వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల జారీ విధానంలో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు భారత కంపెనీలపైనే కాకుండా అమెరికా ఐటీ పరిశ్రమపైనా పెను ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. కఠిన నిబంధనల ప్రభావం అమెరికా ఐటీ రంగం, ఆర్థిక వ్యవస్థపై ఇలా ఉంటుంది. హెచ్ –1బీ వీసాను అధికంగా వినియోగించుకుంటున్నది టెక్ కంపెనీలే. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్‌లకే గతేడాది ఎక్కువ వీసాలు దక్కాయి. కొత్త నిబంధనల వల్ల అవి విదేశీ నిపుణులను నియమించుకోవడం కష్టతరమవుతుంది.
కనీసం బిలియన్ డాలర్ల పెట్టుబడితో విదేశీయులు స్థాపించే సంస్థలు సగటున 760 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వలసదారులకు అడ్డంకులు ఎదురైతే దేశ వాణిజ్య రంగానికి విఘాతమే. అమెరికాలో ఇంజినీరింగ్ చదివే వారిలో విదేశీయులే ఎక్కువ. 70 శాతానికి పైగా కంపెనీల్లో మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో వలసదారులదే ముఖ్య పాత్ర. 2017లో టాప్–7 భారత ఐటీ కంపెనీలకు వీసాలు తక్కువ వచ్చాయి. దీంతో అమెరికాలో నిపుణులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment