fake accounts
-
అమ్మాయిల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్స్.. బరితెగించిన బీటెక్ స్టూడెంట్
-
మీ ఇన్‌స్టా అకౌంట్‌కి ఒకేసారి లైక్స్, వ్యూస్ పెరుగుతున్నాయా? తస్మాత్ జాగ్రత్త
నిజజీవితంలో కాకుండా డిజిటల్ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రదర్శించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి దూరమవుతూ, తాము అంతా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ‘ఫేక్ హ్యాపీనెస్’ను క్రియేట్ చేస్తుంటారు కొందరు. అది ఫేక్ అని తెలియని వాళ్లు, తాము కూడా తమ ఫేక్ హ్యాపీనెస్‌ను మరింత క్రియేటివ్‌గా పోస్ట్ చేస్తుంటారు. వ్యసనంలా మార్చే ఈ చట్రంలో రోజుకు ఎంతోమంది చేరుతున్నారు. అవగాహనా లోపం మనమంతా మన చుట్టూ ఉన్నవారితో కలిసి జీవిస్తున్నాం. ఇందులో కొందరు తమపై తమకు సరైన అవగాహన లేని కారణంగా ఎదుటివారిని అనుకరించడం, విలువలు లేని వారి ప్రవర్తనలను కాపీ చేయడం చూస్తుంటాం. అంటే, ఉదాహరణకు.. స్నేహితుల్లో ఒకరు తాగతాగడాన్ని చూస్తూ, కొన్నాళ్లకు ఆ గ్రూప్‌లో ఉన్న మిగతావారూ అదేపని చేస్తుంటారు. ఇది సమయాన్ని వృథా చేస్తుంది. మానసికంగా, శారీరకంగా చెత్తను తయారు చేస్తుంది. ఇదే సోషల్ మీడియా విషయంలోనూ జరుగుతుంది. చాలామంది ఒకేరకమైన కంటెంట్‌ను చూడటానికి అలవాటు పడుతున్నారు.అది నిజం కాదని స్పష్టంగా తెలిసినప్పటికీ. ఏదో ఆనందం కోసం చూస్తున్నాం అంటారు. అదే కంటెంట్‌ను చూస్తూ కొంతకాలానికి తామూ కూడా అదే రకమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తారు. ఒకరిని చూసి ఒకరు ఫేక్ కంటెంట్‌ను సోషల్‌మీడియాలో వదిలితే.. కొన్నాళ్లకు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ఆత్మగౌరవ సమస్య మీలో ఆత్మబలం లేకపోతే ఇతర వ్యక్తులపై ఆధారపడతారు. అప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఎప్పుడూ బాధ, భయపడుతూ ఉంటారు. నిజానికి చుట్టూ ఉన్నవాళ్లకు మన గురించి పట్టించుకునేంత తీరిక లేదు. మన సొంత అవగాహనే తప్ప ఎవరూ ఎవరికీ తీర్పులు చెప్పరు. ఆత్మగౌరవ సమస్యలు ఉన్న ఎవరైనా సోషల్‌మీడియా ద్వారా తమ జీవితం గొప్పగా, సంతోషకరంగా ఉందని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఎవరైనా ఇప్పటికీ అంతా బాగానే ఉన్నట్లు నటించడానికి సోషల్‌మీడియాను ఉపయోగించవచ్చు. వారి బంధాల గురించి, సంతోషకరంగా గడిపిన సందర్భాలను ఫొటోలతో సహా పోస్ట్ చేయవచ్చు. అవే నిజం అనుకోవడానికి లేదు. వాటికి ప్రతిగా మరికొందరు తాము సంతోషంగా ఉన్న ఎప్పటి సందర్భాన్నో ఇప్పుడు పంచుకోవచ్చు. ఇలాంటి విధానాల వల్ల ఆత్మగౌరవం, బలం పెరగవు అని గుర్తుంచుకోవాలి. ఫేక్ సర్కిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతిదీ ఏదైనా డిలీట్ చేయలేరు. దశాబ్దాలుగా ఇంటర్నెట్లో కనిపించే అవకాశం ఉంది. మీరు మీ మెసేజ్‌ను లేదా ఫొటోని డిలీట్ చేయవచ్చు. అయితే, ఇంటర్నెట్లో స్క్రీన్‌షాట్, డౌన్లోడ్ వంటి సాధనాలపై మీ కంట్రోల్ ఉండదని గుర్తించాలి. మీ ప్రొఫైల్‌ని ఆర్ట్ గ్యాలరీగా పరిగణించాలి. అంటే, మీ సొంత భావోద్వేగాలతో సహా గొప్పగా కనిపించని దేన్నీ పోస్ట్ చేయరని అర్ధం. కానీ, కాలక్రమేణా ఫేక్ హాపీనెస్ షేరింగ్ ఒక అలవాటుగా మారొచ్చు. అలాంటప్పుడు కొన్నాళ్లకు ప్రోఫైల్లోని మొత్తం కంటెంట్ ఫేక్ అవ్వచ్చు. దీనిని కొన్నాళ్లుగా చూస్తున్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు కూడా అదే అలవాటుగా మార్చుకుంటే... ఫేక్ హాపీనెస్ చట్రం క్రియేట్ అవుతుంది. గుర్తింపు కోరుకోవడం ఈ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. సోషల్ మీడియాను అదే పనిగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలలో ఇది ఒకటి. కాలక్రమేణా మిమ్మల్ని మీ ఆన్లైన్ ప్రోఫైల్తోనే జనాలు గుర్తించవచ్చు. అప్పుడు మీ ప్రోఫైల్ మీరు కావచ్చు. మన మనసుకు ఏది నిజం, ఏది అబద్ధం.. వాటి మధ్య ఉంటే తేడా అన్నీ తెలుసు. కానీ, అది ఒక్కటే సరిపోదు. సోషల్ మీడియాలో తమ సొంత ఇమేజ్‌తో గుర్తింపు పొందేందుకు ఇష్టపడే ఎవరైనా చివరికి వారి సొంత నిజ జీవితాన్ని, నిజమైన అవసరాలను విస్మరించవచ్చు. మీరు సంతోషంగా లేని సమయాల్లో గుర్తింపు పోతుందేమో అనే ఆలోచనతో ఫేక్ హ్యాపీనెస్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేయవచ్చు. మీరు సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, దానిపై ఆధారపడే వ్యాపారాన్ని చేస్తుండవచ్చు. కానీ, అన్నింటికన్నా జీవితంపై దృష్టి పెట్టడం ఇప్పుడే మొదలవ్వాలి. ఎందుకంటే జీవితం ఆన్లైన్లో కాదు ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. వ్యసనం లైక్‌లు, కొత్త ఫాలోవర్లు, నోటిఫికేషన్లను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు చేసిన పోస్ట్‌కి వచ్చిన కామెంట్స్‌కు రిప్లై కూడా ఇవ్వండి. వచ్చే నోటిఫికేషన్స్‌కి అడిక్ట్ అవకండి. మీరు చేసిన పోస్ట్‌కు కామెంట్స్, వ్యూస్, లైక్స్.. నంబరింగ్‌పై దృష్టి పెట్టకండి. సంతోషకరమైన ఫొటోలన పోస్ట్ చేయడం వల్ల వచ్చే లైక్‌లు, వ్యూస్ పెరుగుతుంటే వాటి వల్ల వచ్చేదేంటో ఊహించండి. లైక్స్ ఎన్ని ఎక్కువ వస్తే అంత బలం పొందినట్టుగా అనిపిస్తుంది. దీనివల్లే మళ్లీ మళ్లీ అదే పని చేయాలనుకుంటారు. పొంచి ఉండే స్కామర్లు మీరు ఫేక్హ్యాపీనెస్ కోసం ప్రయతిస్తుంటే మిమ్మల్ని నకిలీ ఖాతాలతో మోసం చేసేవారూ ఉండచ్చు.. మీరు చేసే పోస్ట్‌లకు ఉన్న ఫలంగా ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తే అనుమానించండి. ఎందుకంటే, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీతో పరస్పర చర్యలు జరిపి, దారితప్పించవచ్చు.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా లేదా ఆర్థిక స్కామ్‌లలో పాల్గొనేలా మోసగించవచ్చు. స్కామర్లు ఫేక్ స్పాన్సర్షిప్ అవకాశాలను అందిస్తూ, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు. పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు మొదలైన సమాచారాన్ని పంచుకునేలా మోగిసించవచ్చు. మోసగించబడుతున్నాం అని గుర్తిస్తే వెంటనే... ఈ క్రింది సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రి΄ోర్ట్ చేయండి. ♦ https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet ♦ https://www.facebook.com/help/1380418588640631 https://www.linkedin.com/help/linkedin/answer/a1344213/recognize-and-report-spam-inappropriate-and-abusive-content?lang=en https://help.instagram.com/192435014247952 ♦ https://faq.whatsapp.com/1142481766359885/?cms_platform=android పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటే.. https://www.cybercrime.gov.inË లో రిపోర్ట్ చేయండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
100 పెట్టి, వంద కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే స్థితిలో..
మెరిసేవన్నీ బంగారం కానట్టే, మనం చూసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అందరూ నిజమైన వారు కాకపోవచ్చు. వారు చూపే ఉత్పత్తులు నమ్మదగినవి అయిఉండకపోవచ్చు. ఎందుకంటే, రూ.100 పెట్టి, వంద అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే కొత్త మార్కెట్ ప్లేస్‌గా ప్రస్తుత సోషల్‌మీడియా తయారైంది. సరైన అవగాహన లేకపోతే పెయిడ్ పోస్ట్– వ్యక్తిగత అభిప్రాయం మధ్య తేడాను గుర్తించడం కష్టం. సెలబ్రిటీలు, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారు చెబుతున్నారు కదా అని నాసిరకం వస్తుసేవలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి కంపెనీలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వైపు మళ్లుతున్నాయని ఆన్లైన్ ట్రెండ్ నివేదికలు చూపుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఎండార్స్మెంట్ పెరగడానికి ప్రధాన కారణాలివి.. ►ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేసే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ. ►వినియోగదారులు ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ చూపించే వ్యూస్, కామెంట్స్‌ను చూసి నమ్ముతారు. ►ఎక్కువ షేర్ అయిన కంటెంట్‌ను చదవడానికి అధిక సమయం కేటాయిస్తారు. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులు నమ్మే అవకాశాలు ఎక్కువ. ►ఇన్ప్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్ కామెంట్స్‌కు ప్రతిస్పందించడం, ఉత్పత్తులు, సేవలపై వారి అభిప్రాయాలను చెప్పడం.. మొదలైన వాటితో వినియోగదారుడు నమ్మకం పెంచుకుంటాడు. ►ఇన్ఫ్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్‌తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం కూడా దీనికి ఒక కారణం. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ►నకిలీ ఉత్పత్తులు/సేవలు/ యాప్‌లు అందించే డబ్బును చూసి ఆశపడవద్దు. వాటి వల్ల మీపైన కూడా యూజర్లకు నమ్మకం పోయే అవకాశం ఉంది. ►ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా గూగుల్‌లో శోధించండి. చట్టబద్ధమైన సమాచారం ఉందో లేదో రివ్యూలు చదివి నిర్ధారించండి. ►మీ ఫోన్ నెంబర్ లేదా చిరునామాను సోషల్ మీడియాలో ఉంచవద్దు. ఎందుకంటే వీటిని వ్యాపార ఉపయోగాల కోసం ఇతరులు సేకరించే అవకాశం ఉంది. ►యాప్‌లకు ఇచ్చిన యాక్సెస్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసి గాని నిర్ధారణకు రాకండి. ►ఫోన్లో అవసరమైన ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. అందుకు.. ఫోన్లో జీపీఎస్, బ్లూ టూత్, పాస్వర్డ్లు, పిన్‌లను సెట్ చేయండి. ►నమ్మకమైన ప్రొవైడర్ల నుండి మాత్రమే కావల్సినవాటిని డౌన్లోడ్ చేసుకోండి. ►అన్ని ఆఫ్‌లైన్, ఆన్లైన్ పరస్పర చర్యల కోసం సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ►మీ వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ట్రోలింగ్కి ఆస్కారమిచ్చే వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, ఫొటోలు/వీడియోల ... వంటివి పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తపడటం మంచిది. ►అన్ని ఫొటోలపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి. ►హద్దులను సృష్టించుకోండి. అంటే, భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కథనాల జోలికి వెళ్లకండి. ►ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేయవద్దు. ►జాత్యాహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యాలను నివారించడం మంచిది. ►మీ డేటాను రక్షించుకోవడం ముఖ్యం. మాల్వేర్, ట్రాకర్లను నిరోధించే పెయిడ్ టూల్స్‌ను ఉపయోగించండి. ►పాస్వర్డ్లు, ఇమెయిల్, నగదు చెల్లింపులను రక్షించడానికి రెండు రకాల ప్రామాణికతను పాటించాలి. ►ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి నకిలీ సమీక్షలు, కామెంట్స్, లైక్స్‌ను కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వాటిలో ఎక్కువ... ►నకిలీ కంపెనీలు ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, పెట్టుబడి, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిఫ్టో కరెన్సీ .. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ఇంటర్నెట్లో గుర్తుతెలియని విధంగా పనిచేస్తాయి. వారి యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సగటు మధ్యతరగతిని ప్రలోభ పెట్టడానికి ఖరీదైన మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించాయి. ►ఆపిల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయని యాప్‌లు చాలా వరకు చట్టబద్ధమైనవి కావు. వీటి ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలంటే మన దేశంలో చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు పట్టే సమయం ఎంతో తెలియదు కాబట్టి మనమే జాగ్రత్త వహించడం ముఖ్యం. గుర్తించడం ఇలా? ►ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ చేసిన సర్వే ప్రకారం 50 శాతం ఫాలోవర్లు నకిలీలే అని తేలింది. చాలా మంది ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణులు, ర్యాపర్లను కూడా నకిలీ ఇన్ఫ్లుయెన్సర్లుగా మోసగాళ్లు వాడుకుంటున్నారు. ►పోస్టింగ్‌కు ఉన్న ఫాలోవర్ల ట్రెండ్‌ను చూడాలి. ►ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ చేసే పోస్టింగ్‌లపై దృష్టి పెట్టండి. ఫాలోవర్స్ ఎక్కువ, పోస్ట్‌లు తక్కువ ఉంటే అవి రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తించాలి. ►కొన్ని నకిలీ ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్స్ చూస్తే ఒకే విధమైన కామెంట్స్, ఒకే విధమైన ఫాలోవర్లు ఉంటారు. ►ఇన్ఫ్లుయెన్సర్ల మానిటరింగ్ టూల్స్ అంటే కూపన్కోడ్లు, లింక్, బయో డిస్క్రిప్షన్లు... మొదలైనవి పర్యవేక్షించడం ద్వారా మోసపూరితమైన వాటిని కనిపెట్టవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫేస్‘బుక్’ అవుతున్నారు.. వందలాది ఖాతాలు హ్యాక్ !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫోన్లు వాడే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇందులో 80 శాతం మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా సెల్ఫోన్ల వాడకం 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతా లను కలిగి ఉన్నట్టు గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పలమనేరు: మీ ఫోన్లో ఫేస్ బుక్ (ముఖ పుస్తకం) ఖాతా ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నిత్యం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ హ్యాక్ బుక్‌గా మారిపోయింది. ఫేస్‌బుక్‌ను టార్గెట్‌గా చేసుకొని హ్యాకర్లు విరుచుకు పడుతున్నారు. యూజర్స్ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వాడుకుంటూ నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫేక్ అకౌంట్లను ఎలా డిలీట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లను గుర్తించినా వారి పేరు, చిరునామా తప్పుగా ఉంటుంది. దాంతో వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఆపదలో ఉన్నామంటూ రిక్వెస్ట్‌లు హ్యాక్ చేసిన వారి వివరాలతో ఫేక్ ఖాతాలను సృష్టించి వాటిద్వారా మన స్నేహితులకు ఫేస్‌బుక్‌తో పాటు వారి మొబైల్ నంబర్లకు మెసెంజర్, వాట్సాప్, సాధారణ ఎస్ఎంఎస్లను పంపుతున్నారు. తాను ఆస్పత్రిలో ఉన్నానని వెంటనే డబ్బు కావాలంటూ వారి ఫోన్‌పే లేదా గుగూల్‌పే నంబర్లను అందులో ఉంచి, సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ఎంతోమంది తమ ఖాతాలనుంచి నగదును హ్యాకర్లకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయి అదే పేర్లతో రెండు, మూడు ఫేక్ అకౌంట్లు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బగ్స్ సృష్టించి హ్యాక్ చేస్తున్న వైనం ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పలువురు సోషల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హ్యాకింగ్ చేయడమే వృత్తిగా చేసుకొని నిత్యం డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఫోన్కొచ్చే లింక్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. మన ఫోన్‌కు తరచూ వచ్చే ఫోన్ రీచార్జీలు ఉచితమని, లాటరీ వచ్చిందని, ఫెస్టివల్ ఆఫర్లని క్యూఆర్ కోడ్లను పంపుతున్నారు. వాటిని టచ్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి చేరుతోంది. మన ఫోన్‌ను హ్యాకర్లు ఆపరేట్ చేస్తుంటారు. మన ఫోన్లోని యాక్సెస్ లోకేషన్ ఆధారంగా మనకు తెలియకుండానే మన మొబైల్లోని కెమరాసైతం మనల్ని రికార్డు చేసే టెక్నిక్స్‌ను ఎథికల్ హ్యాకర్స్ సులభంగా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ పటిష్టం చేసుకోండి ఫేస్బుక్ హ్యాక్ చేశాక ఇబ్బందులు పడేకంటే ముందుగానే సెక్యూరిటీ సిస్టంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఫేస్‌బుక్‌లోని సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం, మన పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం, ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మన ఫేస్బుక్ హ్యాక్ అయిందా లేదా అని సెటింగ్స్‌లో కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్బుక్లో అన్నోన్ ఫ్రెండ్ రిక్సెస్ట్లను ఎప్పుడూ అంగీరించకుండా ఉంటే మంచిది. మనకు బాగా తెలిసిన వారినే ఫ్రెండ్స్‌గా పెట్టుకోవాలి. హ్యాక్‌చేసి.. ఫేక్ ఖాతాల సృష్టి హ్యాక్‌చేసిన ఖాతాలోని వ్యక్తిగత వివరాలు, ఫొటోలను వాడి, అసలు ఖాతాను పోలిన నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. పోనీ ఎందుకొచ్చిన తంటలేనని మన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసుకుంటే మరిన్ని తిప్పలు తప్పవు. అప్పటికే హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన మన సమాచారంతో మరిన్ని సైబర్ నేరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జీమెయిల్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను సైతం సులభంగా హ్యాక్ చేసి ఆపై మన మొబైల్ నంబర్‌కు కొన్ని యాడ్లింక్స్ పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త స్మార్ట్‌ఫోన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన లింకులను టచ్ చేయడం, మనకు తెలియని యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, కోడ్‌ను స్కాన్ చేయడం చాలా ప్రమాదకరం. మనకు రకరకాలుగా ఆశపెట్టి హ్యాక్ చేసేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సైబర్ నేరాలపై తమశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలి. పొరబాటు జరిగాక బాధపడేకంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. – సుధాకర్ రెడ్డి, డీఎస్పీ, పలమనేరు నా ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారు ఇటీవల నా ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఎవరో ఫేక్ అకౌంట్‌ను సృష్టించి ఆపదలో ఉన్నానని డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతోనేను ఫేస్బుక్హ్యాక్ అయిందని, అదే పేజీలో మెసేజ్ పెట్టాను. నా ఖాతాను సైతం మరింత భద్రపరుచుకున్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వివరాలు సులభంగా బయటకు పోతాయి. – సుధాకర్‌రెడ్డి, వి.కోట, పలమనేరు నియోజకవర్గం -
సోషల్ మీడియాలో ‘చీకోటి’ ట్వీట్స్ హల్చల్!
హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతాను గుర్తించాడు చీకోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు.. సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చీకోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ -
ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్, ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందంనుంచి తప్పుకోవడంతో ట్విటర్ మస్క్‌పై చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ శుక్రవారం ట్విటర్‌కు వ్యతిరేకంగా 164 పేజీల కౌంటర్సూట్ దాఖలు చేశారు. ట్విటర్ పిటిషన్‌పై ఈ అక్టోబర్ 17 నుండి ఐదు రోజుల పాటు విచారణ ప్రారంభం కానుందని డెలావేర్ కోర్టు ప్రకటించిన అనంతరం ఈ వ్యాజ్యం దాఖలు చేయడం విశేషం. కాగా నకిలీ ఖాతాల వెల్లడి విషయంలో ట్విటర్ సరియైన సమాచారాన్ని అందించ లేదంటూ వాదించిన ఎలాన్ మాస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంతో తమ వ్యాపారానికి విఘాతం కలిగిందని, ఒప్పందాన్ని కొనసాగించేలా ఆయనను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్సందించాల్సి ఉంది. చదవండి: విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
Elon Musk - Twitter : ‘కోకకోలాలో కొకైన్’.. అసలేముందక్కడ!
ట్విటర్లో ఫేక్/స్పాన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఈలాన్ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ ప్రస్తుత యాజమాన్యం చెబుతున్న సంఖ్యలు వాస్తవ పరిస్థితులకు మధ్యన పొంతన ఉండటం లేదంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. తన వాదనను సమర్థించుకునేలా అనేక ఉదాహారణలు చూపెడుతున్నారు. ట్విటర్ బోర్డుకు చుక్కులు చూపెడుతున్నాడు.. ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయంలో ఈలాన్‌మస్క్ పునారాలోచనలో పడ్డట్టు ప్రకటించారు. దీనిపై ఇటీవల జరిగిన ఓ పోడ్కాస్ట్లో ఈలాన్ మస్క్ స్పందించారు. ట్విటర్లో ఫేక్ ఖాతాలు 20 శాతానికి పైగానే ఉన్నాయని, ఇక మనుషుల ఖాతాల్లోనూ యాక్టివ్ యూజర్ల సంఖ్య మరింత తక్కువ అంటూ వివరణ ఇచ్చారు. ఇందులో కోసం ఇటీవల తాను చేసిన ఓ ట్వీట్‌కి వచ్చిన స్పందనను ఉదహారించారు. మస్క్ రికార్డ్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించిన తర్వాత నెక్ట్స్ ఏం కొనబోతున్నారంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు.. దానికి బదులిస్తూ నెక్ట్స్ కోకకోలాను కొనుగోలు చేసి అందులో కొకైన్ పెడతానంటూ ఈలాన్ మస్క్ చమత్కరించాడు. అయితే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మొత్తం మీద ఈ ట్వీట్‌కి 4.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్‌గా ఇది రికార్డు సృష్టించింది. Next I’m buying Coca-Cola to put the cocaine back in — Elon Musk (@elonmusk) April 28, 2022 ఇంత తక్కువగా అంటే.. రికార్డు సృష్టించిన కోకకోలా - కొకైన్ ట్వీట్‌పై ఈలాన్ మస్క్ స్పందిస్తూ.. ట్వీటర్కు 217 మిలియన్ల మానిటైజ్డ్ యాక్టివ్ యూజర్ల ఉన్నట్టుగా ట్విటర్ చెబుతోంది. ఇదే సమయంలో రికార్డు సృష్టించిన కోక్ - కొకైన్ ట్వీట్‌కి వచ్చిన లైకులును పరిశీలిస్తే ఇది కేవలం 2 లేదా 2.5 శాతానికి మించదు అన్నారు. అంతమంది యాక్టివ్ యూజర్లు ఉన్నప్పుడు రికార్డు ట్వీట్‌కే ఇంత తక్కువ లైక్స్ రావడం అనేక సందేహాలకు తావిస్తోందంటున్నాడు ఈలాన్ మస్క్. నా ట్వీట్ అనే కాదు బాగా వైరల్ అయ్యే ట్వీట్స్‌కి కూడా నాలుగు మిలియన్ లైకులు వస్తున్నాయి. అంటే యాక్టివ్ యూజర్ల సంఖ్య 2 శాతం దగ్గరే ఉంటోంది. దీనికి కారణం ఫేక్/స్పామ్ అకౌంట్లు అంటూ తర్కిస్తున్నాడు ఈలాన్ మస్క్. ప్రజలకు నిజాలు తెలియాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నీకో దండం బాబు ఇక ఈలాన్‌మస్క్ చేస్తున్న ఆరోపణలు సమర్థించేవారు ఉన్నారు. ట్వీటర్ బోర్డు ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతం ఉన్నట్టుగా చెబుతోంది. అయితే ఈ ఐదు శాతం అన్నది కనిష్టం. గరిష్టంగా ఇంది 20 శాతానికి పైగానే ఉంటుందంటున్నారు. ఓ వైపు మస్క్ ఆరోపణలు..మరోవైపు అతనికి పెరుగుతున్న మద్దతులో ట్విటర్‌కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 44 బిలియన్ డాలర్ల డీల్ సంగతి దేవుడెరుగు! ఈలాన్తో వచ్చిన తంటా తొలగిపోతే చాలనుకునే పరిస్థితి క్రమంగా బలపడుతోంది? అత్యధిక లైకులు ఈ ట్వీట్‌కే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్ బ్లాక్ పాంథర్ చిత్ర నటుడు చాడ్విక్ బోస్మన్ పేరిట ఉంది. ఆయన మరణించినప్పుడు కుటుంబ సభ్యలు ఆ విషయాన్ని ఆయన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ లైకులు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. pic.twitter.com/aZ2JzDf5ai — Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020 అప్పట్లో కొకైన్ ఉండేది చాలామందికి ఫేవరేట్ డ్రింకులలో ఒకటైన కోకకోలాలో ప్రారంభంలో కొకైన్ కలిపేవారు. కోలా ఆకుల నుంచి సంగ్రహించిన కొకైన్‌ను, కోలా నట్స్ నుంచి సేకరించిన కోలాను కలిపి ఈ డ్రింకును 1890లలో తయారు చేశారు అప్పట్లో అమెరికాలో కొకైన్‌ను ఔషధంగా వినియోగించేవారు. ప్రతీ కోక్ బాటిల్లో 9 మిల్లీగ్రాముల కొకైన్ ఉండేది. అయితే కాలక్రమేనా కొకైన్ వాడకంపై విమర్శలు రావడంతో.. అమెరికా కోలాలో కొకైన్ కలపడాన్ని నిషేధించింది. ఇక ఈలాన్‌మస్క్ - ట్విటర్ డీల్ విషయంలో ఇప్పుడు కోక్బ్రాండ్కి ఉచితంగా పబ్లిసిటీ దొరుకుతోంది. చదవండి: ట్విటర్ డీల్.. ఈలాన్‌మస్క్ షరతులు వర్తిస్తాయి .. -
ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఎలన్ మస్క్
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లోనే ఓ పోస్ట్ చేశారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn — Elon Musk (@elonmusk) May 13, 2022 ఈ ప్రకటనతో మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్ నిలిపివేతపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టగా.. ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్ మస్క్ ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్‌ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది. -
చైనీస్ ఆపరేషన్?.. బట్టబయలు చేసిన మెటా
ప్రభుత్వాల కోసం పని చేసే సర్వయిలెన్స్ కంపెనీలు.. నిఘాను అద్దెకి ఇస్తే!, డబ్బులిచ్చిన వాళ్ల కోసం యూజర్ల సమాచారాన్ని చేరవేస్తే! ఎలా ఉంటుంది?. అలాంటి సర్వయిలెన్స్ కంపెనీల బాగోతాన్ని వెలికి తీసింది మెటా కంపెనీ(ఒకప్పుడు ఫేస్బుక్). వేల కొద్దీ ఫేస్బుక్ అకౌంట్ల నుంచి, ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్న కంపెనీల బండారాన్ని బయటపెట్టడంతో పాటు.. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫేక్ అకౌంట్లను నిషేధించింది మెటా కంపెనీ. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ గురువారం 1,500 అకౌంట్లను(ఏడు సర్వయిలెన్స్ కంపెనీలకు చెందినవి) పూర్తిగా నిషేధించింది. ఈ అకౌంట్లన్నీ సైబర్ మెర్కెనరీ (సైబర్ కిరాయి) కంపెనీలకు చెందినవిగా తేల్చింది. ఉద్యమకారులు, ప్రముఖ జర్నలిస్టులు, అసమ్మతివాదులపై నిఘాలో భాగంగా క్లయింట్ల తరపున ఈ అకౌంట్లు పని చేసినట్లు మెటా నిఘాలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వందకు పైగా దేశాల్లో యాభై వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఉంది మెటా. చైనీస్ ఆపరేషన్.. మెటా ఆపరేషన్‌లో వెల్లడైన కీలక అంశం.. చైనా కేంద్రంగా నడుస్తున్న ఆపరేషన్. ఈ ఆపరేషన్ పేరు, ఎవరు నడుపుతున్నారో మెటా గుర్తించలేకపోయింది. కానీ, చైనా అధికారులకు చెందిన సర్వర్లు, నిఘా సాధనాల ‘కమాండ్ అండ్ కంట్రోల్’ వ్యవస్థను మెటా ట్రేస్ చేయగలిగింది. కొన్ని చైనా బ్రాండ్లకు చెందిన ఫోన్ల ద్వారా ఈ స్కామ్ నడుస్తోందని, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర డేటాను సైతం సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్నాయని మెటా పేర్కొంది. ఇక ఈ స్కామ్‌లో ఎక్కువగా పాల్గొంది ఇజ్రాయెల్‌కు చెందిన సర్వయిలెన్స్ కంపెనీలే. ఈ ఏడు కంపెనీల లిస్ట్‌లో బ్లూహాక్ సర్వయిలెన్స్ కంపెనీ పేరు ప్రముఖంగా ఉంది. భారత్‌కు చెందిన బెల్‌ట్రాక్స్ సంబంధిత ఫేస్బుక్ అకౌంట్లను సైతం తొలగించింది మెటా. ఏం జరుగుతోందంటే.. సర్వయిలెన్స్ కంపెనీలు ఫేక్ అకౌంట్లు సృష్టించి.. యూజర్ల ప్రొఫైల్‌ను గుంజేస్తున్నాయి. వీటిలో సెలబ్రిటీలు, ప్రభుత్వ విభాగాల పేరుతోనూ అకౌంట్లను క్రియేట్ చేస్తాయి ఆ కంపెనీలు. అంతేకాదు గ్రూపుల్లో, సంభాషణల్లో జోక్యం చేసుకుంటూ వ్యక్తిగత వివరాల్ని సేకరిస్తాయి. ఫేస్బుక్ అకౌంట్లతో పాటు ఫోన్, కంప్యూటర్, పాస్వర్డ్లు, పొటోలు, వీడియోలు, మెసేజన్లు.. అన్నీ హ్యాక్ చేస్తారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి నిఘా కంపెనీలు.. వెబ్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రభుత్వాలకు విక్రయిస్తుంటాయి. వార్తా నివేదికలు, వికీపీడియా వంటి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఆన్లైన్ మూలాల నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇవి నిఘా ప్రక్రియను ప్రారంభిస్తాయి. అయితే ఈ సేవలను ప్రైవేట్‌గా అద్దెకు ఇస్తుండడం, అందునా యూజర్ల డాటాను అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ మెర్కెనరీ సర్వయిలెన్స్ కంపెనీల పేరుతో ఇవి.. క్లయింట్ల(పెయిడ్) కోసం పని చేస్తుంటాయి. అయితే ఇవి కేవలం క్రిమినల్స్, టెర్రరిస్టులపై నజర్ కోసమే పని చేస్తున్నాయని ప్రకటించుకున్నప్పటికీ.. జరిగే వ్యవహారం అంతా మరోలా ఉంటోంది. చదవండి: ఈ వీడియోలో ఉంది మీరేనా? -
"ట్రింగ్.. ట్రింగ్..హే హలో నేను"..అబ్బాయిలా గొంతు మార్చి..20 లక్షలు కాజేసిన
ఫేస్బుక్లో తప్పుడు పేర్లు, ఫొటోలతో ఐడీలు క్రియేట్ చేసింది. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు అబ్బాయిల పేర్లు, ఫొటోలు.. అబ్బాయిలను ముగ్గులో దించేందుకు అమ్మాయిల ఫొటోలు, పేర్లు వాడింది. గొంతుమార్చి తనే అబ్బాయి, అమ్మాయిగా మాట్లాడింది. ఫేక్ ఫ్యామిలీ ఫొటోలు క్రియేట్ చేసి లోతుగా ప్రేమలోకి దించింది. తాను దూరమైతే వారు చచ్చిపోయేలా చేసి.. చివరకు బ్లాక్‌మెయిల్‌చేసి రూ. 20 లక్షలకుపైగా వసూలు చేసింది. వింటేనే అశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతా చేసి ఆ మహిళ చదివింది కేవలం ఇంటర్. కరీంనగర్ క్రైం: లేని పేర్లు, మనుషులను సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో పలువురు యువతీ, యువకులను మోసగించి రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ మహిళ (30)ను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్ కేంద్రం లో అడిషనల్ డీసీపీ (లాఅండ్ఆర్డర్) ఎస్.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందిన మహిళ కరీంనగర్ లోని తిరుమలనగర్‌లో ఉంటూ మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. ఒక వ్యక్తితో పెళ్లి, విడాకులయ్యాయి. రెండో పెళ్ళి చేసుకున్నా ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. (వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాస్) 2012 నుంచి మోసాలు.. తనకు తెలిసిన అబ్బాయిని వలలో వేసుకునేందుకు 2012లో ఒక ఫేస్బుక్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసింది. తర్వాత అతడికి తెలిసిన ఒక ఉన్నత ఉద్యోగం గల యువతిని పరిచయం చేసుకొని యువకుడి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి చాట్ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఆమెను లోతుగా ప్రేమలోకి దింపింది. విచిత్రమేమిటంటే మహిళ అయి ఉండి కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా మిమిక్రీ చేస్తూ మగవాడిలా మాట్లాడుతూ జాగ్రత్తపడింది. బాధల్లో ఉన్నానంటూ బాధితురాలి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. 34 ఫేక్‌ఐడీలు క్రియేట్ చేసి 10 సిమ్‌కార్డులను ఉపయోగించి 20 మందికి పైగా యువతీ యువకులను మోసం చేసింది. రూ.20 లక్షలకుపైగా వసూలు చేసింది. -
Telugu Academy: ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుల ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారు. సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. ఒరిజినల్ ఎఫ్డీలతో 64.5 కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. ఈ క్రమంలో యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్‌కు తరలించారు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..) తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దీనిలో 6 కోట్ల రూపాయలను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ముఠా.. మిగతా మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
మాటల్లో దించి.. మాయచేసి..
సాంకేతిక పెరిగేకొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి వాసులు సైబర్ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – బాలానగర్ మచ్చుకుకొన్ని.. లింక్ ఓపెన్ చేయడంతో.. బాలానగర్ ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా ‘మీ బ్యాంక్ అకౌంట్ 24 గంటల్లో డియాక్టివేట్ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను చేయాలని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ సీఆర్ఎం నంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.49,999 డెబిట్ అయ్యాయి. నౌకరీ.కామ్ పేరుతో.. 27 ఏప్రిల్ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి నౌకరీ.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్ పంపించాం. ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్‌ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.16,665 దోచుకున్నారు. ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్ డివిజన్ సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి అద్దె, అడ్వాన్స్ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్ పేమెంట్ నంబర్ నుండి అకౌంట్‌కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు. ఈఎంఐ చెల్లించే క్రమంలో.. ఫిరోజ్‌గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్ కట్టేందుకు గూగుల్‌లో వెతుకుతుండగా కస్టమర్ కేర్ అని కనిపించిన ఓ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి క్రెడిట్ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు. ► బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు. ► సైబర్ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు. ► బాధితులు ఎవరైన ఉంటే ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ► సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు. బ్యాంక్ వివరాలు ఇవొద్దు.. సైబర్ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్ వివరాలు ఇవొద్దు. బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. –ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్ సీఐ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
అవును! అప్పుడు పొరపాటు జరిగింది : ట్విట్టర్
గతంలో తమ వల్ల పొరపాటు జరిగిందంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒప్పుకుంది. ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోమంటూ యూజర్లకు హామీ ఇచ్చింది. ఇకపై మరింత నాణ్యతతో సేవలు అందిస్తామని పేర్కొంది. ఫేక్ అకౌంట్లు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాగా సంచలనం సృష్టించిన ట్విట్టర్ గతంలో ఫేక్ ఖాతాలను వడబోసేది. అయితే ఈ వడపోత కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్ 2017 నుంచి ఈ పని నిలిపేసింది. అయితే అప్పటికే అనేక ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో ఉండిపోయాయి. వీటి వల్ల యూజర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. తప్పు జరిగింది దాదాపు నాలుగేళ్ల తర్వాత 2021 మే నుంచి మరోసారి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది ట్విట్టర్. ఈ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులు స్పందిస్తూ ... గతంలో పొరపాటుగా కొన్ని ఫేక్ అకౌంట్లకు తాము అనుమతి ఇచ్చామని, వెరిఫికేషన్‌లో జరిగిన తప్పులే ఇందుకు కారణమని తెలిపారు. ఇకపై ఫేక్ అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లో వెరిపై చేసి బ్లూ టిక్ ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు. ఇవి నిబంధనలు మానిప్యులేషన్, స్పామ్ పాలసీ ప్రకారం ఫేక్ అకౌంటర్లను శాశ్వతంగా తొలగిస్తున్నామని, అదే విధంగా వాటికి జారీ చేసిన వెరిఫైడ్ బ్యాడ్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్. ఫేక్ ఖాతా కాదు అనేందుకు ట్విట్టర్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం గత ఆరు నెలలుగా ఖాతా ఉపయోగంలో ఉండాలి. దీంతో పాటు ఖాతాకు సంబంధించిన ఈమెయిల్, ఫోన్ నంబరు వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ నేమ్, ఇమేజ్‌లు కూడా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిటీస్ ఉండాలి. ఈ నియమాలు పాటించే ఖాతా దారులకు వెరిఫైడ్ బ్యాడ్జీని జారీ చేస్తుంది ట్విట్టర్. లేని పక్షంలో ఫేక్‌గా గుర్తించి ఖతాలు స్తంభింప చేస్తుంది. -
ఆ దొంగ ఎవరు?!
వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్ఎమ్లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్‌లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు. ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ. పోస్ట్ చేసేది ఎవరు? తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్‌తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్లో ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్‌గా ఎవరు తీశారో, ఎవరు అప్లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్‌కి, షాపింగ్‌కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్‌బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది. ముక్కలైన బంధం కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్‌గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది. మేకవన్నె పులి దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్‌కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్లైన్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి. ఎమెషనల్ ఫ్రాడ్స్‌కి దూరం ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్‌ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్‌కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్‌లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ పగ తీర్చుకోవాలనే.. కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్‌గా ముందు క్లోజ్‌గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్‌కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్‌ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం. – వి. గోపీనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి..
అనంతపురం క్రైం: క్రికెట్ బెట్టింగ్.. పేకాట.. ప్రేమ, పెళ్లి ముసుగులో దగా.. 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ.5లక్షల వరకు వసూలు.. గంజాయి వ్యాపారం.. ఇలా ఒకటేమిటి, ఎన్నో విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నియవంచకుడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ గంజాయి, సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగరంలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. నగరంలోని భైరవనగర్‌లో నివాసముంటున్న భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు. సరిపడా డబ్బులు, సంపాదన లేకపోవడంతో నూతన పంథా ఎంచుకున్నాడు. ఫేస్బుక్, టిండర్ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్ ఐడీలతో అకౌంట్లు సృష్టించాడు. వీటిలో భరత్ రెడ్డి పేరుకు బదులుగా సిద్ధార్థ రెడ్డి అని పేరు.. అతని ఫొటోకు బదులుగా ఓ అందమైన వ్యక్తి ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకున్నాడు. అలా అమ్మాయిలను పరిచయం చేసుకుని నిరంతం వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ కొనసాగించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నగ్న దృశ్యాలు, రికార్డ్‌లు సేకరించాడు. మోసపోయిన 20 మందికి పైగా యువతులు ఫేస్ బుక్, టిండర్ యాప్, మ్యాట్రిమోనీ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. అమ్మాయిల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బును తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రాబట్టుకున్నాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిలు భరత్ వలలో మోసపోయారు. వీరిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు.. స్టాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం. రహస్యంగా నగ్న వీడియోల చిత్రీకరణ అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. దీంతో పాటుగా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం వన్‌టౌన్‌లో కిడ్నాప్ కేసు, టూటౌన్లో గ్యాంబ్లింగ్ కేసులున్నాయి. అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు విచారణలో నయవంచన బాగోతం వెలుగు చూసింది. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదం సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిలను వంచించడం పరిపాటిగా మారింది. వాట్సాప్ చాటింగ్‌లు, వాయిస్ కాల్స్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదమని గుర్తించాలి. భరత్ రెడ్డి బాధితులెవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులను సంప్రదించండి. మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ ఎస్ఓఎస్ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. – బి.సత్యయేసుబాబు, ఎస్పీ చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి -
బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను
విద్య(పేరు మార్చడమైనది) పదవ తరగతి చదువుతోంది. ఫోన్లో వచ్చిన మెసేజ్‌లు చూసి, తెగ నవ్వుతుంటే తల్లి మందలిస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోని విద్య ఫోన్ చూస్తూ భోజనం ముగించి, తన రూమ్‌కి వెళ్లిపోయింది. ‘ఏం పిల్లలో ఏమో..’ అనుకుంటూ తల్లి పనిలో పడిపోయింది. ఫేస్బుక్లో తన ఫొటోకు వచ్చిన లైక్‌లు చూసుకుంటూ, సంబరపడిపోతూ విద్య, స్నేహితులతో చాట్ చేస్తూ కూర్చుంది. కొత్తగా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి వెంటనే యాడ్ చేసుకుంది. ఆ రిక్వెస్ట్ తన క్లాస్మేట్ రమ్యది. వారం రోజులుగా రమ్యతో చాట్ చేస్తూ ఉంది. ఓ రోజు.. విద్య కత్తితో తన చేయి మణికట్టు మీద కట్ చేసుకుంది. తల్లి తండ్రి కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు చేశావీపని అంటే ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విషయమంతా వివరించింది. విద్య చెప్పింది విన్న తల్లిదండ్రులు షాక్‌కి లోనయ్యారు. విద్యకు ఆన్లైన్లో పరిచయం అయిన వ్యక్తికి తన ఫొటోలే కాకుండా, చెల్లెలు డ్రెస్ మార్చుకుంటుండగా తీసిన ఫొటోలు ఆ బ్లాక్‌మెయిలర్‌కు షేర్ చేయాల్సిన పరిస్థితిని చెప్పి, తల్లిని పట్టుకుని ఏడ్చేసింది విద్య. ఇప్పుడా ఫొటోలు ఆన్లైన్లో షేర్ చేస్తానని చెబుతూ డబ్బుల కోసం తనని బెదిరిస్తున్నాడని చెప్పింది. తన క్లాస్మేట్ ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, తన క్లాస్మేటే అనుకుని చాట్ చేస్తున్నానని, ఆ బ్లాక్‌మెయిలర్ తనకు తెలియదంది. విద్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. టార్గెట్ టీనేజర్స్ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు సదరు బ్లాక్‌మెయిలర్‌ను పట్టుకున్నారు. అతని టార్గెట్ అంతా 13 –18 ఏళ్ల అమ్మాయిలని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కేవలం టీనేజ్ అమ్మాయిల ప్రొఫైల్స్ చూస్తూ, వాటిలోని సమాచారాన్ని చదివి, ఫేక్ అకౌంట్లు తెరుస్తుంటాడు. ఆ అకౌంట్ నుంచి సదరు అమ్మాయిల క్లాస్‌మేట్స్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతుంటాడు. ఒక సారి యాడ్ చేసుకోగానే రోజూ ఉదయమే ‘హాయ్..’తో సంభాషణ మొదలుపెడతాడు. అవతలి వ్యక్తి తన క్లాస్మేట్ అమ్మాయే కదా అనుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాడ్ చేసుకున్న అమ్మాయి చాట్ చేస్తుంటుంది. దీంతో, సదరు వ్యక్తి మంచి భాషా నైపుణ్యంతో మాటలు పెంచి, ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారమంతా తెలుసుకుని, అదను చూసి మానసికంగా దగ్గరవుతాడు. ఆ తర్వాత శరీరాకృతి గురించి, వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం వరకు వెళుతుంది. అమ్మాయి బాగుంటే ఫిజికల్‌గా, లేదంటే డబ్బు గురించి ట్రాప్ చేయడం మొదలుపెడతాడు. ఇవేవీ లేదంటే, ఇంట్లో ఆడవాళ్లు బాత్రూమ్లో ఉన్న ఫొటోలు, స్నేహితుల న్యూడ్ ఫొటోలు పంపించమని బెదిరిస్తాడు. ఒకసారి ట్రాప్ అయితే ఇక ఏదో ఒక సమస్యలో ఆ అమ్మాయి ఇరుక్కోవాల్సిందే. ఇలాగే ఆ బ్లాక్ మెయిలర్ వందల మందిని ఫేక్ అకౌంట్ ద్వారా మోసం చేశాడు. ఆన్లైన్ మోసగాళ్లు సైబర్ నేరస్థులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. ఒకసారి స్నేహం మొదలయ్యాక వ్యక్తిగత కథనాలను జోడిస్తారు. నమ్మకాన్ని, సానుభూతిని పొందుతారు. బాధితురాలికి నమ్మకం కలిగించడానికి, మొదట తమ ఫొటోలను పంపుతారు. కొన్నిసార్లు నగ్న చిత్రాన్ని పంపుతారు. మంచి ఫొటో, వీడియోలను పంపమని ప్రేరేపిస్తారు. అవి తమకు చేరిన తర్వాత బ్లాక్ మెయిల్, దోపిడీ ప్రారంభమవుతుంది. సరైన ఫోటోలు, వీడియోలను పంపకపోతే మార్ఫింగ్ పద్ధతిని ఎంచుకుంటారు. దోపిడీ ద్వారా వారికి డబ్బు రాకపోతే, వారు ఈ దుర్మార్గపు నెట్‌వర్క్‌లోకి ఇతర వ్యక్తులను లాగడానికి ఈ ఫొటోలను ఎరగా వాడుతారు. నకిలీ ఖాతాల గుర్తింపు.. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుంది ∙అవతలి వ్యక్తి ప్రొఫైల్ తేదీ గమనించాలి ∙చూడాల్సింది పేరు, ప్రొఫైల్ పిక్ కాదు. ప్రొఫైల్‌ను తనిఖీ చేయాలి. ∙ఆ ఫ్రొఫైల్లో పోస్టులు ఏమేం ఉన్నాయో చూడాలి. ఒక కారణం కోసం విరాళాలు కోరడం/ అత్యవసర పరిస్థితుల్లో రుణాలు కోరడం వంటివి ఉన్నాయేమో గమనించండి. ఆన్లైన్ రొమాన్స్‌కు సంబంధించి చిత్రాలు ఉన్నాయేమో చూడండి. సోషల్ మీడియాను సురక్షితంగా.. మీకు బాగా పరిచయం ఉన్న, నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. వారి నిజాయితీని ధృవీకరించుకోకుండా ఆన్లైన్ చాటింగ్, డేటింగ్ వంటివి చేస్తూ మానసికంగా చేరిక కాకూడదు. సన్నిహిత/ స్పష్టమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ పంచుకోకూడదు (ఫోన్ నెంబర్, ఉన్న ప్లేస్.. మొదలైనవి) అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మీ పూర్తి సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. (ఫైనాన్షియల్, లాగిన్ క్రెడెన్షియల్స్ – ఆర్గనైజేషన్.. వంటివి) బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే సోషల్ మీడియా స్నేహితులను వ్యక్తిగతంగా కలవండి. మీ ప్రతి సోషల్ మీడియా ఖాతాకు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు) ఉపయోగించండి. వాటిని తరచూ మారుస్తూ ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకు సరైన కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాలకు బలవకుండా మొదట్లోనే కనిపెట్టి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ ఫౌండేషన్ నాది కాదు: సోనూసూద్
ముంబై: లాక్డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
130 కోట్ల ఫేక్ ఖాతాలు నిలిపివేత
వాషింగ్టన్: 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 130 కోట్లకు పైగా ఫేక్ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం సోమవారం తెలియజేసింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి రోసెన్ వెల్లడించారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్‌ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్‌ను నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాంటి సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్ చేయడం లేదని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు. -
ఆ అకౌంట్లను నమ్మొద్దు: వైష్ణవ్ తేజ్
‘‘సోషల్ మీడియాలో నాకు ఎలాంటి అధికారిక అకౌంట్స్ లేవు. నా పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను దయచేసి ఎవరూ ఫాలో కావొద్దు’’ అని హీరో పంజా వైష్ణవ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఉపయోగిస్తున్నారు’’ అన్నారు వైష్ణవ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ ద్వితీయ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఉప్పెన సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది. చదవండి: రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట! -
రిక్వెస్ట్ పెట్టి దోచేస్తారు.. ఇది ఆ గ్యాంగ్ పనేనా
‘ఇన్నాళ్లూ మీ ఫోన్ నంబరుకు లాటరీ తగిలిందనో.. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది.. వెంటనే మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలనో.. ఫోన్ చేస్తూ మోసం చేసిన నేరగాళ్ల గురించి విన్నాం. ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. స్నేహితుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇలాంటి నేరాలు ఎన్నో వెలుగు చూశాయి. వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. సాక్షి, కడప : అనుమానం వచ్చిన వారు ఫోన్ చేసి నివృత్తి చేసుకుని మిన్నకుండిపోతుండగా, రిక్వెస్టుకు చలించిన వారు వెంటనే అకౌంటు ఎవరిదన్న విషయం చూసుకోకుండా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో ఫేక్ అకౌంట్ దారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్‌లలో ప్రముఖుల పేర ఫేక్ అకౌంట్స్ సృష్టించి అత్యవసరమంటూ డబ్బులు దోచుకుంటున్నారు. తెలిసిన వారేనన్న భ్రమతో పలువురు వారి అకౌంట్లకు డబ్బులు జమ చేసి నష్టపోతున్నారు. తీరా అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. బాధితుల్లో జిల్లాలోని ప్రముఖులతోపాటు కొందరు పోలీసు అధికారులు ఉండడం గమనార్హం. సైబర్ నేరగాళ్లు ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఫేస్బుక్, వాట్సాప్‌లను గుర్తించి ఆ తర్వాత స్వల్ప మార్పులతో వారి ఫొటోలతోనే ఫేక్ అకౌంట్లను సృష్టిస్తున్నారు. వారు రెగ్యులర్‌గా చాట్ చేస్తున్న స్నేహితులతో కొంతకాలం చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత అత్యవసరమని రూ. 15–30 వేల వరకు డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. సర్దుబాటు చేయలేమని చెబితే ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే డబ్బులు సర్దాలని, త్వరలోనే ఇచ్చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు నిజమని నమ్మి బ్యాంకు అకౌంటు నంబరు ఎవరిదన్న విషయం నిర్ధారించుకోకుండానే డబ్బులు జమ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారు ఫోన్ ద్వారా వివరాలు నిర్ధారించుకుని మిన్నకుండి పోతున్నారు. డబ్బు అడిగిన వారు పది మందికి తెలిసిన ప్రముఖులుగా ఉండడం, ఫాలోయర్స్ ఎక్కువగా ఉండడంతో కొందరు స్పందించి తక్షణమే ఫేక్ అకౌంట్ సృష్టించిన వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆలస్యంగా విషయం తెలుసుకుంటున్నారు. జిల్లాలో చాలామంది ఫేక్ అకౌంట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈనెలలోనే జిల్లాలో వందలాది మంది ఫేక్ అకౌంట్ల ద్వారా దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి. కొందరు డబ్బులు పోగొట్టుకుని మిన్నకుండి పోతుండగా, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక నెలలోనే సైబర్ క్రైంకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1100 మంది పోలీసు అధికారులు, పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలు, పోలీసులు సైతం బాధితులుగా ఉండగా, మరోవైపు జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లతోపాటు వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్న వారు బాధితులుండడం గమనార్హం. సైనికుల పేరుతో ఫేక్ అకౌంట్లు మరోవైపు సైనికుల పేరుతోనూ జిల్లాలో ఫేక్ అకౌంట్లు వెలిసినట్లు తెలుస్తోంది. డబ్బులు పంపిస్తే తక్కువ ధరకే గృహోపకరణాలతోపాటు పలు రకాల వస్తువులు తీసుకు వస్తామని పోస్టులు పెడుతూ డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ తరహా మోసాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇది రాజస్థాన్ ముఠా పనే! రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలోనూ వెల్లడైంది. ఇప్పటికే కొందరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండకపోతే అంతే! ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్లతో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఈ తరహా నేరాలపై ఫేస్‌బుక్‌కు సైతం లేఖ రాసింది. దీంతో ఫేస్బుక్...ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చింది. ఫేస్బుక్ యాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ వివరాలతోపాటు ప్రొఫైల్ వివరాలు బయటికి వెలువడకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అప్పుడే సైబర్ నేరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. -
ఫేస్‘బుక్’ అయ్యారు
నల్లగొండ క్రైం: పోలీసుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. రాజస్తాన్ వెళ్లి మరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 350 మంది పోలీసు అధికారుల పేరిట ఈ సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ మెసేజ్‌లు పంపి డబ్బులను ఖాతాల్లో జమ చేయించుకున్నారని వివరించారు. ఇదేవిధంగా తన పేరుతో కూడా నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని పోలీసు అధికారులకు సందేశాలు పంపారని, అయితే విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్తాన్‌కు పంపినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితులు అనేక రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అ«ధికారులకు రివార్డు ప్రకటిస్తామన్నారు. నిందితుల్లో ముగ్గురిని నల్లగొండ జైలుకు, బాలుడిని హైదరాబాద్‌లోని బాల నేరస్తుల జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. మొదట ఐజీ స్వాతి లక్రా పేరిట నకిలీ ఖాతాను సృష్టించగా, ఆ తర్వాత వారం పది రోజుల్లో నల్లగొండ జిల్లా ఎస్పీ పేరిట ఓ ఖాతా తెరిచారు. పోలీసుల పేరిటే నకిలీ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో జిల్లా పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకొని ఆ సైబర్ నేరగాళ్ల ఆటను కట్టించారు. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్స్ విన్నర్
ముంబై: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన 23 ఏళ్ల ఐశ్వర్య షెరాన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుతో 20 నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. తన అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోలాబా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ఐశ్వర్య గతంలో పలు అందాల పోటీల్లో తుళక్కుమన్నారు. 2016లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు తనకు ఇన్‌స్టాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఆమె చెప్పుకొచ్చారు. ఆగస్టు 5న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో నకిలీ ఖాతాల విషయం వెలుగు చూసిందని అన్నారు. (చదవండి: బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!) ‘మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో అసలైనది ఏదీ? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో నాకేం అర్థం కాలేదు. ఇన్‌స్టాలో నాకు అకౌంట్ లేదని చెప్పాను. వెంటనే మా తమ్ముడు సెర్చ్ చేయగా నా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఫేక్ ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. ఒక ఖాతాకైతే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నా ఫొటోలను ఆ ఆగంతకులెవరో దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే ఫిర్యాదు చేశాం’అని ఐశ్వర్య పేర్కొన్నారు. కాగా, ఐశ్వర్య కలాబాలో తన కుటుంబంతో కలిసి 2017 నుంచి నివసిస్తన్నారు. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ఇక ఐశ్వర్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోలాబా సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ ఫడ్తారే చెప్పారు. సర్విస్ ప్రొవైడర్ సాయంతో నకిలీ ఖాతాలను క్లోజ్ చేయిస్తామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. (ఐపీఎస్ టు ఐఏఎస్) -
అజయ్ భూపతి పేరుతో.. విజయ్‌లా మాట్లాడి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక జనాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త మోసాలకు తెరలేపారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి పేరుతో నకిలీ వాట్సప్ నెంబర్ సృష్టించి కథానాయికలు, మోడల్స్ కావాలని, ఆసక్తి ఉన్నవారు ఫోటోలు, వీడియోలు పంపాలని యువతకు కొందరు కేటుగాళ్లు సైబర్ వల వేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి ఆశపడిన ఆశావాహుల నుంచి వేలాది రూపాయలు వారి ఖాతాల్లో జమచేసుకుంటున్నారు. ఇలా నటన, మోడలింగ్‌లో శిక్షణ, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వేలల్లో డబ్బులు దోచుకొని ఆ నేరగాళ్లు ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రకటనలను చూసిన కొంతమంది యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అజయ్ భూపతి తన పేరుపై నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ పేరుతో బాన్సువాడకు చెందిన సాయికిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. విజయ్‌లా మాట్లాడి పలువురు యువతులను ఆకర్షించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, విజయ్ దేవరకొండ బృందం ఓ ప్రణాళిక రచించారు. ఒక యువతితో సాయి కిరణ్‌తో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించారు. సదరు యువతిని కలిసేందుకు నిందితుడు సాయి కిరణ్ హైదరాబాద్‌కు రాగానే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.