IT industry
-
ఐటీ ఉద్యోగులకు ‘భారీ జీతాలు’ కొన్నిరోజులే..!
ఇటీవల పెరుగుతున్న లేఆఫ్‌లు, మందగించిన నియామక పరిస్థితులతో ఐటీ రంగం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్, నాన్-టెక్ రంగాలలో అనుభవం ఉన్న ఓ టెక్ నిపుణుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్ఢిట్’లో ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందంటూ చర్చను ప్రారంభించారు."డెవలపర్ /ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆ ఎక్స్పర్ట్ త్వరలో ఐటీ పరిశ్రమలో వేతనాలు ఇతర రంగాల్లో జీతాలకు దగ్గరగా కావచ్చని అంటే తగ్గిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఈ ప్రకటన భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్ మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్తు స్థితికి సంబంధించి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!టెక్, నాన్-టెక్ ఉద్యోగుల మధ్య ఉన్న జీతం అంతరాన్ని ఆయన విపులంగా వివరించారు. నాన్-టెక్ ఉద్యోగాలలో నైపుణ్యం కలిగినవారు సగటున ఏడాదికి 10-15 లక్షలు సంపాదిస్తున్నారని, ఇక టెక్ డెవలపర్లు, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారు కూడా 30-40 లక్షలు వార్షిక వేతనం అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం బుడగ లాంటిదని, ఎన్నో రోజులు ఉండదని రాసుకొచ్చిన ఆయన ఈ భారీ జీతాలు త్వరలో సర్దుబాటు కావచ్చని అభిప్రాయపడ్డారు.ఇక అనేక మంది డెవలపర్లు చాట్ జీపీటీ వంటి సాధనాలను ఉపయోగిస్తున్నందున డెవలపర్ల డిమాండ్ మరింత తగ్గుతుందని సూచించారు. దీని ఫలితంగా వారి పనిభారం 50% తగ్గింది. ఇదే సమయంలో జాబ్ మార్కెట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. "జనరేటివ్ ఏఐ ఉద్యోగాలను తీసివేయదని కొందరు వాదించవచ్చు, కానీ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మా కంపెనీలో ప్రస్తుతం జూనియర్ పాత్రలకు మాత్రమే ఓపెనింగ్లు ఉన్నాయి. సీనియర్ స్థానాలకు కాదు" అంటూ జోడించారు.Posts from the developersindiacommunity on Reddit -
పన్నుల విషయంలో అనిశ్చితి
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు రూ. 32,400 కోట్ల జీఎస్టీ ఎగవేత నోటీసులివ్వడంపై ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ స్పందించింది. ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనడానికి తాజా పన్ను నోటీసుల ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. పలు కంపెనీలు ఇలాంటి అనవసరమైన లిటిగేషన్లను, పన్నుల విషయంలో అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయని కూడా తెలిపింది. ‘పరిశ్రమ వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొంది. జీఎస్టీ కౌన్సిల్లో తీసుక్ను నిర్ణయాలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు వీటిని పాటించాలి. దీనివల్ల నోటీసులతో అనిశి్చతికి దారితీయదు, అలాగే భారత్‌లో వ్యాపార సానుకూలతపై ప్రభావం చూపకుండా ఉంటుంది’ అని నాస్కామ్ పేర్కొంది. రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం) ద్వారా జీఎస్టీని వర్తింపజేయడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడింది. ‘భారత ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు తమ విదేశీ శాఖలకు పంపే నిధులపై జీఎస్టీ అధికారులు పన్ను ఎగవేత నోటీసులు ఇస్తున్నారు. ఈ ఆర్సీఎం విషయంలో హెడ్ ఆఫీసు, విదేశీ బ్రాంచ్ మధ్య ఎలాంటి సేవల లావాదేవీలు జరగలేదు. ఇది బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీసు సేవలను పొందడం కిందికి రాదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు ఐటీ పరిశ్రమకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఓ పెద్ద ఐటీ కంపెనీకి ఇలాంటి కేసులోనే జారీ చేసిన జీఎస్టీ నోటీసుపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది’ అని నాస్కామ్ వివరించింది. దీనికి సంబంధించి స్పష్టతనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేసింది. -
సీఎం మార్క్ బ్రాండ్ సిటీ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి.. సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో.. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని విప్రో నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ రంగంలో తిరుగులేని నగరంగా విశాఖపట్నంని అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. వైజాగ్ టెక్ పార్క్ కూడా డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నారు. టైర్–1 సిటీలతో పోటీ నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిర అభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖకు 18వ ర్యాంకు సాధించింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షల జనాభా పైబడిన నగరాలు.. మొత్తంగా 56 నగరాలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్.. అందర్నీ ఆకర్షిస్తోంది. స్మార్ట్ సిటీ ర్యాంకింగ్‌లోనూ సత్తా చాటుతోంది. 2018–19లో 23వ ర్యాంకులో ఉన్న నగరం ఆ తర్వాత వరుసగా టాప్–10లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది క్లైమేట్ స్మార్ట్ సిటీ ఫ్రేమ్ వర్క్‌లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఐటీ ఉద్యోగాల జోరు.. రాష్ట్రంలోని ఐటీ రంగంలో 2014–19 కాలంలో 24,350 ఐటీ ఉద్యోగాల కల్పన జరిగితే ఆ తర్వాత రెండేళ్లు కోవిడ్ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఈ నాలుగున్నర ఏళ్లల్లో కొత్తగా 29,500 ఉద్యోగాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 53,850కు చేరింది. ♦ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న అదానీ, ఎస్‌క్యూఎల్ సంస్థలు ♦ భారీ ఐటీ పార్కులు నిర్మి స్తున్న అదానీ, రహేజా, ఏపీఐఐసీ ♦ గడిచిన నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 29,500 ఐటీ ఉద్యోగాలు \ ♦ విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టడ్, బీఈఎల్ కార్యకలాపాలు ♦ ఇప్పటికే ఉన్న సంస్థలు భారీ విస్తరణ ప్రణాళికలు ♦ ఎమర్జింగ్ ఐటీ సిటీగా విశాఖ ♦ విశాఖకు కంపెనీలు ఆకర్షించే విధంగా బీచ్ ఐటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం -
ఐటీ పరిశ్రమలో డేటా భద్రత డొల్లేనా..?
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో డేటా భద్రత అంతంత మాత్రమేనా..? అమెరికాకు చెందిన డేటా సెక్యూరిటీ సంస్థ ‘రుబ్రిక్’ నిర్వహించిన సర్వేలో ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పిన మాటలు వింటే నిజమేనని అనిపిస్తోంది. తమ కంపెనీ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్టు భారత్‌లో 49 శాతం ఐటీ కంపెనీలు చెప్పడం గమనార్హం. తమ వ్యాపార డేటాపై సైబర్ దాడులు జరిగినట్టు పేరొందిన బ్రాండ్లు ప్రస్తావించాయి. అంతేకాదు వచ్చే 12 నెలల కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయే రిస్క్ అధికంగా ఉందని 30 శాతం సంస్థలు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సంస్థలకు గాను ఒక సంస్థ గడిచిన ఏడాది కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయినట్టు చెప్పడం గమనార్హం. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్, భారత్‌లో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 11 మధ్య ఈ సర్వే జరిగింది. గడిచిన ఏడాది కాలంలో ఒకటికి మించిన సార్లు డేటా చోరీ జరిగినట్టు ప్రతి ఆరు సంస్థలకు గాను ఒకటి చెప్పింది. డేటా భద్రత విషయంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ అధ్యయనం మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. కృత్రిమ మేథ (ఏఐ)తోపాటు క్లౌడ్ అధునాతన సైబర్ భద్రత విషయంలో అవకాశాలు కల్పిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. దాడులను ఎదుర్కొనే సన్నద్ధత భారత్‌లో 54 శాతం ఐటీ కంపెనీలు సైబర్ నేరస్థుల చర్యలు తమ సంస్థ డేటాకు రిస్‌్కగా పేర్కొన్నాయి. వీటిలో 34 శాతం సంస్థలు సైబర్ దాడుల రిస్‌్కను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. ఏఐను అమలు చేయడం వల్ల సున్నిత డేటాను కాపాడుకోవచ్చని 54 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఎలాంటి ప్రభావం చూపించదని 24 శాతం కంపెనీలు అభిప్రాయం తెలియజేశాయి. ‘‘డేటా చోరీ వ్యాపారాలను నిరీ్వర్యం చేయగలదు. అందుకని డేటాను కాపాడుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అది సైబర్ దాడులను కాచుకుని వ్యాపారం స్థిరంగా కొనసాగేలా ఉండాలి’’అని రుబ్రిక్ జీరో ల్యాబ్స్ హెడ్స్టీవెన్ స్టోన్ పేర్కొన్నారు. -
ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఐటీ పరిశ్రమంలో పని చేస్తున్న టెక్ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఈ భయంపై ఊరట కలిగించే మాటను గ్లోబల్ డేటా స్టోరేజ్ అండ్ సొల్యూషన్స్ మేజర్ నెట్‌యాప్ (NetApp) సీఈవో జార్జ్ కురియన్ (George Kurian) చెప్పారు. భారత్.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని నెట్‌యాప్ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక బలం, పెరుగుతున్న యువ జనాభా ఇందుకు దోహం చేస్తాయని భావిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసిన ఈ సంస్థ, దేశంలో భాగస్వామ్యాలను, హెడ్‌కౌంట్‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని సీఈవో జార్జ్ కురియన్ పేర్కొన్నారు. తేలికపాటి మాంద్యం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి స్థాయి తగ్గడంతో ఐటీ పరిశ్రమలో తేలికపాటి మాంద్యం ఉండొచ్చని తెలిపారు. సంవత్సరం క్రితంతో పోలిస్తే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వడ్డీ రేటు పెరుగుదల వేగం మందగించడం వల్ల అనిశ్చితి స్థాయి కొద్దిగా తగ్గింది. బిజినెస్ సెంటిమెంట్లు ఇప్పటికే వేగవంతమయ్యాయని చెప్పను కానీ విశ్వాసం మెరుగుపడటం ప్రారంభించిందని కురియన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకపోతే అన్ని దేశాలూ మాంద్యం నుంచి బయటకు వస్తాయన్నారు. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?
ఐటీ మేజర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. చాలామంది ఫ్రెషర్లను తొలగించాయి. ఇది చాలదన్నట్టు తాజాగా వేతనాల పెంపును వాయిదా వేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగుల వార్షిక వేతనాల్లో కోత విధించేందుకు యోచిస్తున్నాయని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇది పరిశ్రమలో నెలకొన్న గడ్డు పరిస్థితులను అద్దం పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఇండియాలో టాప్ శాలరీ అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన హెచ్‌సీఎల్‌టెక్ సీఈఓ సీ విజయకుమార్ ఐటి పరిశ్రమలో మాంద్యం భయం వాస్తవమనే ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 క్యూ1లో ఐటి దిగ్గజం లాభం, రాబడికి సంబంధించిన అంచనాలను మిస్ అయిన తర్వాత విజయ్‌కుమార్ ఎకనామిక్ టైమ్స్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటి మేజర్లు బలహీనమైన ఆదాయ అంచనాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల టర్నోవర్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా యన్నారు. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) జూన్ త్రైమాసికంలో చెప్పుకోదగిన చెల్లింపుల కంటే తక్కువే అందిస్తోందనే అంచనాలను లైవ్‌మింట్ నివేదించింది. జూన్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు వేరియబుల్ వేతనం దాదాపు 60-80శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మనీకంట్రోల్ నివేదించిన ప్రకారం, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. మరో సంస్థ విప్రో తొలి త్రైమాసికానికి ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని 80శాతానికి పరిమితం చేసింది. అయితే ఇందులో టీసీఎస్ కాస్త బెటర్‌గా ఉందని. ఇటీవలి ఫలితాల తరువాత వేతన పెంపుదలలు సగటున 6-8 శాతం మధ్య టాప్ పెర్ఫార్మర్లు 12-15 శాతం వరకు పొందుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అయితే కొత్త ఉద్యోగ నియామకాలు మాత్రం భారీగా 96 శాతం తగ్గిందని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. -
అప్రెంటిస్ జాబ్స్‌కు అనువుగా ఐటీ హబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలు అప్రెంటీస్‌ల నియామకం విషయంలో అత్యంత ఆశాజనక ప్రదేశాలుగా అవతరించాయి. టీమ్‌లీజ్ అప్రెంటిస్‌షిప్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 14 నగరాల్లో 24 రంగాలకు చెందిన 597 కంపెనీలు ఇందులో పాలుపంచుకున్నాయి. 2022 జూలై–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో అప్రెంటీస్‌ల నియామకాల కోసం ఆసక్తి 77 నుంచి 79 శాతానికి పెరిగింది. సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ కంపెనీల్లో 83 శాతం అప్రెంటీస్‌ల నియామకాలను అధికం చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీ కంపెనీల్లో 82 శాతం, బెంగళూరులో 80, చెన్నై 81, ముంబై 77 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. మెట్రోయేతర నగరాలైన కోయంబత్తూరు 79 శాతం, నాగ్‌పూర్ 76, పుణే 76, అహ్మదాబాద్ 70 శాతం కంపెనీలు ఉత్సాహం కనబరిచాయి. వారి ప్రమేయమూ ఎక్కువే.. అప్రెంటీస్‌ల ప్రమేయం రంగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 90 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 88, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ 74 శాతం ఉంది. అప్రెంటీస్లను పెంచుకోవాలని ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 94 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 93, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 85 శాతం ఆసక్తిగా ఉన్నాయి. 2023లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో నిరంతర వృద్ధితో దేశంలో అప్రెంటిస్‌షిప్ పట్ల ఆశాజనక దృక్పథాన్ని చూస్తాం’ అని నివేదిక వివరించింది. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా వేతనంతో కూడిన ఉద్యోగంతోపాటు శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌లు తమ పని గంటలలో కొంత సమయాన్ని తరగతి గది ఆధారిత అభ్యాసాన్ని కళాశాల, విశ్వవిద్యాలయం లేదా కంపెనీలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్కల అవకాశాలు.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా, ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నప్పుడు.. పరిశ్రమ నిర్దిష్ట నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందేందుకు అప్రెంటీస్లకు పుష్కల అవకాశాలను అందిస్తాయని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు కంపెనీ యజమానులు, అప్రెంటీస్లకు విజయవంతమైన పరిష్కారంగా ఉద్భవించాయి. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజికంగా సాధికారత వైపు నడుపుతున్నారు. వ్యాపారాల ఉత్పాదకత, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని ఆర్థికంగా పెంచుతున్నారు’ అని అన్నారు. -
ఇదెక్కడి డిమాండ్ మహాప్రభో.. డబుల్ బెడ్ రూం అద్దె రూ.50వేలు!
దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్‌తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా మారింది. అమాంతం పెరిగిన అద్దె ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్‌ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్ మార్కెట్’కు మంచి డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. -
వర్క్ ఫ్రం హోం: మాకొద్దు మహా ప్రభో ఆఫీసుకు వచ్చేస్తాం.. అసలేం జరిగింది!
మళ్లీ ఆఫీసుల్లో ప్రత్యక్షంగా విధుల నిర్వహణకు ఉద్యోగులు సై అంటున్నారు. సహోద్యోగులతో సరదా సంభాషణలు, మాట్లాడుతూనే విధులు నిర్వర్తించడం, అంతా కలిసి కాఫీ, టీ బ్రేక్‌లు తీసుకోవ డం, వీకెండ్ ఎంజాయ్మెంట్లు..ఆ మజానే వేరు అని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన పరిస్థితులతో ఐటీ కంపెనీలు మూడేళ్లకు పైగా వర్క్ ఫ్రం హోం, ఇటీవలి కాలంలో హైబ్రిడ్, ఇతర పని విధానాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తుండగా, మూన్‌లైటింగ్ (2 లేదా అంతకు మించి ఉద్యోగాలు చేయడం) వెలుగులోకి రావడంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని చేపట్టాయి. మరికొన్ని ఉద్యోగుల్ని పూర్తిగా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. హైబ్రిడ్ విధానంలో టెకీలు 2,3 రోజులు ఆఫీసుకు వెళుతూ, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయినప్పటికీ 86 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు, టెకీలు రెగ్యులర్‌గా ఆఫీసుకు వెళ్లడం పైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది. రోజూ ప్రత్యక్షంగా తమ తోటి ఉద్యోగుల్ని కలుసుకోవాలని, వారితో స్నేహ సంబంధాలు కొనసాగించాలని 78% కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ఆఫీసులకు వెళితే మనోబలం, మానసికస్థైర్యం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘సెన్సస్ వైడ్’అధ్యయనం ఆధారంగా ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ రూపొందించిన తాజా నివేదికలో పలుఅంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► వర్క్ ప్లేసెస్‌లో ‘చాయ్ బ్రేక్ బాండింగ్’ (కలిసి టీ తాగే మంచి సమయం) మిస్సవుతున్నామన్న 72 శాతం మంది. ► వర్క్ ఫ్రం హోం విధానానికే పరిమితమైతే ‘కెరీర్ గ్రోత్’(వృత్తి పరమైన ఎదుగుదల) తగ్గిపోతుందనే భావనలో 63% ఉన్నారు. ► ఆఫీసులో గురువారం కల్లా మొత్తం పని పూర్తిచేసుకుని, ఆ రోజునే ‘న్యూ ఫ్రైడే’గా మార్చుకోవాలని, శుక్రవారం ఆఫీసుకు వెళ్లకుండా లాంగ్ వీకెండ్ గడపాలని 79 శాతం మంది కోరుకుంటున్నారు. ► శుక్రవారాల్లో మరింత ఎక్కువ సమయం కుటుంబం, మిత్రులతో గడపాలని 50 శాతం మంది భావిస్తున్నారు. ► రిమోట్ వర్కింగ్ పద్ధతి వల్ల తమ వృత్తులపై ప్రతికూల ప్రభావం పడలేదని 63 శాతం మంది పేర్కొన్నారు. ► కేవలం కొలీగ్స్‌తో సోషల్ ఇంటరాక్షన్ కోసం ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నట్లు 43 శాతం మంది చెప్పారు. ► సహోద్యోగులతో ముఖాముఖి, ఆఫీసు మీటింగ్‌లు మరింత కార్యదక్షతతో పని చేసేందుకు దోహదపడతాయని 42 శాతం మంది చెప్పారు. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► శని, ఆదివారాల బ్రేక్ తర్వాత మొదలయ్యే సోమవారాన్ని ‘మోస్ట్ ఫోకస్డ్ డే’గా 39% మంది పేర్కొన్నారు. నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు వృత్తి నిపుణులు, టెకీల వంటి వారు ఫ్లెక్సిబుల్ పని విధానాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆఫీసులకు రావడానికి అత్యంతప్రాధాన్యతనివ్వడంతో పాటు టీమ్‌వర్క్ ద్వారా తమ నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. చాయ్ బ్రేక్‌లు, కొలీగ్స్‌తో సరదా చర్చలు తమను చైతన్యపరచడంతో పాటు మరింత మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడతాయని భావిస్తున్నారు.– నిరజిత బెనర్జీ, లింక్డ్ఇన్(ఇండియా) మేనేజింగ్ ఎడిటర్ -
ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కు పండగే, భారీ ప్యాకేజీలు..ప్రమోషన్లే.. ప్రమోషన్లు!
ఐఐటీ బొంబాయి విద్యార్ధి జీతం ఏడాదికి రెండు కోట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాడికి వేతనం కోటి.. ఇరవై నిండిన అమ్మాయి సంపాదన ఎనబై లక్షలు ఎక్కడ చూసిన క్యాంపస్ నియమాకాల్లో దుమ్మురేపుతున్న కుర్రకారు వార్తలే.. ఇదంత గతం. కానీ ఇప్పుడు ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లు కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయనే కథనాల్ని చదివే ఉంటాం. నాణేనికి ఒకవైపు ఇలా ఉంటే ..మరోవైపు మాత్రం ఫ్రెషర్లు భారీ ఎత్తున ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం ఇట్టే దక్కించుకుంటున్నారని అంటున్నారు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ విభాగాధిపతి క్రిష్ శంకర్. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫ్రెషర్ల గురించి, వారి జీతభత్యాలు, ప్రమోషన్ల గురించి క్రిష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్‌లో ఏడేళ్ల పాటు సేవలందించిన కృష్ణశంకర్ మంగళవారం (మార్చి 21) పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో కొత్తగా (ఫ్రెషర్స్) ఉద్యోగంలో చేరిన వారి భవిష్యత్ ఎలా ఉంటుంది? ఐటీ కంపెనీల్లో ఏయే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీలు ఎంత ఎక్కువ శాలరీలు చెల్లిస్తున్నాయనే అంశాలపై ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో క్రిష్ శంకర్ మాట్లాడారు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక! ఇటీవల కాలంలో ఉద్యోగుల జీతాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై ‘ గతంలో ఐటీ కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగికి మూడేళ్ల తర్వాతగాని జీతభత్యాలు 50 శాతం పెరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ రంగం వృద్ధి సాధించడంతో ట్రైనీల జీతాలు మూడేళ్లలో 90 శాతం పెరుగుతున్నాయని’ చెప్పారు. తక్కువ జీతం తీసుకునే వారి సంఖ్య తగ్గి అదే విధంగా ఐటీ రంగంలో వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీలు భారీ ఎత్తున శాలరీ ప్యాకేజీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్రెషర్‌గా ఐటీ ఉద్యోగంలో చేరిన డిజిటల్ ఇంజినీర్, పవర్ ప్రోగ్రామర్స్ ఇలా వివిధ రకాలైన రోల్స్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, వారి జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని అన్నారు. రూ.3.5 లక్షల ప్యాకేజీ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పవర్ ప్రోగ్రామర్స్ రూ.6.2లక్షలు, డిజటల్ ఇంజినీర్లు రూ.9 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 4ఏళ్లకే ప్రమోషన్లు జీతాలతో పాటు వేగంగా ప్రమోషన్లు తీసుకుంటున్నారని, కంపెనీలో జేఎల్4 ((job level 4)టెక్నాలజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి నాలుగేళ్లలో పదోన్నతులు లభిస్తున్నాయి. గతంలో ప్రమోషన్లు రావాలంటే కనీసం 7 నుంచి 8 సంవత్సరాలు పట్టేదని కృష్ణశంకర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా? ఫ్రెషర్సే కాకుండా సంస్థలో పనిచేస్తూ ఎక్కువ శాలరీ కోసం వేరే కంపెనీలో చేరేందుకు ఇష్టపడుతున్న వారికి, లేదంటే ఉన్న ఫీల్డ్‌ను వదిలేసి మరో ఫీల్డ్‌లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నవారికి ‘ఇన్ఫోసిస్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నట్లు క్రిష్ శంకర్ వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అర్హులైన ఉద్యోగులు భారీ ప్యాకేజీలు, ప్రమోషన్లు దక్కించుకుంటున్నారని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారికి స్కిల్స్ ఉంటే రెండేళ్లలో పదోన్నతి పొందవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇక ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌లో అర్హులైన ఉద్యోగులకు ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై తర్ఫీదు ఇస్తున్నామని, డిమాండ్ ఆధారంగా ఉద్యోగులకు ఆ టెక్నాలజీలో నైపుణ్యం సంపాదించేందుకు తోడ్పాటునందిస్తున్నట్లు ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ శంకర్ స్పష్టం చేశారు. చదవండి👉 మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం! -
ఐటీ.. వృద్ధి మందగమనం!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగించనుంది. 8.4 శాతానికి పరిమితమై 245 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదు కానుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 15.5 శాతం పెరిగి 226 బిలియన్ డాలర్లకు చేరింది. దశాబ్దకాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారిపరమైన మార్పులతో కంపెనీలు టెక్నాలజీపై మరింతగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడింది. అయితే, తాజాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు భౌగోళికరాజకీయ సవాళ్లు విసురుతుండటం, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుండటం, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలు టెక్నాలజీ పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాస్కామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సీఈవోలు భవిష్యత్‌పై ’జాగరూకతతో కూడిన ఆశావహ’ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ణయాల్లో జాప్యం.. భౌగోళికరాజకీయ ఆందోళనల వల్ల ఐటీ కాంట్రాక్టులు ఇవ్వడంపై కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కొన్ని మార్కెట్లలో డిమాండ్ కూడా తగ్గుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. కొన్ని కంపెనీలకు మాత్రమే పటిష్టమైన ఆర్డర్లు ఉన్నాయని, పరిశ్రమకు ఇదే కాస్త ఊతంగా ఉంటోందని ఆమె వివరించారు. టాప్ 5 కంపెనీల ఆర్డర్ బుక్ 18 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటం, నిర్దిష్ట కంపెనీల క్లయింట్ల సంఖ్య 10 శాతం మేర పెరగడం, సామరŠాధ్యల వినియోగం 6–7 శాతం పెంచుకోగలగడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాల కొరత ఉంటోందని ఘోష్ చెప్పారు. మన విద్యావ్యవస్థలోనే దీనికి మూలం ఉందని, ఫలితంగా సరైన నైపుణ్యాలున్న తాజా గ్రాడ్యుయేట్లు పరిశ్రమకు లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనిచ్చేందుకు కంపెనీలు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఘోష్ వివరించారు. చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్ కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంల ప్రభావం ఉద్యోగాలపై పరిమితంగానే ఉంటుందని, వాస్తవానికి ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆమె చెప్పారు. 54 లక్షలకు ఐటీ సిబ్బంది.. : మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షలకు చేరనుంది. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉండగా, 36 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాలు ఉన్నట్లు నాస్కామ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (4.5 లక్షల వృద్ధి) తక్కువే అయినప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఇది ఎక్కువేనని పేర్కొంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలు అసాధారణమైనవని వివరించింది. ఐటీ కంపెనీలకు ఇటీవల సమస్యగా మారిన అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు జూన్ క్వార్టర్‌తో పోలిస్తే (25.7 శాతం) డిసెంబర్ త్రైమాసికంలో కాస్త నెమ్మదించి 21.8 శాతానికి చేరింది. ఇక భారత ఐటీ ఎగుమతులు 9.4 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లకు చేరగలవని నాస్కామ్ పేర్కొంది. 2030 నాటికి దేశీ ఐటీ రంగం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. -
యూఎస్‌లో జాబ్ చేస్తున్నవారికి ఊరట! టెన్షన్ వద్దు.. ‘లేఆఫ్స్’ తాత్కాలికమే!
అమెరికా టెక్ ఉద్యోగులకు ఈ మూడేళ్లు గడ్డుకాలమే. 2023 అయితే పీడకల లాంటిది. లేఆఫ్స్‌ను ట్రాక్ చేస్తున్న ‘ట్రూఅప్’ వెబ్సైట్ గణాంకాల ప్రకారం.. కేవలం 40 రోజుల వ్యవధిలో (ఫిబ్రవరి 9 వరకు) 1,26,879 మందిని.. 2022లో 2,41,176 మందిని తొలగించారు. అయితే.. తొలగిస్తున్న కంపెనీల్లో అతికొద్ది కంపెనీలు మాత్రమే రిక్రూట్మెంట్ల మీద ‘ఫ్రీజింగ్’ విధించాయి. భారీ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, యూనికార్న్‌ల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 3 నాటికి 1,69,676 జాబ్ ఓపెనింగ్స్ ఉండటం గమనార్హం. లేఆఫ్స్‌లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో కొందరికి మళ్లీ వేగంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అయితే, అంతకుముందు కంపెనీతో పోలిస్తే జీతంలో వ్యత్యాసం, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల్లో చాలామంది ‘హెచ్1బి’ వీసా మీద ఉంటారు. ఉద్యోగంపోతే.. 60 రోజుల్లోగా మరో ఉద్యోగం సంపాదించని పక్షంలో అమెరికాను వదిలి తిరిగి మాతృదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. టెక్ కంపెనీల్లో ఉద్యోగంపోతే ఆందోళన చెందకుండా మరో ఉద్యోగానికి ప్రయత్నించాలని.. చాలా టెక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు సూచిస్తున్నారు. అటు లేఆఫ్స్.. ఇటు ఓపెనింగ్స్.. గత మూడేళ్లలో టాప్–20 లేఆఫ్స్‌లో లక్ష మందిని తొలగించారు. అందులో టాప్–1 లేఆఫ్ గూగుల్‌ది. ఈ సంస్థ 12 వేల మందిని ఒకేసారి తొలగించింది. కానీ, అదే రోజు దాదాపు 1,000 జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించింది. భారీ టెక్ కంపెనీల్లో రెండుమూడు మినహా మిగతా కంపెనీలదీ అదేబాట. భారతీయ టెకీలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అవసరమైతే కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకునే సామర్థ్యం మన టెకీల సొంతం. యూఎస్‌లో భారీగా ఉద్యోగావకాశాలు టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకటిస్తుంటే.. మిగతా రంగాల్లో భారీ సంఖ్యలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. యూఎస్ఏ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 1.10 కోట్ల ఉద్యోగాలు భర్తీకి ఎదురుచూస్తున్నాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఏడుశాతం అధికంగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అమెరికాలో ప్రతి నిరుద్యోగికి 1.9 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని.. జనవరిలో వివిధ రంగాల్లో 5.17 లక్షల ఖాళీలు భర్తీ అయ్యాయని బీఎల్ఎస్ పేర్కొంది. టెక్ కంపెనీల్లో ఓపెనింగ్స్ గతంలో పోలిస్తే తగ్గాయని, పూర్తిగా నిలిచిపోలేదని వెల్లడించింది. మళ్లీ స్టార్టప్ రోజులకు.. మరోవైపు.. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు మిగిలిన సిబ్బందికి పంపిస్తున్న అంతర్గత కమ్యూనికేషన్లలో.. ‘మనం ఇంకాస్త ఎక్కువ కష్టపడి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. స్టార్టప్ రోజుల్లో మాదిరిగా పనిచేస్తే విజయం మన సొంతమవుతుంది’ అని యాజమాన్యాలు ఉద్భోదిస్తున్నాయి. అమెరికా భారీ టెక్ కంపెనీలు ఇలా భావించడం నూతన పోకడే. ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం ఎటు? ఇక ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం మీద ‘వోక్స్ మీడియా’లో టెక్నాలజీ బిజినెస్ వ్యవహారాలు కవర్ చేస్తున్న రాణి మొల్ల ఆసక్తికర కథనం రాశారు. అందులోని అంశాలు ఏమిటంటే.. ► హెచ్1బీ వీసాల మీద ఉన్న భారతీయ టెకీలు సాధారణంగా మరో ఉద్యోగం కోసం వెతుకుతారు. టెక్ కంపెనీల్లో దొరక్కపోతే.. అమెరికా నుంచి మాతృదేశానికి వెళ్లిపోకుండా, ఇతర రంగాల్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారు. ► టెక్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలు, భారీ పెర్క్‌ల మైమరపు నుంచి టెకీలు వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో భారీగా లాభాలు ఆర్జించిన టెక్ కంపెనీలు.. ఇప్పుడు పొదుపు చర్యల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉద్యోగాల తొలగింపువల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది. కానీ, అంతకంటే ఎక్కువ నష్టం కంపెనీలకే ఉంటుంది. ఉద్యోగాల తొలగింపుల్లో ‘టాలెంట్’ను కూడా కంపెనీలు కోల్పోతున్నాయనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇంకొంత కాలానికైనా గుర్తిస్తాయి. ► ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. తమ ప్రతిభతో వ్యాపారాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. ఆ ప్రయత్నాలు ఫలిస్తే, వారికి మంచి రోజులు వచ్చినట్లే. ► అలాగే, ఒకవైపు లేఆఫ్స్ ప్రకటిస్తున్న గూగుల్, ఆపిల్ లాంటి భారీ కంపెనీలు వరుసగా 25 నెలలుగా జాబ్ ఓపెనింగ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయని ‘ది కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్’ (కంప్ టీఐఏ) ప్రకటించింది. ► టెక్ కంపెనీలు తొలగిస్తున్నది కేవలం టెక్ ఉద్యోగాలు మాత్రమే కాదు. హెచ్ఆర్, సేల్స్, ఫైనాన్స్ విభాగాల ఉద్యోగాలూ ఉన్నాయి. వాళ్లకు నాన్–టెక్ కంపెనీల్లోనూ ఉద్యోగాలుంటాయి. గూగుల్ కాలిఫోర్నియా కార్యాలయం నుంచి తొలగించిన ఉద్యోగుల్లో అన్ని విభాగాల వారున్నారు. అందులో 30 మంది మసాజ్ థెరపిస్టులూ ఉన్నారు. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? -
ఐటీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్ఫినిటీ వైజాగ్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతోపాటు పలు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రెండురోజుల ‘ఇన్ఫినిటీ వైజాగ్’ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఐటీ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వైజాగ్‌లో ఉన్న మెరుగైన అవకాశాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ వర్చువల్‌గా ప్రారంభించే ఈ సదస్సులో రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొంటారు. సైయంట్ ఫౌండర్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అఖిలేష్‌కుమార్ శర్మ, ఎస్టీపీఐ డైరెక్టర్ అరవింద్‌కుమార్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, యూనికార్న్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. బాస్, టెక్‌మహీంద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ మొదలైన 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ కోసరాజు శ్రీధర్ తెలిపారు. ఐటీ సంస్థలకు 21 అవార్డులు అందిస్తున్న ఎస్టీపీఐ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న ఐటీ కంపెనీలకు సదస్సు తొలిరోజు ఎస్టీపీఐ అవార్డులు ఇవ్వనుంది. ఐటీ రంగంలో అత్యుత్తుమ ఎగుమతులు నమోదు చేసిన కంపెనీ, అత్యధికమందికి ఉపాధి కల్పించిన కంపెనీ, అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థ, ఐటీ ఎమర్జింగ్ సిటీస్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ వంటి 21 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సరికొత్త ఆవిష్కరణలు నమోదు చేసిన స్టార్టప్‌కు రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు అవార్డు, మెమెంటో ఇవ్వనుంది. ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు.. భవిష్యత్తులో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీని నిలిపేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై రోడ్‌మ్యాప్ రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ 3.0 ఆవిష్కరణలు, డీప్‌టెక్ డొమైన్.. తదితర రంగాల్లో రాష్ట్ర ఐటీ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. దానికనగుణంగా ఈ సదస్సులో కార్యక్రమాలను రూపొందించారు. బిజినెస్ టూ బిజినెస్ (బీటూబీ) నెట్వర్కింగ్ అవకాశాలు సృష్టిసూ మల్టీ నేషనల్ కంపెనీలతో నెట్వర్క్ చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం మొదలైన అంశాలే ముఖ్య అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. తొలిరోజు శుక్రవారం ఐటీ, స్టార్టప్‌లపై దృష్టి సారించనున్నారు. రెండోరోజున ఐటీ ఆధారిత పరిశ్రమలు, బీపీవో కంపెనీలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ ఛాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్ వ్యవహరించనున్నాయి. వివిధ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కలిపి మొత్తం 12 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: 'బంగారు' బాటలో.. చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత -
అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్దిపై తమకు సంపూర్ణ అవగాహన ఉందని, ఐటీ రంగం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతోందనే విషయం వాస్తవం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్డులోని థ్రిల్సిటీలో జరిగిన ఐటీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ప్రణాళికబద్ధంగా చేసిన కృషితో హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ఆవిష్కరణల వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా టీ హబ్, వీ హబ్, ఇన్నోవేషన్ సెల్, ప్రత్యేక శానిటేషన్ హబ్ ఏర్పాటు కాగా, త్వరలోనే దేశంలో అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆవిష్కరణల వ్యవస్థ బలంగా ఉండటంతో ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలలో స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లు హైదరాబాద్ నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్నాయని, త్వరలో మరిన్ని స్టార్టప్‌లు విజయం సాధిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం ఇక్కడే ఐటీ ఉద్యోగాల సంఖ్యలో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించిందని, దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించి అత్యధిక ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలిచిందన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షల మంది యువతకు ఐటీ, లైఫ్‌సైన్సెస్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని పది లక్షల గృహాలకు ఇంటర్నెట్ను అందించే ‘టీ ఫైబర్’ ఈ ఏడాది పూర్తవుతుందని, పౌర సేవల్లో దేశంలోనే తెలంగాణ ‘మీ సేవా’ కేంద్రాలు ఉత్తమంగా ఉన్నాయని తెలిపారు. విస్తరణపై దృష్టి పెట్టండి ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై ఐటీ సంస్థలు ఆలోచించాలని, జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లో ఐటీ కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, ఆదిలా బాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులతో ఐటీ కంపెనీలు కలిసి పనిచేయాలన్నారు. సోషల్ ఇన్ఫ్రాను బలోపేతం చేస్తున్నాం సోషల్ ఇన్ఫ్రాలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉందని, ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు మురుగునీటిని వందశాతం శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 2050 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతుల నిర్మాణంతోపాటు హైదరాబాద్ మెట్రో, ఎయిర్పోర్ట్ మెట్రో తదితర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని చెప్పారు. హైసియా అధ్యక్షుడు మనీషా సాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ సోమవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీ హబ్ ప్రాంగణాన్ని కేటీఆర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రత్యేకతలను కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్ ఆర్థిక పురో గతికి టీహబ్ అద్దం పడుతోందని, భారత్‌లోనే ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీహబ్‌కు గుర్తింపు ఎందుకొచ్చిందో అర్థమైందని జెన్నిఫర్ లార్సెన్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎలిజబెత్ జోన్స్, జెన్నిఫర్ లార్సెన్‌లు రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా లాకిడ్ మార్టిన్‌ను సందర్శించారు. వీరు టాటా లాకిడ్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. టాటాసంస్థల పనితీరును ప్రశంసించినట్లు తెలిసింది. -
దేశంలో 5జీ సేవలు.. భారీగా ఉద్యోగాలు, కావాల్సిన నైపుణ్యాలు ఇవే!
5జీ టెక్నాలజీ..టెలికం రంగంలో సరికొత్త విప్లవం! స్మార్ట్ ఫోన్ యుగంలో.. ఆధునిక 5జీ టెక్నాలజీతో.. గేమింగ్ నుంచి గృహ అవసరాల వరకు..అన్ని రకాల సేవలు అత్యంత వేగంగా పొందే వీలుంది. ఇదే ఇప్పుడు ఆయా రంగాల విస్తరణకు, లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు మార్గం వేస్తుందని అంచనా! ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు కావలసిందల్లా.. ఈ సాంకేతికతను నడిపించే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే! ముఖ్యంగా 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్ వంటి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. ఇటీవల దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న కొత్త కొలువులు, కావల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం.. 5జీ టెక్నాలజీతో మొబైల్ ఆధారిత సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా అత్యంత వేగంగా అనేక సేవలు ΄÷ందొచ్చు. అంతేకాదు.. ట్రాఫిక్ చిక్కులు దాటుకుంటూ ఇంటికెళ్లే సమయానికి హాయిగా ఏసీలో ఆహ్లాదం పొందాలంటే..ఇక చిటికెలో పని. కేవలం ఫోన్ ద్వారా నిర్దేశిత కమాండ్స్‌తో మనం ఇంటికెళ్లే సమయానికి ఏసీ ఆన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సేవలు సరికొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆయా సేవలు అందించేందుకు బ్యాక్ ఎండ్‌లో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఇదే యువతకు కొత్త కొలువులకు మార్గంగా నిలవనుంది. భారీ సంఖ్యలో కొలువులు ► 5జీ టెక్నాలజీ కారణంగా రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నివేదిక పేర్కొంది. ►ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ్ర΄ాసెస్ ఆటోమేషన్ విభాగాల్లో ఈ కొలువులు లభించనున్నాయి. ►ఇప్పటికే 40 లక్షల మేర ఉద్యోగాలకు వేదికగా ఉన్న టెలికం రంగంలో.. 5జీ టెక్నాలజీ కారణంగా జాబ్స్ సంఖ్య మరింత విస్తృతంగా పెరగనుంది. ∙టెలికం సెక్టార్ మాత్రమే కాకుండా.. నూతన టెక్నాలజీలతో సేవలందిస్తున్న ఇతర రంగాల్లోని సంస్థలు కూడా 5జీ టెక్నాలజీస్‌కు సరితూగే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పించనున్నాయి. ► రిమోట్ సర్వీసెస్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా తమ సేవలను అందించే ఉద్దేశంతో 5జీ టెక్నాలజీ నైపుణ్యాలకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ 5జీ వ్యవసాయం నుంచి వైద్యం వరకూ..అన్ని రంగాల్లోనూ 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యకలా΄ాలు నిర్వహించే అవకాశం ఉంది. హెల్త్‌కేర్ రంగంలో.. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ద్వారా టెలి మెడిసిన్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. 5జీ టెక్నాలజీతో రానున్న రోజుల్లో కీలకమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా 3–డీ ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు కూడా తీసే వీలుంటుంది. ∙వ్యవసాయ రంగంలో.. 5జీ ఫోన్లో ఉండే ఐఓటీ సాంకేతికత ఆధారంగా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ.. వాటికి సరితూగే పంటలు వేయడం లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సాగులో దిగుబడి పెంచేందుకు అవకాశం ఉంటుంది. ∙రిటైల్ రంగంలోనూ.. 5జీ ఫోన్లతో.. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీని ఆస్వాదిస్తూ ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూసుకోవడానికి.. అదే విధంగా.. ఆయా ఉత్పత్తుల నాణ్యతను లోతుగా పరిశీలించడానికి వీలవుతుంది. ఐఓటీ ఆధారమే 5జీ టెక్నాలజీని వైద్యం,రిటైల్,ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వినియోగించడానికి కారణం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మహిమే. ఐఓటీ టూల్స్‌గా పేర్కొనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను 5జీ కారణంగా సంస్థలతో΄ాటు వ్యక్తులూ వినియోగించుకునే అవకాశం ఉంది. క్లౌడ్ సర్వీసెస్ వయా 5జీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే.. ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ సర్వీస్‌లను అందించడం! ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్ ఫోన్లలోనూ కనిపిస్తోంది. ఉదాహరణకు.. పలు హైఎండ్ ఫోన్లలో అందుబాటులో ఉంటున్న ఎంఎస్ ఆఫీస్ టూల్స్, పీడీఎఫ్ వ్యూయర్స్, పీడీఎఫ్ డ్రైవ్స్‌ను అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లోనే ΄÷ందే అవకాశం లభిస్తోంది. ఫలితంగా యూజర్లు తాము డౌన్లోడ్ చేసుకున్న విభిన్న వెర్షన్ల డాక్యుమెంట్లను ఎలాంటి ప్రీ–లోడెడ్ సాఫ్ట్వేర్ లేకుండానే వీక్షించే సదు΄ాయం కలుగుతోంది. రోబో ఆధారిత సేవలు ΄ారిశ్రామిక రంగంలో ఇటీవల కాలంలో రోబోటిక్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. రోబో ఆధారిత కార్యకలా΄ాలు, సేవలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సేవలను వ్యక్తుల స్థాయిలోనే ΄÷ందేందుకు 5జీ ఫోన్లు ఉపకరిస్తాయి. ఉదాహరణకు.. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే నిర్దిష్టమైన సెన్సార్లు, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సాంకేతికతల ఆధారంగా ఎక్కడో సుదూరాల్లో ఉన్న రోబోల సాయంతో సర్జరీలు చేసే అవకాశం లభించనుంది. నిపుణుల కొరత 5జీ సేవలు అందించాలనుకుంటున్న సంస్థలు నిపుణులైన మానవ వనరుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు రీ–స్కిల్లింగ్ పేరుతో 5జీ టెక్నాలజీస్‌పై తమ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. టాటా సన్స్‌కు చెందిన పొనటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్.. తేజస్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుని శిక్షణనిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ కూడా తమ ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ విభాగం ద్వారా 5జీ టెక్నాలజీస్‌పై ఉద్యోగులకు శిక్షణ అందిస్తోంది. నైపుణ్యం పొందే మార్గాలివే ► 5జీ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 5జీ టెక్నాలజీలో కీలకంగా నిలుస్తున్న రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు ఆన్లైన్/ఆఫ్‌లైన్ శిక్షణ మార్గాలు ఉన్నాయి. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, సిస్కో, ఒరాకిల్ ఇండియా, ఐబీఎం, డి΄ార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పలు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ► ఐఐటీ–రూర్కీ, ఢిల్లీ కూడా సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ స్థాయిలో 5జీ టెక్నాలజీ అండ్ ఐఓటీ కోర్సులను అందిస్తున్నాయి. ► కోర్స్ఎరా, ఉడెమీ తదితర సంస్థలు సైతం మూక్స్ విధానంలో 5జీ టెక్నాలజీస్, ఐఓటీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. 5జీ టెక్నాలజీస్.. ముఖ్యాంశాలు ►పలు రిక్రూటింగ్, స్టాఫింగ్ సంస్థల నివేదికల ప్రకారం–ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 5జీ కొలువుల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెరుగుదల. ► అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం–వచ్చే పదేళ్లలో 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలు. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా ప్రకారం–2025 నాటికి 2.2 మిలియన్ల జాబ్స్. ► టెలికం రంగంలోనే ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు. ► 2021లో సిస్కో ఇండియా నియామకాల్లో 30 శాతంపైగా 5జీ టెక్నాలజీ విభాగంలోనే ఉన్నాయి. -
మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ముంబై: మూన్‌లైటింగ్ (రెండో చోట్ల ఉద్యోగాలు చేయడం)పై వివాదం నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇది అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నారు. వాల్యువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో దాదాపు 81 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం మూన్‌లైటింగ్‌కు ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. సర్వేలో పాల్గొన్న ప్రతి అయిదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే (19 శాతం) మూన్‌లైటింగ్ వైపు మొగ్గు చూపగా మిగతా వారు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 1,281 సంస్థలు, 1,533 మంది ఉద్యోగార్థులు .. ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం మూన్‌లైటింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది (37 శాతం) .. అకస్మాత్తుగా ప్రధాన ఉద్యోగం పోయినా ఆదాయం దెబ్బతినకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. మరికొందరు (27 శాతం) కొంత అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కంపెనీల అభిప్రాయం మాత్రం మరో రకంగా ఉంది. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లుగా నివేదిక పేర్కొంది. క్వైట్ క్విటింగ్ సమస్య.. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ (క్రమంగా నిష్క్రమించడం) సమస్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగాన్ని అట్టే పెట్టుకునేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్‌గా ఉండటం వంటి కారణాలు ఎక్కువగా ఉంటున్నట్లు 33 శాతం కంపెనీలు తెలిపాయి. 21 శాతం కంపెనీలు.. ఉద్యోగం పట్ల నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని అభిప్రాయపడ్డాయి. ఉద్యోగుల కోణంలో చూస్తే 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్కు కారణమని తెలిపారు. మేనేజర్లు, బాస్‌ల నుండి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే...ప్రేమలో పడ్డా!: లవ్ స్టోరి వైరల్
బెంగుళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పక్క ట్రాఫ్రిక్ సమస్య తోపాటు, గుంతలమయమైన రహదారులతో నిత్యం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐతే ఇక్కడొక వ్యక్తి ఆ టాఫ్రిక్ సమస్య కారణంగానే తాను ప్రేమలో పడ్డానని, పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే...బెంగళూరులోని ఒక వ్యక్తి ఎజిపురా ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల వారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. అప్పుడే అతను తన భార్యని సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద చూసినట్లు చెబుతున్నాడు. ఆ రోజు విపరితమైన ట్రాఫిక్ కారణంగా... షార్ట్‌కట్‌లో వెళ్లే మరో మార్గాన్ని ఎంచుకోవాలసి వచ్చింది. ఆ రహదారి గుంతమయం కావడం, మరోవైపు బాగా ఆకలి దంచేయడంతో ఆ రోజు తాము ఒక రెస్టారెంట్‌కి వెళ్లాం. అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాము మూడేళ్లు డేటింగ్లో ఉన్నామని. తదనంతర పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తమ పెళ్లై రెండేళ్లవుతుందని చెబుతున్నాడు. ఐతే తాము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి దాదాపు ఐదేళ్లు అయినా... ఆ ఫ్లైఓవర్ మాత్రం నిర్మాణంలోనే ఉంది. ట్రాఫ్రిక్ సమస్య కూడా తీరలేదని వాపోయాడు. ఇలా అతను వినూత్నంగా తన ట్రాఫిక్ కష్టాలు కారణంగా తాను ఒక ఇంటివాడిని అయ్యానంటూనే...రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలను వివరించాడు. ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అతని ప్రేమ కథను విని....ట్రాఫిక్ కొందరికి చేదు అనుభవాలు ఇస్తే, అతనికి మాత్ర మాత్రం మంచి అనుభవాన్ని ఇచ్చిందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Top drawer stuff on Reddit today 😂😂@peakbengaluru pic.twitter.com/25H0wr526h — Aj (@babablahblah_) September 18, 2022 (చదవండి: సీఎం ముఖచిత్రంతో 'పేసీఎం'.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం) -
హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్ డేటా సెంటర్లు బూస్టప్ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్క్ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్ సిటీలో టీఎస్ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్ లైన్ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నలుచెరుగులా విస్తరణకు చర్యలు.. నగరం నలుచెరుగులా ఐటీ వృద్ధికి ఐటీ శాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్ విస్తీర్ణాన్ని 6 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచింది. త్వరలో ఈ పార్క్ నిర్మాణం మొదలు కానుంది. కాగా ఈ పార్క్‌కు సమీపంలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. నగరంలో నలు చెరుగులా టెకీలు ఐటీ ఉ ద్యోగాలు చేసేలా నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టడం విశేషం. టాప్ కంపెనీలకు చిరునామా.. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 7.78 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.(క్లిక్: కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?) ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ బూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఏటా రూ. 1.83 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటతాయని ఐటీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. (క్లిక్: హైదరాబాద్ పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..) -
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్‌లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్‌లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా. రెడ్‌లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా చీనా కపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్. -
ఐటీలో ‘అనంత’ వెలుగులు: తొలి ఐటీ పరిశ్రమ
అనంతపురం సెంట్రల్: జిల్లాలో తొలి ఐటీ పరిశ్రమ త్వరలోనే ఏర్పాటవుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం దాదులూరు సమీపంలో హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్లు నెలకొల్పేందుకు కార్బన్ సంస్థ చైర్మన్ సుర్ అసిజా, గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురం శివారులోని హార్మొనీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన శంఖారావ సదస్సు వేదికగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. హార్మొనీ సిటీని 120 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మరో ఐదు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఇది వరకే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్ పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా చూస్తామన్నారు. ఐటీ టవర్ల నిర్మాణం పూర్తయ్యాక దాదాపు ఐదు వేల మంది వరకు ఐటీ రంగ నిపుణులకు, పరోక్షంగా మరో ఐదు వేల మంది వరకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం హోటల్ కాంప్లెక్స్, మూవీ కాంపెక్స్‌లు, సూపర్ మార్కెట్ కాంప్లెక్స్, హెల్త్ క్లబ్‌లతో పాటు అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కంపెనీ ఎండీ రవికుమార్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో తమను భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. -
ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీలు, సర్వీసులే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధికి దోహదపడనున్నట్లు దిగ్గజ సంస్థ విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. డేటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ వంటి విభాగాలు భారీ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ నుంచి అయినా పనిచేయడం, క్రౌడ్‌సోర్సింగ్ తదితర విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్‌సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. వృద్ధి సాధన దిశగా తమ సంస్థ అయిదు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. కీలక రంగాలపై మరింతగా దృష్టి పెట్టడం, క్లయింట్లతో భాగస్వామ్యాన్ని పటిష్టపర్చుకోవడం, ప్రతిభావంతులైన సిబ్బందిపై ఇన్వెస్ట్ చేయడం, వ్యాపార నిర్వహణ విధానాన్ని సరళతరం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు డెలాపోర్ట్ తెలిపారు. వ్యాపార వ్యూహాల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఇతర సంస్థలను కొనుగోలు చేసినట్లు వివరించారు. క్యాప్కో సంస్థ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ఆయన పేర్కొన్నారు.దీనికోసం విప్రో సుమారు 1.45 బిలియన్ డాలర్లు వెచ్చించింది. చదవండి: Gold: డిజిటల్ గోల్డ్‌తో.. లాభాల పంట -
జాతీయ సగటు కంటే తెలంగాణ ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఈ విషయంలో గతంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని వెళ్లాలని కోరారు. ఇప్పటిదాకా ఉద్దీపన ప్యాకేజీని ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదని, రాష్ట్రాల్లో విపక్ష, స్వపక్ష ప్రభుత్వాలు అనే తేడా లేకుండా మేకిన్ ఇండియా నినాదాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక 2020–21ను మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. జాతీయ సగటు కంటే తెలంగాణ ఉత్తమం ►ఏడేళ్లలో 20కిపైగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి రప్పించాం. ►ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏడాది కాలంలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం. ►గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 810 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 10 పారిశ్రామిక పార్కుల్లో రూ. 6,023 కోట్ల పెట్టుబడులతో 453 పరిశ్రమలు, 7,623 ఉద్యోగాలు వచ్చాయి. సాక్షి, హైదరాబాద్: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) మెరుగ్గా ఉందని, 2020–21లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.78 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా 1.26 శాతం జీడీపీ తగ్గినా జీడీపీతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా ఏకంగా 20.9 శాతం పెరగ్గా జాతీయ స్థాయిలో కేవలం 3 శాతమే పెరిగిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగం జీఎస్డీపీకి ఈ స్థాయిలో వాటా అందించడం ఇదే తొలిసారన్నారు. ఇక జీడీపీలో తెలంగాణ ఆర్థిక రంగం 26 బేసిస్ పాయింట్లు పెరిగి 2020–21లో 5 శాతానికి చేరిందని చెప్పారు. 2019–20లో ఇది కేవలం 4.74 శాతంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. అలాగే తలసరి వార్షిక ఆదాయంలో జాతీయ సగటు రూ. 1,27,768 కాగా తెలంగాణలో రూ. 2,27,145గా ఉందన్నారు. 2020–21 గ్రాస్ స్టేట్ వ్యాల్యూ అడిషన్ (జీఎస్వీఏ)లో రంగాలవారీగా వ్యవసాయ రంగం 20.6 శాతం, పారిశ్రామిక రంగం 19.1 శాతం, సేవా రంగం 60.3 శాతం చొప్పున వాటా ఉందన్నారు. ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ సొబగులు... ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకు తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ టవర్లను ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది నల్లగొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ‘టీ–హబ్’రెండో దశ, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సౌకర్యం ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాదే ప్రారంభిస్తామని, ఎలక్టానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సాగునీటి రంగంతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ రంగం కూడా ఎంతో పురోగతి సాధించిందని, గతంలో 30 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.06 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. హైదరాబాద్ మినహా మిగతా పాత 9 జిల్లాల పరిధిలో 250 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సీఎం ఆదేశాల మేరకు ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు’ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... – ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల ఎగుమతుల్లో 2020–21లో 12.98 శాతం వృద్ధి రేటుతో ఐటీ ఎగుమతులు రూ. 1,45,522 కోట్లకు చేరగా ఉద్యోగుల సంఖ్యలో 7.99 శాతం వృద్ధి రేటుతో కొత్తగా 46,489 ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,489కి చేరగా, పరోక్షంగా హోటల్, టూరిజం, ఇతర సర్వీసు రంగాల్లో సుమారు 20లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. – ఎస్టీపీఐ, ఎస్ఈజడ్, నాస్కామ్ వంటి సంస్థల లెక్కల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ. 2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో 15.6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక రంగంలో కొత్తగా వస్తున్న పెట్టుబడుల్లో 80 శాతం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీల కార్యకలాపాల విస్తరణ వల్లే వచ్చాయి. – ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ జాబితాలో మొదటి స్థానం, ఈఓడీబీలో 3వ స్థానం, నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో 4వ స్థానంలో నిలవడంతోపాటు ఐటీపీవో త్రీ స్మార్ట్ సిటీస్ అవార్డును హైదరాబాద్ గెలుచుకుంది. అమెజాన్ డేటా సర్వీసెస్, ఎన్పీసీఐ, వీఎస్ఈజెడ్, గోల్డ్‌మన్ సాష్ వంటి కంపెనీలు ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే దిక్సూచిగా పనిచేస్తు్తన్నాం. కరోనా మహమ్మారి సంక్షోభంలో జీనోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తోంది. జీనోమ్ వ్యాలీతోపాటు, పాలిస్టర్ ఫిల్మ్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. టీ–హబ్, టీఎస్ఐసీ, రిచ్, వి–హబ్ క్షేత్రస్థాయిలో ఇన్నోవేటర్లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు ఊతమివ్వడంలో అనూహ్యంగా పురోగతి సాధిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డ్రోన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి సరికొత్త టెక్నాలజీలో తెలంగాణ ముందంజలో ఉంది. -
ఐటీ మెరుపులు..!
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై - సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ..... ‘క్యూ3’ సీజన్ వస్తోంది... ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. ఈ సీజన్లో సెలవులు అధికంగా ఉంటాయి. అవుట్‌సోర్సింగ్‌పై కంపెనీలు స్వల్పంగానే ఖర్చు చేస్తాయి. ఫలితంగా ఐటీ కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి డిమాండ్‌ను పెంచుకోవడానికి వివిధ రంగాల కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాయి. ఇది ఐటీ కంపెనీలకు కలసివచ్చింది. గత ఏడాది చివరి ఆర్నెళ్లలో వివిధ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగానే వ్యయం చేశాయి. ఐటీకి సంబంధించిన భారీ డీల్స్ బాగా పెరగడం, ఎన్నడూ లేనంత స్థాయిల్లో కంపెనీల ఆర్డర్ల బుక్‌లు కళకళలాడుతుండటం, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతుండటం, కరోనా కారణంగా కుదేలైన రిటైల్, రవాణా తదితర రంగాలు కోలుకుంటుండటం, అధిక శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తుండటంతో వ్యయాలు తగ్గడం, పర్యాటక, మార్కెటింగ్ సంబంధిత వ్యయాలు కూడా తగ్గడం... ఈ కారణాలన్నింటి వల్ల ఈసారి క్యూ3 ఫలితాలు దుమ్ము రేపనున్నాయి. వేతన పెంపు తప్ప మరే ఇతర ఒత్తిడులు మార్జిన్లపై ప్రభావం చూపవని నిపుణులు భావిస్తున్నారు. గైడెన్స్ (భవిష్యత్తు అంచనాలు) కూడా బాగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు ఆశిస్తున్నాయి. మధ్య స్థాయి కంపెనీలదీ అదే దారి...: దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఇన్పోటెక్‌లు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలున్నాయి. ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే విషయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్‌కు సంబంధించిన వివరాలు, కంపెనీలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై పురోగతి, ఇటీవల టేకోవర్ చేసిన సంస్థల ప్రభావం, వీటికి సంబంధించి యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. భారీ డీల్స్...: ఈ క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దైమ్లర్ కంపెనీతో కుదుర్చుకుంది. ఇక టీసీఎస్ కంపెనీ డాషే బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఇక విప్రో కంపెనీ జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఈఆన్, మారెల్లీ తదితర దిగ్గజాల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎనలిస్టుల అంచనాలు ఈ నెల 8న టీసీఎస్ ఫలితాలు: టీసీఎస్ ఈ నెల 8న క్యూ3 ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ నెల 13న ఇన్ఫోసిస్, విప్రోలు ఫలితాలను ప్రకటించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ఈ నెల 15న వస్తాయి. ఇటీవలి ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ఫలితాలపై భారీ అంచనాలతో చాలా ఐటీ షేర్లు మంగళవారం ఆల్‌టైమ్ హైలను తాకాయి.టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీల ఆదాయాలు సీక్వెన్షియల్‌గా 2-3శాతం మేర పెరగగలవనేది విశ్లేషకుల అంచనా. 2021-22 ఆదాయ అంచనాలను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. టీసీఎస్: ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా 2-3 శాతం ఉండొచ్చు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు పెంచినందున నిర్వహణ లాభం ఒకింత తగ్గవచ్చు. నికర లాభం కూడా 1-1.2 శాతం మేర తగ్గవచ్చు. ఇన్ఫోసిస్: ఆదాయం 3 శాతం మేర పెరుగుతుంది. నిర్వహణ లాభం ఫ్లాట్‌గా ఉండొచ్చు. లేదా ఒకింత తగ్గవచ్చు. అయితే నికర లాభం 15శాతం పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వల్ల పొదుపు చర్యలు పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, రూపాయి క్షీణత... ప్రధాన కారణాలు. విప్రో: ఈ కంపెనీ నిర్వహణ లాభం నిలకడగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఆదాయం (సీక్వెన్షియల్‌గా)2-3 శాతం రేంజ్లో పెరగవచ్చు. ' -
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్న ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 30 శాతానికి పైగా ఐటీ నిపుణులు తూర్పు హైదరాబాద్‌లో నివాసముంటూ పశ్చిమ హైదరాబాద్‌కు వెళుతున్నారు. దీనివల్ల వారి ప్రయాణానికి అధిక సమయం పడుతుండటంతోపాటు నగరం ఇరుకుగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వివిధ పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఐటీ పార్కులివే.. కూకట్పల్లి, గాంధీనగర్, బాలపూర్, మల్లాపూర్, మౌలాలి, సతన్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, నాచారం, పటాన్చెరు (పాక్షికంగా), కాటేదాన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, ఏఐఈ రామచంద్రాపురం కలిపి మొత్తం 11 పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అదనంగా కొంపల్లిలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్కును నిర్మించనుంది. తొలి విడతగా ఉప్పల్, పోచారం, నాచారం, కొంపల్లి, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్, కాటేదాన్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తారు. కొత్త ఐటీ విధానంలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలు ఉన్న పశ్చిమ ప్రాంతాలకు మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వనుంది. రాయితీ, ప్రోత్సాహకాలు ఇవీ.. – కమర్షియల్ కేటగిరీ నుంచి పారిశ్రామిక కేటగిరీకి విద్యుత్ కనెక్షన్‌ను మార్పిడి చేస్తారు. – ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.5 లక్షలకు మించకుండా పారిశ్రామిక విద్యుత్ టారిఫ్‌లో యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు రాయితీ. – ఏడాదికి రూ.10లక్షకు మించకుండా ఐదేళ్ల పాటు 30శాతం వరకు లీజు అద్దెలో సబ్సిడీ – టీఎస్ఐఐసీ/ఐలాకు సంబంధించిన పారిశ్రామిక భూముల్లో కనీసం 50 శాతం నిర్మిత ప్రాంతాన్ని ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు వినియోగిస్తే, సదరు డెవలపర్‌కు రాయితీ, ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. మొత్తం భూమికి సంబంధించిన కనీస రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతాన్ని కన్వర్షన్ ఫీజుగా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆథారిటీకి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి నాలా చార్జీలు వర్తించవు. పశ్చిమ ప్రాంత వెలుపల సంస్థలకూ రాయితీలు.. పశ్చిమ ప్రాంతం వెలుపల ఇప్పటికే ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు/డెవలపర్లకు సైతం ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహాకాలు ప్రకటించింది. అయితే, ఇప్పుడున్న స్పేస్‌కు అదనంగా స్పేస్ తీసుకుంటేనే ఐటీ యూనిట్లకు లీజు అద్దె, విద్యుత్ టారిఫ్ రాయితీలు వర్తిస్తాయి. కొత్తగా తీసుకునే అదనపు స్పేస్, ఇప్పటికే ఉన్న స్పేస్ మధ్య ఉండే నిష్పత్తి మేర లీజు/విద్యుత్ చార్జీల్లో రాయితీ, ప్రోత్సాహకాలు ఇస్తారు. -
భారత్‌లో పెరిగిన ఐటీ అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాల్లోని పరిశ్రమలన్నీ ఏదో మేరకు నష్టపోగా, ఐటీ పరిశ్రమ మాత్రం నిలదొక్కుకొని నిలబడడం ‘గుడ్డిలో మెల్ల మేలు’ చందంగా ఉందనడంలో సందేహం లేదు. ఐటీ పరిశ్రమ యథావిధిగా కొనసాగుతూ ఐటీ సర్వీసులకు డిమాండ్ కూడా పెరగుతుండడంతో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరగతూ వస్తున్నాయి. సెప్టెంబర్ నెల నాటికి హార్డ్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు 63 శాతం పెరగ్గా, సాఫ్ట్వేర్ రంగంలో 20 శాతం పెరిగాయని ‘నౌకరీ డాట్ కామ్’ తాజాగా విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది. (వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!) వాస్తవానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కరోనా మహమ్మారికి ముందున్నంతగా లేవు. తక్కువగా ఉన్నాయి. అయితే హార్డ్‌వేర్ రంగంలో ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగావకాశాలు లేదా నియామకాలు కేవలం మూడు శాతంతో గత 15 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ స్థాయిలో ఉంది. ఐటీ పరిశ్రమ అంతగా దెబ్బ తినకపోయినప్పటికీ దేశంలో ఇతర పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్న కారణంగా దేశంలో నిరుద్యోగుల శాతం సెప్టెంబర్ నెలలో 6.67 శాతం ఉండగా, అక్టోబర్ నెల నాటికి 6.98 శాతానికి చేరుకుంది. ఐటీ రంగంలో ఐబీఎం, కోగ్నిజెంట్, అక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెల్, టెక్‌మహీంద్ర, మైండ్ ట్రీ, గ్జిరాక్స్, అడోబ్ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పెరగతున్నాయి. భారత సిలీకాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలోనే కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాలు ఉన్నాయి.