న్యూఢిల్లీ: క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఈ క్రిస్మస్ శాంతాక్లాజ్ కావాలనుకుంటున్నారా? అయితే నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతోపాటు చక్కటి మీమ్‌ను కూడా ఆయన షేర్ చేశారు. (నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు)
I'm feeling 🎅
— Carl Pei (@getpeid) December 16, 2022
Best meme in the next 24 hrs gets a Nothing Phone (1)
మీరు బాగా చిలిపా? స్మార్టా? అయితే తమ స్మార్ట్‌ఫోన్ ఫ్రీ అన్నట్టుగా కార్ల్ పీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. "రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్ మీమ్‌కి నథింగ్ ఫోన్ (1)’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారితో ఎక్కువగా టచ్‌లో ఉండే యాక్టివ్ టెక్ సీఈవోలలో ఒకరు కార్ ప్లీ. లండన్‌లోని సోహోలో కంపెనీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఫఫ్రీగా నథింగ్ ప్రొడకక్ట్స్ అందించారు.
— Carl Pei (@getpeid) December 16, 2022
కాగా 2022లో నథింగ్ ఫోన్ (1) అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే -ఆధారిత స్టార్టప్ నథింగ్ తీసుకొచ్చిన ఈ తొలి ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. అలాగే ఫోన్ ఎరీనా బెస్ట్ డిజైన్ ఫోన్ 2022 అవార్డు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment