తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్ రాకెట్ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ సతీష్ వేమన.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.