సాక్షి, విజయనగరం ఫోర్ట్/పార్వతీపురం టౌన్: ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా.. వాహన పత్రాలు, లైసెన్సులు వెంట లేవా.. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా... నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే భారీగానే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో సరిపెట్టుకోకుండా జైలు శిక్షకూడా పడే అవకాశం ఉంది. అంతేనా... రహదారి భద్రత నిబంధనలు ఉల్లం ఘించి వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేవారి ఆటలు ఇక సాగవు. తమ కళ్లెదుటే రాంగ్ రూట్‌లో వెళుతూ... నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపు తూ... పౌరులకు ఇబ్బంది కలిగిస్తే... వారే నేరుగా వాట్సాప్‌ద్వారా రవాణా శాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రవాణా శాఖ 9542800800 నంబర్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించి పెద్ద మొత్తంలో జరిమానా విధించవచ్చు. అంటే రాబోయే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ఎటువైపు నుంచైనా వడ్డన పడే అవకాశం ఉంది. కాబట్టి వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసు, రవాణా శాఖలు హెచ్చరిస్తున్నాయి.
కొత్త వాహన చట్టంలో నిబంధనలు కఠినం..
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని అమలులో కి తెచ్చింది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటారు వెహికల్ చట్టంలో కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే పోలీసులు ఈ చట్టంపై వాహనచోదకులు, యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు.
చట్టంలోని ముఖ్యాంశాలు..
డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, మద్యం తాగి, అతి వేగంగా, హెల్మెట్ లేకుండా, అంబు లెన్సు వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోయినా, కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు సీటుబెల్ట్ పెట్టుకోకున్నా శిక్షార్హులు. మైనర్లు వాహనాలు నడిపితే వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అధిక మొత్తంలో జరిమానా విధించేలా చట్టం తీసుకొచ్చారు. చట్టంలోని పలు అంశాల కు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు.
ఫిర్యాదుల కోసం రవాణా శాఖ వాట్సాప్..
రహదారి భద్రత నిబంధనలు పాటించకపోవడం వల్ల అమాయకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారి నిబంధనలు పాటించని వారితో పాటు రహదారిపై ప్రయాణించే వారు సైతం ప్రమాదాల్లో ఇరుక్కునే సందర్భాలున్నా యి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందు కు ప్రజాభాగస్వామ్యం అవసరమని రవాణా శాఖ భావించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. స్మార్ట్ ఫోన్ ఉండి ఫోటో తీసే కొద్ది పాటి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఎక్కడినుంచైనా నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటో తీసి రవాణాశాఖ అధికారులు అందుబా టులోకి తెచ్చిన 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ అధికారులు రం గంలోకి దిగి నిబంధనలు భేఖాతరు చేసిన వారి భరతం పడతారు. ఫొటోల ను రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధి కారులు పరిశీలించి వాహనయజమాని అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
ఎవరైనా వాట్సాప్ ద్వారా పంపవచ్చు..
నిబంధనలు అతిక్రమించిన వారి ఫొటోలు తీసి ఎవరైనా 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. వాటి ఆధారంగా సంబంధిత వాహన యజమాని ఇంటికి చలానా పంపించి జరిమానా వసూలుకు చర్యలు తీసుకుంటాం.
– సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, విజయనగరం
వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన మోటారు వాహన చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
– వి.లోవరాజు, పట్టణ ఎస్‌ఐ, పార్వతీపురం
ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి..
వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా లో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మైనర్లు వాహనం నడిపితే సంరక్షకులకు రూ.25వేలు జరిమానా, మూడే ళ్ల జైలు శిక్షతోపాటు లైసెన్సు రద్దు చేస్తాం.
– ఆర్.జయంతి, పట్టణ మహిళా ఎస్‌ఐ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment