
మందుబాబులతో బీచ్‌ను శుభ్రం చేయిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు.
వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment