ఐటీ ఇండస్ట్రిలోనే భారీగా పతనం
ఐటీ ఇండస్ట్రిలోనే భారీగా పతనం
Published Mon, May 22 2017 5:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రిలో ఇటీవల నెలకొన్న ఉద్యోగులపై ఉద్వాసన వేటు తెలిసిందే. ఇటు ఉద్యోగుల కోత మాత్రమే కాక, అటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల నియామకం కూడా భారీగా పతనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐటీ ఇండస్ట్రిలో ఉద్యోగుల నియామకం 24 శాతం పడిపోయినట్టు నౌకరి.కామ్ తాజా సర్వేలో తెలిసింది. మొత్తంగా కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం పడిపోగా.. దానిలో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలోనే క్షీణించినట్టు తాజా సర్వే పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాదిలో 24 శాతం పడిపోయినట్టు నౌకరి జాబ్ సీక్ ఇండెక్స్ నివేదించింది.
మేజర్ మెట్రోలు ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలోనే ఏడాది ఏడాదికి ఉద్యోగుల కల్పన తగ్గిపోయినట్టు ఈ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం, బీపీఓ, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతుందని తెలిపింది. కీలక పరిశ్రమలు నిర్మాణం, బీపీఓలలో 10 శాతం, 12 శాతం ఉద్యోగుల నియామకం పడిపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లో 11 శాతం తగ్గిపోయింది. జాబ్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతుందని, ఏప్రిల్ నెలలో ఈ నెగిటివ్ వృద్ధి 11 శాతం నమోదైనట్టు పేర్కొంది. మరి కొన్ని నెలల పాటు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగనుందని ఈ ఇండెక్స్ తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఆరు మెట్రోల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఈ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది.
Advertisement
Advertisement