
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్‌పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment