strict rules
-
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్‌లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్‌ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్‌పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్‌లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
-
కరోనా పొంచి ఉన్నా నిర్లక్ష్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదేపదే సూచిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. హిల్ స్టేషన్లతో పాటు మార్కెట్లలో జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రజా రవాణాలో కోవిడ్–19 ప్రోటోకాల్‌కు ఏమాత్రం కట్టుబడి ఉండడం లేదని, భారీ సంఖ్యలో జనాలు బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని, అక్కడ సామాజిక దూరం సైతం పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 రెండో వేవ్ ఇంకా ముగియలేదని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని అజయ్ భల్లా సూచించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, హిల్ స్టేషన్లలో కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్లే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని, ఇది ఆందోళనకరమైన విషయమని భల్లా తెలిపారు. అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలను పాటించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా ఆంక్షలను సడలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు. -
12 గంటల తర్వాత నో ఎంట్రీ.. ఏపీలో కఠిన ఆంక్షలు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఆంధ్రా- తెలంగాణా సరిహద్దుల్లో కర్ఫ్యూ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత వచ్చిన వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసర సేవలు, గూడ్స్ వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. కర్ఫ్యూకు సంపూర్ణ సహకారం అందిస్తామని వ్యాపారులు తెలిపారు. నిత్యావసరాలకు మాత్రమే బయటకు రావాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని పర్యవేక్షించిన కృష్ణా జిల్లా ఎస్పీ.. గరికపాడు చెక్ పోస్టు వద్ద కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిస్థితిని పర్యవేక్షించి.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వాహన దారులకు పరిస్థితిని వినయంగా వివరించి పంపాలని ఎస్పీ ఆదేశించారు. 12 గంటల తర్వాత వాహనాలను అనమతించే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణ దృష్ట్యా కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. జిల్లాలో 52 చెక్‌పోస్టులు ఉన్నాయని.. అంతర్ జిల్లాలకు సంబంధించి 26 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. 18వ తేదీ వరకు కర్ఫ్యూకి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏపీలో కొత్త రకం వైరస్ లేదు -
ద.ఆఫ్రికాలో కొత్త వేరియంట్
లండన్: దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. ఇది కరోనా సెకండ్‌వేవ్ అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ రెండో రకం కరోనా వైరస్‌ను తాజాగా యూకేలోనూ గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ కరోనా వైరస్‌ను బ్రిటన్‌లో కరోనా బారిన పడిన ఇద్దరిలో గుర్తించామని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ వెల్లడించారు. వారిద్దరూ ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను యూకే నిషేధించింది. గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా వెళ్లివచ్చినవారు, వెళ్లి వచ్చిన వారిని కలిసిన వారు వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాలని హాన్కాక్ సూచించారు. ‘ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందనేదే ఆందోళనకర అంశం. యూకేలో గుర్తించిన వైరస్ వేరియంట్ కన్నా ఇది ఎక్కువ ఉత్పరివర్తనాలు చెందిన వైరస్’ అని పేర్కొన్నారు. కొత్త వైరస్ కట్టడి విషయంలో, సంబంధిత సమాచారం తమకు అందించే విషయంలో దక్షిణాఫ్రికా పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. యూకేలో గుర్తించిన కొత్త వేరియంట్‌కు, దక్షిణాఫ్రికాలో గుర్తించిన వేరియంట్‌కు పోలికలున్నప్పటికీ.. అవి వేరువేరు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండూ ఎన్501వై మ్యూటేషన్‌కు గురయ్యాయన్నారు. రెండు కూడా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉన్నాయని ప్రొఫెసర్ సుసాన్ వివరించారు. యూకేలోని మరిన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు! కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ ఆంక్షలను యూకేలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో మంత్రివర్గం బుధవారం ప్రత్యేకంగా సమావేశమై, లాక్డౌన్ ప్రాంతాలను విస్తరించాలనే విషయంలో చర్చలు జరిపారు. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని, అయితే, ఈ కొత్త వైరస్ లండన్, ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉందని యూకే కమ్యూనిటీస్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే టయర్ 4 ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు. మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఈ వైరస్ స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించడం లేదని, అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాల్లోనూ కఠిన లాక్డౌన్ ఆంక్షలను విధించే విషయమై ఆలోచిస్తున్నామని వివరించారు. మరోవైపు, బ్రిటన్ నుంచి ప్రయాణీకులు, సరుకు రవాణాలపై నిషేధాన్ని ఫ్రాన్స్ రెండు రోజుల పాటు సడలించింది. యూకేలో బుధవారం 39,237 కరోనా కేసులు, 744 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 333 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు, మరణాల సంఖ్య 1,46,444కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 96,63,382 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 95.69 శాతానికి చేరింది. మరణాల రేటు 1.45 శాతానికి పడిపోవడం ఊరట కలిగించే పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,89,240 మాత్రమే ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి కేవలం 2.86 శాతమే. జాన్సన్ రాక కష్టమే! న్యూఢిల్లీ: వచ్చేనెల రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావడం అనుమానమేనని బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ చైర్ ఆఫ్ కౌన్సిల్ చా. చాంద్ నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త రూపుతో దాడి చేస్తున్న తరుణంలో బోరిస్ జాన్సన్ దేశం విడిచి వెళ్లకపోవచ్చన్నారు. ఇప్పటికైతే బ్రిటీష్ ప్రభుత్వం జాన్సన్ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇదే వేగంతో కరోనా వ్యాప్తి కొనసాగితే మాత్రం ఆయన వెళ్లరని చెప్పారు. ఒకవేళ లండన్ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్ తదితర ఆంక్షల ఫలితంగా పరిస్థితి అదుపులోకి వస్తే జాన్సన్ ప్రయాణం ఉండొచ్చన్నారు. -
విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే
ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల సేవలు మినహా అన్ని ప్రయాణాలు రద్దయ్యాయి. మార్చి 25 నుంచి కేంద్రం అన్ని రకాల విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముందులాగే విమానాల్లో ప్రయాణం చేయడం అంత ఈజీ కాదని తెలుస్తుంది. కఠిన ఆంక్షలు, భద్రత మధ్యే ప్రయాణికులు విమానాలు ఎక్కనున్నారు. (ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం) ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాల్సిందేనని, ఇది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా అమలవుతుందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విమానంలో అందించే మీల్స్‌ను రద్దు చేయడంతో పాటు లావెటరీ(టాయిలెట్)లను కూడా పరిమితం సంఖ్యలో వాడనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పట్ల కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర విమానాయాన శాఖకు లేఖ ద్వారా సమాచారం అందిచినట్లు తెలిసింది. ఒకవేళ మే 3 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తే విమాన సేవలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులు ఎలాంటి సామాజిక దూరం పాటించకుండానే రోజుకు వందల సంఖ్యలో విమానాశ్రయాలకు పోటెత్తుతారు. దీంతో వారిని అదుపు చేయలేక పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చనే భావనతో లాక్డౌన్ తర్వాత కూడా కొన్ని రోజులు ఆంక్షలు కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. (లాక్డౌన్ వేళ.. ఏఈఓ హోంవర్క్) ఇదే విషయమై ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. 'కట్టుదిట్టమైన భద్రత మధ్యే ప్రయాణికులను అనుమతిస్తాము. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. వారికి ఎలాంటి లక్షణాలు , ఫ్లూ జ్వరం లాంటివి లేకపోతేనే టర్మినెల్‌కు వెళ్లేందుకు అనుమతిస్తాము. ఫేస్ మాస్క్‌ను ధరించని వారిని టర్మినెల్లోకి అనుమతించే అవకాశం లేదు. ప్రయాణికుల మధ్య సామాజిక దూరం పాటిస్తూనే వారిని విడతల వారిగా విభజించి అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసిన తర్వాతే విమానం ఎక్కడానికి అనుమతిస్తాం.ప్రయాణ సమయంలో ప్రయాణికులకు కేవలం నీరు తప్ప ఎలాంటి స్నాక్, మీల్స్ అందించరు. విమానంలోని లావెటరీస్ను కూడా పరిమిత సంఖ్యలోనే వాడుతారని' వెల్లడించారు. దీనిపై ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. -
లాక్డౌన్: 1,270 వాహనాలు సీజ్
సాక్షి, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆకతాయిలు అవసరం లేకున్నా రోడ్డెక్కుతూ సరదాగా తిరుగుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా లాక్డౌన్ అమలవుతున్న గతనెల 23 నుంచి ఈనెల 11వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతం పరిధిలో పోలీసులు కొరడా ఝళిపిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం, బీజాపూర్ రహదారుల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, షాద్‌నగర్, శంషాబాద్, మణికొండలో రెండు చొప్పున, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, బొంగుళూరు, మహేశ్వరం, మాల్లో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. అంతటా నిత్యం తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. 1,270 వాహనాలు సీజ్.. గ్రామీణ ప్రాంతం పరిధిలో దాదాపు 23 ఠాణాలు ఉండగా.. దాదాపు 1,270 వాహనాలు సీజ్ అయ్యాయి. ఇందులో 70 శాతం మేర ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 13 శాతం త్రిచక్ర వాహనాలు, 17 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ వాహనాలను పోలీసులు లాక్డౌన్ పూర్తయ్యాక కోర్టులకు అప్పగించనున్నారు. కోర్టులు విధించే జరిమానా చెల్లించి యజమానులు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. 185 మందిపై కేసులు లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నా.. కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పరిమిత సమయానికి మించి విక్రయాలు జరపడం, మరికొందరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపారం నిర్వహించారు. అలాగే కూరగాయల మార్కెట్లు, ఇతర షాపులు, సూపర్ మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదు. ఈమేరకు 185 మందిపై ఎపిడిమిక్ డిసీజెస్ యాక్ట్–1987, ఐపీసీ 188, జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు జరిమానా కూడా విధించవచ్చు. ఉమ్మినా.. మాస్క్ లేకున్నా.. మహమ్మారి కోవిడ్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయద్దు. ఈ అంశాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఆయా విభాగాలు వీటిపై చైతన్యం కలి్పస్తున్నాయి. మరోరెండు మూడు రోజులపాటు దీన్ని కొనసాగించనున్నారు. ఆ తర్వాత మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉంటేనే క్షేమం లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ కచి్చతంగా పాటించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దు. రోడ్డెక్కొద్దు. ఈ నిబంధనలను కచి్చతంగా పాటిస్తేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజల మేలు కోసమే. దీనిని ప్రతి వ్యక్తి గుర్తించి సహకరించాలి. స్వీయ రక్షణ.. భౌతికదూరంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలం. మాస్‌్కలు ధరించకుండా బయట తిరిగితే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా కేసులు తప్పవు. మాస్క్‌లు పంపిణీ చేయడానికి కొన్ని ఎన్జీఓలను గుర్తిస్తున్నాం. ఆయా సంస్థల ద్వారా మాస్‌్కలు అందజేస్తాం. – ప్రకాశ్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, విజయనగరం ఫోర్ట్/పార్వతీపురం టౌన్: ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా.. వాహన పత్రాలు, లైసెన్సులు వెంట లేవా.. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా... నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే భారీగానే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో సరిపెట్టుకోకుండా జైలు శిక్షకూడా పడే అవకాశం ఉంది. అంతేనా... రహదారి భద్రత నిబంధనలు ఉల్లం ఘించి వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేవారి ఆటలు ఇక సాగవు. తమ కళ్లెదుటే రాంగ్ రూట్లో వెళుతూ... నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపు తూ... పౌరులకు ఇబ్బంది కలిగిస్తే... వారే నేరుగా వాట్సాప్‌ద్వారా రవాణా శాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రవాణా శాఖ 9542800800 నంబర్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించి పెద్ద మొత్తంలో జరిమానా విధించవచ్చు. అంటే రాబోయే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ఎటువైపు నుంచైనా వడ్డన పడే అవకాశం ఉంది. కాబట్టి వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసు, రవాణా శాఖలు హెచ్చరిస్తున్నాయి. కొత్త వాహన చట్టంలో నిబంధనలు కఠినం.. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని అమలులో కి తెచ్చింది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటారు వెహికల్ చట్టంలో కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే పోలీసులు ఈ చట్టంపై వాహనచోదకులు, యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు. చట్టంలోని ముఖ్యాంశాలు.. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, మద్యం తాగి, అతి వేగంగా, హెల్మెట్ లేకుండా, అంబు లెన్సు వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోయినా, కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు సీటుబెల్ట్ పెట్టుకోకున్నా శిక్షార్హులు. మైనర్లు వాహనాలు నడిపితే వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అధిక మొత్తంలో జరిమానా విధించేలా చట్టం తీసుకొచ్చారు. చట్టంలోని పలు అంశాల కు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. ఫిర్యాదుల కోసం రవాణా శాఖ వాట్సాప్.. రహదారి భద్రత నిబంధనలు పాటించకపోవడం వల్ల అమాయకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారి నిబంధనలు పాటించని వారితో పాటు రహదారిపై ప్రయాణించే వారు సైతం ప్రమాదాల్లో ఇరుక్కునే సందర్భాలున్నా యి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందు కు ప్రజాభాగస్వామ్యం అవసరమని రవాణా శాఖ భావించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. స్మార్ట్ ఫోన్ ఉండి ఫోటో తీసే కొద్ది పాటి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఎక్కడినుంచైనా నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటో తీసి రవాణాశాఖ అధికారులు అందుబా టులోకి తెచ్చిన 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ అధికారులు రం గంలోకి దిగి నిబంధనలు భేఖాతరు చేసిన వారి భరతం పడతారు. ఫొటోల ను రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు పరిశీలించి వాహనయజమాని అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.. నిబంధనలు అతిక్రమించిన వారి ఫొటోలు తీసి ఎవరైనా 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. వాటి ఆధారంగా సంబంధిత వాహన యజమాని ఇంటికి చలానా పంపించి జరిమానా వసూలుకు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయనగరం వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన మోటారు వాహన చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. – వి.లోవరాజు, పట్టణ ఎస్ఐ, పార్వతీపురం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి.. వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా లో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మైనర్లు వాహనం నడిపితే సంరక్షకులకు రూ.25వేలు జరిమానా, మూడే ళ్ల జైలు శిక్షతోపాటు లైసెన్సు రద్దు చేస్తాం. – ఆర్.జయంతి, పట్టణ మహిళా ఎస్ఐ, పార్వతీపురం -
విద్యార్థుల డేటాలో తప్పులుంటే మీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన డేటాలో దొర్లుతున్న తప్పులపై రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు మండిపడ్డారు. విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు, పరీక్షలకు హాజరు కావాల్సిన సబ్జెక్టులు, మీడియం తదితర అంశాల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని తాము ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో పిన్సిపాళ్ల సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థుల పరీక్షల ఫీజుల చెల్లింపు, నామినల్ రోల్స్‌కు సంబంధించి తలె త్తుతున్న పొరపాట్లపై చర్చించారు. వాటిని సవరించేందుకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలని కోరారు. బోర్డు కార్యదర్శిదే బాధ్యత ఆన్లైన్లో, నామినల్ రోల్స్‌లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, బోర్డు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని వైనంపై పిన్సిపాళ్లు పలు తీర్మానాలు ఆమోదించారు. ఈసారి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఇంటర్ బోర్డు కార్యదర్శిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే సమస్యలకు కారణమని తెలిపారు. పరీక్షల కోసం జనరేట్ చేసే హాల్టికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లినా, గంద రగోళం తలెత్తినా ప్రిన్సిపాళ్లకు ఎలాంటి బాధ్యత లేదని, బోర్డు కార్యదర్శి మాత్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాలతో పాటు బోర్డు కార్యదర్శి తీరు, నామినల్ రోల్స్, విద్యార్థుల డాటాకు సంబంధించిన వివరాల్లో దొర్లుతున్న తప్పులపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. అవసరమైన బడ్జెట్ కేటాయించాలి కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్‌పాస్ సదుపాయం, ఉచిత యూనిఫాంలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉచిత విద్య ద్వారా ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేసి, కాలేజీలకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలని విన్నవించారు. సమావేశంలో ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూణ్నాళ్ల ముచ్చటేనా..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లఘుచిత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా హెల్మెట్ పెట్టుకుంటే బరువని, హేర్‌స్టైల్ చెదిరిపోతుందని భావిస్తూ చాలామంది దానిని ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పో తున్నారు. కుటుంబాలకు దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. గతంలో హెల్మెట్ వినియోగం చాలా వరకు అమలు జరిగినా పోలీసులు, రవాణాశాఖ అధికారులు రానురాను కొంత పట్టించుకోకపోవడంతో అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రత్యేక డ్రైవ్‌తో... గతంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు సం యుక్తంగా హెల్మెట్ వినియోగాన్ని అమలు చేశా రు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లకు వస్తే హెల్మెట్ లేకుండా రావద్దని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొంత హెల్మెట్ వినియోగంలో వాహన చోదకులు బాధ్యతగా తీసుకున్నారు. హెల్మెట్‌ను విధిగా ఉపయోగించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ వినియోగం చాలా వరకు తగ్గిపోగా పోలీ సులు సైతం నామమాత్రంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున జరిమానాలు... హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో నూతన రవాణ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టు పడితే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించే వారు. ఇక ఇప్పుడు భారీగా జరిమానా విధించైనా సరే హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నో హెల్మెట్–నో పెట్రోల్ నినాదం అమలు జరిపేలా చర్యలు తీసుకొనే విధంగా పోలీసులు చూస్తున్నారు. ఇక రవాణ శాఖాధికారులకు హెల్మెట్ లేకుండా పట్టుబడితే ఆ శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1వెయ్యితో పాటు హెల్మెట్ లేని కారణంగా మరో రూ. 100 మొత్తం కలిపి రూ.1,100 జరిమానా విధిస్తారు. అయితే ఇటీవల హెల్మెట్ వినియోగం తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ క్రమంలో వాహన చోదకులు హెల్మెట్ రోజూవారీగా ధరించేలా చూస్తామని రవాణ శాఖ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గడ్డం వివేకానంద్‌రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోతున్నా... రహదారి ప్రమాదాల్లో 70శాతం మంది ద్విచక్రవాహనదారులు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ మృత్యువాత పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కిందపడి తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. 2016లో 222 ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగగా 160 మంది మృతి చెందారు. మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. 2017లో జరిగిన 236 ద్విచక్ర వాహనప్రమాదాల్లో 196 మంది మృతి చెందగా 145 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2018 మే నెల వరకు 95 ప్రమాదాలు జరగగా 80 మంది వరకు మృత్యువాత పడగా 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. కఠినంగా వ్యవహరిస్తాం... హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానా తక్కువగా ఉండటం, తనిఖీల సమయాల్లో వాహనదారులు అప్రమత్తం కావడం వలన హెల్మెట్ వినియోగంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రవాణ చట్టాలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తాం. అవసరమైతే రవాణాశాఖా అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ వినియోగం పెంచడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –జి.సతీశ్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
కఠిన ‘హెచ్–1బీ’తో అమెరికాకూ నష్టమే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల జారీ విధానంలో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు భారత కంపెనీలపైనే కాకుండా అమెరికా ఐటీ పరిశ్రమపైనా పెను ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. కఠిన నిబంధనల ప్రభావం అమెరికా ఐటీ రంగం, ఆర్థిక వ్యవస్థపై ఇలా ఉంటుంది. హెచ్ –1బీ వీసాను అధికంగా వినియోగించుకుంటున్నది టెక్ కంపెనీలే. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్లకే గతేడాది ఎక్కువ వీసాలు దక్కాయి. కొత్త నిబంధనల వల్ల అవి విదేశీ నిపుణులను నియమించుకోవడం కష్టతరమవుతుంది. కనీసం బిలియన్ డాలర్ల పెట్టుబడితో విదేశీయులు స్థాపించే సంస్థలు సగటున 760 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వలసదారులకు అడ్డంకులు ఎదురైతే దేశ వాణిజ్య రంగానికి విఘాతమే. అమెరికాలో ఇంజినీరింగ్ చదివే వారిలో విదేశీయులే ఎక్కువ. 70 శాతానికి పైగా కంపెనీల్లో మేనేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో వలసదారులదే ముఖ్య పాత్ర. 2017లో టాప్–7 భారత ఐటీ కంపెనీలకు వీసాలు తక్కువ వచ్చాయి. దీంతో అమెరికాలో నిపుణులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. -
మెట్రో రూల్స్.. ఆ పని చేస్తే రూ. 200 ఫైన్
సాక్షి, బెంగళూర్ : మెట్రో రైల్ రవాణా వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచే చర్యలో భాగంగా బెంగళూర్ ‘నమ్మ మెట్రో’ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో, రైళ్లలో పాన్, గుట్కా, చూయింగ్ గమ్‌లను తినడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతిక్రమణ ఉల్లంఘిస్తే 200 రూపాయల ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు చూయింగ్ గమ్‌లు తిని, వాటిని రైళ్లలో, స్టేషన్లలో ఎక్కడపడితే అక్కడ అంటిస్తున్నారు. పాన్లు, గుట్కాలను నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్న ఆ ఆగడాలను కట్టడి చేయలేకపోతున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని నమ్మ మెట్రో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతలను ప్రయాణికులందరిపై ఉందని.. అది మరిచి పారిశుద్ధ్యాన్ని దెబ్బతీసేవారికి ఇది గుణపాఠమౌతుందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
ఇక కఠిన పరీక్షలు తప్పవా?
సాక్షి, వాషింగ్టన్ : ట్రావెల్ బ్యాన్ విషయంలో ఫెడరల్ కోర్టు తీర్పుతో భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయానికి సిద్ధమయ్యారు. శరణార్థులను విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు రచించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని తమ దేశంలోకి అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావంతో మహిళలు, పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. శరణార్థు ముప్పు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వారి భద్రతను పలుస్థాయిలో దఫాలుగా పరిశీలించి తమ దేశంలోకి అనుమతిస్తుంది. ఈ క్రమంలో బయోగ్రఫిక్, బయోమెట్రిక్ డేటా ద్వారా శరణార్థులు డేటాను పరిశీలిస్తారు. ఇంటెలిజెన్స్ డేటా బేస్‌లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకాలం మహిళలు, పిల్లల విషయంలో నిబంధనల సడలింపు ఉన్నప్పటికీ.. ఇకపై ఊపేక్షించాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయంట. సెక్యూరిటీ స్కీనింగ్ విషయంలో పురుషులను మాత్రమే అన్ని విధాలుగా పరిశీలించి పంపేవారు. కొత్త నిబంధనల కారణంగా ఇకపై వారిని క్షణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎదైనా తప్పులు దొర్లితే మాత్రం వారిని అనుమతించరన్న మాట. ఇక ఈ అంశంపై స్పందించేందుకు వైట్‌హౌజ్ ప్రతినిధులు నిరాకరించగా.. ఇది కేవలం 120 రోజులకు సంబంధించిన సమీక్షేనంటూ ఓ అధికారి చెబుతున్నారు. ఇక 2016 నుంచి మొత్తం 85,000 మంది శరణార్థులు అమెరికాలో తలదాచుకుంటుండగా.. వీరిలో 72 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. గత ప్రభుత్వాలు పురుషులతోనే(ఉగ్రవాద సంస్థల్లో చేరే అవకాశం) ఎక్కువ ముప్పు ఉందని భావించింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి సమస్యలు తప్పేలా కనిపించటం లేదు. ఇదిలా ఉంటే శరణార్థులను కట్టడి చేయటంలో ట్రంప్ సఫలం అవుతున్నాడనే చెప్పొచ్చు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏడాదికి 1.10,000 శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో కేవలం 50,000 మందిని మాత్రమే అనుమతించారు. ఇక వచ్చే ఏడాదికి ఆ సంఖ్యన మరో 5 వేలకు తగ్గించాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. -
ఈ మెడికల్ కాలేజీ రూల్స్ సూపర్బ్
ఆగ్రా: సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్ చర్యలకు దిగకుండా ఉత్తరప్రదేశ్‌లోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎలాంటి పనులు చేస్తే ర్యాగింగ్కింద భావించి పోలీసు చర్యలు మొదలవుతాయో స్పష్టంగా పేర్కొంటూ క్యాంపస్ ఏరియా మొత్తం కూడా నోటీసులు అంటించింది. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలు తీసుకోవడం ఎప్పుడూ ముందుండే ఈ కాలేజీ ఈసారి కొన్ని అదనంగా కూడా చేర్చి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి భంగం కలగకుండా గట్టి చర్యలు ప్రారంభించింది. ఎలాంటి సైగలతోనైనా, మాటలతోనైనా.. శారీరకంగాగానీ, మానసికంగాగానీ వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆ కాలేజీ యాంటీ ర్యాగింగ్ సెల్ ప్రెసిడెంట్ ఎస్కే ఖతారియా మీడియాకు చెప్పారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని అతడు జూనియర్ అయిన, సీనియర్ అయినా రంగు, జాతి, మతం, కులం,లింగం, లైంగిక పరమైన, కనిపించేతీరుపైనా, ప్రాంతం, జాతీయత, భాష తదతర అంశాలను ఆధారంగా చేసుకొని ఎదుటివారిని వేధిస్తే మాత్రం ర్యాగింగ్ కిందకే వస్తుందని తెలిపారు. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు హాస్టల్ నుంచి వెళ్లగొట్టి రూ.25వేలు ఫైన్ వేసి అతడి పరీక్ష ఫలితాలు కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తులు, జుట్టుపై కాలేజీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రతి విద్యార్థి హుందాగా మాత్రం వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే!
-
క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే!
కఠిన నిబంధనలతో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలు * 1985కు తర్వాతి కట్టడాల క్రమబద్ధీకరణ తప్పనిసరి * లేకుంటే భారీ జరిమానాలు, కూల్చివేతలు.. * రిజిస్ట్రేషన్ల నిషేధం.. తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్లు బంద్ * క్రిమినల్ కేసులు నమోదుచేసే అంశంపైనా పరిశీలన * సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఇక నుంచి తప్పనిసరి కానుంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సంఖ్యలో కట్టడాలు, అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తుండడం... అడపాదడపా అనుమతులు పొందుతున్నా నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుపుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సరైన ప్రణాళిక లేకుండానే పుట్టుకొస్తున్న నిర్మాణాలతో నగరాలు, పట్టణాలు రూపురేఖలు కోల్పోయి గజిబిజిగా మారడం, రహదారులు, వరద నీటి కాల్వలు, మురికికాల్వలు సైతం కుచించుకుపోయి ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. అక్రమ కట్టడాలతో వరద నీటి కాలువలు కనుమరుగైపోయాయి. వర్షం పడితే చాలు హైదరాబాద్ నగరం చెరువును తలపిస్తోంది. ఇలా పట్టణాభివృద్ధి ప్రణాళికల అమలుకు సైతం విఘాతంగా మారిన అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కఠిన చర్యలు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అక్రమ లే అవుట్లు/ప్లాంట్లు, భవనాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇవ్వడంతోపాటు ఇకపై ఇలాంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం కఠిన నిబంధనలతో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టేందుకు పురపాలక శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా జీవోలకు తుది మెరుగులు దిద్దుతోంది. సోమవారం విడుదల కానున్న ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే.. గత నెల 28వ తేదీలోపు నిర్మించిన భవనాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ తప్పనిసరి కానుంది. అయితే 1985కు పూర్వం నిర్మించిన భవనాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. 1985 నుంచి గత నెల 28లోపు నిర్మించిన భవనాలు, లేఅవుట్లకు క్రమబద్ధీకరణ పథకాలు వర్తించనున్నాయి. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రెండు నెలల గడువు విధించనుంది. ఆ గడువులోగా క్రమబద్ధీకరించుకోని పక్షంలో తీసుకోబోయే కఠిన చర్యలను ఈ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పొందపరుస్తున్నట్లు తెలిసింది. సదరు భవన, లేఅవుట్ల యజమానులు నిరంతరాయంగా నేరానికి పాల్పడుతున్నట్లు పరిగణించి భారీ జరిమానాలు విధించడం, చట్టప్రకారం కూల్చివేసేందుకు స్థానిక అధికారులకు అనుమతులు ఇవ్వడం, ఆయా ప్రాంతాల్లో తదుపరి నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడం వంటి నిబంధనలను అమలుచేయనున్నారు. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ అనుసంధానాన్ని అడ్డుకోనున్నారు. దీంతోపాటు అక్రమ లేఅవుట్ల క్రయావిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లను సైతం నిషేధించే అవకాశముంది. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉండే నిషేధిత ఆస్తుల జాబితాలో ఆ అక్రమ ప్లాట్లను చేర్చుతారు. వీటన్నింటితోపాటు క్రిమినల్ కేసుల నమోదుకు సైతం అనుమతి ఇచ్చే అంశాన్ని సర్కారు పరిశీలిస్తోంది. అయితే ఈ నిబంధనలను ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఉత్తర్వుల్లో పెట్టకపోతే... త్వరలో తీసుకురానున్న రాష్ట్ర భవన నిర్మాణ నియమావళిలో పొందుపరుస్తారని అధికార వర్గాలు తెలిపాయి.