Nivin Pauly
-
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్‌లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్’ అనే మలయాళ సినిమా షూట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్ శ్రీనివాసన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్’ షూటింగ్లో ఉన్నారు నివిన్. అక్కడి న్యూక్లియస్ మాల్ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్ సిరీస్ షూట్‌కి వెళ్లారు. ఇక నివిన్ మా టీమ్‌తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్లోనిపార్వతీ ఆర్. కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్ శ్రీనివాసన్. ‘‘వర్షంగళుక్కు శేషమ్’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్ 14న మా షూటింగ్‌కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్ కాంబినేషన్లో నేను కొన్ని సీన్స్‌లో నటించాను’’ అంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారుపార్వతీ ఆర్. కృష్ణ. -
ప్రేమమ్ హీరో పై రేప్ కేసు నమోదు..
-
మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?
హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని గత కొన్నిరోజులుగా ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్‌తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగోళ్లకు కూడా తెలిసిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నివిన్ ఆరో వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు.'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు. 'ప్రేమమ్' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Nivin Pauly (@nivinpaulyactor) -
గ్రీన్‌సిగ్నల్
మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సందీప్ కుమార్ అండ్ జార్జ్ ఫిలిప్ రాయ్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్ అండ్ అల్ట్రా కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
అత్యాచార ఆరోపణలు, పోలీసుల అదుపులో దర్శకుడు
కేరళ: అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివిన్ పాలీ హీరోగా నటిస్తున్న 'పడవెట్టు' సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రయూనిట్‌లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడి అరెస్ట్‌తో షూటింగ్ వాయిదా వేశారు. పడవెట్టు సినిమాకు లిజు కృష్ణనే స్వయంగా కథ రాశాడు. ఇందులో నవీన్ పాలీతో పాటు మంజు వారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీ తిలకన్, షైన్ టామ్ చికో, ఇంద్రన్స్, సుదీష్, విజయరాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పడవెట్టు గతంలో తీసిన మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్‌కు పని చేసిన సన్నీ వేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మలయాళం స్టార్‌తో దళపతి విజయ్ కుమారుడు.. ఫోటో వైరల్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్. అందుకే ఆ నటించిన ప్రతి చిత్రం తెలుగులోను విడుదలవుతోంది. అయితే తాజాగా ఆయన కుమారుడు జాసన్ సంజయ్, మలయాళం స్టార్ నివిన్ పౌలితో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళం ‘ప్రేమమ్’ స్టార్ నివిన్ అక్టోబర్ 11న బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జాసన్ ఆయనతో తీసుకున్న ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి విషెస్ చెప్పాడు. దీంతో ఆ పిక్ వైరల్‌గా మారింది. అయితే ఇంతకుముందు సైతం ఈ స్టార్కిడ్ స్నేహితులతో కలిసి కారులో పార్టీ చేసుకున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే జాసన్ ఇప్పటికే తన తండ్రి చిత్రం వెట్టైకారన్ (2009)లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు. చదవండి: దళపతికి ఊరట.. ‘ విజయ్’ మక్కల్ ఇయక్కం రద్దు Happy birthday @NivinOfficial brother!! Wishing you a great day and a memorable year ahead!#HBDNivinPauly #HappyBirthdayNivinPauly pic.twitter.com/sx5vIsTM2p — Sanjay Vijay (@IamJasonSanjay) October 11, 2021 -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఇక సినీ వెల్లువ
వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్‌గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు. మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్. ఇది ఓనమ్ సీజన్.ఈ సీజన్లో సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసి జోరుగా బిజినెస్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్‌లో ఓనమ్ సీజన్లో రిలీజ్ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి. ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్ కాదని స్టేట్ గవర్నమెంట్ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్‌లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల షూటింగ్‌లు ఆపేశారు. ఫాహద్ ఫాజల్ లేటెస్ట్ సినిమా కోసం వేసిన సెట్ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రీ షెడ్యూల్ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్‌కు సింగిల్ సినిమా కూడా రిలీజ్ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఓనమ్‌కు కేరళ మార్కెట్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... మలయాళం క్రేజీ ప్రాజెక్ట్.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివీల్ పౌలీ హీరోగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్‌కులమ్ కొచ్చున్ని’. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్‌హుడ్ క్యారెక్టర్. ఈ పాత్రను నివీన్ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్‌లాల్ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్ పోన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అల్లరి చేసే మమ్ముట్టి.. పండక్కి స్టార్ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్‌కి లీడర్‌గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్ నేమ్ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్ హార్ట్ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’. ‘అవును’ ఫేమ్ పూర్ణ, రాయ్ లక్ష్మీ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్‌గా.. ఫాహద్ ఫాజిల్ ‘వరతాన్’ చిత్రం కుడా ఓనమ్‌కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్ అమల్ నీరాద్ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్ నీరద్‌తో కలసి ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నిర్మించారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్ పాటను కూడాపాడారు నజ్రియా. చైన్ స్మోకర్ సెటైర్ 2017లో మలయాళం సూపర్ హిట్ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్ ఈ ఓనమ్‌కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్ స్మోకర్ అని అర్థం. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ ఫెస్టివల్‌కి చాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్‌కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్’, ‘జానీ జానీ యస్ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్ జోరుగా జరగాలని కోరుకుందాం. కాలం మన నేస్తం కేరళ ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్‌ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు ఏఆర్ రెహమాన్. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. మేమున్నామని... కేరళకు మేమున్నాం అంటూ మోహన్‌లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. కేరళ వరదలపై డాక్యుమెంటరీ 2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్‌గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్. వరద సమయాల్లో ఫోన్ లేదా కెమెరాతో షూట్ చేసిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్ పేర్కొన్నారు. రానా 2 సినిమాలకు బ్రేక్ రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’ సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్ కేరళ దట్టమైన అడవుల్లో షూట్ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించాయి అని రానా పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లుడు ఆలస్యం అయ్యాడు కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్ మినిట్ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్ చేసి రీ–రికార్డింగ్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్రబృందం. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
రాబిన్‌హుడ్ టైప్
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’. గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్‌కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
‘ఆనందం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆనందం జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : అరుణ్, థామస్ మాథ్యూ, రోషన్, విశాఖ్ నాయర్, అను ఆంటోని, సిద్ధి మహాజన్‌కట్టి సంగీతం : సచిన్ వారియర్ దర్శకత్వం : గణేష్ రాజ్ నిర్మాత : ఎ.గురురాజ్ యూత్ ఫుల్ఎంటర్టైనర్లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. యువతరానికి నచ్చే అంశాలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుంటాయి. ఆ నమ్మకంతోనే 2016లో మలయాళంలో ఘన విజయం సాధించిన ఆనందం సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ అతిథి పాత్రలో నటించటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : కంప్యూటర్ సైన్స్ ఇంజీనిరింగ్ చదివే విద్యార్థులు కాలేజ్ తరుపున ఇండస్ట్రియల్ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ టూర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్ వేస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్ సౌత్ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) ప్రధానంగా ఏడుగురు విద్యార్థుల చుట్టూనే కథ నడుస్తుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న ఆ విద్యార్థులకు ఈ టూర్ ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది..? వారిలో వ్యక్తిత్వాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటీనటులంతా కొత్తవారే.. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగులో ఇలాంటి కాలేజ్ కథలు చాలానే వచ్చాయి. హ్యాపీడేస్ లాంటి సినిమాలు దాదాపుగా ఇలాంటి కాన్పెప్ట్ తో తెరకెక్కినవే. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ కథలో పెద్దగా కొత్తదనమేమి కనిపించదు. బలమైన కథ లేకపోవటంతో దర్శకుడు.. స్టూడెంట్స్ చేసే అల్లరితోనే సినిమాను నడిపించాడు. (సాక్షి రివ్యూస్)బలమైన సన్నివేశాలు, ఆయడిన్స్‌ను కథలో ఇన్వాల్స్చేసే ట్విస్ట్‌లు ఒక్కటి కూడా సినిమాలో కనిపించవు. బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్న సన్నివేశాలను కూడా దర్శకుడు సింపుల్ గా తేల్చేయటం నిరాశకలిగిస్తుంది. సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఆనంద్ సీ చంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. హంపీలోని లోకేషన్స్‌ను, గోవాలో పార్టీ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని సరదా సన్నివేశాలు మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అప్పుడే అయిపోయిందా అంటారు
మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ అతిథిగా, కొత్త నటీనటులు నటించిన చిత్రం ‘ఆనందం’. గణేష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో ఈరోజు విడుదల చేస్తున్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో పికి ్నక్కి వెళ్లొచ్చే విద్యార్థుల కథే ఈ చిత్రం. నేటి యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. వేసవిలో ప్రేక్షకులకు నవ్వుల జల్లులు పంచే చిత్రమిది. సినిమా చూశాక అప్పుడే అయిపోయిందా! అంటారు. మలయాళంలో 4కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు సంప్రదించారు. అయితే.. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఉండటంతో రీమేక్ చేయకుండా డబ్ చేశాం. ‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’ అంటూ స్టార్ హీరోలు, డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలంతా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారే కానీ, ఆచరణలో పెట్టరు. చిన్న సినిమాలను ప్రోత్సహించినప్పుడే చాలామందికి పని దొరుకుతుంది. నటుడవ్వాలని హైదరాబాద్‌కొచ్చిన నేను బ్రహ్మానందంగారు, రాజేంద్రప్రసాద్‌గారు వంటి వారితోపాటు చాలా సినిమాల్లో నటించా. కానీ, బ్రేక్ రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లా. మళ్లీ నిర్మాతగా మారా. త్వరలోనే మా సుఖీభవ మూవీస్ బ్యానర్లో ఓ స్ట్రెయిట్ ఫిల్మ్ నిర్మించనున్నాం’’ అన్నారు. -
అమల ఒకటి.. ప్రియ మూడు వదులుకున్నారు
మ్యాచ్ రిజల్ట్‌ని రెయిన్ చేంజ్ చేస్తుంది. ఆ మాటకొస్తే చాలా విషయాల్లో రెయిన్ ఇబ్బందులపాలు చేస్తుంది. ఇప్పుడు మాత్రం వరుణుడు హీరోయిన్ అమలా పాల్‌ను ఇరుకుల్లో పడేశాడు. ఎలాగంటే.. హెవీ రెయిన్స్ వల్ల అమలా పాల్ ఓ సినిమా చాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందట. నివీన్ పౌలీ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’. ఇందులో హీరోయిన్ జానకి పాత్రకు ముందుగా అమలా పాల్‌ను సెలక్ట్ చేశారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ, సడన్‌గా అమలా పాల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లో ప్రియా ఆనంద్‌ను కథానాయికగా తీసుకున్నారు. తెలుగులో లీడర్, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో ప్రియా ఆనంద్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రీసెంట్గా పడిన వర్షాల వల్ల మా సినిమా షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. ఆ చేంజేస్ ఏఫెక్ట్ అమలా పాల్ డేట్స్‌పై పడింది. ఆమె బిజీ హీరోయిన్. మార్చిన తేదీలకు తగ్గట్టుగా అమలా పాల్ డేట్స్ ఇవ్వలేకపోయారు. అందుకే ప్రియా ఆనంద్‌ను హీరోయిన్గా తీసుకున్నాం’’ అన్నారు రోషన్. ‘‘ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ గ్రేట్ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేసేందుకు నేను మూడు సినిమాలను వదులుకున్నాను’’ అన్నారు ప్రియ. అయితే మరోవైపు ఈ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’ చిత్రంలో అమలా పాల్‌ను కావాలనే తప్పించారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ‘ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది రీ–ప్లేస్మెంట్ కాదు. డేట్స్ కుదరక నేనే తప్పుకున్నా. అండ్.. నేను మీకులా ఖాళీగా లేను ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడానికి’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అమలాపాల్. -
హే జూడ్... రెడీ ఫర్ రైడ్!
ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో! త్రిష రైడ్ చేస్తున్న బండి కలర్ కూడా బ్లూనే! ఆమె వెనుక సీట్లో కూర్చున్నది ఎవరో తెలుసా? మలయాళ హీరో నివిన్ పాలీ. త్రిష మాటలతో ఏం మంత్రం వేశారో మరి... నీలాకాశంలో విహరిస్తున్నట్టుంది నివిన్ ఎక్స్ప్రెషన్. అసలు, ఈ హీరో త్రిష బండి ఎందుకు ఎక్కారనే డౌటొచ్చిందా? ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘హే జూడ్’ అనే మలయాళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. శ్యామప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రిష్టల్ అనే అమ్మాయిగా త్రిష, జూడ్ అనే అబ్బాయిగా నివిన్ నటిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే... నివిన్ని ‘హే జూడ్... ఆర్ యు రెడీ ఫర్ రైడ్?!’ అని త్రిష అడుగుతున్నట్టు లేదూ! ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ‘‘సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్రదర్శకుడు శ్యామప్రసాద్ పేర్కొన్నారు. మలయాళంలో త్రిషకు తొలి చిత్రమిది. హీరోయిన్ అయిన 15 ఏళ్ల తర్వాత... పలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత... ఇన్నేళ్లకు మలయాళంలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం!! -
ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
నటుడితో ఫొటో దిగి...
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మెరిన్ జోసెఫ్.. దక్షిణాది నటుడు నివిన్ పాలీతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. మెరిన్ జోసెఫ్ ప్రొటోకాల్ పాటించలేదంటూ విమర్శలు చెలరేగాయి. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఆమె యూనిఫాంలో ఉండి, సినీ నటుడితో ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు గుప్పించాయి. అక్కడి ఛానల్స్ వరుస కథనాలు ప్రసారం చేశాయి. ఈ వివాదంపై మెరిన్ జోసెఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. అనవసరంగా విషయాన్ని సంచలనం చేశారని మండిపడ్డారు. వాళ్ల (ఛానల్స్) రేటింగ్ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీడియాకు అలవాటేనని ఆమె ఆరోపించారు. వారిపట్ల జాలిపడటం తప్ప ఏమీ చేయలేనని మెరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లిన తాను కార్యక్రమం పూర్తయి, తన విధులు ముగిసిన తర్వాతే నటుడుతో ఫొటో తీసుకున్నట్లు మెరిన్ జోసెఫ్ వివరణ ఇచ్చారు. కేరళ హోం మంత్రి, తదితర ముఖ్య అతిథులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ నటుడ్ని కలిసినట్లు చెప్పారు. నటుడు నివిన్, తన కోరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబి ఇడెన్ ఈ ఫొటో తీశారని తెలిపారు. కాగా జోసెఫ్ గతంలో కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉండగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై విమర్శలు చెలరేగాయి.