-
సమస్యను సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగి: నెట్టింట్లో వైరల్
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్‌ను ఎవరూ ఆపలేరని హెచ్ఆర్కు చెప్పండి. పీఎఫ్ పాస్‌బుక్‌లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..
ఒక ఉద్యోగంలో చేరితే.. అప్పటికే ఉన్న ఉద్యోగంలో లభించే జీతం కంటే ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు ఆ జాబ్‌కు రాజీమానా చేస్తారు, లేదా ఆరోగ్య సమస్యల కారణంగా జాబ్‌కు రాజీమానా చేస్తారు. కానీ ఇటీవల ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేసి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.రెడిట్‌లో వెల్లడైన ఒక పోస్ట్ ప్రకారం, అసోసియేట్ ప్రొడక్ట్ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. తన మేనేజర్ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను సైతం రెడిట్‌లో షేర్ చేశారు. తన డ్యూటీ ముగిసిన తరువాత కూడా పనిచేయాలని మేనేజర్ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే ఓవర్ టైం పనికి డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదని మేనేజర్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.అదనపు వేతనం లేకుండానే రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయాలని మేనేజర్ చెప్పడంతో ఉద్యోగి తీవ్ర నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగత జీవితానికి విలువ ఇవ్వాలని తాను చెప్పాలనున్నప్పటికీ.. తన మాటలను మేనేజర్ లెక్క చేయలేకపోవడం మాత్రమే కాకుండా.. తనను కించపరిచే విధంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్ఉద్యోగి పంపిన రాజీనామా లేఖకు, మేనేజర్ ప్రత్యుత్తరం పంపిస్తూ.. తాను ఒకటి చెప్పదలచుకుంటే, మరొక రకంగా అర్థమైనదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగం విషయంలో ఇద్దరి అంచనాలు వేరు వేరుగా ఉన్నతలు వెల్లడించారు.ప్రస్తుతం ఉద్యోగి చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆఫీసులో పని వాతావరణం నచ్చకుంటే రాజీనామా చేయడం చాలా ఉత్తమం అని కొందరు చెబుతుంటే.. మరికొందరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావని అంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా.. వారు కామెంట్స్ చేస్తున్నారు. -
ఐటీ ఉద్యోగులకు ‘భారీ జీతాలు’ కొన్నిరోజులే..!
ఇటీవల పెరుగుతున్న లేఆఫ్‌లు, మందగించిన నియామక పరిస్థితులతో ఐటీ రంగం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్, నాన్-టెక్ రంగాలలో అనుభవం ఉన్న ఓ టెక్ నిపుణుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్ఢిట్’లో ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందంటూ చర్చను ప్రారంభించారు."డెవలపర్ /ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆ ఎక్స్పర్ట్ త్వరలో ఐటీ పరిశ్రమలో వేతనాలు ఇతర రంగాల్లో జీతాలకు దగ్గరగా కావచ్చని అంటే తగ్గిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఈ ప్రకటన భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్ మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్తు స్థితికి సంబంధించి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!టెక్, నాన్-టెక్ ఉద్యోగుల మధ్య ఉన్న జీతం అంతరాన్ని ఆయన విపులంగా వివరించారు. నాన్-టెక్ ఉద్యోగాలలో నైపుణ్యం కలిగినవారు సగటున ఏడాదికి 10-15 లక్షలు సంపాదిస్తున్నారని, ఇక టెక్ డెవలపర్లు, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారు కూడా 30-40 లక్షలు వార్షిక వేతనం అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం బుడగ లాంటిదని, ఎన్నో రోజులు ఉండదని రాసుకొచ్చిన ఆయన ఈ భారీ జీతాలు త్వరలో సర్దుబాటు కావచ్చని అభిప్రాయపడ్డారు.ఇక అనేక మంది డెవలపర్లు చాట్ జీపీటీ వంటి సాధనాలను ఉపయోగిస్తున్నందున డెవలపర్ల డిమాండ్ మరింత తగ్గుతుందని సూచించారు. దీని ఫలితంగా వారి పనిభారం 50% తగ్గింది. ఇదే సమయంలో జాబ్ మార్కెట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. "జనరేటివ్ ఏఐ ఉద్యోగాలను తీసివేయదని కొందరు వాదించవచ్చు, కానీ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మా కంపెనీలో ప్రస్తుతం జూనియర్ పాత్రలకు మాత్రమే ఓపెనింగ్లు ఉన్నాయి. సీనియర్ స్థానాలకు కాదు" అంటూ జోడించారు.Posts from the developersindiacommunity on Reddit -
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. -
రూ.1,600 కోట్లు వేతనం.. సమర్థించుకున్న సీఈవో
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. దాంతో రెడ్డిట్ సీఈవో స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేతన ప్యాకేజ్‌ను హఫ్‌మన్ అందుకోవడంపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్లో స్పందించారు. తన సామర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇల్లు చూసేందుకు రూ. 2,500.. ఇదెక్కడి అరాచకం!
ఎక్కడైనా మీకు ఇల్లు అద్దెకు కావాలంటే ఏం చేస్తారు.. మొదట ఇల్లు చూసి అంతా నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరుతారు. కానీ అక్కడ మాత్రం మొదట ఇల్లు చూసేందుకే రూ.2,500 కట్టాలట. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారం గురించి విన్న నెటిజన్లు ఇదెక్కడి అరాచకంరా నాయనా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అత్యంత జనాభా ఉండే మెట్రో నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఈ నగరంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి అసాధారణమైన పరిస్థితి ఎదురైంది. ఇంటి వేటలో భాగంగా ఒక బ్రోకర్‌ను సంప్రదించగా 'సొసైటీ విజిటింగ్ కార్డ్' పేరుతో అద్దె ఇంటిని చూసేందుకు రూ. 2,500 కట్టాల్సి ఉంటుందని సూచించాడు. సదరు వ్యక్తి తనకు ఎదురైన ఈ పరిస్థితి గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో షేర్ చేశారు. ఇది చట్టబద్ధమైనదేనా లేదా స్కామా అని యూజర్లతో అనుమానం వ్యక్తం చేశారు. బ్రోకర్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా జత చేశారు. దీంట్లో బ్రోకర్ చెప్పినదాని ప్రకారం.. “ఇల్లు చూసేందుకు విజిటింగ్ ఫీజు రూ. 2500. మీకు ఫ్లాట్ నచ్చితే, అద్దె మొత్తంలో రూ. 2500 మినహాయిస్తారు. ఒకవేళ ఫ్లాట్ నచ్చకపోతే రూ. 2500 తిరిగిస్తారు.” జనవరి 13న చేసిన ఈ పోస్టుకు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు దీన్ని స్కామ్‌గా అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వంటి నగరాల్లో కనింపించే స్కామ్ ఇప్పుడు ఢిల్లీలోనూ జరగుతోందంటూ ఓ యూజర్ బదులిచ్చారు. ఇల్లు చూసేందుకు విజిటింగ్ కార్డ్ ఎందుకు.. అదేమైనా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇల్లా అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు. -
‘శాడిస్ట్ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
‘బాస్ తిక్క కుదుర్చిన ఉద్యోగి’.. ఇంతకీ ఏం చేసినట్లు!
చలిలో చమటలపడుతున్నాయ్. డాక్టర్‌కి చూపించుకుంటాను. ఒక్కరోజు లీవ్ కావాలి అంటూ ఉద్యోగి అడిగిన పాపానికి.. సదరు యజమాని అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దంటూ మొహం మీదే చెప్పాడు. ఆపై సంస్థకు రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగికి.. ఆయన టీంలో పనిచేసే ఉద్యోగికి మధ్య వాట్సప్ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి వాతావారణం ఎంత చల్లగా ఉన్న చెమటలు పడుతుంటాయి. ట్రీట్మెంట్ కోసం డాక్టర్‌కి దగ్గరికి వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. చేసేది లేక మూడేళ్లు కాలం వెళ్ల దీశాడు. చివిరికి అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇందుకోసం ఆఫీస్ బాస్‌కి మెసేజ్ చేశాడు సదరు ఉద్యోగి. అనారోగ్యంగా ఉంది. వీపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మీరు ఒక్క రోజు లీవ్ ఇస్తే డాక్టర్‌కి చూయించుకుంటాను. డాక్టర్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు ఆఫీస్ బరిస్తుందా? అంటూ బాస్‌ను అడిగాడు. అందుకు ఆ బాస్.. మీరు అనారోగ్యంగా ఉన్నారని డాక్టర్ రాసిన లెటర్ ఇవ్వండి అని రిప్లయి ఇచ్చాడు. అందుకు ఉద్యోగి సార్ నాకున్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల 3ఏళ్లగా డాక్టర్ దగ్గరికి వెళ్లలేకపోయాను. కానీ నిన్ననే కొంతమొత్తాన్ని చెల్లించి నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నాను అని రాశాడు. ఉద్యోగి చేసిన వాట్సప్ మెసేజ్ దెబ్బకు బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్నాచితకా వాటికే లీవ్ పెడితే ఎలా? లీవ్ పెట్టుకో కాని నాకు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కావాలని అడిగాడు. దీంతో బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక, ఈ సంభాషణపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఉద్యోగికి అనారోగ్యం బాగలేనప్పుడు బాస్ తీసుకునే నిర్ణయాలు అసంతృప్తిగా ఉంటున్నాయి. మొత్తానికి ఉద్యోగి రాజీనామా చేసి బాస్ తిక్కకుదిర్చాడంటూ నెటిజన్లు రిప్లయి ఇస్తున్నాయి. -
ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!
ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం, సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కామన్. మన ప్రొఫైల్ నచ్చకపోయినా, వారి రిక్వైర్‌మెంట్‌కు తగినట్టుగా లేకపోయినా జాబ్ రాదు. అయితే చాలావరకు ఐటీ కంపెనీలు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు సారీ అనే మెయిల్స్ కూడా చూశాం. తాజాగా సిలికాన్ వ్యాలీకంపెనీ చేసిన పని ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన కథనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సిలికాన్ వ్యాలీ-ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సీక్రెట్ సుషీ ఉద్యోగం అప్లయ్ చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల ఒక మహిళా ఉద్యోగ అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను పంపింది. దీంతో ఎంత దయగల కంపెనీ అనే ప్రశంసలు దక్కించుకుంది. మేల్విచ్ స్క్వేర్ అనే Reddit వినియోగదారు 'రిక్రూటింగ్హెల్' సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మేనేజర్ జాబ్‌కోసం ఆమె దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఆ తరువాత ప్రతి రోజు, ఆమె తన ఇన్‌బాక్స్‌ను ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా సీక్రెట్ సుషీ నుండి అందుకున్న దరఖాస్తుదారునికి ధన్యవాదాలు తెలుపుతూ, సెలెక్ట్ చేయలేదని చెప్తూనే,గిఫ్ట్ వోచర్ సెండ్చేసింది. ఈ తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దీంతోపాటు తనకొచ్చిన 7 డాలర్లు గిఫ్ట్ వోచర్ ను కూడా షేర్ చేస్తూ.. " మర్చిపోలేని అత్యుత్తమ తిరస్కరణ" అంటూ పోస్ట్‌పెట్టారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. -
రష్యాలో సోషల్ మీడియా సంస్థ రెడిట్‌కు భారీ షాక్!
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ" సమాచారం ఉందనీ, సంబంధిత "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్‌కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్‌కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్ ఇంకా స్పందించలేదు. వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్‌తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్ల జాబితాలో రెడిట్ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
‘సెలవులు పెడితే క్రిమినల్లా చూస్తున్నారు’.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్‌ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్‌ప్లేస్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్‌ప్లేస్‌లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా.. "నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్‌ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు. సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్‌టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్‌టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు. -
ఏం చేసినా పడుండాలా?, బాస్‌కి దిమ్మతిరిగేలా రిప్లై..డేరింగ్ లేడీ అంటున్న నెటిజన్లు!
కొత్త జాబ్, ఆఫీస్. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్ వాతావరణం, బాస్ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్‌కు రిజైన్ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్, ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు. ‘బాస్ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు. ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది. చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్.. మంచి నిర్ణయం తీసుకున్నావ్, నువ్వు డేరింగ్ లేడీ అంటూ అభినందిస్తున్నారు. I quit after 3 days by u/QueenMangosteen in antiwork చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు
కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు గుణపాఠం చెప్పే పేరుతో టాప్ పెర్ఫార్మర్‌నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్ ఒక యూజర్ ఈ స్టోరీని షేర్ చేశాడు. కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) అంతేకాదు కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం, కనీసం వాష్‌రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్‌లో తెలిపారు. టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్ తీసుకున్నందుకు చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని ఇతర ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిండం లాంటి విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్‌ను డైరెక్ట్ మేనేజర్ ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ఫాస్ట్‌గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్‌కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!
‘ఉడుత సాయం’ అంటారు కానీ ఇక్కడ ఒక ఉడత మాత్రం సాయం కోసం మనిషి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తనకు దాహం వేస్తోందని ఆ వ్యక్తికి సైగలు చేస్తూ చూపించింది. సదరు దయగల వ్యక్తి ఉడుతకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎవరో ‘రెడ్డిట్’లో రీ–షేర్ చేశారు. పాతదా, కొత్తదా అనే విషయం పక్కన పెడితే ఈ వీడియో ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది. -
అందమంటే భారత మహిళలదే.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!
ప్రపంచంలో 200కుపైగా దేశాలు ఉన్నాయి. ఏటా ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఏదో ఓ దేశానికి చెందిన, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. ఇలా ఒకరిద్దరి అందం గురించి కాకుండా.. సగటున అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ నివేదిక చెబుతోంది. ఈ అంశంపై యూకేకు చెందిన మల్టీనేషనల్ వస్త్రాల కంపెనీ ‘పోర్ మోయి’ ఆన్లైన్లో అధ్యయనం చేసి తాజాగా నివేదిక విడుదల చేసింది. పోస్టులు, ప్రశంసలను విశ్లేషించి.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను ‘పోర్ మోయి’సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా విశ్లేషించింది. వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని ‘అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ప్రెట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..’వంటి కామెంట్లను.. ఆ పోస్టులు, చిత్రాలకు వచ్చిన అప్వోట్లను (ఫేస్బుక్లో లైక్‌ల తరహా ఇచ్చేవి) పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆయా దేశాల వారికి ర్యాంకులను ఇచ్చింది. కృత్రిమ మేధ ఇమేజ్ జనరేషన్ టూల్ ‘మిడ్‌జర్నీ’సాయంతో ఆయా దేశాల వారి రూపురేఖలపై రూపొందించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. భారత మహిళలే టాప్.. ‘పోర్ మోయి’స్టడీలో అత్యంత అందమైన మహిళలుగా భారతీయులే నిలిచారు. జపాన్, స్వీడన్ మహిళలు రెండు, మూడో స్థానం సాధించగా.. వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్ఏ వారు ఉన్నారు. ఓవరాల్‌గా మహిళలు, పురుషులు కలిపి చూస్తే కూడా.. భారతీయులే టాప్‌లో ఉండటం గమనార్హం. - అదే పురుషుల కేటగిరీలో చూస్తే.. బ్రిటన్లు టాప్‌లో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్ వారు ఉన్నారు. どういう仕組みかわからないけれども自信満々であろうあの国の名前は50位以内に無かった Most Attractive Nationalities In The World 27th February 2023 https://t.co/ZBmpe5PMQb pic.twitter.com/bJEyq8JHve — mknbearpaw (@mknbearpaw) March 7, 2023 -
పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు
వైరల్: పబ్లిక్ పార్క్‌లు ఉండేది ఎందుకు? ‘ఇదేం ప్రశ్న.. ప్రజల అవసరాల కోసం.. కాలక్షేపం చేసేందుకు’ అనేగా మీ సమాధానం. కానీ, కొన్ని పార్కుల నిర్వాహకులు మాత్రం ప్రాంగణంలో ఫలానా పనులు చేయకూడదంటూ నిషేధం విధిస్తుంటాయి. కానీ, ఇక్కడో పార్క్ చిత్రవిచిత్రంగా సైన్ బోర్డు ఉంచింది. అది చూసి ఖంగుతినడం ప్రజల వంతు అవుతోంది. ఈ పార్క్‌లో జాగింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు.. అంతెందుకు యాంటీ క్లాక్ వైజ్‌గా(రివర్స్‌లో) వాకింగ్ కూడా చేయకూడదు అంటూ బోర్డు ఉంచింది బీబీఎంపీ. బీబీఎంపీ అంటే బృహత్ బెంగళూరు మహానగర పాలికె. అంటే బెంగళూరులో ఈ పార్క్, సైన్ బోర్డు పెట్టారన్నమాట. ప్రముఖ కంటెంట్ సైట్ రెడ్డిట్‌లో ఓ యూజర్ దీనిని షేర్ చేశారు. ఇవాళే ఈ బోర్డును చూశా అంటూ ఓ యూజర్ దీనిని రెడ్డిట్‌లో వదిలాడు. ఈ బోర్డును ఏ ఏరియాలో ఏర్పాటు చేశారో తెలియదుగానీ.. ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది ఈ బోర్డు. అలాంటప్పుడు ఆ పార్క్‌లో ఏం చేయాలని ఆ బోర్డు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు పలువురు. ఇంకొందరైతే వాకింగ్, జాగింగ్ కాకపోతే నాగిని డ్యాన్స్ చేయాలా? ఏంటి ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పాకాలని, ఇంకొందరు రివర్స్‌లో పాకితే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి డౌటనుమానాలతో వాళ్లు నవ్వులు పంచుతున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. బెంగళూరు నుంచి ఇలా సైన్ బోర్డు వైరల్ కావడం తొలిసారేం కాదు. గతంలో ఓ ఇంటి ముందు నో పార్కింగ్ బోర్డు కూడా ఇలాగే వైరల్ అయ్యింది. -
డిస్నీ+ హాట్‌స్టార్ అదిరిపోయే ప్లాన్..! కేవలం రూ. 49 కే సబ్స్క్రిప్షన్..!
ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థలు యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను విభినమైన ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన బేసిక్ ప్లాన్స్ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం డిస్నీ-హాట్‌స్టార్ కూడా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లిస్తే నెలరోజులపాటు సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించనుంది. రూ. 49 ప్లాన్ వివరాలు..! డిస్నీ+హాట్‌స్టార్ రూ. 49 ప్లాన్ ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్స్ ఏదైనా ఒక డివైజ్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్ సేవలను పొందవచ్చును. అంతేకాకుండా 720 పిక్సెల్ హెచ్డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూసే అవకాశాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ కల్పించనుంది. రెడిట్‌లో హల్చల్...! డిస్నీ+హాట్‌స్టార్ సేవలు కేవలం రూ. 49 కు వస్తోందనే ఫోటో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం రెడిట్ హల్చల్ చేస్తోంది. కాగా ఈ విషయంపై డిస్నీ+ హాట్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిస్నీ+హాట్‌స్టార్ నెలవారి సబ్స్క్రిప్షన్ యూజర్లకు రూ.99 అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ను ఆయా యూపీఐ యాప్స్ ద్వారా సబ్స్క్రిప్షన్ చేసిన యూజర్లకు రూ.49కే వచ్చినట్లు కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి గోఎయిర్ బంపర్ ఆఫర్..! -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఈ సందర్భాన్ని జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతిగా మార్చుకోవడం కోసం తమ స్థాయికి తగ్గట్లు ఖర్చు పెడతారు. పెళ్లిలో మిగితవన్ని ఒక ఎత్తు అయితే.. విందు ఒక ఎత్తు. రకరకాల పదార్థాలతో వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చినవారు తృప్తిగా భోంచేసి.. తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఓ జంట పెళ్లికి అతిథులు తెచ్చిన బహుమతి ఖరీదు ఆధారంగా వారికి విందు భోజనం పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆహ్వాననోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రెడిట్‌లో ‘బిగ్గర్ క్యాష్ గిఫ్ట్.. బెటర్ డిన్నర్’ అనే క్యాప్షన్‌తో వైరలవుతోన్న ఈ నోట్లో కాబోయే దంపతులు.. తమ వివాహ బహుమతి కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయమని అతిథులను అడిగారు. గిఫ్ట్ కోసం చేసే ఖర్చును బట్టి వారికి డిన్నర్లో ఏం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు సదరు జంట. ఈ నోట్ ప్రకారం సదరు జంట తమ వివాహానికి హాజరయ్యే అతిథులను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ నాలుగు గ్రూప్‌లకు ‘ప్రేమపూర్వక బహుమతి’, ‘బంగారు బహుమతి’, ‘వెండి బహుమతి’, ‘ప్లాటినం బహుమతి’ అని వేర్వేరు పేర్లు పెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు తమకిచ్చే బహుమతి విలువ 250 డాలర్లు అయితే, అది 'ప్రేమపూర్వక బహుమతి' కేటగిరీలోకి వస్తుంది. వారికి ఇచ్చే విందులో రోస్ట్ చికెన్ లేదా చేపను వడ్డిస్తారు. అతిథులు కొనుగోలు చేసే బహుమతుల విలువ 251-500 డాలర్ల మధ్య ఉంటే, అది 'సిల్వర్ గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. వారికి డిన్నర్లో భాగంగా మొదటి కేటగిరీలో ఉన్న వంటలు లేదా ముక్కలు చేసిన స్టీక్, సాల్మన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 501-1000 డాలర్ల మధ్య ఉంటే, అది 'బంగారు బహుమతి' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ కేటగిరీ కింద వంటకాలు కలిపి వడ్డిస్తారు. అవి వద్దనుకుంటే ఫైలెట్ మిగ్నాన్, ఎండ్రకాయల తోకలను ఎంచుకోవచ్చు. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 1000 -2500 డాలర్ల లోపు ఉంటే అది 'ప్లాటినం గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ, మూడో కేటగిరీ కింద వంటకాలు వడ్డిస్తారు. వద్దనుకుంటే ఎండ్రకాయతో పాటు సావనీర్ షాంపైన్ గోబ్లెట్ని వడ్డిస్తారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మీరు భారతీయులై ఉండి.. ఇలాంటి రూల్స్ పెడితే.. మీ పెళ్లికి మీరిద్దరే తప్ప వేరే బంధువులు ఎవరు రారు.. అయినా గిఫ్ట్‌ని బట్టి భోజనం పెట్టడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వర్క్ ఫ్రం.. వెడ్డింగ్! పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా? -
గ్లాసులో బర్గర్.. ఎలా తినాలి గురూ..
ప్రతి రెస్టారెంట్ మెనూలో కామన్‌గా కనిపించే ఐటమ్.. బర్గర్. చికెన్, మటన్, వెజిటబుల్.. భిన్న రుచుల్లో, నచ్చిన వెరైటీలో దొరుకుతుంది. సాధారణంగా బర్గర్లను ట్రేలలో సర్వ్ చేస్తారు. అదే ట్రేలో సైడ్ డిషెస్గా చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ ఉంటాయి. ఇది రొటీన్. కానీ వెరైటీగా ట్రై చేద్దామనుకున్నారో ఏమో రెడిట్ రెస్టారెంట్ వాళ్లు బర్గర్‌ను చక్కగా ఒక గ్లాస్లో సర్దేశారండీ!! దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మొత్తం బర్గర్ అంతా ఒక గ్లాస్లో స్టఫ్ చేసి ఉండటం మనం చూడొచ్చు. బర్గర్ తయారీకి ఉపయోగించే పదార్థాలు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ దానిని పేర్చిన విధానం మాత్రం వింతగా ఉంది. గ్లాస్ అడుగుభాగంలో బ్రెడ్ ముక్కలు పేర్చి, ఆపైన చీజ్ సాస్‌లతో వెజిబటుల్స్ను అమర్చారు. ఇదే పద్ధతిని గ్లాస్ పై భాగం వరకు అనుసరించారు. అన్నింటికంటే పైన నువ్వులతో ఉన్న బ్రెడ్‌ను పెట్టారు. (చదవండి: రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?) ఇక్కడ బర్గర్‌ని వెరైటీగా సర్వ్ చేస్తుండటంతో కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఇలా గ్లాస్లో బర్గర్‌ని సర్వ్ చేస్తే ఎలా తినాలని కొందరు కస్టమర్లు ప్రశ్నించగా.. మరికొందరు మామూలు పద్ధతిలో ఎందుకు సర్వ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. తినడం సంగతి ఎలా ఉన్నా ఫోటోతో ఈ బర్గర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చదవండి: వైరల్: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది! -
జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...
వివాహా ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు పెద్దవారు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ముఖ్యంగా ఆడపిల్లను పంపే ఇంటి వారు కాస్త స్థితిమంతులు అయితే బాగుండు అనుకుంటారు. అందుకే తమ స్తోమతకు మించి.. అప్పు చేసి మరి మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్న కుటుంబానికి ఆడపిల్లను వివాహం చేసి పంపిస్తారు. ఇలా తేలుసుకోవడం మంచిదే. అయితే దేని గురించి అయిన అడగడానికి ఓ పద్దతి ఉంటుంది. కాదని హద్దు మీరి ప్రవర్తిస్తే.. అసలుకే మోసం వస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే అల్లుడి జీతం ఎంతో తెలుసుకోవడం కోసం.. ఓ అత్తమామ.. అతడి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని.. ఓ గదిలో బంధించి టార్చర్ పెట్టారట. ఆగ్రహించిన సదరు వ్యక్తి వివాహం క్యాన్సిల్ చేద్దామనుకున్నాడట. కానీ చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. రెడిట్‌లో పోస్ట్ చేసిన ఈ కథనం వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ఏంటి అనే వివరాలు లేవు. కానీ పోస్ట్ ప్రకారం.. ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం పెళ్లి కుదిరింది.ఆ తర్వాత అతడి కొత్తగా జాబ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి కాబోయే అత్తమామ అల్లుడికి ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని భావించారు. అతడిని పిలిచి ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్నారు. ఓ రోజు అతడికి కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. బాధితుడు ఇంటికి వెళ్లే సరికే అతడి కాబోయే భార్య ఇంట్లో లేదు.. అత్త, మామ మాత్రమే ఉన్నారు. గెస్ట్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అతడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్, బైక్ కీ తీసుకుని దాచిపెట్టారు. ఆ తర్వాత అతడి గొత్త ఉద్యోగం గురించి చర్చించసాగారు. బాధితుడు మాట్లాడుతూ.. ‘‘నా కాబోయే మావ కొత్త ఉద్యోగంలో జీతం ఎంత వస్తుందని ప్రశ్నించారు. నాకు చెప్పడం ఇష్టం లేక దాటవేసే ప్రయత్నం చేశాను. కానీ వారు ‘‘నీకు మా కుమార్తెను ఇస్తున్నాను.. నీ సంపాదన ఎంతో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. కచ్చితంగా చెప్పి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేయసాగారు. నేను బాగానే సంపాదిస్తున్నాను.. మీ కుమార్తెను బాగా చూసుకుంటాను అని వారికి హామీ ఇచ్చాను. కానీ వారు నా మాట వినలేదు. నా అత్త ‘‘డబ్బులు చాలా ముఖ్యం. నువ్వు కుటుంబాన్ని పోషించగలవో లేదో తెలియాలి కదా.. ఎంత సంపాదిస్తున్నావో చెప్పాల్సిందే’’ అని డిమాండ్ చేశారు’’ అని తెలిపాడు. ‘‘వాళ్లు ఎంతకి ఆ టాపిక్ మార్చకపోవడంతో నేను అక్కడి నుంచి బయటకు వెళ్లిపోదామని భావించాను. బాత్రూంకి వెళ్తాను అని చెప్పి.. బయటకు వెళ్లే ప్రయత్నం చేశాను. నేను లేవగానే నా కాబోయే అత్త గారు నన్ను బంధించమని గట్టిగా అరిచారు. ఇక మావ నన్ను గదిలో పెట్టి లాక్ చేశారు. మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశాను. ఇంతలో నా కాబోయే భార్య వచ్చింది. ఇది గమనించి ఆమె తల్లిదండ్రులు డోర్ తెరిచి ఏడ్వడం ప్రారంభించారు. ఇక నా ఫియాన్సీ జరిగిన విషయం ఏంటో తెలియకుండా.. నేను తన తల్లిదండ్రులను అవమానించి తనను కూడా బాధపెట్టానని ఆరోపించిది. వారికి క్షమాపణలు చెప్పమని కోరింది’’ అన్నాడు. ‘‘వారి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి కుటుంబానికి అల్లుడిని అయితే ఇక నా జీవితం ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేసింది. కానీ నా తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నా భార్య చాలా మంచిది. తను నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇక అత్తమామల వల్ల ఇప్పటికి అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి’’ అని తెలిపాడు. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ.. -
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
-
ప్రముఖ వెబ్సైట్ల సర్వర్ డౌన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డిట్ , స్పాటిఫై , ట్విచ్, ఫైనాన్షియల్ టైమ్స్ , ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ వంటి ప్రముఖ వెబ్సైట్లకు ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో ఈ సైట్ల సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ సీడిఎన్ సర్వీస్ ప్రొవైడర్ తన వెబ్సైట్లో తన సేవల విషయంలో సమస్య ఎదుర్కొన్నట్లు సంస్థ మంగళవారం సాయంత్రం 4:14 గంటలకు తన వెబ్సైట్లో రాసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ ఇంక్. తో సహ ఇతర ప్రముఖ హులు, కోరా, హెచ్బిఓ మాక్స్, ది గార్డియన్ వంటి వాటి సేవల విషయంలో అవాంతరం ఎదుర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. అయితే, ప్రస్తుత సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక్కడ చదవండి: ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్ BGMI క్రాఫ్టన్‌కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ -
కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!
ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు సమానమే. కానీ, ఆడా-మగా తేడాతో ప్రేమను కురిపించే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. పిల్లల్ని పెంచే పద్ధతిలోనూ లింగ వివక్ష చూపించే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి ఓ తండ్రిని జనాలు ‘ఛీ’ కొట్టిన ఘటన ఒకటి జరిగింది. ప్రముఖ వెబ్సైట్ రెడ్డిట్లోని ఒక ఫోరమ్‌లో కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి ఇలా పోస్ట్ చేశాడు. ‘‘నా వయసు యాభై ఏళ్లు. నా భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. నాకు పదిహేడేళ్ల కొడుకు, పదిహేనేళ్ల కూతురు ఉన్నారు. వాళ్లిద్దరి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నాది. నా కొడుక్కి కావాల్సినంత డబ్బు ఇస్తాను. కానీ, నా కూతురికి మాత్రం ఇవ్వదల్చుకోలేదు. కారణం, శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్రొడక్టుల కోసం ఆమె విపరీతంగా ఖర్చుచేస్తోంది. అందుకే ఆ ఖర్చు కోసం ఆమెనే డబ్బు సంపాదించి నాకివ్వమని చెప్పా. అందుకోసం నాలుగు ఇళ్లలో పని చేయమని సలహా ఇచ్చాను. కానీ నా కూతురికి అది నచ్చలేదు. వెంటనే బ్యాగ్ సర్దేసుకుని నా సోదరి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి పంపించమని నా సోదరిని అడిగితే.. ఆమె నన్ను బండబూతులు తిట్టింది. ఇందులో ఏమైనా తప్పుందా?’’ అని నెటిజన్స్‌ను అడిగాడు. అంతే.. ఆ పోస్టుకి ఇప్పుడు వేల మంది రియాక్ట్ అయ్యారు. ఆ తండ్రిని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. సెక్సీయెస్ట్ ఎబ్యూజింగ్ కేస్ కింద ఆ తండ్రిని జైల్లో వేయాలని కొందరు పోలీసులను కోరారు. అలాంటి తండ్రి దగ్గర ఉండే కంటే.. దూరంగా ఎక్కడైనా ప్రశాంతంగా బతకమని ఆ కూతురికి సలహా ఇచ్చారు మరికొందరు. -
వైరల్: విద్యార్థుల ప్రేమకు ముగ్ధులైన నెటిజన్లు
సోషల్ మీడియా.. ప్రస్తుతం మనిషి జీవితంలో భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. కాగా ఓ స్కూల్ టీచర్‌కి విద్యార్థులు బహూకరించిన డ్రెస్ ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ చిత్రంలో క్లైర్ అనే టీచర్ చిరునవ్వు చిందిస్తుండగా.. ఆమె ధరించిన తెల్లని డ్రెస్‌పై పువ్వులు, రెయిన్బో, నక్షత్రాలను చూడవచ్చు. ఈ డ్రెస్ కింద ‘‘ఎమ్ఆర్ఎస్ కన్సోల్ట్ క్లాస్ 2020-2021’’ అని రాసి ఉంది. కాగా ఈ చిత్రాన్ని రెడిట్‌లో పోస్ట్ చేయగా.. 13 గంటల్లో లక్షల లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. ‘‘ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది. మీరు విద్యార్థుల మనసు గెలుచుకున్న అద్భుతమైన గురువు అంటూ’’ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మీ విద్యార్థులు తమ కళను అద్భుతంగా ప్రదర్శించారు. మీరు వారిని ప్రేమతో ప్రోత్సహించడం చాలా సంతోషం.’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!) -
షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..
ఇంట్లో వారి కోసం ఎంతో ప్రేమగా వంట చేస్తారు ఆడాళ్లు. ఏ మాత్రం రుచి తగ్గినా తినే వారి కంటే వండిన వారే ఎక్కువ బాధపడతారు. ఇక భర్తకు, పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధతో లంచ్ బాక్స్ తయారు చేస్తారు. తినకుండా అలానే తీసుకొస్తే వారి మనసు విలవిల్లాడుతుంది. అలాంటిది ఓ భర్త ఫాస్ట్ ఫుడ్ మీద ఇష్టంతో భార్య తన కోసం ఎంతో ప్రేమగా వండి పంపిన ఆహారాన్ని అమ్ముకుని.. అలా వచ్చిన డబ్బుతో తనకు నచ్చిన ఆహారం తినేవాడు. ఓ రోజు సడెన్‌గా ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రెడిట్ అకౌంట్లో షేర్ చేసిన ఆ వివరాలు.. ‘‘నా భర్తకు ఇంట్లో చేసిన ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇందుకుగాను రోజుకు 20 డాలర్ల చొప్పున నెలకు 600 డాలర్లు ఖర్చు చేసేవాడు. ప్రస్తుతం మే అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇది చాలా ఖరీదైన ఏరియా. రెంటు కూడా చాలా ఎక్కువ. దాంతో సొంత ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా అవనసర ఖర్చులు తగ్గించి.. పొదుపు చేద్దామని నిర్ణయించుకున్నాం. దాంతో నేను ఇంట్లోనే శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను.. ఫాస్ట్ ఫుడ్ తినడం మారేయమని నా భర్తని కోరాను. అందుకు తను అంగీకరించాడు. తనకు లంచ్ బాక్స్‌లో శాండ్విచ్ పెట్టి పంపించేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. రహస్యం ఎలా భయపడిందంటే... ‘‘ఇలా ఉండగా ఓ రోజు నా భర్త స్నేహితులు మా ఇంటికి డిన్నర్‌కి వచ్చారు. నా వంటను మెచ్చుకున్నారు. అంతేకాక ‘‘మేం ప్రతిరోజు మీ భర్త దగ్గర శాండ్విచ్ కొంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. కానీ ధరే కాస్త ఎక్కువ’’ అన్నారు. దాంతో షాకవ్వడం నా వంతయ్యింది. అంటే నా భర్త నేను పంపే శాండ్విచ్లు తినకుండా అమ్ముతున్నాడని తెలిసింది. తన స్నేహితులు వెళ్లాక దీని గురించి ఆయనని ప్రశ్నించగా.. నేను పంపే శాండ్విచ్లు అమ్మి.. అలా వచ్చిన డబ్బుతో తనకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కొనుక్కోని తింటున్నాను అని తెలిపాడు’’ అన్నది. ‘‘నేను ఎంతో ప్రేమగా ఆయన కోసం ఇష్టంగా చేసిన వంటను ఇలా అమ్మకానికి పెట్టడం నాకు ఏం నచ్చలేదు. అంటే పరోక్షంగా ఆయన నా ప్రేమను అమ్మకానికి పెట్టారు. దీని గురించి తెలిసిన నాటి నుంచి నా మనసు మనసులో లేదు. ఇక జీవితంలో తన కోసం వంట చేయకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. భార్యల వంట విలువ మగాళ్లకు ఏం తెలుస్తుంది.. ఒక్కరోజు వారు వంట చేసి.. దాన్ని ఎవరు తినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు వారికి అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఫాస్ట్ ఫుడ్ కోసం హెలికాప్టర్లో 725 కిమీ.. -
కొంచెం కష్టమే.. ప్రయత్నిస్తే దొరుకుతుంది
ఫజిల్స్లాగే కొన్ని ఫోటోలు అప్పడప్పుడు మన మెదుడుకు మేత పెడుతుంటాయి.కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు చూసినా అర్థంకావు. ఇదేం తిక్క ఫోటోలురా నాయనా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రెడ్డిట్ సంస్థ షేర్ చేసిన ఫోటో కూడా అలాగే ఉంది. బెడ్రూంలో మంచం మీద ఒక దుప్పటి వేసి ఉంది. కాని ఆ దుప్పట్లోనే ఒక పెంపుడు కుక్క దాగుంది.. దాన్ని మీరు కనిపెట్టగలరా అని సవాల్ చేస్తూ స్నాప్ షాట్‌ను షేర్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు దుప్పట్లో దాక్కున్న కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.కుక్కను కనిపెట్టడంలో కొంతమంది విఫలమైతే.. మరికొంతమంది సఫలమయ్యారు. సాధారణంగా చూస్తే మంచం మీద దుప్పటి మాత్రమే కనిపిస్తుంది. కానీ రెడ్డిట్ షేర్ చేసిన ఫోటోలో ఒక దగ్గర కుక్క మూతి బయటపెట్టి ఉంటుంది. తీక్షణంగా చూస్తేనే అది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వేలకొద్ది కామెంట్లు, లైకులు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.(కరోనా: ఆకట్టుకుంటున్న నైక్ వీడియో) -
‘నా కూతురికి సమాధానం చెప్పగలగాలి’
వాషింగ్టన్: సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు. ఆన్లైన్ పోస్ట్‌లో తన రాజీనామా గురించి తెలిపారు ఒహానియాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం చేస్తున్నావు అని దీని గురించి భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నించినప్పుడు.. నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. ఒహానియాన్, సెరెనా విలియమ్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. (హ్యాండ్సప్.. డోంట్ షూట్!) జాతి విద్వేషాలను అరికట్టడమే కాక నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. -
నేను ధైర్యవంతురాలిని కదా.. కానీ ఏం లాభం!
అసలే ఒంటరి ప్రయాణం బోర్ అనుకుంటే.. అందుకుతోడు ఫోన్ కూడా అందుబాటులో లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త క్రేజీగా ఆలోచించిన ఆండ్రియా అనే 21 ఏళ్ల యువతి సిక్ బ్యాగ్(బేబీ డైపర్ డిస్పోజల్ బ్యాగ్)పై రాసిన ‘ప్రేమలేఖ’ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆండ్రియా ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఆమె ప్రేమ ఫలించిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ ‘లేఖ’ను వైరల్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారట నెటిజన్లు. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ‘హలో మీరు ఇది చదువుతున్నారు కదా. నా పేరు ఆండ్రియా. నాకు 21 ఏళ్లు. నాకు చాలా బోర్ కొడుతోంది. ఇప్పుడు నేను ఉన్న ఫ్లైట్ మియామీ నుంచి డీసీ వెళ్తోంది. నిన్న రాత్రి నాలుగు గంటలకు ఈ ఫ్లైట్ కోసం టికెట్ బుక్ చేసుకున్నా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరంటే నాకు చాలా ఇష్టం. అతను ఇప్పుడు బోస్టన్ నుంచి న్యూ ఒరేలాన్స్ వస్తున్నాడు. అందుకే ఎయిర్‌పోర్టులోనే నా ప్రేమ విషయం చెప్పి తనని సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను. నిజంగా నేను ధైర్యవంతురాలిని కదా. కానీ ఏం లాభం ఇది జరిగిన తర్వాత నాలుగు రోజుల్లోనే పై చదువుల కోసం నేను ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఇక ఐదు నెలల పాటు తనని కలిసే వీలే ఉండదు. నాకు బెస్టాఫ్ లక్ చెప్పండి. అవును బార్ఫ్ బ్యాగ్‌పైనే నా భావాలన్నీ రాస్తున్నా కానీ ఏం చేయను వైఫై రావట్లేదు. ఒంటరి ప్రయాణమేమో బోర్ కొడుతోంది. మీకు కూడా ఎప్పుడైనా బోర్ కొడితే ఇలాంటి క్రేజీ పనులు చేయండి. బాగుంటుంది’ అంటూ ఆండ్రియా తన మనసులోని భావాలని రాసుకొచ్చింది. ఆండ్రియా రాసిన ఈ ‘లెటర్’ తనకు దొరకటంతో క్లీనింగ్ సిబ్బంది ఈ విషయాన్ని రెడిట్ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. -
ఐఫోన్ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్, యూజర్లు గగ్గోలు
ఐఫోన్ ఎక్స్.. ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్ కెమెరాకు అమర్చిన గ్లాస్ ప్రొటెక్షన్ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్, ఆపిల్ సపోర్టు ఫోరమ్స్ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్ యూజర్లు తమ కెమెరా గ్లాస్ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. ‘నా ఐఫోన్ ఎక్స్ కెమెరా లెన్స్ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్ వెనుక వైపు కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్ ఆపిల్ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 నుంచి ఆపిల్ తన ఐఫోన్ మోడల్స్‌కు సఫైర్ గ్లాస్ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. -
బిల్‌గేట్స్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్
బిల్‌గేట్స్ నుంచి భారీగా కానుకలు.. ఊహించడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా..! అయితే నిజంగా ఆయన నుంచి కానుకలు వస్తే.. ఒక్క దగ్గర ఆగుతామా! ఎగిరి గంతేస్తాం. ప్రస్తుతం 'రెడిట్ సీక్రెట్ శాంతా' గేమ్‌లో పాల్గొన్న వియెట్టే ఎల్ఎల్సీ అనే యువతి అదే చేస్తున్నారు. క్రిస్మస్ నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ఆమె ఇంటికి పెద్దఎత్తున కానుకలు పంపించారు. ఈ కానుకలు చూడగానే ఆమె ఆనందం అవధులు దాటింది. వియెట్టే ఎల్ఎల్సీ, బిల్‌గేట్స్ నుంచి అందుకున్న కానుకలతో పాటు ఓ హృదయపూర్వకమైన పోస్టును షేర్ చేసింది. ఆ ఆనందం ఎలాంటిదో తన మనసుకే తెలుసని.. ఇకపై క్రిస్మస్ను తాను బిల్‌గేట్స్‌కు ముందు, తర్వాత అని జరుపుకొంటానని పేర్కొన్నారు. తాను చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. పిల్లులంటే అమితంగా ఇష్టపడే వియెట్టే అభిరుచులకు అనుగుణంగా బిల్‌గేట్స్ డజనుకు పైగా కానుకలు పంపించారు. అందులో పెద్ద పుషీన్ (కార్టూన్ పిల్లి) బొమ్మతో పాటు, జంతు సంరక్షణకు 750 డాలర్ల విరాళం, టీషర్టు, పలు పుస్తకాలు, పిల్లులను పెంచేపెట్టె వంటివి ఉన్నాయి. అలాగే తన ఫోటో, ఓ లేఖను కూడా బిల్‌గేట్స్ పంపించారు. అందులో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద బాక్స్ రావడం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని, బిల్‌గేట్స్ నుంచి రావడం తన ఆనందానికి అవధులు లేకుండా చేసిందన్నారు. బిల్‌గేట్స్‌కు తన ఆత్మ కచ్చితంగా తెలిసిందని చెప్పారు. ప్రఖ్యాత రెడిట్ వెబ్సైట్ సీక్రెట్ శాంతా పేరుతో.. తన ఖాతాదారులంతా ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకునేలా ఇలాంటి ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గత కొన్నేళ్లుగా పాల్గొంటున్న బిల్‌గేట్స్, ఓ లక్కీ మహిళకు గిఫ్ట్‌లు పంపించారు. -
దానం చెయ్యబోతే.. దాడి జరిగింది!
పుణ్యక్షేత్రం వీదుల్లో నడుస్తూ వెళుతున్నాడో భక్తుడు. రోడ్డు పక్కనే కూర్చున్న కోతి ఆర్తితో అతనివైపు చూసింది. 'పాపం.. ఆకలితో అలమటిస్తుందేమో' అనుకుని చేతిలో ఉన్న అరటి పండును కోతికి అందించాడు. అంతే.. ఒక్క గంతులో పదుల కోతులు అతణ్ని చుట్టుముట్టాయి. నాకంటే నాకంటూ పోటీపడి పైపైకి ఎక్కేశాయి. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సదరు సంఘటనను వేరొక అంశానికి ముడిపెడుతూ కొందరు నెటిజన్లు తమ ఫొటోషాప్ ప్రతిభ చూపారు. ఈ ఫొటో చూసిన తర్వాతైనా కోతులు నివసించే క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా! (చదవండి: పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట) కోతుల దాడిని ఆక్స్ ప్రకటనతో పోల్చుతూ.. డోనాల్డ్ ట్రంప్ అభిమానులను కోతులతో పోల్చుతూ.. -
పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట
ఒక్కసారిగా పురివిప్పిన నెమలిని ఎక్కడ తనను పొడుచుకుతింటుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగుపెడుతోన్న ఈ ఆరేళ్ల పాప ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలన్నీ ఇప్పుడా పాపను చుట్టేశాయి. సంబంధంలేని ఎన్నెన్నో సంఘటనల్లోకి ఆమెను లాగేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో ఓ పాఠకుడు తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. కూతురిని తీసుకుని చిన్నపిల్లల పార్కుకు వెళ్లామని, అయితే ఆ సందర్శన అనుకున్నంత సజావుగా (నెమలిని చూసి పాప భయపడిపోవడం వల్ల) జరగలేదని ఫొటో కింద కామెంట్ పెట్టాడు. రెడిట్ లో జూన్ 26న ఈ ఫొటో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫొటోషాప్ కొట్లాట మొదలైంది. ఒక వ్యక్తి .. పాప భయాన్ని బ్రెగ్జిట్ తో ముడిపెడుతూ నెమలిని యురోపియన్ యూనియన్(ఈయూ)గా, పాపను ఈయూ నుంచి భయపడి పారిపోతున్న బ్రిటన్ గా పోల్చుతూ ఫొటోలో మార్పులు చేశాడు. ఇంకొకడు.. అలాకాదంటూ పాపను ట్రంప్ తో పోల్చాడు. ట్రంప్ (పాప) పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ తో పోటీపడుతున్నట్లు ఫొటోషాప్ చేశాడు. ఇలా పాప భయంపై లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన ఫొటోషాప్డ్ ఫొటోల పోట్లాట ఇంటర్నెట్ లో నడుస్తూనేఉంది.. -
తండ్రి ప్రేమకు సాటి అవునే....
వాంకోవర్: బుడి బుడి నడకల కొడుకు పట్ల ఓ తండ్రికున్న అమూల్య ప్రేమకు చక్కటి నిదర్శనం ఈ ఫొటో. జోరుగా కురుస్తున్న వర్షంలో కొడుకుపై ఒక్క చుక్క కూడా పడకూడదనే తాపత్రయంతో కొడుకుకు గొడుగు పట్టి బడికి తీసుకెళ్తూ తాను మాత్రం వర్షంలో నిలువన నీరవుతున్న దృశ్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ నగర వీధిలో కనిపించిన ఈ దృశ్యాన్ని జాగర్షాట్జ్ అనే వ్యక్తి తన కెమేరాలో బంధించి ‘డాడ్స్’ అనే శీర్షికతో ముందుగా సోషల్ వెబ్సైట్ ‘రెడిట్’లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫొటో ఇతర వెబ్సైట్లకు విస్తరించింది. ఇప్పటికే 35 లక్షల మంది ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. వెయ్యి మందికి పైగా కామెంట్లు చేశారు. ‘తండ్రులెవరైనా కావచ్చు. ఇలాంటి డాడీలు మాత్రం కొందరే ఉంటారని ఒకరు, చిన్నప్పుడు నా పట్ల నా తండ్రి చూపించిన ప్రేమ ఎలా ఉండేది నాకు గుర్తు లేదు. నేనూ మంచి డాడీని అవుతానా? అని మరొకరు, ఆ తండ్రి స్థానంలో మమ్మీ ఉంటే సీనే మారిపోయేదేమో!’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. ‘ఇంట్లో ఉన్న తల్లి ఒక గొడుగు కాకుండా రెండు గొడుగులిచ్చి పంపించొచ్చుకదా! అని ఒకరు, కొడుకును తండ్రి ఎత్తుకుంటే, ఆ గొడుగును కొడుకు పట్టుకుంటే ప్రాబ్లమ్ తీరేదికదా’ అంటూ సమస్య పూరక సలహాలూ ఇచ్చారు.