అల్లు అర్జున్, రాజమౌళి (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఈ మధ్య ప్రముఖుల ఫాలోవర్ల లెక్కలను విడుదల చేసింది. అయితే అనుసరించేవారి(ఫాలోవర్ల) లెక్కలు నిజం కాదని, అందులో చాలా మట్టుకు బోగస్‌వే ఉన్నాయంటూ పెద్ద షాకే ఇచ్చింది. ప్రధాని మోదీ నుంచి మొదలుకుని, సినీ సెలబ్రిటీల దాకా ఎవరి ఖాతాలో ఎన్ని ఫేక్ ఫాలోవర్లు ఉన్న లిస్ట్‌ను ట్విటర్ విడుదల చేసింది. అందులో మన స్టార్ల లెక్కలను పరిశీలిస్తే...
టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ సమంత అక్కినేని. అయితే ఆమె ఫాలోవర్లలో 68 శాతం మాత్రమే అసలు అని ట్విటర్ తేల్చింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు ఫాలోవర్లలో 51 శాతం, రానా దగ్గుబాటి 53 శాతం, నాగార్జున ఖాతాలో 54 శాతం రియల్ ఫాలోవర్లు ఉన్నారంట. లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉన్న రాజమౌళి ట్విటర్‌లో మాత్రం 72 శాతం ఒరిజినల్ ఫాలోవర్లు ఉండగా, అత్యధిక ఒరిజినల్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా జక్కన్న నిలిచారు. తారక్ రియల్ ఫాలోవర్స్ 65 శాతం ఉండగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 49 శాతంతో లోయెస్ట్ రియల్ ఫాలోవర్స్ సెలబ్రిటీగా నిలిచారు.
బాలీవుడ్ విషయానికొస్తే... 35 మిలియన్ల ఫాలోవర్లతో షారూఖ్ ఖాన్ ట్విటర్ టాప్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన ఒరిజినల్ ఫాలోవర్స్ 48 శాతం మాత్రమే ఉంది. అంతేకాదు ఈ లిస్ట్‌లో ఆయనే లోయెస్ట్ ఫాలోవర్స్ సెలబ్రిటీ కావటం గమనార్హం. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 62 శాతం, సల్మాన్ ఖాన్ 50 శాతం, అక్షయ్ కుమార్ 50 శాతం, దీపికా పదుకొనే 67 శాతం, హృతిక్ రోషన్ 56 శాతం, అమీర్ ఖాన్ 68 శాతం, ఏఆర్ రెహమాన్ 53 శాతం, అలియా భట్ 61 శాతం రియల్ ఫాలోవర్స్ ఉండగా, ఈ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా 71 శాతం రియల్ ఫాలోవర్స్‌తో హయ్యెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు.
ట్విటర్ అడిట్ ప్రకారం...
Comments
Please login to add a commentAdd a comment