ఒక్కో దేశంలో ఒక్కో పేరు!
శాంటా క్లాజ్‌గా ప్రసిద్ధమైన ‘క్రిస్మస్ తాత’ను మన దేశంలో వివిధ ప్రాంతాల్లో, భాషల్లో ఒక్కో రకంగా పిలుస్తారు. హిందీలో ‘క్రిస్మస్ బాబా’ అనీ, ఉర్దూలో ‘బాబా క్రిస్మస్’ అనీ, తెలుగులో, తమిళంలో‘కిస్మస్ తాత’ అనీ, మరాఠీలో ‘నాటల్ బువా’ అనీ అంటారు. అలాగే, ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో ఈ కానుకలిచ్చే తాతయ్య సుప్రసిద్ధం. ఆ పేర్లలో కొన్ని...
ఆఫ్‌ఘనిస్థాన్ – బాబా చఘాలూ
అల్బేనియా – బాబాదిమ్రీ
అర్మేనియా – గఘంత్ బాబా/ కఘండ్ పాపా (ఫాదర్ క్రిస్మస్ లేదా ఫాదర్ న్యూ ఇయర్)
అజర్ బైజాన్ – శాక్సా›్ట బాబా
బెల్జియమ్ సెయింట్ నికోలస్
బ్రెజిల్ – పాపాయ్ నోయెల్
చైనా – షెంగ్ డాన్ లావో రెన్ (ఓల్డ్ క్రిస్మస్ మ్యాన్ అని అర్థం)
కొలంబియా – నినో డియోస్ (బాల జీసస్)
ఈజిప్ట్ – బాబా నోయెల్
గ్రీస్ – అఘియోస్ వాసిలిస్
ఇండొనేసియా – సింటర్‌క్లాజ్
ఇరాన్, ఇరాక్ – బాబా నోయెల్
జపాన్ – శాంటా–శాన్, హŸతీయోషో (జపనీయుల అదృష్టదేవత)
పాకిస్తాన్ – క్రిస్మస్ బాబా
రష్యా – దెద్ మోరెజ్, దెదౌష్కా
బ్రిటన్ – ఫాదర్ క్రిస్మస్
తారలు దిగి వచ్చిన వేళ...
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశంలోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టును ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకొంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి, తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్ని ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకొనే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకూ, ముగ్గురు జ్ఞానులకూ ఆయన దగ్గరకు
వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది.దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం,క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగుతోందనేది అందరి నమ్మకం. l