Disney+ Hotstar Monthly Plan For Rs 49 Only, Check Your Eligibility - Sakshi
Sakshi News home page

Disney+Hotstar Monthly Plan: డిస్నీ+ హాట్‌స్టార్‌ అదిరిపోయే ప్లాన్‌..! కేవలం రూ. 49 కే సబ్‌స్క్రిప్షన్‌..!

Published Tue, Dec 21 2021 6:20 PM | Last Updated on Tue, Dec 21 2021 7:59 PM

Disney Hotstar Has a Rs 49 Monthly Plan Check You May Eligible Or Not - Sakshi

ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థలు యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను విభినమైన ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తన బేసిక్‌ ప్లాన్స్‌ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం డిస్నీ-హాట్‌స్టార్‌ కూడా సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లిస్తే నెలరోజులపాటు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందించనుంది.  

రూ. 49 ప్లాన్‌ వివరాలు..!
డిస్నీ+హాట్‌స్టార్‌  రూ. 49 ప్లాన్‌ ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను పొందవచ్చును. అంతేకాకుండా 720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూసే అవకాశాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌ కల్పించనుంది.

రెడిట్‌లో హల్‌చల్‌...!
డిస్నీ+హాట్‌స్టార్‌ సేవలు కేవలం రూ. 49 కు వస్తోందనే ఫోటో ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం రెడిట్‌ హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఈ విషయంపై డిస్నీ+ హాట్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిస్నీ+హాట్‌స్టార్‌ నెలవారి  సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లకు రూ.99 అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ను ఆయా యూపీఐ యాప్స్‌ ద్వారా సబ్‌స్క్రిప్షన్ చేసిన యూజర్లకు రూ.49కే వచ్చినట్లు కొంతమంది యూజర్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 

చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి గోఎయిర్‌ బంపర్ ఆఫర్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement