ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటిస్తారన్న విషయం తెలిసిందే. ఎంత వయసొచ్చిన తనదైన మార్క్ విలక్షణ నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆయన ఓ సినిమాలో పాప్ ప్రపంచ రారాజు మైకెల్ జాక్సన్‌ను ప్రతిబింబించడంలో ఫేయిల్ అయినట్లు తెలిపారు. తరచు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అమితాబ్ తన వృతిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అమితాబ్ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ‘దర్శకుడు మన్మోహన్ దేశాయ్ ‘గంగా జమునా సరస్వతి’ చిత్రంలో నేను మైకెల్ జక్సన్‌లా కనిపిస్తానని ఆయన అనుకున్నారు. కానీ, నేను విఫలం అయ్యాను’ అని కామెంట్ జత చేశారు.
అమితాబ్-మన్మోహన్ దేశాయ్ కలయికలో కూలీ, మార్డ్, పర్వారిష్, అమర్ అక్బర్ అంటోనీ, నసీబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి-12కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్రా’, అజయ్ దేవ్‌గన్ దర్శకతం వహిస్తున్న ‘మేడే’ సినిమాల్లో కనిపంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment