోలో తెనాలి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరి్పంచేందుకు ప్రయతి్నంచారు. అయితే, ఇది ప్రమాదం కాదని, కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఆ యువకులు బయటకు తీసుకురాగా, బాలుడికి తెలిసిన వ్యక్తి చూసి ఏమైందని ప్రశి్నంచడంతో యువకులు పారిపోయారు. అతను బాధిత బాలుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు చుండూరు ఎస్‌ఐ మహ్మద్ రఫీ ఈ నెల ఒకటో తేదీన కూచిపూడి, తెనాలి, పరిమి, గాదెలవర్రు, ఆలపాడుకు చెందిన ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన యువకులు అధికార పారీ్టకి చెందినవారు కావడంతో రాజీ చేయాలని వేమూరుకు చెందిన ముఖ్య నేత, పార్లమెంట్ స్థాయి నేత ఒకరు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంత చిన్న కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బైక్‌ల చోరీ కేసులలో పట్టించానని కొట్టారు
జూలై 31వ తేదీన నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే చినపరిమి గ్రామానికే చెందిన నా స్నేహితుడు సూర్య బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. మండూరు గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి బీరు తాగించి కొట్టడం ప్రారంభించారు. సూర్యతోపాటు చినగాదెలవర్రుకు చెందిన యువకుడు దయ, మరో ఐదుగురు ఉన్నారు. తెనాలిలో నన్ను కాల్వలో పడేద్దామని తీసుకెళుతుంటే మా ఊరి వ్యక్తి కనిపించాడు. ఆయన సాయంతో వైద్యశాలలో చేరాను. గతంలో బైక్‌ల చోరీ విషయంలో దయా అనే వ్యక్తిని పోలీసులకు పట్టించానన్న కక్షతో నన్ను కొట్టారు. – బాధిత బాలుడు
Comments
Please login to add a commentAdd a comment