సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఆంధ్రా- తెలంగాణా సరిహద్దుల్లో కర్ఫ్యూ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత వచ్చిన వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసర సేవలు, గూడ్స్ వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. కర్ఫ్యూకు సంపూర్ణ సహకారం అందిస్తామని వ్యాపారులు తెలిపారు. నిత్యావసరాలకు మాత్రమే బయటకు రావాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు.
పరిస్థితిని పర్యవేక్షించిన కృష్ణా జిల్లా ఎస్పీ..
గరికపాడు చెక్ పోస్టు వద్ద కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిస్థితిని పర్యవేక్షించి.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వాహన దారులకు పరిస్థితిని వినయంగా వివరించి పంపాలని ఎస్పీ ఆదేశించారు. 12 గంటల తర్వాత వాహనాలను అనమతించే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణ దృష్ట్యా కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. జిల్లాలో 52 చెక్‌పోస్టులు ఉన్నాయని.. అంతర్ జిల్లాలకు సంబంధించి 26 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. 18వ తేదీ వరకు కర్ఫ్యూకి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
ఏపీలో కొత్త రకం వైరస్ లేదు
Comments
Please login to add a commentAdd a comment