ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్‌వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు.
‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది.
So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf
— dulquer salmaan (@dulQuer) May 31, 2021
క్లబ్‌హౌజ్ ఏంటంటే..
ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment