Intoxication
-
అతిగా నీళ్లు తాగుతున్నారా?
నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ప్రతి సెలబ్రిటీ ప్రకావంతమైన చర్మం వెనుక సీక్రెట్ హైడ్రేషన్. మంచి ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం పుష్కలంగా నీళ్లు తాగడం అత్యంత కీలకం. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అలానే బ్యాలెన్స్‌గా తాగడం అనేది కూడా అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణుల మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.అధికంగా నీళ్లు తాగితే..హైపోనాట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతలు పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీరం సాధారణ సెల్యులార్ పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా బహుళ అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలుచబడటానికి దారితీస్తుంది. ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్ వాపుకి కారణమయ్యి.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడెమా అంటారు. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలు...వికారం, వాంతులుతలనొప్పులుగందరగోళంఅలసటకండరాల తిమ్మిరిమూర్చకోమా, తలనొప్పిచేతులు, పాదాలు లేదా ముఖంలో వాపు ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎంత నీరు తాగితే బెటర్..మనం ఉంటున్న వాతారవణం, శారీరక శ్రమ తదితర అంశాల ఆధారంగా నీటిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నిపుణులు సిఫార్సు చేసినవి..పురుషులు: రోజుకు సుమారుగా 3.7 లీటర్లు (125 ఔన్సులు) మొత్తం ద్రవాలు (నీరు, ఇతర పానీయాలు, ఆహారంతో సహా).మహిళలు: రోజుకు సుమారుగా 2.7 లీటర్లు (91 ఔన్సులు) మొత్తం ద్రవాలు.ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ చెమట పట్టే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిది. (చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!) -
బాలుడిపై యువకుల పాశవిక దాడి
చుండూరు (కొల్లూరు): కొందరు యువకులు మద్యం మత్తులో ఓ బాలుడిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొడుతూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు... బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన బాలుడు(17) ఒంగోలు వెళ్లి తన పెదనాన్న వద్ద ఉంటూ కుట్టుపని నేర్చుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల కిందట గ్రామానికి వచ్చి అనారోగ్యం వల్ల ఒంగోలు వెళ్లలేదు.గత నెల 31న ఆ బాలుడి వద్దకు తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు సూర్య, మరో యువకుడు బైక్‌పై వచ్చి సరదాగా బయటకు వెళదామని చెప్పి మండూరు చర్చి డొంక రోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు యువకులు మద్యం తాగి ఆ బాలుడిని కూడా బీరు తాగాలని ఒత్తిడి చేశారు. అందరూ మద్యం తాగుతుండగా, చినగాదెలవర్రుకు చెందిన దయా, ఆలపాడుకు చెందిన చిన్ను అనే వ్యక్తులు వచ్చి వారితో కలిశారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా యువకులందరూ కలిసి ఆ బాలుడిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులు, కర్రలు, బెల్టులతో పైశాచికంగా కొడుతూ అతని చొక్కా చింపేశారు. సుమారు రెండు గంటలు దాడి చేస్తూ వీడియోలు తీశారు. ప్రమాదమని చెప్పి ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం.. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఇద్దరు యువకులు ఆటోలో తెనాలి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరి్పంచేందుకు ప్రయతి్నంచారు. అయితే, ఇది ప్రమాదం కాదని, కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఆ యువకులు బయటకు తీసుకురాగా, బాలుడికి తెలిసిన వ్యక్తి చూసి ఏమైందని ప్రశి్నంచడంతో యువకులు పారిపోయారు. అతను బాధిత బాలుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు చుండూరు ఎస్ఐ మహ్మద్ రఫీ ఈ నెల ఒకటో తేదీన కూచిపూడి, తెనాలి, పరిమి, గాదెలవర్రు, ఆలపాడుకు చెందిన ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన యువకులు అధికార పారీ్టకి చెందినవారు కావడంతో రాజీ చేయాలని వేమూరుకు చెందిన ముఖ్య నేత, పార్లమెంట్ స్థాయి నేత ఒకరు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంత చిన్న కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బైక్‌ల చోరీ కేసులలో పట్టించానని కొట్టారు జూలై 31వ తేదీన నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే చినపరిమి గ్రామానికే చెందిన నా స్నేహితుడు సూర్య బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. మండూరు గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి బీరు తాగించి కొట్టడం ప్రారంభించారు. సూర్యతోపాటు చినగాదెలవర్రుకు చెందిన యువకుడు దయ, మరో ఐదుగురు ఉన్నారు. తెనాలిలో నన్ను కాల్వలో పడేద్దామని తీసుకెళుతుంటే మా ఊరి వ్యక్తి కనిపించాడు. ఆయన సాయంతో వైద్యశాలలో చేరాను. గతంలో బైక్‌ల చోరీ విషయంలో దయా అనే వ్యక్తిని పోలీసులకు పట్టించానన్న కక్షతో నన్ను కొట్టారు. – బాధిత బాలుడు -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ పబ్‌లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్‌లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్‌ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్‌కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్‌గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
మత్తు వదలరా.. చెత్త ఎత్తరా.!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు. వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
Jangaon: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి
మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని.. -
గొర్రెకు బదులు తమ్ముడి మెడ నరికేశాడు
మదనపల్లె: కనుమ పండుగ సంబరాల నేపథ్యంలో గొర్రె తల నరకడానికి బయలుదేరిన ఓ వ్యక్తి మద్యం మత్తులో క్షణికావేశానికి గురై వరుసకు తమ్ముడయ్యే యువకుడి మెడ నరికి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వందలాదిమంది చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటనలో తల తెగిన యువకుడు మరణించగా.. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వలసపల్లె గ్రామానికి చెందిన తలారి లక్ష్మన్న, గంగులమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త లక్ష్మన్న ఎనిమిదేళ్ల క్రితం చనిపోగా పెద్ద కుమారుడు రాయలపేటలో కేబుల్ పని చేసుకుంటుండగా, రెండో కుమారుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడో కుమారుడైన తలారి సురేష్ (26) అవివాహితుడు కావడంతో కూలి పనులు చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. సురేష్‌కు వరుసకు పెదనాన్న కుమారుడైన తలారి చలపతి (55) కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటోంది. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా స్వల్ప వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, గ్రామంలో జరిగే కనుమ ఉత్సవాల్లో అమ్మవారికి జంతు బలులు ఇచ్చేటప్పుడు ఏటా తలారి చలపతి గొర్రె తల నరకడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామమంతా కనుమ సంబరాల్లో హడావుడిగా ఉంది. గ్రామస్తులు రామాలయం నడి వీధిలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు. మద్యం మత్తులో ఘాతుకం కాగా, తలారి సురేష్, అతడి పెదనాన్న కుమారుడు తలారి చలపతి ఆదివారం ఉదయం నుంచీ మద్యం మత్తులో తూగుతున్నారు. సంబరాల్లో భాగంగా అమ్మవారికి బలిచ్చే గొర్రెను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికీ తీసుకెళ్లి పూజలు చేయిస్తూ నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సురేష్ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ గొర్రె వెంట బయలుదేరాడు. తలారి చలపతి చేతితో వేట కొడవలి పట్టుకుని గొర్రెతోపాటు నడుస్తుండగా రెండుమూడుసార్లు సురేష్ అతడిపై తూలిపడ్డాడు. ఆగ్రహించిన చలపతి అమ్మవారి గొర్రెకు చందాలు ఇచ్చే స్తోమత లేదు కానీ డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా చిన్నపాటి గొడవ జరిగింది. చలపతి డప్పుల వారిని నిలిపేయాల్సిందిగా ఆదేశించడంతో తాను డ్యాన్సు వేయాల్సిందేనని సురేష్ పట్టుపట్టాడు. దీంతో చలపతి ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న వేట కొడవలితో ఒక్క ఉదుటున సురేష్ మెడపై నరికాడు. మెడ సగ భాగం వరకు తెగిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి గ్రామస్తులు భయకంపితులై ఇళ్లల్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సురేష్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన రక్తస్రావం కావడంతో అప్పటికే సురేష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మద్యం సేవించి ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం..
సాక్షి, నల్గొండ: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల చిన్నారిని మాయమాటలతో దగ్గరకు పిలుచుకున్నాడు. మద్యంమత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి ఏడవటంతో వదిలేశాడు. ఆ చిన్నారి ఏడుచుకుంటూ రావడాన్ని గమనించిన కుటింబీకులు ఏం జరిగిందని అడుగగా విషయాన్ని వివరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు రమేశ్‌ను పట్టుకొని చితకబాదారు అనంతరం పోలీసులకు అప్పజెప్పేందుకు ప్రయత్నించగా అక్కడనుంచి తప్పించుకొని పరారయ్యాడు. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు. చదవండి: యువకుడు, మహిళ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా? చదవండి: తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు.. -
కల్లు తాగి మత్తులో ఉంటాడు.. తిట్టారో... చచ్చారే...
డిచ్పల్లి: కల్లు తాగిన మత్తులో ఉండగా ఎవరైనా అతడిని బూతులు తిడితే మృగంలా మారిపోతాడు. తనను తిట్టిన వారిని హత్య చేస్తాడు. ఇలా మూడు హత్యలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షారూఖ్ (25)ను డిచ్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 5న డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులోని శ్మశాన వాటిక ప్రహరీ పక్కన చెట్ల పొదల్లో మిట్టాపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సుంకెట నర్సవ్వ (60) మృతదేహం లభించింది. హత్యాస్థలంలో ఆధారాల మేరకు నిందితుడు షారూఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నర్సవ్వ హత్యకు ముందు మరో రెండు హత్యలు కూడా చేసినట్లు తెలిపాడు. ఈనెల 5న నర్సవ్వతో కలసి శ్మశాన వాటిక వద్ద కల్లు తాగుతుండగా ఆమె తిట్టిందని, దీంతో కోపమొచ్చి ఆమెను కల్లు సీసాతో కడుపులో పొడిచి చంపానన్నాడు. ఏడాదిన్నర క్రితం డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద మిట్టాపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తిట్టినందుకు తలపై బండరాయితో కొట్టి చంపానని, ఫిబ్రవరిలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో షేక్ మోసిన్‌తో కల్లు తాగుతుండగా జరిగిన గొడవలో అతన్ని గ్రానైట్ రాయితో తలపై మోది హత్య చేశానన్నాడు. మూడు హత్యలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న షారూఖ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. -
మత్తు ఇచ్చి నగలు దోపిడీ
‘మేడమ్.. నాకు ప్రమోషన్ వచ్చింది.. స్వీట్ తీసుకోండి’ అంటూ ఇంటి యజమానితో మాట కలిపాడు. ఆమె తిరస్కరించడంతో.. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి అంటూ ఆఫర్ చేశాడు. మత్తు మందు కలిపిన ఆ కూల్‌డ్రింక్ తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంకేముంది.. మన వాడు చేతి వాటం చూపించి ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని చక్కాపోయాడు. నూజివీడు: కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అద్దె ఇంట్లో దిగటం, ఆ ఇంటి యజమానులతో పరిచయం పెంచుకోవడం, సమయం చూసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు దోచుకెళ్లడం. కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నూజివీడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కె.వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు యుగంధర్ (33) కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులకు చెందిన ఇంట్లో జూలై నెలలో అద్దెకు దిగాడు. జూలై 18న తనకు ప్రమోషన్ వచ్చిందని, స్వీటు తినమంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వెంకటేశ్వరరావు తినగా, ఝాన్సీలక్ష్మీ తనకు డయాబెటిస్ ఉండటంతో తిరస్కరించింది. దీంతో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దీంతో దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత యుగంధర్ ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల నానుతాడును దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై సచివాలయానికి చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శి స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్, రూరల్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను వెతికి పట్టుకుని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 కాసుల రెండు నానుతాడులను స్వాధీనం చేసుకున్నారు. 2006 నుంచే దొంగతనాలు యుగంధర్‌ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గుంటూరు జిల్లా తెనాలి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, అన్నవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు ప్రాంతాల్లో ఇలాంటి దోపీడీలే చేసినట్లు తేలింది. 2006 నుంచి దొంగతనాలకు అలవాటైన యుగంధర్‌పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇవ్వగా డోసు ఎక్కువై వృద్ధుడు చనిపోయాడు. యుగంధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్‌అలీ (26) ఓ కాల్సెంటర్లో పనిచేస్తూ 20 రోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆదివారం రాత్రి బార్కాస్‌లో జరిగిన పార్టీలో పీకలదాకా మద్యం తాగాడు. సోమవారం ఉదయం ఇంటికి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న అలీ ఔటర్‌పై దారితప్పి గచ్చిబౌలి, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గోపన్‌పల్లి వైపు వెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా 60 మీటర్ల దూరంలో పార్క్‌చేసి ఉన్న స్కూటర్‌ను ఢీకొట్టి ఓ ఇంట్లోకి దూసుకుపో యింది. ఇంటి గోడలు ధ్వంసం కావడంతో ఇంట్లో ఉన్న మధుబాయ్(45) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. హౌస్‌కీపింగ్ పనులు చేసుకునే మధుబాయ్ భర్త సట్వాజీ 2010లోనే మృతి చెందాడు. వారికి ఐదుగురు సంతానం. నిందితుడు ఇక్రమ్ అలీని స్థానికులు పోలీ సులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిందితుడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం 168 ఎంఎల్‌గా నమోదైంది. పోలీసులు అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీ బాటిల్
మందుకొడితే అన్నీ మర్చిపోవచ్చుమందుకొడితేబాధను తొక్కేయవచ్చుమందుకొడితే కష్టాన్నికాటికి పంపేయవచ్చుఇవన్నీ ఓకే గానీ,మందుకొడితే బాధనీ, కష్టాన్నీ తుడిచేయగలుగుతారా?! నాట్ పాసిబుల్! కాసేపు ఇవన్నీ మరిపించవచ్చు కానీ ఎప్పటికీ తుడిచేయలేం. కష్టం, బాధ, దుఃఖం... ఒక వెలితిని.. ఎమ్టీనెస్ని, ఖాళీతనాన్ని కలిగిస్తాయి. దానిని నింపుకోవడానికి మందుకొడతారు. బాటిల్ ఖాళీ అవుతుంది కానీ బాధ నిండుగానే ఉంటుంది. నిండు జీవితాలను ఖాళీ చేసుకోకండి. తలుపు దబ దబ బాదిన శబ్దానికి ఉలిక్కిపడింది కమల. అర్థరాత్రి దాటినట్టుగా గడియారం చూపుతోంది. ఆ వచ్చింది తన భర్త నాగరాజు అయుంటాడు. ‘రోజూ ఇదే తంతు. ఎన్నేళ్లు భరించాలో ఈ ఖర్మ’ అనుకుంటూ లేచి వెళ్లి లైటు వేసి, డోర్ తీసింది. ఎదురుగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ‘‘ఎవరు?’’ అంది భయంగా! ‘‘ఇతను మీ హజ్బెండేనా?’’ అన్నారు వారిలో ఒకరు. వారి చేతుల్లో వాలిపోయున్న వ్యక్తిని చూసిన కమల ‘అవును’ అన్నట్టు తలూపింది. ఇద్దరు వ్యక్తులు అతణ్ణి మోసుకొని లోపలికి తీసుకువచ్చి, సోఫాలో పడుకోబెట్టారు. ఒళ్లంతా దెబ్బలు తగిలిన ట్టు రక్తపు చారికలు కనిపించాయి. ముఖం ఉబ్బిపోయింది. వాళ్లవైపు ఆందోళనగా చూసింది ఏమైందన్నట్టు? ‘‘బాగా తాగున్నాడు. బార్లో గొడవ పడ్డాడు. అవే ఈ దెబ్బలు. ఫోన్ చేద్దామంటే అది పగిలిపోయింది. లక్కీగా జేబులో అ్రyð స్ ఉంది. మాదీ ఇదే దారి కావడంతో తీసుకొచ్చాం. కమల కన్నీళ్లతోనే వారికి రెండుచేతులు జోడించింది చాలా సాయం చేశారంటూ! చావు బతుకుల ప్రయాణం ‘‘డాక్టర్, నా కొడుకుని బతికించండి. మీ కాళ్లు పట్టుకుంటాను..’’ డాక్టర్ని ప్రాధేయపడుతున్నాడు నాగరాజు. కమల భర్తని నిర్వేదంగా చూసింది. నాగరాజు బాబాయికి ఒంట్లో బాగోలేదంటే వెళ్లాడు తన ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకొని. కమల వద్దని వారించినా వినలేదు. తిరుగు ప్రయాణంలో నాగరాజు బాబాయి వారించాడు. ‘‘ఒరేయ్, నన్ను చూడటానికి వచ్చి, బాగా తాగావు. ఈ రాత్రి మత్తు లో ప్రయాణం అంత మంచిది కాదు. రేపు ఉదయానే వెళ్లు్ల’ అంటే వినిపించుకోలేదు నాగరాజు. ‘‘ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాను’’ అని కొడుకును తీసుకొని బండిమీద ఇంటికి బయల్దేరాడు. ఇంకాసేపట్లో ఇల్లు చేరుతాడనగా డివైడర్‌ను ఢీకొట్టాడు. పిల్లవాడు అంతెత్తున ఎగిరి పడిపోయాడు. కొద్దిపాటి దెబ్బలతో నాగరాజు బతికి బయటపడ్డాడు. కొడుకు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మత్తు దిగిన నాగరాజు కొడుకు పరిస్థితికి విలవిల్లాడిపోయాడు. భర్తను ఏమీ అనలేని నిస్సహాయతతో గోడకు చేరగిలబడింది కమల. పదేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది. దారి తెలియని గమనం ‘తమకు పెళ్లై పదేళ్లు. మొదట్లో బాగానే ఉండేవాడు. ఆ తర్వాత తప్పతాగి రోజూ తప్పటడుగులు వేస్తూ ఇంటికి వస్తుండేవాడు. ‘ఎలా భరిస్తున్నావ్!’ అన్నవాళ్లే అంతా! ‘‘ఎందుకిలా తాగడం? ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకోవడం కాకపోతే..’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసింది. అలా అడిగినందుకు తన్నులు తింది. ఏడ్చింది. పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించింది. కానీ, నాగరాజులో ఏ మార్పూ రాలేదు. ఇద్దరు పిల్లలు. వారి జీవితాలను ఓ దారిలో పెట్టాల్సిన తండ్రి తప్పతాగి ఎక్కడో దారిలో పడిపోయి, మత్తు దిగాక ఇల్లు చేరుతుంటాడు. ఎక్కడా నిలకడలేని ఉద్యోగం. అందిన చోటల్లా అప్పులు. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తాగుడుకే మాయమయ్యాయి. ఏడాది క్రితం కాలేయం జబ్బు వస్తే ఉన్నదంతా ఊడ్చి చికిత్సకు పెట్టింది. ఎప్పటికైనా మార్పు వస్తుందేమోనని ఎదురుచూస్తున్న తనకు ఇప్పుడు ఈ పరిస్థితి...’ కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్లలో నీరింకిపోయాయి కమలకు. కరిగిన ఆవేదన ‘‘నా తండ్రి ఓ తాగుబోతు. తాగొచ్చి మా అమ్మను కొడుతుండేవాడు. అతను ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నది లేదు. నేను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయి తో ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. నాక్కావల్సిన ప్రేమ ఎప్పటికీ దక్కదు. నా పనిని ఎవరూ మెచ్చుకోరు. నా భార్య నన్ను అర్థం చేసుకోదు. మందు తాగితే మత్తు వస్తుంది. ఆ మత్తులో అన్నీ మర్చిపోవచ్చు. అందుకే తాగుతున్నాను’’ చెబుతున్న నాగరాజు కళ్ల వెంట ధారగా నీళ్లు. అంతా వింటున్న కమల విస్తుపోతూ భర్తను చూస్తోంది. కొడుకు స్కూల్ టీచర్ నాగరాజు–కమలను పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీకి తీసుకువచ్చింది. కమల ద్వారా విషయం తెలుసుకున్న టీచర్ వారి జీవితాలు చక్కబడటానికి ఈ థెరపీ ఓ సాధనంలా పనిచేస్తుందని వివరించింది. ధ్యానప్రక్రియలో నాగరాజు తన గతజీవితాన్ని దర్శించడంతో పాటు గమనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. వెలితిని పూడ్చిన ఆశ నాగరాజును పదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పటి జీవితాన్ని దర్శించమని చెప్పాడు కౌన్సెలర్. ధ్యానప్రక్రియ ద్వారా తన జీవితం పదేళ్ల తర్వాత ఎలా ఉందో మస్తిష్కంలో దర్శించాడు నాగరాజు. ‘‘పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో తను ఆనందంగా ఉన్నాడు. ఇంటా బయట తనకు గౌరవం పెరిగింది..’’ తన స్థితిని చూసుకున్న నాగరాజు ఆనందంగా ‘కళ్లు తెరిచాడు.’ ‘‘నా భవిష్యత్తును అందంగా మలుచుకోవడం నా చేతుల్లోనే ఉంది సర్. నాలో వెలితిని నేనే పూడ్చకోగలను’’ ఆనందంతో కౌన్సెలర్‌కు, తమను థెరపీకి తీసుకువచ్చిన టీచర్‌కు కృతజ్ఞతలతో చెప్పాడు నాగరాజు. ఆనందం వైపు మలుపు కమల భర్త స్థితిని అర్థం చేసుకుంది. నాగరాజు ఉద్యోగంలో చేరాడు. తనూ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడుగా వాదోడుగా ఉంది కమల. మెల్ల మెల్లగా అప్పులు తీరాయి. రెండేళ్లుగా నాగరాజు జీవితంలో వచ్చిన మార్పును చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు స్కూల్‌కెళుతున్నారు. గత జీవితం నాగరాజుకు అవగాహన కలిగిస్తే భవిష్యత్తు దర్శనం అతనికి ఆనందంగా ఉండటం ఎలాగో నేర్పింది. వ్యసనం నుంచి దూరం చేసింది. వెలితిని పూడ్చటానికే వ్యసనాలు నాగరాజు థెరపీ తీసుకున్నప్పుడు ఈ జన్మతాలూకు గతంతో పాటు కిందటి జన్మలను కూడా దర్శించగలిగాడు. ప్రేమరాహిత్యం ఎన్నిజన్మలుగా అనుభవిస్తున్నాడో తెలుసుకున్నాడు. ఆ బాధలను, వెలితిని ఈ జన్మకూ మోసుకొచ్చినట్టు తెలుసుకున్నాడు. అందుకే తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు అలవాటుపడ్డాడు. థెరపీ తీసుకున్నాక ఇక వాటి అవసరం లేదని గుర్తించాడు. ఈ ‘వెలితి’కి ఆడా–మగ తేడాలేదు. ‘వెలితి’గా అనిపించినప్పుడు అధికంగా షాపింగ్ చేయడం, అమితంగా తినడం, అతిగా మాట్లాడటం.. వంటివన్నీ చేస్తుంటారు. హానికరమైనదెప్పుడు తీసుకున్నా లోపల నుంచి అంతరాత్మ హెచ్చరిస్తుంటుంది. కానీ, వెలితి కారణంగా దానిని పట్టించుకోరు. మూల చికిత్స ఇప్పిస్తే వారిలో మార్పు తీసుకురావచ్చు. అందరూ గౌరవించడం, ప్రేమించడం వంటి భవిష్యత్తును చూసుకున్నాక ఇలాంటి వారి ఆలోచనా సరళలో తప్పక మార్పు రావడం గమనించాం. – డాక్టర్ హరికుమార్, ఫ్యూచర్ థెరపిస్ట్, బ్లిస్ఫుల్ ఫౌండేషన్, హైదరాబాద్ పూర్ణశ్వాసలు.. మేలైన చికిత్స విఘ్నాధిపతి వినాయకుడి తొండం నాభివరకు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. పూర్ణశ్వాస ప్రాముఖ్యాన్ని ఈ మూర్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు. యోగా, ధ్యాన ప్రక్రియలు ఇందుకే మన ప్రాచీనులు మనకు అమోఘంగా తెలియశారు. ఆల్కహాల్ వంటి వ్యసనాల బారి నుంచి బయట పడటానికి ‘రి–బర్తింగ్ థెరపీ’ ఉంది. నాసిక నుండి నాభి వరకు తీసుకునే పూర్ణశ్వాస పద్ధతి గురించి అమెరికన్ సైకాలజిస్ట్ లియోనార్డ్.ఆర్ విస్తృతంగా తెలియజేశారు. అంటే, నాసిక నుంచి నాభి వరకు తీసుకునే శ్వాసలు సంపూర్ణజీవితానికి ఎలా దోహదం చేస్తాయో తెలిపారు. గతజన్మలు నమ్మనివారికి ఇది సరైన చికిత్స. దీని వల్ల చేతన సహిత జీవన కాంక్ష వచ్చేస్తుంది. భ్రమల్లోకి వెళ్లి ‘నేను’ అనే తృప్తి కలుగుతుంది. తమ బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని చూసుకున్నప్పుడు ‘ఆశ’ చిగురిస్తుంది. దీని వల్ల వ్యసనాలకు దూరం అవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం అవుతుంది. దీంతో స్వీయ ప్రేరణ కలుగుతుంది. మనిషి ప్రతి దశలోనూ ఏదో విధంగా అంతరశిశువు ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటుంది. పాస్ట్‌లైఫ్ థెరపీ, ఫ్యూచర్‌లైఫ్ థెరపీలద్వారా ఆ ప్రతిబంధకాలన్నీ నిర్మూలనం అవుతాయి. స్వీయ ప్రేమ, ప్రేరణ కలుగుతాయి. శల్యుడు మత్తు సారధ్యం మాద్రి సోదరుడు, పాండవుల మేనమామ అయిన శల్యుడుకి రథ సారధ్యం వహించడంలో కృష్ణుడంతటి పేరుంది. దుర్యోధనుడు ఇచ్చిన విందుతో ‘మత్తు’లో మునిగిన శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు కాకుండా కౌరవపక్షం వహించాల్సి వచ్చింది. ‘మత్తు’ కారణంగా అధర్మం వైపు ఉండాల్సివచ్చిందే అనుకోవడమే కాకుండా తన విధిని సరిగా నిర్వర్తించలేకపోయాడు. యుద్ధంలో ప్రత్యర్థులను అదేపనిగా పొగుడుతూ కర్ణుడి చావుకు తనూ ఓ కారణంగా నిలిచాడు. – నిర్మల చిల్కమర్రి -
విద్యార్థి కిడ్నాప్‌నకు యత్నం
– మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లిన దుండగులు – స్పృహ వచ్చిన తరువాత తప్పించుకున్న విద్యార్థి – యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వెంకటరమణ కాలనీలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. మత్తు మందు ఇచ్చి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో స్కృహలోకి రాగానే తప్పించుకొని ఆ విద్యార్థి ఇంటికి చేరాడు. అయితే విద్యార్థి కనిపించకుండా నాలుగైదు గంటలు గడిచినా యాజమాన్యం తల్లిదండ్రులకు తెలపకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..చిన్నటేకూరుకు చెందిన కల్యాన్, రేవతి దంపతుల కుమారుడు వెంకటేష్..రవీంద్రభారతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలకు మైదానం లేకపోవడంతో ప్రతీ శనివారం విద్యార్థులను బస్సులో అవుట్ డోర్ స్టేడియానికి తీసుకెళ్లి ఆటలు ఆడిస్తారు. అందులో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు విద్యార్థులను స్టేడియానికి తీసుకెళ్లారు. వెంకటేష్‌కు తలనొప్పి ఉండడంతో ఆటలు ఆడకుండా పక్కన కూర్చున్నాడు. ఇంతలోనే ఆ విద్యార్థిపై మెడపై ఇద్దరు వ్యక్తులు చేయివేసి అరవకుండా మూతికి బట్టను అడ్డంగా పెట్టి మత్తు మందును ఇచ్చి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థికి స్పృలోకి వచ్చాడు. వెంటనే వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఆటోలో నాలుగున్నర గంటలకు ఇంటికి చేరి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం వెంకటేష్‌ను కిడ్నాప్ చేశారన్న విషయాన్ని నాలుగైదు గంటలైనా తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తెలపలేదు. కనీసం పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు వెంకటేష్ ఎక్కడ ఉన్నాడో యాజమాన్యానికి తెలియదు. అయితే ఆరున్నర గంటల సమయంలో తండ్రి కల్యాణ్ ఇంటికి వచ్చిన కుమారుడి తీసుకొని జరిగిన సంఘటనపై వివరాలను తెలుసుకునేందుకు పాఠశాలకు వెళ్లాడు. అప్పుడు యాజమాన్యం హడావుడిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఏదైనా హాని జరిగి ఉంటే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చివరకు ఎట్టకేలకు యాజమాన్యం, తల్లిదండ్రులు సంయుక్తంగా జరిగిన సంఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మత్తు.. గమ్మత్తు
– నొప్పిలేకుండా ఆపరేషన్లు – మత్తు మందు వినియోగంలో విప్లవాత్మక మార్పులు – నేడు ప్రపంచ అనెస్తెషియా దినోత్సవం 'భగవంతుడు తను సృష్టించిన మానవున్ని గాఢనిద్రలోకి జారుకునేటట్లు చేసి, అలా నిద్రలో ఉండగా ఆయన శరీరంలోని పక్కటెముకను ఒక దానిని తీసి, దాని నుంచి ఒక స్త్రీని సృష్టించి ఆ మానవునికి తోడుగా ఉంచాడు' అని బైబిల్లో పేర్కొన్నారు. అదే విధంగా అనెస్తీసియాలజిస్టు సైతం రోగిని నిద్రలోకి జారుకునే విధంగా చేసి, శస్త్రచికిత్స తర్వాత మళ్లీ రోగిని పూర్వసి్థతికి తీసుకువస్తాడు. అనెస్తీషియా అనే వైద్యవిధానం నేడు ప్రత్యేక శాస్త్రంగా రూపుదిద్దుకుంది. 1846 అక్టోబర్ 16వ తేదిన డబ్లు్యటీజీ మోర్టాన్ అనే డాక్టర్ మసాచ్యూట్స్ జనరల్ ఆసుపత్రిలో 'ఈధర్' అనే మత్తుమందును మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఆదివారం ‘ ప్రపంచ అనెస్తీషియా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం. - కర్నూలు(హాస్పిటల్ జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటన్నింటిలో ఆపరేషన్ థియేటర్లు అక్కడి అనెస్తీషియా విభాగం, వైద్యుల ఆధీనంలో ఉంటాయి. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే సంవత్సరానికి 25వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. మిగిలిన ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. అంటే ఏడాదికి అన్ని ఆసుపత్రుల్లో కలిపి 75 వేలకు పైగా రోగులకు ఆపరేషన్లు నిర్వహించడంలో అనెస్తెషియా వైద్యులే కీలక పాత్ర పోషిస్తారు. ఆపరేషన్ థియేటర్లలోనే గాక అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో వెంటిలేటర్లు ఉంటాయి. వాటి నిర్వహణ బాధ్యత కూడా ఈ వైద్యులే చూస్తారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అనెస్తెటిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేది ఉదయం 7 గంటల కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజవిహార్ వరకు, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం స్థానిక బళ్లారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో 'పెయిన్ మేనేజ్మెంట్' అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ అనెస్తెషియా వైద్యులు డాక్టర్ రాజమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. అనెస్తీషియా–అపోహలు –శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ విభాగంలో రోగి ప్రాణానికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఎంతటి చిన్న ఆపరేషన్ అయినా ఈ ప్రాణాపాయం ఉంటుంది. అందరూ అనుకునేటట్లుగా చిన్న ఆపరేషన్ కాబట్టి ఏం భయం అవసరం లేదని అనుకోవడానికి వీలులేదు. – మత్తు డాక్టర్ మత్తు మందు ఇవ్వడంలో ఆయన పని అయిపోతుందనే అభిప్రాయం సరైంది కాదు. శస్త్రచికిత్స ముందు రోగిని పరీక్షించి, రోగికి ఆపరేషన్ తట్టుకునే సామర్థ్యం ఉందా అని నిర్దారించుకుని, ఆపరేషన్ సమయంలో అనుక్షణం రోగిని కంటికి రెప్పలా కాపాడి, ఆ తర్వాత ఆ రోగిని పూర్వపుస్థితికి తీసుకుని వచ్చే బాధ్యత అనెస్తీషియా డాక్టర్‌దే. –మత్తు మందు ఇచ్చేది జబ్బును నయం చేయడానికి కాదు. సర్జన్ శస్త్రచికిత్సకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి, రోగికి నొప్పి లేకుండా ఉంచడానికి మాత్రమే. కావున ముందు రోగి శరీర ధర్మాన్ని అనుసరించి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా పనిచేయవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించవచ్చు. కార్డియోథొరాసిక్లో అత్యాధునిక సేవలు : డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, ఏపీ అనెస్తెటెస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్లో ఏర్పాటు చేసిన మాడ్యులర్ ఓటీ అత్యాధునికమైనది. ఈ విభాగంలో గుండె సంబంధిత వ్యాధులు, రక్తనాళాలు పూడిపోయినప్పుడు, గుండెకవాటాలు సరిగా పనిచేయననప్పుడు, పుట్టుకతో గుండెకు రంధ్రాలు ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో మత్తు డాక్టర్ పాత్ర కీలకంగా ఉంటుంది. స్పైనల్ అనెస్తీషియా అంటే మత్తు మందును వెన్నుపాములోనికి పంపించడం. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలో ఆయా భాగాలలో రోగికి నొప్పి తెలియకుండా చేయవచ్చు. రోగి స్పృహ కోల్పోడు. సాధారణంగా గర్భిణిలో నిర్వహించే సిజేరియన్ ఆపరేషన్లకు, ఆర్థోపెడిక్ విభాగంలో కాళ్లకు సంబంధించి గాయాలకు శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అనెస్తీషియాలో విప్లవాత్మకమైన మార్పులు: డాక్టర్ శాంతిరాజు, ఏపీ అనెస్తీషియాలజిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి 1847లో జేమ్స్ యంగ్ సిమ్సన్ అనే ప్రొఫెసర్ క్లోరోఫామ్ అనే మత్తుమందును కనుగొన్నారు. ఆ తర్వాత ఈ వి«భాగం గణనీయమైన పురోగతిని సాధించింది. 1917లో బాయ్ల్స్ అనే అనెస్తీషియా మిషన్ కనిపెట్టారు. ఈ మిషన్ అనెస్తీషియా విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. దీని ద్వారా ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ అనెస్తీషియా వాయువులను నిర్ధిష్టమైన ప్రమాణంలో రోగి శరీరంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. మాజిల్, రియోబోతమ్ ఎండోట్రాకియల్ ట్యూట్ అంటే స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని అందించేందుకు ఒక గొట్టాన్ని కనుగొన్నారు. మనం తరచుగా చెప్పుకునే జనరల్ అనెస్తీషియాను ఈ గొట్టం ద్వారానే ఇస్తారు. పెయిన్ క్లినిక్లదే కీలక పాత్ర : డాక్టర్ రామశివనాయక్, అనెస్తీషియా వైద్యులు పెయిన్ క్లినిక్ (దీర్ఘకాలిక నొప్పులు నివారించే) విధానాల్లో నేడు అనెస్తెషియాలజిస్టు తన సేవలను అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెయిన్ క్లినిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు. అదే విధంగా 1930లో రక్తనాళాల ద్వారా మత్తుమందును ఇచ్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. క్రిటికల్ కేర్ అంటే అత్యవసర చికిత్స విభాగం, ట్రామాకేర్ అంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో గాయాల బారిన పడిన వారికి చేసే చికిత్సా విధానం. అదే విధంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన వాటిపై శస్త్రచికిత్సలు జరిపి, అవి విజయవంతం కావడానికి అనెస్తీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక శాస్త్ర పరిజ్ఞానమే కారణం. – నొప్పిలేకుండా ఆపరేషన్లు – మత్తు మందు వినియోగంలో విప్లవాత్మక మార్పులు – నేడు ప్రపంచ అనెస్తెషియా దినోత్సవం 'భగవంతుడు తను సృష్టించిన మానవున్ని గాఢనిద్రలోకి జారుకునేటట్లు చేసి, అలా నిద్రలో ఉండగా ఆయన శరీరంలోని పక్కటెముకను ఒక దానిని తీసి, దాని నుంచి ఒక స్త్రీని సృష్టించి ఆ మానవునికి తోడుగా ఉంచాడు' అని బైబిల్లో పేర్కొన్నారు. అదే విధంగా అనెస్తీసియాలజిస్టు సైతం రోగిని నిద్రలోకి జారుకునే విధంగా చేసి, శస్త్రచికిత్స తర్వాత మళ్లీ రోగిని పూర్వసి్థతికి తీసుకువస్తాడు. అనెస్తీషియా అనే వైద్యవిధానం నేడు ప్రత్యేక శాస్త్రంగా రూపుదిద్దుకుంది. 1846 అక్టోబర్ 16వ తేదిన డబ్లు్యటీజీ మోర్టాన్ అనే డాక్టర్ మసాచ్యూట్స్ జనరల్ ఆసుపత్రిలో 'ఈధర్' అనే మత్తుమందును మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఆదివారం ‘ ప్రపంచ అనెస్తీషియా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం. - కర్నూలు(హాస్పిటల్ జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటన్నింటిలో ఆపరేషన్ థియేటర్లు అక్కడి అనెస్తీషియా విభాగం, వైద్యుల ఆధీనంలో ఉంటాయి. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే సంవత్సరానికి 25వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. మిగిలిన ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. అంటే ఏడాదికి అన్ని ఆసుపత్రుల్లో కలిపి 75 వేలకు పైగా రోగులకు ఆపరేషన్లు నిర్వహించడంలో అనెస్తెషియా వైద్యులే కీలక పాత్ర పోషిస్తారు. ఆపరేషన్ థియేటర్లలోనే గాక అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో వెంటిలేటర్లు ఉంటాయి. వాటి నిర్వహణ బాధ్యత కూడా ఈ వైద్యులే చూస్తారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అనెస్తెటిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేది ఉదయం 7 గంటల కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజవిహార్ వరకు, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం స్థానిక బళ్లారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో 'పెయిన్ మేనేజ్మెంట్' అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ అనెస్తెషియా వైద్యులు డాక్టర్ రాజమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. అనెస్తీషియా–అపోహలు –శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ విభాగంలో రోగి ప్రాణానికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఎంతటి చిన్న ఆపరేషన్ అయినా ఈ ప్రాణాపాయం ఉంటుంది. అందరూ అనుకునేటట్లుగా చిన్న ఆపరేషన్ కాబట్టి ఏం భయం అవసరం లేదని అనుకోవడానికి వీలులేదు. – మత్తు డాక్టర్ మత్తు మందు ఇవ్వడంలో ఆయన పని అయిపోతుందనే అభిప్రాయం సరైంది కాదు. శస్త్రచికిత్స ముందు రోగిని పరీక్షించి, రోగికి ఆపరేషన్ తట్టుకునే సామర్థ్యం ఉందా అని నిర్దారించుకుని, ఆపరేషన్ సమయంలో అనుక్షణం రోగిని కంటికి రెప్పలా కాపాడి, ఆ తర్వాత ఆ రోగిని పూర్వపుస్థితికి తీసుకుని వచ్చే బాధ్యత అనెస్తీషియా డాక్టర్‌దే. –మత్తు మందు ఇచ్చేది జబ్బును నయం చేయడానికి కాదు. సర్జన్ శస్త్రచికిత్సకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి, రోగికి నొప్పి లేకుండా ఉంచడానికి మాత్రమే. కావున ముందు రోగి శరీర ధర్మాన్ని అనుసరించి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా పనిచేయవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించవచ్చు. కార్డియోథొరాసిక్లో అత్యాధునిక సేవలు : డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, ఏపీ అనెస్తెటెస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్లో ఏర్పాటు చేసిన మాడ్యులర్ ఓటీ అత్యాధునికమైనది. ఈ విభాగంలో గుండె సంబంధిత వ్యాధులు, రక్తనాళాలు పూడిపోయినప్పుడు, గుండెకవాటాలు సరిగా పనిచేయననప్పుడు, పుట్టుకతో గుండెకు రంధ్రాలు ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో మత్తు డాక్టర్ పాత్ర కీలకంగా ఉంటుంది. స్పైనల్ అనెస్తీషియా అంటే మత్తు మందును వెన్నుపాములోనికి పంపించడం. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలో ఆయా భాగాలలో రోగికి నొప్పి తెలియకుండా చేయవచ్చు. రోగి స్పృహ కోల్పోడు. సాధారణంగా గర్భిణిలో నిర్వహించే సిజేరియన్ ఆపరేషన్లకు, ఆర్థోపెడిక్ విభాగంలో కాళ్లకు సంబంధించి గాయాలకు శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అనెస్తీషియాలో విప్లవాత్మకమైన మార్పులు: డాక్టర్ శాంతిరాజు, ఏపీ అనెస్తీషియాలజిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి 1847లో జేమ్స్ యంగ్ సిమ్సన్ అనే ప్రొఫెసర్ క్లోరోఫామ్ అనే మత్తుమందును కనుగొన్నారు. ఆ తర్వాత ఈ వి«భాగం గణనీయమైన పురోగతిని సాధించింది. 1917లో బాయ్ల్స్ అనే అనెస్తీషియా మిషన్ కనిపెట్టారు. ఈ మిషన్ అనెస్తీషియా విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. దీని ద్వారా ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ అనెస్తీషియా వాయువులను నిర్ధిష్టమైన ప్రమాణంలో రోగి శరీరంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. మాజిల్, రియోబోతమ్ ఎండోట్రాకియల్ ట్యూట్ అంటే స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని అందించేందుకు ఒక గొట్టాన్ని కనుగొన్నారు. మనం తరచుగా చెప్పుకునే జనరల్ అనెస్తీషియాను ఈ గొట్టం ద్వారానే ఇస్తారు. పెయిన్ క్లినిక్లదే కీలక పాత్ర : డాక్టర్ రామశివనాయక్, అనెస్తీషియా వైద్యులు పెయిన్ క్లినిక్ (దీర్ఘకాలిక నొప్పులు నివారించే) విధానాల్లో నేడు అనెస్తెషియాలజిస్టు తన సేవలను అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెయిన్ క్లినిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు. అదే విధంగా 1930లో రక్తనాళాల ద్వారా మత్తుమందును ఇచ్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. క్రిటికల్ కేర్ అంటే అత్యవసర చికిత్స విభాగం, ట్రామాకేర్ అంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో గాయాల బారిన పడిన వారికి చేసే చికిత్సా విధానం. అదే విధంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన వాటిపై శస్త్రచికిత్సలు జరిపి, అవి విజయవంతం కావడానికి అనెస్తీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక శాస్త్ర పరిజ్ఞానమే కారణం. -
మత్తుకు కొత్త మార్గాలు
శ్రీకాకుళం : కవితకు కాదేదీ అనర్హం.. అన్నట్లు యువకులు మత్తు కోసం కొత్త కొత్త మార్గాలను కొనుగొంటున్నారు. తాజాగా ఫెవికాల్‌ను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఫెవికాల్‌ను ఓ ఫాలథిన్ కవర్లో వేసి వాసన చూస్తూ మత్తులో జోగిపోతున్నారు. ఇందులో మరేదైనా కలుపుతున్నారా, లేదా అన్నది యువకులు చెప్పడం లేదు. ఇటీవల ఆదివారంపేట నుంచి రిమ్స్ ఆస్పత్రి వరకు ఉన్న నాగావళి నది గట్టుపై ఇటువంటి యువకులను పలువురు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సాక్షి అక్కడికి వెళ్లేసరికి పలువురు యువకులు నడవలేని స్థితిలో మత్తులో అచేతనంగా ఉండిపోయారు. వారి పక్కన ఫెవికాల్ డబ్బాలు, పాలథిన్ కవర్లు ఉన్నాయి. దీనిని వాసన చూస్తే మత్తు వస్తోందని, దీనిని తాము మానలేకపోతున్నామని మత్తులో ఉన్న యువకులు అతి కష్టం మీద సాక్షికి తెలిపారు. ఫెవికాల్లో మరేదైనా కలుపుతున్నారా! అన్న దానికి వారు సమాధానం కూడా చెప్పలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇటువంటి వాటిపై నిఘా వేసి యువత ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది
హూస్టన్: 20 ఏళ్లుగా చూపులేకుండా అంధకారంలో మగ్గిన 70 ఏళ్ల మహిళ తన గదిలో జారి పడి, తలకు దెబ్బ తగిలి తిరిగి చూపు పొందింది. ఫ్లోరిడాకు చెందిన మేరీ ఆన్ ఫ్రాంకో 1993లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెన్నముకకు గాయమై క్రమంగా చూపు కోల్పోయింది. 22 ఏళ్ల తర్వాత.. గత ఆగస్టులో ఆన్ తన గదిలో తలుపు ైవె పు వెళ్తుండగా కాలు జారి కిందపడింది. తల.. నేలకు బలంగా తాకింది. అప్పటి నుంచి కొన్ని వారాల క్రితం ఆపరేషన్ జరిగే దాకా అచేతనంగా ఉంది. మెడకు శస్త్ర చికి త్స చేశారు. మత్తు నుంచి కోలుకున్న తరువాత తనకు చూపు తిరిగొచ్చిందన్న సంగతిని గుర్తించింది. ‘‘ ఆన్ విషయంలో జరిగింది అద్భుతం. దీన్ని శాస్త్రీయంగా వివరించలేక పోతున్నాం’ అని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ జాన్ అఫ్సర్ అన్నారు. -
వైద్యురాలిపై అఘాయిత్యం
మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి.. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అత్తాపూర్: మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు (32) తన కుటుంబసభ్యులతో కలిసి రాజేంద్రనగర్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామంలోని ఓ అపార్టుమెంట్లో ఉంటోంది. ఈమె ఇంటికి ఎదురు ఫ్లాట్‌లో రాజస్థాన్‌కు చెందిన మనోజ్(30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం వైద్యురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన మోజ్ ఆమెతో మాటాలు కలిపాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే వైద్యురాలు మత్తులోకి జారుకోగా లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా, బాధితురాలు బుధవారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌కు వచ్చి తనపై మనోజ్ జరిపిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు-చిత్తు
నైజీరియన్ డ్రగ్స్ ముఠాల దందా మాదక ద్రవ్యాల అడ్డాగా హైదరాబాద్ విదేశీ మహిళ అరెస్టుతో కలకలం సిటీబ్యూరో: మహా నగరం మాదక ద్రవ్యాల అడ్డాగా మారుతోందా? ఈ మత్తులో పడి... చిత్తవుతున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఇవే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఏటా వీటిని వినియోగించే వారు పెరుగుతుండటంతో సరఫరా... విక్రయాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయనే వాదన వినిపిస్తోంది. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిలో కొంతమంది సెలబ్రిటీలు.. సంపన్నులు ఉన్నట్టు కొన్ని సందర్భాల్లో తేలడం... యువత ఇటువైపు ఆకర్షితులవుతున్నారనే సమాచారం కలవరపరుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలు మాదక ద్రవ్యాలు వినియోగించి గతంలో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా విదేశీ మహిళ మూసియా మూసా (32) పొట్టలోడ్రగ్స్ ప్యాకెట్లు పెట్టుకుని వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్ డ్రగ్ కంట్రోలర్ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనితో డ్రగ్స్ వ్యాపార అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రాణాలకు తెగించి ఆమె ఇంత సాహసం చేసిందంటే... నగరంలో డ్రగ్స్‌కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చని అధికారులే అంటున్నారు. ఆమె పొట్టలో దాదాపుగా 400 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఒక్కో గ్రాము ధర రూ.7 వేలు ఉంటుందని అంచనా. అంటే మార్కెట్లో రూ.28 లక్షల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. సరదాగా మొదలై... తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారు డ్రగ్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. మరికొందరు ఏదో తెలియని ‘శక్తి’ కోసం మాదక ద్రవ్యాల రుచి చూస్తున్నారు. ఇదే అలవాటుగా మారి మోతాదుకు మించి తీసుకుంటూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. హెరాయిన్, కొకైన్, బ్రౌన్‌షుగర్, హెఫీడ్రిన్, ఓపీఎం వంటి మాదక ద్రవ్యాలు నగరంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. నైజీరియన్ల దందా.. నగరంలో ఐటీ రంగం విస్తరించడంతో వివిధ ప్రాంతాల వారు వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం కావడంతో మానసిక ప్రశాంతతను పొందేందుకు వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇది డ్రగ్స్ వైపు అడుగులు వేయిస్తోంది. జీతాలు భారీగా ఉండటంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. స్టూడెంట్ వీసాపై నగరానికి వచ్చిన నైజీరియన్లే ఇక్కడివారి అవసరాలను అనుకూలంగా మలచుకుని డ్రగ్స్ దందా మొదలెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అవసరాల కోసం మాత్రమే తొలినాళ్లలో డ్రగ్స్‌ను తీసుకొచ్చిన వీరు... ఆ తర్వాత వ్యాపార రీత్యా భారీ మొత్తంలో తేవడం ప్రారంభించారు. అలా ఈ వ్యాపారం నగరంలో చాప కింద నీరులా పెరిగిపోయింది. గోవాలోని జేజే అనే వ్యక్తి నుంచి నైజీరియన్లు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తెప్పిస్తున్నారు. పబ్‌లలోనూ మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఉపయోగిస్తుండటంతో ఇప్పటికే వాటిపై పోలీసులు కన్నేశారు. గంజాయి హవా... వీటితో పాటు స్థానికంగా గంజాయి వ్యాపారం బాగానే పెరిగింది. ఒడిశా సరిహద్దుల నుంచి వైజాగ్ మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు భారీ మొత్తంలోనే గంజాయి చేరుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీనికి బాగానే అలవాటు పడినట్టు కనిపిస్తోంది. ధూల్‌పేట్, హుమయూన్ బజార్, అఫ్జల్‌గంజ్, చిలుకలగూడలో గంజాయి లావాదేవీలు భారీగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. హుక్కా సెంటర్లలోనూ దీనిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ఆ దిశగా పోలీసులు కన్నేసి ఉంచారు. అవగాహన కల్పించాలి... మాదక ద్రవ్యవాల వల్ల కలిగేదుష్ఫలితాలపై నగర ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లోనూ జాగృతి కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని నార్కోటిక్ సెల్ అధికారి ఒకరు తెలిపారు. డ్రగ్స్ కేసులను విచారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న కేసులు మాదక ద్రవ్యాల కేసులను దృష్టిలో పెట్టుకుని 2012లో నార్కోటిక్ సెల్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రారంభించారు. ఆ ఏడాదిలో రెండు కేసులు నమోదయ్యాయి. 2013లో పది కేసులు, 2014లో ఆరు కేసులు... ఈ ఏడాది ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయి.