ముంబై: కరోనా భూతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎక్కువగా ఆధారపడే సోషల్ మీడియాలోనూ వారిని చైతన్యం చేసే పోస్టులు చేస్తున్నారు. తాజాగా ముంబై పోలీసులు ఓ పజిల్‌ను పోస్ట్ చేశారు. దాన్ని పరిష్కరించి అందులో ఉన్న అర్థాన్ని కనుక్కోండి.. అంటూ నెటిజన్లు చాలెంజ్ విసిరారు. ఇదేమంత కఠినం కాదని సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ముంబైవాసులకు ఇదేంటో తప్పకుండా తెలుస్తుందని పేర్కొన్నారు. (ఇందులో మాస్కు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించండి)
ఆ పోస్ట్‌లో ఎమోజీలను ఓ క్రమ పద్ధతిలో పేర్చి అందులో అర్థవంతమైన సందేశాన్ని ఇనుమడింపజేశారు. ఇంతకీ మీకు అర్థమైందా? లేదా? లేక అర్థమయూ.. కానట్టు ఉందా? ఇప్పటికీ దాని అసలు అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఇది చదివేసేయండి. "ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనికి వెళ్లండి, ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు ఇంట్లోనే ఉండండి." పోలీసుల ఆలోచన అదిరింది కదూ! కరోనా బారిన పడకుండా ఈ నియమాన్ని పాటించమని చెప్పకనే చెప్తున్నారు. పోలీసులు సందేశాన్ని ఇచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!)
Comments
Please login to add a commentAdd a comment