traffic regulations
-
G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆధ్యక్షతన సెప్టెంబర్ 8-10 వరకు జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 8-10 వరకు జరిగే ఈ సమావేశాలకు ఆయా దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపధ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపుల తోపాటు కొన్ని టాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. दिल्ली में लागू होंगे कई नियम G-20 समिट को लेकर ट्रैफिक पुलिस ने बनाया वर्चुअल हेल्पडेस्क मेट्रो में कोई बदलाव या रोक-टोक नहीं होगी 7 सितंबर की रात से कमर्शियल व्हीकल की एंट्री बंद एयरपोर्ट जाने के लिए करें मेट्रो का इस्तेमाल #G20Summit #G20India2023 #DelhiNews pic.twitter.com/oNqgtClm2v — NiwanTimes (@NiwanTimesInd) August 25, 2023 యాదవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని ఢిల్లీ వాస్తవ్యులైతే పర్వాలేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని.. మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు. ఈ మూడు రోజులు ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు. STORY | Road travel to IGI Airport will be affected on Sept 8-10 due to G20 summit: Delhi Police READ: https://t.co/rWelcfSqhq (PTI File Photo) #G20Summit #G20India2023 pic.twitter.com/0YuvRjG7pr — Press Trust of India (@PTI_News) August 25, 2023 మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్‌పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు. #WATCH | On traffic arrangements in Delhi during G20 summit, Special CP Traffic, SS Yadav says, "...New Delhi Police district has been declared as the controlled zone...Railway services and metro services will be working smoothly. Metro services will be functional throughout… pic.twitter.com/kRrqYUv3wH — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్ -
మత్తు వదలరా.. చెత్త ఎత్తరా.!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు. వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
-
ట్రాఫిక్ ఉల్లంఘనలకు 15 రోజుల్లోగా ఈ–చలాన్
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి. -
ట్రాఫిక్ ఉల్లంఘన.. రోజుకు 9 మంది మృతి
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్ ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. మన రాష్ట్రంలో ఏటా 35 శాతం ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిని నడుపుతున్నవారిలో 80 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేసి రహదారి భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలని రవాణా, పోలీస్ శాఖలు నిర్ణయించాయి. నేటి (సోమవారం) నుంచి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరగనున్నాయి. ప్రతి రోజూ రవాణా శాఖ అధికారులకు ఓ కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్సు ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై ప్రణాళిక రూపొందించారు. ఈ వారోత్సవాలకు సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. వాహనదారుడు హెల్మెట్ ధరించడం నిబంధనగా కాకుండా బాధ్యతగా తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఈ వారోత్సవాల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. రహదారి భద్రత చర్యలు పాటించకుండా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. 8 శాతం తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎనిమిది శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో నోటిఫికేషన్ జారీచేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. గతంలో రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు 40 శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్న రీసెర్చి వింగ్ ఇప్పుడు జరిమానాల పెంపు భయంతో తగ్గిపోయాయని తెలిపింది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. హెల్మెట్ ధరించేవారి సంఖ్య పెరిగింది గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడు జరిమానా రూ.వెయ్యికి పెంచడంతో ఉల్లంఘించేవారి సంఖ్య 15 శాతానికి తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 20 వరకు హెల్మెట్ ధరించని వారిపై 1,947 కేసులు నమోదు చేశారు. తరువాత నెలలో 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే హెల్మెట్ ధరించేవారిసంఖ్య 15 శాతం పెరిగింది. ఓవర్ స్పీడ్‌కు జరిమానా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు పెంచారు. దీంతో కేసులు వెయ్యి నుంచి 900కు (పదిశాతం) తగ్గాయి. -
6 నెలల్లో 43,958 కేసులు
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రాజీలేకుండా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 43,958 కేసులు నమోదు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు అత్యధికంగా విశాఖ జిల్లాలో 11,602, తరువాత శ్రీకాకుళం జిల్లాలో 6,772 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా 242 కేసులు విజయనగరం జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 11,686 కేసులను నమోదు చేసింది. రోజుకు 8 గంటలకుపైగా పనిచేసిన డ్రైవర్ల మీద కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ వాహనాలపైన కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ప్రాణం విలువ తెలియాలనే..
సాక్షి, అమరావతి: ప్రాణం విలువ తెలుసుకోవాలనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు భారీగా పెంచామని, దీన్ని సామాజిక బాధ్యతగా భావించామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. కఠిన నిర్ణయాలు, జరిమానాలు విధిస్తే రహదారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిలో మార్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ జరిమానాలతో కట్టడి చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ముఖ్య విధి అని, ఆ దిశగా ఆలోచించే జరిమానాలు పెంచామని, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ‘దీనిపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మోటారు వాహనాల నిబంధనలు పాటించని వారిని సమర్థిస్తున్నాయా? ఈ అంశంపై హేళనగా మాట్లాడేవారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ఈ అంశంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ.. నామమాత్రపు జరిమానాలతో పదేపదే ఉల్లంఘనలు నామమాత్రపు జరిమానాల వల్ల కొందరు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపితే అతనొక్కడే కాదు.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తే వందే కదా అని నిర్లక్ష్యం వీడట్లేదు. అదే రూ.వెయ్యి విధిస్తే కొంత జాగ్రత్త ఉంటుంది. వాహన చోదకులు చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకూడదనే జరిమానాలు పెంచాం. ఆదాయంకోసం కానే కాదు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కాంపౌండింగ్ ఫీజులు పెంచడం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫీజుల పెంపు వల్ల ఏడాదికి రూ.150 కోట్లు ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రజాసంక్షేమం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ జరిమానాలతో వచ్చే ఆదాయం లెక్క కాదు. కేవలం ప్రజలు బాధ్యత విస్మరించకూడదనే ఈ పెంపుదల చేపట్టాం. వర్షాకాలం ముగియగానే గుంతలు పూడుస్తాం గత 77 రోజుల నుంచీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడటం సహజం. వీటిపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తూ.. జరిమానాలు తర్వాత విధించండి.. ముందు రోడ్లు బాగు చేయండని వెటకారంగా మాట్లాడుతున్న వారిని ఏమనాలో అర్థం కావట్లేదు. వర్షాకాలం ముగిసిన వెంటనే గుంతలన్నీ పూడ్చేలా రూ.2,500 కోట్లతో మరమ్మతులు చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రాణం విలువ తెలుసు కాబట్టే.. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపిస్తుంటే ప్రతిపక్షాలు యాగీ చేస్తాయా? ప్రతిపక్ష నేతలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపే వారికి దన్నుగా నిలుస్తారా? రోడ్డు ప్రమాదాలకు కారకులయ్యే వారికి జరిమానాలు వద్దా? ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని సహకరించాలి కానీ ఇలా హేళనగా మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దు. ప్రాణాల విలువ తెలిసిన సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాణాలు విలువ తెలియని వారి గురించి ఏమీ మాట్లాడలేం. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాల పెంపు
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ చట్టానికి అనుగుణంగా.. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్రం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి నుంచి కాంపౌండింగ్ ఫీజులు భారీగా వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సైతం కేంద్రం సూచనలకు అనుగుణంగానే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే ఉద్దేశంతో కేంద్రం, సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో జరిమానాలు పెంచారు. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ద్విచక్ర వాహనం, క్యాబ్‌లు, ఆటోలు, ఏడుసీట్ల సామర్థ్యం ఉన్న తేలికపాటి మోటారు వాహనాలు ఒక విభాగంగాను, భారీ వాహనాలు మరో విభాగంగాను ప్రభుత్వం జరిమానాలను పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల తయారీలో మార్పులు, చేర్పులు చేస్తే డీలర్లకు, తయారీ సంస్ధలకు, అమ్మినవారికి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇవీ జరిమానాలు ► డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేనివారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు, వేగంగా నడిపితే రూ.వెయ్యి, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు. ► రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు. ► రిజిస్ట్రేషన్, రెన్యువల్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు. అదే భారీ వాహనాలకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.8 వేలు. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు. ► వాహనంతో అనధికారికంగా ప్రవేశిస్తే రెండు కేటగిరీలకు రూ.వెయ్యి. ► వాహనాల తనిఖీ విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా రూ.750, భారీ వాహనాలకు రూ.వెయ్యి. అనుమతి లేని, అర్హతకంటే తక్కువ వయసు వారికి వాహనం ఇస్తే రెండు కేటగిరీలకు రూ.5 వేలు. ► ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం. వాహనం బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు. ఎమర్జెన్సీ (అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీసులు) వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు. ► అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు. రోడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినా, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రించకపోయినా తేలికపాటి వాహనాలకు రూ.1,500, భారీ వాహనాలకు రూ.3 వేలు. ► బీమాపత్రం లేకపోతే 2 కేటగిరీలకు మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. పబ్లిక్ లయబిలిటీ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. -
రహదారులు చంపేస్తున్నాయి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని రోడ్‌సేఫ్టీ విభాగం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రోడ్‌సేఫ్టీ విభాగం గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో రోడ్డు ప్రమాదాల కారణంగా తెలంగాణలో చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 6,800గా ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల సగటున రోజుకు 16 మంది మరణిస్తుండగా.. 61 మందికి గాయాలవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు, ట్రాఫిక్, రవాణారంగ నిపుణులు చెబుతున్నా.. చాలామంది పెడచెవిన పెట్టడంతో ఇది రోజురోజుకూ విజృంభిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో జీరో మరణాలు.. కనీసం ఈ ఏడాదిలోనైనా ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంతా భావిం చారు. ముఖ్యంగా పోలీసులు నూతన సంవత్సరం రోజున ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య తక్కువగా నమోదైంది. తరువాత వరుసగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు గతేడాది మరణాల సగటును అందుకునేలా చేశాయి. ఈ ఏడాది జనవరిలో 1,907 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 484 తీవ్ర ప్రమాదాలు కాగా.. 1,423 సాధారణ ప్రమాదాలు. ఇందులో 491 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,143 మంది క్షతగాత్రులు అయ్యారు. జిల్లాలపరంగా రోడ్డు ప్రమాదాల మరణాలను పరిశీ లిస్తే.. రాచకొండ (53), సైబరాబాద్ (43), సంగారెడ్డి (32), వరంగల్ (29), నిజామాబాద్ (25), మెదక్ (25) తరువాత స్థానాల్లో నిలిచాయి. జనవరి నెలలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేసులు, చలానాలంటే లెక్కలేదు..: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన విషయంలోనూ ప్రజలకు లెక్కలేకుండా పోయింది. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రహదారులపై పార్కింగ్, రవాణా వాహనాల్లో మనుషుల తరలింపు, సీటు బెల్టు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీరికి చలానాలన్నా.. కేసులన్నా లెక్కలేకుండా పోతోంది. 31 రోజుల్లో 87,608 ఓవర్స్పీడు కేసులు నమోదయ్యాయంటే వాహనాల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మందు తాగి పట్టు బడితే అంతే..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 1 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. మందు బాబుల ఆటకట్టించేందుకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసెస్‌లను ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్‌లో ఎక్కువగా ఈవెంట్స్, పబ్‌లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఏడాది ప్రతి ఈవెంట్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలు.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. - ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికిల్స్‌ను అనుమతించరు - పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనా వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ - కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపైకి అనుమతిస్తారు - లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు యథాతథం - గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ల మూసివేత - కామినేని, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, చింతల్ కుంట అండర్ పాస్‌ల మూసివేత - తెలుగుతల్లి ఫ్లైఓవర్, నల్గొండ చౌరస్తా పైవంతెన, పంజాగుట్ట ప్లైఓవర్ మూసివేత - వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలు చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు - మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు - రాత్రి 10 నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిలిపివేత - ఆ దారుల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులు -
ట్రాక్ బాగుంటే గిఫ్ట్
బుధవారం ఉదయం 11.30.. అసెంబ్లీ సమీపంలోని కంట్రోల్‌రూమ్ చౌరస్తా...ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగర పోలీసు కమిషనర్.. అటుగా బైక్‌పై వచ్చిన వాహనచోదకుడిని ఆపారు. రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అతని ‘ట్రాక్’ రికార్డును పరిశీలించారు. గతంలో, ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు లేకపోవడంతో అతనికి మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్, ఓ పువ్వు అందచేశారు. సాక్షి, హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ‘దారి’కి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు, చార్జ్షీట్లు, కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తున్నారు. మరి, పక్కాగా నిబంధనలు పాటించే వారిని ఎందుకు ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ కొన్నాళ్లుగా ఉత్తమ డ్రైవర్లకు సినిమా కూపన్లు అందిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ సంస్థ సాయంతో రూ.250 విలువైన గిఫ్ట్ కూపన్లను నెలకు 300 మందికి చొప్పున ఆరు నెలల పాటు అందించనున్నారు. బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు 25 మంది వాహనచోదకులకు గిఫ్ట్ కూపన్లు, పువ్వులు అందించారు. గిఫ్ట్ కొట్టాలంటే.. క్లీన్ రికార్డు ఉండాలి - మెక్‌డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్ గెల్చుకోవాలంటే వాహనచోదకుడు గతంలో, తనిఖీ సమయంలో పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉండాలి. - హెల్మెట్ పెట్టుకుని వస్తున్న ద్విచక్ర వాహనచోదకులు, సీట్‌బెల్ట్ ధరించిన తేలికపాటి వాహనాల డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. - వాహనచోదకుల వద్ద ఉండాల్సిన ధ్రువీకరణలు తనిఖీ చేసి ఆపై గతంలో ఎప్పుడైనా చలానా చెల్లించారా? అనేది ట్యాబ్ ద్వారా పరిశీలిస్తారు (ఈ ట్యాబ్‌లో.. ఉల్లంఘనుల జాబితా డేటాబేస్ మొత్తం అనుసంధానమై ఉంటుంది). - ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ, గతంలోనూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వారిని ఎంపిక చేసి, అక్కడికక్కడే మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్‌కూపన్, పువ్వు అందజేస్తారు. ఇలా ఒక్కో జోన్‌లోనూ 50 మందిని సత్కరిస్తారు. రోల్‌మోడల్‌గా సిటీ దేశంలోని మెట్రో నగరాలకు అనేక అంశాల్లో హైదరాబాద్ రోల్ మోడల్‌గా ఉంది. రహదారి భద్రత విషయంలోనూ ఈ లక్ష్యం సాధించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా చేస్తే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది. మీ కుటుంబంలో, చుట్టుపక్కల ఎక్కడైనా ఉల్లంఘన మీ దృష్టికి వస్తే వెంటనే వారిని కట్టడి చేయండి. మెక్ డొనాల్డ్స్ సంస్థ పార్ట్నర్ ఆఫ్ రోడ్సేఫ్టీగా మారింది. - అంజనీకుమార్, సిటీ కొత్వాల్ ప్రమాదాల నియంత్రణకే.. నగరంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాం. ఇంకా తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నగరాన్ని యాక్సిడెంట్ ఫ్రీగా మార్చాలంటే రహదారి నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలి. ఇందుకోసం వాహన చోదకులను ప్రోత్సాహించే మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తాం. - అనిల్‌కుమార్, ట్రాఫిక్ చీఫ్ ట్రాఫిక్ పోలీసుల పనితీరు అద్భుతం నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అందరి సామాజిక బాధ్యత. నగరవాసులంతా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. - రితేష్‌కుమార్, మెక్ డొనాల్డ్స్ ఆపరేషన్స్ హెడ్ ఆనందంగా ఉంది నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మెక్ డొనాల్డ్స్ సంస్థతో కలిసి అందిస్తున్న తొలి కూపన్ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే నగరం సేఫ్ సిటీ అవుతుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. - రవిచంద్ర, యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు, సైదాబాద్ కాలనీ -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, విజయనగరం ఫోర్ట్/పార్వతీపురం టౌన్: ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా.. వాహన పత్రాలు, లైసెన్సులు వెంట లేవా.. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా... నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే భారీగానే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో సరిపెట్టుకోకుండా జైలు శిక్షకూడా పడే అవకాశం ఉంది. అంతేనా... రహదారి భద్రత నిబంధనలు ఉల్లం ఘించి వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేవారి ఆటలు ఇక సాగవు. తమ కళ్లెదుటే రాంగ్ రూట్లో వెళుతూ... నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపు తూ... పౌరులకు ఇబ్బంది కలిగిస్తే... వారే నేరుగా వాట్సాప్‌ద్వారా రవాణా శాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రవాణా శాఖ 9542800800 నంబర్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించి పెద్ద మొత్తంలో జరిమానా విధించవచ్చు. అంటే రాబోయే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ఎటువైపు నుంచైనా వడ్డన పడే అవకాశం ఉంది. కాబట్టి వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసు, రవాణా శాఖలు హెచ్చరిస్తున్నాయి. కొత్త వాహన చట్టంలో నిబంధనలు కఠినం.. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని అమలులో కి తెచ్చింది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటారు వెహికల్ చట్టంలో కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే పోలీసులు ఈ చట్టంపై వాహనచోదకులు, యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు. చట్టంలోని ముఖ్యాంశాలు.. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, మద్యం తాగి, అతి వేగంగా, హెల్మెట్ లేకుండా, అంబు లెన్సు వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోయినా, కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు సీటుబెల్ట్ పెట్టుకోకున్నా శిక్షార్హులు. మైనర్లు వాహనాలు నడిపితే వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అధిక మొత్తంలో జరిమానా విధించేలా చట్టం తీసుకొచ్చారు. చట్టంలోని పలు అంశాల కు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. ఫిర్యాదుల కోసం రవాణా శాఖ వాట్సాప్.. రహదారి భద్రత నిబంధనలు పాటించకపోవడం వల్ల అమాయకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారి నిబంధనలు పాటించని వారితో పాటు రహదారిపై ప్రయాణించే వారు సైతం ప్రమాదాల్లో ఇరుక్కునే సందర్భాలున్నా యి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందు కు ప్రజాభాగస్వామ్యం అవసరమని రవాణా శాఖ భావించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. స్మార్ట్ ఫోన్ ఉండి ఫోటో తీసే కొద్ది పాటి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఎక్కడినుంచైనా నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటో తీసి రవాణాశాఖ అధికారులు అందుబా టులోకి తెచ్చిన 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ అధికారులు రం గంలోకి దిగి నిబంధనలు భేఖాతరు చేసిన వారి భరతం పడతారు. ఫొటోల ను రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు పరిశీలించి వాహనయజమాని అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.. నిబంధనలు అతిక్రమించిన వారి ఫొటోలు తీసి ఎవరైనా 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. వాటి ఆధారంగా సంబంధిత వాహన యజమాని ఇంటికి చలానా పంపించి జరిమానా వసూలుకు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయనగరం వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన మోటారు వాహన చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. – వి.లోవరాజు, పట్టణ ఎస్ఐ, పార్వతీపురం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి.. వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా లో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మైనర్లు వాహనం నడిపితే సంరక్షకులకు రూ.25వేలు జరిమానా, మూడే ళ్ల జైలు శిక్షతోపాటు లైసెన్సు రద్దు చేస్తాం. – ఆర్.జయంతి, పట్టణ మహిళా ఎస్ఐ, పార్వతీపురం -
పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరం, అన్యాయం జరిగితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం.. మరి ఆ పోలీసుతోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే.. ఉన్నతాధికారులను కలవాలి. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఇట్టే ఫిర్యాదు చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో హ్యాక్ ఐ యాప్ ఉంటే చాలు ఈ పని క్షణాల్లో చేసేయొచ్చు. కొంతకాలంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాత పోస్టులు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఫలానా పోలీసు తమ సమస్యను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న వార్తలూ వస్తున్నాయి. అందులో నిజానిజాలు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ‘వయొలేషన్ బై పోలీస్’లో ఫిర్యాదు దుష్ప్రచారాల నివారణ, అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోలీసులపై ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసు శాఖలో పూర్తి పారదర్శకత కోసం ‘హ్యాక్ ఐ’లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. వయొలేషన్ బై పోలీస్.. అనే ఆప్షన్‌ను పొందుపరిచారు. ప్రజల నుంచి ఫిర్యాదు తీసుకోకపోయినా, ఎఫ్ఐఆర్ నమోదు తిరస్కరించినా, దురుసుగా ప్రవర్తించినా, ప్రతిఫలం ఆశించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఏకపక్షంగా వ్యవహరించినా, సరిగా స్పందించకున్నా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు.. తదితర విషయాలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడ జరిగిందో చెబుతూ ఫొటోలు, వీడియోలు సహా ఆధారాలు జత చేయొచ్చు. ఇది నేరుగా ఉన్నతాధికారులకే చేరుతుంది కాబట్టి.. నిమిషాల్లో బాధితుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు తెరపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఇక్కడ పాత చలాన్లే!
సాక్షి, హైదరాబాద్: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశవ్యాప్తంగా ఆదివారం అమలులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం పోలీసులు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పాత చలాన్లే విధించారు. కొత్త చట్టం ప్రకారం.. చలాన్లు విధించాలంటూ తమకు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా కొత్త చలాన్లు ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుంది? అన్న విషయాలు కూడా అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మనకు ఇక్కడ పాత జరిమానాలే వర్తించనున్నాయని రవాణా, పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి... మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కొత్త నిబంధనలతో జరిమానాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి.. నిబంధనల్ని పాటిస్తే ఏ మేరకు డబ్బు ‘ఆదా’చేసుకోవచ్చు తదితర విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు సైతం వాహనచోదకుల్ని ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్ని తనిఖీ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ప్రస్తుతం ఎంత జరిమానా పడుతోంది, కొత్త యాక్ట్ అమలులోకి వస్తే ఏ స్థాయిలో పడుతుంది అనేవి వివరిస్తున్నారు. మరోపక్క వాహనదారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో డ్రైవింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా హెల్మెట్ వినియోగం పెరిగిందని, ఇదే వాహనచోదకులు తీసుకుంటున్న జాగ్రత్తకు నిదర్శనమని ఓ అధికారి తెలిపారు. -
అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు. సీటు బెల్ట్ లేకుంటే లైసెన్స్ రద్దు.. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుకు ఆమోదం.. నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేబినెట్ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
తాగి నడిపితే ఉద్యోగం పోయినట్లే!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో ఉద్యోగులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. రహదారుల భద్రత విషయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సంస్థ సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే, మద్యం సేవించి వాహనాలు నడిపే సంస్థ ఉద్యోగులు, ఆర్టిజన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఈ నెల 4న ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు విద్యుత్ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలా చేసే వారు తమ ప్రాణాలనే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఇతర అమాయక ప్రజలకు ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) నిబంధనల ప్రకారం విద్యుత్ ఉద్యోగులు మద్యం, డ్రగ్స్ తీసుకుని విధులకు హాజరైనా, మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించినా తీవ్ర ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. 2017 నవంబర్ 17న జారీ చేసిన ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల ప్రకారం మద్యం, డ్రగ్స్ తీసుకుని విధులకు హాజరైనా, అల్లర్లకు పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్‌కోకు ట్రాఫిక్ పోలీసు లేఖ.. హైదరాబాద్ నగర శివారులో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిపై రూ.1,200 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు అతడి ఐడీ కార్డు ఆధారంగా ట్రాన్స్‌కో ఉద్యోగిగా గుర్తించారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీకి తెలియజేస్తూ సదరు ఆర్టిజన్‌పై శాఖాపర చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎండీ ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేశారు. -
హెల్మెట్లు పెట్టుకోరు.. ఇయర్ఫోన్లు తియ్యరు
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల్లో అటు వాహనదారులు.. ఇటు పాదచారులు రోడ్లతో తమకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతారు. మరొకరు చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్లు దాటుతారు. వారికి నిబంధనలతో ఏ మాత్రం పని ఉన్నట్లు కనిపించట్లేదు. ఇంకొందరు అవసరం లేకున్నా హారన్లు కొడతారు. వాహనం నడిపేందుకు అర్హత లేని పిల్లలు వేగంగా వాహనాలు నడుపుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. – హైకోర్టు ధర్మాసనం జంట నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలేంటి.. వాటిని ఎలా అమలు చేస్తున్నారు.. ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అవసరం లేకుండా హారన్ కొడుతూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారిపై తీసుకుంటున్న చర్యలు.. హారన్ల శబ్ద స్థాయిని తగ్గించేందుకు ఏం చేయబోతున్నారు.. వన్‌వే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.. తదితర అంశాల్లో తమకు స్పష్టతనివ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలివ్వట్లేదని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ్ హైకోర్టుకు లేఖ రాశారు. అలాగే ఏటా రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాహనదారులు ఇష్టారాజ్యంగా హారన్లు మోగిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నివాస ప్రాంతాల్లో నో హారన్ జోన్లను ఏర్పాటు చేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు దీన్ని వ్యాజ్యంగా మలిచింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్లు దాటే పరిస్థితి ఏది? ‘జంట నగరాల్లో జీబ్రా లైన్ల వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులకు వాహనదారులు అవకాశం ఇవ్వట్లేదు. వాహనదారుల దెబ్బకు పాదచారులు హడలిపోతున్నారు. పాదచారులు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్లు దాటుతున్నారు. పక్క నుంచి, వెనుక నుంచి వచ్చే వాహనాలను పట్టించుకోవట్లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తారు. హెల్మెట్ పెట్టుకోరు. ఇక్కడ కూడా అంతే. అయితే ఒకటే తేడా. ఇక్కడ ముగ్గురితో పాటు బరువైన సంచో, బస్తానో ఉంటుంది’అని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంది. తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం లేదా? కొందరు పిల్లలు వాహనం నడిపే అర్హత లేకపోయినా అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా అని ధర్మాసనం ఆరా తీసింది. వన్‌వేల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆసుపత్రులు, న్యాయస్థానాలు, నివాస ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లు హారన్లు వినియోగించడంపై కూడా దృష్టి సారించాలని పేర్కొంది. కాగా, హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యాన్ని కూడా విపిన్ శ్రీవాత్సవ వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
జరిమానాలు పెరగాలా?
‘భరత్ అనే నేను’ అన్న సినిమాలో అనుకోకుండా హీరో ముఖ్యమంత్రి అవు తాడు. గందరగోళంగా ఉన్న ట్రాఫిక్‌ను చూసిన అతను జరిమానాలను విప రీతంగా పెంచేస్తాడు. జరి మానాలను పెంచడం అవ సరమా? ఇప్పుడున్న పరిస్థి తులకు అనుగుణంగా, పడిపోయిన రూపాయి విలు వకు దగ్గర్లో ఈ జరిమానాలు ఉన్నాయా? అనే సందే హాలు సహజంగానే వస్తాయి. డబ్బును జప్తు చేసు కోవడమే జరిమానా. కోర్టులు విధించే జరిమానాకు గాను ముద్దాయి చెల్లించే రుసుము. ట్రాఫిక్ జరిమా నాలు నేరాలే అయినా ఆ నేరాలు చేసిన వ్యక్తులు నేర స్తులు కాదు. చట్టాన్ని ఉల్లంఘించినవారుగా వారిని పరిగణిస్తారు. జరిమానా అనేది ఆర్థికంగా నష్టం కలి గిస్తుంది కానీ అది సమాజంలో ఆ వ్యక్తిపై మచ్చగా ఉండదు. జైలుకు వెళ్లినప్పుడు కలిగే మనోవ్యథ జరిమానా చెల్లించడంలో ఉండదు. సంస్కరణ అనేది సాధ్యం కాని కేసుల్లో కోర్టులు సాధారణంగా నేర స్తులకి జరిమానాలను విధిస్తాయి. దానివల్ల ఆ వ్యక్తి మళ్లీ ఆ నేరాలు చేయకుండా ఉంటాడన్న భావనతో కోర్టులు అలా జరిమానాలు విధిస్తుంటాయి. ఇప్పుడు మనకు చాలా శాసనాలు వచ్చేశాయి. గతంలో ఉన్న శాసనం ఒక్కటే. అది భారతీయ శిక్షాస్మృతి. అది తయారు చేసినప్పుడు జరిమానా గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నేరాలకు జరిమానా విధించడమే సరైన శిక్ష అని వారు నిర్ధా రణకి వచ్చి, ‘‘ప్రపంచవ్యాప్తంగా జరిమానాలు విధించడం అనేది ఉంది. దాని వల్ల చాలా ప్రయో జనాలు ఉన్నాయి. అందుకని జరిమానాలని కోర్టులు విధించాలని మేం ప్రతిపాదిస్తున్నాము!’’ అని అభి ప్రాయపడ్డారు. భారత శిక్షాస్మృతి కోసం మెకాలే 1861లో గట్టి పునాదిని వేశారు. చాలా నేరాలకి జరిమానాలను ఆయన ప్రతిపాదించారు. స్వాతం త్య్రం వచ్చాక మెకాలే రూపొందించిన శిక్షాస్మృతికి కొనసాగింపుగా భారతీయ శిక్షాస్మృతి నడుస్తోంది. నేరస్తులను జైల్లో ఉంచడం వల్ల ప్రభుత్వ ఖజా నాకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని కొన్ని నేరాలకి ఎక్కువ జరిమానాలు విధించడం వల్ల ఆ నేరాలు తిరిగి చేయడానికి మనుషులు వెనుకంజ వేస్తారనీ, ఇంకా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మెకాలే భావించారు. అయితే, నేరస్తుని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకుని కోర్టులు జరి మానాలను విధించాలని ఆయన చెప్పారు. భార తీయ శిక్షాస్మృతిలోని నేరాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తే 10 రూపాయల జరిమానాను కోర్టులు విధిం చాలి. స్వచ్ఛందంగా ఎవరైనా గాయపరిస్తే రూ. 500 జరిమానాని, అదే వి«ధంగా వ్యక్తుల ప్రాణాలకి, రక్ష ణకి హాని కలిగిస్తే రూ.200 జరిమానాను, ఒక మందుకు బదులు మరో మందు విక్రయిస్తే రూ.100 జరిమానాను కోర్టు విధించే విధంగా శిక్షాస్మృతిలో నిబంధనలు ఏర్పరిచారు. భారతీయ శిక్షాస్మృతిని రూపొందించింది 1860లో. అంటే 158 సంవత్స రాల క్రితం అన్నమాట. అప్పుడున్న రూపాయి విలువని పోలిస్తే ఈ జరిమానా అధ్వానంగా అనిపి స్తుంది. అందుకే 158 ఏళ్ల క్రితం నిర్ణయించిన 10 రూపాయల జరిమానాను తగ్గిన రూపాయి విలువ కారణంగా ఎంతకు పెంచాలోనని ఆలోచిస్తే కాస్త భయం వేసినా, పెంచడం అవసరమనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జరిమా నాల విషయంలో అవసరమైన సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిమానాను విధించే సమయంలో కోర్టులు నేర తీవ్రతను, ముద్దాయి గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి. జైలు శిక్షను లేదా జరిమానాను లేదా రెండింటినీ విధించే అవకాశం ఉన్న కేసులో అవసరమని భావించినప్పుడు కోర్టులు రెండు శిక్షలనూ ఖరారు చేస్తాయి. జరిమానా విధించే విషయంలో ముద్దాయి ఆర్థికస్తోమతని కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల విషయంలో వైట్‌కాలర్ నేరాలు చేసే వ్యక్తుల విషయంలో జరి మానాలను భారీగానే విధించాల్సి ఉంటుంది. వారు మళ్లీ అలాంటి నేరాలు చేయ కుండా నిరోధించడానికి ఇది అవసరం. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒకే సంఘ టనలో రెండు మూడు నేరాలు చేసినప్పుడు ఆ శిక్షలు ఏకకాలంలో అమలయ్యే విధంగా కోర్టులు ఆదేశించే వీలుంది. కానీ జరిమానా చెల్లించనపుడు అనుభవిం చాల్సిన శిక్ష మాత్రం వాటి తోబాటు ఏకకాలంలో అమలయ్యే అవకాశమే లేదు. నేరానికి వేసిన శిక్షలు అమలయ్యాక ఈ శిక్ష కొనసాగుతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 ఈ విషయం చెబుతోంది. 1860లో తయారైన ఈ శిక్షా స్మృతిలో జరిమానా విష యంలో ఇంత బాగా ఆలోచించారు. మన శాసన వ్యవస్థకి ఈ జరిమానాలపై ఆలోచించే తీరుబడి లేదు. జైల్లో ఉంచితే ఆ భారం రాజ్యం మీద పడుతుందని గ్రహిస్తే మంచిది. జరిమానాలను ముద్దాయి ఆస్తి నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001 -
ఖాకీలకూ ‘పనిష్మెంట్’
పోలీసు ఉల్లంఘనలపై ప్రత్యేక నజర్ ♦ సిబ్బంది, అధికారుల వయొలేషన్స్‌పై సీరియస్ ♦ తాజాగా కానిస్టేబుల్‌పై అటాచ్మెంట్ వేటు సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా, పాయింట్లు మాత్రమే పడుతున్నాయి. ఇదే పని పోలీసులు చేస్తే వారికి వీటితో పాటు తాఖీదులు తప్పట్లేదు. కొన్ని నెలలుగా నగర పోలీసులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్మెంట్ వేటు కూడా పడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్‌గోపాల్‌పేట కానిస్టేబుల్ కె.రాకేష్సాగర్ను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలున్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని కొత్వాల్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ రహదారుల పైనా పోలీసులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. వీరు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. నాలుగు రకాలుగా ఆధారాలు పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుం టున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలి పారు. మొత్తం 4 రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నారు. విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషన రేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యు లేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తాఖీదులు పొందిన వారు ఇలా.. అదనపు ఇన్స్పెక్టర్ 1 ఎòౖÜ్సలు 66 హెడ్–కానిస్టేబుళ్లు 9 కానిస్టేబుళ్లు 86 హోంగార్డులు 80 మొత్తం 242 ముందు ఫైన్... ఆపై మెమో... సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరనేది నిర్ధారించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపు సంజాయిషీ ఇవ్వకపోయినా, ఇచ్చింది సం తృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. -
విద్యార్థులకు ‘ట్రాఫిక్ గేమ్స్’
వీడియో గేమ్స్ రూపొందించాలనే యోచన సాక్షి, హైదరాబాద్: బడి ఈడు నుంచే చిన్నారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం ఆ ఈడు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపే వీడియో గేమ్స్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. విద్యాశాఖతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు వారి అంగీకారం తర్వాత గేమ్స్ రూపకల్పనకు సన్నాహాలు చేయాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా వీడియో గేమ్స్ ఆలోచన చేస్తున్నారు. థియరీ కోసం పాఠ్యాంశాలు... విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎస్సీఈఆర్టీతో కలసి సమగ్ర విధానం రూపొందించారు. ఒకటో తరగతి నుంచే ట్రాఫిక్‌ను పాఠ్యాంశంగా చేర్చడానికి అవసరమైన విధివిధానాలకు సిద్ధమయ్యారు. వేర్వేరు అంశాలతో తయారైన ట్రాఫిక్ పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం రాష్ట్ర రహదారి భద్రతా విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇది అమలులోకి వస్తే ట్రాఫిక్ అన్నది ఓ పాఠ్యాంశంగా మారడమే కాకుండా పరీక్షల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు, మార్కులు సైతం అమలులోకి వస్తాయి. ఇవి కేవలం థియరీ అని అధికారులు చెప్తున్నారు. ప్రాక్టికల్‌గా ఉండేలా గేమ్స్ చిన్నారుల మెదళ్లలో ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా నిలిచిపోవడంతో పాటు భవిష్యత్తులో వారు ఉత్తమ రోడ్ యూజర్లుగా మారడానికి థియరీ ఒక్కటే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం అవశ్యమని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉండే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా వీడియో గేమ్స్ రూపొందించాలని నిర్ణయించారు. విద్యాశాఖ ప్రాథమిక అనుమతి లభించిన తర్వాత తయారీకి సన్నాహాలు చేయనున్నారు. వీడియో గేమ్స్‌కూ ఓ పిరియడ్... ఈ వీడియో గేమ్స్ తయారీ బాధ్యతల్ని ఏదైనా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పగించనున్నారు. వీటిని నామమాత్రపు ధరకే పాఠశాలలకు పంపిణీ చేయించాలని యోచిస్తున్నారు. దాదాపు ప్రతి పాఠశాలలోనూ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటున్న నేపథ్యంలో వాటితోపాటు ట్రాఫిక్ వీడియో గేమ్స్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఈ గేమ్ ఆడేందుకు వారానికి ఓ పిరియడ్ ఉండేలా పాఠశాలతో సంప్రదింపులు జరపనున్నారు. మార్కులు కేటాయించే విధంగా... అలాగే ఈ ట్రాఫిక్ వీడియో గేమ్స్ అన్నది నామ్‌కే వాస్తేగా మారకూడదని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఈ గేమ్స్‌పై పరీక్షలు సైతం నిర్వహించడంతో పాటు మార్కులు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. తొలిదశలో ఆరో తరగతి వరకు, అనంతరం పదో తరగతి వరకూ అనువుగా ఉండే అంశాలతో కూడిన గేమ్స్ డిజైన్ చేయిస్తారు. భవిష్యత్తులో కాలేజీ విద్యార్థులకూ అవసరమైన, ఆసక్తి ఉండే అంశాలతో వీటిని రూపొందించాలనే ప్రతిపాదనా ఉంది. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నిర్మల్ టౌన్ : వాహనచోదకులు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని సీఐ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ మాట్లాడారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్లు, జీపులు నడిపేవారు తప్పనిసరిగా సీట్‌బెల్టులను ధరించాలన్నారు. లైసెన్స్ లేనిదే వాహనాన్ని నడపరాదని సూచించారు. వాహనాన్ని ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని కోరారు. మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్, వాహనాల డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద: వాహనదారులు సీట్‌బెల్టు ధరించి వాహనాలు నడపాలని ఎస్సై మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పొట్టపెల్లిలో ఎస్సై మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి రోడ్డు నియమాలను పాటిస్తే చాలామట్టుకు ప్రమాదాలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో పీసీలు నరేశ్, రమేశ్, యాస్మిన్ , వాహనదారులు పాల్గొన్నారు. నర్సాపూర్(జి)(దిలావర్పూర్): మండలంలోని టెంబుర్నిలో నర్సాపూర్(జి) పోలీసుల ఆధ్వర్యంలో సర్పంచ్ ఏలేటి కండెల లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సై రాంనరసింహారెడ్డి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయారెడ్డి, ప్రకాశ్, మెంచు పోశెట్టి, గంగయ్య, పోలీసు సిబ్బంది మహిపాల్‌రెడ్డి, వర్మ, మన్సూర్ పాల్గొన్నారు. -
దేశభక్తిని నాటండి
దేశభక్తిని ఇలా వ్యక్తీకరించండి... ‘దేశమును ప్రేమించుమన్నా...’ అన్న మహాకవి అక్కడితో ఆగిపోలేదు. మంచి అన్నది పెంచమన్నాడు. వొట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టమన్నాడు. అందుకే మన దేశభక్తి మాటలకే పరిమితం కాకూ డదు. అది ఆచరణగా వికసించి నలుగురికి ఉపయోగపడాలి. మన దేశభక్తిని ఇలా కూడా వ్యక్తీకరించుకోవచ్చు... రక్తదానం అవయవదానం మొక్కలు నాటడం, వాటి సంరక్షణ క్యూలో పద్ధతి పాటించడం శబ్ధకాలుష్యాన్ని సృష్టించకుండా ఉండడం రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్న అంధులకు సహాయ పడడం వాహనాలను మితిమీరిన వేగంతో నడపకపోవడం పక్షులు, జంతువులను హింసించకపోవడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రకృతి విలయాలు ఏర్పడినప్పుడు... సంబంధిత ప్రాంతాలకు వెళ్లి మన వంతుగా సహాయ పడడం... ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు మీ దేశభక్తిని ఎలా వ్యక్తీకరించుకుంటారో నిర్ణయించుకోండి. మిలే సుర్ మేరా తుమ్హారా... ‘మిలే సుర్ మేరా తుమ్హారా’... దేశంలోని భాషా వైవిధ్యానికి మచ్చుతునక ఈ పాట. పద్దెనిమిదేళ్ల కిందట స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పాట మొట్టమొదటిసారిగా ‘దూరదర్శన్’లో ప్రసారమైంది. జాతీయ సమైక్యతను చాటేలా వైవిధ్యభరితమైన చిత్రీకరణతో రూపొందించిన ఈ పాటను ‘దూరదర్శన్’ అప్పట్లో చాలా తరచుగా ప్రసారం చేసేది. అద్భుతమైన స్వరకల్పనతో రూపొందించిన ఈ పాట ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పట్లో... అంటే 1988 నాటికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పొందుపరచిన పద్నాలుగు భాషలతో ఈ పాటను రూపొందించారు. పీయూష్ పాండే రచించిన ఈ పాటకు అశోక్ పాట్కీ స్వరకల్పన చేశారు. హిందీతో మొదలయ్యే ఈ పాటలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, మలయాళం, మరాఠీ, మార్వాడీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళ, తెలుగు, ఉర్దూ భాషలు వినిపిస్తాయి. పండిట్ భీమ్సేన్ జోషి, లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ వంటి సంగీత దిగ్గజాల గళమాధుర్యం ఈ పాటను అజరామరంగా నిలిపింది. గ్రామ స్వరాజ్యానికి ఊతం... గ్రామ రాజ్యం ద్వారా... రామరాజ్యం ఏర్పాటు చేయాలనే జాతిపిత కన్న కలకు ఆచరణ రూపం పంచాయతీరాజ్ వ్యవస్థ. గాంధీజీ దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటు పడే వీలు కలిగింది. గ్రామ పంచాయితీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చింది. వనరుల పంపిణీని మెరుగు పరచడానికి, ప్రభుత్వ పనుల్లో గ్రామ ప్రజలు పాల్గొనేలా చేయడానికి, స్థానికంగా ఎక్కువమందికి ఉపాధి కలిగించడానికి, పేదరిక నిర్మూలనకు ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందింది. నేను సైతం... సామాజిక విషయాలపై మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరింత పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రభుత్వ టూరిజమ్ క్యాంపెయిన్ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. కాలేజీ గ్రాడ్యుయేట్లు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ‘టెక్ ఇండియా’ ప్రచారం, ఓటు హక్కు విలువ తెలియజేయడానికి ‘నేషనల్ ఓటర్ మోటివేషన్’ క్యాంపెయిన్ నిర్వహించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘అతిథి దేవోభవ’ ప్రచారాన్ని నిర్వహించారు. పోషకాహార లోపంపై ‘మాల్ న్యూట్రిషన్ క్విట్ ఇండియా’ ప్రచారాన్ని నిర్వహించారు. సినిమా ప్రమోషన్ తప్ప దేశం గురించి పట్టని నటులకు అమీర్‌ఖాన్ కచ్చితంగా ఒక ఆదర్శ నమూనా. -
పెండింగ్ చలాన్లు చెల్లిస్తేనే ఎంట్రీ
మనది నగరం కాదు కాదా... ఏదో పనిమీద వచ్చాం... పోతున్నాం... తొందరపాటులో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుందులే అనుకుంటే పొరపాటే... ఇలా నిబంధనలు అతిక్రమించినవారు వందల్లో ఉన్నారని గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు టోల్‌ప్లాజాల వద్దే సంయుక్త తనిఖీలు చేపడుతున్నారు. పెండింగ్ చలాన్లు ఉంటే జరిమానా అక్కడికక్కడే కట్టాల్సిందే. లేదంటే వాహన డాక్యుమెంట్లు తీసుకోనున్నారు. - సాక్షి, హైదరాబాద్ * టోల్‌ప్లాజాల వద్ద ‘ట్రాఫిక్’ ప్రత్యేక డ్రైవ్ * అక్కడికక్కడే జరిమానా చెల్లించాల్సిందే.. * నేటి నుంచి శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద అమలు హైదరాబాద్‌లోకి ప్రవేశించి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వారికి విధించిన పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నగరంలోకి ప్రవేశించే టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ అతిక్రమణదారుల నుంచి జరిమానా వసూలు చేయనున్నారు. తొలిసారిగా పైలట్ పద్ధతిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ను శంషాబాద్ విమానాశ్రయ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం నుంచి చేపడుతున్నారు. సుమారు ఆరుగురుతో కూడిన బృందం పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తించి...అక్కడికక్కడే జరిమానాను కట్టిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పే బూత్‌ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. మూడు మించి చలాన్లు ఉంటే తప్పనిసరిగా కట్టాల్సిందే. ఒకవేళ జరిమానా కట్టని పక్షంలో సదరు వాహన పత్రాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వందల్లో పెండింగ్ చలాన్లు... నగరంలోకి ప్రవేశించి రాష్ డ్రైవింగ్, నో పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, లేన్ అండ్ లైన్ క్రాసింగ్... ఇలా నిబంధనలు అతిక్రమించి చలాన్లు చెల్లించనివారు... దాదాపు వందల్లో ఉన్నట్టు గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి జరిమానాలను వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్ అనంతరం ఇతర టోల్‌ప్లాజాల వద్ద కూడా స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. బయటివారి కోసమే.. నగరానికి వచ్చి పోతూ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారిని పట్టుకోవడానికి టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపడితే బాగుంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చర్చించాం. అందుకే సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీంతో వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించరాదన్న భయం కలుగుతుంది. - జితేంద్ర, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ -
ఉల్లంఘనులపై కొరడా
మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా? చలానా కట్టాల్సి ఉందా? ‘ఇది చెల్లించకపోయినా ఏం కాదులే’ అనే ధీమాతో ఉన్నారా? ఆ భ్రమ నుంచి బయటకు రండి. తక్షణమే చలానా చెల్లించండి. లేదంటే కోర్టు మెట్లు ఎక్కాల్సి రావచ్చు. శిక్షకు గురికావచ్చు. అవును...పెండింగ్ చలానాదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. చార్జిషీట్లు తెరుస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా సోమవారం సంబంధిత వ్యక్తులకు జరిమానా విధించారు. - పెండింగ్ చలానాలపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి - 43 మందిపై చార్జిషీటు - కోర్టుకు హాజరైన వాహనదారులు - మొదటిసారి జరిమానాతో సరి - దేశంలోనే తొలిసారి - భవిష్యత్తులో జైలు శిక్ష విధించే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి... చలానాలు చెల్లించకుండా తిరుగుతున్న వారికి ఇక గడ్డు రోజులే. ఇలాంటి వారు మేలుకోకపోతే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇలా చలానాలు చెల్లించని 43 మంది వాహనదారులకు ఎర్రమంజిల్ కోర్టు సోమవారం రూ.73,800 జరిమానా విధించింది. మొదటి తప్పిదంగా రూ.500 నుంచి రూ.3,700 వరకు జరిమానా విధిస్తూ 3వ మెట్రో పాలిటన్ ఇన్చార్జి మెజిస్ట్రేట్ (రైల్వే కోర్టు మెజిస్ట్రేట్) ఎం.రాజు, 4వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ శివశంకర్‌ప్రసాద్ తీర్పునిచ్చారు. ఆసీఫ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారికి అత్యధికంగా రూ.3,700 జరిమానా పడింది. జరిమానా చెల్లించాల్సిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు. పదిపైన పెండింగ్ చలానాలు ఉన్న వాహదారులపై చార్జిషీట్ పెట్టారు. రానున్న రోజుల్లో మూడు చలానాలు పెండింగ్ ఉన్నా... చార్జిషీట్ పెట్టి... వాహనదారుని కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ డీసీపీ రంగనాథన్ తెలిపారు. వీటిని వెంటనే చెల్లించాలని... లేని పక్షంలో డ్రంకన్‌డ్రైవ్ కేసుల తరహాలోనే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇదే మొదటిసారి... చలానాలు పెండింగ్‌లో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచడం దేశ చరిత్రలోనే మొదటిసారి. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, నోపార్కింగ్, నో ఎంట్రీ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి గతంలో ట్రాఫిక్ పోలీసులు చలానా విధించేవారు. సంబంధిత మొత్తం చెల్లిస్తే వాహనాన్ని వదిలిపెట్టేవారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి ఠాణాకు తరలించేవారు. దీనివల్ల వాహనదారులు, పోలీసు అధికారుల మధ్య వివాదాలు తలెత్తేవి. దీన్ని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని సుమారు 350 చౌరాస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందికీకెమెరాలు అందించారు.వీటి ద్వారా ఉల్లంఘనులను గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలానా కాపీలను పంపించేవారు. రికవరీకి యత్నాలు ఇలా 2009 నుంచి ఇప్పటి వరకూ చలానా బారిన పడిన వారి సంఖ్య 45 లక్షలు. వీరి నుంచి రావాల్సిన మొత్తం సుమారు రూ.60 కోట్లు ‘పెండింగ్’లో ఉండిపోయాయి. వీరిలో మూడు... ఆపైన చలానాలు బకాయి ఉన్న వారు సుమారు 20 లక్షలు. కనీసం వీరి నుంచైనా రికవరీ మొదలు పెట్టాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ మూడు నెలల క్రితం నిర్ణయించారు. వాహనదారులు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆన్లైన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-సేవ, మీ-సేవ, ట్రాఫిక్ కాంపౌండింగ్బూత్లలో సౌకర్యం కల్పించారు. జైలుకు వె ళ్లాల్సి వస్తుందని హెచ్చరించడంతో సుమారు 25 లక్షల మంది చలానాలు చెల్లించారు. మిగిలిన వారు స్పందించలేదు. ఇదీ పరిస్థితి ⇒ పెండింగ్ చలానాల కోసం త్వరలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ⇒ చార్జిషీట్ దాఖలు చేసినా కోర్టుకు రాని వాహనదారుడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. ⇒ అదే జరిగితే పోలీసులు అరెస్టు చేసి... కోర్టులో హాజరుపర్చాల్సి వస్తుంది. ⇒ ప్రస్తుతం నోటీసు ద్వారానే వాహనదారులు కోర్టుకు హాజరవుతున్నారు. పెండింగ్ చలానాలు ఇలా.... ఒకటి నుంచి మూడు వరకూ బకాయి ఉన్నవాహనదారులు 16,24,270 మంది 4 5 .... 1,97,058 6 10 .... 1,26,730 11పైన... 39,471 పాస్‌పోర్టు, జాబ్ వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు పెండింగ్ చలానా విషయంలో కోర్టు శిక్ష విధిస్తే సంబంధిత వ్యక్తుల పాస్‌పోర్టు, విసా, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు. చట్ట ప్రకారం స్పెషల్ బ్రాంచ్ అధికారులు తమ విచారణలో ఉన్న అంశాలను సంబంధిత సర్టిఫికెట్లలో ప్రస్తావించాల్సి ఉంటుంది. - నాగిరెడ్డి జాయింట్ సీపీ -
తగ్గిన డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు
సాక్షి, ముంబై : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన 523 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిలో టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. మొత్తంగా 6,676 నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణాంతకమైన సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. ఠాణే, నవీ ముంబై, మీరా-భయందర్, వసాయి-విరార్లలో 1,041 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ముంబై కన్నా ఠాణేలో 19 శాతం కేసులు అధికంగా నమోదవడం విశేషం. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే మలాడ్‌లో 57 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిలో 26 నుంచి 30 ఏళ్లలోపు వారు 149 మంది ఉన్నారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 1,317 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, 70 ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నాకా బందీని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని ఏ బార్లో మద్యం సేవించారో కూడా విచారించామని పోలీసు కమిషనర్ ఉపాధ్యాయ తెలిపారు. సదరు బార్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన సుమారు 12వేల మంది డ్రైవర్లకు గులాబి పువ్వులు అందచేశామని ఉపాధ్యాయ చెప్పారు.