chirstmas
-
బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతిపిన్న వయస్కురాలు!
ఏ తల్లిదండ్రులైన పిల్లకు ది బెస్ట్ గిఫ్ట్‌లు ఇవ్వాలనే చూస్తారు. తమ పిల్లలు వాటిని చూసి ఎంతో సంతోపడటమే గాక ఎప్పటికీ మర్చిపోకూడదని కోరుకుంటారు. ఓ తల్లిగా లేదా తండ్రిగా వారి మనుసులను గెలుచుకోవాలనే ఆరాట పడతారు. ఇక్కడ కూడా అలానే ఓ తల్లి పుట్టుకతో ఒక చేయి లేకుండా జన్మించిన తన కూతురుకి అత్యంత విలువైన కానుక ఇవ్వాలనుకుంది. ఆమె పెదాలపై ఎప్పటికీ చిరునవ్వు తొణికిసలాడే విలువనే బహుమతి ఇవ్వాలనుకుంది. అందుకోసం ఎంతలా తప్పించిందో వింటే ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. యూకేలో థాలియా కౌల్టాస్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి పుట్టుకతో ఒక చేయితో జన్మించింది. తన కూతురు అలా ఉండటం చూసి కెర్రీ కౌల్టాస్ చాలా బాధపడేది. ఆమె తన పనులు చేసుకోవడం ఎంత ఇబ్బంది పడుతుందో గమనించి తల్లడిల్లింది. ఎలా తనకు సాయం చేయాలని ఆరాటపడింది. సాంకేతికతో కూడిన చేతిని అమరిస్తే తన సమస్యలకు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అన్ని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏ ఒక్క రోబిటిక్ చేయి ఆమెకు సూటవ్వలేదు. అప్పుడే ఈ ఓపెన్ బయోనిక్స్ అవయాల గురించి తెలుసుకుని అన్వేషించింది. సాంకేతికతో కూడిన ఈ బయోనిక్ అవయవాలను ఎనిమిదేళ్ల పిల్లలకు అమర్చరు. సదరు కంపెనీలకు అందుకు అనుమతించవు. అయితే థాలియా తల్లి శతవిధాల చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆ కంపెనీ దిగొచ్చి ఆ చిన్నారికి మినహాయింపు ఇచ్చి మరీ ఈ బయోనిక్ చేతిని అందించింది. దీంతో సాంకేతికతో కూడిన బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతి పిన్నవయస్కురాలిగా థాలియా నిలిచింది. ఈ క్రిస్మస్కి తన కూతురుకి తాను ఇచ్చే అతి విలువైన కానుక అని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఆ తల్లి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఈ క్రిస్మస్కి కూతురుకి అపురూపమైన కానుకను ఇచ్చింది. ఇప్పుడూ తన కూతురు కత్తి, ఫోర్క్ పట్టుకుని కేక్‌ని సులభంగా కట్ చేయగలదు, తన గదిని చక్కబెట్టుగోగలదు అని సంతోషంగా చెబుతోంది. ఏ తల్లి అయినా అంతేకదా! పిల్లలకు ఎదురైన కష్టాన్ని తొలగించి వారి మోములు సంతోషంతో వెలిగిపోవాలని కోరుకుంటారు. నిజానికి అలాంటి చిన్నారులకు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండే తల్లిదండ్రులు ఉండటమే అతిపెద్ద గిఫ్ట్ కదా!. దెబ్బకి ఏ కష్టమైన పరార్ అవ్వాల్సిందే. (చదవండి: రొయ్యలకు నిలయం ఆ సరస్సు! చేపలు పీతలు అస్సలు ఉండవ్!) -
ఇరవై ఏళ్ల క్రితం జైతెలంగాణ ..ఇప్పుడు మన నినాదం జైభారత్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అశాంతి, అసంతృప్తి, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రజానికం కోసం జై తెలంగాణ నినాదంతో యుద్ధం చేసి విజయం సాధించాం. ప్రత్యేక రాష్ట్రాన్ని దక్కించుకుని స్వయం పాలనతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. అభివృద్ధి, తలసరి ఆదాయం వృద్ధి.. అన్నింటా అద్భుత ప్రగతి సాధించి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఇప్పు డు అదే స్ఫూర్తితో జైభారత్ నినాదాన్ని ఎత్తుకున్నాం. అన్నివర్గాల మద్దతు కూడగట్టుకుని దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శాంతికాముక అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దాలని తలచి మరో యుద్దాన్ని మొదలుపెట్టాం. కులమతాలకు అతీతంగా అన్నివర్గాల మద్దతుతో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను’’అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్రిస్మస్ట్రీ లైట్‌ను వెలిగించిన కేసీఆర్.. తర్వాత కేక్ కట్ చేసి క్రైస్తవ పెద్దలకు అందించారు. అనంతరం మాట్లాడారు. క్రీస్తు ప్రేమ మార్గాన్ని అనుసరిద్దాం ఒక మనిషి తనను తాను ఏవిధంగా ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలనే సూత్రాన్ని బోధించిన శాంతి మూర్తి జీసస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తే ప్రపంచంలో మనుషుల మధ్య స్వార్థం, అసూయలకు తావు ఉండదని.. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఎక్కడా యుద్ధాలు జరగవని, నేర సమాజం ఉండదని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం తపించిన క్రీస్తు బాటను అందరం అనుసరిద్దామన్నారు. దేశంలో శాంతి సామరస్యాల కోసం మరో పోరాటాన్ని సాగించేందుకే జై భారత్ నినాదాన్ని ఎత్తుకున్నామని కేసీఆర్ వివరించారు. ‘‘జై తెలంగాణ నినాదంతో నిలిచి పోరాడితే తెలంగాణ ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్షగా ఉండేది. ఇప్పుడు అది రూ.2.75 లక్షలకు పెరిగింది. విద్యుత్, మంచినీటి సరఫరా, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అభివృద్ధి తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా వ్యాప్తిచెందేలా మరో యుద్ధాన్ని నడిపిస్తున్నాం. మంచికోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి వేగాన్ని దేశమంతా అమలు చేస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారత్ దూసుకెళ్తుంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కులం, జాతి, వర్గం అనే తేడా లేకుండా అన్ని పండుగలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక సమావేశాలు క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలను కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని.. వాటిపై చర్చించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలు, పేద క్రైస్తవులకు కేసీఆర్ క్రిస్మస్ బహుమతులను అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనీ కార్డినల్‌గా ఎంపికకావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చదవండి: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ -
మీకు మా స్మార్ట్‌ఫోన్ ఫ్రీ: సీఈవో బంపర్ ఆఫర్, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఈ క్రిస్మస్ శాంతాక్లాజ్ కావాలనుకుంటున్నారా? అయితే నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతోపాటు చక్కటి మీమ్‌ను కూడా ఆయన షేర్ చేశారు. (నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు) I'm feeling 🎅 Best meme in the next 24 hrs gets a Nothing Phone (1) — Carl Pei (@getpeid) December 16, 2022 మీరు బాగా చిలిపా? స్మార్టా? అయితే తమ స్మార్ట్‌ఫోన్ ఫ్రీ అన్నట్టుగా కార్ల్ పీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. "రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్ మీమ్‌కి నథింగ్ ఫోన్ (1)’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారితో ఎక్కువగా టచ్‌లో ఉండే యాక్టివ్ టెక్ సీఈవోలలో ఒకరు కార్ ప్లీ. లండన్‌లోని సోహోలో కంపెనీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఫఫ్రీగా నథింగ్ ప్రొడకక్ట్స్ అందించారు. pic.twitter.com/p2eW6kClQr — Carl Pei (@getpeid) December 16, 2022 కాగా 2022లో నథింగ్ ఫోన్ (1) అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటి. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే -ఆధారిత స్టార్టప్ నథింగ్ తీసుకొచ్చిన ఈ తొలి ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. అలాగే ఫోన్ ఎరీనా బెస్ట్ డిజైన్ ఫోన్ 2022 అవార్డు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్, క్రిస్మస్ వేడుకలు బ్యాన్
Christmas And New Year Gatherings Banned In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలను నిషేధించింది. అయితే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర సమావేశాలను నిషేధించింది. ఢిల్లీలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పైగా గత ఆరు నెలల్లో నమోదైన కేసుల కంటే ఇదే అత్యధికం. డీడీఎంఏ సూచించిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సమావేశాలు, వివాహాలు, ఎగ్జిబిషన్లు జరుపుకోవాలని ఆదేశించింది. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) డీడీఎంఏ విధించిన నిబంధనలు: డీడీఎంఏ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలు పనిచేసేందకు అనుమతిస్తాం అని ప్రకటించింది. పైగా రెస్టారెంట్లు, బార్లు గరిష్టంగా 50% సీటింగ్ సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మెట్రో 100% సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించింది. పైగాఒక్కో కోచ్‌లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి. అంత్యక్రియలు, వాటికి సంబంధించిన సమావేశాలు గరిష్టంగా 200 మందికి మాత్రమే అనుమతి. ప్రజలు మాస్క్‌లు ధరించడమే కాకుండా కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా అమలు చేసే యంత్రాంగాన్ని కఠినతరం చేయాలని జిల్లా పరిపాలన అధికారుల్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని కోరింది. మాస్కులు లేని వినియోగదారులకు ప్రవేశాన్ని నిరాకరించాలని మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను కూడా ఆదేశించింది. రానున్న రెండు వేడుకలకు ముందు కోవిడ్ ఏయే ప్రాంతాల్లో ఎంతగా వ్యాప్తి చెందిందో గుర్తించాలని జిల్లా మేజిస్ట్రేట్లను (డీఎం) ఆదేశించింది. జిల్లా మేజిస్ట్రేట్‌లందరూ తమ పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్నిసర్వే చేసి రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి అప్రమత్తం చేయాలని ఆదేశించింది. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) -
బుల్లి అభిమాని కల నెరవేర్చిన బన్నీ
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కల నెరవేర్చడంతోపాటు అనాథబాలల్లో సంతోషాన్ని నింపారు. తన బుల్లి వీరాభిమానికి ఆయన ఆటోగ్రాఫ్ పంపించడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బిగ్‌బాస్ ఫేమ్ వితిక షేరు అభ్యర్థన మేరకు ఆటో గ్రాఫ్‌తోపాటు, శాంటా బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. వీటిని అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ స్వయంగా అనాథాశ్రమాన్ని సందర్శించి పిల్లలతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో కలిసిపోయి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు బహుమతులను అందజేయడం విశేషం. దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. థ్యాంక్యూ బన్నీ అన్నా అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా బన్నీ పిల్లలు అర్హ, అయాన్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తండ్రితో పోటీపడుతూ మరీ అభిమానులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ ట్రీ అలంకారం, మురిసిపోతున్న అల్లు అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్‌కు లక్షల సంఖ్యలో వ్యూస్ రావడమే ఇందుకు ఉదాహరణ. -
సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గుడ్‌న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే భారీ ఊరటనిచ్చిన వ్యాక్సిన్ తయారీదారులు మరో శుభవార్త అందించారు. అన్ని సవ్యంగా జరిగితే మరి కొన్నిరోజుల్లోనే కోవిడ్-19 డెలివరీ షురూ కానుంది. ఈ మేరకు బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం (నవంబర్18) ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ మొదలు పెట్టనున్నామని భావిస్తున్నామన్నారు. (కరోనా వ్యాక్సిన్: ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్) తమ కరోనా టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా కంపెనీ ఫైజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగుర్ సాహిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబరులో టీకా అత్యవసర వినియోగం ఆమోదం, డిసెంబర్ రెండవ భాగంలో షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అన్నీ సానుకూలంగా జరిగితేనే డిసెంబర్ మధ్యలో టీకాకు అనుమతి లభిస్తుందని, క్రిస్మస్ పండుగ లోపే డెలివరీలు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నామన్నారు. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన తమ రెండు డోసుల టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని ప్రాథమిక ప్రమాణాల్లో విజయం సాధించిందని ప్రకటించేందుకు గర్వంగా ఉందని ఫైజర్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా తమ టీకా సామర్థ్యం 94శాతం కంటే ఎక్కువేననని తుది ప్రయోగ ఫలితాల్లో తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుందని పేర్కొంది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. BREAKING: We are proud to announce, along with @BioNTech_Group, that the Phase 3 study of our #COVID19 vaccine candidate has met all primary efficacy endpoints. — Pfizer Inc. (@pfizer) November 18, 2020 -
క్రిస్మస్ సందడి
-
చరణ్ క్యారెక్టర్‌పై హింట్ ఇచ్చిన ఉపాసన
మెగాస్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న ఉపాసన, రంగస్థలంలో సినిమాలో చరణ్ క్యారెక్టర్ పై హింట్ ఇచ్చారు. చిన్నారులతో సరదాగా గడిపిన వీడియోనే ఫోటలను షేర్ చేసిన ఉపాసన చరణ్ ఈ చిన్నారులకు ఇంతగా ఎందుకు దగ్గరయ్యారో మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఉపాసన పోస్ట్ చూసిన అభిమానులు మాత్రం.. చరణ్ తను చేస్తున్న పాత్ర మూలంగానే దివ్యాంగులకు మరింత దగ్గరయ్యారని భావిస్తున్నారు. Humbled by the love & affection from the children @ashrayakruti . Spread love & happiness this #holidayseason 😊 u’ll know very soon why Mr C is so attached to these differently abled children. #merrychristmas ☃️🎄#happyholidays #ramcharan pic.twitter.com/HNWt5pANNg — Upasana Kamineni (@upasanakonidela) 22 December 2017 -
చర్చిలపై దాడులకు ఐసిస్ సిద్ధం?
ఒకవైపు క్రిస్మస్, మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. అమెరికాలో ఉన్న చర్చిలపై దాడులు మొదలుపెట్టాలంటూ ఇస్లామిక్ స్టేట్ తన సానుభూతిపరులకు ఆన్లైన్లో సందేశాలు పంపుతుండగా, వాటిని ఎఫ్‌బీఐ మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసింది. టర్కీలో రష్యా రాయబారిని ఒక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది కాల్చి చంపి.. బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్లోకి ట్రక్కును పంపించి, డజను మందిని చంపిన తర్వాత.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యంపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. జర్మనీ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. తమకు అందిన సమాచారాన్ని ఎఫ్‌బీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కచ్చితంగా ఎక్కడ దాడులు జరగొచ్చన్న విషయం గురించి మాత్రం రాష్ట్రాల అధికారులు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కాగా, జర్మనీ మార్కెట్లోకి ట్రక్కును తీసుకెళ్లి, పలువురిని తొక్కించి చంపేసిన ట్యునీషియన్ ఉగ్రవాది అనిస్ అమ్రీ... ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు.