నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : ఏసుక్రీస్తు జ న్మించిన రాత్రి రంగులీను ప్రత్యేక తార ఆకాశంలో వెలసింది. అందుకు సూచనగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి క్రైస్తవుల ఇళ్లపై నక్షత్రాన్ని అలంకరించడం ఆనవాయితీ. క్రిస్మస్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు ప్రత్యేక అలంకరణను సంతరించుకున్నాయి. పలు సెంటర్‌లు, ట్రాఫిక్ ఐల్యాండ్స్‌లో పెద్దపెద్ద నక్షత్రాలు, క్రిస్మస్‌ట్రీలను ఏర్పాటు చేశారు. నగరంలోని సంతపేట రోమన్ కేథలిక్, కెథడ్రిల్, ఏబీఎం కాంపౌండ్‌లోని లోన్‌స్టార్ బాప్టిస్టు చర్చి, వీఆర్సీ సెంటర్‌లోని బాప్టిస్టు చర్చి డౌనీహాల్, ఫతేఖాన్‌పేట ఆర్‌సీఎం చర్చి, మూలాపేట రామిరెడ్డిపేట తెలుగు బాప్టిస్టు చర్చి, పొదలకూరురోడ్డులోని సాల్వేషన్ ఆర్మీ చర్చిల డెకరేషన్లు పలువురిని ఆకర్షిస్తున్నాయి. నగరంలోని బట్వాడిపాళెం సెంటర్ రోడ్లు నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలతో కళకలలాడుతున్నాయి.
ఆబ్బురపరుస్తున్న క్రిస్మస్ ‘తార’
నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : క్రీస్తు జననాన్ని తెలియపరిచే ‘తార’లు క్రిస్మస్‌లో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. భక్తులు తమ నివాసాల ముందు క్రిస్మస్ నుంచి నూతన సంవత్సరం వరకు స్టార్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కువగా ఐదు రెక్కలున్న తారలే మనకు కనిపిస్తుంటాయి. అ యితే 26 రెక్కలతో కూడిన ప్రత్యేక తారలను తయారు చేశాడు కావలి క్రిస్టియన్‌పేటకు చెందిన పీహెచ్‌జే మిల్టన్. ఆ వివరాలను సోమవారం నెల్లూరు లో ‘న్యూస్‌లైన్’కు వివరించారు. ఇలాంటి నక్షత్రాలను జర్మనీకి చెందిన వా రు తయారుచేసి క్రిస్మస్‌ను జరుపుకుంటారన్నారు. జర్మనీ నుంచి ఖమ్మంకు ప్రతి ఏటా వలంటీర్స్ వస్తుంటారని, అక్కడి బిషప్ డేవిడ్‌కు ప్రతి ఏటా వీరు ఈ నక్షత్రాలను అందజేస్తారన్నారు. తాను తొలిసారిగా 1987లో చూశానని, అప్పటి నుంచి అలాంటి తారను తయారు చేయాలనే సంకల్పం ఉండేదన్నారు. ఐదేళ్లుగా కష్టపడి 26 రెక్కల నక్షత్రాలను వివిధ రంగుల్లో తయారు చేశానని పేర్కొన్నారు.
క్రిస్మస్ కేరల్స్
కావలి, న్యూస్‌లైన్: స్థానిక సదరన్ తెలుగు బా ప్టిస్టు చర్చి యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేరల్స్‌ను సోమవారం రాత్రి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి యూత్ పాడేటి థామస్, జెడ్ ప్రసాద్‌రావు, జయపాల్, విజయశేఖర్, సంజయ్, సాగర్, పాస్టర్ ఐ.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
మాస్టర్‌లో ప్రీక్రిస్మస్ వేడుకలు
స్థానిక మాస్టర్ స్కూలులో ప్రీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రెవరెండ్ నవయ్య మాట్లాడుతూ మానవాళికి క్రీస్తు చేసిన మేలును వివరించారు. క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్‌లు ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
క్రైస్తవానికి వెంకటగిరి సంస్థానం
వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థానాల్లో వెంకటగిరి ప్రాంతంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ వివరాలను సింహావలోకం చేసుకుందాం. వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన వెలుగోటి రాజుల కుటుంబ సభ్యుల్లో 27వ తరానికి చెందిన కుమారయాచమనాయుడు అన్ని మతాలను ఆదరించారు. 18వ శతాబ్దంలో దేశమంతటా క్రీస్తు మతం వ్యాప్తి చెందుతున్న రోజులవి. ఆ సమయంలో వెంకటగిరి సమీపంలోని రేణిగుంట వద్ద జర్మనీకి చెందిన హెర్మాన్‌బర్గ్ మిషనరీ విడిది చేసి మతవ్యాప్తికి కృషి చేసింది. హెర్మాన్‌బర్గ్ మిషనరీ ఆధ్వర్యంలో మిల్యూస్ అనే మతప్రచారకుడి సహకారంతో నాటి నెల్లూరు కలెక్టర్ సిఫార్సుతో వెంకటగిరి సంస్థానాన్ని పాలిస్తున్న కుమారయాచమనాయుడును కలిశారు. మిషనరీ తరపున ధాల్ అనే మత బోధకుడితో కుమారయాచమ నాయుడు సమావేశమయ్యారు. క్రైస్తవ మతంలోని సిద్ధాంతాలకు ముగ్ధుడైన రాజు తన సంస్థానంలో మతప్రచారానికి అనుమతి ఇచ్చారు. అంతేగాకుండా పట్టణంలోని కాంపాళెం సమీపంలో చర్చి నిర్మాణానికి స్థలం కేటాయించారు. ఒక దశలో రాజు మతాన్ని స్వీకరించేందుకు సిద్ధపడ్డారని ధాల్‌కు రాసిన ఉత్తరప్రత్యుత్తరాలు వెల్లడిస్తాయంటున్నారు.
ఆ ఉత్తరాలు ఇప్పటికీ జర్మనీలోని హెర్మాన్‌బర్గ్ ఆర్క్వ్సిలో భద్రంగా ఉన్నాయని చరిత్రకారుడు రసూల్ అభిప్రాయపడుతున్నారు. వెంకటగిరిలో మనస్సాక్షి కూటమి ఆవిర్భావానికి సంస్థానాదీశుడే కారణమన్నారు. 1950 వరకూ వెంకటగిరిలో మనస్సాక్షి కూటమి తన కార్యకలాపాలు నిర్వహించింది. అనంతరం జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో ఆ కూటమి తన ప్రాభవాన్ని కోల్పోయింది.
యాచమనాయుడిది విలక్షణశైలి
27వ తరానికి చెందిన రాజు కుమారయాచమనాయుడుది విలక్షణశైలి. మంచి అనేది ఏ మతంలో ఉన్నా స్వీకరించేవారు. హిందూ మతానికి చెందిన రాజు అయినా అన్ని మతాలవారితో మమేకం అయ్యారనేందుకు ఆధారులు ఉన్నాయి.
రసూల్, చరిత్రకారుడు, వెంకటగిరి
మతసామరస్యానికి ప్రతీక వేళాంగణి మాత
- క్రిస్మస్ వేడుకలకు వేళాంగణి చర్చి సిద్ధం
తోటపల్లిగూడూరు,న్యూస్‌లైన్ : కోడూరు సాగరతీరాన వెలిసిన వేళాంగిణి మాత పుణ్యక్షేత్రం (వేళాంగణి చర్చి) మతసామరస్యానికి ప్రతీకగా వె లుగొందుతోంది. ఈ నెల 24,25 తేదీల్లో చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఏసుక్రీస్తు మా తృమూర్తి మరియమాతకు మరో నామమే వే ళాంగణి మాత.
1983లో నెల్లూరు బిషప్ పూదో ట బాలస్వామి ఈ చర్చిని నిర్మించారు. అన్ని మతాల వారు వేళాంగణి మాతను పూజిస్తారు. మరియమాత జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌లో జరిగే ఆరాధనోత్సవాలకు రాష్ట్రనలువైపుల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతుం టారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని మంగళ, బుధవారాల్లో జరిగే వేడుకలకు వేళాంగణి చర్చి ముస్తాబవుతోంది.
క్రిస్మస్ కాంతులు - విద్యుత్ దీపాల శోభ
Published Tue, Dec 24 2013 3:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement