ఇటీవల పెరుగుతున్న లేఆఫ్‌లు, మందగించిన నియామక పరిస్థితులతో ఐటీ రంగం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్, నాన్-టెక్ రంగాలలో అనుభవం ఉన్న ఓ టెక్ నిపుణుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్ఢిట్’లో ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందంటూ చర్చను ప్రారంభించారు.
"డెవలపర్ /ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆ ఎక్స్‌పర్ట్ త్వరలో ఐటీ పరిశ్రమలో వేతనాలు ఇతర రంగాల్లో జీతాలకు దగ్గరగా కావచ్చని అంటే తగ్గిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఈ ప్రకటన భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్ మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్తు స్థితికి సంబంధించి చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!
టెక్, నాన్-టెక్ ఉద్యోగుల మధ్య ఉన్న జీతం అంతరాన్ని ఆయన విపులంగా వివరించారు. నాన్-టెక్ ఉద్యోగాలలో నైపుణ్యం కలిగినవారు సగటున ఏడాదికి 10-15 లక్షలు సంపాదిస్తున్నారని, ఇక టెక్ డెవలపర్లు, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారు కూడా 30-40 లక్షలు వార్షిక వేతనం అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం బుడగ లాంటిదని, ఎన్నో రోజులు ఉండదని రాసుకొచ్చిన ఆయన ఈ భారీ జీతాలు త్వరలో సర్దుబాటు కావచ్చని అభిప్రాయపడ్డారు.
ఇక అనేక మంది డెవలపర్‌లు చాట్ జీపీటీ వంటి సాధనాలను ఉపయోగిస్తున్నందున డెవలపర్‌ల డిమాండ్ మరింత తగ్గుతుందని సూచించారు. దీని ఫలితంగా వారి పనిభారం 50% తగ్గింది. ఇదే సమయంలో జాబ్ మార్కెట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. "జనరేటివ్ ఏఐ ఉద్యోగాలను తీసివేయదని కొందరు వాదించవచ్చు, కానీ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మా కంపెనీలో ప్రస్తుతం జూనియర్ పాత్రలకు మాత్రమే ఓపెనింగ్‌లు ఉన్నాయి. సీనియర్ స్థానాలకు కాదు" అంటూ జోడించారు.
Posts from the developersindia
community on Reddit
Comments
Please login to add a commentAdd a comment