sign board
-
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
బెంగళూరు: బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. "నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్ప్లేట్లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు. కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.' అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు. ఇదీ చదవండి: Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు? -
పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు
వైరల్: పబ్లిక్ పార్క్‌లు ఉండేది ఎందుకు? ‘ఇదేం ప్రశ్న.. ప్రజల అవసరాల కోసం.. కాలక్షేపం చేసేందుకు’ అనేగా మీ సమాధానం. కానీ, కొన్ని పార్కుల నిర్వాహకులు మాత్రం ప్రాంగణంలో ఫలానా పనులు చేయకూడదంటూ నిషేధం విధిస్తుంటాయి. కానీ, ఇక్కడో పార్క్ చిత్రవిచిత్రంగా సైన్ బోర్డు ఉంచింది. అది చూసి ఖంగుతినడం ప్రజల వంతు అవుతోంది. ఈ పార్క్‌లో జాగింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు.. అంతెందుకు యాంటీ క్లాక్ వైజ్‌గా(రివర్స్‌లో) వాకింగ్ కూడా చేయకూడదు అంటూ బోర్డు ఉంచింది బీబీఎంపీ. బీబీఎంపీ అంటే బృహత్ బెంగళూరు మహానగర పాలికె. అంటే బెంగళూరులో ఈ పార్క్, సైన్ బోర్డు పెట్టారన్నమాట. ప్రముఖ కంటెంట్ సైట్ రెడ్డిట్‌లో ఓ యూజర్ దీనిని షేర్ చేశారు. ఇవాళే ఈ బోర్డును చూశా అంటూ ఓ యూజర్ దీనిని రెడ్డిట్‌లో వదిలాడు. ఈ బోర్డును ఏ ఏరియాలో ఏర్పాటు చేశారో తెలియదుగానీ.. ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది ఈ బోర్డు. అలాంటప్పుడు ఆ పార్క్‌లో ఏం చేయాలని ఆ బోర్డు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు పలువురు. ఇంకొందరైతే వాకింగ్, జాగింగ్ కాకపోతే నాగిని డ్యాన్స్ చేయాలా? ఏంటి ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పాకాలని, ఇంకొందరు రివర్స్‌లో పాకితే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి డౌటనుమానాలతో వాళ్లు నవ్వులు పంచుతున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. బెంగళూరు నుంచి ఇలా సైన్ బోర్డు వైరల్ కావడం తొలిసారేం కాదు. గతంలో ఓ ఇంటి ముందు నో పార్కింగ్ బోర్డు కూడా ఇలాగే వైరల్ అయ్యింది. -
మరాఠీ బోర్డులపై మొదలైన వివాదం
సాక్షి, ముంబై: దుకాణాల బోర్డులు మరాఠీలోనే రాయాలని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం రాజుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవైపు ఈ ఘనత తమదేనంటూ, ఇతరులు దక్కించుకునే ప్రయత్నం చేయవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) స్పష్టం చేసింది. మరోపక్క పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇటు వ్యాపార పరంగా అటు రాజకీయంగా మరాఠీ బోర్డుల వివాదం రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని, ఆ తర్వాత వాటికింద ఇతర భాషల్లో లేదా మీకు నచ్చిన భాషల్లో రాయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తేమి కాదని, గతంలోనే తమ పార్టీ మరాఠీ బోర్డుల అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అంతటితో ఊరుకోకుండా 2008, 2009లో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఇతర భాషల్లో రాసిన బోర్డులపై నల్లరంగు లేదా తారు పూసి ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలో భాగంగా ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లి శిక్ష అనుభవించారు. దీంతో దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ, వంద శాతం అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. ఇప్పుడు అదే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి కీర్తి దక్కించుకునే ప్రయత్నం మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం చేస్తోందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. మరాఠీ బోర్డుల ఘనత కేవలం తమదేనని, ఇతరులు దీన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి రాసిన లేఖలో హెచ్చరించారు. ఇతరులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తే తమ కార్యకర్తలు మళ్లీ రోడ్డుపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న మరాఠీ భాషలోనే బోర్డుల నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. బీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆఘాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. వ్యాపార సంఘటనల వ్యతిరేకత... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి. దుకాణాల బోర్డులు మరాఠీలో రాయాలనే అంశాన్ని తము వ్యతిరేకించడం లేదని, మరాఠీ అక్షరాలు పెద్దగా ఉండాలని, దాని కింద ఇతర భాషల్లో రాయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫెడెరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విరేన్ షా పేర్కొన్నారు. ముంబైలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలకు చెందిన ప్రజలుంటారు. ముఖ్యంగా కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు షాపులున్న ప్రాంతాల్లో ఎక్కువశాతం ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలుంటారో ఆ భాషలో బోర్డులు రాయాల్సి ఉంటుంది. పెద్ద అక్షరాలతో పైన మరాఠీలో రాసి, చిన్న అక్షరాలతో కింద రాస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులంటున్నారు. మరాఠీ భాష అంటే తమకు అభిమానమే, కానీ, మరాఠీ అక్షరాలకంటే ఇతర భాషల అక్షరాలు చిన్నగా ఉండాలనే నియమాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తాజాగా అమలుచేసిన ఆంక్షల ప్రభావం వ్యాపార లావాదేవీలపై తీవ్రంగా చూపుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దుకాణాల బోర్డు మార్చాలంటే కనీసం రూ.20–30 వేల వరకు ఖర్చవుతుంది. దీంతో ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే వరకు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాపార సంఘటనలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకులు, రైల్వే, ఎయిర్ పోర్టు, బీమా సంస్థల సంగతేంటి? గత బుధవారం జరిగిన మంత్రి మండలిలో దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డు మరాఠీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, బ్యాంకులు, ఎయిర్ పోర్టు, రైల్వే, గ్యాస్, పెట్రోలియం, పోస్టల్, మెట్రో, మోనో, టెలిఫోన్, బీమా కంపెనీల బోర్డుల గురించి వెల్లడించలేదు. వీటి సంగతేంటనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలున్నాయి. నియమాల ప్రకారం కేంద్రం, కేంద్రానికి అనుబంధంగా ఉన్న సంస్థల బోర్డులు తొలుత హిందీలో, ఆ తరువాత స్థానిక భాషను బట్టి ఆ భాషలో రాయాల్సి ఉంటుంది. కానీ, మహరాష్ట్రలో మరాఠీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని దుకాణాలు, వ్యాపారం, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ మరాఠీలో రాయాలని మొన్నటి వరకు ఎమ్మెన్నెస్, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తునేది వేచిచూడాలి. -
'నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. జాగ్రత్తగా ఉండండి'
ఒరేగాన్: సాధారణంగా ఇంట్లోకి ఎవరిని రానీయకుండా పెంపుడు కుక్కలను కాపలా పెట్టి 'కుక్క ఉంది జాగ్రత్త' అని బోర్డు తగిలించడం గమనిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఒక మహిళకు తన పెంపుడు పిల్లి చర్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోని వస్తువులు ఆమెకు తెలియకుండానే తీసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా చేతికి వేసుకునే గ్లౌజులు, మాస్క్‌లు పిల్లి నోట కరచుకొని పక్కింట్లో పడేయడం గమనించింది. దీంతో ఎలాగైనా పిల్లిని కట్టడి చేయాలని సదరు యజమాని ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తన ఇంటి వరండా భాగంలో ''నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. దానితో జాగ్రత్తగా ఉండండి.'' అని బోర్డు తగిలించింది.ఒకవేళ పిల్లి వస్తువులను దొంగతనంగా తీసుకెళ్లినా.. పక్కింటివాళ్లు ఇంటి బయట ఉన్న బోర్డును గమనించి వస్తువులు ఆమెకు తిరిగి ఇవ్వడం ప్రారంభించారు.కాగా పెంపుడు పిల్లిపై మహిళ ప్లాన్ వర్క్‌వుట్ కావడంతో మిగతావాళ్లు కూడా అదే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం Sign of the day. pic.twitter.com/fgr0vC4Z0O — Dick King-Smith HQ (@DickKingSmith) June 10, 2021 -
ఇక ఆ స్టేషన్ల పేర్లు ఉర్ధూ స్ధానంలో సంస్కృతంలో...
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ల నేమ్ బోర్డులు ఇక ఉర్ధూ స్ధానంలో రాష్ట్రంలో రెండో అధికార భాష సంస్కృతంలో దర్శనమివ్వనున్నాయి. హిందీ, ఇంగ్లీష్ తర్వాత ఆయా రాష్ట్రాల్లో రెండో అధికార భాషలోనే రైల్వే స్టేషన్ల ఫ్లాట్‌ఫాం సైన్బోర్డ్స్పై పేర్లు ఉండాలన్న రైల్వే మ్యాన్యువల్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ దీపక్ కుమార్ వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం సైన్బోర్డ్స్పై పేర్లనీ హిందీ, ఇంగ్లీష్, ఉర్ధూ స్దానంలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో రాయనున్నారు. ఉత్తరాఖండ్‌లో సంస్కృతం రెండో అధికార భాష కావడంతో రాష్ట్రంలో రైల్వేస్టేషన్లలోని సైన్బోర్డులపై సంస్కృతం భాషలో ఆయా స్టేషన్ల పేర్లు చేర్చుతామని ఆయన తెలిపారు. కాగా, ఉత్తరాఖండ్ యూపీలో భాగంగా ఉన్న క్రమంలో గతంలో రైల్వే స్టేషన్ల పేర్లు ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్ధూలో వ్యవహరించారు. -
కామెడీ కార్పెట్
జీవితంలోని హాస్యాన్ని నలుగురికీ పంచుతుండే ప్రముఖ సామాన్యురాలు షబానా అజ్మీ. బహుశా ఈ స్వభావం ఆమెకు ఆమె తండ్రి కైఫీ అజ్మీ నుంచి వచ్చి ఉండాలి. ఆయనా అంతే, మానవ తప్పిదాల వల్ల ఒనగూడే స్వల్ప ఆనందాలను అప్పుడప్పుడూ ఆయన తన కవిత్వంలోంచి ఒంపి ప్రపంచానికి పంచుతుంటారు. షబానా గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. అదొక సైన్బోర్డ్ ఫొటో. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్లు 2015లో ముంబై విమానాశ్రయంలో పెట్టిన బోర్డ్ అది. అప్పుడు దాన్ని ఫొటో తీసుకుని ఉంచుకున్నారో ఏమో.. షబానా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. వెంటనే వేల లైకులు, కామెంట్స్ వచ్చి పడ్డాయి. సైన్బోర్డ్ వైరల్ అవడం మొదలుపెట్టింది. అందులో ఇంగ్లిష్ లో ‘ఈటింగ్ కార్పెట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్’ అని ఉంది. షబానాకు ఏమీ అర్థం కాలేదు. ‘కార్పెట్‌ను తినడం నిషిద్ధం’ అని రాశారేమిటి అనుకున్నారు. తర్వాత పైన హిందీలో ఉన్న నిషిద్ధాన్ని చదివారు. ఫర్శ్ పర్ ఖానా సఖ్త్ మనా హై... (కార్పెట్ మీద తినడం నిషిద్ధం) అని ఉంది. అప్పుడు కానీ షబానాకు విషయం అర్థం కాలేదు.. ‘కార్పెట్‌పై పడేలా తినకూడదు’ అని దాని భావం అని. అప్పటి ఆ ఫొటోను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘రియల్లీ’ అని కామెంట్ పెట్టారు షబానా. ఎప్పుడూ సేవాకార్యక్రమాల్లో ఉండే షబానా.. ఇలాంటివి కనిపించినప్పుడు, గుర్తొచ్చినప్పుడు సరదాగా షేర్ చేస్తూ ఉంటారు. -
ప్రమాదాల కొండ
నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలోనే రామతీర్థానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఏడాదికి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తోంది.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా భద్రాద్రిగా కూడా చరిత్రకు ఎక్కాల్సిన సమయంలో వివిధ కారణాలతో ఒంటిమిట్టకు ఆ అవకాశం వెళ్లిపోయింది. అయినప్పటికీ రామతీర్థంలో కూడా అధికార లాంచనాలతో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వేడుకగా జరిపిస్తున్నారు... కార్తీకమాసం, తిరుక్కల్యాణం, రథయాత్ర, మహా శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. క్షేత్రం పక్కనే ఉన్న బోడికొండ వల్లే రామతీర్థానికి ఇంతటి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రాశస్త్యం ఉన్న బోడికొండ నిర్లక్ష్యపు నీడలో ఉంది. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బోడికొండపై హెచ్చరికబోర్డులు లేకపోవడంతో భక్తులు తికమకపడుతున్నారు. అలనాటి చిహ్నాలను చూసేందుకు.... క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతమే బోడికొండ. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించిన చిహ్నములున్నాయి. అలాగే పర్వతాగ్రమున కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ (నీటి కొలను) ఉంది. ఈ నీటి మడు గు నుంచి పడమర దిశగా ఇరుకురాయి ఉంటుం ది. దాని మధ్యగుండా వెళితే.. అలనాడు భీముడు వంట చేసిన ప్రదేశం కనిపిస్తుంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉంది. అలాగే పాండవులు ధరించిన పంచెలు, సీతమ్మవారి పురిటి మంచం, తదితర చిహ్నా లు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహాలు కూడా ఉన్నాయి. ఈ చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు ప్రతినిత్యం అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళ్తుంటారు. అయి తే కొండ ప్రమాదకరంగా ఉండడంతో ఎటు నుం చి ఎటు వెళ్లాలి...ఎక్కడ ప్రమాదకరం... ఎక్క డ జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే బోర్డులు లేవు. పొంచి ఉన్న ప్రమాదం.. కోదండరామస్వామి ఆలయం పక్కనే ఉన్న నీటికొలను లోతు ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రాంతం వద్ద దేవదాయ శాఖాధికారులు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. గతంలో ఇక్కడ బోర్డులుండేవి. గాలులకు పడిపోయిన తర్వాత ఎవ్వరూ మళ్లీ ఏర్పాటు చేయలేదు. భీముని గుడికి వెళ్లే మెట్ల మార్గం వద్ద.. సీతమ్మ పురిటి మంచం వద్ద మెట్లు దిగే ప్రాంతంలో సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడే అదుపు తప్పి ఎంతోమంది పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ దేవస్థాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి .. బోడికొండపై హెచ్చరికబోర్డులు, సూచిక చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రెయిలింగ్ ఏర్పాటు చేస్తే మంచిందే కానీ ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. భక్తులు కూడా సహకరించాలి. బోడికొండపైకి చేరుకుంటున్న భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. దారి తప్పితే సాహసాలు చేయకుండా వచ్చిన రహదారినే తిరిగి ఆశ్రయించాలి.. ఎన్వీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ కమీషనర్, దేవదాయశాఖ. -
బుమ్రా ఎందుకిలా చేశాడు?
దుబాయ్: తనను పరిహాసం చేసిన పోలీసులకు ఆటతోనే బదులిచ్చాడు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు. పోస్టర్లపై తనను అవమానించిన వారికి తగిన విధంగా జవాబిచ్చాడు. @traffic_jpr well done Jaipur traffic police this shows how much respect you get after giving your best for the country. pic.twitter.com/y0PU6v9uEc — Jasprit bumrah (@Jaspritbumrah93) June 23, 2017 అసలేం జరిగింది? గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్ వేయడంతో పాక్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన అతడు సెంచరీ(114)తో చెలరేగాడు. తుదిపోరులో 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి టీమిండియా టైటిల్ చేజార్చుకుంది. సీన్ కట్ చేస్తే బుమ్రా నోబాల్ ఫొటోను జైపూర్ ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్‌గా వాడుకున్నారు. ‘లైను దాటకండి. లైను దాటితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’ని ఈ ఫొటోలో హోర్డింగ్‌లు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లకు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థమైందని అప్పట్లోనే ట్విటర్లో బుమ్రా ఆవేదన వెలిబుచ్చాడు. ఇప్పుడేమైంది? బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. ట్రోఫి పట్టుకుని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన తనను అవమానించిన వారికి బుమ్రా బదులిచ్చాడు. ‘కొంత మంది తమ సృజనను సైన్ బోర్డుల మీద చూపించడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఇదే నా సమాధానం’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా జరిగిన ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 సగటుతో 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంతో తనవంతు పాత్ర పోషించాడు. Some people love to use their creativity on the sign boards. Hope this one fits there as well!! 😁💪#Champions#AsiaCup2018 #lionalwaysroars🦁 pic.twitter.com/VWiJidwmaA — Jasprit bumrah (@Jaspritbumrah93) September 28, 2018 -
ఎయిర్‌పోర్టులో మరో మైలురాయి
శంషాబాద్:పర్యావరణ హితంగా అడుగులు వేస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు మరో ముందడుగు వేసింది. విమానాశ్రయాన్ని వందశాతం ఎల్ఈడీ వెలుగులతో నింపినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సంస్థ ప్రకటించింది. ఆరునెలల కిందట ఆరవైశాతం ఎల్ఈడీ దీపాలను అమర్చిన జీఎంఆర్ సంస్థ తాజాగా ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఉన్న సైన్ బోర్డులను సైతం పూర్తి స్థాయిలోకి ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఫ్లోరోసెంట్ దీపాలు ఉన్న చోట్ల మొత్తం 350 ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఈ దీపాలను కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అమర్చారు. ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న ఈ సైన్ బోర్డులు రాత్రి సమయాలతో పాటు ఉదయం వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతో పాటు వాటిని పార్కింగ్ చేసేందుకు సూచికలుగా ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. వందశాతం ఎల్ఈడీ ఏర్పాటుతో ఎయిర్‌పోర్టులో ఏటా 45 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కర్బన రహితంగా ఉండడంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. పర్యావరణ హితంగా ఎయిర్‌పోర్టు ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుందని ఈ సందర్భంగా సీఈఓ ఎస్జీకే కిషోర్ అన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టును వందశాతం ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం మరో మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే పగటి సమయాల్లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. -
ఒడియాలోనే సైన్‌బోర్డులు
బరంపురం: ఒడిశా ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి అన్ని వ్యాపార సంఘాల దుకాణాల బోర్డులు ఒడియా భాషలోనే ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో స్పష్టం చేశారు. గంజాం చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక కొమ్మబాల వీధిలో గల కార్యాలయంలో 50వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వీవీ రామ నరసింగ రావు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి సూర్జో పాత్రో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తచట్టాన్ని అమలు చేసిందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యేక ఒడిశా అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం అనుసారంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి వ్యాపార దుకాణం ముందు వ్యాపార బోర్డులపై మాతృ భాష ఒడియాలోనే పేర్లు ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా తప్పని సరిగా ఒడియా భాషలో బోర్డుల్లో పేరు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో గల కలెక్టరేట్ కార్యాలయాల నుంచి అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో కూడా ఒడియా భాషలోనే బోర్డులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్లకు ఒడియా భాషలోనే లేఖలు, కరస్పాండింగ్ చేయగలరని లేఖలో కూడా కింద ఒడియా భాషలో తప్పనిసరిగా సంతకం ఉండాలని స్పష్టం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసిన కరస్పాండింగ్ లేఖలు మాత్రం ఆంగ్లంలో ఉంటాయని అన్నారు. తెలుగులో కూడా బోర్డులు ఇదే విధంగా రాష్ట్రంలో 4.17 కోట్ల మంది జనాభా ఉన్నా వారిలో రెండో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్న ఊళ్లలో మాత్రం తెలుగులో కూడా బోర్డులు అమర్చగలరని చెప్పారు. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉల్లి, బంగాళా దుంపల ధరలు పెరగనున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా బంగాళాదుంపలు, ఉల్లిపాయల నిల్వలు ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని చెప్పారు. వ్యాపారస్తులు ఆన్లైన్ బిల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి సక్రమంగా పన్ను చెల్లించాలని కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ వల్ల జాతీయ రహదారులలో చెక్‌పోస్ట్‌లు ఎత్తివేశామని అన్నారు. ఉత్తమ వ్యాపారస్తులకు సన్మానం అనంతరం గంజాం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వావీ రామ నరసింగ రావు కొత్తగా సంఘంలో చేరిన, ప్రభుత్వానికి సక్రమంగా, సరైన పన్ను చెల్లించిన ఉత్తమ వ్యాపారస్తులను పేరుపేరున పిలవగా మంత్రి సూర్జో పాత్రో వారికి గౌరవ సన్మానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్ సాహు, గౌరవ అతిథి మనోజ్ కుమార్ పాఢితో సహా జిల్లాలో గల వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘రోడ్డు’పై సూచిక బోర్డులెక్కడ.?
తల్లాడ : నిత్యం రద్దీగా ఉండే రాష్ట్రీయ రహదారిలో సూచిక బోర్డుల ఏర్పాటులో ఆర్అండ్బీ అదికారులు తగిన శ్రద్ధ వహించడం లేదు. దీంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రీయ రహదారిలో వివిధ పట్టణాలను, వాటి దూరాన్ని సూచించే బోర్డులు లేక వాహనదారులు తికమక పడుతున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన బోర్డులు శిథిలావస్థకు చేరి పాడై పోయాయి. గతంలో కిలోమీటరుకు కోటి రూపాయల చొప్పున వరగంల్ నుంచి దేవరపల్లి వరకు రాష్ట్రీయ రహదారిని అభివృద్ధి చేశారు. రోడ్డును అభివృద్ది చేసిన తర్వాత ఆర్అండ్బీ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి వాహనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే ఏళ్లు గడవటంతో అవి గాలి, వాన, ఎండలకు దెబ్బతిన్నాయి. వాటి ఫోల్స్ కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. తల్లాడ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి హైరరాబాద్ వైపు వెళ్లాలంటే పక్కనే సత్తుపల్లి రోడ్డు ఉంటుంది. ఇక్కడ వాహనాదారులు తికమక పడి ఒక్కోసారి సత్తుపల్లి రోడ్డులో కొద్దిదూరం వెళ్లిన తర్వాత వాహనం ఆపుకొని స్థానికులను అడిగి తెలుసుకొని మళ్లీ వారు వెళ్లాల్సిన రూటుకు పయనిస్తున్నారు. దీంతో సమయం, ఆయిల్ వృథా అవుతోంది. అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఖమ్మం వైపు నుంచి భద్రాచలం వెళ్లాలంటే సత్తుపల్లి, భద్రాచలం రోడ్ల వద్ద ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతున్నారు. సత్తుపల్లి వైపు నుంచి వచ్చే ఇతర జిల్లాలు, రాష్ట్రాల వాహనదారులు కూడా తల్లాడ రింగ్ రోడ్ సెంటర వద్ద ఆలోచించాల్సి వస్తోంది. రాష్ట్రీయ రహదారిలో నాగాపూర్, విశాఖపట్టణం, చత్తీస్ఘడ్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, వంటి సుదూర ప్రాంతాల నుంచి లారీలు సరుకులతో రాత్రివేళ వెళ్తుంటాయి. సూచించే బోర్డులు సరిగా లేకపోవటంతో అసౌకర్యం కలుగుతోంది. -
బోర్డులపై ‘ఉపాధి’ వివరాలు
భైంసా(ముథోల్) : ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పారదర్శకత కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సామాజిక తనిఖీలు పకడ్బందీగా నిర్వహిస్తుండగా, మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చింది. ఏటా గ్రామసభలు, మండలస్థాయిలో సామాజిక తనిఖీలు, జియో ట్యాగింగ్ చేపడుతోంది. ఇప్పుడు చేసిన పనులు మళ్లీ చేయకుండా వివరాలతో కూడిన బోర్డులను క్షేత్రస్థాయిలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాలకు ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలు తెలుపుతూ రాసిన బోర్డులను పంపించింది. ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,53,551 జాబ్‌కార్డులను అందించింది. 3,20,829 మంది కూలీలు పని చేశారు. 40లక్షలకుపైగా పని దినాలు పూర్తిచేసిన కూలీలకు వేతనం కింద రూ.63.23కోట్లు చెల్లించారు. చేపడుతున్న అభివృద్ధి పనులు.. ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన పనులే అధికంగా చేస్తున్నారు. ఇంకుడుగుంతలు, నీటి కుంటలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పూడిక తొలగింపు, మట్టిరోడ్ల మరమ్మతుతోపాటు హరితహారం కింద మొక్కలు నాటుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల వివరాలు తెలుపుతూ ఇప్పటికే అధికారులు గ్రామాల్లో గోడలు నిర్మించి అందులో వివరాలు నమోదు చేశారు. చాలాచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సూచిక బోర్డులు.. ఇప్పటివరకు ఇలా బోర్డుల ద్వారా ప్రదర్శించిన అధికారులు ఇక పనులను బట్టి సూచికలను మూడు రకాలుగా ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మట్టి పనుల వివరాలపై ఒక్కో బోర్డుకు రూ.350 ఖర్చుచేసి అందులో వివరాలు రాయనున్నారు. ఇలా వివరాలతో రాసిన బోర్డును పనులు జరిగిన ప్రదేశం వద్దనే ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, కుంటల్లో పూడికతీత, రహదారుల నిర్మాణం, హరితహారం, నీటి నిల్వ గుంత, ఇంకుడుగుంతలు వంటి పనుల వివరాలు రూ.2వేల వ్యయంతో రాతి పలకంపై రాసి పని జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామం మొత్తంలో జరిగిన పనుల వివరాలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలందరికీ తెలిసేలా గ్రామ సమాచార బోర్డుల పేరుతో గోడలపై రూ.3వేలు ఖర్చుచేసి రాయించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఈప్రక్రియ ప్రారంభమైంది. ఆయా బోర్డుల్లో ఎనిమిది నుంచి పది రకాల సమాచారం రాయిస్తున్నారు. పనిపేరు, గుర్తింపు సంఖ్య, చేసిన ప్రదేశం, అంచనా విలువ, కూలీల వివరాలు, వ్యయం, సామగ్రి వ్యయం, చేసిన పని దినాలు, ప్రారంభం, ముగింపు తేదీ తదితర విషయాలన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. దీంతో చేసిన పనులు మళ్లీ చేసేందుకు వీలుపడదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏవైన అనుమానాలుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా బోర్డుపైనే టోల్‌ఫ్రీ నంబర్లు రాయిస్తున్నారు. రికార్డుల నిర్వహణ బాధ్యత.. ఉపాధిహామీలో పనిచేసే ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు కీలకబాధ్యతలు అప్పగిస్తున్నారు. పనుల గుర్తింపు మస్టర్లు వేయడానికే పరిమితం కాకుండా మరింత బాధ్యతను ఇస్తున్నారు. ఉపాధికి సంబంధించి ఏడు రకాల దస్త్రాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దస్త్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండనుంది. పనులు, గ్రామసభలు, కూలీలు, ప్రతిపాదనలు, పనుల గుర్తింపు, ఖర్చు, వేతనాలు, చెల్లింపులు, ఫిర్యాదులు తదితర వివరాలన్నింటినీ ఇకపై ఈ సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రికార్డుల పర్యవేక్షణ టీఏలు, ఏపీవోలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెల మూడో బుధవారం గుడ్‌గవర్నెస్ నిర్వహణపై సమావేశం ఏర్పాటుచేసి పనుల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ నూతన విధానంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరిగినప్పుడు నోటిమాటలతో తప్పుడు లెక్కలు చెప్పే వీలుండదు. రికార్డుల రూపంలో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధానంతో ఉపాధిహామీ పనులు రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా మారి దుర్వినియోగం, అవినీతిని నివారించే అవకాశం ఉంటుంది. పారదర్శకంగా పనులు ఉపాధిహామీ పథకం అమలుకు జిల్లావ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అన్నిచోట్ల పారదర్శకంగానే పనులు నడుస్తున్నాయి. ఉపాధి సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉంది. ఇప్పటికే చేసిన పనులపై గ్రామాల్లో కూడళ్ల వద్ద, బోర్డులపై రాయించడం జరిగింది. ఇక పనుల వివరాలు తెలుపుతూ క్షేత్రస్థాయిలోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీవో -
న్యూ ఇయర్ అర్థరాత్రి హాలీవుడ్‌కు షాక్
-
న్యూ ఇయర్ అర్థరాత్రి హాలీవుడ్‌కు షాక్
లాస్ఎంజెల్స్: హాలీవుడ్ పేరు మారింది. అది కూడా నూతన సంవత్సరం రోజే.. ఇది చూసినవాళ్లంతా కూడా అవాక్కయ్యారు. రాత్రికి రాత్రి ఇలా ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే లాస్ ఎంజెల్స్ వెళ్లినవారందరికీ తొలుత దర్శనం ఇచ్చేది హాలీవుడ్ అంటూ పెద్ద సైన్ బోర్డు. హాలీవుడ్ స్టూడియోకి స్వాగతం పలుకుతూ అది కనిపిస్తుంటుంది. అయితే, నూతన సంవత్సరం రోజున తెల్లవారిన తర్వాత లాస్ ఎంజెల్స్ ప్రజలు, స్టూడియో వాళ్లు ఒక్కసారిగా ఆ బోర్డు వైపు చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ బోర్డు పేరు కాస్త హాలీవీడ్గా మారిపోయింది. ఓ అనే ఆంగ్ల అక్షరం ఉండాల్సిన చోట్ల ఈ అనే అక్షరాలు వచ్చిచేరాయి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రకారం ఓ వ్యక్తి కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అర్ధరాత్రి రెండుగంటల ప్రాంతంలో ఆ అక్షరాలను ఓ ఆకతాయి మారుస్తున్నట్లు రికార్డయింది. అయితే, పోలీసులు మాత్రం అసలు ఇది ఎలా సాధ్యం అయిందో అర్ధం కావడం లేదని, అప్పుడు జోరు వాన, పైగా చీకటి ఉందని ఆ సమయంలో ఆ వ్యక్తి అలా చేశాడో తెలియడం లేదని అంటున్నారు. ఆదివారం ఉదయం 11గంటల వరకు కూడా హాలీవుడ్ అనే పేరు హాలీవీడ్గానే ప్రజలకు దర్శనం ఇచ్చింది. ఈ పేరును మార్చడానికి ఆ వ్యక్తి నల్లటి టార్పాన్లను ఉపయోగించాడు. అయితే, ఈ పేరులోని కొన్ని అక్షరాల్లో కొన్ని చోట్ల సెన్సార్లు ఉన్నాయని, వాటిని తాకగానే పోలీసులకు అలారం వెళుతుందని, కానీ మార్చిన వ్యక్తి మాత్రం సెన్సార్లను తాకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. -
కలెక్టర్ మాటకు పక్షం రోజులు
సిద్దిపేట టౌన్ : సర్కార్ బడుల తీరును ప్రజలు పరిశీలించడానికి తద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడానికి వీలుగా అన్ని పాఠశాలల ముందు రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ వీడియో కాన్ఫరెన్సులో 15 రోజుల క్రితం విద్యాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ వీటి నిర్మాణానికి నిధులు ఎలా వస్తాయో చెప్పలేదు. విద్యాధికారులు నిధుల విషయమై ఆర్ అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఉత్తర్వులు లేవని చేతులెత్తేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణ నిధులు కూడా విడుదల కానీ స్కూల్స్ స్పీడ్ బ్రేకర్లను, సైన్ బోర్డులను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నాయి. రూ. ఐదు కోట్ల నిధులు అనివార్యం.. సిద్దిపేట డివిజన్లో 162 హైస్కూల్స్, సుమారు 500 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లో అన్ని పాఠశాలల ముందు వీటిని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 5 కోట్ల నిధులు అనివార్యం. కానీ నిధులు ఎలా వస్తాయో తెలియక అటూ ప్రధానోపాధ్యాయులు, ఇటూ విద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని స్కూల్ గ్రాంట్స్‌తో కనీస అవసరాలనే తీర్చలేకపోతున్నామని ఈ క్రమంలో వీటిని ఎలా నిర్మిస్తామని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.