అమితాబ్‌ త్రో బ్యాక్‌ ఫొటో వైరల్‌.. | Amitabh Bachchan Shares Throwback Picture Viral On Social Media | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ త్రో బ్యాక్‌ ఫొటో వైరల్‌..

Published Tue, Dec 1 2020 2:44 PM | Last Updated on Tue, Dec 1 2020 5:17 PM

Amitabh Bachchan Shares Throwback Picture Viral On Social Media - Sakshi

ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో బిగ్‌బీ ఆయనకు సంబంధించిన ఓ త్రో బ్యాక్‌( పాత ఫొటో)ను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిని ‘సినిమాలో స్టైలిష్‌ ఫోటో షాట్, టైటిల్‌ ఉన్నప్పటకీ కొన్నిసార్లు అవి ప్రేక్షకుల ముందు రాకపోవచ్చు. అలాంటి చిత్రంలోనిదే ఈ ఫొటో’ అని ఆయన కాప్షన్‌‌ జత చేశారు. ఈ ఫొటోలో బిగ్‌బీ జాకెట్, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించి చేతిలో తుపాకీతో సీరియస్‌ లుక్‌లో కనిపించారు.

అయితే ఈ ఫొటో ఏ చిత్రంలోనిదో మాత్రం అమితాబ్‌ వెల్లడించలేదు. కానీ ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఫొటో ఏ సినిమాలోనిదో తెలుసుకునేందుకు నెటిజన్‌లు ప్రయత్నిస్తున్నారు. కాగా అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా వ్యహరిస్తున్న పాపుల‌ర్ టెలివిజ‌న్ గేమ్ షో కౌన్‌ బనేగా క‌రోడ్‌ప‌తి(కేబీసీ) 12వ సీజన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో కంటెస్టెంట్స్‌ ఎన్నడూ లేని విధంగా కఠిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కోటీ రూపాయలు గెలుచుకుంటున్నారు. ఇక బిగ్‌బీ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement