ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది.
(ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..)
నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్‌కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment