పిల్లి, మనుషుల పెంపుడు జంతువు. కొందరికి పిల్లి అంటేనే గిట్టదనుకోండి, అది వేరే విషయం. ప్రపంచవ్యాప్తంగా 33 రకాల జాతుల పిల్లులున్నాయి. కానీ ఏ జాతి పిల్లికైనా మనిషికి తగ్గట్టు నడిచే స్వభావం పుట్టుకతోనే ఉంది. యజమానుల ముందు అమాయకంగా ఉంటూ, గెంతులేస్తుంటాయి. ఇతరుల ముందు రాజసంగా నడుస్తూ తిక్క వేషాలు కూడా వేస్తుంటాయి. దొంగలా పక్కింట్లోకి దూరి పాలు తాగి ఏమీ ఎరగనట్టుగా నటిస్తాయి. ఇంతకీ ఈ పిల్లి గోలంతా ఎందుకనుకుంటున్నారా? మరేం లేదు. పైన ఫొటోలో ఓ పిల్లి దాగుంది. మీకు దొరకనంటూ సవాలు విసురుతోంది. ఎక్కడ దాగున్నానో మీరు కనుక్కోలేరని వెక్కిరిస్తోంది. (చదవండి: బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ..)
ఆ మార్జాలాన్ని పట్టేసుకుందామని ఎందరో నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. కొందరు అసలు ఆ గదిలో పిల్లి ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తుండగా మరికొందరు వెతకలేక చస్తున్నాన్రా దేవుడా అని కామెంట్లు పెడుతున్నారు. అతి కొద్ది మంది మాత్రం పావుగంట తర్వాత అది పట్టుబడిందోచ్ అని సంబరపడుతున్నారు. అది మామూలు పిల్లి కాదని, నల్ల పిల్లి అని చెప్తున్నారు. దాన్ని రాత్రిపూట చూస్తే భయంతో చచ్చిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీకు ఆ పిల్లి కనిపించిందా? లేదా? దొరక్కపోతే ఆ మార్జాలాన్ని కింద ఫొటోలో చూసేయండి. (చదవండి: వార్నీ, పిల్లి డ్రామా మామూలుగా లేదు)
Comments
Please login to add a commentAdd a comment