మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వచ్చి ఏడాదిపైనే అవుతోంది. గతేడాది ఆగస్టులో కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తర్వాత కల్కి 2898 ఏడీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
అందుకే గ్యాప్ వచ్చింది
నా గత సినిమా అంతగా ఆడలేదు. అందులో ఎవరి తప్పూ లేదు. అయితే నాకు చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. అందుకే గతేడాది ఒకే ఒక్క సినిమా చేయగలిగాను. నేను ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. అది నా తప్పే అని చెప్పుకొచ్చాడు.
సినిమాల విషయానికి వస్తే..
దుల్కర్ ప్రధాన పాత్లలో నటించిన ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఇతడు పీరియాడికల్ ఫిలిం కాంత సినిమా చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. . 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ సాధినేని డైరెక్షన్‌లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment