
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెటిజన్లకు ఓ పజిల్ విసిరాడు. ఈ వారం పజిల్ అంటూ.. నెటిజన్లకు ‘పరీక్ష’పెట్టాడు. పజిల్‌ని పరిష్కరించే క్రమంలో అమితాబ్ ట్వీట్‌కు విపరీతమైన స్పందన రావడంతో వైరల్ అయింది. కొందరు అభిమానులు పజిల్ కనుక్కోలేక సరదా కామెంట్లు చేయగా.. మరికొందరు ప్రయత్నించారు. మీ మనుమరాలిని అడగండి బిగ్ బీ అని ఒకరు.. సమాధానం చెప్పండి సర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. ఒకరిద్దరు సరైన జవాబు చెప్పారు. అయితే, వాటిల్లో ఒక అభిమాని చెప్పిన వినూత్నమైన ఆన్సర్ బిగ్ బీని ఆకట్టుకుంది. అమితాబ్ సినిమా పాటను షేర్ చేసిన సదరు అభిమాని.. జవాబు ఇదే అని చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ అంటూ బిగ్ బీ అతన్ని అభినందించాడు.
ఇంతకూ ఆ పజిల్‌కు మీరు కూడా ఆన్సర్ ఇస్తారా..!
T 3442 - GUESS .. ??? pic.twitter.com/wACvs0GsJa
— Amitabh Bachchan (@SrBachchan) February 16, 2020
Comments
Please login to add a commentAdd a comment