Club House
-
ఫేస్బుక్ యూజర్లకు గుడ్‌న్యూస్....!
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ యూజర్లకు ఫేస్బుక్ శుభవార్తను అందించింది. క్లబ్‌హౌజ్, ట్విటర్ స్పేస్ తరహాలో ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్ ఆడియో రూమ్స్ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్‌లకు అందుబాటులో ఉంది. చదవండి: బ్లూ ఆరిజిన్ రెండో టూర్ సక్సెస్: అద్భుతమన్న నటుడు.. అంతరిక్షయానంలో అత్యంత వయస్కుడిగా రికార్డు ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియోట్ చేసే ఫీచర్‌ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్బుక్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫేస్బుక్ క్లబ్ హౌజ్, ట్విటర్స్పేస్ తరహా లాంటి ఆడియో రూమ్స్‌ను క్రియోట్ చేసేందుకు సమయాత్తమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్ ఆడియో రూమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లైవ్ ఆడియో రూమ్స్‌లో స్పీకర్‌గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్‌కి ఉంది. కాగా స్పీకర్ చేసే సంభాషణను ఎవరైనా వినవచ్చు. 50 మందితో...! ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ ప్రస్తుతం 50 మంది స్పీకర్స్‌ను మాత్రమే ఆలో చేస్తుంది. వీరి సంభాషణను వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ను క్రియోట్ చేసే ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. లైవ్ ఆడియో రూమ్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ కంట్రోల్ చేయవచ్చును. లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్ యాప్‌లో ఫేస్బుక్ వాచ్ ట్యాబ్ దగ్గర కన్పిస్తోంది. ఈ ఫీచర్ పరిచయంతో యూజర్లకు కొంత తిప్పలు తప్పనుంది. ఆడియో కన్వర్సేషన్ చేసుకునే వారు సపరేట్గా ట్విటర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనం కల్గనుంది. క్లబ్‌హౌజ్‌లో జరిగిన గోల ఇప్పుడు ఫేస్బుక్లో కన్పించనుంది. చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! -
డార్క్ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లబ్హౌజ్పై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. క్లబ్‌హౌజ్ యూజర్లకు చెందిన 3.8 బిలియన్ల ఫోన్ నంబర్లను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..తాజాగా క్లబ్‌హౌజ్ డేటా బేస్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. మార్క్ రూఫ్ అనే సైబర్ నిపుణుడు క్లబ్‌హౌజ్‌కు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లు డార్క్ నెట్లో ఉంచారనే విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. కేవలం క్లబ్‌హౌజ్‌లో ఉన్న వారివి మాత్రమే కాకుండా యూజర్‌కు చెందిన కాంటాక్ట్‌లు యాప్‌తో అనుసంధానించబడిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా డార్క్ నెట్లో అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ డేటా బ్రీచ్‌పై క్లబ్‌హౌజ్ ఇంకా స్పందించలేదు. Full phone number database of #Clubhouse is up for sale on the #Darknet. It contains 3.8 billion phone numbers. These are not just members but also people in contact lists that were synced. Chances are high that you are listed even if you haven't had a Clubhouse login. pic.twitter.com/PfAkUJ0BL5 — Marc Ruef (@mruef) July 23, 2021 -
క్లబ్‌హౌస్ అంటే ఏమిటి? ఎందుకింత ఫేమస్
ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. ఎక్కడో ఒక చోట రోజుకు ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో అక్షరాలు, వీడియోల ద్వారా భావాలను పంచుకునే వాళ్లం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పడు ఆడియోల రూపంలో కూడా మన భావాలను పంచుకోవచ్చు. అమెరికాకు చెందిన ఆల్ఫా ఎక్స్‌ప్లోరేషన్ కో సంస్థ ఆడియో ఓన్లీ సోషల్ ఫ్లాట్పాం ‘క్లబ్‌హౌస్’ను రూపొందించింది. ఈ యాప్ మొదట ఆపిల్ ఐఓఎస్ యూజర్ల కోసం మార్చి 2020లో తీసుకొచ్చారు. కేవలం విడుదలైన ఒక ఏడాది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. క్లబ్ హౌస్‌లో 5 వేల మందితో చాట్ రూమ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. క్లబ్‌హౌస్ అంటే ఏమిటి? క్లబ్ హౌస్‌లో ఇతర సామాజిక మద్యమాలలో లాగా వ్రాతపూర్వక, వీడియోల ద్వారా పోస్టింగ్‌లు చేయలేము. దీనిలో కేవలం మనం లేదా ఇతరులు మాట్లాడే మాటలు మాత్రమే వినబడుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక రేడియో లాగా. కానీ, ఇందులో చర్చించుకునే అవకాశం ఉంది. ఇందులో ఆలోచనలు పంచుకోవడానికి ప్రభావవంతమైన వ్యక్తుల పోస్టింగులు వినడానికి భాగ ఉపయోగపడుతుంది. క్లబ్‌హౌస్‌కు లాగిన్ అవ్వడం ఎలా? ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌస్ చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు ఆహ్వానిస్తే తప్ప అందులో చేరే అవకాశం తక్కువ. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో ఉంటుంది. అతని వంతు వచ్చిన తర్వాత సభ్యుడిగా క్లబ్‌హౌస్‌కు లాగిన్ అవ్వవచ్చు. క్లబ్‌హౌస్‌ను ఎలా ఉపయోగించాలి? ఈ అప్లికేషన్లో చాలా రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ మాట్లాడటం ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతుంది. మీరు గదిలో మాట్లాడే వాటిని లేదా మోడరేటర్ అనుమతితో మాత్రమే వినగలరు. క్లబ్‌హౌస్ ఆహ్వాన కోడ్ అవసరమా? క్లబ్‌హౌస్ యాప్ లో సభ్యత్వం పొందడానికి ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్న స్నేహితుడు మీకు ఆహ్వాన కోడ్‌ను పంపాలి. మీరు ఆహ్వాన కోడ్ లేకుండా ఇందులో జాయిన్ కాలేరు. ఆండ్రాయిడ్ ఫోన్లలో క్లబ్‌హౌస్ అందుబాటులో ఉందా? ఆహ్వాన వ్యవస్థతో పనిచేసే క్లబ్‌హౌస్ అనేది ఒక మొబైల్ యాప్. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికీ ఇది ఇంకా అభివృద్ధిలో ఉంది. ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ కి అందుబాటులో ఉంది. ఇది మనకు నచ్చిన కంటెంట్ ఉచితంగా లభించడంతో పాటు సమాజంలో భాగ గుర్తింపు పొందిన వ్యక్తుల ఐడియాలను వినే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలోన్ మస్క్, క్రిస్ రాక్, ఓప్రా విన్ఫ్రే, మార్క్ క్యూఫిన్ వంటి ప్రజాదరణ పొందిన ఉన్నత ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
బడి బాటలో బిల్డర్లు!
ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆసుపత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడి బాట పడుతున్నారు. నగరంలో ఇటీవల పెరిగిపోయిన సరికొత్త సంస్కృతిపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆసుపత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లల్ని పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తుంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆసుపత్రి ఉందా? వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. శరవేగంగా అభివృద్ధి.. ఇలాంటి ప్రాజెక్ట్‌లుండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే రీసెర్చ్ సెంటర్లకూ స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆసుపత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టిప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. నగరంలోని పలు ప్రాజెక్ట్‌లివే.. మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ 600 ఎకరాల్లో ‘డిస్కవరీ సిటీ’ పేరుతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 15 ఎకరాలు విద్యా సంస్థలకు కేటాయించారు. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, థీమ్ పార్క్ వంటివెన్నో ఈ ప్రాజెక్ట్‌లో కొలువుదీరనున్నాయి. మూసాపేట్లో సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 68 ఎకరాల్లో ‘సైబర్‌సిటీ రెయిన్బో విస్టాస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఫేజ్-1లో నెక్ట్స్‌జెన్ ప్లే స్కూల్, ఫేజ్-2లో ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది. షాద్‌నగర్‌లో వాసుదేవా లే-అవుట్ డెవలపర్స్ ఇండియా ప్రై.లి. ‘డాక్టర్స్ కాలనీ’ పేరుతో సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఇందులో ట్రిడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వర్షాకాలంలోనే వాస్తవాలు తెలుస్తాయ్.. {పాజెక్ట్ ఆవరణలో స్కూలు, ఆసుపత్రి ఉన్నంత మాత్రానా ఫ్లాట్ కొనేందుకు సిద్ధమవకూడదు. ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే వర్షాకాలమే సరైంది. సైటు వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం ఉత్తమం. వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది. ఇంటి నుంచి ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు సులువుగా చేరుకోగలరా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇదే సరైన సమయం. {పజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? అత్యవసరాల్లో ఆటోలు దొరుకుతాయా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వర్షా కాలంలోనే పక్కాగా తెలుస్తాయి. వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వర్షాలు పడితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు. నిర్మాణపనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది. గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి.