
ఒరేగాన్: సాధారణంగా ఇంట్లోకి ఎవరిని రానీయకుండా పెంపుడు కుక్కలను కాపలా పెట్టి 'కుక్క ఉంది జాగ్రత్త' అని బోర్డు తగిలించడం గమనిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఒక మహిళకు తన పెంపుడు పిల్లి చర్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోని వస్తువులు ఆమెకు తెలియకుండానే తీసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా చేతికి వేసుకునే గ్లౌజులు, మాస్క్‌లు పిల్లి నోట కరచుకొని పక్కింట్లో పడేయడం గమనించింది. దీంతో ఎలాగైనా పిల్లిని కట్టడి చేయాలని సదరు యజమాని ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.
తన ఇంటి వరండా భాగంలో ''నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. దానితో జాగ్రత్తగా ఉండండి.'' అని బోర్డు తగిలించింది.ఒకవేళ పిల్లి వస్తువులను దొంగతనంగా తీసుకెళ్లినా.. పక్కింటివాళ్లు ఇంటి బయట ఉన్న బోర్డును గమనించి వస్తువులు ఆమెకు తిరిగి ఇవ్వడం ప్రారంభించారు.కాగా పెంపుడు పిల్లిపై మహిళ ప్లాన్ వర్క్‌వుట్ కావడంతో మిగతావాళ్లు కూడా అదే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది?
10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం
Sign of the day. pic.twitter.com/fgr0vC4Z0O
— Dick King-Smith HQ (@DickKingSmith) June 10, 2021