urdu
-
ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కేటాయించిన రూ.కోట్లాది రూపాయలను ఇష్టానుసారం కొల్లగొట్టేశారు. అప్పట్లో ఉర్దూ అకాడమీకి కేటాయించిన దాదాపు రూ.30కోట్లలో ఎంత సద్వినియోగం అయ్యాయి? ఎంత అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి? అనే కోణాల్లో దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం కోరుతోంది.విజయవాడలో ఆఫీస్... కర్నూలులో బ్యాంక్ అకౌంట్ విజయవాడలో ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర కార్యాలయం ఉంది. అయితే కర్నూలులోని ఎన్ఆర్ పేట కెనరా బ్యాంకు బ్రాంచిలో ఏపీ ఉర్దూ అకాడమీ పేరుతో అకౌంట్ (33941010001054)ను తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు. ఉర్దూ అకాడమీ ఉన్నత ఉద్యోగులు రకరకాల కార్యక్రమాల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ముస్లింలు లేని చోట కూడా ఉర్దూ భాషాభివృద్ధి సాకుతో ముసాయిరా(కవి సమ్మేళనం) నిర్వహించినట్టు చెబుతూ నిధులు స్వాహా చేశారు.రూ.3.15 కోట్ల స్కామ్‌పై కమిషనర్ ఆరా..తెలంగాణ ఉర్దూ అకాడమీకి రూ.3.15 కోట్లను ఏపీ ఉర్దూ అకాడమీ నుంచి అప్పు ఇచ్చినట్లు ఆడిట్ రిపోర్ట్‌లో వెలుగు చూసిన వ్యవహారంపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ఇటీవల ఆరా తీశారు. తన కార్యాలయానికి పలువురు సిబ్బందిని పిలిచి ఈ విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ఆ నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రికార్డులు సైతం తారుమారు చేశారని, ఆధారాలు ధ్వంసం చేశారని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు తెలిసింది. నిధుల మళ్లింపు కేసులో గతంలోనే ఇద్దరి అరెస్టుతెలంగాణ ఉర్దూ అకాడమీకి 2016–17లో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ అప్పు ఇచ్చినట్లు చూపించి రూ.3.15కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఏపీ లోకాయుక్త ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాజాగా కూటమి ప్రభుత్వం విచారణకు కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు 2018–19లో ఉర్దూ అకాడమీకి చెందిన దాదాపు రూ.4కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సీఐడీ 2021లో ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్‌విత్120(బి) కింద కేసు నమోదు చేసింది. అప్పటి ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్‌వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పని చేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. అనంతరం వారు బెయిల్ పొందారు.67 మంది వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు ఏపీ ఉర్దూ అకాడమీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా తమ బంధువులు, అనుయాయుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులు మళ్లించి, ఆ తర్వాత వారి నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా 2019 ఎన్నికల ముందు హడావుడిగా రూ.3,92,21,500లను ఏకంగా 67 మంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారు. ఆ డబ్బులను వారి నుంచి తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. వారిలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బేగ్ ఖాతాకు రూ.2.2కోట్లు, సోహెల్ పాషా ఖాతాకు రూ.15లక్షలు, బీఎస్కే సైదా–పి.ఇస్మాయల్ల ఖాతాలకు రూ.3,77,700, షేక్ జాఫర్ బంధువులు, స్నేహితుల ఖాతాలకు రూ.95,22,906 మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. -
బడిలో ‘బైలింగ్యువల్’ భళా!
గుంటూరు చౌత్ర సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 545 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే 40 మంది పెరిగారు. ప్రవేశాలు ఇంకా నమోదవుతున్నాయి. గతంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇంగ్లిష్‌లోనూ బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లి ష్–ఉర్దూలో ఉండడంతో ఆంగ్ల భాషను సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. నగరంలోని రెండు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం సమకూర్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా మరింత మెరుగ్గా బోధన కొనసాగుతోంది. గుంటూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:సంస్కరణలు చేపట్టి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగేతర మాతృభాష విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. రెండో అధికార భాషకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 5,286 ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 62,777 మంది విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను సమకూర్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని స్కూళ్లలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో బైలింగ్యువల్ పుస్తకాలను ముద్రించి అందిస్తోంది. నాలుగు మైనర్ భాషల్లో 85,469 మంది బడికెళ్లే వయసున్న ప్రతి చిన్నారి చదువుకోవాలన్న సంకల్పంతో తెలుగేతర మాతృభాషల విద్యార్థులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తమిళం మాతృభాషగా ఉన్న 1,316 మంది విద్యార్థుల కోసం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఒడియా మాధ్యమంలో 8,599 మంది, కన్నడలో 10,485 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వీరి కోసం కూడా ప్రభుత్వం బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం భాషల్లో 85,469 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలో మైనర్ భాషల్లో బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యాశాఖ ప్రశంసలు అందుకుంది. కచ్చితంగా మెరుగైన ఫలితాలు.. గతంలో సైన్స్ పాఠం ఎన్నో ఉదాహరణలతో చెప్పినా చాలామందికి అంతుబట్టేది కాదు. విద్యార్థులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకునేవారు. ఇప్పుడు ఐఎఫ్‌పీ స్క్రీన్లు వచ్చాక ప్రతి అంశాన్ని విపులంగా ఆడియో, వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాం. విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటున్నారు. కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మరుగుదొడ్లు లేక బాలికలు చదువులకు దూరమైన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో గౌరవంగా చదువుకుంటున్నారు. – డి.యల్లమందరావు (ఫిజిక్స్ ఉపాధ్యాయుడు), ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు వేగంగా అద్భుతమైన మార్పులు.. గతంలో ఉర్దూ మీడియం విద్యార్థులు అదే భాషలో రాసేవారు. ఇప్పుడు బైలింగ్యువల్ పుస్తకాలు ఉర్దూ–ఇంగ్లిష్‌లో ఉండడంతో బోధన, అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి ఇంగ్లిష్‌లోనే నోట్స్ రాస్తున్నారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన మార్పు వచ్చింది. – అబ్దుల్ కయ్యూమ్, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు ఇప్పుడెంతో బాగుంది.. మా ఇంట్లో మాకంటే ముందు చదువుతున్న వారు పుస్తకాలు కొనేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మాకు అలాంటి పరిస్థితి లేదు. బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫారం వరకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయి. బడిలో దేనికీ లోటు లేదు. కొత్తగా ఐఎఫ్‌పీ స్క్రీన్లతో పాఠాలు చెప్పడం ఎంతో బాగుంది. – మహ్మద్ తనాజ్, పదో తరగతి విద్యార్థిని, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు -
జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 2020లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు) -
భగవద్గీత, ఖురాన్ మద్య పోలికలతో పుస్తకం రాసిన ఫాతిమా
-
జేజే నగర హత్యకేసు: ప్రమాదం కాదు.. చికెన్కబాబ్ తినడానికి హోటల్‌కు వెళ్తే..
బనశంకరి(బెంగళూరు): జేజే.నగర చంద్రు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత అందరూ అనుకున్నట్లుగా అతని మృతికి బైక్ ప్రమాదం కాదని, ఉర్దూ భాషలో మాట్లాడలేదని హత్య చేశారని సీఐడీ కోర్టుకు అందజేసిన 179 పేజీల చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న స్నేహితుడు సైమన్ పుట్టినరోజు వేడుకల్లో చంద్రు పాల్గొన్నాడని, అనంతరం ఇద్దరూ చికెన్కబాబ్ తినడానికి హోటల్‌కు వెళ్లారని పేర్కొంది. హోటల్ పక్కన బైకు పార్కింగ్ చేసి బేకరిలోకి వెళ్లే సమయంలో సైమన్, చంద్రుకు షహీన్ అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ సమయంలో షహీన్ ఉర్దూలో తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో చంద్రు, సైమన్లు షహీన్‌తో గొడవపడ్డారని, ఈక్రమంలో చంద్రు హత్యకు గురైనట్లు సీఐడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. చదవండి: వింత ఆచారం.. వాళ్ల సమాధులకు నీరు పోస్తే వానలు! -
World Urdu Day 2021: ఉర్దూ విద్యకు ఊతం
జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో విద్యార్థులు ఉర్దూ విద్యను అభ్యసిస్తున్నారు. వీరు డిగ్రీ అనంతరం వీరికి పీజీ చేయాలంటే హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే వైఎస్ఆర్ ముందుచూపుతో విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ కోర్సుకు అడుగులు పడగా.. ప్రస్తుత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, వీసీ చొరవతో ఎంఏ కోర్సును రెగ్యులర్‌గా మార్పు చేసి సాధారణ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతర్జాతీయ ఉర్దూ భాషా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.. వైవీయూ : రాయలసీమ జిల్లాలకు నడిబొడ్డుగా ఉన్న కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఉర్దూ విద్యకు ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది జాతీయ విద్యాదినోత్సవం, జాతీయ మైనార్టీ దినోత్సవం పురస్కరించుకుని వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తూ వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి ప్రకటించారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉర్దూ విద్యార్థులు ఉన్నతవిద్యను పొందాలన్న కల నెరవేరింది. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వైస్ చాన్స్‌లర్ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి ఎంఏ ఉర్దూ కోర్సుకు సంబంధించిన ప్రతిపాదనలను 2009లో తీసుకొచ్చారు. వైఎస్ఆర్ మరణానంతరం ఈ కోర్సు సంగతి అటకెక్కింది. అయితే దీనిపై గతంలో సాక్షిలో ‘ఉర్దూ విద్య.. మిధ్య’ అన్న శీర్సికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఎంఏ కోర్సును ప్రవేశపెట్టారు. అయితే దీనిని సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుగా ప్రవేశపెట్టడం, ఫీజులు ఎక్కువ కావడంతో ఉర్దూ విద్యను అభ్యసించే విద్యార్థులకు భారంగా మారింది. 2020 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన వైస్ చాన్స్‌లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి దృష్టికి ఉర్దూ మేధావులు సమస్యను తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి పాలకమండలిలో ఉంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తూ తీర్మానించింది. అనంతరం ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ చేయడంతో పాటు కోర్సుకు సంబంధించిన రెగ్యులర్ పోస్టులు మంజూరు విషయమై ఏపీ ఉన్నతవిద్యామండలి దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి దిశగా ఉర్దూ విభాగం.. విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం విభాగాధిపతిగా ఆచార్య పి.ఎస్. షావల్లీఖాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విభాగంలో పలు అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా లాంగ్వేజ్ ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చారు. దీంతో పాటు పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా జాతీయస్థాయిలో పేరొందిన ఉర్దూ కవులు, రచయితలు, ప్రముఖులతో వెబినార్లు నిర్వహించి మరింత ప్రాభవం కల్పించారు. కాగా ఉర్దూ కోర్సులో ప్రస్తుతం అందరూ అకడమిక్ కన్సల్టెంట్లు మాత్రమే బోధన చేస్తున్నారు. కోర్సును రెగ్యులర్ చేసినప్పటికీ పోస్టులను రెగ్యులర్ చేయాలని అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు కోరుతున్నారు. దీంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవసరమైన గైడ్షిప్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
సాక్షి ఉర్దూ న్యూస్ 22 September 2021
-
సాక్షి ఉర్దూ న్యూస్ 1september 2021
-
ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్ గా నదీమ్ అహ్మద్ ప్రమాణ శ్వీకారం
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గతంలో ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఉర్ధూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని నదీమ్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ హాజరయ్యారు. -
ఉర్దూ పాఠాలు
కొత్త పాత్ర కోసం ఉర్దూ పాఠాలు నేర్చుకుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. ఉర్దూను సరిగ్గా పలకడం కోసం ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారట. కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రిచా చద్దా ముఖ్య తారగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాహోర్ కాన్స్పిరసీ’. ఇందులో రిచా రహస్య గూడచారి పాత్రలో నటిస్తున్నారు. ఒకే షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం యాక్టర్ లక్షణం అయ్యుండాలని నమ్ముతాను. అందుకే ఈ సినిమాలోని పాత్ర కోసం ఉర్దూ నేర్చుకుంటున్నాను. కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకునే అవకాశం సినిమా ఎప్పుడూ కల్పిస్తూనే ఉంటుంది’’ అన్నారు రిచా. -
సాక్షి ఉర్దూ న్యూస్ 29th June 2020
-
ఇక ఆ స్టేషన్ల పేర్లు ఉర్ధూ స్ధానంలో సంస్కృతంలో...
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ల నేమ్ బోర్డులు ఇక ఉర్ధూ స్ధానంలో రాష్ట్రంలో రెండో అధికార భాష సంస్కృతంలో దర్శనమివ్వనున్నాయి. హిందీ, ఇంగ్లీష్ తర్వాత ఆయా రాష్ట్రాల్లో రెండో అధికార భాషలోనే రైల్వే స్టేషన్ల ఫ్లాట్‌ఫాం సైన్బోర్డ్స్పై పేర్లు ఉండాలన్న రైల్వే మ్యాన్యువల్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ దీపక్ కుమార్ వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం సైన్బోర్డ్స్పై పేర్లనీ హిందీ, ఇంగ్లీష్, ఉర్ధూ స్దానంలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో రాయనున్నారు. ఉత్తరాఖండ్‌లో సంస్కృతం రెండో అధికార భాష కావడంతో రాష్ట్రంలో రైల్వేస్టేషన్లలోని సైన్బోర్డులపై సంస్కృతం భాషలో ఆయా స్టేషన్ల పేర్లు చేర్చుతామని ఆయన తెలిపారు. కాగా, ఉత్తరాఖండ్ యూపీలో భాగంగా ఉన్న క్రమంలో గతంలో రైల్వే స్టేషన్ల పేర్లు ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్ధూలో వ్యవహరించారు. -
ప్రముఖ మహిళా ఎడిటర్ సంచలన నిర్ణయం
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్‌కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్‌నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్‌గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్‌ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్‌ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మరోవైపు మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. -
జిల్లాలో ఉర్దూ వెబ్సైట్..
సాక్షి, మహబూబ్‌నగర్ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన మహబూబ్‌నగర్ జిల్లా నేడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు, తెలుగులోనే అందుబాటులో ఉండే మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను సరికొత్తగా ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉర్దూ మాట్లాడే, చదివే వారికోసం స్వాస్ సాంకేతిక టెక్నాలజీ సహాయంతో ఈ ఉర్దూ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఉర్దూలో మహబూబ్‌నగర్ జిల్లా ఎన్ఐసీ వెబ్సైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంపై ఉర్దూ భాష మాట్లాడే వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఉర్దూ భాషలో మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ఐసీ అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగించి తుది మెరుగులు దిద్దారు. నెల రోజులపాటు కసరత్తు చేసిన ఎన్ఐసీ అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ఉర్దూ వెబ్‌సైట్‌కు అంకురార్పన చేశారు. దేశంలోనే మొదటిసారి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా దేశంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను ఉర్దూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తుండటమే కాకుండా అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి సైతం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఉర్దూ భాషలోనూ వెబ్సైట్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మెరుగైన ఫలితాలు తీసుకురానుంది. అయితే జిల్లాలో ఇప్పటికే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఈ–ఆఫీస్ విధానంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని అనుసంధానం చేసి ఫైళ్ల నిర్వహణను అత్యంత సులభతరం చేయడంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సఫలీకృతులయ్యారు. ప్రతీ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఎవరూ కార్యాలయాల చుట్టూ సంతకాల కోసం, అనుమతుల కోసం తిరిగే వీలు లేకుండా తమ కార్యాలయం నుండే ఈ–ఆఫీస్ విధానంతో క్షణాల్లో అనుతులు తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకుల సమక్షంలో.. ఈ విధానంతో పనిభారం తగ్గడమే కాకుండా అధికారులు అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఇదిలాఉండగా, ఉర్దూ వెబ్‌సైట్‌ను మొదటిసారిగా అందుబాటులోకి తేవడం ఎంతో గర్వకారణమని జిల్లా అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రొనా ల్డ్‌రోస్ సోమవారం ప్రజావాణి కార్యక్రమం వేదికగా అఖిలపక్ష పార్టీల ము స్లిం నాయకుల సమక్షంలో ఉర్దూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ రూపకల్పనకు స్వాస్ సాంకేతిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని, ఎన్ఐసీ అధికారుల శ్రమ ఫలితంగా ఉర్దూ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించేందుకు వీలుకలిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. -
ఉర్దూ అధికారి పోస్టులకు 10న నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారి ఉద్యో గాల భర్తీకి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు డు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉర్దూ అధికారి గ్రేడ్–1 విభా గంలో 6 పోస్టులు, గ్రేడ్–2 విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉర్దూ అధికారులు ఉర్దూ నుంచి ఆంగ్లం, తెలుగులోకి అనువాదం చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఉర్దూ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మైనార్టీలకూ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ పాల్గొన్నారు. -
టప్పాబహీ సత్తార్ మియా
ఒకసారి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు హైదరాబాదు వచ్చారు. ప్రజల్లో ఆయన విప్లవం యెక్కడ తెస్తారో అని జడిసి ఆయన్ని గిరఫ్తార్(అరెస్టు) చేయవలసిందిగా వారెంటు జారీచేశారు. అది ఉర్దూలో వుంది. ఉర్దూకు ఫారసీ లిపిని ఉపయోగిస్తారు. ఉర్దూ భాషకు స్వంతలిపి అంటూ లేదు. ఫారసీ లిపిలో భారతీయ శబ్దాలు వ్రాయడం కష్టం. ‘‘పట్టాభి సీతారామయ్య’’ అని రాయాలంటే ‘‘టప్పాబహీ సత్తార్ మియా’’లా వుంటుంది. డాక్టర్ పట్టాభిగారు బసచేసిన చోటికి పోలీసువారు వారంటు పట్టుకు వచ్చారు. ‘‘టప్పాబహీ సత్తార్ మియా హై క్యా’’ అని అడిగారు. అది పసిగట్టిన యన్.కె.రావుగారు ‘‘యహా సత్తార్ మియా కోయీ నహీ. ఇన్కానాంతో సీతారామయ్యా హై’’ (ఇక్కడ సత్తార్ మియా యెవరూ లేరు. వీరి పేరు సీతారామయ్య) అన్నారు. పొరపాటు చేశామనుకుని పోలీసువారు వెళ్ళిపోయారు. వెంటనే సీతారామయ్య గారిని సురక్షిత ప్రదేశానికి పంపించివేశారు రావుగారు. లిపిమార్పు వల్ల పేరు మారింది. (దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ లోంచి...) -
కాలీ పీలీ దిమాఖ్ ఖరాబ్ జేయకురా బై!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటే ఆరామ్ సంస్కృతి, దక్కనీ భాష.. బిర్యానీ భోజనం! నిజాం పాలనలో తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలూ ఉండడం, ఉర్దూ అధికార భాష కావడంతో ఇక్కడి తెలుగులో వీటన్నిటీ ప్రభావమూ కనిస్తుంది. ఒక్కప్పుడు నగరం నైజాం రాజధాని.. తర్వాత రెండు తెలుగురాష్ట్రాల రాజధానీ కావడంతో కాస్మోపాలిటన్ కల్చర్‌కు వేదికగా నిలిచింది. దీనివల్ల కూడా హైదరాబాద్ తెలుగు పలు భాషల పదాలతో కలిసి ఈ అర్బన్ లింగో మిగిలిన నగరాల్లోలా కాక హైదరాబాదీ లింగోగా తన ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ కూరగాయల బేరగాళ్లు, ఆటోవాలాలు, యువత.. పెద్దవాళ్లు.. ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో తెలుగు ఉంది ఇక్కడ. ‘అరే అమ్మా.. ఇయ్యాల తర్కారీ (కూరగాయలు) మస్తు సస్తా (చవక) ఉన్నయ్, కద్దూ (సొరకాయ), కరేలా (కాకరకాయ), కల్యామాక్ (కరివేపాకు), భేండీ (బెండకాయ) అన్నీ సస్తల్నే’’ అంటారు. ఉత్తర భారతీయులూ ఎక్కువగా ఉండడం వల్ల పాతబస్తీ నుంచి మొదలు వయా నాంపల్లి బేగంపేట్ వరకు కూరగాయల పేర్లు హిందీ లేదా ఉర్దూ భాషల్లోనే వినిపిస్తాయి మార్కెట్లలో. బేరగాళ్ల దగ్గర కూడా! గ్లోబలైజేషన్ నేపథ్యంలో సూపర్ మార్కెట్లు వచ్చినా అక్కడ ఇంగ్లిష్ జతకూర్చుకుంది కాని ఈ నేటివిటీ అయితే తాజాతనం కోల్పోలేదు. కాలీ పీలీ.. కిరాక్.. ఎక్కడున్నా యువత ఉనికే వేరు. వాళ్ల ఫ్యాషన్‌కే కాదు వాళ్ల కమ్యూనికేషనూ లేటెస్ట్ ట్రెండ్‌నే అనుసరిస్తుంటుంది. అందుకే ప్రతి తరంలో యూత్ కొత్త తెలుగును ఆవిష్కరిస్తుంటారు. ఇందులోనూ హైదరాబాద్ యువతరం ఫర్మాయిష్ ప్రత్యేకమే. పొట్టి, పాట్ట (అమ్మాయి, అబ్బాయి) నుంచి మొదలవుతుంది ఇది. ‘2 పొట్టి ఏముందిరా.. ఏక్దమ్ కిరాక్’ అంటూ ‘‘అబే.. కాలీ పీలీ (ఉట్టిగానే) దిమాఖ్ ఖరాబ్ జేయకురా బై’ అని ఎండ్ చేస్తారు. మధ్యలో ఇంకెన్ని..? నక్కో (వద్దు), లైట్ లేలే (పట్టించుకోకు), ‘యేం బైగన్ (వంకాయ) పనులు చేస్తున్నవ్రా’, ‘నన్ను బైగన్ చేసేసినవ్ కదా..’, ‘పోరడు చిక్నా (అమాయకుడు, సున్నితమనస్కుడు)రా.. పాపం’, ‘అరే హౌలే (పిచ్చోడు)..’, ‘కిరికిరి (గొడవ) షురూ జేయక్’’, ‘పటాయించు (ప్రేమలో పడేయ్)’’, ‘దబాకే (బాగా) ఆకలైతుంది’, ‘ఏంది.. సర్కాయిం చిందా? (పిచ్చి పట్టిందా)’’ వగైరా వగైరా తెలుగుగానే పలుకుతున్నాయ్. ఇక స్నేహితులను మామా, చిచ్చా.. అని పిలుచుకోవడం పరిపాటి. తరాలు మారుతున్నా ఇవన్నీ ఇప్పటికీ వాడకంలో ఉన్న మాటలే! ఎవర్ యంగ్ జర్గాన్! అంటే పాతతరమూ వీటి సరళి వీడలేదన్నమాట! ఇంటర్నెట్ స్లాంగ్ ఇది ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తున్న మాధ్యమం. దీనికి హైదరాబాదూ మినహాయింపు కాదు. డూడ్, లోల్, రఫోల్, ఓఎమ్‌జీ (ఓ మై గాడ్), యూ నో, హీ ఈజ్ బే (బీఈఏ.. అంటే బిఫోర్ ఎనీ వన్ ఎల్స్), ఫేస్‌పామ్(అయ్యో), త్రో బాక్ టు (పాతది గుర్తు చేసుకునే క్రమం), ఫట్టా.. పీస్ (అందమైన అమ్మాయిని ఉద్దేశించిన పదాలు, ఎఫ్‌వైఐ (ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్), కూల్, చిల్,ఈటీసీ (ఎట్సెట్రా), టీక్యూ (థాంక్యూ), టీకే (టేక్ కేర్) మొదలైనవన్నీ ఇంటర్నెట్ స్లాంగ్గా ఫేమస్ అయ్యాయి. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ చాటింగ్ క్రియేట్ చేసిన మాటలివి. వీటిలో చాలా టీక్యూ, టీకే, రఫోల్, లోల్ వంటివన్నీ కూడా చాటింగ్‌లోనే కాదు.. మాట్లాడుతున్నప్పుడు కూడా వాడుకలో సర్వసాధారణమైపోయాయి. ఏ జోక్ అయినా నవ్వు తెప్పిస్తే లోల్ అని, పగలబడేలా నవ్వు తెప్పిస్తే నవ్వకుండా రఫోల్ అని చెప్పేసి ఊరుకుంటున్నారు అంతే. పరభాషా పదాలు చేరితేనే మాతృభాష విస్త్రతమవుతుంది. అభివ్యక్తీకరణకు కొత్త మాటలు పుడితేనే భాష వికాసం చెందుతుంది. అయితే.. పరాయి పదాలు మన భాషలో ఇమిడిపోవాలి. పరాయి పదాల్లో మన భాష కుంచించుకుపోవద్దు. ఆ జాగ్రత్త పాటిస్తే చాలు! రోకో.. హల్లు సైకిల్ రిక్షాలున్నప్పుడు వినిపించిన ఈ పదాలు ఆటోరిక్షాల్లోనూ ధ్వనిస్తూ క్యాబ్ డ్రైవర్లకూ కామన్ అయ్యాయి. ‘భయ్యా.. చార్మినార్ ఛల్తే’’ దగ్గర బేరం మొదలై రిక్షా ఎక్కాక హైదరాబాద్ ఎగుడు దిగుడు రోడ్లకు తన రిక్షాను బ్యాలెన్స్ చేసుకుంటున్న సందర్భంలో సవారీ.. (సారీ ఈ మాట చెప్పడం కూడా మర్చాం. సవారీ అంటే రిక్షాలో ప్రయాణించే ప్రయాణికుడు) ‘భయ్యా.. హల్లూ ఛలో (నెమ్మదిగా నడుపు అన్నా)’, గమ్యం వచ్చేశాక.. ‘రోకో భయ్యా.. రోకో (ఆపు అన్నా ఆపు) అనే ఉర్దూ పదాలు మొత్తం రవాణా సౌకర్య వ్యవస్థ జార్గాన్గా.. ఆ డిక్షనరీలో స్థిరపడిపోయాయి. డ్రామెటిక్‌గా భావిస్తున్నారు.. సాఫ్ట్వేర్ జాబ్స్, చాటింగ్ వల్లే వాక్యాలు పదాల్లా మారిపోతున్నాయని నా అభిప్రాయం. హైదరాబాద్‌లాంటి చోట్ల తెలుగుతో సమానంగా హిందీ, ఉర్దూ ఉంటాయి. ఈ పది పదిహేనేళ్లలో ఇంగ్లిష్ కూడా అంతే కామన్ అయింది. అచ్చంగా తెలుగులో మాట్లాడితే డ్రామెటిక్‌గా మాట్లాడినట్టు ఉంటోంది. విన్నవాళ్లూ అలాగే భావిస్తున్నారు. – స్వప్నపేరి, అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ సీక్రెట్‌గా ఉండడం కోసం సాధారణంగా యూత్ లింగో ఎందుకుంటుంది అంటే.. వాళ్ల స్వేచ్ఛను కోపాడుకోవడం కోసం. తల్లిదండ్రులతో, లెక్చరర్స్‌తో ఓపెన్‌గానే ఉంటాం. కాని కొన్ని విషయాల్లో సీక్రెట్స్ తప్పవు కదా! సపోజ్ నా ఫ్రెండ్ పర్సనల్ విషయాలు మా పేరెంట్స్‌తో మాట్లాడలేను కదా. అలా పేరెంట్స్ ముందు ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చనప్పుడో, లేక పరాయి వాళ్లముందు, కొత్త ప్లేసెస్‌లో వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ లింగోను యూజ్ చేస్తాం. – కె.ప్రత్యూష, గ్రాఫిక్ డిజైనర్ ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైయిల్ మాది ఒడిశా. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నా. మనం ఉండే ప్రాంతం, వాతావరణాన్ని బట్టి స్లాంగ్స్, యాక్సెంట్స్ ఉంటాయి. అర్బన్ లింగో నుంచి మాలాంటి యూత్ సపరేట్గా కొన్ని పదాలను తయారు చేసుకుంటుంటుంది. ఇవన్నీ భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న భాషల నుంచీ పుట్టుకొస్తాయి. – భరత్ బెహెరా, ఫన్‌బకెట్ ఆర్టిస్ట్ -
సాక్షి ఉర్దూ న్యూస్ 1st November 2017
-
ఇక ఉర్దూలోనూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజి బిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఇక నుంచి ఉర్దూలోనూ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూ లోనూ నిర్వహిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు హాజరై జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి లిఖితపూర్వక వివరణ నిచ్చారు. గతంలో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనే ఓ విద్యార్థి సంఘం ‘నీట్’ను ఉర్దూలో నిర్వ హించాలని కోరుతూ వ్యాజ్యం వేసింది. -
సాక్షి ఉర్దూ న్యూస్ 29th July 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 13th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 11th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 10th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 9th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 8th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 6th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 5th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 4th May 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 22nd April 2017
-
వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్!
న్యూఢిల్లీ: 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మే 7న జరిగే ఈ ఏడాది నీట్లోనే ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని పిటిషనర్ కోరగా అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ‘అద్భుతాలు చేయమని మేం కేంద్రాన్ని ఆదేశించలేం. పరీక్ష మే 7 న ఉంది. ఈ రోజు ఏప్రిల్ 13. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. -
సాక్షి ఉర్దూ న్యూస్ 4th April 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 3rd April 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 25th March 2017
-
సాక్షి ఉర్దూ న్యూస్ 11th March 2017
-
ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది. -
సాక్షి ఉర్దూ న్యూస్ 8th March 2017
-
అమ్మ భాషకు వందనం
– నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కర్నూలు(కల్చరల్) : అమ్మ నుంచి నేర్చుకున్న కమ్మనైన భాష... పాలు పెరుగు కన్న... జున్ను, వెన్న కన్న తీయనైన భాష... సహజమైన స్వచ్ఛమైన అమృతధారలు పంచే అద్వితీయమైన భాష... ఊయలలో ఉంగా ఉంగా పలుకులప్పుడు అమ్మ పాడే తీయనైన జోల పాట... అమ్మ పలికే అందమైన పలుకుల పూదోట... ఎవరికైనా ఆహ్లాదాన్ని కల్గిస్తాయి... ఆనందాన్ని పంచుతాయి... అమ్మ గుండె నుంచి శిశువు గుండెకు ప్రవహించే ఆ అనంత భావవాహిని... అనంతరం... భాషా సాగరానికి నిలయమవుతుంది.. ప్రతి వ్యక్తి అభివ్యక్తికి అదే ఆధారమవుతుంది. మాతృభాషే మధురమైనది, మాతృభాషలోని బోధన స్వచ్ఛమైనది అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏనాడో చాటిచెప్పారు. భావాలను స్వచ్ఛంగా, నిర్మలంగా ప్రకటించేందుకు ఏకైక సాధనం మాతృభాషేనని ఎందరెందరో భాషావేత్తలు ఘోషించారు. మంగళవారం..అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో తెలుగు భాషను పరిమళింపజేసిన మేధావులు ఎందరో ఉన్నారు. అలనాటి భువన విజయంలో సభ్యుడైన పింగళి సూరన జన్మించిన కర్నూలు జిల్లా తెలుగు భాషకు చక్కని పునాది వేసింది. తొలి తెలుగు నవల ఇక్కడే పుట్టిందని ఎందరో భాషావేత్తలు ప్రచారం చేశారు. ఇక్కడ పారుతున్న హంద్రీనదియే ఆంధ్రి అనే పదానికి పునాది అని కొందరు భాషా పరిశోధకులు తెలిపారు. కర్నూలు జిల్లాలో స్థాపితమైన తెలుగు భాషా వికాస ఉద్యమం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలో తన కార్యక్రమాలను విస్తరింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసింది. గతంలో ఖమర్నగర్గా గుర్తింపు పొందిన కర్నూలులో ఉర్దూ భాష ముషాయిరాలలో, పాఠశాలల్లో గుబాళించింది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉర్దూ మాతృభాషగా కలిగినవారు ఉర్దూ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆదోని కర్ణాటక రాష్ట్రానికి అత్యంత సమీపంగా ఉండటంతో అక్కడ పుట్టి పెరిగిన కొందరు మేధావులు కన్నడ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో వివిధ భాషలను మాతృభాషలుగా కలిగినవారు తమతమ మాతృభాషల పరిరక్షణ కోసం తమదైన శైలిలో పనిచేస్తున్నారు. భాషా వికాసానికి కృషి.. ఉర్దూ భాషా వికాసం కోసం కర్నూలులో 1970నుంచి ఖైసీఖమర్నగరి అనే కవి కృషి చేస్తున్నారు. ఉర్దూ రచయితలు, కవులనందరినీ కలుపుకుంటూ ముషాయిరాల ద్వారా, ఆయినా అనే పత్రిక ద్వారా ఉర్దూ భాషా పరిరక్షణ కోసం సాహితీ ఉద్యమం చేస్తున్నారు. ఆదోని వాస్తవ్యులైన రంగనాథ రామచంద్రరావు ప్రసిద్ధి చెందిన కన్నడ కథలను తెలుగులోకి అనువదిస్తూ, తెలుగు కథలను కన్నడలోకి అనువదిస్తూ కన్నడ భాషా పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. కర్నూలు కేంద్రంగా ఎందరెందరో భాషావేత్తలు, కవులు, రచయితలు తెలుగు భాషా వికాసం కోసం, పరిరక్షణ కోసం తమ సేవలు కొనసాగిస్తున్నారు. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం... – జే.ఎస్.ఆర్.కె.శర్మ, తెలుగు భాషా ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : తెలుగు భాషా వికాస ఉద్యమం పేరుతో 2000లో మేము ఒక సంస్థను స్థాపించాం. తెలుగు భాషా పరిరక్షణ సదస్సులు 23 జిల్లాల్లో నిర్వహించాం. ప్రముఖ శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో నూరు భువన విజయ కార్యక్రమాలు, నూరు అష్టావధానాలు నిర్వహించి తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రస్తుత తరానికి పంచిపెట్టాం. తెలుగు రాష్ట్రంలో రేషన్ కార్డు దరఖాస్తు తెలుగులోనే ఉండాలని కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి దానిని అమలు చేయించాం. తిరుపతిలోని పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం పేరును తెలుగులోనే కొనసాగించేటట్లు చేశాం. కర్నూలు జిల్లాలో 73 ప్రాంతాల్లో తెలుగు భాషా రథయాత్రలు నిర్వహించాం. కర్నూలులో కృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టించాం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాం. మద్దూర్‌నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణాన్ని 2015లో ప్రారంభించాం. ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ప్రస్తుత తరానికి మాతృభాషలోనే విద్యాబోధన జరిగే విధంగా కృషి చేస్తున్నాం. ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఉద్యమించాలి... – షంషుద్దీన్, రాయలసీమ ఉర్దూ కమిటీ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లాలో ఉర్దూ మాట్లాడే ప్రజలు అధిక శాతం ఉన్నారు. అందుకే రాయలసీమ ఉర్దూ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కేవీఆర్ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ ఉర్దూ మాధ్యమంలో ప్రారంభించడానికి కృషి చేశాం. ఉర్దూలో పీజీ కోర్సును ప్రారంభింపజేశాం. ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో ఉర్దూ మాద్యమ పాఠశాలలను ప్రారంభించాం. ఉర్దూ యూనివర్సిటీ కోసం చాలా సంవత్సరాలుగా ఉద్యమిస్తూ వచ్చాం. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి గారికి 2009లో దరఖాస్తును ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభానికి శ్రీకారం చుట్టాం. రాయలసీమ వ్యాప్తంగా ఉర్దూ భాషా వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఉర్దూ భాషా మాధుర్యాన్ని తెలియజేశాం. ఉర్దూ అధికంగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో ఉర్దూ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమ్మభాషే కమ్మనైనది.. – బి.వి.స్వరూప్ సిన్హా, ప్రముఖ రచయిత, కర్నూలు అమ్మ భాష కమ్మదనం అనే పేరుతో నేను రాసిన కవిత్వ సంకలనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర పాఠశాలలో ఆవిష్కరింపజేస్తున్నాను. ఈ పుస్తకంలో తెలుగు భాషలోని కమ్మదనాన్ని వివరించే పలు కవితలు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలుకొని ఎందరెందరో భాషావేత్తలు, మేధావులు భావ వ్యక్తీకరణకు మాతృభాషే అసలైన సాధనమని ప్రచారం చేశారు. ఇది ఎప్పటికైనా వాస్తవమే. పీజీ స్థాయి వరకు మాతృభాషలోని విద్యాబోధన జరిగినట్లయితే విద్యార్థులు సరైన అవగాహనను పెంచుకుని భావ వ్యక్తీకరణకు సిద్ధమవుతారు. -
పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో నిర్వహించాలి
కర్నూలు (న్యూసిటీ) : నీట్ (ఎంబీబీఎస్)తోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించాలని ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీఖాన్ డిమాండ్‌చేశారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఎన్నికల హామీల మేరకు ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆలీఖాన్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి నబీరసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లీంలు అధికంగా ఉన్న ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఉర్తూ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎస్ఎన్ రసూల్ దీక్షలకు మద్దతు తెలిపారు. నబీ రసూల్, రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ, అజయ్‌కుమార్ దీక్షల్లో కూర్చున్నారు. మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీంఖాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు షాలీబాషా, కోశాధికారి షేక్షావలి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో దేశంలో ఒక్కో పేరు!
శాంటా క్లాజ్‌గా ప్రసిద్ధమైన ‘క్రిస్మస్ తాత’ను మన దేశంలో వివిధ ప్రాంతాల్లో, భాషల్లో ఒక్కో రకంగా పిలుస్తారు. హిందీలో ‘క్రిస్మస్ బాబా’ అనీ, ఉర్దూలో ‘బాబా క్రిస్మస్’ అనీ, తెలుగులో, తమిళంలో‘కిస్మస్ తాత’ అనీ, మరాఠీలో ‘నాటల్ బువా’ అనీ అంటారు. అలాగే, ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో ఈ కానుకలిచ్చే తాతయ్య సుప్రసిద్ధం. ఆ పేర్లలో కొన్ని... ఆఫ్ఘనిస్థాన్ – బాబా చఘాలూ అల్బేనియా – బాబాదిమ్రీ అర్మేనియా – గఘంత్ బాబా/ కఘండ్ పాపా (ఫాదర్ క్రిస్మస్ లేదా ఫాదర్ న్యూ ఇయర్) అజర్ బైజాన్ – శాక్సా›్ట బాబా బెల్జియమ్ సెయింట్ నికోలస్ బ్రెజిల్ – పాపాయ్ నోయెల్ చైనా – షెంగ్ డాన్ లావో రెన్ (ఓల్డ్ క్రిస్మస్ మ్యాన్ అని అర్థం) కొలంబియా – నినో డియోస్ (బాల జీసస్) ఈజిప్ట్ – బాబా నోయెల్ గ్రీస్ – అఘియోస్ వాసిలిస్ ఇండొనేసియా – సింటర్క్లాజ్ ఇరాన్, ఇరాక్ – బాబా నోయెల్ జపాన్ – శాంటా–శాన్, హŸతీయోషో (జపనీయుల అదృష్టదేవత) పాకిస్తాన్ – క్రిస్మస్ బాబా రష్యా – దెద్ మోరెజ్, దెదౌష్కా బ్రిటన్ – ఫాదర్ క్రిస్మస్ తారలు దిగి వచ్చిన వేళ... యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశంలోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టును ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకొంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి, తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్ని ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకొనే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకూ, ముగ్గురు జ్ఞానులకూ ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది.దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం,క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగుతోందనేది అందరి నమ్మకం. l -
డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫికి దరఖాస్తులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): డిప్లొమా ఇన్ ఉర్దూ క్వాలిగ్రఫి అండ్ గ్రాఫికల్ డిజైనింగ్ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వెజ్ (ఎన్‌సీపీయూఎల్) స్టడీ సెంటర్ ఇన్చార్జి షుకూర్ మియ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్సీ లేదా ఓఎస్ఎస్ చదివిన 15 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతీ యువకులు అర్హులన్నారు. దరఖాస్తులను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలన్నారు. 9వ తేదీన ఉదయం 10 గంటలకు అభ్యర్థులకు ప్రవేశపరీక్ష ఉంటుందని, మెరిట్ అభ్యర్థులకు అక్టోబరు 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఉర్దూ ఘర్, ఇంటి నెంబరు 9–239, లాల్ మసీద్ రోడ్, కర్నూలు చిరునామాలో కానీ, ఫోన్(08518–223314, 9948769374)లో కాని సంప్రదించాలన్నారు. -
పాక్ నుంచి పావురం రెక్కపై ఉర్దూలో రాసి
చంఢీఘడ్: రెక్కలపై ఉర్దూ భాషలో అక్షరాలు రాసివున్న పావురం పంజాబ్ లో కలకలం సృష్టించింది. ఈ పావురాన్ని పరిశీలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులు పాకిస్తాన్-ఇండియా బోర్డర్ ను దాటి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషయాపూర్ జిల్లా మోట్లా గ్రామంలో ఓ వ్యక్తి తెల్లపావురం రెక్కలపై ఉర్దూలో రాసివుందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాంతో ఆ ప్రాంతానికి చేరుకుని పావురాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పావురం రెక్కలపై ఉర్దూలో రాసివున్న అక్షరాలను ఆర్మీ, ఇంటిలిజెన్స్ అధికారులు పరిశీలించినట్లు పేర్కొన్నారు. పావురానికి ఎక్స్ రే స్కానింగ్ పరీక్ష కూడా చేయించినట్లు చెప్పారు. రెక్కలపై పదకొండు అంకెలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ నంబర్లు రహస్యంగా చేరవేస్తున్న ఫోన్ నంబరా? పాకిస్తాన్ నుంచి ఆ పావురం వచ్చిందా? వంటి కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. రెక్కలపై నంబర్లతో పాటు ఉర్దూలో కొన్ని పదాలతో పాటు గుర్తుతెలియని ఒక స్టాంప్ కూడా ఉందని పేర్కొన్నారు. కొన్ని పదాలను తర్జూమా చేయగా.. ఆదివారం, బుధవారం, గురువారం అని రాసి ఉందని తెలిపారు. గత ఏడాది కూడా పఠాన్ కోట్ జిల్లాలో రెక్కలపై ఉర్దూలో రాసివున్న పావురాన్ని అధికారులు గుర్తించారు. పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై ముష్కరాలు దాడి చేసిన విషయం తెలిసిందే. -
అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో..
రూ.10 కోట్ల విలువైన భూమిపై టీడీపీ నేతల కన్ను దశాబ్దాలుగా ఉన్న ‘ఉర్దూ’ కార్యాలయం నేలమట్టం భవన నిర్మాణ కాంట్రాక్టు అప్పగింత వాటిలో షాపింగ్ కాంప్లెక్సులకు వ్యూహం ప్రతినెలా అద్దెల రూపంలో లక్షల స్వాహాకు ఎత్తుగడ ఆందోళనలకు సిద్ధమవుతున్న మైనార్టీలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది కాకినాడ నగరానికి నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం. అక్కడ గజం స్థలం కొనాలంటే రెండు లక్షలుపైనే పెట్టాలి. ఇప్పుడున్న ధరలతో లెక్కిస్తే రూ.10 కోట్లు విలువ చేస్తుంది. అటువంటి ప్రాంతం లో 500 గజాల స్థలంలో రెండు దశాబ్థాలుగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ స్కూల్స్ కార్యాలయం నడుస్తోంది. ఆ స్థలం తమకు వృత్తి విద్యా కళాశాల కోసం కావాలంటూ పిఠాపురం రాజా (పీఆర్) కళాశాల యాజమాన్యం పట్టుబట్టి స్కూల్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఉర్దూ కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. బయటకు ఆ కళాశాల యాజమాన్యం కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక కాకినాడ నగరంలోని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత, అతని అనుచరులు తెరవెనుక పావులు కదిపారు. ‘మహోప్రభో ఆదుకోండ’ంటూ కాకినాడ సిటీ ఎమెమల్యే వనమాడి కొండబాబు దగ్గరకు ముస్లింలు పరుగులు తీశారు. ‘మహారాజా ... అంటే మరి రెండు తన్నమన్నట్టు’గా మౌనం వహించడంతో తెలుగు తమ్ముళ్లు తమ పని తాము చక్కబెట్టుకున్నారు. అధికార బలానిదే పై చేయి కావడంతో ఉర్దూ కార్యాలయం నేటమట్టమయింది. అయినదే తడువుగా రూ.34.50 లక్షలు ఎస్ఆర్ఎంటీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బులిటీ ఫండ్‌ను కూడా మంజూరు చేయించేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ఉర్థూ కార్యాలయం కాకినాడలోనే ఉంది. ఖాళీగా ఉన్న మిగిలిన స్థలంలో ఉర్థూ అకాడమీ ప్రాంతీయ కార్యాలయం, మైనార్టీ కార్పొరేషన్, వక్స్S్ఫబోర్డు ఇలా...ఒకే కాంప్లెక్స్‌లో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటి నుంచో డైరెక్టర్ ఆఫ్ మైనార్టీస్‌కు వెళ్లిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిమాట ‘అల్లా’ ఎరుగు ఉన్న గూడు కూడా పోవడంతో మైనార్టీలు లబోదిబోమంటున్నారు. ఈ గోడు మధ్యనే ఆ భవనాల నిర్మాణ కాంట్రాక్టును అధికారపార్టీ నేతలే హస్తగతం చేసుకున్నారు. చుట్టా తెరచాపలు చుట్టేసి పనులు కూడా ప్రారంభించేశారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఓ వర్గం ఆగ్రహంతో ఉంది. ఆ ముఖ్యనేత వ్యూహమిదీ... ఆ 500 గజాల్లో నిర్మించే భవనంలో తొలుత వృత్తి విద్యా కోర్సులకు రెండు గదులు నిర్మిస్తారు. ఇందుకు ఎస్ఆర్ఎంటీ సమకూర్చిన రూ.34.50 లక్షలు వెచ్చిస్తారు. ఇదంతా పక్కాగానే జరిగిపోతోంది. అసలు కిటుకు రెండో దశలోనే ఉంది. రెండో దశలో మెయిన్‌రోడ్డు వైపు షాపింగ్ కాంప్లెక్సు ఏర్పాటుచేసి సగం దుకాణాలు ఆ ముఖ్యనేత చెప్పిన వారికి కట్టబెట్టే ‘డీల్’ కుదిరిందని సమాచారం. ఆ స్థలం ఉన్న ప్రాంతం మెయిన్ రోడ్డులో అతి ప్రధానమైన కూడలిలో ఉండటంతో దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక షాపునకు అడ్వాన్సుగా రూ.50 లక్షలు పైనే వస్తుంది. అలా మెయిన్ రోడ్డువైపు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వచ్చే నాలుగు దుకాణాలపైనా రెండు కోట్లు అడ్వాన్సుగా నొక్కేయవచ్చని ఆ ముఖ్యనేత వ్యూహంగా కనిపిస్తోంది. పీఆర్ కాలేజీ స్థలంలో ముఖ్యనేతకు ఎలా దుకాణాలు కేటాయిస్తారనుకుంటున్నారా...? రెండో దశలో దుకాణాలు నిర్మాణం పూర్తయ్యాక నామమాత్రపు అద్దెకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి భారీగా అడ్వాన్సులు, అద్దెలు ఆ ముఖ్యనేతకు చేరేలా తెరవెనుక పావులుకదుపుతున్నారు. అందుకే ఆ ప్రజాప్రతినిధి అనచరుడు రెండు దశాబ్థాలుగా ఉంటున్న తమ కార్యాలయాన్ని ఉన్నఫళంగా ఖాళీ చేయించి భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహం పక్కాగా భవిష్యత్తులో అమలు పరిచేందుకే రూ.34.50 లక్షలతో చేపట్టే భవన నిర్మాణాన్ని ఆ ముఖ్యనేత తన ప్రధాన అనుచరుడికి కట్టబెట్టేశారు. అతనేమైనా కాంట్రాక్టరా అంటే చిన్న వీధి కాలువ నిర్మించిన అనుభవం కూడా లేదు. నిర్మాణ దశ నుంచి తమ ఆధిపత్యం ఉంటేనే మెయిన్ రోడ్డువైపు దుకాణాల్లో కూడా చక్రం తిప్పవచ్చేనేది వారి వ్యూహం. దీనిపై ముస్లిం పెద్దలు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నాక భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామంటున్నారు. అపోహ మాత్రమే... పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒకేషనల్ కళాశాల కోసం నిర్మిస్తున్న భవనంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు అనుమతి ఇస్తున్నామనేది పూర్తిగా అపోహ మాత్రమే. విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో ఎస్ఆర్ఎంటీ సంస్థను సంప్రదించగా సోషల్ రెస్పాన్స్‌బులిటీ పథకంలో భాగంగా రెండు తరగతి గదులు, ఒక హాలు నిర్మాణానికి 34 లక్షల 50 వేల రూపాయలును నిధులు అందజేశారు. త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేస్తాం – వి.కేశవరావు, పీఆర్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న భవనం స్థానంలో యథావిధిగా కార్యాలయాన్ని నిర్మించాలి. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, యథాతథంగా అక్కడ కార్యాలయాన్ని నిర్మించాల్సిందిగా కోరతాం. అందుకు విరుద్ధంగా జరిగితే పోరాడేందుకు సిద్ధం.– అబ్దుల్ బషీరుద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు -
నేడు ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై. నరసింహులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, గౌరవ అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయమోహన్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
సీఎం నియోజకవర్గంలో ఉర్దూ రాని ఉర్దూ టీచర్
-
ప్యూర్ నుంచి పాక్...
పేరులో నేముంది పాక్ అంటే ఉర్దూలోప్యూర్ అని అర్థం. స్థాన్ అంటే భూమి అని అర్థం. దీనిని బట్టి పాకిస్థాన్‌కు స్వచ్ఛమైన భూమి అనే అర్థం వస్తుంది. ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కలలు కన్న చౌధురి రహమత్ అలీ అనే ఒక ముస్లిం జాతీయవాది అంతకు దాదాపు ఒక దశాబ్దం క్రితమే ‘నౌ ఆర్ నెవర్’ అనే ఒక కరపత్రం ప్రచురించి, దానిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముందుంచాడు. భారతదేశంలో సుమారు 30 మిలియన్ల మంది ముస్లిములు స్వాతంత్య్రం కోసం అభిలషిస్తున్నారని, వారికోసం ప్రత్యేకంగా ఒక దేశం ఉండాలన్నదే దాని సారాంశం. దేశంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే ప్రాంతాలైన పంజాబ్, అఫ్ఘన్ ప్రావిన్స్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్‌లను కలుపుతూ పాకిస్థాన్ పేరిట ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాలని రహమత్ అలీ ఆ పత్రంలో నివేదించాడు. అలా చెప్పినట్టుగా ఈ అయిదు ప్రదేశాలలో మొదటి అక్షరాలని వరుసగా పేరిస్తే పాకిస్థాన్ అవుతుంది. మొత్తానికి ఈ సూచన సంగతి ఎలా ఉన్నా, దేశవిభజన జరిగింది. మన దేశంలోని స్వచ్ఛమైన భూభాగం కాస్తా విడిపోయి పాకిస్థాన్ ఏర్పడింది. -
ఉర్దూన్యూస్ 5th September 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 29th August 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 28th August 2015
-
Sakshi Urdu News 25th Aug 2015
-
Sakshi Urdu News 24th Aug 2015
-
Sakshi Urdu News 21st Aug 2015
-
Sakshi Urdu News 19th Aug 2015
-
Sakshi Urdu News 18th Aug 2015
-
Sakshi Urdu News 17th Aug 2015
-
Sakshi Urdu News 14th Aug 2015
-
Sakshi Urdu News 12th Aug 2015
-
Sakshi Urdu News 10th Aug 2015
-
Sakshi Urdu News 7th Aug 2015
-
Sakshi Urdu News 6th Aug 2015
-
Sakshi Urdu News 5th August 2015
-
Sakshi Urdu News 1st August 2015
-
Sakshi Urdu News 31st JUly 2015
-
Sakshi Urdu News 30th JUly 2015
-
Sakshi Urdu News 27th July 2015
-
Sakshi Urdu News 16th July 2015
-
ఉర్దూ ఇక ఫస్ట్ లాంగ్వేజ్
హైదరాబాద్: ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్ (మొదటి భాష) ఆప్షన్‌గా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిం చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం ఆయన సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండో భాషగా ఉన్న ఉర్దూను చాలా మంది విద్యార్థులు మొదటి భాషగా తీసుకునే అవకాశం కల్పించాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. దీనికి స్పందించిన సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ప్రతి జిల్లాలో మైనారిటీలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక హాస్టల్ నెలకొల్పాలని, రాష్ట్రంలోని మైనారిటీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్పులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 75 వేల మంది మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. -
సాక్షి ఉర్ధూ న్యూస్ 7th April 2015
-
సాక్షి ఉర్ధూ న్యూస్ 1st April 2015
-
సాక్షి ఉర్ధూ న్యూస్ 31st March 2015
-
Sakshi Urdu News 30th March
-
Sakshi Urdu News 29th March 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 28th March 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 27th March 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 26th March 2015
-
Sakshi Urdu News 24th March 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 23rd March 2015
-
Sakshi Urdu News 21st Mar 2015
-
Sakshi Urdu News 20th March
-
Sakshi Urdu News 19th March 2015
-
సాక్షి ఉర్దూ న్యూస్ 19th March 2015