G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు | G20 Summit: New Delhi Area To Be Out Of Bounds For 3 Days - Sakshi
Sakshi News home page

G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

Published Fri, Aug 25 2023 5:45 PM | Last Updated on Fri, Aug 25 2023 6:20 PM

G20 Summit New Delhi Area To Be Out Of Bounds For 3 Days  - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆధ్యక్షతన సెప్టెంబర్ 8-10 వరకు జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. 

ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో సెప్టెంబర్ 8-10 వరకు జరిగే ఈ సమావేశాలకు ఆయా దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపధ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపుల తోపాటు కొన్ని టాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. 

యాదవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని ఢిల్లీ వాస్తవ్యులైతే పర్వాలేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని.. మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు. ఈ మూడు రోజులు ప్రజలు  రద్దీగా ఉండే మార్కెట్‌లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు. 

మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్‌లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్‌పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు.  

ఇది కూడా చదవండి: అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement