డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ల నేమ్ బోర్డులు ఇక ఉర్ధూ స్ధానంలో రాష్ట్రంలో రెండో అధికార భాష సంస్కృతంలో దర్శనమివ్వనున్నాయి. హిందీ, ఇంగ్లీష్ తర్వాత ఆయా రాష్ట్రాల్లో రెండో అధికార భాషలోనే రైల్వే స్టేషన్ల ఫ్లాట్‌ఫాం సైన్‌బోర్డ్స్‌పై పేర్లు ఉండాలన్న రైల్వే మ్యాన్యువల్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర రైల్వే సీపీఆర్‌ఓ దీపక్ కుమార్ వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం సైన్‌బోర్డ్స్‌పై పేర్లనీ హిందీ, ఇంగ్లీష్, ఉర్ధూ స్దానంలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో రాయనున్నారు. ఉత్తరాఖండ్‌లో సంస్కృతం రెండో అధికార భాష కావడంతో రాష్ట్రంలో రైల్వేస్టేషన్లలోని సైన్‌బోర్డులపై సంస్కృతం భాషలో ఆయా స్టేషన్ల పేర్లు చేర్చుతామని ఆయన తెలిపారు. కాగా, ఉత్తరాఖండ్ యూపీలో భాగంగా ఉన్న క్రమంలో గతంలో రైల్వే స్టేషన్ల పేర్లు ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్ధూలో వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment