హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసును కొంతమంది బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లో నడిరోడ్డుపై జరిగింది.
బల్లాబ్‌ఘర్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారును ఆపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ట్రాఫిక్ సబ్- ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ వద్దకు వెళ్లి బండి పత్రాలు అడిగి, చలాన్ రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై డ్రైవర్‌కు పోలీస్‌కు మధ్య వాగ్వాదం మొదలైంది.
పేపర్‌లను పరిశీలించేందుకు సబ్‌ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ డోర్ ద్వారా కారు లోపలికి వంగగా.. డ్రైవర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్‌తోపాటు కారు అలాగే ముందుకు కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు.
నిందితుడుని కొంతదూరం వెంబడించి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VIDEO | #Haryana: A cab driver tried to flee when traffic police asked for the documents of the vehicle he was driving in Ballabgarh. He was nabbed by traffic cops after a short chase. The incident reportedly took place yesterday.
(Source: Third Party) pic.twitter.com/eJILVSsqMJ— Press Trust of India (@PTI_News) June 22, 2024
Comments
Please login to add a commentAdd a comment