puzzle
-
‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..
తొమ్మిది గుడులు.. తొమ్మిది అంకెలు. అటు చూసినా ఇటు చూసినా ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని అంకెలూ రావాలి. ఒక్కటీ మిస్ కాకూడదు, ఒకే అంకె మరోసారి రాయకూడదు. ఇవన్నీ సుడోకు(sudoku) ఆటలో నియమాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిత్యం ఆడే ఈ ఆటంటే పిల్లలతోపాటు పెద్దలకూ చాలా ఇష్టం. దీని వల్ల లెక్కల మీద ఇష్టంతోపాటు ఏకాగ్రత, దీక్ష పెరుగుతాయి. ‘సుడోకు’ జపాన్‌లో (Japan) చాలా ప్రసిద్ధి చెందింది. అయితే పుట్టింది మాత్రం అమెరికాలో. 1979లో హోవర్డ్ గాన్స్ అనే ఆయన దీన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇది పలు పత్రికల్లో ప్రచురితమైంది. అయితే 1986లో జపాన్‌కు చెందిన పజిల్ కంపెనీ ‘నికోలీ’ ఈ ఆటకు ‘సుడోకు’ అని పేరు పెట్టిన ప్రపంచమంతా తెలిసింది. ‘సుడోకు’ అంటే ‘ఒకే సంఖ్య’ అని అర్థం. సుడోకు ఆడాలంటే లెక్కలు తెలిసి ఉండాలని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి అదేమీ అక్కర్లేదని సుడోకు నిపుణులు అంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు గుర్తుపట్టగలిగేవారు ఎవరైనా సుడోకు ఆడొచ్చంటున్నారు. ఈ ఆట ఆడేందుకు గణితశాస్త్రంతో పని లేదని, కేవలం ఆలోచనాశక్తి చాలని వివరిస్తున్నారు.సుడోకులోనూ అనేక రకాలున్నాయి. జిగ్సా సుడోకు, సమురాయ్ సుడోకు, మినీ సుడోకు, లాజిక్ 5, కిల్లర్ సుడోకు.. ఇలా ఒకే ఆటని రకరకాలుగా ఆడతారు. పేరుకు ఆటే అయినా ఇది ఆడేందుకు ఒక్కరే సరిపోతారు. ఒకచోట కూర్చుని పెన్ను, కాగితం పట్టుకొని గడులు నింపడమే ఇందులో కీలకం. చదవండి: ఆమె ఇళయరాజానా లేక రెహమానా..? అంత చిన్న వయసులోనే..సుడోకు ఎలా ఆడాలి, తొందరగా ఎలా పూర్తి చేయాలి అనే విషయాలను వివరిస్తూ కొంతమంది పుస్తకాలు రాశారు. అలాగే సుడోకు పేపర్లతో నిండిన పుస్తకాలను మార్కెట్లో అమ్ముతుంటారు. త్రీడీ సుడోకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఫోన్లో సుడోకు ఆడేందుకు ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2006లో ఇటలీ(Italy)లో ప్రపంచ సుడోకు ఛాంపియన్(Championship) షిప్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ విన్నాక మీకూ సుడోకు మీద ఆసక్తి కలుగుతోందా? ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి ఆడేయండి. మెదడును పదునుగా మార్చుకోండి. -
భర్తను షూట్ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం?
1. ఈ ఇంగ్లీష్ పదంలో మొదటి రెండు అక్షరాలు అతడు. మొదటి మూడు అక్షరాలు ఆమె. మొదటి నాలుగు అక్షరాల విషయానికి వస్తే...సాహసం చేసిన వ్యక్తులను ఇలా పిలుస్తారు. మొత్తం పదం విషయానికి వస్తే....అందానికి అద్భుత నిర్వచనం. ఆ పదం ఏమిటి? 2. 1988వ సంవత్సరం, ఒక పండగపూట ఎవరికీ అనుమానం రాకుండా భర్తను షూట్ చేసింది అన్నపూర్ణ. ఆ తరువాత చీకటి గదిలో నీళ్లలో ముంచి వేలాడదీసింది. ఆ తరువాత అన్నపూర్ణ ఆమె భర్త ఇద్దరు కలిసి సంతోషంగా భోజనం చేశారు. ఇదెలా సాధ్యం? జవాబులు 1.Heroine 2. అన్నపూర్ణ షూట్ చేసింది గన్‌తో కాదు. అలనాటి కెమెరాతో. డార్క్‌రూమ్‌లో నెగెటివ్‌ను డెవలప్ చేసింది. -
అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు?
అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్‌కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్ చేసి తన భార్య బోట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!) జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్–వే టికెట్ మాత్రమే బుక్ చేశాడు. -
సుడోకు రూపకర్త కన్నుమూత
టోక్యో: అంకెలతో ఆసక్తి పుట్టించే సుడోకు రూపకర్త మాకి కాజీ కన్నుమూశారు. బైల్ డక్ట్ కేన్సర్‌తో బాధపడుతూ 69 ఏళ్ల వయసులో మరణించారని ఆయన స్థాపించిన నికోలి కో. సంస్థకు చెందిన ఉద్యోగులు వెల్లడించారు. 2004 నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జపనీయులు సుడోకును స్థానికంగా సుజి–వా–డోకుషిన్–ని–కగిరు అని పిలుస్తారు. దాన్ని షార్ట్‌కట్‌లో సుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకి కాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకు చాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది. -
ఈ పిల్లి ఎంతకీ దొరికి చావట్లేదే!
పిల్లి, మనుషుల పెంపుడు జంతువు. కొందరికి పిల్లి అంటేనే గిట్టదనుకోండి, అది వేరే విషయం. ప్రపంచవ్యాప్తంగా 33 రకాల జాతుల పిల్లులున్నాయి. కానీ ఏ జాతి పిల్లికైనా మనిషికి తగ్గట్టు నడిచే స్వభావం పుట్టుకతోనే ఉంది. యజమానుల ముందు అమాయకంగా ఉంటూ, గెంతులేస్తుంటాయి. ఇతరుల ముందు రాజసంగా నడుస్తూ తిక్క వేషాలు కూడా వేస్తుంటాయి. దొంగలా పక్కింట్లోకి దూరి పాలు తాగి ఏమీ ఎరగనట్టుగా నటిస్తాయి. ఇంతకీ ఈ పిల్లి గోలంతా ఎందుకనుకుంటున్నారా? మరేం లేదు. పైన ఫొటోలో ఓ పిల్లి దాగుంది. మీకు దొరకనంటూ సవాలు విసురుతోంది. ఎక్కడ దాగున్నానో మీరు కనుక్కోలేరని వెక్కిరిస్తోంది. (చదవండి: బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ..) ఆ మార్జాలాన్ని పట్టేసుకుందామని ఎందరో నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. కొందరు అసలు ఆ గదిలో పిల్లి ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తుండగా మరికొందరు వెతకలేక చస్తున్నాన్రా దేవుడా అని కామెంట్లు పెడుతున్నారు. అతి కొద్ది మంది మాత్రం పావుగంట తర్వాత అది పట్టుబడిందోచ్ అని సంబరపడుతున్నారు. అది మామూలు పిల్లి కాదని, నల్ల పిల్లి అని చెప్తున్నారు. దాన్ని రాత్రిపూట చూస్తే భయంతో చచ్చిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీకు ఆ పిల్లి కనిపించిందా? లేదా? దొరక్కపోతే ఆ మార్జాలాన్ని కింద ఫొటోలో చూసేయండి. (చదవండి: వార్నీ, పిల్లి డ్రామా మామూలుగా లేదు) -
కొంచెం కష్టమే.. ప్రయత్నిస్తే దొరుకుతుంది
ఫజిల్స్లాగే కొన్ని ఫోటోలు అప్పడప్పుడు మన మెదుడుకు మేత పెడుతుంటాయి.కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు చూసినా అర్థంకావు. ఇదేం తిక్క ఫోటోలురా నాయనా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రెడ్డిట్ సంస్థ షేర్ చేసిన ఫోటో కూడా అలాగే ఉంది. బెడ్రూంలో మంచం మీద ఒక దుప్పటి వేసి ఉంది. కాని ఆ దుప్పట్లోనే ఒక పెంపుడు కుక్క దాగుంది.. దాన్ని మీరు కనిపెట్టగలరా అని సవాల్ చేస్తూ స్నాప్ షాట్‌ను షేర్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు దుప్పట్లో దాక్కున్న కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.కుక్కను కనిపెట్టడంలో కొంతమంది విఫలమైతే.. మరికొంతమంది సఫలమయ్యారు. సాధారణంగా చూస్తే మంచం మీద దుప్పటి మాత్రమే కనిపిస్తుంది. కానీ రెడ్డిట్ షేర్ చేసిన ఫోటోలో ఒక దగ్గర కుక్క మూతి బయటపెట్టి ఉంటుంది. తీక్షణంగా చూస్తేనే అది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వేలకొద్ది కామెంట్లు, లైకులు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.(కరోనా: ఆకట్టుకుంటున్న నైక్ వీడియో) -
ఈ ఎమోజీల అర్థమేమిటో?
ముంబై: కరోనా భూతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎక్కువగా ఆధారపడే సోషల్ మీడియాలోనూ వారిని చైతన్యం చేసే పోస్టులు చేస్తున్నారు. తాజాగా ముంబై పోలీసులు ఓ పజిల్‌ను పోస్ట్ చేశారు. దాన్ని పరిష్కరించి అందులో ఉన్న అర్థాన్ని కనుక్కోండి.. అంటూ నెటిజన్లు చాలెంజ్ విసిరారు. ఇదేమంత కఠినం కాదని సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ముంబైవాసులకు ఇదేంటో తప్పకుండా తెలుస్తుందని పేర్కొన్నారు. (ఇందులో మాస్కు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించండి) ఆ పోస్ట్‌లో ఎమోజీలను ఓ క్రమ పద్ధతిలో పేర్చి అందులో అర్థవంతమైన సందేశాన్ని ఇనుమడింపజేశారు. ఇంతకీ మీకు అర్థమైందా? లేదా? లేక అర్థమయూ.. కానట్టు ఉందా? ఇప్పటికీ దాని అసలు అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఇది చదివేసేయండి. "ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనికి వెళ్లండి, ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు ఇంట్లోనే ఉండండి." పోలీసుల ఆలోచన అదిరింది కదూ! కరోనా బారిన పడకుండా ఈ నియమాన్ని పాటించమని చెప్పకనే చెప్తున్నారు. పోలీసులు సందేశాన్ని ఇచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!) -
జూమ్ చేసినా బల్లి కనిపించట్లేదు..
కరోనా వార్తలతో మీ బుర్ర వేడెక్కిందా.. గుండెకు గుబులు పుట్టించే వార్తలు చదివీ మనసు ఆందోళనగా మారుతోందా? అందుకే మీకోసం ఈ పజిల్. మీ టెన్షన్లన్నీ పక్కనపెట్టి సరదాగా ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. మెదడుకు మేతతోపాటు, మనసుకు కాస్త స్వాంతన చేకూరుతుంది. ఇంతకీ పైన కనిపిస్తున్న ఫొటోలో ఏముంది.. రోడ్డు.. ఆ పక్కన చెట్టు వేర్లు, లేదా కాండం. దాని పక్కనే ఎండిన మొక్కల పొద కూడా ఉంది. వీటితోపాటు ఓ జీవి కూడా ఉందండోయ్.. ఇందులో చాలామందికి పేరు తలుచుకుంటేనే జలదరించే బల్లి కూడా ఉంది. (బంగారు బల్లి.. మళ్లీ దర్శనం) ఇంకేం.. భూతద్దం పట్టుకుని వెతికేయండి మరి.. ఇప్పటికే చాలామంది వెతికి వెతికి అలిసిపోతున్నారే తప్ప దాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. మరికొందరు మాత్రం "బల్లి ప్రాణం మా చావుకొచ్చింది.." అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఎంత జూమ్ చేసినా కనిపించట్లేదురా బాబోయ్" అంటూ చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం "హేయ్.. దొరికేసిందోచ్.." అంటూ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ మీరు కూడా కళ్లు పెద్దవి చేసి తెగ వెతికేస్తున్నట్లున్నారు. ఇప్పటికీ దాని జాడ గుర్తించకపోతే శ్రమించడం మాని ఈ ఫొటో చూసేయండి. (ఉడుము బిర్యానీ అదరహో!) -
ఇంటి వెనకాల పాము: కనిపించిందా?
పజిల్స్.. మెదడుకు మేత. అప్పుడప్పుడు ఈ పజిల్స్‌ను సాల్వ్ చేస్తుంటే కాలయాపనతో పాటు మెదడుకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇంతకు ముందు గజిబిజిగా ఉన్న ఫొటో పిల్లిని, జన సమూహం మధ్యలో మాస్కు ధరించిన వ్యక్తిని గుర్తుపట్టారు కదా! ఈసారి పై ఫొటోలో పాము ఎక్కడ ఉందో పసిగట్టండి. ఇంతకీ ఏ పాము? అంటూ ప్రశ్నలు మాని బుర్రకు పదును పెట్టండి, చూపులో తీక్షణత పెంచండి. సాధారణ చెట్లు, కలప, నిర్మానుష్యమైన భూమి ఉన్న ఈ ఫొటోలో పామును కనుక్కోండి.. అంటూ ఈ పజిల్ ప్రస్తుతం ఫేస్బుక్లో చక్కర్లు కొడుతోంది. (దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించకండి) ఇక ఇది ఇంటి వెనుక ఖాళీ స్థలంలా గోచరిస్తోంది. ఇలాంటి ప్రదేశాలే కదా పాములకు అనువైనవి. కాబట్టి అది ఎవరికీ కనబడకుండా ఎక్కడ నక్కి ఉందో తోక పట్టుకుని లాగేయండి. ఓస్ ఇదెంత పని? అంటూ కొందరు దాని ఆచూకీ గుర్తుపట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎందెందు వెతికినా.. అందందు పాము లేదయా అని ఉసూరుమంటున్నారు. మీరూ ఈ జాబితాలో ఉంటే ఇక శ్రమించడం మాని కింద ఉన్న ఫొటోను చూసేయండి. పాము పారిపోకుండా పట్టేసుకోండి.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) -
ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?
న్యూఢిల్లీ: ఇక్కడో పిల్లి దాగుడు మూతలు ఆడుతోంది. అది ఎక్కడుందో కనిపెట్టమంటూ సవాలు విసురుతోంది. అసలే మార్జాలం. ఎక్కడైనా దూరగలదు, ఎందులోకైనా చొచ్చుకుపోగలదు. అలాంటిది. ఇన్ని పుస్తకాల దొంతరల మధ్య దాన్ని గుర్తించడం కాస్త కష్టమే అయ్యేటట్టుంది. ఇంతకీ ఈ పజిల్‌ను కేట్ హైండ్స్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశాడు. "ఈ రోజు పిల్లిని పట్టుకుందాం" అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు. ఓస్, అదెంత పని.. వెతికేద్దాం అని ప్రయత్నించిన కొందరు నెటిజన్లు అందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ? అంటూ దాన్ని గుర్తించలేక జుట్టు పీక్కుంటున్నారు. (డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది) పుస్తకాలు, చెట్లు, టీవీతో అంగుళం కూడా ఖాళీ లేకుండా నిండిపోయిన ఫొటోలో దాన్ని పట్టుకోవడం కష్టమేనంటూ మరికొందరు ముందే చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం పిల్లి దొరికిందోచ్ అంటూ దాని ఫొటోను షేర్ చేస్తూ ఎగిరి గంతేస్తున్నారు. ఇక మిగిలిన వారు మాత్రం తాము కూడా పిల్లులతో ఇలాగే దాగుడుమూతలు ఆడతామంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పజిల్‌ను పక్కన పెట్టేశారు. (మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి!) How is this even possible? pic.twitter.com/loak8Va5lW — Second Ave. Sagas (@2AvSagas) June 7, 2020 -
వైరల్: అమితాబ్ పజిల్.. కనుక్కోండి చూద్దాం..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెటిజన్లకు ఓ పజిల్ విసిరాడు. ఈ వారం పజిల్ అంటూ.. నెటిజన్లకు ‘పరీక్ష’పెట్టాడు. పజిల్ని పరిష్కరించే క్రమంలో అమితాబ్ ట్వీట్‌కు విపరీతమైన స్పందన రావడంతో వైరల్ అయింది. కొందరు అభిమానులు పజిల్ కనుక్కోలేక సరదా కామెంట్లు చేయగా.. మరికొందరు ప్రయత్నించారు. మీ మనుమరాలిని అడగండి బిగ్ బీ అని ఒకరు.. సమాధానం చెప్పండి సర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. ఒకరిద్దరు సరైన జవాబు చెప్పారు. అయితే, వాటిల్లో ఒక అభిమాని చెప్పిన వినూత్నమైన ఆన్సర్ బిగ్ బీని ఆకట్టుకుంది. అమితాబ్ సినిమా పాటను షేర్ చేసిన సదరు అభిమాని.. జవాబు ఇదే అని చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ అంటూ బిగ్ బీ అతన్ని అభినందించాడు. ఇంతకూ ఆ పజిల్‌కు మీరు కూడా ఆన్సర్ ఇస్తారా..! T 3442 - GUESS .. ??? pic.twitter.com/wACvs0GsJa — Amitabh Bachchan (@SrBachchan) February 16, 2020 -
ఆ పజిల్ విప్పితే.. తిరిగి వచ్చేస్తా
అహ్మదాబాద్: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మరోసారి భారత ఆర్థికవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోతోంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం ఉత్సాహంగా పైపైకి దూసుకుపోవడం తనకు ఒక పజిల్‌గా వుందని వ్యాఖ్యానించారు. ఇదొక పజిల్‌గా తనకు గోచరిస్తోందని, దీన్ని తనకు అర్థం చేయిస్తే తాను తిరిగి దేశానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం వుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ), ఎన్ఎస్ఇ, ఎన్ఎస్ఇ ఐసీఎఫ్టి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఎన్ఎస్ఇ సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్స్ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్షీణిస్తుందో, స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోందో వివరించాలన్నారు. మొట్టమొదటి సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్సెస్ డొమైన్ ఈ చిక్కుముడిని విప్పగలిగితే.. తాను అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చేస్తానన్నారు. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కేవలం ఆర్ధికశాస్త్రం, ఫైనాన్స్, మార్కెటింగ్లాంటి వాటికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ పరిమితం కాకుండా ఎకనామిక్స్‌లోని కొన్ని పరిస్థితులకు మానవుల స్పందన ఎలా వుంటుందనే అసాధారణమైన విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం-ఎ డైరెక్టర్ ఎర్రోల్ డిసౌజా , మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్యాకల్టీ సభ్యుడు అరవింద్ సహాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక సేవల్లోని వ్యాపార సమస్యలకు సంబంధించిన అనేక విషయాలలో అవగాహన చేపట్టడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని డిసౌజా తెలిపారు. విధాన రూపకర్తలు, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు, ఫండ్ నిర్వాహకులు, వ్యాపారులు, విశ్లేషకులు, సంపద సలహాదారులు, ఇతర నిర్వాహకులు ఈ విషయంలో తమకు సహాయపడాలన్నారు. ఎన్ఎస్ఈ సీఎండీ విక్రమ్ లిమాయే మాట్లాడుతూ జనాభా , పొదుపు , పెట్టుబడి అలవాట్లను రూపొందించడంలో సామాజిక ప్రవర్తనా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దుతో వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిందనీ, దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్య అని విమర్శించిన అరవింద్ ‘ఆఫ్ కౌన్సెల్– ది ఛాలెంజెస్ ఆఫ్ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 2014 అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అయితే 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ గత ఏడాది అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
సోనమ్ కపూర్ సమాధానంపై జోకులు
ముంబై : మనలో చాలా మందికి పజిల్స్ పూర్తి చేయాలనే ఆసక్తి ఉంటుంది. పజిల్‌కి జవాబు తెలిస్తే అంతటితో ఊరుకోకుండా మన స్నేహితులు, తెలిసిన వారిని జవాబు చెప్పుకోండంటూ వారికి సవాల్ విసురుతాం. ఫిలింఫేర్ మ్యాగజీన్ ఎడిటర్ జితేశ్ పిల్లై కూడా సరిగ్గా ఇదే పని చేశారు. లాజికల్ అండ్ రీజనింగ్‌కు సంబంధించిన ఒక పజిల్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. ట్రయాంగిల్స్తో కూడిన ఒక పెద్ద ట్రయాంగిల్ చిత్రాన్ని పోస్ట్ చేసిన జితేశ్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో జవాబు కనిపెట్టాలంటూ నెటిజన్లను కోరారు. వెంటనే స్పందించిన బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తనకు తోచిన జవాబు చెప్పేశారు. అయితే ఆ జవాబు తప్పు కావడంతో గణిత శాస్త్ర ‘ఉద్దండ పండితులు’ ఆమెపై జోకులు వేసేందుకు సిద్ధమైపోయారు. ‘నువ్వు చెప్పింది తప్పు. ట్యూషన్‌కు వెళ్తేనైనా సరైన సమాధానం తెలుస్తుందంటూ’ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ఆమెకు బుర్ర పనిచేయడం లేదంటూ’ మరొకరు సెటైర్ వేశారు. అయితే నెటిజన్ల కామెంట్లను తేలిగ్గా తీసుకున్న సోనమ్.. ‘నేను చెప్పింది తప్పు సమాధానమని నాకు ముందే తెలుసు. మరి సరైన సమాధానమేంటో మీరు చెప్పండి’ అంటూ రివర్స్ పంచ్ వేసింది. ఇంతకీ జవాబేంటో చెప్పలేదు కదూ.. కొందరు 24 త్రిభుజాలని, మరికొందరు 18 మాత్రమే ఉన్నాయంటూ ట్వీట్ చేస్తున్నారు. ఫొటో చూశారుగా మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సోనమ్ చెప్పలేకపోయిన జవాబు మీరు చెప్పేయండి. Say? pic.twitter.com/lrhXrWw5EP — J (@jiteshpillaai) April 9, 2018 -
జిగ్సా పజిల్
తయారు చేసి చూడండి కావలసినవి అందమైన చిత్రాలు, రబ్బరు సిమెంట్ లేదా జిగురు, సన్నటి అట్ట ముక్క, కత్తెర తయూరు చేసే పద్ధతి పాత పుస్తకం నుండి కొన్ని అందమైన చిత్రాలను కత్తిరించి పక్కన పెట్టుకోండి. అట్టముక్కను మీకు నచ్చిన చిత్రానికి సరిపోయేలా అన్ని వైపులా కత్తిరించుకోండి. చిత్రం వెనుక వైపు రబ్బరు సిమెంట్, లేదా జిగురు అతికించండి. ఇప్పుడు చిత్రాన్ని అట్టముక్క పైన చక్కగా అతికించండి. జిగురు పూర్తిగా ఆరిన తరువాత అట్టముక్క వెనుక వైపు బొమ్మలో చూపించిన విధంగా వేరు వేరు ఆకారాల్లో గీతలు గీయండి. ఆ గీతల పైనే కత్తిరించి చిత్రాన్ని అనేక ముక్కలు చేయండి. ఈ ముక్కలను మళ్ళీ జాగ్రత్తగా అమర్చితే మీ జిగ్సా పజిల్ రెడీ! ప్రయత్నించండి మరి! -
మదర్స్ సెయిలింగ్
అమ్మ ఎప్పుడూ అద్భుతం. అంతుపట్టని పజిల్. లోకం అంతా తన చుట్టూనే తిరుగుతున్నా తను మాత్రం పిల్లలే లోకంగా బతుకుతుంది. పిల్లల కోసం ఇష్టాలు, అభిరుచులు, చివరకు కెరీర్ కూడా వదులకుంటుంది. ఈ ఇద్దరమ్మలు అందరికన్నా భిన్నం. చిన్నప్పుడు బిడ్డలకు ఆట బొమ్మలైన వారు... ఇప్పుడు వాళ్ల కోసమే ఆటలు నేర్చుకుంటున్నారు. సెయిలింగే తమ లైఫ్ అనుకున్న పిల్లల కోసం లైఫ్ జాకెట్స్ ధరించారు. సాహసంతో ఏటికి ఎదురీదుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో తమ పిల్లలతో పాటూ పాల్గొన్న జినా, నిపా అషర్ల అమ్మ మనసు వారి మాటల్లోనే... - వాంకె శ్రీనివాస్ ‘మేం కొంపల్లిలో ఉంటాం. పాప జుహీ, వాటర్ స్పోర్ట్స్ తనిష్క్ దేశాయ్‌కి వాటర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. అందుకే మూడేళ్ల నుంచి సెయిలింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి శిక్షణ కోసం ప్రతి శని, ఆదివారాలు హుస్సేన్సాగర్కి తీసుకొచ్చేవాళ్లం. అప్పుడు కోచ్ ‘మీరూ నేర్చుకోండి’ అన్నారు. ఆ క్లబ్లో జుహీ ఒక్కతే అమ్మాయి కావడంతో, తనకూ ధైర్యంగా ఉంటుంది, కష్టనష్టాలేంటో తెలిసినట్టుగా ఉంటుందని భావించి నేనూ సెయిలింగ్ ప్రాక్టీసు చేశా. ఈ సమయంలో ఆటలంటే అంతా వింతగా చూస్తారు. కానీ నా భర్త నితిన్ దేశాయ్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు. అలా 2012, 2013, ప్రస్తుతం మాన్సూన్ రెగెట్టాలో ఫ్యామిలీ ఈవెంట్లో పాల్గొన్నా. అయితే గత పోటీల్లో వయసు సరిపోక జుహీ పార్టిసిపేట్ చేయులేదు. ఈసారి తనతోపాటు నేనూ పోటీ పడ్డా. ఇదో అద్భుతమైన అనుభూతి నాకు. సెరుులర్గా వూరతానని ఎన్నడూ ఊహించలేదు. ఇక బాబు 15 ఏళ్ల తనిష్క్ కూడా సెరుులింగ్లో తన విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాడు. పిల్లలిద్దరూ సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. భవిష్యత్‌లో వీరిని వరల్డ్ చాంపియన్లుగా చూడాలన్నది నా ఆశ’ అంటూ ఆనందంగా చెప్పారు జినా. జినాలాగే తన పిల్లలకోసం సెయిలర్‌గా మారిన మరో తల్లి... ముంబైకి చెందిన నిపాఅషర్. ‘మా పాప అనియా ముంబైలోని ఏవీఎన్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. తనకు సెయిలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అంత చిన్నవయసులో ఒంటరిగా పంపించడమా అని భయమేసింది. నా భర్త మహుల్అషర్ కూడా సెయిలర్. అయినా పాప కోసం నేనూ సెయిలింగ్ నేర్చుకున్నా. ప్రస్తుతం పదేళ్లు ఉన్న అనియా హుస్సేన్‌సాగర్‌లో జరిగిన మాన్సూన్ రెగెట్టాలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. వుంచి సెరుులర్ అవుతుందనే నవ్ముకం ఉంది’ అని ధీవూ వ్యక్తం చేశారు అషర్.