santa claus
-
స్పెషల్ ఫోటో షేర్ చేసిన మస్క్ - నెట్టింట్లో వైరల్
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ.. 'ఇలాన్ మస్క్' (Elon Musk) క్రిస్మస్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఒజెంపిక్ శాంటా (Ozempic Santa) అంటూ శాంటా డ్రెస్‌తో.. క్రిస్మస్ చెట్టు ముందు నిలబడిన ఫోటోను మస్క్ షేర్ చేశారు. ఇందులో పెద్ద గడ్డం, నడుముపై చేతులు పెట్టుకున్న మస్క్‌ను చూడవచ్చు.ఇలాన్ మస్క్ శాంటా వేషధారణలో కనిపించడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే తన చిన్న తనం నుంచే శాంటా దుస్తులు ధరించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఎలా ప్రారంభమైంది.. ఎలా వెళుతోంది అంటూ మస్క్ మరో ట్వీట్ చేశారు. మేరీ క్రిస్మస్.. వండర్ఫుల్ న్యూ ఇయర్ అంటూ కూడా ట్వీట్ చేశారు.Ozempic Santa pic.twitter.com/7YECSNpWoz— Elon Musk (@elonmusk) December 26, 2024How it started vs how it’s going pic.twitter.com/fQeCQ7zCPC— Elon Musk (@elonmusk) December 26, 2024 -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
క్రిస్మస్ శాంటా తాత ఎవరు? ఏ ఊరి నుంచి వస్తాడు? అసలు నిజమేంటి?
"క్రిస్మస్ రోజున శాంటా తాత వస్తాడు. బహుమతులెన్నో తెస్తాడు. శాంటా ఉత్తర ధ్రువం నుంచి వస్తాడని అందరూ అంటారు. కాదు శాంటా మా ఊరి నుంచి వస్తాడు అంటారు ఫిన్లాండ్ దేశస్తులు. ఫిన్లాండ్లోని ‘రొవానియమి’ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రతి క్రిస్మస్కు పర్యాటకులు అక్కడకు వెళ్లి శాంటా ఊరు ఇదేనంటూ సందడి చేస్తారు. ఈ ఊరి విశేషాలు చాలానే ఉన్నాయి. పిల్లలకు చెప్తే అబ్బుర పడతారు." ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే’.. ఎర్రని దుస్తుల్లో, తలమీద టోపీతో, గుబురు గెడ్డంతో, రైన్ డీర్లు లాగే స్లెడ్జ్ బండి మీద, బోలెడన్ని కానుకలు మూటగట్టుకుని క్రిస్మస్ రాత్రి ఆకాశ వీధుల గుండా క్రిస్మస్ తాత వస్తాడని పిల్లలకు ఒక నమ్మకం. క్రిస్మస్ వచ్చే ముందే తల్లిదండ్రులు పిల్లల్ని ‘క్రిస్మస్ తాత ఏం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావు’ అని అడుగుతారు. కొందరు పిల్లలు ‘ఫలానాది ఇవ్వు’ అని క్రిస్మస్ తాతకు లెటర్లు రాస్తారు. కొందరు పిల్లలు ఇవేవీ అడక్కుండా తమకోసం ఏం ఇస్తాడో చూద్దాం అని ఉత్సుకతతో ఎదురు చూస్తారు. ఎవరి బాల్యంలో అయినా ఇది అద్భుతమైన జ్ఞాపకం. క్రిస్మస్ తాత అంటూ ఎవరూ రారు అని పిల్లలకు తెలిసినా.. ఏమో వస్తాడేమో అనుకునే అమాయకమైన వయసు అది. వస్తాడేమో అనిపించే ఉత్సుకత ఉండేప్రాయం అది. అందుకే తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులు ఉన్నచోట వారు నిద్రపోయాక వారి కోసం తల దగ్గర కానుకలు పెట్టి వెళతారు. పిల్లలు తెల్లారి లేచి వాటిని చూసుకుని ‘శాంటా ఇచ్చాడు’ అని సంబర పడతారు. శాంటా తాత ఎవరు? ఇది బైబిల్ పాత్ర కాదు. క్రీ.శ.280 కాలంలో టర్కీలో సెయింట్ నికొలస్ అనే ఒక బిషప్ క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి, ముఖ్యంగా పిల్లలకు ఎంతో కొంత సహాయం చేసేవాడట. నిద్రపోతున్న వారి పక్కన కానుకలు, డబ్బు పెట్టి వెళ్లేవాడట. సాక్సుల్లో బంగారు నాణెలు పెట్టి ఇళ్లల్లో పడేసేవాడని అంటారు. పండగంటే ఆనందం పంచడమే కదా. ఇది అందరికీ నచ్చింది. ఇలా ఒక తాత వచ్చి కానుకలు ఇస్తే బాగుండు అనే కోరిక పెరిగింది. మంచి కోరికను తీర్చడానికి ప్రపంచమంతా ముందుకొస్తుంది. అందుకే క్రిస్మస్ తాత అందరి తాత అయ్యాడు. సెయింట్ నికోలస్ కాస్తా శాంటా క్లాజ్ అయ్యాడు. శాంటా ఊరు.. నిజమైన శాంటా క్లాజ్ టర్కీ వాడైనా కాలక్రమంలో నార్త్‌పోల్ వాడయ్యాడు. దీనికి కారణం 1893–96ల మధ్య థామస్ నాస్ట్ అనే అమెరికన్ కార్టూనిస్టు శాంటా క్లాజ్ బొమ్మలు పత్రికలకు గీసి శాంటా నార్త్‌పోల్ వాడని అడ్రస్ పెట్టాడు. దానికి కారణం ఆ రోజుల్లో నార్త్ పోల్ (ఉత్తర ధ్రువం) ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక దాని చుట్టూ ఒక దైవిక కల్పనలు సాగేవి. సెయింట్స్ అక్కడే ఉంటారని అనుకొని ఉండొచ్చు. అదీగాక అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది కనుక క్రిస్మస్ అంటే మంచుకాలం కనుక థామస్ నాస్ట్ ఏకంగా 24 గంటలూ మంచు ఉండే ప్రాతాన్ని శాంటా క్లాజ్ తావును చేసి ఉంటాడు. ఇక అక్కడ రైన్డీర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాహనంగా మార్చారు. ఫిన్లాండ్ ఊరు.. ఫిన్లాండ్ దేశం వారు శాంటా తమ ఊరి వాడేనని ఒక వాదన మొదలుపెట్టారు – పర్యాటక ఎత్తుగడే కావచ్చు. ఫిన్లాండ్ ఆర్కిటిక్ సర్కిల్లో వచ్చే దేశం కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచే కాబట్టి శాంటా ఊరు తమ దేశంలోదే అనుకుని ఉండొచ్చు. అంతటితో ఆగక ‘రొవానిఎమి’ అనే ఊరిని శాంటా ఊరిగా టూరిస్ట్ ఎట్రాక్షన్ చేశారు. ఇక్కడ శాంటా ఇల్లు, శాంటా పోస్టాఫీసు, శాంటా తిరిగే స్లెడ్జ్బళ్లు అన్నీ ఉంటాయి. మైనస్ 12 డిగ్రీల చల్లదనం ఉండే క్రిస్మస్ కాలంలో కూడా టూరిస్టులు శాంటా ఊరికి వెళ్లి సందడి చేస్తారు. మత భావనలు పొందుతారు. ఈ ఊరి వారు శాంటాతో మాట్లాడాలనుకునే పిల్లల కోసం ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడి పోస్టాఫీసుకు ప్రతి సంవత్సరం 200 దేశాల నుంచి రెండు లక్షల ఉత్తరాలు శాంటా నుంచి పిల్లలకు వస్తాయి. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు ఇక్కడి పోస్టాఫీసులో ఉత్తరం రాసి పడేస్తే కరెక్ట్‌గా క్రిస్మస్కు అందేలా పంపుతారు. అంటే శాంటా పంపినట్టు పంపుతారు. అదో సరదా. 'శాంటా అబద్ధం కావచ్చు. కాని శాంటా ఉంటాడన్న పిల్లల అమాయక కామన అబద్ధం కాకూడదు. ఈ క్రిస్మస్ రోజున అందరు పిల్లలకూ, ముఖ్యంగా ఆట వస్తువులు లేని పేద పిల్లలకు మీరే శాంటాగా మారండి. హ్యాపీ క్రిస్మస్. ఇవి చదవండి: ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు? -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు..
మమ్మీ... శాంటా ఏమిచ్చాడో చూడు.. శాంటా వస్తాడట... గిఫ్ట్స్ ఇస్తాడట... మమ్మీ... నాక్కూడా ఇస్తాడా?. డాడీ... నేనడిగింది ఇస్తాడా? పిల్లలు... బంగారు కొండలు. శాంటా వారికి ఇష్టమైన తాతయ్య. కానుకలిచ్చే తాతయ్య. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి మంచి బుద్ధులు చెప్పడానికి చదువులో ప్రోత్సహించడానికి ఊరికే సంతోషపెట్టడానికి అర్ధరాత్రి దిండు కింద కానుకలు పెట్టి తల్లిదండ్రులే శాంటాలు అవుతారు. పిల్లలు ఈ సంతోషానికి హక్కుదారులు. పెద్దలు ఈ సంతోషం పంచాల్సిన బాధ్యత కలిగిన వారు. క్రిస్మస్ను సంతోషమయం చేయండి. పిల్లలను ఈ కానుకలతో ఎలా ప్రోత్సహించవచ్చు?. ఏ కానుకలు ఇవ్వొచ్చు? ‘అమ్మా... శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు?’ ‘నార్త్ పోల్‌లో’ ‘ఎప్పుడు వస్తాడు?’ ‘రేపు క్రిస్మస్ అనగా ఇవాళ రాత్రి వస్తాడు’ ‘ఎలా వస్తాడు?’ ‘ఎగిరే జింకల బగ్గీ మీద బోలెడన్ని గిఫ్ట్స్ వేసుకుని, ఏయే పిల్లాడికి ఏయే గిఫ్ట్ ఇవాలో వాటి మీద పేరు రాసుకుని వస్తాడు’ ‘మన ఇంటికి వస్తాడా?’ ‘ఎందుకు రాడు?’ ‘నాకు గిఫ్ట్ ఇస్తాడా?’ ‘ఇస్తాడు. మంచి పిల్లలకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. అల్లరి పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడు’ ‘నేను మంచి పిల్లాడినేగా’ ‘నాకేం తెలుసు. నీకు తెలియాలి’ ‘నేను అల్లరి చేయనుగా’ ‘అయితే నీకు గిఫ్ట్ తెచ్చిస్తాడులే’ ∙∙ క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలందరికీ క్రిస్మస్ తాత గుర్తుకొస్తాడు. తెల్లటి ఫర్ అంచుల ఎర్రటి బట్టలు వేసుకుని, ఇంత పొడవు తెల్ల గడ్డంతో, ఎర్ర టోపీతో, కళ్లద్దాలు పెట్టుకుని ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్’ పాడుతూ కానుకలు తెచ్చే శాంటా తాత కోసం ఎదురు చూపులు మొదలవుతాయి. మూడు నాలుగేళ్ల వయసు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు క్రిస్మస్ తాత మీద ఎంతో నమ్మకం. సంవత్సరమంతా ఎదురు చూసైనా తాత ఇచ్చే బహుమతి అందుకోవాలనుకుంటారు. ఏ బహుమతి ఇస్తాడో అనే సస్పెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. కాస్త పెద్ద పిల్లలకు తాత మీద డౌట్ ఉన్నా తెల్లారే సరికి తమ బెడ్ మీద పక్కనే ఉన్న గిఫ్ట్స్‌ను చూస్తే ఆనందం. సంతోషం. వాటిని తాత ఇచ్చినా సరే. తాత పేరుతో ఎవరు ఇచ్చినా సరే. కాని ఆ రోజంతా ‘శాంటా ఏం ఇచ్చాడో చూడు’ అని అందరికీ చూపడం ఎంత బాగుంటుందో. ∙∙ ‘అమ్మా.. నాకేం గిఫ్ట్ కావాలో శాంటాకు ఎలా తెలుస్తుంది? ‘ఉత్తరం రాసి నాకు ఇవ్వు పోస్ట్ డబ్బాలో పడేస్తాను’ ‘సరే’ ‘నేను కోరిందే ఇస్తాడా?’ ‘శాంటాకు రాయి. తాతయ్యా... నేను బాగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. క్లాస్‌లో అల్లరి చేయను. అమ్మ చెప్పినట్టు వింటాను. అన్నం తిననని మారాం చేయక పెట్టిందల్లా తింటాను. అబద్ధాలు చెప్పను. ఎక్కువగా ఫోన్‌తో ఆడను. నేను గుడ్‌బాయ్‌గా ఉంటాను అని రాయి. అప్పుడు తెస్తాడు’ ‘సరే’ ∙∙ కానుకలు ఎప్పుడూ పిల్లలను ఉత్సాహపరుస్తాయి. తల్లిదండ్రులు క్రిస్మస్ సందర్భంగా వారికి నచ్చిన చిన్నచిన్న కానుకలైనా ఇచ్చి ప్రోత్సహించాలి. ‘పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్. చాలా బుద్ధిగా ఉంటున్నావుగా... అందుకని ఈ గిఫ్ట్. చెల్లితో/అక్కతో కొట్లాడటం లేదు కదా అందుకని ఈ గిఫ్ట్. మంచి ఫ్రెండ్స్‌ను చేసుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్’ ఇలా చెప్పి కానుకలు ఇస్తే వారు తాము మంచి పనులు చేస్తున్నామనే నమ్మకానికి వస్తారు. చేయాలని అనుకుంటారు. వాటికి కానుకలు ఉంటాయని ఉత్సాహపడతారు. క్రిస్మస్ తాతను చూపి దురలవాట్లు (గోర్లు కొరకడం, హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం, పుస్తకాల బ్యాగ్ సరిగ్గా ఉంచుకోకపోవడం, స్కూల్ ఎగ్గొట్టడం.. వంటివి) మాన్పించవచ్చు. అవి మానతామని హామీ ఇస్తేనే తాత గిఫ్ట్ ఇస్తాడని చెప్పాలి. మెర్రీ క్రిస్మస్. పిల్లలకు ఏం గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు? వీటిలోంచి ఎంచుకోండి. 1. ఆర్ట్ మెటీరియల్ 2. బొమ్మల పుస్తకాలు 3. షూస్ 4. పిగ్గీ బ్యాంక్ 5. కెలడీస్కోప్ 6. ఇండోర్ ప్లాంట్ 7. కుక్కపిల్ల 8. స్మార్ట్ వాచ్ 9. స్మార్ట్ స్పీకర్స్ 10.పోర్టబుల్ ఆడియో ప్లేయర్ 11. క్రిస్మస్ టీషర్ట్స్ 12. హెడ్ సెట్స్ 13. టాయ్స్ -
మీకు మా స్మార్ట్‌ఫోన్ ఫ్రీ: సీఈవో బంపర్ ఆఫర్, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఈ క్రిస్మస్ శాంతాక్లాజ్ కావాలనుకుంటున్నారా? అయితే నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతోపాటు చక్కటి మీమ్‌ను కూడా ఆయన షేర్ చేశారు. (నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు) I'm feeling 🎅 Best meme in the next 24 hrs gets a Nothing Phone (1) — Carl Pei (@getpeid) December 16, 2022 మీరు బాగా చిలిపా? స్మార్టా? అయితే తమ స్మార్ట్‌ఫోన్ ఫ్రీ అన్నట్టుగా కార్ల్ పీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. "రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్ మీమ్‌కి నథింగ్ ఫోన్ (1)’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారితో ఎక్కువగా టచ్‌లో ఉండే యాక్టివ్ టెక్ సీఈవోలలో ఒకరు కార్ ప్లీ. లండన్‌లోని సోహోలో కంపెనీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఫఫ్రీగా నథింగ్ ప్రొడకక్ట్స్ అందించారు. pic.twitter.com/p2eW6kClQr — Carl Pei (@getpeid) December 16, 2022 కాగా 2022లో నథింగ్ ఫోన్ (1) అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటి. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే -ఆధారిత స్టార్టప్ నథింగ్ తీసుకొచ్చిన ఈ తొలి ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. అలాగే ఫోన్ ఎరీనా బెస్ట్ డిజైన్ ఫోన్ 2022 అవార్డు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. -
క్రిస్మస్ తాత గురించి ఈ విశేషాలు తెలుసా?
క్రిస్మస్.. ఈ పేరు వినగానే సంబరాలు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలూ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు మరో వ్యక్తి కూడా తప్పక గుర్తొస్తారు. ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తుతెచ్చుకోకుండా క్రిస్మస్ పండుగను జరుపుకోరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయనే శాంటా క్లాస్.. ముద్దుగా క్రిస్మస్ తాత అని పిలుచుకుంటారు. తెల్ల జుట్టు, పొడవాటి తెల్ల గడ్డం, ఎరుపు, తెలుపు కలిగిన టోపీని, దుస్తులను ధరించి వచ్చే క్రిస్మస్ తాతను మనం చూసే ఉంటాం. పిల్లలకు బహుమతులు ఇస్తూ, వారిని ఉత్సాహపరుస్తూ క్రిస్మస్ తాత (వేషం వేసిన వ్యక్తి) సందడి వాతావరణం సృష్టిస్తాడు. క్రిస్మస్ సందర్భంగా జరిగే కరోల్స్ లో పిన్నలూ, పెద్దలు సైతం శాంటా క్లాజ్ వేషంలో ఉన్న వ్యక్తి వెంట తిరుగుతూ ఉండటం చూస్తుంటాం. అయితే ఈ క్రిస్మస్ తాత ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా! పండుగ నుంచి ఆయన్ను వేరు చేయలేనంతగా ఆయన ఎందుకు మారారో తెలుసా ! ఆయనో బిషప్.. స్థానికంగా క్రైస్తవుల మతపెద్దగా వ్యవహరించే వ్యక్తిని బిషప్ అని పిలుస్తారు. క్రిస్మస్ తాతగా పేరొందిన వ్యక్తి కూడా ఓ బిషప్. ఆయన పేరు నికోలస్. ఆయన ప్రస్తుత టర్కీ లోని మైరా ప్రాంతానికి బిషప్ గా పని చేశారు. ఆయన క్రీ. శ. 280వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి తనకు వచ్చిన ఆస్తులను అవసరాల్లో ఉన్న వారికి దానం చేసిన గొప్ప వ్యక్తి నికోలస్. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన పేదవారి ఇళ్లకు మారు వేషంలో వెళ్లేవారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు బహుమతులను, కొంత డబ్బును తీసుకొని వెళ్లి ఆ పేదలకు అందించేవారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయం అయ్యేవారు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికాలో, యూరప్ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు. సాయమే లక్ష్యం.. పండుగ అంటే మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బతకడం కాదు.. మన చుట్టూ ఉన్న నలుగురి ముఖాల్లో చిరునవ్వు కలిగించడం అని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి సెయింట్ నికోలస్. పేదవారికి సాయం చేయడం కోసం ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేసేవారు ఎవరుంటారు ? కానీ ఆయన ఆ పని చేశారు. అందుకే ప్రతి క్రిస్మస్ నాడు.. క్రిస్మస్ తాత వచ్చి బహుమతులు ఇస్తాడని పిల్లలంతా నమ్మేంతగా అతడు ఈ పండుగలో చొచ్చుకుపోయాడు. శాంటా క్లాస్ – క్రిస్మస్ ఫ్యాక్ట్స్.. క్రిస్మస్ తాత నిజానికి నీలి రంగు దుస్తులు ధరించేవారు. అయితే 1930లలో కోకాకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందటంతో క్రిస్మస్ తాత కాస్ట్యూమ్స్ ఎరుపు, తెలుపు రంగులు సంతరించుకున్నాయి. బరువైన క్రిస్మస్ గిఫ్ట్: సుప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని 1886లో ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దాని బరువు 225 టన్నులు. దీంతో ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత బరువైన క్రిస్మస్ బహుమతిగా పేరొందింది. – సృజన్ సెగెవ్ -
శాంటా క్లాజ్ గిప్ట్స్ : ఊహించని విషాదం
క్రిస్మస్ శాంటా క్లాజ్ నుంచి కానుకలు అందుకున్న వారి జీవితాల్లో భారీ విషాదం అలుముకుంది. ఉత్సాహంగా బహుమతులందుకున్న వారిలో 18 మంది కరోనాకు బలయ్యారు. ముఖ్యంగా బహుమతులను పంచిన శాంటాకి అప్పటికే కరోనా సోకింది. కానీ ఈ విషయాన్ని గమనించని శాంటా వృద్ధాశ్రమంలో గిఫ్ట్‌లను అందించారు. ఈ అజాగ్రత్తే బెల్జియంలోని ఒక హెమ్పాలిట పీడకలగా మారి పోయింది. యాంట్వెర్ప్ అనే వృద్ధాశ్రమం వారు అక్కడి వృద్ధులకు క్రిస్మస్ సంబరాల్లో భాగంగా శాంటాను పిలిచారు. దీనికోసం అక్కడి వృద్ధాశ్రమంలో వారి ఆరోగ్య సంరక్షణ చూసుకునే డాక్టర్నే శాంటా క్లాజ్‌గా వ్యవరించారు. అయితే అతనికి అప్పటికే కరోనా సోకడంతో అతని నుంచి బహుమతులు అందుకున్న అందరికీ వైరస్ వ్యాప్తి చెందింది. ఈ 'సూపర్ స్ప్రెడర్' కారణంగా కేర్ హోమ్‌లోని 121 మందితోపాటు అక్కడి 36 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో18 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని నింపింది. మరోవైపు శాంటా వచ్చినప్పుడే అతని ఆరోగ్యం బాగాలేదని, అయితే తనకు కరోనా సోకిన విషయం డాక్టర్‌కు, తమకూ తెలియదని వృద్ధాశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. అయితే వృద్ధులకు బహుమతులు ఇచ్చే సమయంలో కరోనా సంబంధిత నిబంధనలను పాటించలేదని నగర మేయర్ విమ్ కేయర్స్ చెబుతున్నారు. మిగిలిన బాధితులు కోలుకుంటున్నారనీ, కానీ రానున్న 10 రోజులు మరింత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. -
8 ఏళ్ల చిన్నారి లేఖకి బదులిచ్చిన ప్రధాని
లండన్: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటికీ మనం దాని కంట్రోల్లోనే ఉన్నాం. మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక కోవిడ్ వ్యాప్తితో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పండుగలు, వేడకలకు దూరంగా ఉన్నాయి. ఒకవేళ నిర్వహించాల్సి వచ్చినా ఎన్నో జాగ్రత్తల నడుమ అతి కొద్ది మందితో మాత్రమే జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాదిలో మిగిలిన చివరి వేడుక, పండుగ క్రిస్టమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ శాంటాక్లాజ్.. మనదగ్గర అయితే క్రిస్మస్ తాత. క్రిస్మస్ పండుగ అనగానే చిన్నారులకు కేకులు, క్రిస్మస్ ట్రీ, స్టార్లతోపాటు శాంటాక్లాజ్ తాత కూడా గుర్తుకు వస్తాడు. ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించిన శాంటాక్లాజ్ తమకు బోలెడన్ని గిఫ్టులను తీసుకువస్తాడని పిల్లలు ఎదురు చూస్తుంటారు. రాత్రి పూట ఇంటి గుమ్మం ఎదుట సంచుల్లో ఆయన గిఫ్ట్‌లను ఉంచి వెళ్లిపోతాడని కథలు చెబుతారు. ఇక చిన్నారులు శాంటాక్లాజ్ ఇచ్చే బహుమతుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది వేడుకలకు కుటుంబ సభ్యులందరు కలవడమే వీలు కావడం లేదు.. ఇక శాంటాక్లాజ్ వస్తాడా రాడా. ఈ సందేహం ఇప్పటికే ఎందరో చిన్నారుల బుర్రలని తొలిచేస్తుంది. దీని గురించి పిల్లలంతా తల్లిదండ్రులను ప్రశ్నలు అడుగుతూ సతాయిస్తూ ఉండగా.. ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం దీని గురించి ఏకంగా ప్రధానికే ఉత్తరం రాశాడు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఎంటంటే ప్రధాని ఆ చిన్నారికి సమాధానమిస్తూ.. మరో ఉత్తరం రాశాడు. (చదవండి: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) ఆ వివరాలు.. ఎనిమిదేళ్ల మోంటీ అనే చిన్నారి బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కి శాంటాక్లాజ్ రాక గురించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఉత్తరం రాశాడు. ‘ఈ ఏడాది శాంటాక్లాజ్ వస్తాడా.. మాకు బహుమతులు ఇస్తాడా లేదా ప్లీజ్ దీని గురించి నాలానే ఇంకా చాలా మందికి అనుమానం ఉంది. శాంటాక్లాజ్ రావడం గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా దయచేసి క్లారిటీ ఇవ్వండి’ అంటూ మోంటో.. ప్రధానికి తన చిట్టి చిట్టి చేతులతో ఉత్తరం రాశాడు. ఈ లేఖ బోరిస్‌ని కదిలించింది. వెంటనే రిప్లై ఇచ్చారు. క్రిస్మస్ నాడు శాంటా తప్పక వస్తారు అంటూ భరోసా ఇచ్చారు. మోంటో ఉత్తరంతో పాటు తాను ఇచ్చిన రిప్లైని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు బోరిస్. ‘ఇప్పటికే నాకు ఇలాంటి లెటర్లు చాలా వచ్చాయి. దీని గురించి నిపుణులతో మాట్లాడాను. ఇక శాంటాక్లాజ్ తన సంచిని బహుమలతలో నింపుకుని ప్రయాణం అయ్యారు. క్రిస్టమస్ నాడు ఇక్కడికి తప్పక వస్తాడు. అంతేకాక ఇప్పటికే నేను ఉత్తర ధ్రువానికి కాల్ చేసి శాంటాక్లాజ్‌ని రావాల్సిందిగా ఆహ్వానించాను. ఆయన తప్పక వస్తారు’ అంటూ ట్వీట్ చేశారు బోరిస్. ప్రస్తుతం ఈ సంభాషణ తెగ వైరలవుతోంది. ఇక పండుగ సమయంలో ప్రజలు తగిన కోవిడ్ నియమాలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేడుకలు సంతోషంగా ముగుస్తాయన్నారు. (ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు) Monti (aged 8) wrote to me asking if Father Christmas will be able to deliver presents this year 🎅🎁🎄 I've had lots of letters about this, so I have spoken with experts and can assure you that Father Christmas will be packing his sleigh and delivering presents this Christmas! pic.twitter.com/pXwcjHSxZg — Boris Johnson (@BorisJohnson) November 25, 2020 -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి చాక్లెట్లు!
-
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి చాక్లెట్లు!
క్రిస్మస్ పండగ కోసం షాపింగ్‌లు, ఆర్డర్లు అంటూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ప్రజలను చైతన్యవంతం చేయడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. గోవాలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతితో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచారు. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు సాంటాక్లాజ్‌లా వేషం ధరించి రోడ్లపైకి వచ్చారు. జనాల నోరు తీపి చేస్తూ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలియజేశారు. జీవితం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కష్టాలను కొనితెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు. ఈ సమయంలో బైక్‌పై వెళ్తున్న కొంతమంది ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను వాడటం లేదని గుర్తించారు. పెద్ద వాహనాలు నడుపుతున్నవారు సీటుబెల్టు పెట్టుకోకపోవడం గమనించారు. జాగ్రత్త వహించడం అత్యంత ముఖ్య విషయమని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని సుతిమెత్తంగా వారిని హెచ్చరించారు. చాక్లెట్లు పంచుతూ వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్న ట్రాఫిక్ పోలీసులను అక్కడి జనాలు అభినందించారు. ఇలా అర్థం అయ్యేలా ఓపికగా చెప్తే అందరూ కచ్చితంగా రూల్స్ పాటిస్తారని ఓ వాహనదారుడు పేర్కొన్నాడు. అందరూ పండగ బిజీలో మునిగిపోతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం వారి విధుల్లో మునిగితేలుతున్నారని ఓ మహిళ పేర్కొంది. -
ఆ చిట్టాలోని చిన్నారి ఆశలను నెరవేర్చేందుకు..!
తన ఆవరణలోని పొదల్లో చిక్కుకున్న ఎర్ర రంగు గాలిబుడగను చూసి అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అరిజోనా రాష్ట్రం పాటగోనియాకు చెందిన రాండీ హెయిస్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే పగిలిపోయిన ఓ బెలూన్ దారపు కొనకు ఓ చిన్నారి రాసిన ఆశల చిట్టా ఉంది. అది స్పానిష్‌లో రాసి ఉంది. స్పానిష్ చదవడం రాకపోయినా కూడా అందులోని భావం అర్థమయింది తనకు. ఆ ఎరుపురంగు బెలూన్‌తో పాటు సరిహద్దులు దాటి వచ్చిన పాపాయి కోరికల జాబితా 60 ఏళ్ల వయసున్న రాండీ హెయిస్ను తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి నడిపించింది. తను కూడా చిన్నప్పుడు ఇలా తనకేమేం కావాలో జాబితా రాసి బెలూన్‌తో సహా ఎగరేస్తే తెల్లారేసరికల్లా శాంతాక్లాజా బహుమానాలు మోసుకొచ్చేస్తాడని భావించేవాడు రాండీ హెయిస్. కానీ ఏ ఒక్క క్రిస్మస్కి కూడా తన కోరికలు తీర్చేందుకు శాంతాక్లాజా దిగిరాలేదు. అందుకే సరిహద్దులు దాటి వచ్చిన ఆ చిట్టాలోని చిన్నారి కోర్కెలను ఎలాగైనా తీర్చాలనుకున్నాడు హెయిస్. అది కష్టమైన పనే.. కానీ ఆయనకి కొన్ని క్లూస్ ఉన్నాయి. అయితే అదంత సులభమేం కాదు. ఎక్కడినుంచి ఎగిరివచ్చిందో తెలియని ఆ పాపాయి అడ్రస్ కోసం వేట ప్రారంభించాడు. సరిహద్దులకావల సౌత్ వెస్ట్‌లో 20 మైళ్ల దూరంలో మెక్సికోలో నోగేల్స్ అనే పట్టణం ఉంది. చిన్నారి పేరు దయామి అని తెలుసుకున్నాడు. గౌన్లు, ఎంచాంటిమల్స్ అనే బొమ్మలు, ఇతర దుస్తులూ తదితరాలేవో రాసి ఉన్నాయి. దయామి గురించి తెలుసుకోవాలన్న తన తపనను ఫేస్బుక్లో పెట్టాడు హెయిస్. ఈ బుధవారం నోగెల్స్లోని స్థానిక జెనీ రేడియో స్టేషన్ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. దయామిని కనుగొన్నామనీ తమ రేడియో స్టేషన్లోనే ఆ చిన్నారిని పరిచయం చేస్తామనీ కబురు పంపాడు. దీంతో ఆ రేడియో స్టేషన్‌కు వెళ్లి దయామికి కోరుకున్న బహుమతులన్నీ ఇచ్చారు. -
ఆనంద్ మహీంద్ర సారీ చెప్పారా? ఎందుకు?
సాక్షి, ముంబై: మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర బైక్ లవర్స్‌కు "క్రిస్మస్ బహుమతి" ప్రకటించారు. ఎం అండ్ ఎండ్ బ్రాండ్ బీఎస్ఏ నుంచి ఒక కొత్త మోటార్ సైకిల్ తీసుకొస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సారీ.. ఇన్ని సంవత్సరాలు మీ ఫావరెట్ రైడ్‌ను మిస్ అయ్యారు శాంటా.. కానీ ఈసారి కొత్త షైనీ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నామంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు శాంటా బీఎస్ఏ మోటార్ సైకిల్ నడుపుతున్న ఒక ఫోటోను కూడా జతచేశారు. అయితే ఈ కొత్త వెహికల్ విడుదల తేదీ, టైం ఇంకా నిర్ధారించపోయినప్పటికీ, రాయల్‌ఎన్‌ఫీల్డ్, బజాజ్ వాహనాలకు భిన్నంగా బీఎస్ఏ వాహన లవర్స్‌కు మాత్రం ఇది శుభవార్తే. కాగా 2016 అక్టోబర్‌లో ఎం అండ్ ఎం అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ యూకేకు చెందిన మోటార్ సైకిల్ సంస్థ బీఎస్ఏ ను సొంతం చేసుకుంది. మార్కెట్ లీడర్ రాయల్ ఎన్ఫీల్డ్కు దడపుట్టించేలా నూతన లాంచ్‌లతో ముంచెత్తింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో ఎం అండ్ ఎం టూవీలర్స్ లిమిటెడ్ రూ.471కోట్ల నష్టాలను ప్రకటించింది. We’re sorry you’ve missed out on your favourite ride for all these years, Santa...We’re working on getting it back for you...A shiny new one, but with all the character of your old steed... pic.twitter.com/lgj0C7staC — anand mahindra (@anandmahindra) December 25, 2017 -
భారీ శాంటాక్లాజ్
భువనేశ్వర్ / పూరీ: ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘ప్రపంచ శాంతి’ సందేశంతో ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో శాంటా ముఖాన్ని తయారుచేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం రూపొందించిన ఈ శిల్పం కోసం 600 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. -
దేవుడిచ్చిన గిఫ్ట్!
క్రీస్తు పుట్టినరోజు పండుగ అయిన ‘క్రిస్మస్’ అంటే ఇచ్చే పండుగ... కానుకల రూపంలో ప్రేమను పంచి ఇచ్చే పండుగ. ఆప్యాయతనూ, ఆనందాన్నీ ప్రతి ఒక్కరూ మరొకరితో పంచుకొనే పండుగ. క్రిస్మస్ అనగానే పిల్లలకూ, పెద్దలకూ అందరికీ గుర్తొచ్చేది – శాంటా క్లాజ్. మరో మాటలో ‘ఫాదర్ క్రిస్మస్’. పండుగ కానుకలన్నీ తెచ్చి ఇచ్చే క్రిస్మస్ తాతను ప్రేమించని వారు ఎవరుంటారు! క్రీస్తుకు మూడు కానుకలు! క్రిస్మస్కు ఇలా కానుకలు ఇచ్చి, పుచ్చుకొనే సంప్రదాయం వెనుక ఒక కారణం ఉంది. యేసుక్రీస్తుకు ముగ్గురు జ్ఞానులు మూడు కానుకలు ఇచ్చారు. ఆ మూడూ ఏమిటంటే – అగరుధూపం, బంగారం, అత్తరు. యూదుల దైవారాధనలో అగరుధూపం వాడతారు. దాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా క్రీస్తును ప్రజలు ఆరాధిస్తారని సూచన. ఇక, బంగారమంటే రాజులకు సంబంధించినది. రెండో కానుకగా దాన్ని ఇవ్వడం ద్వారా క్రీస్తు ‘రాజాధిరాజు’ అని గుర్తుచేయడమన్న మాట! పరిమళ ద్రవ్యమైన అత్తరును దేహత్యాగం చేసిన వారి మీద జల్లడం మామూలుగా అలవాటు. అత్తరును కానుకగా ఇవ్వడమనేది సమస్త ప్రజానీకం కోసం క్రీస్తు దేహత్యాగానికీ, శిలువ మరణానికీ సూచన. క్రీస్తు అందుకున్న ఆ కానుకలకు గుర్తుగా పండుగకు ఇలా కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం వచ్చినట్లు పెద్దలు చెబుతారు. ఆ దేవదేవుడు దాదాపు రెండు వేల సంవత్సరాల పైచిలుకు క్రితం ఈ మానవాళికి ఇచ్చిన అతి పెద్ద కానుక ‘యేసుక్రీస్తు’. నిజం చెప్పాలంటే, ఆ అతి పెద్ద కానుకను పురస్కరించుకొని జరుపుకొనే పండుగే కదా – ‘క్రిస్మస్’. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు, స్నేహితులు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం ఈ పండుగ ఆచారమైంది. శాంటా క్లాజ్ (ఫాదర్ క్రిస్మస్), సెయింట్ నికోలస్లు ఈ కానుకలు ఇస్తారని నమ్మకం. అయితే, జర్మనీలో ‘క్రైస్ట్కైండ్’ అనీ, స్పెయిన్‌లో ‘వైజ్ మెన్’ (జ్ఞానులు) అనీ, ఇటలీలో పెద్ద వయసు మహిళ ‘బెఫానా’ అనీ పేర్కొంటారు. ఏది ఏమైనా, ప్రపంచమంతా పిల్లలు క్రిస్మస్ తాతను ప్రేమిస్తారు. క్రిస్మస్ తాత పేరు మీద ఇచ్చే ఈ కానుకలను కూడా నేరుగా చేతికి ఇవ్వరు. వాటిని పిల్లల షూస్‌లో, దుస్తుల్లో – ఇలా రకరకాల స్థలాల్లో ఉంచుతారు. చాలా దేశాల్లో స్నేహితులకూ, కుటుంబాలకూ ఇచ్చే కానుకలను క్రిస్మస్ ట్రీ కింద పెడతారు. బ్రిటన్ లాంటి చోట్ల అయితే, క్రిస్మస్ రోజు పొద్దున్నే కుటుంబమంతా కలసి కానుకలను తెరిచి చూస్తారు. దేవుడే మనిషిగా అవతరించాడు! యేసుక్రీస్తు దేవుడు. సాక్షాత్తూ దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం. – స్వామి వివేకానంద అత్యుత్తమ గురువు! మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో యేసుక్రీస్తు ఒకరు. భగవంతునితో క్రీస్తుకు ఉన్న సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం. భగవంతుని సంకల్పాన్నీ, శక్తినీ యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను. – మహాత్మాగాంధీ ప్రతి మనిషీ క్రీస్తే! నేను మనిషిని మనిషిగా విశ్వసిస్తాను. అందుకే నాకు ప్రతి మనిషీ సాక్షాత్తూ యేసుక్రీస్తే.– మదర్ థెరిసా -
ఒక్కో దేశంలో ఒక్కో పేరు!
శాంటా క్లాజ్‌గా ప్రసిద్ధమైన ‘క్రిస్మస్ తాత’ను మన దేశంలో వివిధ ప్రాంతాల్లో, భాషల్లో ఒక్కో రకంగా పిలుస్తారు. హిందీలో ‘క్రిస్మస్ బాబా’ అనీ, ఉర్దూలో ‘బాబా క్రిస్మస్’ అనీ, తెలుగులో, తమిళంలో‘కిస్మస్ తాత’ అనీ, మరాఠీలో ‘నాటల్ బువా’ అనీ అంటారు. అలాగే, ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో ఈ కానుకలిచ్చే తాతయ్య సుప్రసిద్ధం. ఆ పేర్లలో కొన్ని... ఆఫ్ఘనిస్థాన్ – బాబా చఘాలూ అల్బేనియా – బాబాదిమ్రీ అర్మేనియా – గఘంత్ బాబా/ కఘండ్ పాపా (ఫాదర్ క్రిస్మస్ లేదా ఫాదర్ న్యూ ఇయర్) అజర్ బైజాన్ – శాక్సా›్ట బాబా బెల్జియమ్ సెయింట్ నికోలస్ బ్రెజిల్ – పాపాయ్ నోయెల్ చైనా – షెంగ్ డాన్ లావో రెన్ (ఓల్డ్ క్రిస్మస్ మ్యాన్ అని అర్థం) కొలంబియా – నినో డియోస్ (బాల జీసస్) ఈజిప్ట్ – బాబా నోయెల్ గ్రీస్ – అఘియోస్ వాసిలిస్ ఇండొనేసియా – సింటర్క్లాజ్ ఇరాన్, ఇరాక్ – బాబా నోయెల్ జపాన్ – శాంటా–శాన్, హŸతీయోషో (జపనీయుల అదృష్టదేవత) పాకిస్తాన్ – క్రిస్మస్ బాబా రష్యా – దెద్ మోరెజ్, దెదౌష్కా బ్రిటన్ – ఫాదర్ క్రిస్మస్ తారలు దిగి వచ్చిన వేళ... యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశంలోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టును ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకొంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి, తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్ని ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకొనే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకూ, ముగ్గురు జ్ఞానులకూ ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది.దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం,క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగుతోందనేది అందరి నమ్మకం. l -
కానుకల కాలం
క్రిస్మస్ వచ్చిందంటే కానుకల కాలం వచ్చినట్టే. శాంటాక్లాస్ అనే గ్రీకు బిషప్ 4వ శతాబ్దంలో ఏ ముహూర్తాన ఈ కానుకల పర్వం మొదలెట్టాడోగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. ‘అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండే పిల్లలకు మాత్రమే’ వాస్తవానికి ఈ బహుమతులు అందాలని క్రిస్మస్ తాత మొదట అనుకున్నాడు. అలా చెప్పడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండి, ఆ కానుకల కోసం ఎదురు చూడటంలో ఒక ఉత్సుకత ఉండేది. కాని అల్లరి చేయని పిల్లలు ఎవరు? బుద్ధి ఉండని పిల్లలు ఎవరు? అసలు పిల్లలంటే మంచి పిల్లలు అని కదా అర్థం. అందుకే శాంటా క్లాస్ అందరికీ బహుమతులు ఇచ్చేవాడు. ఆయన పేరు చెప్పి పిల్లలున్న తల్లితండ్రులు తమ పిల్లల దిండ్ల కింద డిసెంబర్ 24 రాత్రి, లేదంటే 25 తెల్లవారుజామున కానుకలు ఉంచేవారు. రానురాను ఈ పద్ధతి విస్తృతి పెంచుకుంది. అనాధ పిల్లలకూ, అన్నార్తులకూ క్రిస్మస్ రోజున దాతలు కానుకలు పంపిణీ చేయడం మొదలెట్టారు. పై ఫొటోలో ఉన్నది అలాంటి క్రిస్మస్ తాతలే. సౌత్ కొరియాలో సియోల్ నగరంలో దాదాపు యాభై మంది భిన్న రంగాల మిత్రులు క్రిస్మస్ తాతయ్యలుగా మారాలనుకున్నారు. మరి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకున్నారో తెలుసా? నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఇవ్వాలనుకున్నారు. అలాంటి పట్టిక సేకరించి నగరంలోని నలుమూలల్లో ఉన్న నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు క్రిస్మస్ కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆరోగ్యంగా సమయానికి పుట్టిన పిల్లలు ఎలాగూ మంచి పిల్లలే. కాని ప్రిమెచ్యూర్ బేబీలకు ఏవో ఆరోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి. వారిని కానుకలతో సంతోషపెట్టాలనుకోవడం ఎంత మంచి విషయం. ఎంత ఆనందాన్నిచ్చే సంగతి. అటు పంచినవారికీ. ఇటు పుచ్చుకున్నవారికీ -
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
వెలుగులీనుతున్న చర్చిలు * మాల్స్, చర్చిల్లో ఆకట్టుకుంటున్న క్రిస్మస్ ట్రీలు * అసహనంపై గోవా బిషప్ ఆందోళన న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో ఇళ్లు, చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రపంచం లోని వివిధ నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ,దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు క్రిస్మస్ శోభతో కాంతులీనుతున్నాయి. ఎక్కడ చూసినా శాంటాక్లాజ్ డ్రస్సుల్లో చిన్నారుల సందడే. ఇక పెద్దలు స్వీట్లు, కేక్‌లు పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ప్రముఖుల శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత, తదితరులు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసహనంపై గోవా బిషప్ ఆందోళన పనాజీ: దేశంలో పెరుగుతున్న అసహనం తీవ్రత ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆర్చ్‌బిషప్ ఆఫ్ గోవా ఫిలిప్ నెరి ఫెర్రావో ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలు, సంస్కృతుల ప్రజల మధ్య అసహనం పెరుగుతోందన్నారు. అవగాహన, సయోధ్య, శాంతి మొదలైన వాటి ద్వారా అసహనానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తన క్రిస్మస్ సందేశంలో స్పష్టం చేశారు. -
ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్' సైకత శిల్పం
పూరి: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో 45 అడుగుల ఎత్తు ఉన్న శాంటాక్లాజ్ సైకతశిల్పాన్ని గురువారం ఏర్పాటుచేశారు. 'ప్రపంచశాంతి' అనే సందేశంతో శాంటాక్లాజ్‌ను రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. దాంతో ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శాంటాశిల్పంగా గుర్తింపుపొందనుంది. ఈ శిల్పాన్ని రూపొందించడానికి వేయి టన్నుల ఇసుకను వివిధ వర్ణాల రంగులతో ఉపయోగించినట్టు సుదర్శన్ వెల్లడించారు. ఇందుకోసం పూరిలోని ఆయన శాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో 20మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. దీన్ని సరైన ఆకృతిని రూపొందించడానికి వారికి రెండు రోజల్లో 22 గంటల పాటు సమయం పట్టింది. ఈ రోజు నుంచి జనవరి 1 వరకు శాంటా సైకిత శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. అదేవిధంగా సుదర్శన్ యేసు, మేరీ మాతల సైకత శిల్పాలను కూడా రూపొందించారు. అంతేకాక తన సైకత శిల్పాలను 'లిమ్కా బుక్' రికార్డ్స్‌లో చేర్చాల్సిందిగా వారిని పట్నాయక్ కోరారు. -
శాంటా ‘క్లాసులు’
క్రిస్మస్ వచ్చేస్తోంది.. క్రిస్మస్‌తోపాటు శాంటా క్లాజ్ కూడా వచ్చేస్తాడు. తమకెన్నో బహుమతులు తెచ్చే శాంటా క్లాజ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. శాంటా క్లాజ్ అంటే ఎరుపు రంగు డ్రస్ వేసుకుని.. తెల్లటి గడ్డం పెట్టుకుని.. జింగిల్ బెల్ అంటూ పాటలు పాడటమేనా.. కాదు.. శాంటా క్లాజ్ కావాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమంటున్నారు.. ఇదో కోర్సు అంటున్నారు నోయిర్ ప్రోగ్రామ్స్ కంపెనీ వారు.. అందుకోసం శాంటా వర్సిటీనే ఏర్పాటు చేసిందీ సంస్థ.. ఇక్కడ శాంటాలకు శిక్షణ ఇస్తారు. అమెరికాలోని కొలరాడోకు చెందిన నోయిర్ ప్రోగ్రామ్స్ సంస్థ శాంటాలను రిక్రూట్ చేసుకుని.. వారికి 4 రోజులపాటు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. వీరి వద్ద 70 మంది నిపుణులైన శాంటాలు ఉన్నారట. శిక్షణలో భాగంగా శాంటాలు పాటించాల్సిన నియమాలు..ఫొటోలకు పర్ఫెక్ట్గా ఫోజు ఎలా ఇవ్వాలి? సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో ఎలా మసలు కోవాలి? పిల్లలతో ఎలా కలిసిపోవాలి? క్రిస్మస్కు సంబంధించి పిల్లల నుంచి ఏదైనా అనూహ్యమైన ప్రశ్నలు వస్తే ఎలా వ్యవహరించాలి? అదే విధంగా పండుగ రోజుల్లో ఆరోగ్యకరంగా ఉండటం వంటి వాటిని బోధిస్తారు. అలాగని శాంటా శిక్షణకు కూడా ఎవరిని పడితే వారిని తీసుకోరట. వాళ్ల నేపథ్యం వంటివాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత, పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన అనంతరం రిక్రూట్ చేసుకుంటామని నోయిర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇంతకీ ఈ శాంటాల సంపాదన ఎంత అని ప్రశ్నిస్తే.. ‘వాళ్ల అనుభవం బట్టి ఉంటుంది. అయితే.. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు.. పిల్లలకు ఎంత అద్భుతమైన, చిరస్మరణీయమైన అనుభూతిని కలుగజేశామన్నదే ముఖ్యం’ అని అన్నారు. -
శాంటా క్లాజ్ కావాలంటే...
కొలరాడో : క్రిస్మస్తో పాటు శాంటా క్లాజ్ కూడా వచ్చేస్తాడు. తమకెన్నో బహుమతులు తెచ్చే శాంటా క్లాజ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. శాంటా క్లాజ్ అంటే ఎరుపు రంగు డ్రస్ వేసుకుని.. తెల్లటి గడ్డం పెట్టుకుని.. జింగిల్ బెల్ అంటూ పాటలు పాడటమేనా.. కాదు.. శాంటా క్లాజ్ కావాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమంటున్నారు.. ఇదో కోర్సు అంటున్నారు నోయిర్ ప్రోగ్రామ్స్ కంపెనీ.. అందుకోసం శాంటా వర్సిటీనే ఏర్పాటు చేసిందీ సంస్థ.. ఇక్కడ శాంటాలకు శిక్షణ ఇస్తారు. అమెరికాలోని కొలరాడోకు చెందిన నోయిర్ ప్రోగ్రామ్స్ సంస్థ శాంటాలను రిక్రూట్ చేసుకుని.. వారికి 4 రోజుల పాటు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. వీరి వద్ద 70 మంది నిపుణులైన శాంటాలు ఉన్నారట. శిక్షణలో భాగంగా శాంటాలు పాటించాల్సిన నియమాలు..ఫొటోలకు పర్ఫెక్ట్గా పోజు ఎలా ఇవ్వాలి? సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో ఎలా మసలు కోవాలి? పిల్లలతో ఎలా కలిసిపోవాలి? క్రిస్మస్కు సంబంధించి పిల్లల నుంచి ఏదైనా అనూహ్యమైన ప్రశ్నలు వస్తే ఎలా వ్యవహరించాలి? అదే విధంగా పండుగ రోజుల్లో ఆరోగ్యకరంగా ఉండటం వంటి వాటిని బోధిస్తారు. అలాగని శాంటా శిక్షణకు కూడా ఎవరిని పడితే వారిని తీసుకోరట. వాళ్ల నేపథ్యం వంటివాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత, పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన అనంతరం రిక్రూట్ చేసుకుంటామని నోయిర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇంతకీ ఈ శాంటాల సంపాదన ఎంత అని ప్రశ్నిస్తే.. ‘వాళ్ల అనుభవం బట్టి ఉంటుంది. అయితే.. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు.. పిల్లలకు ఎంత అద్భుతమైన, చిరస్మరణీయమైన అనుభూతిని కలుగజేశామన్నదే ముఖ్యం’ అని అన్నారు. -
శాంటాక్లాజ్ సందడి
-
రోమ్ లో శాంటా క్లాజ్ ర్యాలీ
-
అల్లువారి బుల్లోడు ..ఈసారి శాంటాక్లాజ్
సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్‌తో వెండితెరపై 'నాన్న' మెరుస్తుంటే...కొడుకు మాత్రం తక్కువ తిన్నాడా? సందర్భాన్ని బట్టి ఆయా గెటప్‌లతో అదరగొడుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా బుడతడు అంటే... అదేనండి అల్లువారి బుల్లోడు తాజాగా శాంటాక్లాజ్ వేషంలో దర్శమనిచ్చాడు. ఇటీవల బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ గెటప్‌లో అదరగొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్...ఈసారి రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులలో శాంటాక్లాజ్ డ్రస్‌తో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా బన్నీ తన కుమారుడిని శాంటాక్లాజ్‌గా ముస్తాబు చేసి ఫోటో తీశాడు. ఈ ఫోటోను తన ఫేస్బుక్లో అప్ చేయటం... చిన్నోడికి లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. మరి అల్లువారి మనవడా...మజాకానా. -
జీసస్ సమైక్యాంధ్రను బహుమతిగా ఇవ్వు
చిత్తూరు: విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మరో కొత్త వేషం వేశారు. క్రిస్మస్ సందర్భంగా చిత్తూరులో ఆయన శాంతా క్లాజ్ వేషం వేశారు. సమైక్యాంధ్ర చాక్లెట్లు పంచారు. జీసస్ ప్రభు సమైక్యాంధ్రను మాకు బహుమతిగా ఇవ్వు అని పాట కూడా పాడారు. తనతోపాటు పిల్లలను కూడా పాట పాడమని ఆయన కోరారు. శివప్రసాద్ గతంలో ఢిల్లీలో కూడా అనేక రకాల వేషధారణలతో వార్తలకెక్కారు. కృష్ణుడు, నారదుడు వంటి పౌరాణిక పాత్రల వేషంలో, బుడబుక్కల వాడి వంటి అనేక వేషాలు వేయడం ద్వారా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలిపారు. రాష్ట్ర విభజనకు శివప్రసాద్ వంటి వారు ఎంత వ్యతిరేకత తెలిపినా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సమైక్యాంధ్రకు మద్దతు తెలుపరు. ఆయన విభజనకే మద్దతు తెలుపుతున్నారు.