
ఫజిల్స్‌లాగే కొన్ని ఫోటోలు అప్పడప్పుడు మన మెదుడుకు మేత పెడుతుంటాయి.కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు చూసినా అర్థంకావు. ఇదేం తిక్క ఫోటోలురా నాయనా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రెడ్డిట్ సంస్థ షేర్ చేసిన ఫోటో కూడా అలాగే ఉంది. బెడ్‌రూంలో మంచం మీద ఒక దుప్పటి వేసి ఉంది. కాని ఆ దుప్పట్లోనే ఒక పెంపుడు కుక్క దాగుంది.. దాన్ని మీరు కనిపెట్టగలరా అని సవాల్ చేస్తూ స్నాప్ షాట్‌ను షేర్ చేసింది.
ఇంకేముంది నెటిజన్లు దుప్పట్లో దాక్కున్న కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.కుక్కను కనిపెట్టడంలో కొంతమంది విఫలమైతే.. మరికొంతమంది సఫలమయ్యారు. సాధారణంగా చూస్తే మంచం మీద దుప్పటి మాత్రమే కనిపిస్తుంది. కానీ రెడ్డిట్ షేర్ చేసిన ఫోటోలో ఒక దగ్గర కుక్క మూతి బయటపెట్టి ఉంటుంది. తీక్షణంగా చూస్తేనే అది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వేలకొద్ది కామెంట్లు, లైకులు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.(కరోనా: ఆకట్టుకుంటున్న నైక్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment