అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలని, జన్మభూమికి ఎంతో కొంత చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా సమాజానికీ తోడ్పాటివ్వాలని, అవకాశం ఇచ్చిన ఆతిథ్య దేశాన్ని మరవకూడదన్నారు.